
క్రైస్ట్‌చర్చ్: అండర్–19 వన్డే వరల్డ్‌కప్‌లో సంచలనం నమోదైంది. అఫ్గానిస్తాన్ అనూహ్య విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 309 పరుగులు చేసింది. రహ్మతుల్లా గర్బాజ్(69), ఇబ్రహీం జాడ్రాన్(68), బాహీర్ షా(67) అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (66) అర్ధసెంచరీలతో రాణించారు. చివర్లో అజ్మతుల్లా చెలరేగి ఆడటంతో అఫ్గాన్ స్కోరు 300 పరుగులు దాటింది. అజ్మతుల్లా 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 66 పరుగులు బాదాడు.
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్.. అఫ్గాన్ స్పిన్నర్ల ధాటికి విలవిల్లాడింది. స్వల్ప స్కోరుకే చాపచుట్టేసింది. న్యూజిలాండ్ 28.1 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడింది. అఫ్గాన్ బౌలర్లలో ఖాయిస్ అహ్మద్, ముజీబ్ నాలుగేసి వికెట్లు నేలకూల్చారు. నవీన్ ఉల్ హక్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో అఫ్గానిస్తాన్ తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment