ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల కావడంతో క్రికెట్ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మాత్రం ఊహించని షాక్ తగిలింది. త్వరలో పీసీబీకి చైర్మన్‌కు సంబంధించి జరగనున్న ఎన్నికపై బలూచిస్తాన్ హైకోర్టు స్టే విధించింది.జూలై 17 వరకు ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది.
ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో రిపోర్టు ప్రకారం.. 2014 రాజ్యాంగ చట్టాన్ని పీసీబీ గవర్నింగ్ బాడీ ఉల్లఘించినట్లు ఆరోపణలు రావడంతో ఎన్నికలు నిలిపివేయాలని కోర్టు తెలిపింది. అయితే పీసీబీ వాదనను వినడానికి కూడా ఇష్టపడని హైకోర్టు గవర్నింగ్ బాడీలో ఉన్న ప్రతినిధులందరికి నోటీసులు జారీ చేసింది. కోర్టు నిర్వహించే తదుపరి సెషన్‌కు హాజరవ్వాలని కోరింది. అయితే పీసీబీ చైర్మన్‌గా జకా అష్రఫ్ పేరు ఖరారు అయినప్పటికి కోర్టు నుంచి క్లియరెన్స్ వస్తేనే పీసీబీ చైర్మన్‌కు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఆరోపణలు నిజమని తేలితే మాత్రం పీసీబీ గవర్నింగ్ బాడీ ప్రాసెస్‌ను మొత్తం రద్దు చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి వస్తోంది.
వాస్తవానికి పీసీబీ గవర్నింగ్ బాడీ పది మంది పాలకవర్గంతో ఉంటుంది. ఇందులో ఇద్దరు ప్రధాని సిఫార్సు చేసిన వ్యక్తులు ఉంటే.. మిగతావారిలో నలుగురు ప్రాంతీయ ప్రతినిధులు, మరో నలుగురు సేవా ప్రతినిధులు ఉంటారు. వీరందరు కలిసి నూతన చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే పీసీబీ చైర్మన్ ఎవరనేది మాత్రం ప్రధానమంత్రి చేతుల్లో ఉంటుంది. ఎన్నికైన నూతన పీసీబీ చైర్మన్ మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగాల్సి ఉంటుంది.
ఇక ఇవాళ విడుదలైన వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌కు సంబంధించి పాకిస్తాన్ తన మ్యాచ్‌లన్నీ దక్షిణాది నగరాల్లో ఆడనుండగా.. భారత్‌తో మ్యాచ్‌ను మాత్రం అహ్మదాబాద్‌లో ఆడనుంది. అక్టోబర్ 15న జరగనున్న మ్యాచ్‌కు సంబంధించి పాకిస్తాన్ భారత్‌తో మ్యాచ్‌ను కూడా దక్షిణాది నగరాల్లో లేదా కోల్‌కతా, ముంబైలో నిర్వహించాలని కోరింది. కానీ అందుకు ఒప్పుకొని బీసీసీఐ అహ్మదాబాద్‌లోనే ఆడాలంటూ తమ నిర్ణయాన్ని వెల్లడించింది. బీసీసీఐ తీసుకున్న నిర్ణయానికి ఓటు వేసిన ఐసీసీ భారత్-పాక్ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసింది. అంతేగాక దక్షిణాదిన పాకిస్థాన్ రెండు వేదికలు (చెన్నై, బెంగళూరు) తమకు అనుకూలంగా లేవంటూ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఐసీసీ దానిని పట్టించుకున్న పాపాన పోలేదు.
చదవండి: వన్డే వరల్డ్‌కప్-2023 మ్యాచ్ టైమింగ్స్, తదితర వివరాలు
Comments
Please login to add a commentAdd a comment