Najam Sethi Pulls Out Of Race For Next PCB Chairman - Sakshi
Sakshi News home page

#NajamSethi: 'గొడవలు జరగడం ఇష్టం లేదు.. రేసు నుంచి తప్పుకుంటున్నా'

Published Tue, Jun 20 2023 10:53 AM | Last Updated on Tue, Jun 20 2023 12:11 PM

Najam Sethi-Pulls-Out Of Race For Next PCB Chairman Surprised Every-one - Sakshi

పీసీబీ తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్న నజమ్‌ సేథీ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో పీసీబీ ఛైర్మన్‌కు సంబంధించి జరగనున్న ఎన్నికల్లో రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని నజమ్‌ సేథీ స్వయంగా ట్విటర్‌ ద్వారా తెలిపాడు. ''ఆసిఫ్ జర్దారీ, షెహబాజ్ షరీఫ్‌ల మధ్య గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు. ఇంతటి అస్థిరత, అనిశ్చితి పీసీబీకి మంచిది కాద. ఈ పరిస్థితుల్లో నేను పీసీబీ చైర్మన్ అభ్యర్థి పదవికి పోటీ చేయలేను. అందుకే తప్పుకుంటున్నా. రేసులో ఉన్న మిగిలినవారికి ఆల్‌ ది బెస్ట్‌'' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా గతేడాది డిసెంబర్‌లో రమీజ్‌ రాజాను పీసీబీ ఛైర్మన్‌ పదవి నుంచి తప్పించిన ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ అతని స్థానంలో నజమ్‌ సేథీని తాత్కాలిక ఛైర్మన్‌గా ఎంపిక చేశాడు. పీసీబీ ఛైర్మన్‌ పదవికి ఎన్నికలు జరిగేంతవరకు నజమ్‌ సేథీ తాత్కాలిక ఛైర్మన్‌గా ఉంటారని పీసీబీ పేర్కొంది. కాగా 120 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉండగా.. ఆరు నెలలు దాటిపోయింది.

ఈ ఆరు నెలల కాలంలో నజమ్‌ సేథీ పీసీబీలోని 14 మందితో కూడిన కమిటీని సమర్థంగా నడిపించాడు. కొన్ని కీలక నిర్ణయాలతో తన ఇంపాక్ట్‌ చూపించాడు. మికీ ఆర్థర్‌ను డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా, గ్రాంట్‌  బ్రాడ్‌బర్న్‌  హెడ్‌కోచ్‌గా, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ మోర్నీ మోర్కెల్‌ను బౌలింగ్‌ కోచ్‌గా ఎంపిక చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఆసియా కప్‌ హైబ్రీడ్‌ మోడ్‌లో నిర్వహించే ప్రతిపాదన నజమ్‌ సేథీదే. మొత్తానికి ఏసీసీని ఒప్పించి ఆసియా కప్‌ హైబ్రీడ్‌ మోడ్‌లో జరిగేలా చూడడంలో నజమ్‌ సేథీ సక్సెస్‌ అయ్యాడు. 

కాగా ఈ బుధవారం(జూన్‌ 21న)తో పీసీబీ తాత్కాలిక ఛైర్మన్‌ పదవీకాలం ముగియనుంది. సమర్థంగా పనిచేసిన నజమ్‌ సేథీ మరోసారి పీసీబీ ఛైర్మన్‌గా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ నజమ్‌ సేథీని ఎన్నుకోవడం పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీకి ఇష్టం లేదు. మరోవైపు ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ మాత్రం నజమ్‌కు మద్దతుగా ఉన్నారు.

కానీ తన వల్ల ఇద్దరి మధ్య గొడవలు రాకూడదని.. అది పీసీబీకి మంచిది కాదని పేర్కొన్న నజమ్‌ సేథీ తనంతట తానుగా రేసు నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా నజమ్‌ సేథీ రేసు నుంచి తప్పుకోగా. మిగిలిన వారిలో జకా అష్రఫ్‌ పీసీబీ ఛైర్మన్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

చదవండి: 'తప్పేముంది.. రెండింటికి సమన్యాయం చేశాడు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement