ఎమర్జింగ్ ఆసియా కప్ 2023లో బుధవారం ఇండియా-ఏ, పాకిస్తాన్-ఏ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ ఏదైనా చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నాయంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. అది జూనియర్ లేదా సీనియర్ మ్యాచ్ కావొచ్చ.. ఉత్కంఠ మాత్రం గ్యారంటీగా ఉంటుంది. తాజాగా మ్యాచ్‌లో సీఎస్‌కే పేసర్.. యువ బౌలర్ రాజ్‌వర్దన్ హంగర్గేకర్ సంచలన స్పెల్‌తో మెరిశాడు.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో పాటు మెయిడెన్ చేయడం విశేషం. పాక్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ హంగర్గేకర్ వేశాడు. ఓవర్‌లో రెండో బంతికి సయీమ్ అయూబ్‌ను డకౌట్‌గాపెవిలియన్ చేర్చాడు. మూడు డాట్‌బాల్స్ అనంతరం ఆఖరి బంతికి ఒమెర్ యూసఫ్ కూడా ద్రువ్ జురేల్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. అలా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి పాక్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం పాకిస్తాన్-ఏ జట్టు 36 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఖాసిమ్ అక్రమ్ 26, ముబాసిర్ ఖాన్ 17 పరుగులతో ఆడుతున్నారు.
ఎవరీ రాజ్‌వర్దన్ హంగర్గేకర్?
నవంబర్ 10, 2002లో జన్మించిన రాజ్‌వర్దన్ హంగర్గేకర్ ప్రస్తుతం ఇండియా-ఏ టీమ్‌లో ప్రామిసింగ్ క్రికెటర్‌గా ఉన్నాడు. తన ఫాస్ట్ బౌలింగ్‌తో అనతి కాలంలోనే డొమెస్టిక్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 2020-21 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్ర తరపున హంగర్గేకర్ దేశవాలీ టి20 క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత లిస్ట్-ఏలోనూ అరంగేట్రం చేసిన రాజ్‌వర్దన్ హంగర్గేకర్ ఇప్పుడిప్పుడే దేశవాలీలో సత్తా చాటుతున్నాడు.
2022 ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్‌కు హంగర్గేకర్ జట్టులో చోటు సంపాదించాడు. తన ప్రదర్శనతో ఆకట్టుకున్న హంగర్గేకర్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి పడింది. సీఎస్‌కే 2022 ఐపీఎల్ వేలంలో అతన్ని కొనుగోలు చేసింది. ఇక 31 మార్చి 2023న రాజ్‌వర్దన్ హంగర్గేకర్ సీఎస్‌కే తరపున ఐపీఎల్‌లో ఆడాడు. అయితే మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వ్యవహరించాడు.
Pace is Pace Yaar, right? 😉
— FanCode (@FanCode) July 19, 2023
Hangargekar with two wickets early in the game!#INDvPAK #LIVEonFanCode pic.twitter.com/WCqF7vO4bS
చదవండి: ధోనిని ముప్పుతిప్పలు పెట్టిన కివీస్ టాప్-3 బౌలర్, కట్‌చేస్తే సూపర్‌మార్కెట్ ఓనర్‌గా
Ishan Kishan: 'ఇవ్వడానికి ఏం లేదు.. బర్త్‌డే గిఫ్ట్ నువ్వే మాకు ఇవ్వాలి'
Comments
Please login to add a commentAdd a comment