పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా జకా ఆష్రఫ్ నియమితుడయ్యాడు. పది మంది సభ్యులతో కూడిన కమిటీకి అతడు నేతృత్వం వహించనున్నాడు. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం నియామకాలు జరిపినట్లు పీసీబీ గురువారం ప్రకటన విడుదల చేసింది.
కాగా జకా ఆష్రఫ్ సారథ్యంలోని ఈ కమిటీ నాలుగు నెలల పాటు అధికారంలో కొనసాగనుంది. ఇందులో నలుగురు రీజినల్ రిప్రెజెంటేటివ్స్, నలుగురు సర్వీస్ రిప్రెజెంటేటివ్స్, ప్రధాని చేత నామినేట్ చేయబడిన ఇద్దరు సభ్యులకు చోటు ఉంటుంది.
ఈ నేపథ్యంలో జకా ఆష్రఫ్ ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఇప్పుడు అధికారికంగా పీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యాను. రానున్న కాలంలో పీసీబీలో సానుకూల మార్పులు తీసుకురాగలనని ఆ దేవుడి సాక్షిగా చెబుతున్నా’’ అంటూ తన నియామకానికి సంబంధించిన డాక్యుమెంట్ ఫొటోను షేర్ చేశాడు. కాగా ఆసియాకప్, వన్డే వరల్డ్‌కప్ టోర్నీలు సమీపిస్తున్న తరుణంలో కొత్త కమిటీ గురువారమే లాహోర్‌లో సమావేశం కానుంది.
I have Officially Joined PCB as Chairman. Alhamdulillah, You will have Positives Changes in the PCB Upcoming Days In Sha Allah✌️💯. #ZakaAshraf pic.twitter.com/h6rRGkjlKm
— Chaudhry Zaka Ashraf (@IZakaAshraf) July 5, 2023
Comments
Please login to add a commentAdd a comment