ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం దగ్గరపడుతుంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీలలో వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది. అయితే స్టార్ ఆటగాళ్లు వేలంలో ఉండడంతో వేలానికి ప్రాధన్యత సంతరించుకోంది. ఈ నేపథ్యంలో రానున్న మెగా వేలంలో భారత ఫాస్ట్ బౌలర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. "ఈసారి ఐపీఎల్ వేలంలో చాలా మంది ఆటగాళ్ల కోసం జట్లు పోటీపడతాయి. అదే విధంగా భారత పేసర్లకు కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా దీపక్ చహర్ కోసం జట్లన్నీ పోటీపడబోతున్నాయి. అతడు అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలుస్తాడని గట్టిగా నమ్ముతున్నాను. చహర్ పవర్‌ప్లేలో మూడు ఓవర్లు బౌలింగ్ చేస్తాడు. అతడు వికెట్ టేకింగ్ బౌలర్. ఒకవేళ పరుగులు ఎక్కువ ఇచ్చినా, వికెట్లు పడగొడతాడు. అతడు బ్యాటింగ్‌లో కూడా రాణించగలడు. కాబట్టి వేలంలో అత్యంత ఖరీదైన భారత బౌలర్‌గా దీపక్ చహర్ అవుతాడని" ఆకాష్ చోప్రా జోస్యం చెప్పాడు. కాగా గత సీజన్ల నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్న చహర్‌ను.. ఐపీఎల్-2022 మెగా వేలం ముందు సీఎస్‌కే వదిలేసిన సంగతి తెలిసిందే.
చదవండి: India Test Captain: రోహిత్ శర్మపై టీమిండియా మాజీ సెలక్టర్ సంచలన వ్యాఖ్యలు... సిరీస్‌కు ముందు గాయపడే కెప్టెన్ అవసరమా?
IPL 2022- MS Dhoni: చెన్నై సూపర్‌కింగ్స్ సరికొత్త రికార్డు.. 7,600 కోట్లు.. భారతదేశంలో నంబర్ 1గా..
Comments
Please login to add a commentAdd a comment