
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాహుల్ మరోసారి నిరాశపరిచాడు.
తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసిన రాహుల్.. ఇప్పుడు కీలకమైన సెకెండ్ ఇన్నింగ్స్‌లో అదే తీరును కనబరిచాడు. 44 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్ వినూత్న రీతిలో తన వికెట్‌ను కోల్పోయాడు.
అసలేం జరిగిందంటే?
భారత్ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన స్పిన్నర్ కోరి రోకిసియోలి తొలి బంతిని రాహుల్ ఓవర్ ది వికెట్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని డిఫెన్స్ ఆడాలని రాహుల్ నిర్ణయించుకున్నాడు. కానీ బంతి లెగ్ సైడ్ నుండి టర్న్ అవుతుండడంతో రాహుల్ తన ప్యాడ్లతో డిఫెండ్‌కు ప్రయత్నించాడు. కానీ బంతి రాహుల్ కాళ్ల మధ్య నుంచి వెళ్లి బెయిల్స్‌ను గిరాటేసింది.
దీంతో రాహుల్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఏంటి రాహుల్ ఇంత చెత్తగా అవుటవుతావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్-ఎ జట్టు 5 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజులో ధ్రువ్ జురెల్(19), నితీష్ కుమార్ రెడ్డి(9) పరుగులతో ఉన్నారు.
"Don't know what he was thinking!"
Oops... that's an astonishing leave by KL Rahul 😱 #AUSAvINDA pic.twitter.com/e4uDPH1dzz— cricket.com.au (@cricketcomau) November 8, 2024