వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీస్ రేసు నుంచి పాకిస్తాన్ నిష్కమ్రిచించడం దాదాపు ఖాయమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడంతో పాక్ సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. న్యూజిలాండ్‌ను అధిగమించి పాక్ సెమీస్‌కు వెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో 287 పరుగులతో గెలవడం లేదంటే.. ఇంగ్లండ్ విధించిన ఎంతటి లక్ష్యాన్నైనా 2.5 ఓవర్లలోపు ఛేదించాలి.
ఒక వేళ పాకిస్తాన్ మొదటి బ్యాటింగ్ చేసి ఉంటే సెమీస్‌కు చేరే చిన్నపాటి ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేయడంతో పాక్ సెమీస్‌కు చేరే దారులు మూసుకుపోయాయి. కాగా ఈ వరల్డ్‌కప్ ముగిసిన పాకిస్తాన్ వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
జియో న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం.. తన స్వదేశానికి వెళ్లాక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్‌తో తన రాజీనామా విషయంపై చర్చించనున్నట్లు సమాచారం. కాగా ఈ టోర్నీలో బాబర్ బ్యాటర్‌గా కాస్త పర్వాలేదనపించినా.. సారధిగా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.
దీంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని సొంత దేశ మాజీ ఆటగాళ్ల నుంచే వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో వరల్డ్‌కప్‌లో దారుణ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకోవాలని బాబర్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: IPL 2024: 'వరల్డ్‌కప్‌లో అదరగొట్టాడు.. కచ్చితంగా ఐపీఎల్‌లో కూడా ఆడుతాడు'
Comments
Please login to add a commentAdd a comment