India-A Cricket Team
-
ఏంటి రాహుల్.. మరీ ఇంత చెత్తగా అవుటవుతావా? వీడియో వైరల్
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసిన రాహుల్.. ఇప్పుడు కీలకమైన సెకెండ్ ఇన్నింగ్స్‌లో అదే తీరును కనబరిచాడు. 44 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్ వినూత్న రీతిలో తన వికెట్‌ను కోల్పోయాడు.అసలేం జరిగిందంటే?భారత్ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన స్పిన్నర్ కోరి రోకిసియోలి తొలి బంతిని రాహుల్ ఓవర్ ది వికెట్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని డిఫెన్స్ ఆడాలని రాహుల్ నిర్ణయించుకున్నాడు. కానీ బంతి లెగ్ సైడ్ నుండి టర్న్ అవుతుండడంతో రాహుల్ తన ప్యాడ్లతో డిఫెండ్‌కు ప్రయత్నించాడు. కానీ బంతి రాహుల్ కాళ్ల మధ్య నుంచి వెళ్లి బెయిల్స్‌ను గిరాటేసింది. దీంతో రాహుల్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఏంటి రాహుల్ ఇంత చెత్తగా అవుటవుతావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్-ఎ జట్టు 5 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజులో ధ్రువ్ జురెల్(19), నితీష్ కుమార్ రెడ్డి(9) పరుగులతో ఉన్నారు. "Don't know what he was thinking!"Oops... that's an astonishing leave by KL Rahul 😱 #AUSAvINDA pic.twitter.com/e4uDPH1dzz— cricket.com.au (@cricketcomau) November 8, 2024 -
నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. 223 పరుగులకు ఆసీస్ ఆలౌట్
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో భారత్-ఎ జట్టు బౌలర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 223 పరుగులకు ఆలౌటైంది. 52/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ అదనంగా 171 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. దీంతో కంగారులకు మొదటి ఇన్నింగ్స్‌లో 62 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బ్యాటర్లలో మార్కస్ హ్యారీస్(74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కోరీ రోకిసియోలి(35),పీర్సన్(30) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 4 వికెట్లు పడగొట్టగా, ముఖేష్ కుమార్ మూడు, ఖాలీల్ ఆహ్మద్ రెండు వికెట్లు సాధించారు.ధ్రువ్ జురెల్ ఒంటరి పోరాటం..అంతకుముందు భారత్-ఎ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్(80) మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో నీసర్ 4 వికెట్లు పడగొట్టగా, వెబ్‌స్టెర్ మూడు వికెట్లు సాధించాడు.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. -
సెంచరీతో చెలరేగిన అభిమన్యు ఈశ్వరన్.. బంగ్లా బౌలర్లకు చుక్కలు
బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 248 బంతులు ఎదుర్కొన్న ఈశ్వరన్ 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 157 పరుగులు సాధించాడు. మూడో రోజు ఆట ప్రారంభంలోనే ముస్ఫిక్ హసన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. కాగా ఈశ్వరన్‌కు బంగ్లా పర్యటనలో ఇది వరుసగా రెండో సెంచరీ. ఇక అతడితో పాటు చెతేశ్వర్ పుజారా (52), శ్రీకర్ భరత్(77) పరుగులతో రాణించారు. 110 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత ‘ఎ’ జట్టుకు 159 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. క్రీజులో జయంత్ యాదవ్, సూరభ్ కుమార్ ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టు 252 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో పేస్ బౌలర్ ముకేశ్ కుమార్ 6 వికెట్లతో చెలరేగాడు. ఆతిథ్య బంగ్లా జట్టులో షాహదత్ హుస్సేన్ (80; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), జకీర్ అలీ (62; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు. చదవండి: BAN vs IND: బంగ్లాదేశ్‌తో మూడో వన్డే.. టీమిండియాకు భారీ షాక్! రోహిత్‌తో పాటు -
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. భారీ ఆధిక్యంలో భారత 'ఎ' జట్టు
కాక్స్ బజార్: బంగ్లాదేశ్ పర్యటనలో తొలి అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. గురువారం మూడో రోజు 404/5 ఓవర్‌నైట్ స్కోరుతో మూడోరోజు ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 465/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాటర్స్‌లో ఉపేంద్ర (71 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం బంగ్లాదేశ్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టానికి 172 పరుగులు చేసింది. హసన్ (21) నిష్క్రమించగా, జకీర్ (81 బ్యాటింగ్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), నజ్ముల్ (56 బ్యాటింగ్; 7 ఫోర్లు) అబేధ్యమైన రెండో వికెట్‌కు 101 పరుగులు జోడించారు. న్నర్ సౌరభ్ కుమార్ ఒక వికెట్ తీశాడు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా... బంగ్లా ఇంకా 181 పరుగులు వెనుకంజలోనే ఉంది. చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు.. ఫోటోలు వైరల్ -
న్యూజిలాండ్- 'ఎ'తో సిరీస్.. భారత జట్టులోకి హైదరాబాద్ ఆటగాడు!
ముంబై: పరిమితంగా జరిగిన దేశవాళీ టోర్నీలతో పాటు, ఈ సీజన్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున మెరిసిన హైదరాబాదీ యువ క్రికెటర్ నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ భారత ‘ఎ’ జట్టులోకి ఎంపికయ్యాడు. ఇందులో ఆంధ్ర వికెట్ కీపర్–బ్యాటర్ శ్రీకర్ భరత్‌కు కూడా సెలక్టర్లు అవకాశమిచ్చారు. ఈ జట్టు భారత పర్యటనకు వచ్చే న్యూజిలాండ్ ‘ఎ’తో నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది. సెప్టెంబర్ 1 నుంచి బెంగళూరు, హుబ్లీ వేదికగా మూడు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది. అనంతరం ఇరు జట్ల మధ్య చెన్నైలో వన్డే సిరీస్ నిర్వహిస్తారు. ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో తలపడే జట్టును మాత్రమే ఎంపిక చేశారు. వన్డే జట్టును తర్వాత ఎంపిక చేయనున్నట్లు ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ వర్గాలు తెలిపాయి. భారత్ ‘ఎ’ జట్టు: ప్రియాంక్ పాంచల్ (కెప్టెన్), తిలక్ వర్మ, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, సౌరభ్ కుమార్, రాహుల్ చహర్, ప్రసిధ్ కృష్ణ, ఉమ్రాన్ మలిక్, ముకేశ్ కుమార్, యశ్ దయాళ్, అర్జాన్ నాగ్వాస్వాలా. చదవండి: న్యూజిలాండ్- 'ఎ'తో సిరీస్.. భారత కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్! -
న్యూజిలాండ్- 'ఎ'తో సిరీస్.. భారత కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్!
స్వదేశంలో న్యూజిలాండ్-'ఎ' తో జరగనున్న సిరీస్(నాలుగు రోజులు పాటు జరిగే టెస్టు మ్యాచ్)కు భారత్- 'ఎ' జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. కాగా బీసీసీఐ ప్రకటించిన ఈ జట్టులో హనుమ విహారి, వాషింగ్టన్ సుందర్, కేఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారు. అదే విధంగా రంజీట్రోఫీ(2021-22)లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్, షామ్స్ మూలానీ, సర్ఫరాజ్ ఖాన్, యష్ దూబే వంటి యువ ఆటగాళ్లకు కూడా అవకాశం లభించింది. కాగా ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్‌తో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్ 1న బెంగళూరు వేదికగా జరగనున్న తొలి టెస్టుతో న్యూజిలాండ్-‘ఎ’ టూర్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లు అన్నీ బెంగళూరు వేదికగానే జరగనున్నాయి. అదే విధంగా వన్డే సిరీస్‌కు చెన్నై వేదికగా కానుంది. భారత్-ఏ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశ్ దూబే, హనుమ విహారి, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), షమ్స్ ములానీ, జలజ్ సక్సేనా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, శుభమ్ శర్మ, అక్షయ్ వాడ్కర్, షాబాజ్ అహ్మద్, మణిశంకర్ మురాసింగ్ చదవండి: David Warner: వార్నర్ అభిమానులకు గుడ్ న్యూస్.. తొమ్మిదేళ్ల తర్వాత ఆ లీగ్‌లో రీ ఎంట్రీ! -
తొలి రోజు భారత్‌పై చెలరేగి ఆడిన దక్షిణాఫ్రికా...
India A bowlers toil on opening day against South Africa A: భారత్ ‘ఎ’తో ఆరంభమైన తొలి అనధికారిక టెస్టులో దక్షిణాఫ్రికా ‘ఎ’ మొదటి రోజు చెలరేగింది. ఓపెనర్ పీటర్ మలాన్ (258 బంతుల్లో 157 నాటౌట్; 18 ఫోర్లు), టోని డి జోర్జి (186 బంతుల్లో 117; 18 ఫోర్లు) శతకాలు సాధించడంతో మంగళవారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఉమ్రాన్, అర్జాన్, సైనీ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: ఆటలో దూకుడు పెంచాను చతేశ్వర్ పుజారా వ్యాఖ్య -
భారత్ ‘ఎ’ గెలుపు
బెంగళూరు: స్పిన్నర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో ముగించింది. ఆట చివరిరోజు మంగళవారం ఓవర్‌నైట్ స్కోరు 38/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా ‘ఎ’ 213 పరుగులకు ఆలౌటైంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, కృష్ణప్ప గౌతమ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. నదీమ్‌కు రెండు వికెట్లు దక్కాయి. 8 ఓవర్లలో 55 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 6.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి దానిని అందుకుంది. శ్రేయస్ అయ్యర్ (3), శుబ్‌మన్ గిల్ (4), కృష్ణప్ప గౌతమ్ (1), భరత్ (12) ఔటవ్వగా... అంకిత్ బావ్నే (18 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు), సమర్థ్ (5 నాటౌట్) భారత్ విజయాన్ని ఖాయం చేశారు. సంక్షిప్త స్కోర్లు ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 346; భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 505; ఆస్ట్రేలియా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 213 (హ్యాండ్స్కోంబ్ 56, మార్‡్ష 36, చహర్ 2/30, నదీమ్ 2/67, గౌతమ్ 3/39, కుల్దీప్ 3/46); భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 55/4. -
యో-యో టెస్టులో సంజు శాంసన్ విఫలం
ముంబై: ఐపీఎల్-11 సీజన్లో మెరుగ్గా రాణించి.. భారత-ఎ జట్టులో చోటు సంపాదించిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ తాజాగా బీసీసీఐ నిర్వహించిన యో-యో ఫిట్నెస్ టెస్టులో విఫలమయ్యాడు. దీంతో త్వరలో జరగనున్న ఇంగ్లండ్ పర్యటన నుంచి సంజు శాంసన్ తప్పుకోవాల్సి వచ్చింది. జూన్ 17 నుంచి ఇంగ్లండ్ వేదికగా మూడు జూనియర్ జాతీయ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరగనుంది. వెస్టిండీస్- ఎ, ఇంగ్లండ్ లయన్స్ జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీ కోసం ఇటీవల భారత- ఎ జట్టుని సెలక్టర్లు ప్రకటించారు. కాగా, క్రికెటర్లందరికీ మూడు రోజుల క్రితం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ టెస్టుని నిర్వహించారు. ఈ టెస్టులో సంజు శాంసన్ ఫెయిలవడంతో అతన్ని ఇంగ్లండ్‌కు వెళ్లే జట్టు నుంచి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తప్పించింది. భారతత-ఎ జట్టుకి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. జట్టులో పృథ్వీ షా, శుభమన్ గిల్, రిషబ్ పంత్ తదితర యువ క్రికెటర్లకి చోటు దక్కింది. తాజాగా సంజూ శాంసన్ జట్టు నుంచి పక్కకి వెళ్లడంతో.. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ బాధ్యతలు చేపట్టనున్నాడు. -
రాణించిన రాయుడు, జాదవ్
డార్విన్: తెలుగు కుర్రాడు అంబటి రాయుడు, కేదార్ జాదవ్ అర్థ సెంచరీలు సాధించడంతో నాలుగు దేశాల సిరీస్‌లో భారత్-ఎ ఐదో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా-ఎ జట్టును భారత్ 5 వికెట్ల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. భారత్ బౌలర్ మనోజ్ కుమార్ తివారి 5 వికెట్లు పడగొట్టాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ 47.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. రాయుడు 77, జాదవ్ 42, శామ్సన్ 49, పర్వేజ్ రసూల్ 20, ఊతప్ప 13 పరుగులు చేశారు.