కాక్స్ బజార్: బంగ్లాదేశ్ పర్యటనలో తొలి అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. గురువారం మూడో రోజు 404/5 ఓవర్‌నైట్ స్కోరుతో మూడోరోజు ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 465/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాటర్స్‌లో ఉపేంద్ర (71 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు.
అనంతరం బంగ్లాదేశ్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టానికి 172 పరుగులు చేసింది. హసన్ (21) నిష్క్రమించగా, జకీర్ (81 బ్యాటింగ్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), నజ్ముల్ (56 బ్యాటింగ్; 7 ఫోర్లు) అబేధ్యమైన రెండో వికెట్‌కు 101 పరుగులు జోడించారు. న్నర్ సౌరభ్ కుమార్ ఒక వికెట్ తీశాడు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా... బంగ్లా ఇంకా 181 పరుగులు వెనుకంజలోనే ఉంది.
చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు.. ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment