
వన్డే ప్రపంచకప్-2023లో ఆఫ్గానిస్తాన్ చేతిలో పాకిస్తాన్‌కు ఘోర పరాభావం ఎదురైన సంగతి తెలిసిందే. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో ఆఫ్గాన్ చిత్తు చేసింది. అంతర్జాతీయ వన్డేల్లో ఆఫ్గాన్ చేతిలో పాక్ ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ ఓటమిని పాకిస్తాన్ అభిమానులతో పాటు మాజీలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ జట్టుపై తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది.
అంతకుముందు టీమిండియా చేతిలో కూడా పాక్ జట్టు ఘోర ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు కెప్టెన్ బాబర్ ఆజంపై వేటు వేయాలని పీసీబీ ఆలోచిస్తున్నట్లు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. వరల్డ్‌కప్ తర్వాత తిరిగి స్వదేశానికి వచ్చాక పీసీబీ తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
బాబర్ స్ధానంలో సర్ఫరాజ్ అహ్మద్, ముహమ్మద్ రిజ్వాన్, షాహీన్ షా ఆఫ్రిది పేర్లను పీసీబీ మేనెజ్‌మెంట్ కమిటీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ ముగిసిన వెంటనే పాకిస్తాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌కు ముందే పాకిస్తాన్ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చే ఛాన్స్ ఉంది.
కాగా మెగా టోర్నీలో వ్యక్తిగత ప్రదర్శన పరంగా పర్వాలేదనపిస్తున్న బాబర్.. కెప్టెన్సీ పరంగా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడి వేటు వేయాలని పీసీబీ ఆలోచిస్తోంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.
చదవండి: World Cup 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment