రాణించిన బ్యాటర్లు.. కెప్టెన్‌ సెంచరీ.. సైనీ కూడా దంచికొట్టాడు! | India-A Vs Bangladesh-A 2nd Unofficial Test Match | Sakshi
Sakshi News home page

IND A Vs BAN A: రాణించిన బ్యాటర్లు.. కెప్టెన్‌ సెంచరీ.. సైనీ కూడా దంచికొట్టాడు!

Published Fri, Dec 9 2022 7:10 AM | Last Updated on Fri, Dec 9 2022 2:25 PM

India-A Vs Bangladesh-A 2nd Unofficial Test Match - Sakshi

సిల్హెట్‌: బంగ్లాదేశ్‌ ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ 310 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సంపాదించింది. జయంత్‌ యాదవ్‌ (83; 10 ఫోర్లు)తో పాటు సౌరభ్‌ కుమార్‌ (55; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), నవ్‌దీప్‌ సైనీ (50 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 562 పరుగుల భారీస్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది.

జయంత్, సౌరభ్‌  ఏడో వికెట్‌కు 86 పరుగులు జోడించగా, సైనీ, ముకేశ్‌ కుమార్‌ (23 నాటౌట్‌; 3 ఫోర్లు) అజేయమైన ఆఖరి వికెట్‌కు 68 పరుగులు జత చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్‌ మొదలుపెట్టిన బంగ్లా ‘ఎ’ ఆటనిలిచే సమయానికి 49/2 స్కోరు చేసింది. షాద్‌మన్‌ ఇస్లామ్‌ (22 బ్యాటింగ్‌), మోమినుల్‌ (4 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement