Rajvardhan Hangargekar
-
Ind Vs Pak: సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్.. పాక్‌ను చిత్తు చేసిన భారత్
ACC Mens Emerging Teams Asia Cup 2023- Pakistan A vs India A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో భాగంగా భారత యువ జట్టు పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్-ఏ- పాకిస్తాన్- ఏ జట్లు బుధవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పాక్‌కు ఆదిలోనే షాకిచ్చాడు భారత యువ పేసర్ రాజ్వర్ధన్ హంగర్గేకర్. ఓపెనర్ సయీమ్ ఆయుబ్‌ను డకౌట్ చేశాడు. ఐదు వికెట్లతో చెలరేగిన హంగర్గేకర్ అంతేకాదు.. వన్‌డౌన్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్‌తో కూడా సున్నా చుట్టించాడు. దీంతో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన పాక్‌ను ఓపెనర్ షాహిజాదా ఫర్హాన్(35), హసీబుల్లా ఖాన్(27) ఆదుకున్నారు. అయితే, భారత స్పిన్నర్ మానవ్ సుతార్, ఫాస్ట్‌బౌలర్ హంగేర్గకర్ వారిని ఎక్కువసేపు నిలవనీయలేదు. వీరిద్దరి విజృంభణతో పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కాసిం అక్రమ్(48) కాసేపు పోరాడాడు. అతడికి తోడుగా.. ముబాసిర్ ఖాన్(28) రాణించాడు. ఆఖర్లో మెహ్రాన్ మంతాజ్ 25 పరుగులతో అజేయంగా నిలవడంతో 48 ఓవర్లలో పాకిస్తాన్ 205 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో హంగేర్గకర్ అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. మానవ్‌కు మూడు, రియాన్ పరాగ్, నిషాంత్ సింధు ఒక్కో వికెట్ తీశారు. సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ సాయి సుదర్శన్ అదిరిపోయే ఆరంభం అందించాడు. సెంచరీ(104)తో చెలరేగి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. వరుసగా రెండు సిక్సర్లు బాది శతకం పూర్తి చేసుకుని వారెవ్వా అనిపించాడు. ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(20) నిరాశ పరచగా.. వన్‌డౌన్‌లో వచ్చిన నికిన్ జోస్ అర్ధ శతకం(53)తో రాణించి సాయితో కలిపి మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశాడు. మెహ్రాన్ బౌలింగ్‌లో నికిన్ అవుట్ అయ్యాడు. హ్యాట్రిక్ విజయం అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ యశ్ ధుల్ 19 బంతుల్లో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సాయి సుదర్శన్ అజేయ శతకం, నికిన్ జోస్ హాఫ్ సెంచరీ కారణంగా భారత్ 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. కాగా ఈ టోర్నీలో భారత-ఏ జట్టుకు ఇది హ్యాట్రిక్ విజయం. అంతకు ముందు యూఏఈ, నేపాల్‌లపై భారీ విజయాలు నమోదు చేసింది. చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో.. -
పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు! రియాన్ పరాగ్ సైతం
ACC Mens Emerging Teams Asia Cup 2023- Pakistan A vs India A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత-ఏ జట్టు బౌలర్లు అద్భుతంగా రాణించారు. యువ పేసర్ రాజ్వర్ధన్ హంగర్గేకర్ ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ మానవ్ సుతార్ మూడు వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరికి తోడు మరో స్పిన్నర్ నిషాంత్ సింధు, పార్ట్‌టైమ్ స్పిన్ బౌలర్ రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్-ఏ, పాక్- ఏ జట్ల మధ్య బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డకౌట్ ఈ క్రమంలో హంగర్గేకర్ పాక్ ఓపెనర్ సయీమ్ ఆయుబ్‌ను డకౌట్ చేయడంతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్‌ను కూడా పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన పాక్‌ను ఓపెనర్ షాహిజాదా ఫర్హాన్(35), హసీబుల్లా ఖాన్(27) ఆదుకునే ప్రయత్నం చేశారు. 48 ఓవర్లలోనే కథ ముగిసింది అయితే, మానవ్ సుతార్, హంగేర్గకర్ ధాటికి వరుసగా వికెట్లు పడ్డాయి. టాపార్డర్ విఫలమైన వేళ లోయర్ ఆర్డర్లో వచ్చిన కాసిం అక్రమ్(48), ముబాసిర్ ఖాన్(28) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆఖర్లో మెహ్రాన్ మంతాజ్ 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, భారత బౌలర్ల ధాటికి 48 ఓవర్లలోనే పాకిస్తాన్ కథ ముగిసింది. 205 పరుగులు చేసి దాయది జట్టు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యశ్ ధుల్ సేన గెలవాలనే పట్టుదలతో రంగంలోకి దూకింది. కాగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించింది. యూఏఈ, నేపాల్‌లపై వరుసగా 8, 9 వికెట్ల తేడాతో గెలుపొంది. చిరకాల ప్రత్యర్థిపై కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో.. విండీస్‌తో రెండో టెస్టు! కీలక అప్డేట్ ఇచ్చిన రోహిత్!; వాళ్లకు నో ఛాన్స్! -
పాక్‌తో మ్యాచ్.. సంచలన స్పెల్‌తో మెరిసిన సీఎస్కే బౌలర్
ఎమర్జింగ్ ఆసియా కప్ 2023లో బుధవారం ఇండియా-ఏ, పాకిస్తాన్-ఏ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ ఏదైనా చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నాయంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. అది జూనియర్ లేదా సీనియర్ మ్యాచ్ కావొచ్చ.. ఉత్కంఠ మాత్రం గ్యారంటీగా ఉంటుంది. తాజాగా మ్యాచ్‌లో సీఎస్కే పేసర్.. యువ బౌలర్ రాజ్‌వర్దన్ హంగర్గేకర్ సంచలన స్పెల్‌తో మెరిశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో పాటు మెయిడెన్ చేయడం విశేషం. పాక్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ హంగర్గేకర్ వేశాడు. ఓవర్లో రెండో బంతికి సయీమ్ అయూబ్‌ను డకౌట్గాపెవిలియన్ చేర్చాడు. మూడు డాట్‌బాల్స్ అనంతరం ఆఖరి బంతికి ఒమెర్ యూసఫ్ కూడా ద్రువ్ జురేల్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. అలా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి పాక్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం పాకిస్తాన్-ఏ జట్టు 36 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఖాసిమ్ అక్రమ్ 26, ముబాసిర్ ఖాన్ 17 పరుగులతో ఆడుతున్నారు. ఎవరీ రాజ్‌వర్దన్ హంగర్గేకర్? నవంబర్ 10, 2002లో జన్మించిన రాజ్‌వర్దన్ హంగర్గేకర్ ప్రస్తుతం ఇండియా-ఏ టీమ్‌లో ప్రామిసింగ్ క్రికెటర్‌గా ఉన్నాడు. తన ఫాస్ట్ బౌలింగ్‌తో అనతి కాలంలోనే డొమెస్టిక్ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2020-21 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్ర తరపున హంగర్గేకర్ దేశవాలీ టి20 క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత లిస్ట్-ఏలోనూ అరంగేట్రం చేసిన రాజ్‌వర్దన్ హంగర్గేకర్ ఇప్పుడిప్పుడే దేశవాలీలో సత్తా చాటుతున్నాడు. 2022 ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్‌కు హంగర్గేకర్ జట్టులో చోటు సంపాదించాడు. తన ప్రదర్శనతో ఆకట్టుకున్న హంగర్గేకర్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి పడింది. సీఎస్కే 2022 ఐపీఎల్ వేలంలో అతన్ని కొనుగోలు చేసింది. ఇక 31 మార్చి 2023న రాజ్‌వర్దన్ హంగర్గేకర్ సీఎస్కే తరపున ఐపీఎల్లో ఆడాడు. అయితే మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వ్యవహరించాడు. Pace is Pace Yaar, right? 😉 Hangargekar with two wickets early in the game!#INDvPAK #LIVEonFanCode pic.twitter.com/WCqF7vO4bS — FanCode (@FanCode) July 19, 2023 చదవండి: ధోనిని ముప్పుతిప్పలు పెట్టిన కివీస్ టాప్-3 బౌలర్, కట్‌చేస్తే సూపర్‌మార్కెట్ ఓనర్‌గా Ishan Kishan: 'ఇవ్వడానికి ఏం లేదు.. బర్త్‌డే గిఫ్ట్ నువ్వే మాకు ఇవ్వాలి' -
ఒక్క మ్యాచ్ ఆడలేదు.. కోటికి పైగా వెనకేశారు! టైటిల్ కూడా!
IPL 2022: కొంతమంది ఆటగాళ్లు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. మరికొంత మంది ఒక్కసారి తమ ప్రతిభ నిరూపించుకుంటే చాలు.. అదృష్టం వెంటపడి మరీ వరిస్తుంది. అలా కాలు మీద కాలేసుకుని కూర్చున్నా కనకవర్షం కురిపిస్తుంది. ఇక ఐపీఎల్ వంటి క్యాష్ రిచ్‌లీగ్‌లో ఇలాంటి ఘటనలు జరగడం సహజమే! కొన్ని ఫ్రాంఛైజీలు వేలంలో కోట్లు పోసి కొన్న క్రికెటర్లను కూడా బెంచ్‌కే పరిమితం చేసే పరిస్థితులు ఉంటాయి. జట్టు అత్యుత్తమ కూర్పులో భాగంగా కొందరిని పక్కనపెడతాయి. అయినా సరే వాళ్లకు చెల్లించాల్సిన మొత్తం చెల్లించక తప్పదు కదా! అలా ఐపీఎల్-2022లో బెంచ్‌కే పరిమితమై కోటి రూపాయలకు పైగా సంపాదించిన టాప్-3 క్రికెటర్లను పరిశీలిద్దాం! వీరిలో ఇద్దరు ఆడకుండానే టైటిల్ గెలిచిన జట్టులో భాగం కావడం విశేషం. 1.జయంత్ యాదవ్ ఐపీఎల్ మెగా వేలం-2022లో టీమిండియా ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్‌ను 1.7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. కనీస ధర కోటితో ఆక్షన్‌లోకి వచ్చిన అతడిని లక్నో సూపర్ జెయింట్స్‌తో పోటీ పడి మరీ సొంతం చేసుకుంది. రషీద్ ఖాన్‌తో కలిసి అతడిని బరిలోకి దింపుతారనే అంచనాలు ఉన్నా.. అలా జరుగలేదు. సీజన్ ఆసాంతం ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జయంత్‌కు ఒక్కసారి కూడా తుది జట్టులో చోటు లభించలేదు. రషీద్, సాయి కిషోర్, రాహుల్ తెవాటియాలతో పోటీలో అతడు వెనుకబడిపోయాడు. ఇక ఐపీఎల్-2022తో ఎంట్రీ ఇచ్చిన సీజన్లోనే గుజరాత్ చాంపియన్స్‌గా నిలిచిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. View this post on Instagram A post shared by Jayant Yadav (@jyadav19) 2. డొమినిక్ డ్రేక్స్ ఐపీఎల్లో అత్యంత అదృష్టవంతుడైన ప్లేయర్‌గా కరేబియన్ ఆల్‌రౌండర్ డొమినిక్ డ్రేక్స్ పేరొందాడు. కనీసం ఒక్కసారైనా క్యాష్ రిచ్ లీగ్ టైటిల్ గెలిచిన జట్టులో భాగమవ్వాలని ప్రతి ఒక్క ఆటగాడి కల. డొమినిక్ డ్రేక్స్‌కు ఇది రెండుసార్లు నెరవేరింది. అది కూడా ఒక్క మ్యాచ్ ఆడకుండానే. గత సీజన్ రెండో అంచెలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది. ఇక ఆ 2021 ఎడిషన్‌లో చెన్నై టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2022 మెగావేలంలో ఆర్సీబీతో పోటీ పడి మరీ గుజరాత్ టైటాన్స్ డొమినిక్‌ను దక్కించుకుంది. ఇందుకోసం ఏకంగా 1.1 కోట్లు ఖర్చు చేసింది. అయితే, ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో అతడు బెంచ్‌కే పరిమితమైనా కోటితో పాటు మరో ఐపీఎల్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. View this post on Instagram A post shared by Filter Cricket ⬇️ (@filtercricket) 3. రాజ్వర్ధన్ హంగర్కర్ భారత అండర్-19 జట్టులో సభ్యుడైన రాజ్వర్ధన్.. వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టి ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో సీఎస్కే ఈ యువ ఆల్‌రౌండర్‌ను 1.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ.. తుదిజట్టులో చోటు కల్పించలేదు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరగల.. జట్టుకు అవసరమైన సమయంలో బ్యాటింగ్ చేయగల రాజ్‌వర్ధన్‌కు అవకాశం ఇవ్వలేదు. చదవండి: IPL: మా వాళ్లంతా సూపర్.. ఏదో ఒకరోజు నేనూ ఐపీఎల్లో ఆడతా: ప్రొటిస్ కెప్టెన్ Hardik Pandya - Kiran More: 'ఆ ఆటగాడు ఇకపై ఫోర్-డి ప్లేయర్'.. టీమిండియా మాజీ క్రికెటర్ -
IPL 2022: అతడికి ఆఖరి మ్యాచ్‌లోనైనా ధోని ఛాన్స్ ఇవ్వాలి.. అప్పుడే!
IPL 2022 RR Vs CSK: అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కీలక సభ్యుడు రాజ్వర్ధన్ హంగర్కర్. ఐసీసీ మెగా ఈవెంట్లో బంతితోనూ.. బ్యాట్‌తోనూ రాణించిన ఈ యువ ఆటగాడిని ఐపీఎల్-2022 మెగా వేలంలో చెన్నై సూపర్‌కింగ్స్ 1.5 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. అయితే, ఇంతవరకు అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక ఈ సీజన్లో ఘోర వైఫల్యంతో ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ధోని సేన శుక్రవారం(మే 20) తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ రాజ్‌వర్ధన్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కనీసం ఆఖరి పోరులోలైనా అతడిని భాగం చేయాలని సూచించాడు. రాజ్వర్ధన్ హంగర్కర్(ఫైల్ ఫొటో) ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘చివరి మ్యాచ్‌లో సీఎస్కే గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా వాళ్లు కొత్త కాంబినేషన్లు ట్రై చేయవచ్చు. అయితే, అదెలా ఉంటుందో మనం ఊహించలేము. నాకైతే ప్రశాంత్ సోలంకి స్థానంలో రాజ్వర్ధన్ హంగర్కర్ తుదిజట్టులోకి వస్తే చూడాలని ఉంది. ధోని అతడికి అవకాశం ఇస్తాడని భావిస్తున్నా. ఒకవేళ రాజ్వర్ధన్ ఫిట్‌గా ఉండి.. అతడికి ఛాన్స్ వస్తే కచ్చితంగా తనను తాను నిరూపించుకోగలడు’’ అని క్రిక్‌బజ్‌తో వ్యాఖ్యానించాడు. కాగా క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్‌లో సీఎస్కే దారుణంగా విఫలమైంది. తొలుత రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పజెప్పిన యాజమాన్యం.. వరుస వైఫల్యాల నేపథ్యంలో ఎంఎస్ ధోనిని మళ్లీ కెప్టెన్‌గా నియమించింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కేవలం నాలుగు గెలిచి 8 పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఆఖరి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. చదవండి👉🏾Matthew Wade: డ్రెస్సింగ్ రూమ్ వినాశనం; వార్నింగ్‌తో సరి.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022- CSK: డుప్లెసిస్ స్థానంలో టీమిండియా వెటరన్ ఆటగాడే సరైనోడు!
మరికొన్ని రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ఆరంభం కానుంది. మార్చి 26న చెన్నై సూపర్‌కింగ్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్‌తో తాజా సీజన్ మొదలు కాబోతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీసులో తలమునకలై పోయాయి. అయితే, గత సీజన్లో సీఎస్కేను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన స్టార్ పేసర్, వేలంలో భారీ ధర పలికిన దీపక్ చహర్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కావడంతో ధోని సేనకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అంతేగాక అత్యధిక పరుగుల వీరుడు, సీఎస్కే స్టార్ ఓపెనర్ రుతురాజ్‌గైక్వాడ్ ఫిట్నెస్ సాధించడం ఊరట కలిగించినా.. అతడికి జోడీ ఎవరన్నది ఇంకా తేలలేదు. గత సీజన్లో రుతుతో కలిసి ఓపెనింగ్ చేసిన ఫాఫ్ డుప్లెసిస్‌ను వదిలేయగా ఆర్సీబీ వేలంలో అతడిని కొనుగోలు చేసి కెప్టెన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో వీరి స్థానాల్ని భర్తీ చేయగల ఆటగాళ్లు ఎవరన్నా అన్న చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీపక్ చహర్‌ను రీప్లేస్ చేయగల సత్తా అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్ రాజ్వర్ధన్ హంగర్కర్కు ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘దీపక్ చహర్ గొప్ప బౌలర్. అతడు దూరం కావడం సీఎస్కేకు పెద్ద దెబ్బ. నిజానికి శార్దూల్ ఠాకూర్ కూడా ఇప్పుడు సీఎస్కేలో లేడు. చహర్ స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో యువ ఆటగాడు హంగర్కర్ సేవలను సీఎస్కే ఉపయోగించుకుంటే ఫలితం ఉంటుంది. అతడు ప్రతిభావంతుడు. అయితే, హంగర్కర్ చాలా చిన్నవాడు. తనకు అనుభవం తక్కువ. కానీ ధోని వంటి నాయకుడు ఉన్నపుడు ఇలాంటి విషయాలకు భయపడాల్సిన పనిలేదు. యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ఫలితాలు రాబట్టడం, వారిని సౌకర్యంగా మెదిలేలా చేయడంలో ధోని దిట్ట. కాబట్టి హంగర్కర్ను చహర్ ప్లేస్‌లో జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది’’ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. ‘‘ఇక ఫాఫ్ స్థానం విషయంలో సీఎస్కేకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే. మరొకరు రాబిన్ ఊతప్ప. ఊతప్ప సైతం ఓపెనర్‌గా రాణించగలడనే నమ్మకం ఉంది. అయితే, సీఎస్కే వ్యూహం ప్రకారం ఓపెనింగ్ జోడీలో కచ్చితంగా ఒక విదేశీ ఓపెనర్ ఉండాలనుకుంటే... కాన్వే మంచి ఆప్షన్’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2022: షాట్లతో అలరించిన రిషభ్ పంత్.. రెప్పవాల్చని యువ ఆటగాళ్లు 📹 Slowed to perfection! #Yellove #WhistlePodu 🦁💛 pic.twitter.com/4fS1o9sm3H — Chennai Super Kings (@ChennaiIPL) March 20, 2022 The one with "I'm gonna go with Mahi bhai first!" 💛#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/YBTevDUJZK — Chennai Super Kings (@ChennaiIPL) March 19, 2022 -
"దీపక్ చాహర్ స్ధానాన్ని భర్తీ చేసే సత్తా అతడికే ఉంది"
ఐపీఎల్-2022 మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. అయితే సీఎస్కే స్టార్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అతడితో పాటు రుత్‌రాజ్ గైక్వాడ్ కూడా ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో ఉన్నారు. ఇది ఇలా ఉంటే.. సాధరణంగా చాహర్ పేస్ బౌలర్‌గా జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తాడు. అయితే అతడు దూరం కావడంతో అతడి స్ధానాన్ని జట్టులో ఎవరు భర్తీ చేస్తారన్నది ప్రశ్నార్ధకమైంది. ఈ నేపథ్యంలో చాహర్ స్ధానాన్ని భర్తీ చేసే సత్తా అండర్-19 బౌలర్ రాజవర్ధన్ హంగర్గేకర్‌కు ఉంది అని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయ పడ్డాడు. ఐపీఎల్ మెగా వేలంలో హంగర్గేకర్ను సీఎస్కే రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక రాజవర్ధన్ హంగర్గేకర్ అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించాడు. అతడు బంతితో పాటు బ్యాట్‌తో కూడా దుమ్ము దులిపాడు. "దీపక్ చాహర్ త్వరగా కోలుకోవాలని సీఎస్కే మేనేజేమెంట్ కోరుకుంటుంది. ఒక వేళ అతడు అందుబాటులో లేకుంటే హంగర్గేకర్తో ఆ స్ధానాన్ని భర్తీ చేయవచ్చు. అతడు తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు ముప్పుతిప్పలు పెట్టగలడు. అంతేకాకుండా అతడికి సిక్స్ హిట్టింగ్ చేసే సామర్థ్యం కూడా ఉంది. కాబట్టి చెన్నై విజయాల్లో అతడు కీలకపాత్ర పోషిస్తాడని భావిస్తున్నాను" అని పేర్కొన్నాడు. చదవండి: WTC Final: అటు ఇంగ్లండ్.. ఇటు ఆస్ట్రేలియా.. టీమిండియాకు అంత ఈజీ కాదు! no looks from hangargekar pic.twitter.com/e4gukWDVtE — ‘ (@Ashwin_tweetz) March 10, 2022 -
IPL 2022: ఏయ్.. రాజ్వర్ధన్.. అలా కాదు.. ఇలా.. కాస్త చూసుకో! సరే భయ్యా!
IPL 2022- CSK Practice Session: అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్ రాజ్వర్ధన్ హంగర్కర్ నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. బ్యాట్, బంతితో ప్రాక్టీసు చేస్తున్నాడు. మిస్టర్ కూల్ ధోని సలహాలు, సూచనలు తీసుకుంటూ ఆటపై దృష్టి సారించాడు. కాగా ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్ రాజ్‌వర్ధన్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 1.5 కోట్లు చెల్లించి అతడిని సొంతం చేసుకుంది. ఇక ఐపీఎల్-2022 సన్నాహకాల్లో భాగంగా ధోని సారథ్యంలోని సీఎస్కే ఇప్పటికే సూరత్ చేరుకుని ప్రాక్టీసు చేస్తోంది. ఇందులో భాగంగా రాజ్వర్ధన్ గురువారం ప్రాక్టీసు సెషన్లో పాల్గొన్నాడు. సిక్సర్లు బాదుతూ తన బ్యాటింగ్ నైపుణ్యాలు ప్రదర్శించిన అతడు.. ఫీల్డింగ్ కోచ్ సలహాలతో బంతితోనూ మెరిశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్కే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో ..‘‘ ఏయ్.. రాజ్వర్ధన్.. అలా కాదు.. ఇలా.. కాస్త చూసుకో! అంటూ ధోని సలహాలు ఇస్తున్నాడు. సరే భయ్యా! అని రాజ్‌వర్థన్ అంటున్నాడు’’ అంటూ నెటిజన్లు సరాదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా డిఫెండింగ్ చాంపియన్ చెన్నై, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మార్చి 26న మ్యాచ్‌తో 15వ సీజన్ ఆరంభం కానుంది. ముంబై వేదికగా అత్యధిక మ్యాచ్‌లు జరుగనున్న నేపథ్యంలో అక్కడి పిచ్‌లను పోలి ఉండే సూరత్ స్టేడియంను సీఎస్కే ప్రాక్టీసు కోసం ఎంచుకోవడం విశేషం. ఇక రాజ్వర్ధన్ విషయానికొస్తే అతడు గంటకు 140 కి.మీ. వేగంతో బంతిని విసరగలడు. అంతేకాదు జట్టుకు అవసరమైన సమయంలో బ్యాట్‌తోనూ రాణించగలడు. అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో మూడు వరుస సిక్సర్లు బాది బ్యాటింగ్ పదును చూపించాడు. ఈ క్రమంలో చెన్నై ఫ్రాంఛైజీ దృష్టిని ఆకర్షించాడు. స్టార్ ప్లేయర్ దీపక్ చహర్ జట్టుకు దూరం కానున్నాడన్న వార్తల నేపథ్యంలో రాజ్‌వర్ధన్‌ను అతడికి ప్రత్యామ్నాయంగా ఎంచుకునే అవకాశం ఉంది. చదవండి: IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. మరో స్టార్ ఆటగాడు దూరం! -
దీపక్ చహర్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీళ్లే!
-
IPL 2022: దీపక్ చహర్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీళ్లే!
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ దీపక్ చహర్ గాయం కారణంగా జట్టుకు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా 14 కోట్ల రూపాయలు ఖర్చు చేసి చహర్‌ను సొంతం చేసుకున్న ఫ్రాంఛైజీకి భారీ షాక్ తగిలినట్లయింది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న చహర్ సగం మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడన్న కథనాల నేపథ్యంలో సీఎస్కే ఫ్యాన్స్ సైతం ఉసూరుమంటున్నారు. తనదైన రోజున మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగల స్టార్ దూరం అయితే పరిస్థితి ఏమిటని చర్చించుకుంటున్నారు. మరి చహర్ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు ఎవరో ఓ లుక్కేద్దామా! తుషార్ దేశ్‌పాండే ఐపీఎల్- 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున క్యాష్ రిచ్‌లీగ్‌లో అడుగుపెట్టాడు ఈ ముంబై పేసర్. గత సీజన్లో సీఎస్కేకు నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరగలడు. దేశవాళీ టోర్నీల్లో బ్యాటర్లకు చుక్కలు చూపించిన తుషార్.. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021లో ముంబై తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా 26 ఏళ్ల తుషార్ నిలిచాడు. రాజ్వర్ధన్ హంగర్కర్ అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు రాజ్వర్ధన్ హంగర్కర్. మెగా వేలంలో భాగంగా చెన్నై 1.5 కోట్లు చెల్లించి అతడిని సొంతం చేసుకుంది. ఈ యువ ఫాస్ట్ బౌలర్ గంటకు 140 కి.మీ. వేగంతో బంతిని విసరగలడు. అంతేకాదు దీపక్ చహర్లాగే జట్టుకు అవసరమైన సమయంలో బ్యాట్ ఝులిపించగలడు కూడా! వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో మూడు వరుస సిక్సర్లు బాది సత్తా చాటాడు. కేఎమ్ ఆసిఫ్ 2018 నుంచి సీఎస్కే జట్టులో ఉన్నాడు ఆసిఫ్. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడాడు. కేరళకు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ తొలుత దుబాయ్‌లో జీవించేవాడు. ఓ షాప్‌లో స్టోర్‌కీపర్‌గా పనిచేశాడు. యూఏఈ జట్టులో స్థానం సంపాదించేందుకు చాలా కష్టపడ్డాడు. కానీ ఫలితం దక్కలేదు. 2018లో సీఎస్కే కొనుగోలు చేయడంతో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది ఢిల్లీతో మ్యాచ్‌కు దీపక్ చహర్ గాయం కారణంగా దూరం కావడంతో ఆసిఫ్ అతడి స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2019-20 విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో ఏడు మ్యాచ్‌లలో 14 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్‌కు ముందు ఫ్రాంచైజీలకు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ -
IPL 2022 Auction: వేలంలో 1.5 కోట్లు.. సీఎస్కే యువ ఆటగాడిపై సంచలన ఆరోపణలు
U 19 WC Star CSK Young Player Accused Of Age Fraud: అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రాజ్వర్ధన్ హంగర్కర్పై సంచలన ఆరోపణలు వచ్చాయి. వయసును తక్కువగా చూపించి అతడు మోసానికి పాల్పడ్డాంటూ మహారాష్ట్ర క్రీడా, యువజన విభాగం కమిషనర్ ఓం ప్రకాశ్ బకోరియా ఆరోపించారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలికి లేఖ రాసినట్లు స్థానిక సామ్నా పత్రిక కథనం వెలువరించింది. కాగా ఇటీవల వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్ 19 వరల్డ్‌కప్‌ను యశ్ ధుల్ సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో రాజ్వర్ధన్ హంగర్కర్ సభ్యుడిగా ఉన్నాడు. ఇక ప్రపంచకప్ టోర్నీలో మెరుగ్గా రాణించిన నేపథ్యంలో పలువురు అండర్ 19 ఆటగాళ్లు ఐపీఎల్ మెగా వేలం-2022లో మంచి ధర పలికిన సంగతి తెలిసిందే. ఆక్షన్‌లో భాగంగా మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై ఫ్రాంఛైజీ 1.5 కోట్లు వెచ్చించి రాజ్‌వర్ధన్‌ను కొనుగోలు చేసింది. గంటకు 140 కి.మీ. వేగంతో బంతిని విసరగల ఈ యువ ఫాస్ట్ బౌలర్‌ను తమ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఓం ప్రకాశ్ రాజ్వర్ధన్పై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ‘‘ధారాశివ్ సీఈఓ రాహుల్ గుప్తా రాజవర్ధన్ హంగర్కర్ పుట్టిన తేదీ వివరాల గురించి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ధారాశివ్ పబ్లిక్ స్కూల్లో ఉన్న వివరాల ప్రకారం అతడు 2001 జనవరి 10న జన్మించినట్లు రాశారు. అయితే, అతడు ఎనిమిదో తరగతి చదువుతున్నపుడు దీనిని 2002 నవంబరు 10గా మార్చినట్లు ఉంది’’ అని ఓం ప్రకాశ్ తన లేఖలో బీసీసీఐకి వివరించారు. ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ వర్గాలు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ... ‘‘అవును... మహారాష్ట్ర నుంచి మాకు లేఖ అందింది. ఆ ఆటగాడిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై మేము దృష్టి సారించాం. అయితే, ఇప్పుడే ఒక అంచనాకు రాలేం. వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది. లోతుగా దర్యాప్తు చేస్తాం’’ అని పేర్కొన్నారు. చదవండి: తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా! Some Cricketers are playing Cricket with fabricated Date of Birth Certificate. Cricketers who Indulge in a fraud in DOB not only violate core values of Crocket but also put genuine Cricketers in a disadvantages position. It’s against the integrity of sports.@bcci @SGanguly99 — Om Prakash Bakoria (@ombakoria) February 14, 2022