Bodhan sugar factory
-
ఎన్డీఎస్ఎల్ అమ్మకానికి బ్రేక్
బోధన్: నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎ స్ఎల్) లిక్విడేషన్ను ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తు న్యూ ఢిల్లీ ఎన్సీఎల్ఏటీ ( నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్) బుధవారం స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో షుగర్ ఫ్యాక్టరీ రైతులు, కార్మికులకు తీపికబురందినట్లయ్యింది. ఎన్సీఎల్టీ గత నెల 3న ఎన్డీఎస్ఎల్ మూడు యూనిట్లను లిక్విడేషన్‌కు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , స్టేట్ డైరెక్టర్ ఆఫ్ కేన్ అండ్ షుగర్ కమిషనర్ హై దరాబాద్ ఎన్సీఎల్టీ షుగర్ ఫ్యాక్టరీ లిక్విడేషన్ ఉత్తర్వులపై సవాలు చేస్తు న్యూఢిల్లీ ఎన్సీఎల్ఏటీకి ఈ నెల 12న అప్పీలు పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్సీఎల్ఏటీలో విచారణ కొనసాగగా, రాష్ట్ర ప్రభుత్వ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీంతో బుధవారం ఎన్డీఎస్ఎల్ స్థిర, చర ఆస్తుల అమ్మకం నిలుపుదల చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల మేరకు ఫ్యాక్టరీ చర, స్థిరఆస్తులను విక్రయించడానికిగాని, బదలాయింపునకు గాని అవకాశం ఉండదు. ఎన్సీఎ ల్టీ హైదరాబాద్ బెంచ్ ఎన్డీఎస్ఎల్ లిక్విడేషన్ ఉత్తర్వులతో చెరుకు రైతులు, వందలాది కార్మిక కుటుంబాల్లో ఫ్యాక్టరీ భవితవ్యంపై తీవ్ర ఉత్కంఠతకుగురయ్యారు. తాజా పరిణామాలతో చెరుకు రైతులు, కార్మికుల్లో ఒకింత హర్షం వ్యక్తం అవుతోంది. తాత్కాలికంగానైనా షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి బ్రేక్ పడటం తీపి కబురేనని వారంటున్నా రు. తెలంగాణ ప్రభుత్వం ఎన్డీఎస్ఎల్ను స్వాధీ నం చేసుకుని ప్రభుత్వరంగంలోనే నడిపించినట్లయితే ఈప్రాంత చెరుకు రైతులు, కార్మికులకు మే లు చేకూరుతోందని అంటున్నారు. 2015 డిసెంబర్ 23న లేఆఫ్... ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం అనుహ్యాంగా 2015 డిసెంబర్ 23న లేఆఫ్ ప్రకటించి బోధన్, ము త్యంపేట (జగిత్యాల) ముంబోజిపల్లి ( మెదక్) ఫ్యాక్టరీలను మూసివేసింది. వాస్తవంగా ప్రభుత్వం 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రా గానే ఎన్డీఎస్ఎల్ను స్వాధీనం చేసుకుని పూర్వవైభవం తెస్తామని హామీ ఇచ్చింది. కాని ఫ్యాక్టరీ స్వాధీనం చేసుకోకపోగా, నడిచే ఫ్యాక్టరీ మూతపడటంతో చెరుకు రైతులు, కార్మికులు తీవ్ర నిరా శకు గురయ్యారు. కాని తెలంగాణ ప్రభుత్వం సా నుకూలమైన నిర్ణయం తీసుకుంటోందనే ఆశతో చెరుకు రైతులు, కార్మికులు నిరీక్షించారు. కాని 2017 సెప్టెంబర్‌లో అనుహ్యంగానే షుగర్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారం కోసం ఎన్సీఎల్టీ రంగప్రవే శం చేసింది. ఈ పరిణామం చెరుకు రైతులు, కా ర్మికుల్లో మరింత ఉత్కంఠతకు గురిచేసింది. ఎన్సీ ఎల్టీ హైదరాబాద్ బెంచ్ ఐపీఆర్‌గా నియామకమైన రాచర్ల రామక్రిష్ణ గుప్తా విచారణ ప్రక్రియను 2017 అక్టోబర్‌లో ప్రారంభించగా.. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించిన సమయంలో వివరాలను వెల్లడించారు. బ్యాంక్ అప్పులు, కార్మికుల ఆర్థికపరమైన బకాయిలు, ఇతర పన్ను బకాయిలు చె ల్లించేందుకు అంగీకరించిన వారికి ఫ్యాక్టరీని అప్పగించే ప్రక్రియ ఉంటుందని తెలిపారు. తొలి ప్రా ధాన్యతగా ప్రస్తుత ఎన్డీఎస్ఎల్ ప్రైవేట్ యాజ మాన్యం అవకాశం కల్పించడం జరుగుతోందని వివరించారు. ప్రైవేట్ యాజమాన్యం, ప్రభుత్వం బకాయిలు చెల్లించి, ఫ్యాక్టరీని నడిపేందుకు ముం దుకు రానియెడల ఇతర ప్రైవేట్ కంపెనీలకు ఆ హ్వానిస్తామని, ఈ ప్రక్రియ సాధ్యం కాకపోతే ఫ్యా క్టరీ ఆస్తులు విక్రయించి అప్పు బకాయిలు చెల్లించ డం జరుగుతోందని స్పష్టత ఇచ్చారు. దీంతో ఈ కోణంలో విచారణ కొనసాగింది. 2017 నుంచి ఎ న్సీఎల్టీ విచారణ కొనసాగించి ఆఖరుకు 2019 జూన్ 3న ఎన్డీఎస్ఎల్ లిక్విడేషన్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హఠాత్పరిణామంతో చెరుకు రైతులు, కార్మికులు హతాశులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్డీఎస్ఎల్ అమ్మకం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నిలుపుదలకు అప్పీలేట్ ట్రి బ్యునల్‌కు అప్పీలు పిటిషన్ దాఖలు చేయడం. ఈ మేరకు సానుకూలంగా ట్రిబ్యునల్ స్టే ఉత్తర్వులు ఇవ్వడం శుభపరిణామమని కార్మిక సంఘాల నాయకులంటున్నారు. ఇదే స్ఫూర్తితో ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలంటున్నారు. తాజా పరిణామంతో చెరుకు రైతులు, కార్మికుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. స్టే ఉత్తర్వులు వాస్తవమే.. ఎన్సీఎల్టీ గత నెల 3న ఎన్డీఎస్ఎల్ లిక్విడేషన్‌కు జారీ చేసిన ఉత్తర్వుల పై న్యూఢిల్లీ ఎన్సీఎల్ఏటీకి ఈ నెల 12న అప్పీలు పిటిషన్ దాఖలు చేశాం. బుధవారం లిక్విడేషన్ ఉత్తర్వులు నిలుపుదల చేస్తు ఎన్సీఎల్ఏటీ స్టే ఉత్తర్వులు జారీ చేసిన విషయం వాస్తవమే. –భద్రు మల్హోత్, రాష్ట్ర కేన్ కమిషనర్, హైదరాబాద్ -
ఫ్యాక్టరీని విక్రయిస్తే తరిమికొడతాం
రెంజల్(బోధన్): బోధన్‌లోని చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం విక్రయిస్తే తరమికొడతామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ హెచ్చరించారు. రైతులు, కార్మికులతో ప్రతిఘటిస్తామన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదులో భాగంగా రెంజల్ మండలం నీలాక్యాంపులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని సీఎం కేసీఆర్ మాట మార్చారని విమర్శించారు. ‘కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు’ టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు ఉందన్నారు. కార్మికుల బకాయిలను చెల్లించి వందలాది మందికి ఉపాధినిస్తున్న ఫ్యాక్టరీని తెరిపించాలన్నారు. రూ.360 కోట్లు చెల్లించిన కేసీఆర్ రూ.500 కోట్లతో అసెంబ్లీ భవన నిర్మాణం చేపట్టడం సిగ్గుచేటన్నారు. జిల్లా కేంద్రంలోని నడిబోడ్డున ఉన్న కలెక్టరేట్‌ను తరలించడంలో అనుమానం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయానికి ఎంపిక చేసిన భూమి విలువ మార్కెట్లో రూ.1.50 లక్షలకు గజం ఉండగా కేవలం రూ.వందకు గజం చొప్పున ధర కట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని దేశం సరిహద్దు, అంతర్గత భద్రత విభాగాల్లో సురక్షితంగా ఉందన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత కాశ్మీర్లో ఉగ్రవాద, తీవ్రవాదం పూర్తిగా తగ్గిందన్నారు. మానవబాంబులను మోదీ నిర్వీర్యం చేశారని ఫలితంగా ప్రపంచ దేశాల్లోని ఎన్ఆర్ఐలకు గౌరవం లభిస్తుందన్నారు. సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది.. సొమ్ము కేంద్రానిదైతే రాష్ట్ర ప్రభుత్వం సోకు చేస్తుందని యెండల ఆరోపించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు 2014–15లో ఒక్కొక్కరికి రూ.350 ఉండగా 2018–19కు రూ. 804కు కేంద్రం పెంచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూపాయి కూడా విదల్చడంలేదన్నారు. ఉపాధిహామీ మొదటి విడతలో ఇచ్చిన హామీలు నెరవేరకుండారనే రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎంపీపీ లోలపు రజిని, జెడ్పీటీసీ మేక విజయ, ఎంపీటీసీలు యోగేశ్, గడ్డం స్వప్న, జల్ల రుక్మిణి, అంతయ్య, బీజేపీ నాయకులు సంతోష్, కిషోర్, కోయా సాంబశివరావ్, డాక్టర్ శివప్ప, సుభాష్, భాస్కర్‌రెడ్డి, రాజు, వెంకటేశ్వర్రావ్, రాంచందర్, పోచయ్య, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు. -
మళ్లీ నిజాం షుగర్స్ రక్షణ ఉద్యమం
బోధన్: మూతపడిన ఎన్డీఎస్ఎల్ (నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్) లిక్విడేషన్‌కు తాజాగా ఎన్సీఎల్టీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రక్షణ కోసం మళ్లీ రాజకీయ పార్టీలు ఉద్యమ బాట పట్టాయి. తెలంగాణ ఆవిర్భావనంతరం 2014 లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో , మలి దశ తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని పూర్వవైభవం తెస్తామని ఇచ్చిన హామీని ప్రస్తావిస్తున్నాయి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఫ్యాక్టరీ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా షుగర్ ఫ్యాక్టరీ అమ్మేందుకు రంగం సిద్ధమవుతున్న పరిస్థితిపై ప్రతిపక్ష పార్టీలు నిరసన గళం ఎత్తాయి. స్వరాష్ట్ర పాలనలో ఫ్యాక్టరీకి పూర్వవైభవం వస్తోందని ఆశిస్తే, నడిచే ఫ్యాక్టరీ మూతపడిందని, వందలాది మంది కార్మికలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని, పండించిన చెరుకు పంటను ప్రైవేట్ చక్కెర ఫ్యాక్టరీలకు తరలించేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారని, ఫ్యాక్టరీ మూతపడి మూడున్నరేళ్లు గడిచినా ప్రభుత్వం పునరుద్ధరణవిషయంలో కాలయాపన చేస్తోందని, నిర్లక్ష్యం వహిస్తోందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే శివసేన, బీజేపీలు ధర్నా, రాస్తారోకోలు చేపట్టాయి. కాంగ్రెస్, వామపక్ష, విప్లవ కమ్యూనిస్టు పార్టీలు, కార్మిక సంఘాలు షుగర్ ఫ్యాక్టరీ లిక్విడేషన్ ఉత్తర్వులు రద్దు చేయించాలని డిమాండ్ చేస్తున్నాయి. నిజాంషుగర్స్ రక్షణ కమిటీ ఉద్యమ కార్యాచరణను రూపకల్పన చేస్తోంది. గురువారం బోధన్ ఆర్డీవో ఆఫీసు ఎదుట రక్షణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. -
చిమ్నీ ఎక్కిన కార్మికులు
వేతన సవరణ చేశాకే ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బోధన్ చక్కెర కర్మాగారం (ఎన్డీఎస్ఎల్)లో పలువురు కార్మికులు పొగ గొట్టం పైకి ఎక్కారు. తమ డిమాండును అంగీకరించపోతే దూకుతామని హెచ్చరించారు. వారికి మద్దతుగా సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న ఎన్డీఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ జానకీ మనోహర్, బల్దియా చైర్మన్ ఆనంపల్లి ఎల్లం అక్కడి చేరుకొని కార్మిక సంఘాల నాయకులతో మాట్లా డారు. జనవరి 31 లోగా మధ్యంతర భృతి, బాయిలు చెల్లిస్తామని, వేతన సవరణ కూడా చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు కిందికి దిగి వచ్చారు. - పొగ గొట్టం ఎక్కిన ఎన్డీఎస్ఎల్ కార్మికులు - జనవరి 31 వరకు అమలు చేస్తామని అసిస్టెంట్ కేన్ కమిషనర్ హామీ బోధన్ టౌన్ : యాజమాన్యం వేతన సవరణను దాటవేస్తూ కార్మికులను విస్మరిస్తోందని ఎన్డీఎస్ఎల్ కర్మాగారంలో బుధవారం కార్మికులు ఆందోళన చేపట్టారు. పొగగొట్టం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. సీఐ టీయూ కార్మిక సంఘం, ప్రజా సంఘాల నాయకులు ఫ్యాక్టరీలో ఆందోళనకు దిగారు. వేతన సవరణ చేపట్టాకే ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో విధులకు వచ్చిన కార్మికులు సాయిలు, శ్రీనివాస్ కర్మాగారంలో 160 ఫీట్లు గల పొగ గొట్టం ఎక్కి వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు, సీటీయూ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు అక్కడికి చేరుకొని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొనగా, సీఐ రామకృష్ణ వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. యాజమాన్యం దిగి వచ్చి వేతన సవరణ చేయాలని పట్టుబట్టారు. సమాచారం తెలుసుకున్న ఎన్డీఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ జానకీ మనోహర్, బల్దియా చైర్మన్ ఆనం పల్లి ఎల్లం అక్కడికి చేరుకొని కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడారు. నేరుగా యాజమాన్యంతో మాట్లాడి తమకు వేతన సవరణపై హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు. వేతన సవరణపై స్పష్టమైన హా మీ ఇవ్వాలని యాజమాన్యాన్ని బల్దియా చైర్మన్ ఎల్లం, టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు కోరారు. దీంతో వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్‌లో కార్మిక సంఘంతో యాజమాన్యం చర్చ లు జరిపిందన్నారు. చర్చల్లో కార్మికులు 14 నెలల ఐఆర్, ఏరియర్స్ నాలుగు విడతలుగా ఇవ్వాలని, మార్చి అనంతరం వేతన సవరణ చేపట్టాలని యాజమాన్యానికి సూచించారని తెలిపారు. దీనికి కార్మిక సంఘం నాయకులు, యాజమాన్యం ఒప్పుకున్నాయన్నారు. అయినా కార్మికులు ససేమిరా అన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు కుమార స్వామి, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ తమకు వేతన సవరణపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం చెరకు ఉత్పత్తి దారుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. కార్మిక సంఘాల నాయకులు క్రషింగ్‌కు సహకరించాలని, రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఆలోచించాలన్నారు. తాముసైతం కార్మికులకు అండగా ఉండి వేతన సవరణ అయ్యే వరకు పోరాడుదామని కార్మికులను సముదాయించే ప్రయత్నం చేశారు. కార్మికులు ససేమిరా అనడంతో చర్చించి సమస్య పరిష్కరించుకుందామని తెలిపారు. ప్రజా సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ ఇవ్వాలని సూచించారు. దీంతో అసిస్టెంట్ కేన్ కమిషనర్ జాన్ విక్టర్ కర్మాగారానికి చేరుకొని చర్చలు జరిపారు. కార్మికులకు నాలుగు విడతలుగా ఇస్తామన్న ఐఆర్, ఏరియర్స్ రెండు విడతల్లో జనవరి 31 వరకు చెల్లిస్తామని, దీంతో పాటు వేతన సవరణ సైతం అప్పటి వరకు చేస్తామని హామీ ఇచ్చారు. క్రషింగ్ కు అందరు సహకరించాలని కోరారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించారు.