Zaka Ashraf
-
పాక్ క్రికెట్లో కీలక పరిణామం.. చైర్మెన్‌గా సుప్రీంకోర్టు న్యాయవాది
పాకిస్తాన్ క్రికెట్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాత్కాలిక చైర్మన్‌గా ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయవాది షా ఖవార్ నియమితులయ్యారు. షా ఖవార్ పీసీబీ ఎన్నికల కమీషనర్‌గా కూడా పనిచేస్తున్నారు. కాగా ఈ నెల 20న పీసీబీ చైర్మెన్ పదవికి జకా అష్రఫ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పదవి చేపట్టి ఏడాది కాకముందే పీసీబీ మేనేజ్మెంట్ కమిటీ నుంచి అష్రఫ్ వైదొలిగాడు. ఇప్పుడు అతడి స్ధానాన్ని షా ఖవార్ భర్తీ చేయనున్నాడు. ఈ మెరకు పాక్ తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వారుల్ హక్ కాకర్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెలలలో జరగనున్న పీసీబీ ఎన్నికల వరకు షా ఖవార్ ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా పీసీబీ కొత్త అధ్యక్షుడి రేసులో పంజాబ్ ప్రావిన్స్ తాత్కాలిక ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ ముందంజలో ఉన్నారు. ఇక పాకిస్తాన్ క్రికెట్ జట్టు విషయానికి వస్తే.. గత కొన్ని రోజులగా దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. వన్డే వరల్డ్‌కప్-2023 నుంచి పాకిస్తాన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. వరల్డ్‌కప్ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలలో ఘోర ఓటములను చవిచూసింది. చదవండి: #Suryakumar Yadav: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
పాకిస్తాన్ క్రికెట్లో మరో వివాదం.. బాబర్ ఆజం ప్రైవేట్ చాట్ లీక్
వన్డే ప్రపంచకప్-2023లో వరుస ఓటములతో సతమతవుతున్న పాకిస్తాన్ క్రికెట్లో మరో వివాదం చెలరేగింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓవో) మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీక్ అయింది. ఏం జరిగిందంటే? కాగా ఆఫ్గానిస్తాన్ చేతిలో ఘోర ఓటమిపాలైనంతరం పాకిస్తాన్ జట్టుపై తీవ్ర విమర్శల వర్షం కురిసింది. ఈ క్రమంలో కెప్టెన్ బాబర్ ఆజంను తన పదవి నుంచి తప్పిస్తారని.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి కూడా ఆటగాళ్లకు ఎటువంటి సపోర్ట్ లేదని వార్తలు వినిపించాయి. అంతేకాకుండా పీసీబీ చైర్మన్ జాకా అష్రఫ్తో మాట్లాడేందుకు బాబర్ ఆజం ప్రయత్నిస్తున్నప్పటికీ అతడు నుంచి ఎటువంటి స్పందన లేదన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొట్టాయి. తాజాగా ఇదే విషయంపై ఓ పాకిస్తానీ ఛానల్ ఇంటర్వ్యూలో పీసీబీ చైర్మన్ జాకా అష్రఫ్ స్పందించాడు. ఈ వార్తలను అష్రప్ తొచిపుచ్చాడు. "బాబర్ నన్ను ఎప్పుడూ నేరుగా సంప్రదించలేదు. అతడు సాధారణంగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ లేదా అంతర్జాతీయ క్రికెట్ డైరెక్టర్‌తో మాట్లాడతాడు" అని అష్రఫ్ పేర్కొన్నాడు. అంతటితో అగని అష్రప్.. తన వ్యాఖ్యలను సమర్ధిస్తూ బాబర్ ఆజం, పీసీబీ సీఓవో మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను చూపించాడు. చాట్‌లో ఏముందంటే? ఇదే విషయంపై బాబర్ ఆజంతో సల్మాన్ నసీర్ వాట్సాప్‌లో చాట్ చేశాడు. ‘బాబర్.. నువ్వు ఫోన్, మెసేజ్ చేస్తే ఛైర్మన్ రెస్పాండ్ కావడం లేదని టీవీలలో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నువ్వేమైనా ఆయనకు ఫోన్ చేశావా..?’ అని నసీర్ అడిగాడు. అందుకు బదలుగా బాబర్.. ‘సలామ్ సల్మాన్ భాయ్, నేను సార్ కు ఫోన్ చేయలేదు..’అని రిప్లై ఇచ్చినట్లు ఆ చాట్‌లో ఉంది. కాగా ఒక చైర్మెన్ స్ధాయిలో ఉండి కెప్టెన్ ప్రైవేట్ చాట్‌ను లీక్ చేసిన అష్రప్పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మండి పడుతున్నారు. ఆ జట్టు మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ స్పందిస్తూ.. . ‘అసలు ఏం చేద్దామని చూస్తున్నారు? ఇది చాలా దారుణం. మీరు ఇప్పుడు చాలా సంతోషంగా ఉండి ఉంటారు. బాబర్ ఆజమ్‌ని వదిలేయండి. అతను పాకిస్తాన్ క్రికెట్‌కి ఓ విలువైన ఆస్తి" అంటూ ట్విట్ చేశాడు. చదవండి: CWC 2023: పాకిస్తాన్ క్రికెట్‌కు భారీ షాక్ -
టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్! భారత్‌కు రానున్న పీసీబీ చీఫ్
క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న దాయాదుల పోరుకు సమయం దగ్గరపడుతోంది. ఆక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ జకా అష్రఫ్ భారత్‌కు రానున్నారు. కాగా ఇప్పటికే ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం పాకిస్తాన్ జర్నలిస్ట్‌లకు భారత ప్రభుత్వం వీసాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 60 మంది జర్నలిస్టులతో పాటు జకా అష్రఫ్ కూడా భారత గడ్డపై అడుగుపెట్టనున్నారు. "నేను గురువారం భారత్‌కు పయనం కానున్నాను. నా ప్రయాణం కాస్త ఆలస్యమైంది. ఈ మెగా ఈవెంట్‌ను కవర్ చేయడానికి పాకిస్తాన్ జర్నలిస్ట్‌లకు వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది. వీసాల జారీపై భారత రాయబార కార్యాలయం సానుకూలంగా స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది. మా జర్నలిస్టులతో కలిసి భారత్‌కు రానున్నాను. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లో మా జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఆటగాళ్ల ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. జట్టును ప్రోత్సహించేందుకు నేను భారత్‌కు వెళుతున్నాను. భారత్‌తో కీలక మ్యాచ్‌కు ముందు మా జట్టుకు నేను ఇచ్చే సందేశం ఒక్కటే. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడాలని పీసీబీ విడుదల చేసిన వీడియోలో అష్రఫ్ పేర్కొన్నాడు. చదవండి: WC 2023: వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన కోహ్లి.. రాహుల్ ఏకంగా.. -
'జై షా పాకిస్తాన్ వెళ్లడమేంటి?.. దాయాదుల మ్యాచ్ అక్కడే'
ఆసియా కప్ 2023 నిర్వహణపై ఒక స్పష్టత వచ్చింది. పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్, బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడు జై షా.. సోమవారం భేటీ కావడం ఆసక్తి కలిగించింది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్‌కు తాను అంగీకరించినట్లు జకా అష్రఫ్ మీడియాకు వెల్లడించాడు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనున్న ఆసియా కప్‌లో శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‌లు, పాకిస్తాన్లో నాలుగు మ్యాచ్‌లు షెడ్యూల్ చేశారు. మ్యాచ్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ శుక్రవారం విడుదలయ్యే అవకాశముంది. భారత్ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. ఈ విషయం పక్కనబెడితే పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు టీమిండియా త్వరలో వెళ్లనుందని.. ముందస్తుగా బీసీసీఐ సెక్రటరీ జై షా పాక్‌కు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తారంటూ వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తల్లో నిజం లేదని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. పీటీఐతో మాట్లాడిన ఆయన.. ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు శ్రీలంకలోని డంబుల్లా స్టేడియం వేదిక కానుందని పేర్కొన్నారు. ''బీసీసీఐ కార్యదర్శి జై షా, పీసీబీ ప్రతినిధి జాకా అష్రఫ్ సమావేశం తర్వాత ఆసియా కప్ పై స్పష్టత వచ్చింది. మా కార్యదర్శి జై షా, పీసీబీ చైర్మన్ జాకా అష్రఫ్ ను కలిశారు. ఆసియా కప్ షెడ్యూల్ ఖరారైంది. పాకిస్థాన్ లో నాలుగు లీగ్ మ్యాచ్ లు జరుగుతాయి. ఆ తర్వాత 9 మ్యాచ్ లు శ్రీలంకలో జరుగుతాయి. అందులో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కూడా ఉంటుంది. ఒకవేళ ఈ రెండు టీమ్స్ ఫైనల్లో తలపడితే ఆ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే జరుగుతుంది" అని అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. ఇండియన్ టీమ్ పాకిస్థాన్ రాబోతోందన్న మీడియా వార్తలను ఆయన ఖండించారు. భారత జట్టే కాదు.. చర్చల కోసం జై షా కూడా పాకిస్థాన్ వెళ్లడం లేదని అరుణ్ ధుమాల్ తేల్చి చెప్పాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టు తమ స్వదేశంలో నేపాల్ తో మాత్రమే ఆడనుంది. ఈ మ్యాచ్ కాకుండా ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్.. బంగ్లాదేశ్, శ్రీలంక.. శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ మధ్య కూడా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉపఖండంలో 2016 తర్వాత జరుగుతున్న తొలి ఆసియా కప్ ఇదే. ఆ ఏడాది బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వగా.. తర్వాత 2018, 2022లలో యూఏఈలో జరిగింది. చదవండి: జై షాను కలిసిన పీసీబీ చైర్మన్.. ఆసియా కప్‌కు గ్రీన్ సిగ్నల్ WCC Suggests ICC: 'వరల్డ్‌కప్ తర్వాత ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను తగ్గించండి' -
జై షాను కలిసిన పీసీబీ చైర్మన్.. ఆసియా కప్‌కు గ్రీన్ సిగ్నల్
ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆసియా క్రికెట్ కౌన్సిల్ పర్యవేక్షిస్తోంది. ఈసారి ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్లో జరగనుంది. శ్రీలంక, పాకిస్తాన్‌లు ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందులో నాలుగు మ్యాచ్‌లు పాకిస్తాన్లో.. మరో తొమ్మిది మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి. ఇటీవలే పీసీబీ చైర్మన్‌గా ఎన్నికైన జకా అష్రఫ్.. ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్‌ను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఒక మెట్టు దిగిన జకా అష్రఫ్ తాను అలా అనలేదని.. ఆసియాకప్ టోర్నీని పాకిస్తాన్లో నిర్వహించి ఉంటే బాగుండేదని మాత్రమే అన్నట్లుగా పేర్కొన్నాడు. అయితే ఆసియా కప్ షెడ్యూల్ ఇప్పటివరకు విడుదల కాకపోవడానికి పీసీబీనే పరోక్ష కారణం. హైబ్రీడ్ మోడల్‌ను ఒకసారి ఒప్పుకోవడం.. మరోసారి తిరస్కరించడం.. వరల్డ్‌కప్‌తో ముడిపెట్టడంతో అసలు ఆసియా కప్ జరుగుతుందా అన్న అనుమానం కలిగింది. తాజాగా పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్.. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడు జై షాతో భేటి అయ్యాడు. సోమవారం రాత్రి ఇద్దరు దుబాయ్‌లో కలుసుకొని ఆసియా కప్ గురించి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించడంపై తమకు అభ్యంతరం లేదని స్వయంగా పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్ జైషాకు వెల్లడించారు. దీంతో ఆసియా కప్ నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ శుక్రవారం ఆసియా కప్ 2023 పూర్తి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఇదే విషయమై పీసీబీ చీఫ్ మాట్లాడుతూ.. ''జై షాతో మీటింగ్ మంచి ఆరంభం. ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్లో నిర్వహించడం మాకు ఓకే. ఇక రానున్న కాలంలో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మైత్రి బంధం బలపడే అవకాశముంది. రిలేషన్స్‌ను పెంచుకుంటూ ముందుకు సాగుతాం'' అంటూ తెలిపాడు. చదవండి: Wimbledon 2023: సంచలనం.. నెంబర్ వన్ స్వియాటెకు షాకిచ్చిన స్వితోలినా -
PCB: పీసీబీ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్‌గా జకా ఆష్రఫ్ నియామకం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్‌గా జకా ఆష్రఫ్ నియమితుడయ్యాడు. పది మంది సభ్యులతో కూడిన కమిటీకి అతడు నేతృత్వం వహించనున్నాడు. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం నియామకాలు జరిపినట్లు పీసీబీ గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా జకా ఆష్రఫ్ సారథ్యంలోని ఈ కమిటీ నాలుగు నెలల పాటు అధికారంలో కొనసాగనుంది. ఇందులో నలుగురు రీజినల్ రిప్రెజెంటేటివ్స్, నలుగురు సర్వీస్ రిప్రెజెంటేటివ్స్, ప్రధాని చేత నామినేట్ చేయబడిన ఇద్దరు సభ్యులకు చోటు ఉంటుంది. ఈ నేపథ్యంలో జకా ఆష్రఫ్ ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఇప్పుడు అధికారికంగా పీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యాను. రానున్న కాలంలో పీసీబీలో సానుకూల మార్పులు తీసుకురాగలనని ఆ దేవుడి సాక్షిగా చెబుతున్నా’’ అంటూ తన నియామకానికి సంబంధించిన డాక్యుమెంట్ ఫొటోను షేర్ చేశాడు. కాగా ఆసియాకప్, వన్డే వరల్డ్‌కప్ టోర్నీలు సమీపిస్తున్న తరుణంలో కొత్త కమిటీ గురువారమే లాహోర్‌లో సమావేశం కానుంది. I have Officially Joined PCB as Chairman. Alhamdulillah, You will have Positives Changes in the PCB Upcoming Days In Sha Allah✌️💯. #ZakaAshraf pic.twitter.com/h6rRGkjlKm — Chaudhry Zaka Ashraf (@IZakaAshraf) July 5, 2023 -
'పాక్‌కు ఇది అవమానం.. హైబ్రీడ్ మోడల్‌ను వ్యతిరేకిస్తున్నా'
''ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించడం ఇష్టం లేదని.. దీనిని వ్యతిరేకిస్తున్నానంటూ''.. పీసీబీకి కాబోయే చైర్మన్ జకా అష్రఫ్ బాంబు పేల్చాడు. ఇటీవలే పీసీబీ తాత్కాలిక చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్న నజమ్ సేథీ ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ)కు ప్రతిపాదన పంపారు. దీనిపై సుధీర్ఘంగా చర్చించిన ఏసీసీ పాక్ ప్రతిపాదనను ఒప్పుకొని ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడల్లో నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో ఆసియా కప్ షెడ్యూల్ కూడా విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకూ జరగాల్సి ఉంది. దీని ప్రకారం పాకిస్తాన్ లో నాలుగు మ్యాచ్ లు.. శ్రీలంకలో 9 మ్యాచ్ లు ఆడించేందుకు పీసీబీ అంగీకారం తెలిపింది.తాజాగా బుధవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అష్రఫ్ మాట్లాడుతూ ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నేను ఈ హైబ్రిడ్ మోడల్‌ను గతంలోనే వ్యతిరేకించా. ఇదో అర్థం పర్థం లేని విధానం. నేను దీనికి అంగీకరించను. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ).. ఈ ఏడాది ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహిస్తానని తెలిపింది. దాని ప్రకారం ఈ టోర్నీ ఇక్కడే జరగాలి. ఇక టోర్నీలో ప్రధాన మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్ బయటే జరగనున్నాయి. భూటాన్, నేపాల్ వంటి చిన్న జట్లు మాత్రమే ఇక్కడికి వస్తున్నాయి. ఇది పాకిస్తాన్ కు ఒకరకంగా అవమానమే. గతంలో మా బోర్డు ఏం నిర్ణయం తీసుకుందో నాకైతే అవగాహన లేదు. ఆ సమాచారం గురించి నాకు తెలియదు. కానీ క్లారిటీ మాత్రం ఉంది. ఈ తక్కువ వ్యవధిలో ఏం చేయగలనో అది చేస్తా'' అని చెప్పుకొచ్చాడు. PCB Nominated Chairman Zaka Ashraf Reject PCB hybrid Model for Asia Cup Interesting days ahead & controversy related #AsiaCup2023 #WorldCup2023 pic.twitter.com/3El1ISj0ym — Abdul Ghaffar 🇵🇰 (@GhaffarDawnNews) June 21, 2023 అష్రఫ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ ఏడాది ఆసియా కప్ భవితవ్యం మళ్లీ ప్రమాదంలో పడ్డట్టే. హైబ్రిడ్ మోడల్ ను తిరస్కరించిన పాకిస్తాన్ ఇప్పుడు ఆడితే పూర్తి మ్యాచ్ లు శ్రీలంకలోనే ఆడాలి లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించాలి. ఇంతకుమించి పాక్‌కు మరో ఆప్షన్ లేదు. ఎందుకంటే బీసీసీఐ ఇదివరకే తాము పాకిస్తాన్ కు వెళ్లేది లేదని కుండబద్దలు కొట్టింది. ఒకవేళ భారత్ లేకున్నా ఆసియా కప్ నిర్వహించడం అసాధ్యం. ఇక జకా అష్రఫ్ పీసీబీ చైర్మన్‌గా ఉన్న సమయంలో టీమిండియా, పాకిస్తాన్‌లు చివరి'సారిగా 2012లో ద్వైపాక్షిక సిరీస్ ఆడాయి. చదవండి: 'గిల్ క్యాచ్' పునరావృతం.. ఈసారి అన్యాయమే గెలిచింది! #AsiaCup2023: 'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది' -
కన్నేసి ఉంచాలంటూ పాక్ ఆటగాళ్ల భార్యలను భారత్‌కు పంపించాం!
టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే కేవలం పోటీ మాత్రమే కాదు. రెండు దేశాలకు తమ గౌరావాన్ని కాపాడుకోవాలనే ఆకాంక్షతో ఉంటాయి. ఏ జట్టుతో మ్యాచ్ ఓడినా పర్లేదు కానీ దాయాది చేతిలో ఓడితే మాత్రం విమర్శలు తప్పవు. కాగా ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగి చాలా కాలమే అవుతుంది. రెండు దేశాల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల మేజర్ టోర్నీల్లో తప్ప భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు జరగడం లేదు. ఇటీవలే పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా ప్రస్తావించిన నాలుగు దేశాల టోర్నీ ప్రతిపాదనను భారత్ తిరస్కరించింది. ఆ టోర్నీలో ఆడబోయేది లేదని భారత్ ఐసీసీకి తెలిపింది. అయితే పాకిస్తాన్ జట్టు భారత్‌లో చివరిసారి 2012-13లో పర్యటించింది. ఆ సమయంలో మూడు వన్డేలు. రెండు టి20 మ్యాచ్‌లు ఆడేందుకు పాక్ టీమిండియా గడ్డపై అడుగుపెట్టింది. టీమిండియాకు కెప్టెన్‌గా ఎంఎస్ ధోని ఉండగా.. పాకిస్తాన్ కెప్టెన్‌గా మిస్బా-ఉల్-హక్ వ్యవహరించాడు. వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో పాక్ కైవసం చేసుకోగా.. రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 1-1 డ్రా చేసుకున్నాయి. సిరీస్ ఫలితం పక్కనబెడితే.. అప్పుడు జరిగిన ఒక సంఘటనను మాజీ పీసీబీ చైర్మన్ జాకా అశ్రఫ్ తాజాగా పంచుకున్నాడు. పాక్ ఆటగాళ్ల వెంబడి వారి భార్యలను కూడా తొలిసారి భారత్‌కు పంపించామని పేర్కొన్నాడు. దీని వెనుక ఒక బలమైన కారణం ఉందని ఆయన వివరించాడు. '' పాకిస్తాన్ ఆటగాళ్లు ఎప్పుడు భారత్‌కు వచ్చినా.. ఆ దేశ మీడియా పాక్ ఆటగాళ్లపై ఆరోపణలు చేసేది. ఆటగాళ్లు ఎప్పుడు భారత్‌కు వచ్చినా తమ భార్యలను తీసుకురారని.. వాళ్లు రాకపోవడం వల్ల ఇక్కడ తమ సరసాలకు అడ్డు ఉండదని.. ఎవరు ఏం చేసినా అడిగేవారు ఉండరని.. అందుకే పాక్ ఆటగాళ్లు తమ భార్యలను తీసుకురారని వార్తలు రాసేవారు. కానీ వీటన్నింటికి చెక్ పెట్టడానికే.. పాక్ ఆటగాళ్లు వెళ్లిన తర్వాత.. ఒక కన్నేసి ఉంచమని వారి భార్యలను భారతదేశానికి పంపించాను. పీసీబీ మాజీ చైర్మన్ జాకా అశ్రఫ్ ఆ సమయంలో వాళ్లు పాక్ ఆటగాళ్లతోనే ఉండడంతో అక్కడి మీడియా(భారత్ మీడియా)కు వార్తలు రాయడానికి ఆస్కారం లేకుండా పోయింది. కాగా అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్.. సెక్యూరిటీ విషయంలో హామీ ఇస్తే పాకిస్తాన్ పర్యటనకు భారత్‌ను పంపిస్తామని మాట ఇచ్చారు. ఇంతవరకు ఆ మాట నిలుపుకోలేకపోయారు. అయితే భారత్‌తో సిరీస్ ఆడేందుకు ఎప్పటికప్పుడు మా ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉన్నాం.. కానీ భారత్ ఒప్పుకునే ప్రతిపాదనలో కనిపించడం లేదు'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Tim Southee: ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న కివీస్ స్టార్ ఆల్‌రౌండర్ Pollard Run-out: పొలార్డ్.. మరీ ఇంత నిర్లక్ష్యం పనికి రాదు! -
త్వరలో భారత్- పాక్ క్రికెట్ సిరీస్
ఎన్నాళ్లుగానో క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఇండో-పాక్ క్రికెట్ సిరీస్ త్వరలో సాకారం కాబోతోంది. సాధారణంగా ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులు వెల్లువెత్తుతారు. చాలా కాలంగా మ్యాచ్ ఏదీ జరగకపోవడంతో పాక్, భారత్ క్రికెట్ బోర్డులు తటస్థ వేదికపై సిరీస్ నిర్వహించాలని తలపెట్టాయి. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు జకా అష్రఫ్ తెలిపారు. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కూడా ఇందుకు అంగీకరించారని ఆయన అన్నారు. శ్రీనివాసన్‌తో అష్రఫ్ ఇటీవల భేటీ అయ్యారు. భారత్, పాకిస్థాన్ జట్టుల మధ్య క్రికెట్ సిరిస్ ఏర్పాటుకు బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ సుముఖత వ్యక్తం చేశారని సోమవారం లాహోర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అష్రఫ్ వెల్లడించారు. అయితే ఇరు దేశాల క్రికెట్ జట్లు మరో తటస్థ వేదికపై క్రికెట్ అడనున్నాయని తెలిపారు. అందుకు ఆస్ట్రేలియా లేదా ఇంగ్లాండ్‌ను ఎంచుకునే అవకాశం ఉందని అష్రఫ్ తెలిపారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్ టెస్ట్ అంటే ఇరుదేశాలలోని క్రికెట్ అభిమానులకు టెన్షనే టెన్షన్. ఇరుదేశాల పోటీలలో ఏ దేశం విజయపతాకం ఎగురవేస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే 2008లో ముంబై దాడుల తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య క్రికెట్ టెస్ట్ సిరీస్‌లకు మంగళం పాడారు. దాంతో ఇరుగు పొరుగు దేశాల క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. అయితే ఆ విషయాన్ని గ్రహించిన ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.