IPL 2022: Here We Take a Look at the Possible Replacements for Deepak Chahar From Current CSK Squad - Sakshi
Sakshi News home page

IPL 2022- CSK: దీప‌క్ చ‌హ‌ర్ స్థానాన్ని భ‌ర్తీ చేయ‌గ‌ల ఆట‌గాళ్లు వీళ్లే!

Published Sat, Mar 5 2022 5:56 PM | Last Updated on Mon, Mar 7 2022 5:03 PM

IPL 2022: Players Who Can Replace Deepak Chahar in CSK Check - Sakshi

చెన్నై సూపర్‌ కింగ్స్  స్టార్‌ బౌలర్‌ దీపక్‌ చహర్‌ గాయం కారణంగా జ‌ట్టుకు దూరం కానున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా 14 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి చహ‌ర్‌ను సొంతం చేసుకున్న ఫ్రాంఛైజీకి భారీ షాక్ త‌గిలిన‌ట్ల‌యింది.

తొడ కండ‌రాల గాయంతో బాధ‌ప‌డుతున్న చ‌హ‌ర్ స‌గం మ్యాచ్‌ల‌కు అందుబాటులో ఉండ‌డ‌న్న క‌థ‌నాల నేప‌థ్యంలో సీఎస్‌కే ఫ్యాన్స్ సైతం ఉసూరుమంటున్నారు. త‌న‌దైన రోజున మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించ‌గ‌ల స్టార్ దూరం అయితే ప‌రిస్థితి ఏమిట‌ని చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి చ‌హ‌ర్ స్థానాన్ని భ‌ర్తీ చేయ‌గల స‌త్తా ఉన్న ఆట‌గాళ్లు ఎవ‌రో ఓ లుక్కేద్దామా!

తుషార్ దేశ్‌పాండే
ఐపీఎల్‌- 2020 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌ఫున క్యాష్ రిచ్‌లీగ్‌లో అడుగుపెట్టాడు ఈ ముంబై పేస‌ర్‌. గ‌త సీజ‌న్‌లో సీఎస్‌కేకు నెట్ బౌల‌ర్‌గా వ్య‌వ‌హరించాడు. గంట‌కు 140 కిలోమీట‌ర్ల వేగంతో బంతిని విస‌ర‌గ‌ల‌డు. దేశవాళీ టోర్నీల్లో బ్యాట‌ర్లకు చుక్క‌లు చూపించిన తుషార్‌.. డెత్ ఓవ‌ర్ల‌లో అద్భుతంగా బౌలింగ్ చేయ‌గ‌ల‌డు.

ఐపీఎల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడి 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక దేశ‌వాళీ టీ20 టోర్నీ స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021లో ముంబై త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు తీసిన రెండో బౌల‌ర్‌గా 26 ఏళ్ల తుషార్ నిలిచాడు.

రాజ్‌వర్ధన్‌ హంగర్కర్‌
అండర్‌ 19 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యుడు రాజ్‌వర్ధన్‌ హంగర్కర్‌. మెగా వేలంలో భాగంగా చెన్నై 1.5 కోట్లు చెల్లించి అత‌డిని సొంతం చేసుకుంది. ఈ యువ ఫాస్ట్‌ బౌలర్ గంటకు 140 కి.మీ. వేగంతో బంతిని విసరగలడు. అంతేకాదు దీప‌క్ చ‌హ‌ర్‌లాగే జ‌ట్టుకు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో బ్యాట్ ఝులిపించ‌గ‌ల‌డు కూడా! వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో భాగంగా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో మూడు వ‌రుస సిక్స‌ర్లు బాది స‌త్తా చాటాడు. 

కేఎమ్ ఆసిఫ్‌
2018 నుంచి సీఎస్‌కే జ‌ట్టులో ఉన్నాడు ఆసిఫ్‌. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు మ్యాచ్‌లు ఆడాడు. కేర‌ళ‌కు చెందిన ఈ ఫాస్ట్ బౌల‌ర్ తొలుత దుబాయ్‌లో జీవించేవాడు. ఓ షాప్‌లో స్టోర్‌కీప‌ర్‌గా ప‌నిచేశాడు. యూఏఈ జ‌ట్టులో స్థానం సంపాదించేందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. కానీ ఫ‌లితం ద‌క్క‌లేదు. 2018లో సీఎస్‌కే కొనుగోలు చేయ‌డంతో ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు.

అదే ఏడాది ఢిల్లీతో మ్యాచ్‌కు దీప‌క్ చ‌హ‌ర్ గాయం కార‌ణంగా దూరం కావ‌డంతో ఆసిఫ్ అత‌డి స్థానంలో తుది జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నాడు. 2019-20 విజ‌య్ హ‌జారే ట్రోఫీ టోర్నీలో ఏడు మ్యాచ్‌ల‌లో 14 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

చదవండి: IPL 2022: ఐపీఎల్‌కు ముందు ఫ్రాంచైజీలకు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement