Richard Kettleborough
-
భారత్-దక్షిణాఫ్రికా ఫైనల్.. అంపైర్లు వీరే! ఐరెన్ లెగ్లకు చోటు
టీ20 వరల్డ్‌కప్-2024లో ఫైనల్ పోరుకు సమయం అసన్నమవుతోంది. జూన్ 29(శనివారం) బార్బోడస్ వేదికగా ఫైనల్ మ్యాచ్‌లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అంపైర్ల జాబితాను ప్రకటించింది.ఈ టైటిల్ పోరులో న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గాఫ్నీ, ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నాడు. అదే విధంగా థర్డ్ అంపైర్‌గా రిచర్డ్ కెటిల్‌బరో, ఫోర్త్ అంపైర్‌గా రోడ్ టక్కర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.అయితే ఈ జాబితాలో ఐరెన్ లెగ్ అంపైర్లు రిచర్డ్ కెటిల్‌బరో, ఇల్లింగ్‌వర్త్ ఉండటం భారత ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. గత నాలుగేళ్లలో ఐసీసీ టోర్నీల్లో వీరు అంపైర్లుగా వ్యవహరించిన నాలుగు నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ఓటమి పాలైంది. 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్లో ఇల్లింగ్‌వర్త్, కెటిల్‌బరో ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఉన్నారు. ఆ మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైంది. ఆ తర్వాత 2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో, ఇల్లింగ్‌వర్త్ ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా ఉండగా, కెటిల్ బరో టీవీ అంపైర్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి చవిచూసింది. అనంతరం 2023 డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా ఇదే జరిగింది. ఆసీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఇక చివరగా వన్డే వరల్డ్‌కప్-2023లో కూడా వీరిద్దరూ ఆన్-ఫీల్డ్ అంపైర్లగా వ్యహరించారు. మరి ఈసారి వీరిద్దరూ ఫైనల్ మ్యాచ్ అంపైర్ల జాబితాలో ఉండడంతో ఏమి జరుగుతుందో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. -
భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్.. అంపైర్లు వీరే! ఐరెన్ లెగ్ లేడు
టీ20 వరల్డ్‌కప్-2024లో ఆసాధరణ ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా.. ఇప్పుడు రసవత్తర పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీ సెకెండ్ సెమీఫైనల్లో భాగంగా గురువారం(జూన్ 27) గయనా వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి గత వరల్డ్‌కప్‌లో సెమీస్ ఓటమికి భారత్ బదులు తీర్చుకోనుంది. కాగా ఈ మ్యాచ్ కోసం ఐసీసీ తాజాగా అంపైర్లు జాబితాను ప్రకటించింది. భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్లో ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా క్రిస్ గఫానీ, రాడ్ టక్కర్ వ్యవహరించనున్నారు. అదేవిధంగా థర్డ్ అంపైర్‌గా జోయెల్ విల్సన్, ఫోర్త్ అంపైర్‌గా పాల్ రీఫిల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మ్యాచ్ రిఫరీగా జెఫ్రీ క్రోవ్ వ్యవహరించనున్నాడు. ఈ జాబితాలో ఐరెన్ లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో లేకపోవడం భారత అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 2014 నుంచి అతడు అంపైర్‌గా ఉన్న ఏ నకౌట్ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించలేదు. దీంతో ఫ్యాన్స్ రిచర్డ్ కెటిల్‌బరోను ఐరెన్ లెగ్ అంపైర్‌గా పిలుస్తుంటారు. మరోవైపు అఫ్గానిస్తాన్-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న తొలి సెమీఫైనల్‌కు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, నితిన్ మీనన్‌లు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఉండనున్నారు. అయితే రిచర్డ్ కెటిల్‌బరో మాత్రం తొలి సెమీఫైనల్లో భాగమయ్యాడు. ఈ మ్యాచ్‌కు థర్డ్ అంపైర్‌గా కెటిల్‌బరో పనిచేయనున్నాడు. అహ్సన్ రజా నాల్గవ అంపైర్‌గా వ్యవహరించనున్నాడు. -
టీమిండియా సూపర్-8 మ్యాచ్‌లకు అంపైర్లు వీరే.. విలన్ ఉన్నాడు జాగ్రత్త..!
టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా సూపర్-8కు చేరిన విషయం తెలిసిందే. సూపర్-8లో భారత్.. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలను ఢీకొట్టనుంది. కీలకమైన ఈ మ్యాచ్‌లకు ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించే వారి పేర్లను ఐసీసీ ఇవాళ (జూన్ 19) ప్రకటించింది. జూన్ 20న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు రాడ్నీ టక్కర్, పాల్ రిఫిల్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా.. జూన్ 22న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌కు మైఖేల్ గాప్, ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్.. జూన్ 24న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌కు రిచర్డ్ కెటిల్‌బరో, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు.విలన్ ఉన్నాడు జాగ్రత్త..!సూపర్-8లో టీమిండియా ఆస్ట్రేలియాతో ఆడబోయే కీలకమైన మ్యాచ్‌కు సీనియర్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించనున్నాడు. కెటిల్‌బరో పేరు వింటేనే భారత అభిమానులు ఉలిక్కిపడతారు. ఎందుకంటే అతను అంపైర్‌గా వ్యవహరించిన అన్ని ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో టీమిండియా ఓటమిపాలైంది. ఇప్పుడు అదే కెటిల్‌బరో సూపర్-8లో ఆసీస్‌తో కీలకమైన మ్యాచ్‌కు ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించనుండటంతో భారత క్రికెట్ అభిమానులు కలవపడుతున్నారు. భారత్ మరోసారి ఓడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో ఫ్యాన్స్ టీమిండియాను ముందుగానే హెచ్చరిస్తున్నారు. విలన్ ఉన్నాడు జాగ్రత్త అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. -
దక్షిణాఫ్రికా-భారత్ టెస్టు సిరీస్.. ఐరెన్ లెగ్ అంపైర్ ఔట్
భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమైంది. మంగళవారం(డిసెంబర్ 26)న జరగనున్న ఇరు జట్లు మధ్య జరగనున్న తొలి టెస్టుతో ఈ రెడ్‌బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ నుంచి ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిచర్డ్ కెటిల్‌బరో వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని లాంగ్టన్ రుసెరేను ఐసీసీ భర్తీ చేసింది. కాగా సౌతాఫ్రికా- భారత్ మధ్య టెస్టు సిరీస్‌కు ఐసీసీ తొలుత ప్రకటించిన జాబితాలో అంపైర్లుగా కెటిల్‌బరో, పాల్ రీఫిల్ అహ్సన్ రజాకు చోటు దక్కింది. ఇప్పుడు కెటిల్‌బరో తప్పుకోవడంతో రుసెరేను ఎంపిక చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ సిరీస్ నుంచి కెటిల్‌బరో తప్పకోవడం పట్ల భారత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అతడు అంపైర్‌గా వ్యవహరించిన చాలా మ్యాచ్‌ల్లో టీమిండియా ఓటమి పాలైంది. ముఖ్యంగా ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్స్‌లో భారత జట్టు గెలిచిన సందర్భాలు లేవు. వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్స్‌లో కూడా కెటిల్‌బరో ఫీల్డ్ అంపైర్‌గా ఉన్నాడు. అంతకుముందు 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్, 2019 వన్డే ప్రపంచ కప్ సెమీస్, ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్, 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ భారత్ ఓటమి పాలైంది. చదవండి: IND vs SA 1st Test: ధోనీ అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ -
ఆస్ట్రేలియా-భారత్ ఫైనల్‌కు అంపైర్లు ఖరారు.. లిస్ట్‌లో ఐరన్ లెగ్ అంపైర్
వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ తుది అంకానికి చేరుకుంది. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న తుదిపోరులో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు అంపైర్ల జాబితాను ఐసీసీ ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్‌కు సీనియర్ అంపైర్లు రిచర్డ్ కెటిల్‌బరో, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. ఇక థర్డ్ అంపైర్ జోయెల్ విల్సన్, ఫోర్త్ అంపైర్‌గా క్రిస్ గఫానీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జాబితాలో ఐరన్ లెగ్ అంపైర్ అయితే ఈ లిస్ట్‌లో ఐరన్ లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో ఉండడం భారత అభిమానులను ఆందోళన కలిగిస్తోంది. 2014 టీ20 ప్రపంచకప్ నుంచి 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ వరకు రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేసిన మ్యాచుల్లో టీమిండియా గెలవలేదు. ముఖ్యంగా అతడు అంపైరింగ్ చేసిన నాకౌట్, ఫైనల్ మ్యాచ్‌ల్లో గత 9 ఏళ్ల నుంచి భారత్ ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేదు. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేయగా.. ఈ మ్యాచ్‌లో ధోనీ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంక చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత 2015 వన్డే ప్రపంచ కప్‌లోనూ భారత్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 95 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి ఇంటి దారిపట్టింది. అదే విధంగా 2016 టీ20 వరల్డ్‌కప్‌లో జట్టును దురదృష్టం వెంటాడింది. స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత్.. సెమీస్‌లో వెస్టిండీస్ చేతిలో అనుహ్యంగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌కూ కెటిల్ బరోనే అంపైర్‌గా ఉన్నాడు. ఆ తర్వాత అతడు అంపైర్‌గా వ్యవహరించిన ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్లోనూ పాక్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది. ఆ తర్వాత అతడు అంపైరింగ్ చేసిన 2019 వన్డే ప్రపంచ కప్ సెమీస్‌లోనూ భారత్.. న్యూజిలాండ్ చేతిలో ఓడింది. అంతేకాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్-2021, 2023 ఫైనల్స్‌లోనూ భారత్ ఓటమి పాలైంది. ఈ రెండు ఫైనల్స్‌కు అతడు థర్డ్ అంపైర్‌గా వ్యవహరించాడు. అయితే ఈ సారి కూడా ఫైనల్‌కే ఈ ఐరెన్ లెగ్ అంపైర్ రావడంతో అభిమానులలో ఆందోళన నెలకొంది. చదవండి: World cup 2023: ఆస్ట్రేలియాతో ఫైనల్.. వక్ర బుద్ధి చూపించిన పాక్ క్రికెటర్ -
ప్రపంచ క్రికెట్‌కు చీకటి రోజు.. అది బంగ్లాదేశ్ కాబట్టే అలా జరిగింది..!
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కంటే నిమిషం ఆలస్యంగా బ్యాటింగ్ చేసేందుకు వచ్చి టైమ్ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో బంగ్లా కెప్టెన్ షకీబ్ క్రీడాస్పూర్తి విరుద్దంగా వ్యవహరించి అందరి చీత్కారాలకు గురవుతున్నాడు. Even Aasif Sheikh from Nepal has a 1000 time better Sportsmanship then Shakib Al Hasan. Today, Cricket 🏏 has seen a Dark Day that too in a World Cup Match😞 Follow 🙏#BANvsSL #AngeloMatthews #ShakibAlHasan #CWC23 #AngeloMathews #ThugLife #timedout pic.twitter.com/EHL9X3lsW6 — Richard Kettleborough (@RichKettle07) November 6, 2023 మాథ్యూస్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయనప్పటికీ షకీబ్ కనీస క్రీడా ధర్మాన్ని మరిచి ప్రవర్తించడం క్రికెట్ అభిమానులను విస్మయానికి గురి చేస్తుంది. నెటిజన్లు సోషల్మీడియామ వేదికగా షకీబ్‌ను ఏకి పారేస్తున్నారు. Angelo Mathews speaks in Press conference and is whole fired up 🤣🔥#SLvBAN pic.twitter.com/GKXg8kf8UH— Div🦁 (@div_yumm) November 6, 2023 మ్యాచ్ అనంతరం ఈ విషయంపై మాథ్యూస్ స్వయంగా స్పందించాడు. షకీబ్ ప్రవర్తించిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ కాబట్టి అలా జరిగింది, మరే ఇతర జట్టు ఇలా స్పందిస్తుందని అనుకోను అంటూ కామెంట్స్ చేశాడు. మాథ్యూస్‌ను టైమ్ ఔట్‌గా ప్రకటించడంపై ప్రముఖ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బొరో కూడా స్పందించాడు. Angelo Mathews said, "it was Bangladesh that's why it happened, I don't think any other team would've done it". pic.twitter.com/cTzI9UM9SL — Mufaddal Vohra (@mufaddal_vohra) November 6, 2023 ప్రపంచ క్రికెట్‌కు ఇది చీకటి రోజు. ఇలాంటి ఘటన ప్రపంచకప్‌లో జరగడం విచారకరం అంటూ ట్వీట్ చేశాడు. ఇందుకు ఓ వీడియోను జోడిస్తూ.. క్రీడాస్పూర్తిని చాటుకోవడంలో నేపాల్‌కు చెందిన ఆసిఫ్ షేక్ షకీబ్ కంటే వెయ్యి రెట్లు నయమని కామెంట్ జోడించాడు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: బంగ్లాదేశ్ అప్పీలు.. మాథ్యూస్ అవుట్! అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! -
కోహ్లి సెంచరీకి సాయపడ్డ అంపైర్.. క్లియర్ వైడ్‌బాల్ ఇవ్వకుండా..!
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నిర్ధేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లి చేసిన సెంచరీ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. కోహ్లి సెంచరీకి అంపైర్ రిచర్డ్ కెటిల్‌బొరో సాయపడ్డాడని కోహ్లి వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కోహ్లి 97 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉండగా బంగ్లా బౌలర్ నసుమ్ అహ్మద్ లైగ్ సైడ్ దిశగా వైడ్‌బాల్ వేశాడు. ఏ తరహా క్రికెట్లో అయినా దీన్ని వైడ్‌బాల్ కాదనే వారు ఉండరు. Umpire doesn't give wide to virat Best moment of match. 🤣🔥🔥#INDvsBAN #ViratKohli pic.twitter.com/L621N4ciur — Saurabh Raj (@sraj57454) October 19, 2023 అయితే, కెటిల్‌బొరో ఈ బంతిని వైడ్‌బాల్‌గా ప్రకటించకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. బంతి లెగ్ సైడ్ దిశగా వెళ్లగానే కోహ్లి అంపైర్ వైపు దీనంగా చూశాడు. దీనికి అంపైర్ చలించిపోయాడో ఏమో కాని, మొత్తానికి వైడ్ ఇవ్వకుండా కోహ్లి సెంచరీకి పరోక్షంగా తోడ్పడ్డాడు. అనంతరం ఓ బంతిని వృధా చేసిన కోహ్లి, 42వ ఓవర్ మూడో బంతికి సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేశాడు. కోహ్లి సెంచరీ మాట అటుంచితే, అతను సెంచరీ మార్కును చేరుకున్న వైనాన్ని జనాలు తప్పుపడుతున్నారు. అంతకుముందు ఓవర్లో కూడా కోహ్లి 92 పరుగుల వద్ద ఉన్నప్పుడు రాహుల్ సింగిల్‌కు పిలుపునివ్వగా నిరాకరించి వ్యతిరేకులకు టార్గెట్‌గా మారాడు. వ్యక్తిగత మైలురాళ్లకు కోహ్లి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ఈ ఒక్క ఇన్నింగ్స్ చూస్తే అర్ధమవుతుందని కోహ్లి వ్యతిరేకులు సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌కు దిగారు. -
ఆ అంపైర్ లేడు.. టీమిండియా సెమీస్ గండం దాటినట్టే..!
టీ20 వరల్డ్‌కప్-2022 సెమీఫైనల్ మ్యాచ్‌లకు సంబంధించిన మ్యాచ్ అఫీషియల్స్ (అంపైర్లు, రిఫరి) జాబితాను ఐసీసీ ఇవాళ (నవంబర్ 7) విడుదల చేసింది. సిడ్నీ వేదికగా న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య నవంబర్ 9న జరిగే తొలి సెమీఫైనల్‌కు ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా మరయిస్ ఎరాస్మస్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ వ్యవహరించనుండగా.. రిచర్డ్ కెటిల్‌బొరో, మైఖేల్ గాఫ్‌లు థర్డ్, ఫోర్త్ అంపైర్లుగా ప్రకటించబడ్డారు. ఈ మ్యాచ్‌కు రిఫరీగా క్రిస్ బ్రాడ్ వ్యవహరించనున్నాడు. ఇక, నవంబర్ 10న అడిలైడ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే.. కుమార ధర్మసేన, పాల్ రిఫిల్ ఫీల్డ్ అంపైర్లుగా.. క్రిస్ గఫానీ, రాడ్ టక్కర్ థర్డ్, ఫోర్త్ అంపైర్లుగా, డేవిడ్ బూన్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు. We are saved 🙏 pic.twitter.com/pi4LewhFiv — Dere (@Der1x_) November 7, 2022 ఇదిలా ఉంటే, ఐసీసీ టోర్నీల్లో టీమిండియాకు అచ్చిరాని అంపైర్‌గా ముద్రపడ్డ రిచర్డ్ కెటిల్‌బొరో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ఐసీసీ ప్రకటించిన అఫీషియల్స్ జాబితాలో లేకపోవడంతో భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బ్రతికిపోయాం రా బాబు.. ఇక, టీమిండియా ఫైనల్‌కు చేరడం ఖాయమంటూ సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కెటిల్‌బొరో అంపైర్‌గా లేడు కాబట్టి.. టీమిండియా సెమీస్ గండం దాటినట్టే, ఇంగ్లండ్‌పై గెలుపు మనదే, ఫైనల్‌కు ఎవరు వచ్చినా టీమిండియా విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 9 ఏళ్లుగా టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవకపోవడానికి పరోక్ష కారణమైన కెటిల్‌బొరో లేడు కాబట్టి రోహిత్ సేన విజయం లాంఛనమేనని కామెంట్ చేస్తున్నారు. కాగా, 2013 నుంచి ఐసీసీ టోర్నీల్లో రిచర్డ్ కెటిల్‌బొరో అంపైర్‌గా వ్యవహరించిన (భారత్ ఆడిన మ్యాచ్‌లు) ప్రతి నాకౌట్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. కెటిల్‌బొరో ఫీల్డ్ అంపైర్‌గా లేదా థర్డ్ అంపైర్‌గా వ్యవహరించిన.. 2014 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్, 2015 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్, 2016 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌ల్లో టీమిండియా దారుణ పరాజయాలను మూటగట్టుకుంది. దీంతో కెటిల్బొరోపై భారతీయుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.