పాక్‌ క్రికెట్‌లో కీలక పరిణామం.. చైర్మెన్‌గా సుప్రీంకోర్టు న్యాయవాది | Shah Khawar appointed interim chairman of Pakistan Cricket Board | Sakshi
Sakshi News home page

#PCB Chairman: పాక్‌ క్రికెట్‌లో కీలక పరిణామం.. చైర్మెన్‌గా సుప్రీంకోర్టు న్యాయవాది

Published Wed, Jan 24 2024 4:22 PM | Last Updated on Wed, Jan 24 2024 4:50 PM

Shah Khawar appointed interim chairman of Pakistan Cricket Board - Sakshi

పాకిస్తాన్‌ క్రికెట్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాత్కాలిక చైర్మన్‌గా ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయవాది షా ఖవార్ నియమితులయ్యారు. షా ఖవార్ పీసీబీ ఎన్నికల కమీషనర్‌గా కూడా పనిచేస్తున్నారు. కాగా ఈ నెల 20న పీసీబీ చైర్మెన్‌ పదవికి జ‌కా అష్రఫ్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప‌ద‌వి చేప‌ట్టి ఏడాది కాక‌ముందే పీసీబీ మేనేజ్‌మెంట్ క‌మిటీ నుంచి అష్రఫ్ వైదొలిగాడు.

ఇప్పుడు అతడి స్ధానాన్ని షా ఖవార్ భర్తీ చేయనున్నాడు. ఈ మెరకు పాక్‌ తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వారుల్ హక్ కాకర్ ఆదేశాలు జారీ చేశారు.  వచ్చే నెలలలో జరగనున్న పీసీబీ ఎన్నికల వరకు షా ఖవార్ ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా పీసీబీ కొత్త అధ్యక్షుడి రేసులో పంజాబ్ ప్రావిన్స్ తాత్కాలిక ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ ముందంజలో ఉన్నారు.

ఇక పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు విషయానికి వస్తే.. గత కొన్ని రోజులగా దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. వన్డే వరల్డ్‌కప్‌-2023 నుంచి పాకిస్తాన్‌ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. వరల్డ్‌కప్‌ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనలలో ఘోర ఓటములను చవిచూసింది.
చదవండి: #Suryakumar Yadav: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement