జింబాబ్వే దేశీవాళీ క్రికెట్ టోర్నీ నేషనల్ వన్డే కప్-2024లో విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. ఓ జింబాబ్వే క్రికెటర్ విన్నింగ్ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. సదరు బ్యాటర్ ఓవరాక్షన్ కారణంగా ఆన్ ఫీల్డ్ అంపైర్ కాలికి గాయమైంది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే.
అసలేం జరిగిందంటే?
ఈ టోర్నీలో భాగంగా బుధవారం ఓగో రేంజర్స్, రెయిన్ బో 1 క్రికెట్ క్లబ్ జట్లు తలపడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఓగో రేంజర్స్ నిర్ణీత 45 ఓవర్లలో 229 పరుగులు చేసింది. అనంతరం 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రెయిన్‌బో 1 క్రికెట్ క్లబ్ సరిగ్గా 44.5 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది.
దీంతో రెయిన్ బో జట్టు విజయానికి ఆఖరి బంతికి 4 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఓగో రేంజర్స్ స్పిన్నర్ ర్యాన్ బర్ల్ వేసిన బంతిని ఫ్రాన్సిస్ సాండే అద్భుతమైన సిక్స్ కొట్టి రెయిన్‌బో క్రికెట్ క్లబ్‌కు విజయాన్ని అందించాడు. ఇక్కడ వరకు అంత బాగానే ఉన్న మ్యాచ్‌ను గెలిపించిన సాండే అతి చేశాడు.
సిక్స్ కొట్టిన వెంటనే తన బ్యాట్‌ను బలంగా నాన్‌స్ట్రైక్ వైపు విసిరాడు. దీంతో ఆ బ్యాట్ కాస్త అంపైర్ కాలికి తాకింది. అంపైర్ నొప్పితో కాసేపు విల్లవిల్లాడు. కానీ ఫ్రాన్సిస్ సాండే మాత్రం అంపైర్‌కు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అతడు కావాలనే తన బ్యాట్‌ను అంపైర్ విసిరాడని కామెంట్లు చేస్తున్నారు.
The 𝐍𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐏𝐫𝐞𝐦𝐢𝐞𝐫 𝐋𝐞𝐚𝐠𝐮𝐞 dishes out sissling hot action! 🙌🏻
Rainbow wanted 4 runs off the last ball against SOGO Rangers 🎥#NPL2024 pic.twitter.com/oj0bwT1X4Q— Zimbabwe Cricket Domestic (@zcdomestic) July 31, 2024
Comments
Please login to add a commentAdd a comment