న్యూజిలాండ్‌కు బిగ్‌ షాకిచ్చిన పాకిస్తాన్‌.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం | Pakistan under-19 team thump New Zealand to top Group D | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌కు బిగ్‌ షాకిచ్చిన పాకిస్తాన్‌.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం

Published Sat, Jan 27 2024 8:29 PM | Last Updated on Sun, Jan 28 2024 8:33 AM

Pakistan under-19 team thump New Zealand to top Group D - Sakshi

అండర్‌-19 వరల్డ్‌‍కప్‌-2024లో పాకిస్తాన్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని పాక్‌ అందుకుంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం ఈస్ట్‌ లండన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ ఘన విజయం సాధించింది. 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 25.2 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా ఛేదించింది.

పాక్‌ ఓపెనర్లు షాజైబ్ ఖాన్(80 నాటౌట్‌), షమీల్ హుస్సేన్(54నాటౌట్‌) మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన కివీస్‌.. పాక్‌ బౌలర్ల దాటికి కేవలం 140 పరుగులకే కుప్పకూలింది. పాక్‌ బౌలర్లలో ఉబైద్‌ షా, ఆరాఫాట్‌ మిన్హాష్‌ తలా 3 వికెట్లు పడగొట్టి బ్లాక్‌ క్యాప్స్‌ పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు నవీద్‌ రెండు,అలీ, జీషన్‌ ఒక్కో వికెట్‌ సాధించారు. ఈ విజయంతో పాకిస్తాన్‌ గ్రూపు-డి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది.
చదవండి: IND vs ENG: సెంచరీతో చెలరేగిన పోప్‌.. రసవత్తరంగా భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement