బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25కు సర్వం సిద్దమైంది. మరి కొన్ని గంటల్లో ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు తెర లేవనుంది. ఈ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
అందుకు తగ్గట్టే ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాయి. ఇక పెర్త్ వేదికగా జరిగే ఈ తొలి టెస్టుకు అంపైర్‌లను ఐసీసీ ప్రకటించింది. రిచర్డ్ కెటిల్‌బరో, క్రిస్ గాఫ్నీలు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. అదేవిధంగా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ థర్డ్ అంపైర్‌గా, సామ్ నోగాజ్‌స్కీ నాలుగో అంపైర్‌గా, రంజన్ మదుగల్లె మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
అయితే ఈ జాబితాలో రిచర్డ్ కెటిల్‌బరో ఉండడంతో భారత అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. గతంలో భారత్ ఓడిపోయిన ప్రతీ కీలక మ్యాచ్‌లోనూ రిచర్డ్ కెటిల్‌బరోనే అంపైర్ కావడం గమనార్హం. ముఖ్యంగా అతడు అంపైర్‌గా ఉన్న ఒక్క ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించలేదు. దీంతో ఫ్యాన్స్ అతడిని ఐరెన్ లెగ్ అంపైర్‌గా పిలుస్తుంటారు. ఈసారి మరి ఫలితం ఏవిధంగా ఉంటుందో ఎదురు చూడాలి.
చదవండి: ఇదంతా విరాట్ భాయ్ వల్లే.. అతడే నాకు ఆదర్శం: యశస్వీ జైశ్వాల్
Comments
Please login to add a commentAdd a comment