ప్రతీకాత్మక చిత్రం
బోధన్: నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్‌డీఎ స్‌ఎల్) లిక్విడేషన్‌ను ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తు న్యూ ఢిల్లీ ఎన్‌సీఎల్‌ఏటీ ( నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్) బుధవారం స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో షుగర్ ఫ్యాక్టరీ రైతులు, కార్మికులకు తీపికబురందినట్లయ్యింది. ఎన్‌సీఎల్‌టీ గత నెల 3న ఎన్‌డీఎస్‌ఎల్ మూడు యూనిట్లను లిక్విడేషన్‌కు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , స్టేట్ డైరెక్టర్ ఆఫ్ కేన్ అండ్ షుగర్ కమిషనర్ హై దరాబాద్ ఎన్‌సీఎల్‌టీ షుగర్ ఫ్యాక్టరీ లిక్విడేషన్ ఉత్తర్వులపై సవాలు చేస్తు న్యూఢిల్లీ ఎన్‌సీఎల్‌ఏటీకి ఈ నెల 12న అప్పీలు పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్‌సీఎల్‌ఏటీలో విచారణ కొనసాగగా, రాష్ట్ర ప్రభుత్వ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీంతో బుధవారం ఎన్‌డీఎస్‌ఎల్ స్థిర, చర ఆస్తుల అమ్మకం నిలుపుదల చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది.
తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల మేరకు ఫ్యాక్టరీ చర, స్థిరఆస్తులను విక్రయించడానికిగాని, బదలాయింపునకు గాని అవకాశం ఉండదు. ఎన్‌సీఎ ల్‌టీ హైదరాబాద్ బెంచ్ ఎన్‌డీఎస్‌ఎల్ లిక్విడేషన్ ఉత్తర్వులతో చెరుకు రైతులు, వందలాది కార్మిక కుటుంబాల్లో ఫ్యాక్టరీ భవితవ్యంపై తీవ్ర ఉత్కంఠతకుగురయ్యారు. తాజా పరిణామాలతో చెరుకు రైతులు, కార్మికుల్లో ఒకింత హర్షం వ్యక్తం అవుతోంది. తాత్కాలికంగానైనా షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి బ్రేక్ పడటం తీపి కబురేనని వారంటున్నా రు. తెలంగాణ ప్రభుత్వం ఎన్‌డీఎస్‌ఎల్‌ను స్వాధీ నం చేసుకుని ప్రభుత్వరంగంలోనే నడిపించినట్లయితే ఈప్రాంత చెరుకు రైతులు, కార్మికులకు మే లు చేకూరుతోందని అంటున్నారు.
2015 డిసెంబర్ 23న లేఆఫ్...
ఎన్‌డీఎస్‌ఎల్ యాజమాన్యం అనుహ్యాంగా 2015 డిసెంబర్ 23న లేఆఫ్ ప్రకటించి బోధన్, ము త్యంపేట (జగిత్యాల) ముంబోజిపల్లి ( మెదక్) ఫ్యాక్టరీలను మూసివేసింది. వాస్తవంగా ప్రభుత్వం 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రా గానే ఎన్‌డీఎస్‌ఎల్‌ను స్వాధీనం చేసుకుని పూర్వవైభవం తెస్తామని హామీ ఇచ్చింది. కాని ఫ్యాక్టరీ స్వాధీనం చేసుకోకపోగా, నడిచే ఫ్యాక్టరీ మూతపడటంతో చెరుకు రైతులు, కార్మికులు తీవ్ర నిరా శకు గురయ్యారు. కాని తెలంగాణ ప్రభుత్వం సా నుకూలమైన నిర్ణయం తీసుకుంటోందనే ఆశతో చెరుకు రైతులు, కార్మికులు నిరీక్షించారు. కాని 2017 సెప్టెంబర్‌లో అనుహ్యంగానే షుగర్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారం కోసం ఎన్‌సీఎల్‌టీ రంగప్రవే శం చేసింది. ఈ పరిణామం చెరుకు రైతులు, కా ర్మికుల్లో మరింత ఉత్కంఠతకు గురిచేసింది.
ఎన్‌సీ ఎల్‌టీ హైదరాబాద్ బెంచ్ ఐపీఆర్‌గా నియామకమైన రాచర్ల రామక్రిష్ణ గుప్తా విచారణ ప్రక్రియను 2017 అక్టోబర్‌లో ప్రారంభించగా.. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించిన సమయంలో వివరాలను వెల్లడించారు. బ్యాంక్ అప్పులు, కార్మికుల ఆర్థికపరమైన బకాయిలు, ఇతర పన్ను బకాయిలు చె ల్లించేందుకు అంగీకరించిన వారికి ఫ్యాక్టరీని అప్పగించే ప్రక్రియ ఉంటుందని తెలిపారు. తొలి ప్రా ధాన్యతగా ప్రస్తుత ఎన్‌డీఎస్‌ఎల్ ప్రైవేట్ యాజ మాన్యం అవకాశం కల్పించడం జరుగుతోందని వివరించారు. ప్రైవేట్ యాజమాన్యం, ప్రభుత్వం బకాయిలు చెల్లించి, ఫ్యాక్టరీని నడిపేందుకు ముం దుకు రానియెడల ఇతర ప్రైవేట్ కంపెనీలకు ఆ హ్వానిస్తామని, ఈ ప్రక్రియ సాధ్యం కాకపోతే ఫ్యా క్టరీ ఆస్తులు విక్రయించి అప్పు బకాయిలు చెల్లించ డం జరుగుతోందని స్పష్టత ఇచ్చారు. దీంతో ఈ కోణంలో విచారణ కొనసాగింది.
2017 నుంచి ఎ న్‌సీఎల్‌టీ విచారణ కొనసాగించి ఆఖరుకు 2019 జూన్ 3న ఎన్‌డీఎస్‌ఎల్ లిక్విడేషన్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హఠాత్పరిణామంతో చెరుకు రైతులు, కార్మికులు హతాశులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్‌డీఎస్‌ఎల్ అమ్మకం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నిలుపుదలకు అప్పీలేట్ ట్రి బ్యునల్‌కు అప్పీలు పిటిషన్ దాఖలు చేయడం. ఈ మేరకు సానుకూలంగా ట్రిబ్యునల్ స్టే ఉత్తర్వులు ఇవ్వడం శుభపరిణామమని కార్మిక సంఘాల నాయకులంటున్నారు. ఇదే స్ఫూర్తితో ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలంటున్నారు. తాజా పరిణామంతో చెరుకు రైతులు, కార్మికుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
స్టే ఉత్తర్వులు వాస్తవమే..
ఎన్‌సీఎల్‌టీ గత నెల 3న ఎన్‌డీఎస్‌ఎల్ లిక్విడేషన్‌కు జారీ చేసిన ఉత్తర్వుల పై న్యూఢిల్లీ ఎన్‌సీఎల్‌ఏటీకి ఈ నెల 12న అప్పీలు పిటిషన్ దాఖలు చేశాం. బుధవారం లిక్విడేషన్ ఉత్తర్వులు నిలుపుదల చేస్తు ఎన్‌సీఎల్‌ఏటీ స్టే ఉత్తర్వులు జారీ చేసిన విషయం వాస్తవమే. –భద్రు మల్హోత్, రాష్ట్ర కేన్ కమిషనర్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment