
IPL 2022 Auction: ఐపీఎల్ 2022 మెగా వేలంకు అంతా సిద్దమైంది. ఫిబ్రవరి 12,13 తేదీల్లో మెగా వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది. కాగా ఈ వేలంలో 590 మంది ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. ఇక ఐపీఎల్ మెగా 2022 వేలంకు ముందు చెన్నై సూపర్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కోడుతుంది. రానున్న వేలంలో సీఎస్కే.. డుప్లెసిస్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌ను మళ్లీ దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వేలంకు ముందు డు ప్లెసిస్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌ను సీఎస్కే రీటైన్ చేసుకోలేదు.
“వేలంలో మా వ్యూహాన్ని బయటకు చెప్పడం సరైనది కాదు, అయితే సీఎస్కేకు ఎక్కువ కాలం సేవలందించిన ఆటగాళ్లను తిరిగి దక్కించుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ మేము టార్గెట్ చేసుకున్న పేర్లును నేను బయటకు వెల్లడించాలి అనుకోవడం లేదు. చాలా మంది ఆటగాళ్లు ఎక్కువ కాలం జట్టుకు సేవలు అందిచారు. అయితే రీటెన్షన్ నిబంధనల కారణంగా మేము వదులుకోవాల్సి వచ్చింది" అని చెన్నై సూపర్ కింగ్స్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. సీఎస్కే వేలానికి ముందు రవీంద్ర జడేజా,మొయిన్ అలీ,ఎంస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్‌లను రీటైన్ చేసుకుంది.
చదవండి: 6 సిక్స్‌లు, 2ఫోర్లు.. కేవలం 19 బంతుల్లోనే.. బౌలర్లకు చక్కలు!
Comments
Please login to add a commentAdd a comment