
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో తొలి సెమీఫైనల్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. దుబాయ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. లీగ్ దశలో ఆజేయంగా నిలిచిన భారత జట్టు.. అదే జోరును సెమీస్ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా ఎలాగైనా భారత్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టాలని పట్టుదలతో ఉంది.
కాగా ఈ మ్యాచ్‌కు సంబంధించిన అఫిషయల్స్ జాబితాను ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఈ సెమీస్ పోరుకు ఆన్ ఫీల్డ్ అంపైర్‌లుగా న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ వ్యవహరించనున్నారు. అదేవిధంగా థర్డ్ అంపైర్‌గా మైకేల్ గాఫ్ .. నాలుగో అంపైర్‌గా అడ్రియన్ హోల్డ్‌స్టాక్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ ఎంపికయ్యాడు.
ఐరెన్ లెగ్ అంపైర్ లేడు?
కాగా ఈ మ్యాచ్ అఫిషయల్స్ జాబితాలో ఐరెన్ లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో లేకపోవడం భారత అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 2014 నుంచి అతడు అంపైర్‌గా ఉన్న ఏ నాకౌట్ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించలేదు. దీంతో ఫ్యాన్స్ రిచర్డ్ కెటిల్‌బరోను ఐరెన్ లెగ్ అంపైర్‌గా పిలుస్తుంటారు. వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్స్‌లో కూడా కెటిల్‌బరో ఫీల్డ్ అంపైర్‌గా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి పాలైంది.
అంతకుముందు 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్, 2019 వన్డే ప్రపంచ కప్ సెమీస్, ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్, 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ భారత్ ఓటమి చవిచూసింది. మరోవైపు న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్‌కు కుమార్ ధర్మసేన, పాల్ రీఫిల్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఉండనున్నారు.
ఆసీస్‌దే పైచేయి..
వన్డే క్రికెట్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా పూర్తి అధిపత్యం చెలాయించింది. ఇప్పటివరకు ఇరు జట్లు 151 వన్డేల్లో తలపడ్డాయి. 57 మ్యాచ్‌ల్లో భారత్... 84 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గెలిచాయి. 10 మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం భారత్‌దే పైచేయిగా ఉంది. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్, ఆ్రస్టేలియా ముఖాముఖిగా నాలుగుసార్లు తలపడ్డాయి. రెండుసార్లు భారత్ (1998లో ఢాకాలో 44 పరుగుల తేడాతో; 2000లో నైరోబిలో 20 పరుగుల తేడాతో) నెగ్గింది.
ఒకసారి ఆ్రస్టేలియా గెలిచింది (2006లో మొహాలిలో 6 వికెట్ల తేడాతో). 2009లో దక్షిణాఫ్రికాలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వన్డే టోర్నమెంట్‌లలో (వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీ) భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరుసార్లు నాకౌట్ దశ మ్యాచ్‌లు జరిగాయి. మూడుసార్లు భారత్ (1998, 2000 చాంపియన్స్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌లో; 2011 వరల్డ్‌కప్ క్వార్టర్ ఫైనల్లో)... మూడుసార్లు ఆ్రస్టేలియా (2003 వరల్డ్‌కప్ ఫైనల్, 2015 వరల్డ్‌కప్ సెమీఫైనల్, 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్) గెలిచి 3–3తో సమంగా ఉన్నాయి.
చదవండి: WPL 2025: మూనీ విధ్వంసం.. యూపీని చిత్తు చేసిన గుజరాత్
Comments
Please login to add a commentAdd a comment