Pakistan Cricket Board Announces Schedule For New Zealand Dual Tour Of Pakistan - Sakshi
Sakshi News home page

NZ Vs PAK: పాకిస్తాన్‌ పర్యటనకు రానున్న కివీస్‌.. షెడ్యూల్‌ విడుదల

Published Mon, Oct 10 2022 1:42 PM | Last Updated on Mon, Oct 10 2022 3:58 PM

Pakistan Cricket Board announces schedule for New Zealand tour of Pakistan - Sakshi

ఈ ఏడాది డిసెంబర్‌లో న్యూజిలాండ్‌ జట్టు పాకిస్తాన్‌ పర్యటనకు రానుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడేందుకు కివీస్‌ జట్టు.. రెండు సార్లు పాకిస్తాన్‌కు రానుంది. తొలి దశ పర్యటనలో భాగంగా పాక్‌తో విలియమ్సన్‌ సేన రెండు టెస్టులు, మూడు వన్డేల సిరీస్‌లలో తలపడనుంది.

డిసెంబర్‌ 27న కరాచీ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో న్యూజిలాండ్‌ పర్యటన ప్రారంభం కానుంది. అదే విధంగా వచ్చే ఏడాది జనవరిలో మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది. అనంతరం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మరోసారి కీవిస్‌ జట్టు పాక్‌ టూర్‌కు రానుంది.

రెండో దశ పర్యటనలో భాగంగా ఐదు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌లో పాక్‌తో కివీస్‌ ఆడనుంది. కాగా గతేడాది పాకిస్తాన్‌ పర్యటనకు  వచ్చిన న్యూజిలాండ్‌.. భద్రతా కారణాల దృష్ట్యా అఖరి నిమిషంలో వన్డే సిరీస్‌ను రద్దు చేసుకుంది. కాగా ప్రస్తుతం పాకిస్తాన్‌ జట్టు  న్యూజిలాండ్‌ పర్యటనలో ఉంది. బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ జట్లతో ట్రై సిరీస్‌లో పాకిస్తాన్‌ తలపడుతోంది.
చదవండి: IND vs WA-XI: నిరాశ పరిచిన రోహిత్‌.. మరోసారి చెలరేగిన సూర్య కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement