bangladesh A
-
'నువ్వు మొదలెట్టావ్.. నేను పూర్తి చేశా; లెక్క సరిపోయింది'
ఎమర్జింగ్ ఆసియా కప్ 2023లో ఇండియా-ఏ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం బంగ్లాదేశ్-ఏతో జరిగిన సెమీఫైనల్లో ఇండియా-ఏ జట్టు 51 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది. ఈ సంగతి పక్కనబెడితే సెమీఫైనల్ సందర్భంగా ఇండియా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఎక్కడా తగ్గలేదు. మొదట టీమిండియా బ్యాటింగ్ సమయంలో వికెట్ పడ్డ ప్రతీసారి బంగ్లా ఆటగాళ్లు టీమిండియా బ్యాటర్లపై ఏదో ఒక కామెంట్ చేస్తూ పెవిలియన్ సిగ్నల్ చూపించారు. ఒక్కసారి అంటే ఏదో అనుకోవచ్చు.. పదే పదే అదే చర్యకు పాల్పడుతూ శ్రుతి మించారు. ఇదంతా టీమిండియా ఆటగాళ్లు గమనిస్తూనే వచ్చారు. మాకు టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం అన్నట్లుగా సైలెంట్‌గా ఉన్నారు. ఇక బంగ్లా ఇన్నింగ్స్ సమయంలో ఇండియా- ఏ ఆటగాళ్లు కూడా ఏమాత్రం తగ్గలేదు. బంగ్లా వికెట్ కోల్పోయిన ప్రతీసారి గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లా సీనియర్ బ్యాటర్ సౌమ్యా సర్కార్, ఇండియా-ఏ ఆటగాడు హర్షిత్ రానాల మధ్య మాటల యుద్దం చోటుచేసుకోవడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 26వ ఓవర్ యువరాజ్‌సిన్హ్ దోదియా వేశాడు. ఆ ఓవర్లో రెండో బంతిని సౌమ్యా సర్కర్ షాట్ ఆడే ప్రయత్నంలో ఇన్సైడ్ ఎడ్జ్ అయి స్లిప్‌లో ఉన్న నికిన్ జోస్‌కు దొరికిపోయాడు. కీలక వికెట్ కావడంతో ఇండియా-ఏ ఆటగాళ్లు సంబరాలు మొదలుపెట్టారు. అయితే హర్షిత్ రానా సౌమ్యా సర్కర్ మొహం ముందు గట్టిగా అరుస్తూ పంచ్‌లు గుద్దుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది నచ్చిన సౌమ్యా సర్కార్ హర్షిత్ రానాతో గొడవకు దిగాడు. ఇద్దరు మాటమాట అనుకున్నారు. అంపైర్ వచ్చేలోపే ఇద్దరు దూషణకు దిగారు. ఇంతలో ఆటగాళ్లు వచ్చి ఇద్దరిని విడదీసే ప్రయత్నం చేశారు. సాయి సుదర్శన్ వచ్చి సౌమ్యా సర్కార్‌ను వెళ్లమంటూ పక్కకు తీసుకెళ్లాడు. అయితే పెవిలియన్ వెళ్తున్న సమయంలోనూ సౌమ్యా సర్కార్ హర్షిత్ రానాపై మాటల యుద్దం కొనసాగించాడు. అయితే హర్షిత్ రానా ఇంత వైల్డ్‌గా రియాక్ట్ అవ్వడానికి ఒక కారణం ఉంది. టీమిండియా బ్యాటింగ్ సమయంలో యష్‌దుల్ ఔటైన సందర్భంలో సౌమ్యా సర్కార్ అసభ్యకర వ్యాఖ్యలు చేసి శ్రుతి మించాడు. ఇది మనసులో పెట్టుకున్న హర్షిత్ రానా సౌమ్యా సర్కార్ ఔటవ్వగానే బదులు తీర్చుకున్నాడు. ''నువ్వు మొదలుపెట్టావ్..నేను పూర్తి చేశా.. లెక్క సరిపోయింది'' అంటూ కామెంట్ చేయడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. India vs Bangladesh - never short of some heat 🔥 . .#EmergingAsiaCup2023 #INDAvBANA pic.twitter.com/xxnMx8Arez — FanCode (@FanCode) July 21, 2023 చదవండి: దురదృష్టవంతుల లిస్ట్‌లో బెయిర్ స్టో.. ఏడో క్రికెటర్‌గా Lionel Messi: మెస్సీనా మజాకా.. క్లబ్‌లు మారినా గోల్స్ మాత్రం ఆగడం లేదుగా -
రాణించిన బ్యాటర్లు.. కెప్టెన్ సెంచరీ.. సైనీ కూడా దంచికొట్టాడు!
సిల్హెట్: బంగ్లాదేశ్ ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ 310 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. జయంత్ యాదవ్ (83; 10 ఫోర్లు)తో పాటు సౌరభ్ కుమార్ (55; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), నవ్‌దీప్ సైనీ (50 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 562 పరుగుల భారీస్కోరు వద్ద డిక్లేర్ చేసింది. జయంత్, సౌరభ్ ఏడో వికెట్‌కు 86 పరుగులు జోడించగా, సైనీ, ముకేశ్ కుమార్ (23 నాటౌట్; 3 ఫోర్లు) అజేయమైన ఆఖరి వికెట్‌కు 68 పరుగులు జత చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్ మొదలుపెట్టిన బంగ్లా ‘ఎ’ ఆటనిలిచే సమయానికి 49/2 స్కోరు చేసింది. షాద్మన్ ఇస్లామ్ (22 బ్యాటింగ్), మోమినుల్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
సెంచరీతో చెలరేగిన అభిమన్యు ఈశ్వరన్.. బంగ్లా బౌలర్లకు చుక్కలు
బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 248 బంతులు ఎదుర్కొన్న ఈశ్వరన్ 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 157 పరుగులు సాధించాడు. మూడో రోజు ఆట ప్రారంభంలోనే ముస్ఫిక్ హసన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. కాగా ఈశ్వరన్‌కు బంగ్లా పర్యటనలో ఇది వరుసగా రెండో సెంచరీ. ఇక అతడితో పాటు చెతేశ్వర్ పుజారా (52), శ్రీకర్ భరత్(77) పరుగులతో రాణించారు. 110 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత ‘ఎ’ జట్టుకు 159 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. క్రీజులో జయంత్ యాదవ్, సూరభ్ కుమార్ ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టు 252 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో పేస్ బౌలర్ ముకేశ్ కుమార్ 6 వికెట్లతో చెలరేగాడు. ఆతిథ్య బంగ్లా జట్టులో షాహదత్ హుస్సేన్ (80; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), జకీర్ అలీ (62; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు. చదవండి: BAN vs IND: బంగ్లాదేశ్‌తో మూడో వన్డే.. టీమిండియాకు భారీ షాక్! రోహిత్‌తో పాటు -
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. భారీ ఆధిక్యంలో భారత 'ఎ' జట్టు
కాక్స్ బజార్: బంగ్లాదేశ్ పర్యటనలో తొలి అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. గురువారం మూడో రోజు 404/5 ఓవర్‌నైట్ స్కోరుతో మూడోరోజు ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 465/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాటర్స్‌లో ఉపేంద్ర (71 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం బంగ్లాదేశ్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టానికి 172 పరుగులు చేసింది. హసన్ (21) నిష్క్రమించగా, జకీర్ (81 బ్యాటింగ్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), నజ్ముల్ (56 బ్యాటింగ్; 7 ఫోర్లు) అబేధ్యమైన రెండో వికెట్‌కు 101 పరుగులు జోడించారు. న్నర్ సౌరభ్ కుమార్ ఒక వికెట్ తీశాడు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా... బంగ్లా ఇంకా 181 పరుగులు వెనుకంజలోనే ఉంది. చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు.. ఫోటోలు వైరల్ -
శతక్కొట్టిన టీమిండియా ఓపెనర్లు.. రెచ్చిపోయిన యశస్వి జైస్వాల్
IND A VS BAN A 1st Unofficial Test: బంగ్లాదేశ్-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు పట్టు బిగించింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. తొలి రోజు (నవంబర్ 29) ప్రత్యర్ధిని 45 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూల్చింది. సౌరభ్ కుమార్ (4/23), నవదీప్ సైని (3/21) బంగ్లా పతనాన్ని శాశించారు. అనంతరం నిన్ననే తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. తొలి రోజే అర్ధసెంచరీలు పూర్తి చేసుకుని జోరు మీదుండిన భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (61 బ్యాటింగ్), అభిమన్యు ఈశ్వరన్ (53 బ్యాటింగ్) రెండో రోజు మరింత రెచ్చిపోయారు. ఇద్దరు భారీ సెంచరీలు సాధించి జట్టును పటిష్ట స్థితిలో ఉంచారు. జైస్వాల్ (145; 20 ఫోర్లు, సిక్స్), ఈశ్వరన్ (142; 11 ఫోర్లు, సిక్స్) తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 283 పరుగులు జోడించారు. ఫలితంగా రెండో రోజు టీ విరామం సమయానికి భారత్.. 3 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. యశ్ ధుల్ (20) ఔట్ కాగా.. తిలక్ వర్మ (6), సర్ఫరాజ్ ఖాన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 213 పరుగుల ఆధిక్యంలో కొనసాగతుంది. కాగా, భారత-ఏ జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. వీటి అనంతరం టీమిండియా 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం ఆ దేశంలో పర్యటిస్తుంది. -
భారత్ ‘ఎ’కు భారీ ఆధిక్యం
రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ‘ఎ’ 36/2 బెంగళూరు: బంగ్లాదేశ్ ‘ఎ’తో జరుగుతున్న మొదటి అనధికారిక టెస్టు మ్యాచ్‌పై భారత్ ‘ఎ’ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 183 పరుగుల భారీ ఆధిక్యం లభించగా... మ్యాచ్ రెండో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. బంగ్లాదేశ్ ఇంకా 147 పరుగులు వెనుకబడి ఉంది. మంగళవారం మ్యాచ్‌కు చివరి రోజు. రాణించిన శంకర్, నాయర్: ఓవర్‌నైట్ స్కోరు 161/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 411 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. శిఖర్ ధావన్ (146 బంతుల్లో 150; 18 ఫోర్లు, 3 సిక్సర్లు) తన జోరు కొనసాగించగా, ఆ తర్వాత విజయ్ శంకర్ (110 బంతుల్లో 86; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కరుణ్ నాయర్ (97 బంతుల్లో 71; 12 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 108 పరుగులు జోడించారు. బంగ్లా బౌలర్లలో జుబేర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ తక్కువ వ్యవధిలో అనాముల్ (0), సర్కార్ (19) వికెట్లు కోల్పోయింది. ఈశ్వర్ పాండే, జయంత్ యాదవ్‌లకు ఒక్కో వికెట్ లభించింది. -
సిరీస్ గెలుస్తారా?
బెంగళూరు: బంగ్లాదేశ్ 'ఎ' జట్టుతో జరుగుతున్నఅనధికార మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను సాధించాలని భారత్' ఎ' జట్టు పట్టుదలగా ఉంది. తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత్.. ఆ తరువాత శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఓటమి పాలైంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మిడిల్ ఆర్డర్ ఆటగాడు నాసిర్ హుస్సేన్(102) సెంచరీ చేయడంతో రెండో వన్డేలో భారత్ కు ఓటమి తప్పలేదు. దీంతో సిరీస్ 1-1 తో సమం అయ్యింది. ఇరు జట్లు మధ్య కీలకమైన మూడో వన్డే ఆదివారం జరుగనుంది. ఈ మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్ 'ఎ' జట్టు భావిస్తుండగా.. బంగ్లాదేశ్ కూడా రెండో వన్డేలో ఫలితాన్నే పునరావృతం చేయాలని యోచిస్తోంది. ఉన్ముక్ చంద్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన భారత 'ఎ' జట్టు తొలి వన్డేలో ఘనవిజయం సాధించింది. ఆ మ్యాచ్ లో గుర్ కీరత్ సింగ్ ఆల్ రౌండ్ షో అదరగొట్టాడు. గుర్ కీరత్ సింగ్ 65 పరుగులు చేయడమే కాకుండా..తన స్పిన్ మాయాజాలంతో ఐదు వికెట్లను సాధించాడు. దీంతో భారత'ఎ' జట్టు 96 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, రెండో వన్డేలో టాస్ ఓడిన బంగ్లా 'ఎ' జట్టు 252 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ స్కోరు ఛేదించే క్రమంలో టీమిండియా ఆటగాళ్లు తడబడ్డారు. ఉన్ముక్త్ చంద్(56) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. మనీష్ పాండే(34), గురుకీరత్ సింగ్(34), మయాంక్ అగర్వాల్(24) లు ఓ మాదిరిగా రాణించినా విజయాన్ని సాధించి పెట్టలేకపోయారు. ఈ తరుణంలో రేపు జరిగే మ్యాచ్ లో బంగ్లా' ఎ'ను కంగుతినిపించాలంటే భారత్ 'ఎ' జట్టు సమిష్టిగా పోరాడాల్సి ఉంది. -
భారత్-ఎ టీమ్ కెప్టెన్ శిఖర్...!
బంగ్లాదేశ్-ఎ తో జరిగే సిరీస్‌కు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ నెల 16 నుంచి బెంగళూరు వేదికగా ప్రాంరభం కానున్న సిరీస్ లో బంగ్లా ‘ఎ’ జట్లు మూడు వన్డేలతో పాటు.. ఒక మూడు రోజుల మ్యాచ్ ఆడనుంది. ఇటీవల శ్రీలకం గాలే మ్యాచ్ లో చేతి గాయంతో సిరీస్ కు దూరమైన శిఖర్ పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. వన్డే టీమ్ కు కెప్టెన్ గా ఉన్ముఖ్ చంద్ వ్యవహరించ నున్నాడు. టీమిండియా బ్యాట్స్ మెన్ సురేశ్ రైనా కూడా వన్డే ఏ జట్టులోకి తీసుకున్నారు. జూన్ బంగ్లా దేశ్ సిరీస్ తర్వాత వన్డే క్రికెట్ ఆడని రైనాకు.. సౌతాఫ్రికా సిరీస్ ముందు ప్రాక్టీస్ మ్యాచ్ గా ఉపయోగ పడుతుందని సెలక్షన్ కమిటీ అభిప్రాయపడింది. సెప్టెంబర్ 16,18, 20 తేదీల్లో వన్డే మ్యాచ్ లు, 27 నుంచి 29 వరకూ మూడు రోజుల మ్యాచ్ జరగ నున్నాయి. మరో వైపు.. రానున్న దక్షిణాఫ్రికా సిరీస్ ను దృష్టి లో ఉంచుకుని ప్రాక్టీస్ కోసం ధోనీ ని కూడా వన్డే జట్టుకు ఎంపిక చేయనున్నారని మొదట వార్తలు వినిపించినా.. ఇండియా ఏ జట్టులో ధోనీని ఎంపిక చేయలేదు.. కాగా ఈనెల 17న ఇంగ్లండ్‌లో ధోనీ ఓ చారిటీ మ్యాచ్ లో ఆడనున్నాడు. భారత్‌తో సిరీస్ తర్వాత ఈనెల 22-24 వరకు మైసూర్లో రంజీ చాంప్ కర్ణాటకతో బంగ్లాదేశ్-ఎ మూడు రోజుల మ్యాచ్ ఆడనుంది.