పాకిస్తాన్‌ క్రికెట్‌లో మరో వివాదం.. బాబర్‌ ఆజం ప్రైవేట్ చాట్‌ లీక్‌ | Leaked Whatsapp chats of Babar Azam fuels tensions in Pakistan cricket | Sakshi
Sakshi News home page

World Cup 2023: పాకిస్తాన్‌ క్రికెట్‌లో మరో వివాదం.. బాబర్‌ ఆజం ప్రైవేట్ చాట్‌ లీక్‌

Published Mon, Oct 30 2023 7:18 PM | Last Updated on Mon, Oct 30 2023 8:44 PM

Leaked Whatsapp chats of Babar Azam fuels tensions in Pakistan cricket - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో వరుస ఓటములతో సతమతవుతున్న పాకిస్తాన్‌ క్రికెట్‌లో మరో వివాదం చెలరేగింది. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం.. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీఓవో) మధ్య జరిగిన  వాట్సాప్‌ చాట్‌ లీక్‌ అయింది.

ఏం జరిగిందంటే?
కాగా ఆఫ్గానిస్తాన్‌ చేతిలో ఘోర ఓటమిపాలైనంతరం పాకిస్తాన్‌ జట్టుపై తీవ్ర విమర్శల వర్షం కురిసింది. ఈ క్రమంలో కెప్టెన్‌ బాబర్‌ ఆజంను తన పదవి నుంచి తప్పిస్తారని.. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు నుంచి కూడా ఆటగాళ్లకు ఎటువంటి సపోర్ట్‌ లేదని వార్తలు వినిపించాయి. 

అంతేకాకుండా  పీసీబీ  చైర్మన్ జాకా అష్రఫ్‌తో మాట్లాడేందుకు బాబర్ ఆజం ప్రయత్నిస్తున్నప్పటికీ అతడు నుంచి ఎటువంటి స్పందన లేదన్న వార్తలు కూడా సోషల్‌ మీడియాలో తెగ చెక్కర్లు కొట్టాయి. తాజాగా ఇదే విషయంపై  ఓ పాకిస్తానీ ఛానల్‌ ఇంటర్వ్యూలో పీసీబీ  చైర్మన్ జాకా అష్రఫ్‌ స్పందించాడు. ఈ వార్తలను అష్రప్‌ తొచిపుచ్చాడు.

"బాబర్‌ నన్ను ఎప్పుడూ నేరుగా సంప్రదించలేదు. అతడు సాధారణంగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ లేదా అంతర్జాతీయ క్రికెట్ డైరెక్టర్‌తో మాట్లాడతాడు" అని అష్రఫ్‌ పేర్కొన్నాడు. అంతటితో అగని అష్రప్..‌ తన వ్యాఖ్యలను సమర్ధిస్తూ బాబర్‌ ఆజం, పీసీబీ సీఓవో మధ్య జరిగిన వాట్సాప్‌ చాట్‌ను చూపించాడు.

చాట్‌లో ఏముందంటే?
ఇదే విషయంపై బాబర్‌ ఆజంతో సల్మాన్‌ నసీర్‌  వాట్సాప్‌లో చాట్‌ చేశాడు.  ‘బాబర్.. నువ్వు ఫోన్‌, మెసేజ్‌ చేస్తే   ఛైర్మన్‌  రెస్పాండ్‌ కావడం లేదని టీవీలలో సోషల్‌ మీడియాలో  వార్తలు వస్తున్నాయి. నువ్వేమైనా ఆయనకు ఫోన్‌ చేశావా..?’ అని నసీర్‌  అడిగాడు.  అందుకు బదలుగా బాబర్‌.. ‘సలామ్‌ సల్మాన్‌ భాయ్‌, నేను సార్‌ కు ఫోన్‌ చేయలేదు..’అని  రిప్లై  ఇచ్చినట్లు ఆ చాట్‌లో ఉంది.

కాగా  ఒక చైర్మెన్‌ స్ధాయిలో ఉండి కెప్టెన్‌ ప్రైవేట్‌ చాట్‌ను లీక్‌ చేసిన అష్రప్‌పై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్లు మండి పడుతున్నారు. ఆ జట్టు మాజీ కెప్టెన్‌ వకార్ యూనిస్ స్పందిస్తూ.. . ‘అసలు ఏం చేద్దామని చూస్తున్నారు? ఇది చాలా దారుణం. మీరు ఇప్పుడు చాలా సంతోషంగా ఉండి ఉంటారు. బాబర్ ఆజమ్‌ని వదిలేయండి. అతను పాకిస్తాన్ క్రికెట్‌కి ఓ విలువైన ఆస్తి" అంటూ ట్విట్‌ చేశాడు.
చదవండిCWC 2023: పాకిస్తాన్‌ క్రికెట్‌కు భారీ షాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement