umpire
-
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..! 'ఐరెన్ లెగ్' అంపైర్ వచ్చేశాడు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25కు సర్వం సిద్దమైంది. మరి కొన్ని గంటల్లో ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు తెర లేవనుంది. ఈ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.అందుకు తగ్గట్టే ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాయి. ఇక పెర్త్ వేదికగా జరిగే ఈ తొలి టెస్టుకు అంపైర్లను ఐసీసీ ప్రకటించింది. రిచర్డ్ కెటిల్‌బరో, క్రిస్ గాఫ్నీలు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. అదేవిధంగా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ థర్డ్ అంపైర్‌గా, సామ్ నోగాజ్స్కీ నాలుగో అంపైర్‌గా, రంజన్ మదుగల్లె మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.అయితే ఈ జాబితాలో రిచర్డ్ కెటిల్‌బరో ఉండడంతో భారత అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. గతంలో భారత్ ఓడిపోయిన ప్రతీ కీలక మ్యాచ్‌లోనూ రిచర్డ్ కెటిల్‌బరోనే అంపైర్ కావడం గమనార్హం. ముఖ్యంగా అతడు అంపైర్‌గా ఉన్న ఒక్క ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించలేదు. దీంతో ఫ్యాన్స్ అతడిని ఐరెన్ లెగ్ అంపైర్‌గా పిలుస్తుంటారు. ఈసారి మరి ఫలితం ఏవిధంగా ఉంటుందో ఎదురు చూడాలి.చదవండి: ఇదంతా విరాట్ భాయ్ వల్లే.. అతడే నాకు ఆదర్శం: యశస్వీ జైశ్వాల్ -
బంతి తగిలి అంపైర్ ముఖంపై తీవ్ర గాయాలు..!
క్రికెట్ మైదానంలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. బంతి తగిలి ఫీల్డ్ అంపైర్ ముఖం వాచిపోయింది. ఆస్ట్రేలియాలోని ఛార్లెస్ వెర్యార్డ్ రిజర్వ్ క్రికెట్ మైదనంలో ఇది జరిగింది. ఓ స్థానిక మ్యాచ్ సందర్భంగా టోనీ డినోబ్రెగా అనే వ్యక్తి వికెట్ల వద్ద అంపైరింగ్ చేస్తున్నాడు. బ్యాటర్ కొట్టిన బంతి (స్ట్రయిట్ డ్రైవ్) నేరుగా డినోబ్రెగా ముఖంపై తాకింది. బంతి బలంగా తాకడంతో డినోబ్రెగా ముఖం గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. కుడి కన్ను, కుడి వైపు ముఖం అంతా కమిలిపోయి, వాచిపోయింది.అదృష్టవశాత్తు డినోబ్రెగా ముఖంపై ఎలాంటి ఫ్రాక్చర్స్ లేవు. ప్రస్తుతం అతను అసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డినోబ్రెగా త్వరగా కోలుకోవాలని స్థానిక అంపైర్ల సంఘం ఆకాంక్షించింది. గాయపడక ముందు డినోబ్రెగా ముఖం.. గాయపడిన తర్వాత డినోబ్రెగా ముఖాన్ని అంపైర్ల సంఘం సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. క్రికెట్ మైదానంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారి కాదు. ఇటీవలికాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. అందుకే అంపైర్లు కూడా హెల్మెట్లు ధరించి బరిలోకి దిగుతున్నారు. గతంలో ఆస్ట్రేలియాలోనే ఓ ఫీల్డ్ అంపైర్ ఇలానే బంతి ముఖంపై తాకడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. 2014లో ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్ హ్యూస్ బంతి తలకు తాకడంతో తొలుత కోమాలోని వెళ్లి, ఆతర్వాత ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. -
ఓర్నీ.. ఇదేమి సెలబ్రేషన్స్ రా బాబు! అంపైర్‌ను భయపెట్టాడు(వీడియో)
జింబాబ్వే దేశీవాళీ క్రికెట్ టోర్నీ నేషనల్ వన్డే కప్-2024లో విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. ఓ జింబాబ్వే క్రికెటర్ విన్నింగ్ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. సదరు బ్యాటర్ ఓవరాక్షన్ కారణంగా ఆన్ ఫీల్డ్ అంపైర్ కాలికి గాయమైంది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే.అసలేం జరిగిందంటే?ఈ టోర్నీలో భాగంగా బుధవారం ఓగో రేంజర్స్, రెయిన్ బో 1 క్రికెట్ క్లబ్ జట్లు తలపడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఓగో రేంజర్స్ నిర్ణీత 45 ఓవర్లలో 229 పరుగులు చేసింది. అనంతరం 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రెయిన్బో 1 క్రికెట్ క్లబ్ సరిగ్గా 44.5 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. దీంతో రెయిన్ బో జట్టు విజయానికి ఆఖరి బంతికి 4 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఓగో రేంజర్స్ స్పిన్నర్ ర్యాన్ బర్ల్ వేసిన బంతిని ఫ్రాన్సిస్ సాండే అద్భుతమైన సిక్స్ కొట్టి రెయిన్బో క్రికెట్ క్లబ్‌కు విజయాన్ని అందించాడు. ఇక్కడ వరకు అంత బాగానే ఉన్న మ్యాచ్‌ను గెలిపించిన సాండే అతి చేశాడు. సిక్స్ కొట్టిన వెంటనే తన బ్యాట్‌ను బలంగా నాన్‌స్ట్రైక్ వైపు విసిరాడు. దీంతో ఆ బ్యాట్ కాస్త అంపైర్ కాలికి తాకింది. అంపైర్ నొప్పితో కాసేపు విల్లవిల్లాడు. కానీ ఫ్రాన్సిస్ సాండే మాత్రం అంపైర్‌కు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అతడు కావాలనే తన బ్యాట్‌ను అంపైర్ విసిరాడని కామెంట్లు చేస్తున్నారు. The 𝐍𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐏𝐫𝐞𝐦𝐢𝐞𝐫 𝐋𝐞𝐚𝐠𝐮𝐞 dishes out sissling hot action! 🙌🏻Rainbow wanted 4 runs off the last ball against SOGO Rangers 🎥#NPL2024 pic.twitter.com/oj0bwT1X4Q— Zimbabwe Cricket Domestic (@zcdomestic) July 31, 2024 -
దూబే చీటింగ్ చేశాడా..? జేబులు చెక్ చేసిన అంపైర్! ఫోటోలు వైరల్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మూడో ఓటమి చవిచూసింది. ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. చెన్నై బ్యాటింగ్‌లో పర్వాలేదన్పించనప్పటికి.. బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. 177 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే బౌలర్లు కాపాడుకోలేకపోయారు. 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సీఎస్కే బ్యాటింగ్ సందర్భంగా ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శివమ్ దూబే జేబులను ఆన్ ఫీల్డ్ అంపైర్ చెక్ చేశాడు. దూబే క్రీజులోకి వచ్చిన తర్వాత ఇన్నింగ్స్ మధ్యలో అంపైర్ అనిల్ చౌదరీ.. అతడి దగ్గరకు వెళ్లి అనుమానాస్పదంగా జేబులను తనిఖీ చేశాడు. ఇందుకు సంబంధిచిన ఫోటోలు సోషల్ మీడియా కాగా అంపైర్లు ఇలా ఆటగాళ్ల జేబులను చెక్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే అంపైర్ దూబే పాకెట్స్‌ను చెక్ చేయడానికి గల కారణమైతే ఇప్పటివరకు తెలియలేదు. కానీ అంపైర్లు అప్పుడప్పుడు ఆటగాళ్లు తమతో పాటు బంతి స్ధితిని మార్చే వస్తువులు ఏమైనా తీసుకు వచ్చారేమోనని అనుమానంతో తనిఖీ చేస్తూ ఉంటారు. అదే విధంగా ఆటగాళ్లు అంపైర్లు అనుమతి లేకుండా ఎటువంటి క్రీమ్స్ గానీ అయింట్మెంట్లు గాని వాడకూడదు. కాగా ఈ మ్యాచ్‌లో దూబే కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. What Umpire is checking on the Shivam Dube's Pocket? pic.twitter.com/xi4ipbWyNR — Jay Cricket. (@Jay_Cricket18) April 19, 2024 What’s happening here between the umpire and #ShivamDube?#IPL2024 #CSKvsLSG #MSDhoni #Thala #Mahi #Yellove #WhistlePodu pic.twitter.com/Q5AZ5z1Rn1 — Run Chase HQ (@runchaseHQ) April 19, 2024 -
ఇదేమి అంపైరింగ్‌రా బాబు.. కళ్లు కన్పించడం లేదా? వీడియో వైరల్
దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్- శ్రీలంక మధ్య మూడో టీ20 అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో శ్రీలంకపై 3 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో లంక విజయానికి 19 పరుగుల అవసరమ్వగా.. 16 పరుగుల మాత్రమే చేసి ఓటమి పాలైంది. 210 పరుగుల భారీ లక్ష్యంతో దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. లంక బ్యాటర్ కమిందు మెండిస్(65 నాటౌట్) అద్భుతమైన పోరాటం కనబరిచినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. చెత్త అంపైరింగ్.. అయితే ఈ మ్యాచ్‌లో అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. శ్రీలంక ఇన్నింగ్స్ కీలకమైన ఆఖరి ఓవర్లో అఫ్గాన్ పేసర్ వఫాదర్ మొమాండ్.. మెండిస్‌కు ఫుల్ టాస్‌గా సంధించాడు. అయితే ఆ బంతి మెండిస్ నడుముపై నుంచి వెళ్లింది. దీంతో హైట్ నో బాల్ కోసం మెండిస్ అప్పీల్ చేశాడు. కానీ స్క్వేర్ లెగ్ అంపైర్ హన్నిబాల్ మాత్రం అది ఫెయిర్ డెలివరీ అంటూ చెప్పుకొచ్చాడు. కనీసం థర్డ్ అంపైర్ కైనా రిఫర్ చేయక పోవడం గమనార్హం. ఈ క్రమంలో మెండిస్ డీఆర్ఎస్ కావాలని పట్టుబట్టాడు. అయితే రూల్స్ ప్రకారం నో బాల్ విషయంలో డీఆర్ఎస్ను పరిగణలోకి తీసుకోరు. అనంతరం రిప్లేలో క్లియర్‌గా అది హైట్ నోబాల్‌గా తేలింది. ఈ క్రమంలో అంపైర్‌పై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చెత్త అంపైరింగ్.. కళ్లు కన్పించడం లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అది నోబాల్‌గా ఇచ్చి వుంటే కచ్చితంగా శ్రీలంక గెలిచి ఉండేదని మరి కొంత మంది అభిప్రాయపడుతున్నారు. చదవండి: పాక్ బ్యాటర్ విధ్వంసం.. కేవలం 11 బంతుల్లోనే? వీడియో వైరల్ No-ball or legal delivery? #SLvAFG pic.twitter.com/P5iPSfiEjx — Estelle Vasudevan (@Estelle_Vasude1) February 21, 2024 -
వరల్డ్‌కప్‌కు అంపైర్లు వీరే.. భారత్ నుంచి ఒకే ఒక్కడు
వన్డే ప్రపంచకప్-2023 భారత్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు పుష్కరకాలం తర్వాత ఈ మెగా టోర్నీకి భారత్ అతిథ్యం ఇస్తోంది. ఆక్టోబర్ 5న చెన్నై వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈ మెగా టోర్నీకోసం 16 మందితో కూడిన అంపైర్స్ జాబితాను ఐసీసీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఐసీసీ ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్లో సభ్యత్వం పొందిన అంపైర్లు 12 మంది, ఎమర్జింగ్ ప్యానెల్‌లోని నలుగురు అంపైర్లు ఉన్నారు. ఈ లిస్టులో భారత్ నుంచి నితిన్ మీనన్‌కు ఒక్కడికే చోటు దక్కింది. అదే విధంగా 2019 వరల్డ్‌కప్ ఫైనల్లో అంపైర్లుగా వ్యవహరించిన కుమార్ ధర్మసేన, మరైస్ ఎరాస్మస్, రాడ్ టక్కర్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. అదే విధంగా ఈ ప్రధాన టోర్నీ కోసం మ్యాచ్ రిఫరీల జాబితాను కూడా ఐసీసీ ప్రకటించింది. జెఫ్ క్రోవ్, ఆండీ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్, జవగల్ శ్రీనాథ్‌లను మ్యాచ్ రిఫరీలగా ఐసీసీ నియమించింది. ఇక ఆక్టోబర్ 8 న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌తో భారత్ తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. వరల్డ్‌కప్‌కు అంపైర్లు వీరే.. క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, మరైస్ ఎరాస్మస్, క్రిస్ గఫానీ, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, నితిన్ మీనన్, అహ్సన్ రజా, పాల్ రీఫిల్, షర్ఫుద్దౌలా ఇబ్నే షైద్, రాడ్ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్, పాల్ విల్సన్ చదవండి: ASIA CUP 2023: పాకిస్తాన్‌తో మ్యాచ్.. కేఎల్ రాహుల్ వచ్చేశాడు! శ్రేయస్ అయ్యర్‌పై వేటు -
ఒకే బంతికి రెండు రివ్యూలు ధోనిని మించిపోయిన అశ్విన్..!
-
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఐపీఎల్ అంపైర్లు.. ఎవరంటే?
ఇంగ్లండ్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా- ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. జూన్ 7న లండన్‌లోని ఓవల్ స్టేడియంలో ఈ ప్రతిష్టాత్మక టెస్టు మ్యాచ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సంబంధించిన మ్యాచ్ అఫీషియల్స్ (అంపైర్లు, రిఫరి) జాబితాను ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఆన్-ఫీల్డ్ అంపైర్లతో సహా ఐదుగురు మ్యాచ్ అఫీషియల్స్ పేర్లను ఐసీసీ వెల్లడించింది. న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, ఇంగ్లండ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఎంపికయ్యారు. అదేవిధంగా థర్డ్ అంపైర్‌గా ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బరో వ్యవహరించనున్నాడు. ఇక ఫోర్త్ అంపైర్‌గా శ్రీలంకకు చెందిన సీనియర్ అంపైర్ కుమార్ ధర్మసేన బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అదే విధంగా మ్యాచ్ రిఫరీగా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం రిచీ రిచర్డ్సన్ వ్యవహరించునున్నాడు. కాగా క్రిస్ గఫానీ, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లు ఐపీఎల్-2023లో ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పడు ఇదే అంపైర్లు డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా ఫీల్డ్అంపైర్లగా ఎంపిక కావడం గమానార్హం. ఇక ఇప్పటికే లండన్‌కు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతోంది. కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్‌కు పయనం కానున్నారు. ఈ జాబితాలో షమీ, జడేజా, గిల్ వంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. చదవండి: IPL 2023: ధోని అంటే ఇంత అభిమానమా? రాత్రంతా రోడ్లపై పడుకుని! వీడియో వైరల్ -
మ్యాచ్ పట్టించుకోకుండా పక్షులు, ఆకాశంకేసి చూస్తున్నారా!?
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకంది. చైర్ అంపైర్ చేసిన చిన్న తప్పిదం కారణంగా తాను మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చిందంటూ ఫ్రెంచ్ టెన్నిస్ స్టార్ జెరెమీ కార్డీ ఆరోపణలు చేయడం సంచలనం కలిగించింది. విషయంలోకి వెళితే.. పురుషుల సింగిల్స్‌లో గురువారం బ్రిటన్‌కు చెందిన డాన్ ఎవన్స్(27వ ర్యాంక్), జెరెమీ కార్డీ మధ్య రెండో రౌండ్ మ్యాచ్ జరిగింది. తొలి సెట్లో ఇరువురు 3-3తో సమానంగా ఉన్నారు. కీలకమైన టైబ్రేక్ పాయింట్ సమయం కావడంతో ఇద్దరు సీరియస్‌గా ఆడుతున్నారు. ఎవన్స్ బంతిని సర్వీస్ చేయగా.. జెరెమీ షాట్ ఆడాడు. ఆ తర్వాతి టర్న్‌లో జెరెమీ ఫోర్‌హ్యాండ్ షాట్ ఆడే సమయంలో అతని జేబు నుంచి బంతి కిందపడింది. ఇది గమనించిన జెరెమీ చైర్ అంపైర్‌కు సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఆమె పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎవన్స్ కూడా గమనించకుండా షాట్ కొట్టడం.. జెరెమీ షాట్ మిస్ కావడంతో బంతి నెట్‌కు తగిలింది. దీంతో ఎవన్స్‌కు పాయింట్ లభించినట్లయింది. అయితే దీనిపై జెరెమీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. చైర్ అంపైర్ మాత్రం పోనీలే అన్న తరహాలో ఎక్స్ప్రెషన్ ఇవ్వడంతో జెరెమీకి చిర్రెత్తుకొచ్చింది. ఎవన్స్ ఈ విషయంలో తాను దూరలేనని పక్కకి వెళ్లి కూర్చొన్నాడు. చైర్ అంపైర్‌తో జెరెమీ చాలా సేపు వాదించాడు. బంతి జేబులో నుంచి పడిందని సిగ్నల్ ఇచ్చినా పట్టించుకోలేదన్నాడు. మ్యాచ్‌ను చూడకుండా పైనున్న ఆకాశం, పక్షులను చూస్తూ కూర్చొన్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కెరీర్లో మీ అంత బ్యాడ్ అంపైర్‌ను ఎప్పుడు చూడలేదన్నాడు. ఆ తర్వాత టోర్నీ నిర్వాహకులు వచ్చి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో జెరెమీ కార్డీ ఓటమి పాలయ్యాడు. డాన్ ఎవన్స్ చేతిలో జెరెమీ కార్డీ 6-4, 6-4, 6-1తో వరుస సెట్లలో ఖంగుతిన్నాడు. చైర్ అంపైర్‌తో వివాదం తనను విజయానికి దూరం చేసిందని జెరెమీ కార్డీ మ్యాచ్ ముగిసిన అనంతరం పేర్కొనడం ఆసక్తి కలిగించింది. Chardy and Evans lock horns over unclear tennis rule. 🤬 Which side are you on? 🤔 🖥 #AusOpen LIVE | https://t.co/80XjQpwKWh#9WWOS #Tennis pic.twitter.com/zY6EVp90Oq — Wide World of Sports (@wwos) January 19, 2023 -
క్రికెట్లో విషాదం.. దిగ్గజ అంపైర్ దుర్మరణం
క్రికెట్లో పెను విషాదం చోటుచేసుకుంది. సౌతాఫ్రికాకు చెందిన మాజీ అంపైర్ రూడి కోర్ట్జెన్(73) కన్నుమూశాడు. మంగళవారం మధ్యాహ్నం సౌతాఫ్రికాలోని రివర్‌డేల్‌లో ఉన్న గోల్ఫ్ కోర్స్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఆయన కారు యాక్సిడెంట్‌కు గురయ్యింది. ఈ ప్రమాదంలో కోర్ట్జెన్‌తో పాటు మరో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. కాగా 1981లో కోర్ట్జెన్ తన కెరీర్‌ను ప్రారంభించారు. 1992లో ఐసీసీ కోర్ట్జెన్ను ఫుల్‌టైం అంపైర్‌గా నియమించింది. 1992లో సౌతాఫ్రికా- భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌కు తొలిసారి అంపైరింగ్ అవకాశం వచ్చింది. అంతేకాదు కోర్ట్జెన్ చేసిన మెయిడెన్ అంపైరింగ్ మ్యాచ్‌లో బ్యాటర్ రనౌట్‌కు సంబంధించిన తొలిసారి టెలివిజన్ రీప్లే ప్రవేశపెట్టారు. ఇక 43 ఏళ్ల వయసులో పోర్ట్ ఎలిజిబెత్ వేదికగా జరిగిన టెస్టులో తొలిసారి ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించారు. అక్కడి నుంచి కోర్ట్జేన్ మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. దాదాపు 100 టెస్టులు, 200 వన్డేలకు కోర్ట్జెన్ అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. 2003, 2007 వరల్డ్‌కప్స్‌లో కోర్ట్జెన్ థర్డ్ అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు. ఇక రూడీ కోర్ట్జెన్ 2010లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్‌కు చివరిసారి అంపైరింగ్ చేశాడు. పాకిస్తాన్ అంపైర్ అలీమ్ దార్, స్టీవ్ బక్నర్ తర్వాత అత్యధిక టెస్టులకు అంపైర్ గా చేసిన ఘనత సాధించాడు.బ్యాటర్ క్యాచ్ ఔట్, స్టంప్, ఎల్బీడబ్ల్యూ, రనౌట్ అయినప్పుడు ఎల్బీడబ్ల్యూ ఔట్ ఇచ్చే విధానం కూడా హైలైట్ గా ఉండేది. మెల్లిగా చేతిని పైకెత్తుతూ ఆయన ఔట్ ఇచ్చే విధానానికి కల్ట్ ఫ్యాన్స్ ఉండడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్ లో దీనిని ‘ది స్లో ఫింగర్ ఆఫ్ డెత్’గా అభివర్ణించేవారు. రూడి కోర్ట్జెన్ కుమారుడు జూనియర్ కోర్ట్జెన్ మాట్లాడుతూ.. ''ప్రతీ వారాంతంలో గోల్ఫ్ ఆడిన తర్వాత కేప్ టౌన్ నుండి నెల్సన్ మండేలా బేలోని డెస్పాచ్ వద్ద వెళ్లడం నాన్నకు అలవాటు. వాస్తవానికి సోమవారమే ఆయన ఇంటికి రావాలి. కానీ గోల్ఫ్‌లో మరొక రౌండ్ ఆడాలన్న ఉద్దేశంతో అక్కడే ఉండిపోయారు. ఇంటికి తిరిగి వస్తారని సంతోషంలో ఉన్న మాకు ఆయన మరణవార్త కలచివేసింది అంటూ ఎమోషనల్ అయ్యాడు. రూడీ కోర్ట్జెన్ మృతి పట్ల ఐసీసీ సహా పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు నివాళి ప్రకటించారు. కాగా రూడీ కోర్ట్జెన్ మరణవార్త తెలుసుకున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సౌతాఫ్రికా జట్టు మంగళవారం ఇంగ్లండ్ లయన్స్‌తో జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్‌కు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగనుంది. Former South African umpire Rudi Koertzen has died in a car accident at the age of 73 Our thoughts go out to his family and friends pic.twitter.com/R0bhtNZu13 — ESPNcricinfo (@ESPNcricinfo) August 9, 2022 చదవండి: Hundred 2022: ఆరు సెకన్ల పాటు గాల్లోనే.. సెకన్ల వ్యవధిలో రెండు అద్భుతాలు -
'తెలుసుకొని మాట్లాడితే మంచిది'.. రిఫరీతో దురుసు ప్రవర్తన
ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్‌కు కోపం ఎక్కువ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ టెన్నిస్ స్టార్ కోర్టులో సీరియస్‌గా మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఎవరైనా గెలికారో ఇక అంతే సంగతులు. తాజాగా నిక్ కిర్గియోస్ తన కోపాన్ని మరోసారి చూపించాడు. ఏటీపీ 500 హాలే ఓపెన్‌లో బుధవారం రాత్రి నిక్ కిర్గియోస్, సిట్సిపాస్ మధ్య నాలుగో రౌండ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కిర్గియోస్ 5-7, 6-2, 6-4తో సిట్సిపాస్‌పై సంచలన విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరాడు. అయితే మ్యాచ్‌లో రెండో రౌండ్ సందర్భంగా సిట్సిపాస్ 2-0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో కిర్గియోస్ సర్వీస్ చేయడంలో సమయం ఎక్కువ తీసుకున్నాడు. తనకు సర్వీస్ వచ్చిన ప్రతీసారి అదే చేయడంతో లైన్ అంపైర్(రిఫరీ)..''తొందరగా సర్వీస్ చెయ్.. నీ వల్ల సమయం వృథా అవుతుంది.. ప్రత్యర్థి ఆటగాడి ఫోకస్ దెబ్బ తింటుంది'' అంటూ కిర్గియోస్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఇది విన్న కిర్గియోస్‌కు కోపం నషాళానికి అంటింది. అంపైర్‌వైపు కోపంగా చూస్తూ.. ''నేను టైం వేస్ట్ చేయడం లేదు.. కాస్త అలసటగా ఉండడంతో మెళ్లిగా సర్వీస్ చేస్తున్నా.. అనే ముందు తెలుసుకొని మాట్లాడితే మంచిది'' అంటూ దురుసుగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక క్వార్టర్స్‌లో కిర్గియోస్.. కారెన్నోతో తలపడనున్నాడు. *time violation warning mr Kyrgios* the supervisor arrives, Tsitsipas keeps serving, everything is so perfect pic.twitter.com/yJT79W3U9M — Garbee|| Serena is coming ❤️ (@muguruthlessN1) June 15, 2022 చదవండి: Base Ball Game: అది బేస్‌బాల్ గేమ్.. ఏమరపాటుగా ఉంటే అంతే సంగతి! -
అంపైర్ పొరపాటు ఎస్ఆర్హెచ్కు కలిసొచ్చింది
క్రికెట్లో ఫీల్డ్ అంపైర్‌పై ఒత్తిడి చాలానే ఉంటుంది. ప్రతీ బంతిని సూక్ష్మంగా పరిశీలించడం.. నో బాల్స్, వైడ్స్, లెగ్ బై, రనౌట్లు, ఫోర్లు, సిక్సర్లు, మైదానంలో ఆటగాళ్లను కంట్రోల్ చేయడం.. ఇలా ఒకటేంటి చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి. ఇంత ఒత్తిలోనూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ సరైన నిర్ణయాలు తీసుకోవాలి. దీంతో అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. తాజాగా ఐపీఎల్ 2022లోనూ అలాంటిదే ఒకటి జరిగింది. ఎస్ఆర్హెచ్, కేకేఆర్ మధ్య మ్యాచ్‌లో అంపైర్ ఒక నో బాల్‌ను గుర్తించలేకపోయాడు. విషయంలోకి వెళితే.. టి20 క్రికెట్లో తొలి పవర్ ప్లే(6 ఓవర్లు) ముగిసిన తర్వాత ఔట్ ఫీల్డ్‌లో నలుగురు ఫీల్డర్లను ఉంచాలి. మిగతా ఫీల్డర్లు 30 గజాల సర్కిల్లో ఉండాలి. ఇది రూల్.. అయితే మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 8వ ఓవర్ తొలి బంతి వేసే సమయానికి ఉమ్రాన్ మాలిక్ ఔట్ ఫీల్డ్‌లో ఐదో ఫీల్డర్‌గా ఉన్నాడు. అప్పటికే బంతి వేయడం..బ్యాట్స్‌మన్ పరుగు తీయడం జరిగిపోయింది. ఈ సమయంలో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సైమన్ డౌల్ ఎయిర్‌లో నోబాల్ అని చెప్పడం క్లియర్‌గా వినిపించింది. అంపైర్ చూసుంటే కచ్చితంగా నో బాల్ వచ్చేదే. అయితే ఔట్‌ఫీల్డ్‌లో ఎంతమంది ఉన్నారన్న విషయం అంపైర్ పట్టించుకోలేదు. మొత్తానికి అంపైర్ పొరపాటుతో ఎస్ఆర్హెచ్కు ఒక నోబాల్ కలిసొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Commwntator Simon Doull calls no-ball. pic.twitter.com/jSdbEEIkFv — Cricketupdates (@Cricupdates2022) April 15, 2022 -
అల్లపురెడ్డి జనార్థనరెడ్డి ఇక లేరు..
-
మతి తప్పిన జ్వెరెవ్.. టోర్నీ నుంచి గెంటేసిన నిర్వాహకులు
అకాపుల్కో (మెక్సికో): ప్రపంచ మూడో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) హద్దు మీరాడు. మెక్సికో ఓపెన్ టెన్నిస్ టోర్నీలో జ్వెరెవ్ తన రాకెట్‌తో అంపైర్‌ను దాదాపు కొట్టినంత పని చేశాడు. దాంతో జ్వెరెవ్ నిర్వాకంపై టోర్నీ నిర్వాహకులు క్రమశిక్షణ చర్య తీసుకున్నారు. టోర్నీలో అతను సింగిల్స్ మ్యాచ్ ఆడాల్సిన పనిలేదంటూ ఇంటికి పంపించేశారు. వివరాల్లోకి వెళితే... మంగళవారం రాత్రి జరిగిన డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో జ్వెరెవ్ –మార్సెలో మెలో (బ్రెజిల్) జోడీ 2–6, 6–4, 6–10తో గ్లాస్‌పూల్ (బ్రిటన్)–హారి హెలియోవారా (ఫిన్లాండ్) జంట చేతిలో ఓడింది. మ్యాచ్ సందర్భంగా అంపైర్ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన జ్వెరెవ్ తుది ఫలితం తర్వాత తన రాకెట్‌తో ఏకంగా చైర్ అంపైర్ కుర్చీకేసి బాదాడు. అంపైర్ తన కాళ్లను దగ్గరకు తీసుకోకపోతే కచ్చితంగా గాయమయ్యేది. ‘క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన జ్వెరెవ్‌ను టోర్నీ నుంచి తప్పించాం’ అని అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ తెలిపింది. మరోవైపు తన హద్దుమీరిన ప్రవర్తనపై జ్వెరెవ్ బుధవారం స్పందించాడు. చైర్ అంపైర్‌తోపాటు టోర్నీ నిర్వాహకులకు క్షమాపణలు చెప్పాడు. Alexander Zverev has been THROWN OUT of the Mexican Open for attacking the umpire's chair at the end of his doubles match 😮😮😮 pic.twitter.com/CWhQ1r6kwj — Amazon Prime Video Sport (@primevideosport) February 23, 2022 -
అంపైర్‌ను బూతులు తిట్టిన స్టార్ ప్లేయర్‌కు భారీ జరిమానా
Medvedev Fined 12000 USD: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా చైర్ అంపైర్‌ను బూతులు తిట్టిన ప్రపంచ నెంబర్ 2 ఆటగాడు డానిల్ మెద్వెదెవ్(రష్యా)కు భారీ జరిమానా విధించారు టోర్నీ నిర్వాహకులు. క్రీడా స్పూర్తికి విరుద్ధంగా అంపైర్‌పై అనవసరంగా నోరు పారేసుకున్నాడన్నకారణంగా మెద్వెదెవ్కు 12000 యూఎస్ డాలర్లు ఫైన్ వేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. One set all in #AusOpen semi-final and Daniil Medvedev has completely lost his head as he goes onto call the umpire a “small cat” 😂 He has a point though, this isn’t the first time Stefanos Tsitsipas has been accused of cheating by receiving coachingpic.twitter.com/Be0h2R7uCZ — Alex ⚒ (@AlexSmith_123) January 28, 2022 కీలకమైన సెమీస్ సందర్భంగా ప్రత్యర్థి ఆటగాడు సిట్సిపాస్ రూల్స్‌కు విరుద్ధంగా స్టాండ్స్‌లోని తన తండ్రి నుంచి సలహాలు తీసుకున్నాడని ఆరోపిస్తూ.. చైర్ అంపైర్ జౌమ్ క్యాంపిస్టల్ను స్టుపిడ్ అంటూ దూషించాడు మెద్వెదెవ్. అయితే, మ్యాచ్ అనంతరం మెద్వెదెవ్ తన ప్రవర్తనపై అంపైర్‌ను క్షమాపణ కోరినప్పటికీ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. కాగా, సెమీస్‌లో నాలుగో సీడ్ సిట్సిపాస్‌ను 7-6(5),4-6,6-4,6-1తో కంగుతినిపించిన మెద్వెదెవ్.. ఆదివారం జరగబోయే ఫైనల్లో స్పెయిన్ బుల్ రఫేల్ నదాల్‌తో అమీతుమీకి సిద్ధమయ్యాడు. చదవండి: రెండు నెలల క్రితం రిటైర్మెంట్ ఆలోచన.. కట్‌చేస్తే -
అంపైర్‌ను బూతులు తిట్టిన స్టార్ టెన్నిస్ ప్లేయర్
మ్యాచ్‌లో ఆటగాళ్లకు అంపైర్‌తో వివాదాలు సహజమే. ఒక్కోసారి అవి శృతిమించుతుంటాయి. టెన్నిస్ కూడా దీనికి అతీతం కాదనే చెప్పొచ్చు. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ప్రపంచ నెంబర్ రెండో ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ అంపైర్‌పై అనవసరంగా నోరు పారేసుకున్నాడు. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో రెండోసెట్ ముగిసిన తర్వాత ఇది చోటుచేసుకుంది. ప్రత్యర్థి ఆటగాడు సిట్సిపాస్ రూల్స్‌కు విరుద్ధంగా స్టాండ్స్‌లోని తన తండ్రి వద్ద మ్యాచ్‌కు సంబంధించి సలహా తీసుకున్నాడు. చదవండి: Shoaib Akhtar: పిచ్చి ప్రశ్నలు వేస్తోంది.. స్విమ్మింగ్‌ఫూల్‌లో పడేయండి ఇది గమనించిన మెద్వెదెవ్.. చైర్ అంపైర్ జౌమ్ క్యాంపిస్టల్ చూస్తూ.. ''సిట్సిపాస్ తన తండ్రి సలహా తీసుకొని కోడ్ ఆఫ్ వయలేషన్ను ఉల్లఘించాడు.. ఇది నీకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించాడు. అంపైర్ చెప్పేది వినిపించుకోకుండానే మెద్వెదెవ్ మరోసారి గట్టిగా అరిచాడు.''సిట్సిపాస్‌కు తన తండ్రి ఏ పాయింట్ గురించైనా మాట్లాడుండొచ్చు.. ఆర్ యూ స్టుప్టిడ్.. అతని తండ్రి ఏ పాయింట్ గురించైనా మాట్లాడుండొచ్చు.. నా ప్రశ్నకు సమాధానం చెప్పు.. ఒక గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్లో ఇంత బ్యాడ్ అంపైర్ ఉంటారా.. ఓ మై గాడ్.. నీతోనే మాట్లాడుతున్నా నన్ను చూడు'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం మెద్వెదెవ్ తన ప్రవర్తనపై అంపైర్‌ను క్షమాపణ కోరాడు. అంతకముందు ఇదే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రఫేల్ నాదల్, కెనడా టెన్నిస్ ఆటగాడు డెనిస్ షాపోవాలో మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. చైర్ అంపైర్ నాదల్‌తో కుమ్మక్కయ్యాడని.. అవినీతి అంపైర్ అంటూ షాపోవాలో దూషించడం సంచలనంగా మారింది. ఇంతటితో ఊరుకొని షాపోవాలో... నాదల్కు ఒకసారి వైద్య పరీక్షలు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చదవండి: Australian Open 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన నాదల్.. కన్నీటిపర్యంతం ఇక పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో డానిల్ మెద్వెదెవ్ విజయం సాధించాడు. గ్రీక్‌కు చెందిన నాలుగో సీడ్ సిట్సిపాస్‌ను 7-6(5),4-6,6-4,6-1తో కంగుతినిపించిన మెద్వెదెవ్ ఫైనల్లో అడుగపెట్టాడు. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్లో మెద్వెదెవ్.. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్‌తో అమితుమీ తేల్చుకోనున్నాడు. "If you don't call it, you are a small cat?" "Medvedev vs Tsitsipas pic.twitter.com/WS7yPXJGtb — Llama Says☄🌠🚀 (@funnyzeitgist) January 28, 2022 Medvedev vs the umpire, Round 2! 🛎️🥊#AusOpen - live on Channel 9, 9Now and Stan Sport. pic.twitter.com/XZgZ9qJgin — Wide World of Sports (@wwos) January 28, 2022 -
చంపేస్తానంటూ హెచ్చరిక.. ఆటగాడిపై జీవితకాల నిషేధం
క్రికెట్లో ఆటగాళ్ల మధ్య గొడవలు సహజం. ఒక్కోసారి అవి కొట్టుకునే స్థాయికి వెళ్తాయి. అయితే ఇలాంటివి జరగకుండా అంపైర్లు జోక్యం చేసుకొని వివాదాన్ని సద్దుమణిగిస్తుంటారు. మరి అలాంటి అంపైర్లకు చంపేస్తామంటూ వార్నింగ్‌లు ఇస్తే ఆటగాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సరిగ్గా అలాంటి పనే పావర్టీ బే క్రికెట్ అసోసియేషన్ చేసింది. చదవండి: Virat Kohli: 'కోహ్లి వివాదం ముగించే వ్యక్తి గంగూలీ మాత్రమే' మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే అంపైర్‌పై చేయి చేసుకోవడంతో పాటు చంపేస్తానంటూ తిమోటి వీర్ అనే క్లబ్ క్రికెటర్ గ్రౌండ్‌లోనే వార్నింగ్ ఇచ్చాడు. డిసెంబర్ 4న గిస్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. దీనిపై విచారణ జరిపిన పావర్టీ బే క్రికెట్ అసోసియేషన్ తిమోటిపై సీరియస్ యాక్షన్ తీసుకుంది. క్రికెట్ నిబంధనల ప్రకారం అంపైర్‌పై దురుసు ప్రవర్తన మాత్రమేగాక చంపేస్తానంటూ హెచ్చరికలు జారీ చేసి కోడ్ ఆఫ్ కండక్ట్ కింద లెవెల్-4 నిబంధనలను తిమోటి అతిక్రమించినట్లు తేలింది. ఈ చర్యలకుగాను ఇకపై క్రికెట్ ఆడకుండా అతనిపై జీవితకాల నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఇంతకముందు కూడా తిమోటి ఇదే తరహాలో తన దురుసు ప్రవర్తనతో కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు ఉల్లఘించాడని.. అందుకే తాజా చర్యను సీరియస్‌గా తీసుకొని జీవితకాలం నిషేధం విధించినట్లు పావర్టీ బే క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్ ఐసాక్ హ్యూగ్స్ వివరణ ఇచ్చారు. చదవండి: Ashes 2021-22: జోస్ బట్లర్ స్టన్నింగ్ క్యాచ్.. సూపర్‌మాన్‌లా డైవ్ చేస్తూ.. వీడియో వైరల్ -
అడ్డంగా బుక్కైన హసన్ అలీ.. అంపైర్ వార్నింగ్
Umpire Warns Hasan Ali Use Saliva To Shine Ball.. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీని అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. కరోనా దృష్యా ఐసీసీ నిబంధనల ప్రకారం బౌలర్లు బంతి పదును కోసం సలైవాను రుద్దడం నిషేధం. మార్చి 2020లో ఐసీసీ తీసుకొచ్చిన ఈ నిబంధనను బౌలర్లు తప్పనిసరిగా ఫాలో కావాల్సిందే. అయితే హసన్ అలీ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో నిబంధనను అతిక్రమించి బంతి పదును కోసం సలైవా రుద్ది కెమెరాల్లో అడ్డంగా బుక్కయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. చదవండి: Ban Vs Pak 1st Test: 5 వికెట్లతో మెరిసిన హసన్ అలీ.. సెంచరీ దిశగా అబిద్ అలీ ఇది చూసిన ఫీల్డ్ అంపైర్.. హసన్ అలీ దగ్గరికి వచ్చి మాట్లాడాడు. ఇలా చేయడం మంచిది కాదని.. ఇంకోసారి రిపీట్ కావొద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ వెర్నన్ ఫిలాండర్ కూడా హసన్ అలీతో మాట్లాడడం వైరల్‌గా మారింది. కోచ్ చెబితేనే ఇలా చేశాడా.. లేక ఉద్దేశపూర్వకంగానే హసన్ అలీ బంతికి సలైవా రుద్దాడా అనేది తెలియదు. ఇక ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక బౌలర్ బంతి పదును కోసం సలైవాను రెండుసార్ల కంటే ఎక్కువ ఉపయోగిస్తే ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. కాగా హసన్ అలీ ఇప్పటికే రెండుసార్లు బంతికి సలైవా రుద్దాడు. ఇంకోసారి అదే తప్పు చేస్తే ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు అదనంగా ఇస్తారు. చదవండి: IND vs NZ: న్యూజిలాండ్ స్పిన్నర్ చెత్త రికార్డు.. 21 ఏళ్ల తర్వాత ఇక మ్యాచ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ ప్రస్తుతం 83 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. అంతకముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ ఓపెనర్ హబీద్ అలీ (133 పరుగులు) సెంచరీతో మెరవగా.. షఫీఖ్ 52 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 7 వికెట్లతో దుమ్మురేపాడు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులుకు ఆలౌటైంది. -
అంపైర్‌ను భయపెట్టిన పుజారా.. తృటిలో తప్పించుకున్నాడు
లీడ్స్: టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరోను తన షాట్‌తో భయపెట్టాడు. మూడో టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్ 79వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. మొయిన్ అలీ వేసిన ఆ ఓవర్ తొలి బంతిని పుజారా స్వేర్ లెగ్ దిశగా బౌండరీ కొట్టాడు. అయితే పుజారా బ్యాక్‌ఫుట్ తీసుకొని బంతిని బలంగా బాదడంతో సెకన్ల వ్యవధిలోనే బౌండరీ లైన్‌కు వెళ్లిపోయింది. అయితే అక్కడే ఉన్న లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో కిందకు వంగడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఒకవేళ అంపైర్ అలాగే నిల్చొని ఉంటే తల ఖాయంగా పగిలి ఉండేది. పుజారా కొట్టిన ఆ షాట్ గంటకు 98 కిమీ వేగంతో వెళ్లినట్లు తర్వాత మీటర్ రీడింగ్‌లో చూపించారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు బంతి ఎంత వేగంగా వెళ్లిందనేది. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో ఉంది.. మీరు ఒక లుక్కేయండి. చదవండి: పుజారాకు టెక్నిక్‌తో పాటు మైండ్ పోయింది: వాన్ ఇక పుజారా తన బ్యాటింగ్‌పై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానమే ఇచ్చాడు. 11 ఇన్నింగ్స్‌ల నుంచి కనీసం అర్థసెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయిన పుజారా కీలకదశలో రాణించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచినా పుజారా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తనదైన మార్క్ చూపించాడు. ఓపెనర్ రాహుల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా తన శైలికి భిన్నంగా వేగంగా ఆడుతూ 180 బంతుల్లో 91 పరుగులు సాధించాడు. ఇందులో 15 ఫోర్లు ఉన్నాయి. ఇక మ్యాచ్‌లో మూడోరోజు ఆటముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఇంకా 139 పరుగులు వెనుకబడి ఉన్న టీమిండియా నాలుగోరోజు ఇంగ్లండ్ బౌలర్లను రోజు మొత్తం నిలువరించాల్సి ఉంది. పుజారా 91, కోహ్లి 45 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు మరో ఓపెనర్ రోహిత్ శర్మ 59 పరుగులు చేసి ఔటయ్యాడు. ENG Vs IND: స్పిన్ బౌలింగ్.. అందరూ హెల్మెట్లతోనే, కారణం అదే ENG Vs IND: మళ్లీ వచ్చేశాడు.. ప్యాడ్స్ కట్టుకొని కోహ్లి స్థానంలో pic.twitter.com/DhC0mwSxdu — Sportzhustle_Squad (@sportzhustle) August 27, 2021 -
అంతర్జాతీయంగా పనిచేసిన తెలుగు అంపైర్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: వరుసగా మూడు ఒలింపిక్స్‌లతోపాటు (1992 బార్సిలోనా, 1996 అట్లాంటా, 2000 సిడ్నీ) పలు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో... ఆసియా క్రీడల్లో... కామన్వెల్త్ గేమ్స్‌లో.. థామస్ కప్–ఉబెర్ కప్‌లలో అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ అంపైర్ వేమూరి సుధాకర్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో రెండు వారాలుగా కరోనా వైరస్‌తో పోరాడిన 70 ఏళ్ల సుధాకర్ మంగళవారం తుదిశ్వాస విడిచారు. సుధాకర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాలుగు దశాబ్దాలుగా బ్యాడ్మింటన్‌తో అనుబంధం కలిగిన సుధాకర్ ప్రస్తుతం ఆసియా బ్యాడ్మింటన్ టెక్నికల్ కమిటీకి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సుధాకర్ మృతిపట్ల తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు, ఐటీ, మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్... భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, డబుల్స్ స్టార్ ప్లేయర్ గుత్తా జ్వాల, వెటరన్ కోచ్ ‘ద్రోణాచార్య’ ఎస్ఎం ఆరిఫ్, భారత బ్యాడ్మింటన్ సంఘం, ఆసియా బ్యాడ్మింటన్ సంఘం, భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు ఎ.జగన్మోహన్రావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
అందరి చర్చా.. ‘సాఫ్ట్’ సిగ్నల్ పైనే!
‘స్పష్టత లేదు’... లెక్క లేనన్ని సార్లు రీప్లేలు చూసిన తర్వాత మూడో అంపైర్ వీరేందర్ శర్మ చేసిన వ్యాఖ్య ఇది. నాలుగో టి20 మ్యాచ్‌లో సూర్యకుమార్ ఇచ్చిన క్యాచ్‌ను మలాన్ ఎలా పట్టాడో అందరికీ స్పష్టంగా కనిపించింది. బంతి గ్రౌండ్‌కు తాకిన విషయం టీవీల ముందు కూర్చున్న లక్షలాది మందికి, మైదానంలో ఉన్న ఆటగాళ్లకూ తెలుస్తోంది. కానీ అంపైర్‌కు మాత్రం అది నాటౌట్ అనిపించలేదు. అందుకే ఫీల్డ్ అంపైర్ అనంత పద్మనాభన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ సూర్యను అంపైర్ పెవిలియన్‌కు పంపించాడు. ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అలా ఎలా ఇచ్చాడు అనేది సగటు అభిమానికి అర్థం కాలేదు. అందుకు కారణం ‘సాఫ్ట్ సిగ్నల్’. ఇప్పుడు ఇదే ‘సాఫ్ట్’ నిర్ణయం క్రికెట్లో కొత్త చర్చకు దారి తీసింది. -సాక్షి క్రీడా విభాగం నాలుగో టి20 మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయి ఉంటే ఎలా ఉండేది? సహజంగానే సూర్యకుమార్ అవుట్‌పై మరింత రచ్చ జరిగేది. ఓటమికి అంపైర్ తప్పుడు నిర్ణయమే కారణమని అన్ని వైపుల నుంచి మాజీలు, విశ్లేషకులు విరుచుకు పడేవారు. అయితే గెలుపోటములతో సంబంధం లేకుండా ఈ మ్యాచ్ కొత్త వివాదాన్ని ముందుకు తెచ్చింది. తనకు కనిపించనంత దూరంలో బౌండరీ వద్ద పట్టిన సందేహాస్పద క్యాచ్‌పై కూడా ఫీల్డ్ అంపైర్ ‘సాఫ్ట్ సిగ్నల్’ పేరుతో తన నిర్ణయం ప్రకటించడం, టెక్నాలజీ అందుబాటులో ఉన్నా తప్పుడు నిర్ణయాలు వెలువడటంతో నిబంధనలు మార్చాలంటూ సహజంగానే డిమాండ్లు ముందుకు వచ్చాయి. నిబంధనలు ఏం చెబుతున్నాయి... సూర్యకుమార్ విషయంలో ఫీల్డ్ అంపైర్ ఒకవైపు థర్డ్ అంపైర్‌కు నివేదిస్తూనే మరోవైపు తన వైపుగా ‘అవుట్’ అంటూ వేలెత్తి చూపించేశాడు. ఇదే ‘సాఫ్ట్ సిగ్నల్’. అంటే తనకు ఎలా అనిపించిందనే విషయాన్ని అతను స్పష్టంగా చెప్పేశాడు. ఆ తర్వాత థర్డ్ అంపైర్ వరుసగా రీప్లేలు చూసిన తర్వాత ‘ఇన్‌కన్‌క్లూజివ్’ అంటూ స్పష్టంగా కనిపించడం లేదని తేల్చేశాడు. కాబట్టి ఫీల్డ్ అంపైర్ నిర్ణయమే సరైందని ప్రకటించడంతో అది అవుట్‌గా తేలింది. ఈ రకంగా చూస్తే ఇద్దరూ అంపైర్లూ తమ పరిధిలో సరిగ్గానే విధులు నిర్వర్తించారు. అయితే రీప్లేల్లోనూ స్పష్టంగా కనిపించని ‘ఇన్‌కన్‌క్లూజివ్’ విషయాల్లో థర్డ్ అంపైర్‌ను తప్పు పట్టలేం. కానీ సూర్య విషయంలో అంతా స్పష్టంగా కనిపిస్తున్నా అంపైర్ అలా తేల్చడమే వివాదం ముదరడానికి కారణమైంది. తనకు అర్థంకాని అంశంలో ఫీల్డ్ అంపైర్ ఎందుకు స్పందించాలి, రనౌట్ల తరహాలో నేరుగా థర్డ్ అంపైర్‌కే వదిలేయవచ్చు కదా అని కొందరు వ్యాఖ్యానించారు. అయితే క్రికెట్ నిబంధనలు రూపొందించే ‘ఎంసీసీ’ ప్రకారం అంపైర్ అవుట్ కానీ నాటౌట్ కానీ ఏదో ఒక నిర్ణయం తనవైపు నుంచి తప్పనిసరిగా ప్రకటించాల్సిందే. దీనినే ఇప్పుడు తొలగించాలని అందరూ చెబుతున్నారు. ‘సాఫ్ట్’ వెనుక కారణమిదీ... సాంకేతికత ఎంత గొప్పగా ఉన్నా దానిని ఆపరేట్ చేసేది మానవమాత్రులే కాబట్టి 100 శాతం దానిపైనే ఆధారపడకుండా అంపైర్ల విచక్షణకు కూడా అవకాశం ఇవ్వాలనేది ‘సాఫ్ట్ సిగ్నల్’ అంతస్సూత్రం. ఎల్బీడబ్ల్యూల విషయంలో ‘అంపైర్స్ కాల్’ను అమలు చేస్తోంది కూడా సరిగ్గా ఇదే కారణంతోనే. బాల్ ట్రాకింగ్ ఎలా చూపించినా అంపైర్ దృష్టిలో బంతి ఎలా స్పందిస్తుంది అనేదానిపైనే ఆధారపడి నిర్ణయాలు ప్రకటిస్తాడు. సూర్యకుమార్‌లాంటి క్యాచ్‌ల విషయంలో కొన్నిసార్లు ఫీల్డర్ స్పందన, ముఖకవళికలు కూడా అంపైర్లను ప్రభావితం చేస్తాయనేది వాస్తవం. ఇలాంటి సందర్భాల్లో మహా నటుల్లా కనిపించే ఆటగాళ్లను పూర్తిగా నమ్మడం కూడా సరైంది కాదు. అయితే సగటు అభిమానికి అర్థంకాని సమస్యలు కూడా ఇక్కడ ఉన్నాయి. ‘ఒక మ్యాచ్‌కు కనీసం 10 కెమెరాలు వాడితే అందులో 2 సూపర్ స్లో మోషన్ కెమెరాలు ఉంటాయి. అవి కూడా పూర్తిగా స్పష్టతనివ్వలేవు. ఇప్పుడు వాడుతున్న కెమెరాలు 2డి మాత్రమే. అన్ని స్పష్టంగా కనిపించాలంటే 3డి కెమెరాలు వాడాలి. పైగా పెద్ద జట్లు మినహా అన్ని సిరీస్‌లకు ఇలాంటివి వాడటంలేదు. అబుదాబిలో జరుగుతున్న అఫ్గానిస్తాన్, జింబాబ్వే సిరీస్‌లో అసలు అంపైర్ నిర్ణయ సమీక్ష (డీఆర్ఎస్) లేదు. కాబట్టి అందరికీ ఒకే రూల్ అనే నిబంధన పని చేయదు’ అని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. అంటే ఏదో ఒక దశలో అంపైర్ నిర్ణయానికి కట్టుబడాల్సిందే కాబట్టి ఆ అవకాశం ఫీల్డ్ అంపైర్‌కే ఇస్తున్నట్లు లెక్క. కీలక మ్యాచ్‌లలో ఇలాం టివి తుది ఫలితాన్ని మార్చేయవచ్చు. అసలు అంపైర్ అవుట్గానీ నాటౌట్కానీ ఎందుకు స్పష్టంగా ప్రకటించాలి. ‘నాకు తెలియదు’ అని చెప్పే అవకాశం కూడా అంపైర్‌కు ఉండాలి కదా. అందరికీ అర్థమయ్యే తరహాలో ఒకే రకమైన నిబంధనలు రూపొందించాలి. –కోహ్లి, భారత కెప్టెన్ -
'నా నిర్ణయం వ్యతిరేకిస్తారా.. ఇప్పుడు చూడండి'
కరాచీ: క్రికెట్లో డీఆర్ఎస్ రూల్స్ ప్రవేశపెట్టాకా ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. ఫీల్డ్ అంపైర్ నిర్ణయం ఒకసారి అనుకూలంగా ఉంటే మరోసారి వ్యతిరేకంగా ఉంటాయి. వారిచ్చిన నిర్ణయం నచ్చకపోతే రివ్యూ కోరే అవకాశాన్ని ఇరు జట్ల ఆటగాళ్లకు కల్పించారు. అయితే కొన్ని సందర్భాల్లో నాటౌట్ అని తెలిసి కూడా ఫీల్డ్ అంపైర్ మాట లెక్కచేయకుండా ఆటగాళ్లు రివ్యూలకు వెళుతుంటారు. రివ్యూ వ్యతిరేకంగా రాగానే ఆటగాళ్లు నిరాశకు లోనవుతుంటారు. ఇది ఇప్పటికే చాలాసార్లు నిరుపితమైంది. అదే సమయంలో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయం సరైందని తెలిసి లోలోపల సంతోషిస్తుంటారే తప్ప ఎమోషన్స్‌ను బయట పడనివ్వరు. తాజాగా సీనియర్ అంపైర్ అలీమ్ దార్ మాత్రం ఎమోషన్‌ను దాచుకోలేకపోయారు. అసలు విషయంలోకి వెళితే.. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో భాగంగా బుధవారం ఇస్లామాబాద్ యునైటెడ్స్, కరాచీ కింగ్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఇస్లామాబాద్ యునైటెడ్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కేవలం ఒక్క పరుగు చేస్తే ఇస్లామాబాద్ విజయం సాధిస్తుంది. మక్సూద్ వేసిన తొలి బంతిని ఆసిఫ్ అలీ థర్డ్ మన్ దిశగా ఫ్లిక్ చేసి పరుగు పూర్తి చేశాడు. అయితే మక్సూద్ అలీ బంతి ప్యాడ్‌కు తాకి వెళ్లిందోమోనన్న అనుమానంతో ఎల్బీకి అప్పీల్ చేశాడు. అయితే బంతి ప్యాడ్లను తాకినా వికెట్లకు చాలా ఎత్తులో నుంచి వెళుతుండడంతో ఫీల్డ్ అంపైర్ అలీమ్ దార్ నాటౌట్ అని పేర్కొన్నాడు. దీంతో కరాచీ కింగ్స్ డీఆర్ఎస్కు వెళ్లింది. అయితే రిప్లేలో కూడా బంతి అల్ట్రా ఎడ్జ్ తీసుకొని వికెట్ల పైనుంచి వెళుతున్నట్లు తేలింది. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్ అని ఇచ్చాడు. దీంతో ఇస్లామాబాద్ సంబరాల్లో మునిగిపోగా.. కరాచీ కింగ్స్‌కు నిరాశే ఎదురైంది. అయితే తాను చెప్పినా వినకుండా కరాచీ కింగ్స్ రివ్యూకు వెళ్లిందన్న కారణంతో అలీమ్ దార్ .. యా.. నేనే విజయం సాధించా.. అన్నట్లు సైగలు చేశాడు. అలీమ్ దార్ చర్యను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇస్లామాబాద్ యునైటెడ్స్ కరాచీ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇస్లామాబాద్ 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇస్లామాబాద్ బ్యాటింగ్‌లో అలెక్స్ హేల్స్ 46, ఇఫ్తికర్ అహ్మద్ 49, హుస్సేన్ తలాత్ 42 పరుగులతో రాణించారు. చదవండి: డబుల్ సెంచరీ... పృథ్వీ షా సరికొత్త రికార్డు Aleem Dar Thug Life Moment at the End when they lost the review 🤣🤣🤣 pic.twitter.com/boldCdV4S7 — Taimoor Zaman (@taimoorze) February 24, 2021 -
కష్టాల కడలి దాటి.. క్రికెట్ ఒడిలోకి
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో తొలి మహిళా అంపైర్‌గా ఎంపికైన వై.హరీషా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. అడ్డంకులను అధిగమిస్తూ.. కష్టాలనే విజయ సోపానాలుగా మలుచుకుంటూ విజేతగా నిలిచింది. హరీషా చిన్న వయసులోనే తండ్రి కన్నుమూశాడు.. బరువు.. బాధ్యత మోసిన మాతృమూర్తి తన ఎదుగుదలను చూడకముందే మృత్యుఒడికి చేరింది.. ఇలా అనుకోని కష్టాల కడలి దాటి క్రికెట్ ఒడికి చేరింది. శ్రమయేవ జయతే నినాదాన్ని నిజం చేస్తూ తల్లి ఆశయాన్ని.. తన లక్ష్యాన్నీ సాధించింది. ప్లేయర్‌గానే కాదు అంపైరింగ్‌లోనూ అడుగు పెట్టి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న వై. హరీషా విజయగాథపై ప్రత్యేక కథనం. సాక్షి, కడప : కడప నగరంలోని శ్రీహరి డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న వై. హరీషా స్వస్థలం కర్నూలు జిల్లా నంద్యాల. తండ్రి చిన్న వయసులోనే చనిపోగా పోషణ భారమంతా తల్లిపై పడింది. అప్పటి నుంచి అన్నీతానై అల్లారుముద్దుగా పెంచింది. కూతురు ప్రయోజకురాలైతే చూడాలని ఎంతో ఆశ పడింది. ఆ ఆశ నెరవేరకుండానే కన్నుమూసింది. తల్లి ఆశయ సాధన కోసం.. కన్న తల్లి దూరమైనా ఆమె ఆశయసాధన కోసం మరింత పట్టుదలగా కృషి చేసింది హరీషా. ఈ క్రమంలో తనకెంతో ఇష్టమైన క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. అండర్–16, అండర్–19 ఉమన్టీంకు ప్రాతినిథ్యం వహించింది. జోనల్‌స్థాయి పోటీల్లో సైతం పాల్గొని ప్రతిభ కనబరిచింది. ఈ నేపథ్యంలో ఆమె ఇంట్లో పరిస్థితులు సహకరించకపోవడంతో క్రికెట్‌కు స్వస్తిపలికి చదువుపై దృష్టి సారించింది. తల్లిదండ్రులు లేకపోవడంతో బంధువుల సహకారంతో కడపలోని శ్రీహరి డిగ్రీ కళాశాలలో చేరింది. అక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఆనంద్ ఆమెలోని ప్రతిభను గుర్తించి క్రికెట్లోకి మళ్లీ రావాలని ప్రోత్సహించాడు. అంతేకాకుండా క్రికెట్ సంఘం పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం. భరత్‌రెడ్డి, పి. సంజయ్‌కుమార్‌ల బృందం ఆమె బాగోగులు చూసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో పాటు సహకారం అందిస్తామని తెలిపారు. దీంతో క్రికెట్లో ఈమె కడప నుంచి ప్రాతినిథ్యం వహిస్తోంది. ఏసీఏ తొలి మహిళా అంపైర్‌గా.. ఇప్పటి వరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పరిధిలో మహిళా క్రీడాకారిణులు తమ క్రికెట్ అనంతరం స్కోరర్లుగా పనిచేశారు. అయితే ఎవరూ అంపైరింగ్ రంగంలోకి రాలేదు. ఇటీవల జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జనవరి 30న జిల్లాస్థాయి అంపైరింగ్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరైన ఏకైక మహిళ ఈమె కావడం విశేషం. పరీక్ష ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఫిబ్రవరి 8న నిర్వహించిన ప్రాక్టికల్స్, వైవాలో ఉత్తీర్ణత సాధించడంతో ఈమెను స్టేట్ ప్యానల్‌కు అంపైర్‌గా జిల్లా క్రికెట్ సంఘం సభ్యులు సిఫార్సు చేశారు. దీనికి ఆంధ్రా క్రికెట్ సంఘం అనుమతించడంతో ఈమె తొలి ఏసీఏ అంపైర్‌గా అరుదైన చరిత్రను తనపేరు మీదుగా రాసుకుంది. రానున్న రోజుల్లో ఈమె లెవల్–2 అంపైర్‌గా కూడా అవకాశం లభించనుంది. చదవండి: ఏంటిది రహానే.. ఇలా చేశావు? ఓటమిని ఆహ్వానించిన టీమిండియా -
వైరల్ వీడియో: వైడ్ కాదా.. చాలా లోపల
దుబాయ్ : ఐపీఎల్-2020 సీజన్లో భాగంగా గురువారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సరదా సన్నివేశం జరిగింది. మ్యాచ్ మధ్యలో ఫీల్డ్ అంపైర్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్య పరిచాడు. రెండో ఇన్నింగ్స్ 19వ ఓవర్లో సీఎస్కే ఆటగాడు స్యామ్ కరన్ బౌలింగ్ వేశాడు. ఓవర్లోని నాలుగో బంతిని ఎదుర్కొన్న దినేష్ కార్తీక్‌కు బాల్ అందకుండా వికెట్లకు కాస్త దూరంగా వెళ్ళింది. దీంతో వైడ్ కాదా అంటూ అంపైర్‌ను తెలుగులో ప్రశ్నించాడు. దీనికి హైదరాబాద్‌కు చెందిన అంపైర్ షంషుద్దీన్ తెలుగులోనే సమాధానం ఇచ్చాడు. `లోపల..చాలా లోపల. కొంచెం గూడ కాదు.. అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కామెంట్స్ సైతం పెడుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. (కేకేఆర్ బౌలర్‌కి ధోనీ సూచనలు) -
వైరల్ వీడియో: వైడ్ కాదా.. చాలా లోపల
-
బారెడు జట్టుతో అంపైర్, మీమ్స్ హోరు
దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసి ఉత్కంఠ రేకెత్తించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 163 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ కూడా 20 ఓవర్లలో 163 పరుగులే చేయగలిగింది. టై గా ముగిసిన మ్యాచ్‌లో కేకేఆర్ సూపర్ విజయం సాధించింది. ఆద్యంతం అభిమానులను అలరించిన ఈ మ్యాచ్‌లో అంపైర్ పశ్చిమ్ పాఠక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆట మొదలైనప్పటి నుంచి ఆయన అంపైరింగ్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ వరద కొనసాగింది. పాఠక్ అంపైరింగ్ విధానం, హెయిర్ స్టైయిల్ దీనికి కారణం. ఆయన జుట్టు మహిళల మాదిరిగా బారెడు పొడుగు ఉండటంతో.. ‘మహిళా అంపైర్ ఎవరబ్బా?’అంటూ కొందరు అభిమానులు ప్రశ్నలు సంధించారు. (చదవండి: సూపర్: 3 బంతులు, 2 పరుగులు, 2 వికెట్లు) ‘ఐపీఎల్లో మొట్ట మొదటిసారి అంపైరింగ్ చేస్తున్న ఈ మహిళను చూడండి.. ఎంత అందంగా ఉందో’ అంటూ మీమ్స్ కూడా వేశారు కొందరు. బౌలర్ బంతిని విసిరే సమయంలో ఒకప్పటి అంపైర్ల మాదిరిగా ముందుకు వంగి ఉండటం పాఠక్ స్పెషాలిటీ. ఆయన అంపైరింగ్ స్టాండర్డ్స్ కూడా బాగుంటాయని పేరుంది. విజయ్ హజారే టోర్నీలో మొట్ట మొదటిసారిగా హెల్మెట్ ధరించి అంపైరింగ్ చేసింది కూడా పాఠకే. వికెట్ కీపర్ అంపైర్లాగా నిలబడితే.. అంపైర్ వికెట్ కీపర్ లా నిలుచున్నాడని కొందరు ట్రోల్ చేశారు. మరికొందరు మాత్రం పాఠక్ సంప్రదాయక పద్ధతిలో అంపైరింగ్ బాగుందంటూ.. ఆయన్ని రాక్‌స్టార్ అంటూ పొగిడేస్తున్నారు. కాగా, 2014లో తొలిసారి ఆయన ఐపీఎల్లో అంపైరింగ్ చేశాడు. మళ్లీ తాజా సీజన్లో ఫీల్డులోకి దిగాడు. (చదవండి: షమీ నిర్ణయంపై ఆశ్చర్యపోయాం: రాహుల్) -
‘ఒక్క పరుగు’ విలువెంత...
దుబాయ్: ఐపీఎల్–2020లో రెండో రోజే వివాదానికి తెర లేచింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైరింగ్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంపైర్ ప్రకటించిన ‘షార్ట్ రన్’ను నిరసిస్తూ రిఫరీ జవగల్ శ్రీనాథ్‌కు తాము అధికారికంగా ఫిర్యాదు చేశామని పంజాబ్ జట్టు సీఈఓ సతీశ్ మీనన్ వెల్లడించారు. ఈ పొరపాటు ప్రభావం తమ ప్లే ఆఫ్ అవకాశాలపై కూడా పడవచ్చని కూడా ఇందులో పేర్కొంది. ఏం జరిగింది... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్‌లో రబడ వేసిన 19వ ఓవర్ మూడో బంతిని మయాంక్ లాంగాన్ దిశగా ఆడగా ఇద్దరు బ్యాట్స్‌మెన్ రెండు పరుగులు తీశారు. అయితే తొలి పరుగును జోర్డాన్ సరిగా పూర్తి చేయకుండా, క్రీజ్‌లో బ్యాట్ ఉంచకుండానే వెనుదిరిగాడంటూ స్క్వేర్ లెగ్ అంపైర్ నితిన్ మీనన్ ఒకటే పరుగు ఇచ్చాడు. మ్యాచ్ చివరకు సూపర్ ఓవర్ వరకు వెళ్లడంతో ఈ ఒక్క పరుగు విషయంలో వివాదం రాజుకుంది. టీవీ రీప్లే చూడగా అంపైర్‌దే తప్పని తేలింది. జోర్డాన్ సరైన రీతిలోనే తన బ్యాట్‌ను పూర్తిగా క్రీజ్‌లో ఉంచడం స్పష్టంగా కనిపించింది. దాంతో కింగ్స్ ఎలెవన్ తీవ్ర అసహనానికి గురైంది. ఈ పరుగు ఇచ్చి ఉంటే తాము ముందే గెలిచేవారమని పంజాబ్ భావించింది. నిజంగానే నితిన్‌కు సందేహం ఉంటే థర్డ్ అంపైర్‌కు నివేదించాల్సిందని ఆ జట్టు అభిప్రాయ పడింది. ‘కరోనా సమయంలో ఎంతో ఉత్సాహంగా ఇక్కడకు వచ్చాను. ఆరు రోజులు క్వారంటైన్లో ఉండి 5 కరోనా టెస్టులు చేయించుకున్నా. కానీ షార్ట్ రన్ నన్ను తీవ్రంగా బాధించింది. సాంకేతికత అందుబాటులో ఉండి కూడా ఉపయోగించుకోవడంలో అర్థమేముంది. బీసీసీఐ నిబంధనలు మార్చాలి’ అంటూ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా వ్యాఖ్యానించింది. నిబంధనలు ఏం చెబుతున్నాయి... టీవీ రీప్లే చూడగా జోర్డాన్ పరుగు పూర్తి చేసినట్లు కనిపించింది. దాంతో అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మూడో అంపైర్ సహాయం తీసుకోవాల్సిందని మాజీ క్రికెటర్లంతా వ్యాఖ్యానించారు. అయితే ఐసీసీ, ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఆటగాడు అవుటైన సమయంలో లేదా బౌండరీ గురించి ఏదైనా సందేహం ఉంటే తప్ప ఇతర అంశాల్లో మూడో అంపైర్‌ను ఫీల్డ్ అంపైర్ సంప్రదించాల్సిన అవసరం లేదు. పైగా ఫీల్డ్ అంపైర్ అడగకుండా థర్డ్ అంపైర్ జోక్యం చేసుకోరాదు. ఇలా చూస్తే మూడో అంపైర్ ద్వారా షార్ట్ రన్ తేల్చాలన్న మాటే ఉదయించదు. అంపైర్‌ను తప్పు పట్టవచ్చా... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ స్టొయినిస్‌కు కాదు అంపైర్ నితిన్ మీనన్‌కు ఇవ్వాల్సింది’ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ వ్యంగ్య వ్యాఖ్యతో అంపైర్‌పై విరుచుకు పడ్డాడు. నితిన్ తన అంపైరింగ్ విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నానని అనిపించుకునే విధంగా కొంత అత్యుత్సాహం చూపిన మాట వాస్తవమే కానీ... అంపైర్లు తప్పులు చేయడం ఇదే మొదటిసారి కాదు. మానవమాత్రులు కాబట్టి పొరపాట్లు చేయడం సహజం. ఎంత బాగా పని చేసినా వారు చాలా సందర్భాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మ్యాచ్ తర్వాత పంజాబ్ కెప్టెన్ లోకేశ్ రాహుల్ కూడా అంపైర్‌తో వాదించడం కనిపించింది. గత కొన్నేళ్లుగా నితిన్ మీనన్ రికార్డు చాలా బాగుంది. అందుకే 36 ఏళ్ల వయసులోనే ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో కూడా అవకాశం దక్కింది. నిజానికి మీనన్ నిలబడిన కోణం నుంచి చూస్తే అది షార్ట్ రన్‌గా కనిపించింది. సాధారణంగా స్క్వేర్ లెగ్ అంపైర్లు లైన్ నుంచి నేరుగా నిలబడతారు. కానీ నోబాల్స్‌ను కూడా థర్డ్ అంపైర్లే చూస్తున్న నేపథ్యంలో టీవీ కెమెరాలకు అడ్డు రాకుండా ప్రసారకర్తలే అంపైర్‌ను కాస్త పక్కగా నిలబడమని చెప్పినట్లు సమాచారం. చివరగా... మ్యాచ్‌లో ఫలితం సూపర్ ఓవర్‌కు వరకు వెళ్లకుండా గెలుపు తేడా ఏ 30 పరుగులో, 5 వికెట్లో ఉంటే ఇంత రచ్చ జరగకపోయేదనేది వాస్తవం. ఈ ఘటనపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏ ప్రమాణాల ప్రకారం చూసుకున్నా 3 బంతుల్లో 1 పరుగు చేయడం ఎంతో సులభమని, అది చేయకుండా పంజాబ్ అనవసర విమర్శలకు దిగిందని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. -
‘ఎలైట్ ప్యానెల్’లో నితిన్
దుబాయ్: భారత అంపైర్ నితిన్ నరేంద్ర మేనన్‌కు అరుదైన అవకాశం లభించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అగ్రశ్రేణి అంపైర్ల జాబితా అయిన ‘ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్స్’లో ఆయనకు చోటు దక్కింది. భారత్ నుంచి గతంలో ఇద్దరు మాత్రమే ఎలైట్ ప్యానెల్ అంపైర్లుగా వ్యవహరించారు. శ్రీనివాసన్ వెంకట్రాఘవన్ (2002–04), సుందరం రవి (2010–19) గతంలో ఈ బాధ్యతను నిర్వర్తించారు. ఇంగ్లండ్‌కు చెందిన నైజేల్ లాంజ్ స్థానంలో 36 ఏళ్ల నితిన్ ప్యానెల్లోకి వచ్చారు. ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అలార్డిస్, రంజన్ మదుగలే, డేవిడ్ బూన్, సంజయ్ మంజ్రేకర్‌ల బృందం నితిన్‌ను ఎంపిక చేసింది. 12 మంది సభ్యుల ఎలైట్ ప్యానెల్ అంపైర్ల జాబితాలో ఇప్పుడు అందరికంటే పిన్న వయస్కుడు నితిన్ కావడం విశేషం. ఇండోర్‌కు చెందిన నితిన్ మధ్యప్రదేశ్ జట్టు తరఫున 2 దేశవాళీ వన్డేలు ఆడారు. 2017లో అంతర్జాతీయ అంపైర్‌గా కెరీర్ మొదలు పెట్టారు. తన మూడేళ్ల అంతర్జాతీయ అంపైరింగ్ కెరీర్లో ఆయన 3 టెస్టులు, 24 వన్డేలు, 16 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించారు. 10 మహిళల టి20 మ్యాచ్‌లకు కూడా పని చేశారు. ఏడాది కాలంగా ఆయన పనితీరు చాలా బాగుండటాన్ని ఐసీసీ గుర్తించింది. మరోవైపు అందరికంటే ఎక్కువగా 36.2 శాతం తప్పుడు నిర్ణయాలు ప్రకటించిన నైజేల్ లాంజ్ చోటు కోల్పోవాల్సి వచ్చింది. తనకు ఈ అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన నితిన్... మరింత సమర్థంగా పని చేసి అంపైరింగ్‌పై విశ్వాసం పెరిగేలా చేస్తానని అన్నారు. -
సచిన్ ఔట్ నిర్ణయాలు తప్పిదమే
న్యూయార్క్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విషయంలో తను రెండుసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు మాజీ అంపైర్ స్టీవ్ బక్నర్ అంగీకరించారు. ఈ విండీస్ అంపైర్ రిటైరైన 11 ఏళ్ల తర్వాత తన పొరపాటును ఒప్పుకోవడం గమనార్హం. భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా ఓ సారి సచిన్ ఎదుర్కొన్న బంతి ఎత్తులో వెళ్తున్నప్పటికీ ఎల్బీగా ఇచ్చానని, అలాగే భారత్‌లోని ఈడెన్ గార్డెన్స్‌లో అతని బ్యాట్‌కు బంతి తగలకపోయినా క్యాచ్ ఔట్ ఇచ్చానని చెప్పారు. అప్పుడు స్టేడియంలో ఉన్న లక్ష మంది తన తప్పుడు నిర్ణయంపై గగ్గోలు పెట్టారని ఆయన నాటి ఘటనను వివరించారు. ఈ రెండు మానవ తప్పిదాలని బక్నర్ చెప్పుకొచ్చారు. 2009లో రిటైరయ్యాక బక్నర్ న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. ప్రపంచ క్రికెట్లో సచిన్, లారా మేటి బ్యాట్స్‌మెన్ అని కితాబిచ్చారు. -
రెండు వైపుల నుంచి ఒకరే అంపైరింగ్!
రంజీ ఫైనల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో సి.షంషుద్దీన్‌కు దెబ్బ తగిలింది. వికెట్ తీసిన ఆనందంలో బెంగాల్ ఫీల్డర్ ఒకరు బంతిని విసరగా దీనిని గమనించని షంషుద్దీన్ పొత్తి కడుపునకు బలంగా తగిలింది. దాంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న అంపైర్‌ను సౌరాష్ట్ర క్రికెట్ సంఘం అధికారులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఒక సెషన్ పాటు మరో ఆన్‌ఫీల్డ్ అంపైర్ కేఎన్ అనంతపద్మనాభన్ ప్రతీ ఓవర్‌కు మారుతూ రెండు ఎండ్ల నుంచి అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. స్థానిక అంపైర్ పీయూష్ కక్కడ్ స్క్వేర్ లెగ్ అంపైర్‌గా నిలబడిపోయారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఈ మ్యాచ్‌కు తటస్థ అంపైర్లు ఉండాలి. పీయూష్ సౌరాష్ట్రకు చెందినవాడు కావడంతో మెయిన్ ఎండ్ నుంచి అంపైరింగ్ చేయనివ్వలేదు. థర్డ్ అంపైర్ రవికి మాత్రమే డీఆర్ఎస్ విధానంపై అవగాహన ఉండటంతో ఆయనా మైదానంలోకి రాలేదు. చివరకు షంషుద్దీన్‌ను టీవీ అంపైర్ స్థానంలో కూర్చోబెట్టి రవి ఆ తర్వాత అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించారు. రంజీ ఫైనల్ నిర్వహణలో ఈ తరహా బీసీసీఐ వైఫల్యంపై విమర్శలు వచ్చాయి. ముంబై నుంచి రానున్న యశ్వంత్ బర్డే నేటినుంచి ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరిస్తారు. -
‘ఇదెక్కడి ఔట్.. నేనెప్పుడూ చూడలేదు’
సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ రెడ్ బాల్ క్రికెట్లో తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో పరుగుల వరద పారించిన ఈ ఆసీస్ మాజీ సారథి.. తాజాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ తన సత్తా చాటుతున్నాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూసౌత్‌వేల్స్ బ్యాట్స్‌మన్ స్మిత్ సెంచరీ సాధించాడు. ఇది అతడికి 42వది కావడం విశేషం. కాగా ఈ మ్యాచ్‌లో జిడ్డు బ్యాటింగ్ చేసిన స్మిత్ తన కెరీర్లో అత్యంత నెమ్మదైన సెంచరీ(290 బంతుల్లో) చేసిన చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో యాషెస్ సిరీస్‌లో 261 బంతుల్లో సెంచరీ చేసి ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించిన విషయం తెలిసిందే. కాగా వెస్ట్రన్ ఆసీస్‌పై సెంచరీతో ఆకట్టుకున్న స్మిత్ అనూహ్యంగా అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలర్ మార్కస్ స్టోయినిస్ వేసిన బంతిని స్మిత్ అప్పర్ కట్ అడబోయాడు. అయితే స్మిత్ అంచనా తప్పడంతో షాట్ ఫెయిల్ అయి బంతి బ్యాట్‌కు తగలకుండానే వికెట్ల వెనకాలే ఉన్న కీపర్ జోష్ ఇంగ్లిస్ చేతుల్లోకి వెళ్లింది. అయితే వికెట్ కీపర్ అవుట్ కోసం అప్పీల్ చేశాడు. అనూహ్యంగా అంపైర్ స్మిత్ అవుటని ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన స్మిత్ భారంగా మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ‘ఇదెక్కడి ఔట్.. నేనెప్పుడూ చూడలేదు’అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘స్మిత్ బ్యాటింగ్‌తో నిద్ర పోయిన అంపైర్‌కు అప్పుడే మెలుకువ వచ్చినట్టుంది’అంటూ మరికొంత మంది సరదాగా కామెంట్ చేస్తున్నారు. కాగా, స్మిత్ ఈ ఏడాది ఇప్పటివరకు నాలుగు టెస్టుల్లో 774 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో నిషేధానికి గురైన స్మిత్ యాషెస్ సిరీస్‌తో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. NEVER tell Steve Smith he has to stop batting! A bizarre dismissal brings the right-hander's 42nd first-class century to an end #SheffieldShield pic.twitter.com/KNEDpjtiFp — cricket.com.au (@cricketcomau) November 12, 2019 -
నోబాల్ అంపైర్...
ముంబై: ఐపీఎల్–2019లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ గుర్తుందా! ముంబైతో మ్యాచ్‌లో చివరి బంతికి విజయం కోసం బెంగళూరు 7 పరుగులు చేయాల్సి ఉండగా, మలింగ వేసిన బంతికి పరుగు రాలేదు. అయితే టీవీ రీప్లేలో అది ‘నోబాల్’గా తేలింది. దానిని అంపైర్లు సరిగా గమనించి ఉంటే అదనపు పరుగు రావడంతో పాటు సిక్సర్‌తో తాము గెలిచే అవకాశం ఉండేదని భావించిన కోహ్లి ‘అంపైర్లు కళ్లు తెరచి పని చేయాలి’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. రాజస్తాన్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో అంపైర్లు ముందుగా ‘నోబాల్’ ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తీసుకోవడంతో చెన్నై కెప్టెన్ ధోని ఆగ్రహంతో మైదానంలోకి దూసుకొచ్చి వాదనకు దిగాడు. ఇలాంటి ఘటనలను నివారించేందుకు ఐపీఎల్ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. 2020 ఐపీఎల్లో తొలిసారి ‘నోబాల్ అంపైర్’ అంటూ ప్రత్యేకంగా నియమించనున్నారు. ఇద్దరు ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్, రిజర్వ్ అంపైర్లకు ఇది అదనం. కేవలం మ్యాచ్‌లో నోబాల్స్‌నే ప్రత్యేకంగా పరిశీలించడమే అంపైర్ పని. ‘ఈ అంపైరింగ్ గురించి చెబుతుంటే కొంత వింత గా అనిపిస్తూ ఉండవచ్చు. కానీ గవర్నింగ్ కౌన్సిల్ తొలి సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. మేం టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని భావిస్తున్నాం. కాబట్టి నోబాల్స్ పొరపాట్లనే ప్రత్యేకంగా గుర్తించేందుకు ఒక అంపైర్ ఉంటే మంచిదే. రాబోయే ముస్తాక్ అలీ దేశవాళీ టి20 టోర్నీలో దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించే అవకాశం ఉంది’ అని కౌన్సిల్ సభ్యుడొకరు వెల్లడించారు. మరోవైపు మ్యాచ్‌లో ‘పవర్ ప్లేయర్’ను తీసుకొచ్చే నిబంధనను ప్రస్తుతానికి పక్కన పెట్టాలని కూడా కౌన్సిల్ నిర్ణయించింది. ఈ అంశంపై ఇప్పటి వరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అనుమతి లభించలేదని తెలిసింది. ఎక్కువ మంది సీనియర్లు ఉన్న ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి చెందిన వ్యక్తి తమ అనుకూలత కోసమే ఈ కొత్త తరహా ప్రతిపాదన చేశాడని సమాచారం. డిసెంబర్ 19న వేలం... ఐపీఎల్–2020 కోసం జరిగే ఆటగాళ్ల వేలంను డిసెంబర్ 19న కోల్‌కతాలో నిర్వహించాలని గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రతీ సారి వేలం బెంగళూరులోనే జరిగింది. 2019తో పోలిస్తే ఈసారి ఒక్కో ఫ్రాంచైజీ మరో రూ. 3 కోట్లు అదనంగా ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తూ గరిష్టంగా రూ. 85 కోట్లకు పెంచారు. -
పవర్ ప్లేయర్ కాదు.. ఎక్స్ట్రా అంపైర్!
సాక్షి, ముంబై : అన్నీ కుదిరితే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 13 కొత్త పుంతలు తొక్కనుంది. దీనిలో భాగంగా పలు ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ‘పవర్ ప్లేయర్’ అనే కొత్త ప్రతిపాదన గవర్నింగ్ కౌన్సిల్ ముందుకు వచ్చింది. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తుది నిర్ణయమని బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు. అయితే పవర్ ప్లేయర్‌పై చర్చ జరుగుతుండగానే మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గత ఐపీఎల్లో అంపైర్ల తప్పుడు నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా వారిపై పని ఒత్తిడిని తగ్గించే ఉద్దేశంతో మైదానంలో మరో ఎక్స్ట్రా అంపైర్‌ను ఉంచాలని గవర్నింగ్ కౌన్సిల్ భావిస్తోంది. అయితే ఈ ఎక్స్ట్రా అంపైర్ కేవలం ‘నో బాల్’ చెక్ చేయడానికి మాత్రమేనని తెలుస్తోంది. అయితే దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ప్రయోగాత్మకంగా ముస్తాక్ అలీ ట్రోఫీలో పరిశీలించాలని బీసీసీఐ భావిస్తోంది. ఫ్రంట్ ఫుట్, హైట్ నోబాల్ నిర్ణయాలను మాత్రమే తీసుకునే అధికారం ఎక్స్ట్రా అంపైర్‌కు ఉంటుందని బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నామని, దీనిపై అధ్యక్షుడు గంగూలీ కూడా సుముఖంగా ఉన్నాడని ఆ అధికారి తెలిపారు. అయితే వచ్చే ఐపీఎల్‌కు ఎక్కువ సమయం లేనందున ‘పవర్ ప్లేయర్’ను ఈసీజన్లో అమలు చేయడం కుదరదని గవర్నింగ్ కౌన్సిల్ తేల్చిచెప్పింది. అంతేకాకుండా పవర్ ప్లేయర్ నిబంధనకు గంగూలీ ఆమోదముద్ర వేయలేదని తెలుస్తోంది. దీంతో ఈ ప్రతిపాదనను తరువాతి ఐపీఎల్‌కు వాయిదా పడింది. ఇక గత సీజన్లో ముంబై ఇండియన్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా చివరి బంతిని లసిత్ మలింగ నోబాల్ వేసనప్పటికీ అంపైర్ గుర్తించలేదు. అంపైర్ తప్పుడు నిర్ణయంతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఆ బంతిని అంపైర్ నోబాల్ ప్రకటించి ఉంటే ఫలితం ఆర్సీబీకి అనుకూలంగా ఉండేది. అయితే ఇదే విషయాన్ని మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లి అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
క్రికెట్ మ్యాచ్ మధ్యలో అంపైర్‌కు గుండెపోటు
కరాచీ : ఓ క్రికెట్ మ్యాచ్ మధ్యలో అంపైర్‌కు గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ఈ ఘటన పాకిస్తాన్లో జరుగుతున్న లోకల్ క్రికెట్ టోర్నమెంట్లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 56 ఏళ్ల నసీమ్ షేక్ కరాచీలోని టీఎంసీ గ్రౌండ్లో జరుగుతున్న లాయర్స్ టోర్నమెంట్‌కు అంపైర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే మ్యాచ్ మధ్యలో అతనికి గుండెపోటు రావడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్నవారు నసీమ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, వృత్తి రీత్యా నసీమ్ మాంసం వ్యాపారం నిర్వహిస్తున్నప్పటికీ.. క్రికెట్‌పై ఉన్న అమితమైన ప్రేమ అతన్ని అర్హత కలిగిన అంపైర్‌గా మారేలా చేసింది. -
గాయపడ్డ అంపైర్ మృతి
లండన్: బంతి తగిలి తీవ్రంగా గాయపడిన అంపైర్ జాన్ విలియమ్స్(80) నెల రోజులకు పైగా మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచారు. నెలరోజులకుపైగా ఆస్పత్రిలో చికిత్స పొందిన విలియమ్స్ గురువారం మృతి చెందారు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో భాగంగా జులై 13న పెమ్బ్రోక్షైర్ వర్సెస్ నార్బెత్ జట్ల మధ్య కౌంటీ క్రికెట్ జరిగింది. ఆ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన విలియమ్స్ తలకు బంతి తగలడంతో తీవ్ర గాయమైంది. గాయపడిన వెంటనే విలియమ్స్‌ను కార్డిఫ్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా కోమాలోకి వెళ్లాడు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హావర్ఫోర్డ్వెస్ట్లోని మరో ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. పెమ్బ్రోక్షైర్ క్రికెట్ క్లబ్ గురువారం ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపింది. ‘అంపైర్ జాన్ విలియమ్స్ గురించి చేదు వార్త వినాల్సివచ్చింది. ఈ ఉదయం ఆయన ఆస్పత్రిలో మృతిచెందారు’ అని ట్వీట్ చేసింది. -
ఆట ఆడిస్తున్నారు!
అన్నింట్లో సగం అంటారు కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధం. సగ భాగం కాదు కదా కనీసం కాలు మోపడానికి కూడా చోటు ఇవ్వడం లేదు. అవకాశాల్లోనే కాదు ఆటల్లోనూ ఆడవాళ్లపై వివక్ష కొనసాగుతోంది. ప్రతి క్రీడలోనూ మహిళల ప్రవేశానికే ఏళ్లకు ఏళ్లు పట్టింది. కొన్నిట్లో అయితే ఇప్పటికీ మహిళలకు ఎంట్రీ లేదు. అలాంటి సరిహద్దులను దాటి ఇద్దరు మహిళామణులు పురుషుల ఆటల్లో నిర్ణయాధికారం చెలాయించే సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఇక ’మేము చెప్పినట్టు కూడా వినండి’ అంటూ నినదిస్తూ ఆడటమే కాదు ఆడించడమూ తెలుసంటున్నారు. ‘‘నా జీవితంలో ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు’’.. పురుషుల క్రికెట్ మ్యాచ్‌లో అంపైరింగ్ చేసిన తర్వాత క్లయిర్ పొలొసాక్ స్పందన ఇది. ఆస్ట్రేలియాకు చెందిన ఆమె పురుషుల అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ఏప్రిల్ 27న నమీబియా, ఒమన్ పురుషుల క్రికెట్ జట్ల మధ్య జరిగిన ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్–2 ఫైనల్ మ్యాచ్ తర్వాత హాయిగా నిద్రపోయినట్టు క్లయిర్ చెప్పారు. తన అంపైరింగ్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ మాట అన్నారామె. ఈ మ్యాచ్‌కే ఆమె అంపైర్ గా వ్యవహరించి సరికొత్త చరిత్రకు మైలురాయిలా నిలిచారు. ‘‘మైదానంలో ఒక్కోసారి ఆటగాళ్ల భావోద్వేగాలు అదుపు తప్పుతుంటాయి. సంయమనంతో వ్యవహరించి సర్దిచెప్పాల్సిన బాధ్యత అంపైర్లపై ఉంటుంది. కానీ నేను అంపైరింగ్ చేసిన పురుషుల మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో అందరూ బాగా సహకరించారు. ఆటగాళ్ల ప్రవర్తనతో నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఎల్బీడబ్ల్యూ ఔట్ల కోసం బౌలర్లు బాగా ఒత్తిడి చేస్తుంటారు. కచ్చితంగా ఔట్ అని నమ్మితేనే ఔట్ ఇస్తా. ఈ రోజు మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాను’’అని క్లయిర్ సంతోషం వ్యక్తం చేశారు. పురుషుల మ్యాచ్‌కు అంపైరింగ్ చేయడం ఆమెకు ఇదే మొదటిసారి కాదు. 31 ఏళ్ల క్లయిర్ పేరిట మరో రికార్డు కూడా ఉంది. దేశవాళీల్లోనూ పురుషుల క్రికెట్ మ్యాచ్‌కు అంపైరింగ్ చేసిన తొలి మహిళగా రెండేళ్ల క్రితమే ఆమె గుర్తింపు పొందారు. 2017లో ఆస్ట్రేలియాలో లిస్ట్ ’ఎ’ మ్యాచ్‌లో అంపైర్‌గా వ్యవహరించి ఈ రికార్డు తన పేరిట లిఖించుకున్నారు. మహిళా క్రికెట్లోనూ తనదైన ముద్ర వేసిన క్లెయిర్ గత రెండున్నరేళ్లలో 15 వన్డే మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. 2017 ప్రపంచకప్ మ్యాచ్‌లు, 2018 టి20 వరల్డ్‌కప్ సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లు ఆమె అంపైరింగ్ చేసిన వాటిలో ఉన్నాయి. ‘డబుల్’ రికార్డులోనూ భాగస్వామ్యం! ఆస్ట్రేలియా గడ్డపై ఇద్దరు మహిళలు ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించిన చరిత్రాత్మక సందర్భంలోనూ క్లయిర్ పొలొసాక్ భాగస్వామిగా ఉన్నారు. తన దేశానికే చెందిన మరో అంపైర్ ఎలోసి షెరిడాన్‌తో కలిసి 2018 డిసెంబర్ 23న ఈ ఘనత సాధించారు. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా అడిలైడ్ స్ట్రయికర్స్, మెల్బోర్న్ స్టార్ జట్ల మధ్య అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ అంపైరింగ్ చేసి ఔరా! అనిపించారు. ‘‘ఇది మరో చారిత్రక ఘట్టం. ఆస్ట్రేలియా క్రికెట్లో మహిళలు, బాలికలను ప్రోత్సహించే దిశగా ఇలాంటి ప్రయత్నాలు కొనసాగుతుండాలి. క్లయిర్, షెరిడాన్ ఎంతో కష్టపడి స్వశక్తితో అగ్రశ్రేణి మహిళా అంపైర్లుగా ఎదిగారు. వారు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా’’ అని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కెవిన్ రాబర్ట్స్ ఆకాంక్షించారు. సాహోరే.. స్టెఫాని! క్లయిర్ పొలొసాక్ సరికొత్త చరిత్ర సృష్టించిన మరుసటి రోజే ఐరోపాలో స్టెఫాని ఫ్రాపర్ట్ పతాక శీర్షికలకు ఎక్కారు. పురుషుల ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ప్రధాన రెఫరీగా వ్యవహరించిన రెండో యూరోపియన్ మహిళగా ఘనత సాధించారు. ఏప్రిల్ 29న అమియన్స్ స్పోర్టింగ్ క్లబ్, రేసింగ్ క్లబ్ స్ట్రాస్బర్స్ జట్ల మధ్య జరిగిన ఫ్రెంచ్ లీగ్ ఫస్ట్ డివిజన్ మ్యాచ్‌లో ఆమె రిఫెరీగా మైదానంలో ఆటగాళ్లతో పాటు పరిగెడుతూ నిర్ణయాధికారం చెలాయించారు. ఫలితం తేలకుండా(0–0) ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు టీమ్‌లకు చెందిన ఇద్దరు ఆటగాళ్లను స్టెఫాని హెచ్చరించారు. ఇద్దరు స్ట్రాస్బర్స్ ఆటగాళ్లకు ఎల్లో కార్డులు చూపించారు. 35 ఏళ్ల స్టెఫాని ఇప్పటికే సెకండ్ డివిజన్ మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించారు. జూన్–జూలైలో జరగనున్న మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మ్యాచ్ రిఫెరీగా ఉండనున్నారు. ‘‘నా కష్టానికి తగిన గుర్తింపు లభించింది. పురుషుల లీగ్ –1 మ్యాచ్‌కు రిఫెరీగా ఉండే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మహిళ అన్న ఒక్క కారణంతోనే నాకు ఈ అవకాశం ఇచ్చారని అనుకోవడం లేద’ని స్టెఫాని అన్నారు. లీగ్ –1 మ్యాచ్‌కు స్టెఫానిని రిఫెరీగా నియమించడం పట్ల ఫుట్‌బాల్ అభిమానులు, ఫెమినిస్టులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. మరింతమంది మహిళలు ఈ రంగంలోకి రావడానికి స్టెఫాని స్ఫూర్తిగా నిలిచారని కితాబిస్తున్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను స్టెఫాని సమర్థవంతంగా నిర్వహించారని, ఆమె ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొనలేదని రేసింగ్ క్లబ్ స్ట్రాస్బర్స్ టీమ్ మేనేజర్ థీరి లారే కొనియాడారు. లీగ్ –1 మ్యాచ్‌కు రిఫెరీ వ్యవహరించడానికి స్టెఫానికి అన్ని అర్హతలు ఉన్నాయని, ఆమె పనితీరు చాలా బాగుందని అభినందించారు. పురుషుల ఫుట్‌బాల్ మ్యాచ్‌లో రిఫెరీగా వ్యవహరించిన తొలి మహిళ రికార్డు జర్మనీకి చెందిన బిబియనా స్టీన్హాస్ పేరిట ఉంది. 2017లో హెర్తా బెర్లిన్, వెర్డర్ బ్రెమెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ద్వారా ఆమె ఈ ఘనత దక్కించుకున్నారు. బిబియనా బాటలో స్టెఫాని కూడా నడిచి పురుషుల మ్యాచ్‌లో మెయిన్ రెఫరీగా వ్యవహరించిన తొలి ఫ్రెంచ్ మహిళగా ఖ్యాతికెక్కారు. మనదేశ పురుషుల క్రీడల్లోనూ మహిళలకు నిర్ణయాధికారం దక్కడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. - పోడూరి నాగ శ్రీనివాసరావు సాక్షి వెబ్ డెస్క్ -
కోహ్లితో వాగ్వాదం..డోర్‌ను ధ్వంసం చేసిన అంపైర్!
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లితో వాగ్వాదానికి దిగిన ఇంగ్లిష్ అంపైర్ నిగెల్ లాంగ్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)విచారణను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక నోబాల్ వ్యవహారంలో కోహ్లితో వాగ్వాదానికి దిగిన తర్వాత స్టేడియంలోని ఓ గది తలుపును నిగెల్ ధ్వంసం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం నాటి మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ ఉమేశ్‌యాదవ్ వేసిన ఓ బంతిని నిగెల్ నోబాల్‌గా ప్రకటించాడు. అయితే రీప్లేలో అది సరైన బంతిగా తేలడంతో కోహ్లికి, అంపైర్‌కి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సహనం కోల్పోయిన నిగేల్ ఇన్నింగ్స్ విరామం సమయంలో అంపైర్ గది తలుపును పగలగొట్టాడు. ఈ ఘటనపై అంపైర్ విచారణ ఎదుర్కోవాల్సి ఉందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. అయితే ఈ కారణంగా మే 12న జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో అంపైరింగ్ బాధ్యతల నుంచి అతడిని బీసీసీఐ తొలగించకపోవచ్చని సమాచారం. అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నిగెల్ లాంగ్.. మే 30 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచకప్‌లో కూడా అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. -
పురుషుల మ్యాచ్‌కు తొలిసారి మహిళా అంపైర్
పురుషుల క్రికెట్ మ్యాచ్‌కు అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళగా ఆస్ట్రేలియాకు చెందిన క్లైర్ పొలొసక్ అరుదైన ఘనత సాధించింది. శనివారం నమీబియా, ఒమన్ మధ్య జరిగిన ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్–2 మ్యాచ్‌కు 31 ఏళ్ల క్లైర్ అంపైర్‌గా వ్యవహరించింది. క్లైర్ గత రెండున్నరేళ్లలో మహిళల క్రికెట్లో 15 వన్డేలకు అంపైరింగ్ చేసింది. వీటిలో 2017 ప్రపంచ కప్ మ్యాచ్‌లు, గతేడాది జరిగిన టి20 ప్రపంచ కప్ సెమీస్ వంటి కీలకమైనవి ఉన్నాయి. దేశవాళీల్లోనూ పురుషుల మ్యాచ్ (2017లో ఆస్ట్రేలియాలో లిస్ట్ ‘ఎ’)కు అంపైరింగ్ చేసిన తొలి మహిళగా క్లైర్ ఘనతకెక్కింది. దీనిపై ఆమె స్పందిస్తూ... ‘మహిళలు అంపైర్లుగా చేయకూడదని ఏమీ లేదు. మహిళా అంపైర్ల వ్యవస్థను ప్రోత్సహించాలి. చైతన్యం కల్పిస్తే... అడ్డంకులన్నీ దాటుకుని మరింతమంది అమ్మాయిలు ఈ రంగంలోకి వస్తారు’ అని పేర్కొంది. -
వేలెత్తి చూపేలా...!
వినడానికి విచిత్రంగా... చెప్పుకోవడానికి ఆశ్చర్యకరంగా అనిపించే ఘటనలు ఇటీవల క్రికెట్లో తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటివి ఆటగాళ్ల మధ్యనో... మైదానంలోని ప్రేక్షకుల కారణంగానో అయితే పెద్దగా ప్రాధాన్యం ఉండకపోయేది. కానీ, ఆటకు ఆయువుపట్టయిన అంపైరింగ్ వ్యవస్థలో తలెత్తుతుండటంతో చర్చనీయాంశం అవుతున్నాయి. మ్యాచ్ ఫలితంపై అంతోఇంతో ప్రభావం చూపుతూనే... ఒక్కోసారి వివాదానికి సైతం దారితీస్తూ ‘జెంటిల్మన్’ గేమ్ స్ఫూర్తిని సూటిగా ప్రశ్నిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వివిధ జట్ల మధ్య జరిగిన గత ఐదారు సిరీస్‌లను పరిశీలిస్తే అంపైరింగ్ పొర‘పాట్లు’ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది. సాక్షి క్రీడా విభాగం ఏదైనా అనుమానం వస్తే సంప్రదించేందుకు సహచర అంపైర్ ఉన్నాడు... అప్పటికీ సంశయం ఉంటే నివృత్తికి థర్డ్ అంపైర్‌కు నివేదించే వీలుంది... ఆపై తేల్చేందుకు టెక్నాలజీ తోడుంది! ఇన్ని పటిష్ట ఏర్పాట్లు చేసుకున్నా ఇటీవల అంపైరింగ్‌లో పదేపదే పొరపాట్లు దొర్లుతున్నాయి. ఇలాంటివి ఒకటీ, అరా అయితే చూసీచూడనట్లు వదిలేయొచ్చు. అప్పుడప్పుడు అంటే మానవ తప్పిదమని సర్దిచెప్పుకోవచ్చు. కానీ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సిరీస్‌లలో తలెత్తుతుండటంతో ప్రమాణాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఓ దశలో సహనం కోల్పోయిన ఆటగాళ్లు నిలదీసే వరకు వెళ్తున్నాయి. ఈ ఆవేశంలో అనుకోకుండా హద్దు మీరితే మొదట చర్యలకు గురయ్యేది క్రికెటర్లే కావడం గమనార్హం. విచక్షణతో వదిలేశారు... ప్రతి అంశానికీ టెక్నాలజీ వైపు చూస్తున్న ఈ రోజుల్లోనూ అంపైరింగ్ దోషాలంటే అవి ఆటగాళ్ల పాలిట గ్రహపాట్లుగానే భావించాలి. ఓవైపు టెస్టుల్లో పెద్దగా పరిగణనలోకి తీసుకోకుండా వదిలేయాల్సిన ‘స్లో ఓవర్ రేట్’కే మ్యాచ్‌లకు మ్యాచ్‌లు నిషేధం విధిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)... మైదానంలో అదుపు తప్పిన ఆటగాళ్లను అన్నిసార్లు ఊరకనే వదిలేస్తుందని అనుకోలేం. ఉదాహరణకు డిసెంబరులో బంగ్లాదేశ్‌పై మూడో టి20లో ఒషేన్ థామస్ వేసిన ఓ బంతిని ‘నో బాల్’గా ప్రకటించడంపై వెస్టిండీస్ కెప్టెన్ కార్లొస్ బ్రాత్‌వైట్ అంపైర్ తన్వీర్ అహ్మద్‌తో తీవ్రమైన వాదనకు దిగాడు. ఈ వివాదం కారణంగా మ్యాచ్ 8 నిమిషాలు ఆగింది. వాస్తవానికి థామస్‌ది ‘నో బాల్’ కాదు. దీంతో బ్రాత్‌వైట్‌పై చర్యలు తీసుకోలేదు. మరోవైపు ఇదే సిరీస్ రెండో టి20లో స్లో ఓవర్ రేట్‌కు బ్రాత్‌వైట్ మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత పడటం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. అక్కడ... ఇక్కడ... ఎక్కడైనా! సెప్టెంబరులో జరిగిన ఆసియా కప్‌లో భారత్–అఫ్గానిస్తాన్ వన్డేలో, భారత్–న్యూజిలాండ్ రెండో టి20లో, ఇంగ్లండ్–వెస్టిండీస్ టెస్టులో, ప్రస్తుత శ్రీలంక–దక్షిణాఫ్రికా టెస్టులో అంపైరింగ్ తప్పటడుగులు సాధారణమయ్యాయి. కొత్తవారంటే తడబడ్డారని అనుకున్నా, వందలకొద్దీ మ్యాచ్‌లను పర్యవేక్షించిన అలీమ్ దార్ వంటి సీనియర్ల నిర్ణయాలు సైతం వేలెత్తిచూపేలా చేస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో చూపాల్సిన ‘సమయ’స్ఫూర్తి వారిలో కొరవడుతోంది. దీంతో పని భారం తగ్గింపు, నిర్ణయాల్లో కచ్చితత్వం కోసమంటూ తీసుకొచ్చిన సాంకేతికతకూ విలువ లేకుండా పోతోంది. ‘అంపైరింగ్ నిర్ణయాలను ప్రశ్నించి లేనిపోని తలనొప్పులు తెచ్చుకుని మ్యాచ్ నిషేధాలను ఎదుర్కోవడం ఇష్టం లేదంటూ’ ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్‌పై మ్యాచ్‌కు భారత కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని వ్యాఖ్యానించాడు. ధోని మాటల అంతరార్థం... అంపైర్లు సరైన నిర్ణయాలు తీసుకోలేదని అందరికీ తెలిసిపోయింది. సాఫ్ట్ సిగ్నల్ ఎత్తివేయండి... డీఆర్ఎస్లోనూ ఏమీ తేలని పక్షంలో... అంపైర్ తొలుత ప్రకటించిన నిర్ణయానికే కట్టుబడి ఉండే సాఫ్ట్ సిగ్నల్‌ను ఎత్తివేయాలని క్రికెట్ ప్రముఖుల నుంచి బలమైన డిమాండ్ వస్తోంది. కొన్నిసార్లు మైదానంలో ఆటగాళ్ల సంబరాలకు ప్రభావితులై అంపైర్లు నిర్ణయాలు తీసుకుంటున్నారని, అలాంటపుడు తుది నిర్ణయాన్ని వారికే ఎలా వదిలేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇవీ... అంపైరాంగ్ ఘటనలు! ఇంగ్లండ్–వెస్టిండీస్ మూడో టెస్టు తొలి రోజు అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్ అయిన బెన్ స్టోక్స్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. అయితే అంపైర్ పరిశీలించి జోసెఫ్ ‘నో బాల్’ వేసినట్లు తేల్చి వెనక్కుపిల్చాడు. కానీ, అప్పటికే బెయిర్‌స్టో గ్రౌండ్లోకి వచ్చేశాడు. 2017 ఏప్రిల్ నుంచి మారిన రూల్ నంబర్ 31.7 ప్రకారం... ఔట్‌గా వెళ్లిపోయిన బ్యాట్స్‌మన్‌ను మరుసటి బంతి పడేవరకు వెనక్కు పిలిచే అధికారం అంపైర్లకు ఉంది. దీంతో స్టోక్స్‌ను మళ్లీ బ్యాటింగ్‌కు అనుమతించారు. ►భారత్‌పై రెండో టి20లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ డరైల్ మిచెల్ ఎల్బీడబ్ల్యూ వివాదం రేపింది. దీనిపై నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్)కి వెళ్లగా హాట్‌స్పాట్‌లో బంతి బ్యాట్‌కు తగిలినట్లు స్పష్టమైంది. అయితే, బంతి ట్రాకింగ్‌లో మూడు ఎరుపు గుర్తులు కనిపించడంతో మూడో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ►డిసెంబరులో బంగ్లాదేశ్–వెస్టిండీస్ టి20లో ఒషేన్ థామస్ కాలు క్రీజ్‌కు తగులుతున్నా అంపైర్ తన్వీర్ అహ్మద్ నోబాల్ ఇచ్చాడు. పెద్ద వివాదం రేగడంతో తాను అంతర్జాతీయ క్రికెట్‌కు కొత్తవాడినని, పొరపాటు చేశానని అతడు అంగీకరించాడు. ►శ్రీలంకతో టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా స్పష్టంగా ఔటయినా అలీమ్ దార్ ఇవ్వలేదు. లంక కెప్టెన్ కరుణరత్నె డీఆర్ఎస్ కోరబోగా నిర్ణీత సమయం (15 సెకన్లు) అయిపోయిందంటూ దార్ తిరస్కరించాడు. కానీ, మరో రెండు సెకన్ల వ్యవధి మిగిలే ఉన్నట్లు తర్వాత తేలింది. -
అంపైర్ నిద్రపోయావా ఏంటి?
-
అంపైర్ నిద్రపోయావా ఏంటి?
నాగ్‌పూర్: క్రికెట్లో రోజురోజుకి అంపైర్ల చర్యలు, తప్పిద నిర్ణయాల పట్ల విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. అంపైర్ల తప్పిద నిర్ణయాలతో అనేక జట్లు గెలిచే మ్యాచ్‌లు ఓడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తప్పిద నిర్ణయాలతో అంపైర్లు అభాసుపాలవుతుండగా.. తాజాగా దేశవాళీ మ్యాచ్‌లో అంపైర్ సీకే నందన్ తీరు పట్ల సర్వత్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇరానీ కప్‌లో భాగంగా రెస్టాఫ్ ఇండియా-విదర్భ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా కెప్టెన్ ఫయాజ్ ఫజల్ అంపైర్ తప్పిద నిర్ణయానికి బలయ్యాడు. ఇన్నింగ్స్ 21వ ఓవర్ వేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ వేసిన బంతిని ఫజల్ ఫయాన్స్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ.. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతి బ్యాట్‌కి అందకుండా నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో.. ఔట్ కోసం రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. తొలుత ఆ ఆప్పీల్‌ను ఫీల్డ్ అంపైర్ నందన్ తిరస్కరించాడు. దీంతో ఆటగాళ్లు తమతమ స్థానాలకు వెళుతుండగా నందన్ మరో ఫీల్డ్ అంపైర్ వైపు చూసి.. ఔటంటూ వేలెత్తాడు. దీంతో.. తొలుత నాటౌట్ అని నిరాశకి గురైన రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాళ్లు సంబరాలు మొదలెట్టగా.. నాటౌట్ అని సంతోషించిన ఫజల్ అసహనంతో కాసేపు క్రీజులోనే ఉండిపోయి అనంతరం భారంగా క్రీజు వదిలాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. అంపైర్ తీరు పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ అంపైర్ నిద్రపోయావా ఏంటి’ అంటూ కొందరు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ‘అంపైర్లకు కూడా ఎప్పటికప్పుడు క్లాస్‌లు, పరీక్షలు పెట్టాలి’అంటూ మరికొందరు సూచిస్తున్నారు. -
టీ బ్రేక్..కోహ్లీ ప్రాక్టీస్.. వైరల్ వీడియో!
-
లార్డ్స్ టెస్ట్: అంపైర్ ఆఫ్ సెంచరీ!
లార్డ్స్ : అదేంటీ అంపైర్ ఆఫ్ సెంచరీ అనుకుంటున్నారా? ఆటగాళ్లకే హాఫ్ సెంచరీలుంటాయా? అంపైర్లకు ఉండవా? భారత్-ఇంగ్లండ్ రెండో టెస్ట్‌లో అంపైర్ మరైస్ ఎరాస్ముస్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. లార్డ్స్ టెస్టు అతనికి కెరీర్లో అంపైర్‌గా 50వ టెస్ట్. దీంతో ఈ ఘనతను అందుకున్న 17వ అంపైర్‌గా, రెండో దక్షిణాఫ్రికా అంపైర్‌గా మరైస్ ఎరాస్ముస్ నిలిచాడు. అతని కన్నా ముందు రూడీ కోర్ట్జెన్ సఫారీ నుంచి ఈ ఘనతను అందుకున్నాడు. అతను 108 టెస్టులకు అంపైర్‌గా వ్యవహరించాడు. ఈ జాబితాలో స్టీవ్బక్నర్ 128 టెస్టులతో తొలి స్థానంలో ఉన్నాడు. 2010లో బంగ్లాదేశ్, భారత్ మధ్య చిట్టగాంగ్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఎరాస్ముస్ తొలిసారి అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు. 2016,2017లో ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్‌గా డేవిడ్ షేపహర్డ్ ట్రోఫీలందుకున్నాడు. అంపైర్ కాకముందు ఎరాస్ముస్ 53 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడి 1913 పరుగులతో 131 వికెట్లు పడగొట్టాడు. తన జీవితంలో మరిచిపోలేని రోజని, ఈ ఘనతను అందుకున్న17వ అంపైర్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు. తన విజయానికి తన కుంటు సభ్యులే కారణమని, తనకు మద్దతుగా నిలిచిన ఐసీసీ, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు తెలిపాడు. ఇక ఐసీసీ సైతం ఎరాస్ముస్‌ను అభినందిస్తూ అతని సేవలను కొనియాడింది. ప్రారంభమైన కొద్దిసేపటికే ఇంగ్లండ్-భారత్ టెస్ట్‌కు వర్షం అడ్డంకిగా మారింది. మ్యాచ్ నిలిచే సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులు మాత్రమే చేసింది. Congratulations to Marais Erasmus who is standing in his 50th Test match - the 17th umpire and 2nd South African to reach the milestone 👏 ➡️ https://t.co/P5WiPWXKmi pic.twitter.com/fbWPoYiwJz — ICC (@ICC) August 10, 2018 చదవండి: 10 పరుగులకే ఓపెనర్లు ప్యాకప్! -
దొంగగా మారిన మాజీ అంపైర్
సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన వివాదాస్పద మాజీ అంపైర్ డారెల్ హెయిర్ నగదు దొంగిలిస్తూ పట్టుబడ్డారు. 65 ఏళ్ల హెయిర్ తాను పనిచేస్తున్న మద్యం దుకాణంలో రూ. 4.50 లక్షలు (9,005 ఆస్ట్రేలియా డాలర్లు) దొంగిలించారు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఆయన దొరికిపోవడంతో స్థానిక కోర్టులో హాజరు పరిచారు. ఇది క్రిమినల్ నేరం కాకపోవడం... హెయిర్ తాను దొంగిలించిన డబ్బును చెల్లించడంతో ఆయనకు కోర్టు 18 నెలలు సామాజిక సేవ చేయాలని ఆదేశించింది. 1992 నుంచి 2008 వరకు ఆయన 78 టెస్టులకు అంపైర్‌గా వ్యవహరించారు. అయితే మైదానంలో ఆయన తీసుకున్న నిర్ణయాలతో వివాదాస్పద అంపైర్‌గా గుర్తింపు పొందారు. ముఖ్యంగా 1995లో లంక స్టార్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ యాక్షన్‌ను తప్పుబడుతూ వరుసగా నోబాల్స్ ఇవ్వడం వివాదంగా మారింది. ఆ తర్వాత ఐసీసీ మురళీకి క్లీన్చిట్ ఇచ్చింది. 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో పాకిస్తాన్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడిందని క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఐదు పరుగుల పెనాల్టీ విధించడం కూడా వివాదాస్పదమైంది. -
'క్రికెట్' కాస్త కొత్తగా...
భారత్‌తో ఇటీవల జరిగిన టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఉపుల్ తరంగ పరుగు పూర్తి చేసే ప్రయత్నంలో నిర్ణీత సమయంలోపే బ్యాట్‌ను క్రీజులో ఉంచగలిగాడు. అయితే వేగంగా నేలను తాకిన బ్యాట్ అనూహ్యంగా గాల్లోకి లేచింది. సరిగ్గా అదే సమయంలో కీపర్ సాహా బెయిల్స్ పడగొట్టడంతో తరంగ రనౌట్‌గా వెనుదిరిగాడు. అంతకు ముందు చాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ కూడా ఇదే తరహాలో అవుటయ్యాడు. అయితే ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై అలాంటిది నాటౌట్‌గా గుర్తిస్తారు. దీంతో పాటు మరికొన్ని నిబంధనలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా బ్యాట్ పరిమాణం, ఫుట్‌బాల్ తరహాలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే మైదానం బయటకు పంపడంలాంటివి కూడా ఉన్నాయి. దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రూపొందించిన కొత్త నిబంధనలు ఈ నెల 28 నుంచి అమల్లోకి వస్తున్నాయి. భారత్–ఆస్ట్రేలియా, ఇంగ్లండ్–వెస్టిండీస్ సిరీస్‌లు ఇప్పటికే కొనసాగుతున్న కారణంగా మిగతా మ్యాచ్‌లను పాత నిబంధనల ప్రకారమే నిర్వహిస్తారు. త్వరలో జరిగే దక్షిణాఫ్రికా–బంగ్లాదేశ్, పాకిస్తాన్–శ్రీలంక సిరీస్‌ల నుంచి కొత్త రూల్స్ వర్తిస్తాయి. 2000 నుంచి ఇప్పటి వరకు అవసరాన్ని బట్టి ఐసీసీ క్రికెట్ నిబంధనల్లో ఆరు సార్లు మార్పుచేర్పులు చేసింది. ‘మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) క్రికెట్ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. దానికి అనుగుణంగానే ఐసీసీ కూడా వాటిని అనుసరించాలని నిర్ణయించింది. కొత్త మార్పులపై అంపైర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాం. అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఇకపై వీటిని అమలు చేసే సమయం ఆసన్నమైంది’ అని ఐసీసీ జనరల్ మేనేజర్ (క్రికెట్) జెఫ్ అలార్డిస్ చెప్పారు. ముఖ్యంగా బ్యాట్‌కు, బంతికి మధ్య అంతరం తగ్గించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. రేపటి నుంచి కొత్తగా అమల్లోకి రానున్న కొన్ని ప్రధాన ఐసీసీ నిబంధనల వివరాలు ఇలా ఉన్నాయి. ► బ్యాట్ పొడవు, వెడల్పులో ఎలాంటి పరిమితులు లేకపోయినా... బ్యాట్ మందం 67 మిల్లీ మీటర్లకు మించరాదు. అనుమానం వస్తే అంపైర్లు బ్యాట్ మందాన్ని పరికరంతో పరీక్షిస్తారు. ఇప్పటి వరకు వార్నర్ తదితరులు ఎక్కువ మందం కలిగిన భారీ బ్యాట్లు వాడుతున్నారు. ► బౌండరీ వద్ద గాల్లోకి ఎగిరి ఫీల్డర్లు పట్టే క్యాచ్‌లు ఇటీవల తరచుగా కనిపిస్తున్నాయి. బౌండరీ దాటి గాల్లోనే దాన్ని లోపలికి తోసి మళ్లీ వాటిని అందుకుంటున్నారు. అయితే ఇందులో మార్పు చేశారు. ఇకపై ఫీల్డర్ బంతిని తాకే సమయంలో కూడా అతను బౌండరీ లోపలే ఉండాలి. లేదంటే బౌండరీగా పరిగణిస్తారు. ► బ్యాట్స్‌మన్ పరుగు పూర్తి చేసే సమయంలో ఫీల్డర్/కీపర్ వికెట్లు పడగొట్టడానికి ముందే అతని బ్యాట్‌గానీ, అతనుగానీ క్రీజులో చేరి... ఆ తర్వాత బ్యాట్ గాల్లోకి ఎగరడం లేదా బ్యాట్స్‌మన్ నియంత్రణ కోల్పోయినా అతను సురక్షితంగా క్రీజులో అడుగు పెట్టినట్లే లెక్క. దానిని రనౌట్‌గా పరిగణించరు. ► ఇప్పటి వరకు బ్యాట్స్‌మన్ ఒక్కసారి మైదానం వీడితే అతడిని వెనక్కి పిలవడానికి లేదు. అయితే అతను నాటౌట్‌గా తేలితే ఇకపై తర్వాతి బంతి వేసే లోపు మళ్లీ వెనక్కి పిలుచు కోవచ్చు. ‘హ్యాండిల్డ్ ద బాల్’ (వికెట్ల వైపు వెళ్లే బంతిని చేతితో ఆపడం) నిబంధనను పూర్తిగా తొలగించి దానిని ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’లోకి కలిపేశారు. ► ఐసీసీ లెవల్ 4 నిబంధన ప్రకారం మైదానంలో ఆటగాడు హద్దు మీరి దురుసుగా ప్రవర్తిస్తే అంపైర్ అతడిని మొత్తం మ్యాచ్‌లో ఆడకుండా తప్పించవచ్చు. ఉద్దేశపూర్వకంగా నోబాల్ వేసినప్పుడు, బ్యాట్స్‌మన్ క్రీజ్ దాటి చాలా ముందుకు వచ్చి గార్డ్ తీసుకున్నప్పుడు చర్యలు తీసుకునే అధికారాన్ని అంపైర్లకు అప్పజెప్పారు. ► బౌలర్ బంతిని విసిరిన తర్వాత క్రీజులోకి చేరేలోపు రెండు సార్లు నేలను తాకితే దానిని నోబాల్‌గా పరిగణిస్తారు. పిచ్‌కు దూరంగా బంతి పడినా దానిని నోబాల్‌గానే ప్రకటిస్తారు. నోబాల్ కీపర్‌కు అందకుండా వెళ్లి బౌండరీని తాకితే బౌలర్ నోబాల్ మాత్రమే వేసినట్లు. బైస్ను అతని ఖాతాలో కలపరు. ► బ్యాట్స్‌మన్ షాట్ కొట్టిన తర్వాత బంతి ఫీల్డర్ లేదా వికెట్ కీపర్ హెల్మెట్‌కు తగిలి వచ్చినా సరే... ఫీల్డర్ క్యాచ్ పడితే దానిని అవుట్‌గా పరిగణిస్తారు. ఇప్పటి వరకు అలా వస్తే అది నాటౌట్‌గా ఉండేది. ► అంతర్జాతీయ టి20ల్లో కూడా అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్)ను అమలు చేస్తారు. ఒక ఇన్నింగ్స్‌లో ఒక రివ్యూకు అవకాశం ఉంటుంది. టెస్టుల్లో రివ్యూ చేసిన సమయంలో ‘అంపైర్ నిర్ణయం’ సరైనదిగా డీఆర్ఎస్ చూపించినప్పుడు జట్టు ఒక రివ్యూను కోల్పోదు. దీని వల్ల ఇకపై ఇన్నింగ్స్‌కు 2 రివ్యూలు మాత్రమే ఉంటాయి. 80 ఓవర్ల తర్వాత అదనంగా మరో 2 రివ్యూలు చేరడం ఉండదు. -
రోహిత్ శర్మ అస్సలు కేకలు వేయలేదు!
ఎంపైర్ తో వాగ్వాదానికి దిగిన తమ జట్టు కెప్టెన్ ను ముంబై ఇండియన్స్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వెనకేసుకొచ్చాడు. ఎంపైర్‌తో రోహిత్ శర్మ తప్పుగా ప్రవర్తించలేదని, నిబంధనలకు ఎంపైర్‌కు వివరించడానికే అతను ప్రయత్నించాడని చెప్పుకొచ్చాడు. రోహిత్ ఎంపైర్‌తో వాదన పెట్టుకోలేదని, కేకలు వేయలేదన్నాడు. వాంఖడే స్టేడియంలో సోమవారం పుణేతో జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఎంపైర్‌తో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. పుణే బౌలర్ జయదేవ్ ఉనాద్కత్ వేసిన బంతి వైడ్ వెళ్లినా అంపైర్ ఇవ్వకపోవడంతో రోహిత్‌కు కోపం వచ్చింది. నేరుగా అంపైర్ దగ్గరకు వెళ్లి ఎందుకు వైడ్ ఇవ్వలేదంటూ వాదనకు దిగాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించింనందుకు రోహిత్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. మ్యాచ్‌లో జరిగిన ఈ ఘటనపై హర్భజన్ స్పందిస్తూ.. ‘ ఆ బంతి మాత్రం చాలా దూరంగా వెళ్లింది. నిజాయితీగా చెప్పాలంటే.. అది వైడా, కాదా అన్నది నాకు తెలియదు. బ్యాట్మన్ రెండు కాళ్లు కదిలించినప్పుడు బౌలర్‌కు మార్జిన్ ఇవ్వవచ్చు. కానీ రోహిత్ ఒక కాలు మాత్రమే కదిలించాడు. ఆ ప్రకారం ఇది వైడ్ కావాలి. కానీ ఎంపైర్ నిర్ణయం ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఆటలో ఎవరు మెరుగ్గా ఆడితే వారే గెలుస్తారు’ అని చెప్పాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌తో ముంబైపై పుణేతో మూడు పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. బేన్ స్టోక్ వేసిన 19వ ఓవర్ మ్యాచ్ గతిని మార్చి.. పుణే వైపు మొగ్గేలా చేసిందని, ఆఖరి వరకూ పోరాటం చేసినా చివరి ఓవర్లో రోహిత్ ఔటవ్వడంతో విజయావకాశాలు దెబ్బతిన్నాయని అన్నారు. -
అరే..అంపైర్ భలే కవర్ చేశాడే!
రాంచీ: క్రికెట్ ఫీల్డ్‌లో ఆటగాళ్లు తడబడటం చూస్తూ ఉంటాం. అటు బ్యాటింగ్ చేసేటప్పుడు కానీ ఫీల్డింగ్ చేసేటప్పుడు క్రికెటర్లు తడబడటం అనేది సర్వ సాధారణం. అయితే ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు సందర్భంగా అంపైర్ తొలుత తడబడి ఆపై నాలుక కరుచుకున్న ఘటన అభిమానుల్లో నవ్వులు పూయించింది. అసలు విషయమేమిటంటే..భారత్ తొలి ఇన్నింగ్స్ లో భాగంగా నాల్గో రోజు ఆటలో ఆసీస్ పేసర్ హజల్ వుడ్ 140వ ఓవర్ వేశాడు. ఆ సమయంలో చటేశ్వర పుజారా బ్యాటింగ్ ఎండ్‌లో ఉన్నాడు. అయితే ఆ ఓవర్ నాల్గో బంతి లెగ్ స్టంప్ వైపు బౌన్స్ అవుతూ వచ్చింది. దాన్ని పుజారా హుక్ షాట్ కు యత్నించి విఫలమయ్యాడు. కాగా, అంపైర్ గఫానీ మాత్రం ఆ బంతికి కాస్త భిన్నంగా స్పందించాడు. బౌలర్ హజల్ వుడ్ ఎటువంటి అప్పీలు చేయకుండానే తన వేలిని ముందుగా పైకెత్తేసి ఆపై బుర్ర గోక్కున్నాడు. దీన్ని చూసిన క్రికెట్ అభిమానులు అంపైర్ భలే కవర్ చేశాడే అనుకుంటూ సరదాగా నవ్వుకున్నారు. అయితే స్లిప్ లో ఉన్న ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎందుకు వేలెత్తారు అనే అర్థం వచ్చేలా అక్కడ్నుంచే సైగ చేయడం ఇక్కడ గమనార్హం. అందుకు సమాధానంగా తన తలను గోక్కోవడానికి అంటూ అంపైర్ సంకేతాలివ్వడం కొసమెరుపు. -
అరే..అంపైర్ భలే కవర్ చేశాడే!
-
గీత దాటితే వేటు పడుద్ది
లండన్: ఇక నుంచి మైదానంలో క్రికెటర్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాల్సిందే! మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) రూపొందించిన కొత్త నియమావళిలో అంపైర్లకు మరిన్ని అధికారాలు రాబోతున్నాయి. మైదానంలో ఏమాత్రం అనుచితంగా ప్రవర్తించినా సంబంధిత ఆటగాడిని పెవిలియన్‌కు పంపే అధికారం వారికి ఉంటుంది. అలాగే క్రికెటర్లు వాడే బ్యాట్ల పరిమాణం కూడా తగ్గనుంది. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. గతేడాది డిసెంబర్లో జరిగిన ఎంసీసీ క్రికెట్ కమిటీ ప్రతిపాదనలకు ఎంసీసీ ఆమోదముద్ర వేసింది. -
అంపైర్‌ను బంతితో కొట్టాడు!
-
అంపైర్‌ను బంతితో కొట్టాడు!
ఒట్టావా: కెనడా టెన్నిస్ స్టార్ డెనిస్ షపోవాలవ్.. తన ఆవేశాన్ని అదుపు చేసుకోలేక బంతితో అంపైర్‌ను బలంగా కొట్టిన ఘటన డేవిస్ కప్ లో చోటు చేసుకుంది. బ్రిటన్ ఆటగాడు కేల్ ఎడ్మండ్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో వరుసగా రెండు సెట్లు కోల్పోయిన షపోవాలవ్.. మూడో సెట్లో కూడా వెనుకబడిపోయాడు. మూడో సెట్లో షపోవాలవ్ 1-2తో వెనుకంజలో ఉన్న సమయంలో ఆవేశాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. ఆ క్రమంలోనే అతిగా స్పందించి బంతిని అంపైర్ గాబస్ కూర్చొన్న స్టాండ్ వైపు గట్టిగా కొట్టాడు. ఆ బంతి కాస్తా అంపైర్ ముఖానికి బలంగా తాకడంతో అతను విలవిల్లాడిపోయాడు. తొలుత అతనికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఒట్టావాలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంపైర్ ఎడమ కన్నుపై తీవ్రంగా వాచినట్లు కెనడా డేవిస్ కప్ సభ్యుడొకరు తెలిపారు. కాగా, అంపైర్ ను బంతితో కొట్టిన డెనిస్ షపోవాలవ్ ను డేవిస్ కప్ నుంచి బహిష్కరించారు. -
గాయపడినా హెల్మెట్ వద్దంటున్నాడు!
ముంబై:ఇటీవల ముంబైలో జరిగిన నాల్గో టెస్టులో ఆస్ట్రేలియాకు చెందిన అంపైర్ పాల్ రీఫెల్ ఫీల్డ్‌లో ఉండగా గాయపడిన సంగతి తెలిసిందే. భారత ఫీల్డర్ భువనేశ్వర్ కుమార్ వేసిన రీఫెల్ తల వెనుక తగిలింది. దాంతో రీఫెల్ ఫీల్డ్‌లో పడిపోయాడు. అనంతరం స్టేడియంలోని వైద్య సిబ్బంది అతనికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం రీఫెల్ రిటైర్డ్‌హర్ట్ అయ్యాడు. దాంతో ఫీల్డ్ అంపైర్లకు హెల్మెట్ ఉండాలనే ప్రతిపాదనను వచ్చింది.. కాగా, దీనికి రీఫెల్ అభ్యంతరం చెప్పాడు. 'నా వరకూ ఫీల్డ్ అంపైర్లు టెస్టుల్లో హెల్మెట్‌తో అంపైరింగ్ చేయడం క్లిష్టంగానే ఉంటుంది. ఐదు రోజుల పాటు హెల్మెట్ ధరించి ఉండాలంటే చాలా కష్టమే కాదు.. అత్యంత భారంగా ఉంటుంది. అది సాధ్యం కాదు. ఒకవేళ హెల్మెట్‌తోనే అంపైరింగ్ చేయాలంటే నాకు నిజంగా ఇబ్బందికరంగా ఉంటుంది' అని రీఫెల్ పేర్కొన్నాడు. ముంబైలో జరిగిన నాల్గో టెస్టు తొలి రోజు ఆటలో భాగంగా ఇన్నింగ్స్ 49.0 ఓవర్‌ను రవిచంద్రన్ అశ్విన్ వేశాడు. ఈ క్రమంలోనే అతను విసిరిన రెండో బంతిని ఇంగ్లండ్ ఆటగాడు జెన్నింగ్స్ లెగ్ స్టంప్ మీదుగా తరలించి సింగిల్ తీశాడు. అయితే భారత ఫీల్డర్ భువనేశ్వర్ కుమార్ నేరుగా విసిరిన బంతి అంపైర్ తల వెనుక బాగాన తగిలింది. దాంతో అంపైర్ ఫీల్డ్‌లో పడిపోయాడు. దాంతో ఈ సిరీస్ కు రీఫెల్ దూరం కావాల్సి వచ్చింది. -
నాల్గో టెస్టు: అంపైర్ ’రిటైర్డ్‌హర్ట్’!
-
నాల్గో టెస్టు: అంపైర్ 'రిటైర్డ్‌హర్ట్'!
ముంబై:భారత్-ఇంగ్లండ్ జట్లు మధ్య ఇక్కడ జరుగుతున్న నాల్గో టెస్టులో ఫీల్డ్ అంపైర్ పాల్ రైఫెల్ రిటైర్డ్‌హర్ట్ అయ్యాడు. తొలి రోజు ఆటలో భాగంగా ఇన్నింగ్స్ 49.0 ఓవర్‌ను రవిచంద్రన్ అశ్విన్ వేశాడు. ఈ క్రమంలోనే అతను విసిరిన రెండో బంతిని ఇంగ్లండ్ ఆటగాడు జెన్నింగ్స్ లెగ్ స్టంప్ మీదుగా తరలించి సింగిల్ తీశాడు. అయితే భారత ఫీల్డర్ భువనేశ్వర్ కుమార్ నేరుగా విసిరిన బంతి అంపైర్ తల వెనుక బాగాన తగిలింది. దాంతో అంపైర్ ఫీల్డ్‌లో పడిపోయాడు. అనంతరం ఫిజియోలో అతనికి ప్రాథమిక చికిత్స చేసిన తరువాత రైఫెల్ ఫీల్డ్‌ను వదిలి వెళ్లిపోయాడు. అతని స్థానంలో టీవీ అంపైర్ ఎరస్మస్ ఫీల్డ్ అంపైర్‌గా వచ్చాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ఆచితూచి బ్యాటింగ్ చేస్తోంది. అలెస్టర్ కుక్(46), జో రూట్(21)లను వికెట్లను ఇంగ్లండ్ కోల్పోగా, ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన జెన్నింగ్స్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. -
టి20 ప్రపంచకప్ లో ఆడనివ్వరా?: ధోని
మిర్పూరు: మైదానంలో కొత్త మంది అంపైర్లు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉపయోగిస్తుండడంపై టీమిండియా వన్డే, టి20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇయర్ పీస్ లాంటి వస్తువులను అంపైర్లు వాడుతుండడంపై అభ్యంతరం తెలిపాడు. ఆశిష్ నెహ్రా బౌలింగ్ లో ఖుర్రం మంజూర్ కొట్టిన బంతిని తప్పించుకోవడంలో బంగ్లాదేశ్ అంపైర్ ఎస్ఐఎస్ సైకత్ విఫలమయ్యాడు. ఆ సమయంలో సైకత్ తన చెవికి ఇయర్ పీస్ తగిలించుకుని ఉన్నాడు. దీని గురించి విలేకరులు అడిగినప్పుడు ధోని సరదాగా స్పందించాడు. 'టి20 ప్రపంచకప్ టోర్నీలో నన్ను ఆడకుండా చేయాలనుకుంటున్నారా. నాపై వేటు పడాలని కోరుకోవద్దు' అంటూ సరదాగా సమాధానం ఇచ్చాడు. అంపైర్లు ఇయర్ పీస్ తగిలించుకుని మైదానంలో అంపైరింగ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపాడు. 'అంపైర్లు వాకీ టాకీతో పాటు ఇయర్ పీస్ పరికరాలు వాడుతున్నారు. దీంతో ఒక చెవితోనే మైదానంలో పనిచేస్తున్నారు. ఒక చెవిని పూర్తిగా పరికరాలకు అప్పగించేయడంతో ఆటగాళ్లు చెబుతున్నది వారికి పూర్తిగా వినపడని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆన్ ఫీల్డ్ లో అంపైర్లు రెండు చెవులతో పనిచేయడం మంచిదన'ని ధోని పేర్కొన్నాడు. -
తొలిసారి హెల్మెట్ ధరించిన అంపైర్
కాన్బెర్రా: బౌలర్ల ధాటికి మాత్రమే ఇన్ని రోజులు బ్యాట్స్మెన్లు హెల్మెట్ ధరించేవారు. కానీ బ్యాట్స్మెన్ల దూకుడుకు ఇప్పుడు అంపైర్లు కూడా హెల్మెట్లు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య జరుగుతున్న నాలుగో వన్డే ఇందుకు వేదికైంది. మ్యాచ్ ఆరో ఓవర్లో ఫించ్ కోట్టిన షాట్‌కు అంపైర్ రిచర్డ్స్ కాలికి గాయమైంది. దీంతో చికిత్స కోసం గ్రౌండ్‌ను వదిలి వెళ్లాల్సి వచ్చింది. దీంతో అప్పటి వరకు మాములుగానే ఉన్న జాన్ వార్డ్ మందుస్తు రక్షణ చర్యల్లో భాగంగా హెల్మెట్ ధరించి అంపైరింగ్‌కు వచ్చారు. ఇదివరకే భారత్‌లో దేశవాలి క్రికెట్ సందర్భంగా అంపైరింగ్ చేస్తున్న సమయంలో జాన్ వార్డ్ తలకు బాల్ తగిలి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో ఓ అంపైర్ హెల్మెట్ ధరించి మైదానంలోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇలివలి కాలంలో మైదనంలో బంతులు తగిలి క్రికెటర్లు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. దీంతో ఆటగాళ్లే కాకుండా అంపైర్ల సేఫ్టీ కోసం ఆసీస్ క్రికెట్ బోర్డు ముందుకు వచ్చింది. దీనిలో భాగంగానే అంఫైర్కూ హెల్మెట్ ఉండాల్సిందేనంటూ వాదిస్తోంది. -
అంపైర్ హెల్మెట్ ధరించిన వేళ..
మెల్ బోర్న్:క్రికెట్ ఫీల్డ్ లో అంపైర్లు హెల్మెట్ ధరించటం చాలా అరుదైన విషయమే. సాధారణంగా బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్, డేంజర్ జోన్లలో ఫీల్డింగ్ చేసే వారే ఎక్కువగా హెల్మెట్ తో కనిపిస్తారు. అయితే మోడ్రన్ క్రికెట్ లో వచ్చిన మార్పులతో అంపైర్లు కూడా హెల్మెట్ ధరించడానికే మొగ్గు చూపుతున్నారు. బ్యాట్స్ మెన్ బంతిని బాదుతున్న తీరు కూడా అంపైర్లకు హెల్మెట్ తప్పనిసరి అని హెచ్చరికలు పంపిస్తోంది. ఇటీవల భారత్‌లో పంజాబ్-తమిళనాడుల మధ్య జరిగిన రంజీ మ్యాచ్ సందర్బంగా ఆస్ట్రేలియాన్ అంపైర్ జాన్ వార్డ్ కు తలకు బంతి తగిలి స్వల్పంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో బుధవారం మెల్ బోర్న్-పెర్త్ స్కార్చెర్స్ ల మధ్య ఇథిహాడ్ స్టేడియంలో జరిగిన బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ లో అంపైర్ గెరాడ్ అబూద్ హెల్మెట్‌ను ధరించాడు. దీంతో హెల్మెట్ ను ధరించిన తొలి ఆస్ట్రేలియన్ అంపైర్ గా గెరాడ్ గుర్తింపు పొందాడు. తన సహచర అంపైర్ జాన్ వార్డ్ కు బంతి తగలడంతోనే హెల్మెట్ ధరించాలని బలంగా నిశ్చయించుకున్నట్లు గెరాడ్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా గతేడాది ఇజ్రాయిల్ జాతీయ క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు హిల్లెల్ అవాస్కర్ అంపైరింగ్ చేస్తూ బంతి బలంగా తగలడంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అలీమ్ దార్ స్థానంలో ఎస్ రవి
దుబాయ్: దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య గురువారం చెన్నైలో జరుగనున్న నాల్గో వన్డేలో అంపైరింగ్ చేసేందుకు పాకిస్థాన్ అంపైర్ అలీమ్ దార్ స్థానంలో సుందరమ్ రవిని నియమించారు. భద్రతా కారణాలతో పాకిస్థాన్ అంపైర్ అలీమ్ దార్ ను ఐసీసీ వెనక్కు పిలిచిన నేపథ్యంలో ఎస్ రవిని ఎంపిక చేశారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయాన్ని సోమవారం శివసేన కార్యకర్తలు ముట్టడించిన అనంతరం ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ మ్యాచ్ కు తటస్థ అంపైర్ తో పాటు, ఆతిథ్య అంపైర్ ఉంటే బావుంటుందని భావించిన ఐసీసీ.. సుందర్ రవిని అంపైర్ గా నియమించింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ సభ్యుడైన రవి.. ప్రస్తుతం ఇంగ్లండ్-పాకిస్థాన్ ల మధ్య జరుగుతున్న సిరీస్ కు అంపైర్ గా వ్యవహరించాల్సి ఉంది. కాగా, దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య జరిగే తదుపరి వన్డేకు రవి అంపైర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తారని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. నాల్గో వన్డేకు ఇద్దరూ కూడా భారత్ కు చెందిన అంపైర్లే ఉంటారని పేర్కొంది. -
రాయుడు అవుటా... డౌటా?
మిర్పూర్: బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడే వన్డేలో టీమిండియా బ్యాట్స్ మన్ అంబటి రాయుడు వివాదస్పదరీతిలో అవుటయ్యాడు. కెప్టెన్ ధోనితో కలిసి భారీ స్కోరుకు బాటలు వేసిన రాయుడు అంపైర్ సందేహాస్పద నిర్ణయంతో పెవిలియన్ చేరాడు. 43.3 ఓవర్ లో మొర్తజా వేసిన బంతిని షార్ట్ ఫైన్ గా ఆడేందుకు రాయుడు ప్రయత్నించాడు. వికెట్లను వదిలి పక్కకు జరిగి బంతిని కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే బంతి రాయుడు తొడ భాగం వద్ద తగిలి తర్వాత వికెట్ కీపర్ చేతిలో పడింది. బంగ్లా ఆటగాళ్లు గట్టిగా అప్పీలు చేయడంతో అంపైర్ అవుట్ ప్రకటించారు. అంపైర్ నిర్ణయంపై రాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. మరో ఎండ్ లో ఉన్న కెప్టెన్ ధోని కూడా అంపైర్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. అయితే బంతి రాయుడు ప్యాడ్లకు తగల్లేదని రీప్లేలో కనబడింది. దీనిపై 'బంతి మిర్పూర్ లో, బ్యాట్ ఢాకాలో ఉంటే అంపైర్ అవుట్ ఇచ్చారు' కామెంటేటర్ ఒకరు వ్యాఖ్యానించారు. అంపైర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రాయుడు తన మ్యాచ్ ఫీజులో కొంత వదులుకోవాల్సి రావచ్చు అంటూ చమత్కరించారు. -
భారత్‌లో ‘సఫారీ’ అంపైరింగ్
ముంబై: దక్షిణాఫ్రికాకు చెందిన భారత సంతతి అంపైర్ అల్లావుద్దీన్ పాలేకర్ వాంఖడే స్టేడియంలో జరిగే రంజీ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించనున్నారు. గ్రూప్ ‘ఎ’లో ముంబై, మధ్యప్రదేశ్ జట్ల మధ్య ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు ఈ మ్యాచ్ జరగనుంది. 36 ఏళ్ల పాలేకర్ తాతయ్య మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేద్ గ్రామానికి చెందినవారు. కాగా అంతర్జాతీయ అంపైర్ల మార్పిడి కార్యక్రమంలో భాగంగా ఆయన భారత్‌లో తొలిసారి రెండు మ్యాచ్‌లకు అంపైరింగ్ విధులు నిర్వర్తిస్తారని బీసీసీఐ జనరల్ మేనేజర్ రత్నాకర్ షెట్టి వెల్లడించారు. కేప్‌టౌన్‌లో జన్మించిన పాలేకర్ దక్షిణాఫ్రికాలో 16 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. -
అంపైర్ల గుసగుసలిక మనమూ వినొచ్చు!!