Deepak Chahar
-
నా భర్త ఎక్కుడున్నా!..నా హృదయం మాత్రం ఆ జట్టుతోనే: టీమిండియా స్టార్ భార్య(ఫొటోలు)
-
IPL Auction 2025 : పేస్ బౌలర్లకు పట్టం
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు... అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానం... టైటిల్ సహా దశాబ్దకాలం పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిన పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేలంలో ఫ్రాంచైజీలను ఆకర్షించడంలో సఫలమయ్యాడు. రెండో రోజు వేలంలో భువీ (రూ.10 కోట్ల 75 లక్షలు) అత్యధిక ధరతో అగ్ర స్థానంలో నిలిచాడు. భువనేశ్వర్లాగే చెన్నై మూడు ట్రోఫీ విజయాల్లో కీలక బౌలర్‌గా నిలిచిన దీపక్ చహర్‌కు (రూ.9 కోట్ల 25 లక్షలు) భారీ మొత్తం దక్కింది. వీరిద్దరిని వరుసగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు దక్కించుకున్నాయి. ప్రతీ జట్టుకూ భారత పేసర్ల అవసరం ఉండటంతో సోమవారం వేలంలో ఆకాశ్‌దీప్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండేలకు మంచి విలువ లభించింది. విదేశీ ఆటగాళ్లలో మార్కో జాన్సెన్, విల్ జాక్స్‌లను ఫ్రాంచైజీలు తగిన మొత్తానికి సొంతం చేసుకున్నాయి. ఆరంభంలో ఆసక్తి చూపించకపోయినా... అజింక్య రహానే, దేవదత్ పడిక్కల్, ఉమ్రాన్ మాలిక్వంటి ఆటగాళ్లను చివర్లో టీమ్‌లు ఎంచుకున్నాయి. రెండో రోజు కూడా ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు నిరాశ ఎదురవగా... కేన్ విలియమ్సన్, బెయిర్‌స్టో, మిచెల్, శార్దుల్ ఠాకూర్ తదితరులను ఫ్రాంచైజీలు దూరంగా ఉంచాయి. జిద్దా (సౌదీ అరేబియా): ఐపీఎల్–2025 కోసం రెండు రోజుల పాటు సాగిన వేలం సోమవారం ముగిసింది. మొత్తం 577 మంది క్రికెటర్లు వేలంలోకి రాగా... గరిష్టంగా 204 మంది క్రికెటర్లను ఎంచుకునే అవకాశం ఉండగా... 10 ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 182 మంది ఆటగాళ్లనే వేలంలో తీసుకున్నాయి. వీరిలో 62 మంది విదేశీయులు కాగా... అన్ని జట్లూ కలిపి వేలంలో రూ.639.15 కోట్లు వెచ్చించాయి. ఐపీఎల్లో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. వేలంలో రాజస్తాన్ రూ.1 కోటీ 10 లక్షలకు ఎంచుకునే సమయానికి వైభవ్ వయసు 13 ఏళ్ల 243 రోజులు మాత్రమే. వైభవ్ ఇప్పటి వరకు 5 రంజీ మ్యాచ్‌లు, ఒక టి20 మ్యాచ్ ఆడాడు. అయితే ఇటీవల భారత అండర్–19 జట్టు సభ్యుడిగా ఆ్రస్టేలియా అండర్ –19 జట్టుతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. తొలి రోజు వేలం రికార్డులతో హోరెత్తించగా, రెండో రోజు కూడా పేరున్న ఆటగాళ్లకు మంచి మొత్తమే దక్కింది. సోమవారం జాబితాలో పెద్ద సంఖ్యలో యువ ఆటగాళ్లు బరిలో నిలవగా, కొందరిని అదృష్టం తలుపు తట్టింది. జాతీయ జట్టుకు ఆడని అన్క్యాప్డ్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు చివర్లో కనీస విలువకే తీసుకొని జట్టులో మిగిలిన ఖాళీలను నింపాయి. -
రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్ చహర్ భావోద్వేగం (ఫొటోలు)
-
ధోనితో వాదించిన రుతురాజ్.. ఎవరి ఆదేశాలు పాటించాలి?
'I've to look at both Dhoni and Ruturaj for instructions: గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చహర్. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా(21), కెప్టెన్ శుబ్‌మన్ గిల్(8) రూపంలో రెండు కీలక వికెట్లు తీసి సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. చెపాక్ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 28 పరుగులే ఇచ్చి.. రెండు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో భాగంగా గుజరాత్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సీఎస్కే అదరగొట్టిన విషయం తెలిసిందే. సొంత మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్‌ను 143 పరుగులకే కట్టడి చేసి.. 63 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. 2⃣ in 2⃣ for Chennai Super Kings 👏👏 That's some start to #TATAIPL 2024 for the men in yellow 💛 Scorecard ▶️ https://t.co/9KKISx5poZ#TATAIPL | #CSKvGT | @ChennaiIPL pic.twitter.com/njrS8SkqcM — IndianPremierLeague (@IPL) March 26, 2024 ఈ నేపథ్యంలో విజయానంతరం దీపక్ చహర్ జియో సినిమాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ నుంచి చహర్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ‘బౌలింగ్ చేసేటపుడు నువ్వు ధోనితో చర్చిస్తావా? లేదంటే గైక్వాడ్తోనా? ఆదేశాల కోసం ఎవరివైపు చూస్తావు?’ అని గావస్కర్ అడిగాడు. ఎవరి ఆదేశాలు పాటించాలో అర్థం కావడం లేదు ఇందుకు బదులిస్తూ.. ‘‘నేను ఇప్పుడు మహీ భాయ్, రుతురాజ్.. ఇద్దరి వైపూ చూడాల్సి వస్తోంది. ఒక్కోసారి మహీ భాయ్‌ను చూడాలా లేదంటే రుతురాజ్‌ను చూడాలా అన్నది అర్థం కావడం లేదు. ఆ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఏదేమైనా రుతురాజ్ తనదైన శైలిలో సమర్థవంతంగానే జట్టును ముందుకు నడిపిస్తున్నాడు’’ అని దీపక్ చహర్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ఒక్కరోజు ముందు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్న ధోని.. పగ్గాలను రుతురాజ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, ఫీల్డింగ్ సెట్ చేసే విషయంలో మాత్రం ధోని జోక్యం చేసుకుంటూనే ఉన్నాడు. కొత్త నిబంధనలు మాకే ఉపయోగకరం ఈ క్రమంలో గుజరాత్‌తో మ్యాచ్‌లో రుతురాజ్ ధోనితో వాదించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 సందర్భంగా ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల గురించి మాట్లాడుతూ.. ‘‘సీఎస్కేకు ఆడుతున్న తొలినాళ్ల నుంచే పవర్ ప్లేలో నేను మూడు ఓవర్లు బౌల్ చేస్తున్నా. కొత్త నిబంధనలకు అనుగుణంగానే నా ఆట తీరులో మార్పు చేసుకుంటున్నా. గతంలో ఆరంభ ఓవర్లోనే 2-3 బౌన్సర్లు వేస్తే.. ఆ తర్వాత ఫుల్ లెంగ్త్ బాల్‌ను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు సిద్ధంగా ఉండేవారు. అయితే, ఇప్పుడు కొత్తగా ఒక ఓవర్లో కేవలం రెండు బౌన్సర్లకే అనుమతినిచ్చారు. పేసర్లకు ఈ రూల్ అనుకూలంగా ఉంది. పెద్దగా తేమ లేని వికెట్‌పై బంతిపై గ్రిప్ సాధించేందుకు కచ్చితంగా ఉపయోగపడుతుంది’’ అని చహర్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మెరుపు అర్ధ శతకం(23 బంతుల్లో 51)తో చెలరేగిన సీఎస్కే ఆల్‌రౌండర్ శివం దూబే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: #Rohit Sharma: రోహిత్ శర్మ ఫ్లైయింగ్ కిస్.. ఫొటోలు డిలీట్ చేసిన సన్‌రైజర్స్ -
IPL 2024: ‘ధోని ఇంకో రెండేళ్లు ఆడతాడు’
IPL 2024- Is this MS Dhoni's last IPL season?: మిస్టర్ కూల్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్-2024 సీజన్లో ఆడతాడా? లేదా? తలా అభిమానులను వేధిస్తున్న ప్రశ్న ఇది. ఈసారి కొత్త పాత్రలో నేను అంటూ ధోని కూడా టీజ్ చేయడంతో ఆటగాడిగా జట్టు నుంచి నిష్క్రమిస్తాడా అనే సందేహాలు మరింత బలపడ్డాయి. తాజా ఎడిషన్‌లో మెంటార్‌గా ధోని కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే ఆల్‌రౌండర్ దీపక్ చహర్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో సంతోషాన్ని నింపాయి. ‘‘ధోని ఈసారి కచ్చితంగా ఆడతాడు. నాకు తెలిసి ఈ సీజన్ ముగిసిన తర్వాతే ఇక ముందు ఆడాలా? వద్దా అనే నిర్ణయం తీసుకుంటాడు. నా అభిప్రాయం ప్రకారం అయితే.. ధోని మరో రెండేళ్లపాటు ఆడతాడు. బ్యాటర్లైనా, బౌలర్లైనా తమ ఆటలో పస తగ్గినపుడే రిటైర్ అవ్వాలని భావిస్తారు. మరి.. గతేడాది ఎంఎస్ ధోని ఎలాంటి షాట్లు బాదాడో చూశారు కదా! గంటకు 145 కిలో మీటర్ల వేగంతో సిక్స్‌లు కొట్టాడు. నెట్స్‌లోనూ భారీ షాట్లతో అలరించాడు’’ అని ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. దీపక్ చహర్ పేర్కొన్నాడు. కాగా 42 ఏళ్ల ధోని గతేడాది సీఎస్కేను రికార్డు స్థాయిలో ఐదోసారి చాంపియన్‌గా నిలిపాడు. ఆరంభానికి ముందే ఎదురుదెబ్బ ఐపీఎల్ టి20 టోర్నీ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక బ్యాటర్, న్యూజిలాండ్‌కు చెందిన డెవాన్ కాన్వే ఐపీఎల్ టోర్నీకి దూరం కానున్నాడు. ఇటీవల కాన్వే ఎడమ బొటన వేలికి గాయంకాగా, ఈ వారంలో అతనికి శస్త్ర చికిత్స జరగనుంది. కాన్వే కోలుకోవడానికి కనీసం ఎనిమిది వారాల సమయం పడుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈసారి రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఎవరు ఓపెనింగ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఐపీఎల్లో 23 మ్యాచ్‌లు ఆడిన కాన్వే 9 అర్ధ సెంచరీలతో కలిపి 141.28 స్ట్రయిక్‌రేట్‌తో 924 పరుగులు సాధించాడు. చదవండి: IPL 2024: ఆ జట్టు ఈసారి కూడా ప్లే ఆఫ్స్ చేరలేదంటే సిగ్గుచేటే! -
Ind vs SA: ఆఖరి రెండు వన్డేలకు అయ్యర్ దూరం.. కారణమిదే
India’s updated ODI squad Vs SA 2023: సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ ట్రోఫీని ఆతిథ్య జట్టుతో పంచుకున్న టీమిండియా తదుపరి వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది. జొహన్నస్‌బర్గ్ వేదికగా ఆదివారం(డిసెంబరు 17) నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. స్టార్ పేసర్ దీపక్ చహర్ ఈ సిరీస్‌కు దూరం కానున్నట్లు శనివారం వెల్లడించింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు సౌతాఫ్రికాకు వెళ్లడం లేదని తెలిపింది. అతడి స్థానాన్ని ఆకాశ్ దీప్తో భర్తీ చేస్తున్నట్లు పేర్కొంది. శ్రేయస్ అయ్యర్ దూరం అదే విధంగా శ్రేయస్ అయ్యర్ సైతం ఆఖరి రెండు వన్డేలకు అందుబాటులో ఉండడని బీసీసీఐ వెల్లడించింది. టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ఈ మిడిలార్డర్ బ్యాటర్ రెండు, మూడో మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలిపింది. కాగా రోహిత్ శర్మ గైర్హాజరీలో ఈ వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ టీమిండియాను ముందుండి నడిపించనున్నాడు. మరోవైపు.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు స్టార్ పేసర్ మహ్మద్ షమీ కూడా దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. సఫారీ గడ్డపై టీమిండియా ఇంత వరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌పై ప్రత్యేక దృష్టిసారించింది. అందుకే పలువురు స్టార్ బ్యాటర్లు, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్నారు. ఆ సమయాన్ని టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు కేటాయించనున్నారు. చహర్ స్థానంలో వస్తున్నాడు.. ఇంతకీ ఎవరీ ఆకాశ్ దీప్? దేశవాళీ క్రికెట్లో బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న 27 ఏళ్ల ఆల్‌రౌండర్ ఆకాశ్ దీప్. బెంగాల్ తరఫున 2019 నుంచి ఇప్పటి వరకు మూడు ఫార్మాట్ల(లిస్ట్-ఏ, ఫస్ట్‌క్లాస్, టీ20)లలో 80 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో కలిపి మొత్తంగా నూట డెబ్బైకి పైగా వికెట్లు తీయడంతో పాటు 500 పరుగులు సాధించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న ఆకాశ్ దీప్.. ఏడు మ్యాచ్‌లలో కలిపి ఆరు వికెట్లు తీశాడు. భారత వన్డే జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్. చదవండి: రోహిత్‌కు బైబై.. ఇక టీమిండియా టీ20 కెప్టెన్‌గానూ హార్దిక్ పాండ్యా!? -
టీమిండియాకు భారీ షాక్.. ఆ ఇద్దరూ కూడా! బీసీసీఐ అధికారిక ప్రకటన
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ ఫిట్నెస్ కారణంగా సౌతాఫ్రికాతో టెస్టులకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా శనివారం దృవీకరించింది. షమీ ఫిట్‌నెస్‌పై మెడికల్ టీమ్ ఇంకా క్లియర్స్ ఇవ్వలేదని, అందువల్ల షమీ దక్షిణాఫ్రికు వెల్లడం లేదని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా షమీ ప్రస్తుతం మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. మోకాలి నొప్పికి అతడు చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడిని జట్టు నుంచి బీసీసీఐ తప్పించింది. అతడు తిరిగి వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అదే విధంగా భారత యువ పేసర్ దీపక్ చాహర్.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ప్రోటీస్ పర్యటనకు దూరంగా ఉండాలని చాహర్ నిర్ణయించకున్నాడు. దీంతో అతడి స్ధానాన్ని బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్తో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దీపక్ చాహర్ తండ్రి ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తండ్రిని దగ్గరుండి చాహర్ చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడు వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు. 🚨 NEWS 🚨 Deepak Chahar withdrawn from the ODI series; Mohd. Shami ruled out of the Test series. Details 🔽 #TeamIndia | #SAvIND https://t.co/WV86L6Cnmt pic.twitter.com/oGdSJk9KLK — BCCI (@BCCI) December 16, 2023 -
Ind vs SA: సౌతాఫ్రికాతో మ్యాచ్‌లకు టీమిండియా పేసర్ దూరం?
India Tour Of South Africa 2023: టీమిండియా పేసర్ దీపక్ చహర్ సౌతాఫ్రికా పర్యటనలో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తండ్రి అనారోగ్య కారణాల దృష్ట్యా అతడు దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండకపోవచ్చనే సంకేతాలు వెలువడ్డాయి. కాగా గాయాల బెడదతో చాలా కాలం పాటు ఆటకు దూరమైన రైటార్మ్ పేసర్ దీపక్ చహర్.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ సందర్భంగా పునరాగమనం చేశాడు. కంగారూ జట్టుతో నాలుగో మ్యాచ్‌కు యువ పేసర్ ముకేశ్ కుమార్ గైర్హాజరు కావడంతో అతడి స్థానంలో దీపక్ ఎంట్రీ ఇచ్చాడు. రాయ్‌పూర్ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఐదో టీ20లో కూడా దీపక్ చహర్ ఆడతాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు ఆఖరి టీ20కి దూరమయ్యాడని తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. తండ్రికి బ్రెయిన్‌స్ట్రోక్ తాజాగా ఈ విషయం గురించి దీపక్ చహర్ స్పందించాడు. తన తండ్రి లోకేంద్ర సింగ్ శనివారం(డిసెంబరు 2) బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురయ్యారని.. అందుకే హుటాహుటిన అలీఘర్కు బయల్దేరినట్లు తెలిపాడు. ‘‘సరైన సమయానికి మా నాన్నను ఆస్పత్రికి తీసుకురాగలిగాం. లేదంటే పరిస్థితి విషమించేది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20లో ఎందుకు ఆడలేదని చాలా మంది నన్ను అడుగుతున్నారు. అన్నింటికంటే మా నాన్నే నాకు ముఖ్యం. ఈరోజు క్రికెటర్‌గా నేను ఇక్కడ ఉన్నానంటే అందుకు ఆయనే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను వదిలి నేను ఎక్కడికీ వెళ్లలేను. మా నాన్న అనారోగ్యం పాలైనప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాను. ద్రవిడ్ సర్, సెలక్టర్లతో మాట్లాడాను ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాబట్టి సౌతాఫ్రికాకు పయనమవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటికే రాహుల్ ద్రవిడ్ సర్, సెలక్టర్లతో మాట్లాడాను. మా నాన్న ఆరోగ్యం బాగానే ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని దీపక్ చహర్ వెల్లడించాడు. అయితే, డిసెంబరు 10 నుంచే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో దీపక్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఇక కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో వన్డే, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీ20 జట్టుకు దీపక్ చహర్ ఎంపికైన విషయం తెలిసిందే. వివాహ వేడుకకు వెళ్లి కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన 31 ఏళ్ల దీపక్ చహర్ తండ్రి లోకేంద్రసింగ్ భారత వైమానిక దళ మాజీ ఉద్యోగి అని సమాచారం. ఆయన బీపీ, షుగర్ పేషంట్. అలీఘర్‌లో ఓ వివాహ వేడకకు హాజరైన సందర్భంగా పక్షవాతానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు దైనిక్ జాగరణ్ వివరాలు వెల్లడించింది. చదవండి: సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్.. సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! -
IND vs AUS: భారత జట్టులో కీలక మార్పు! స్టార్ బౌలర్ ఎంట్రీ
గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20కు టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ దూరమయ్యాడు. తన పెళ్లి కారణంగా మూడో టీ20కు ముందు ముఖేష్‌ను జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. ఇక అతడి స్ధానాన్ని మరో యువ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ బీసీసీఐ భర్తీ చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విటర్ వేదికగా మంగళవారం వెల్లడించింది. అయితే రాయ్‌పూర్ వేదికగా జరగనున్న నాలుగో టీ20కు ముందు అతడు జట్టుతో కలవనున్నాడు. ముఖేష్ జట్టులోకి వచ్చినప్పటికీ చాహర్ కూడా జట్టులో కొనసాగనున్నాడు. "గౌహతిలో ఆస్ట్రేలియాతో జరిగే మూడో టీ20కి ముందు టీమిండియా నుంచి తనను విడుదల చేయాలని ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ బీసీసీఐని అభ్యర్థించాడు. ముఖేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. దీంతో అతడికి సెలవు మంజూరు చేయబడింది. అతడి స్ధానంలో దీపక్ చాహర్ జట్టుతో చేరాడు. ముఖేష్ తిరిగి రాయ్‌పూర్‌లో జరిగే 4వ టీ20కి ముందు జట్టులో చేరనున్నాడని" బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా దీపక్ చాహర్ చివరగా గతేడాది దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో టీమిండియా తరపున ఆడాడు. చదవండి: సచిన్ అంతటి వాడవుతాడు.. పోలికలే కొంపముంచుతున్నాయి! తొందరపడి ముందే ఎందుకు Update: Fast bowler Mukesh Kumar made a request to BCCI to be released from India’s squad ahead of the third T20I against Australia in Guwahati. Mukesh is getting married and has been granted leave for the duration of his wedding festivities. He will join the squad ahead of the… — BCCI (@BCCI) November 28, 2023 -
భారత జట్టులో నో ఛాన్స్.. కట్ చేస్తే! అక్కడ మాత్రం 6 వికెట్లతో
విజయ్ హజారే ట్రోఫీ 2023 టీమిండియా యువ పేసర్, రాజస్తాన ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ దుమ్మురేపుతున్నాడు. ఈ టోర్నీలో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లతో దీపక్ చాహర్ చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో చాహర్ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన 10 ఓవర్ల కోటాలో 41 పరుగులిచ్చి 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి బౌలింగ్ దాటికి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 29 ఓవర్లలో కేవలం 128 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బ్యాటర్లలో చిరాగ్ గాంధీ(43) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్తాన్ బౌలర్లలో చాహర్‌తో పాటు ఖాలీల్ అహ్మద్ రెండు, అంకిత్ చౌదరీ, ధావన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు కోల్పోయి రాజస్తాన్ ఛేదించింది. రాజస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ దీపక్ హుడా(76 నాటౌట్) పరుగులతో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. దీపక్ చాహర్ విషయానికి వస్తే.. గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. మిండియా తరపున చివరగా గతేడాది ఆక్టోబర్‌లో సౌతాఫ్రికాపై టీ20 సిరీస్‌లో ఆడాడు. ఇప్పటివరకు భారత్ తరపున 37 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన చాహర్.. 45 వికెట్లు పడగొట్టాడు. చదవండి: కుర్చీ కదపడం కాదు.. ఎత్తి కిందపడేస్తా.. ఇకపై యూపీకి ఆడొద్దు: గతాన్ని తలచుకున్న షమీ -
శతక్కొట్టిన దీపక్ హుడా.. చెలరేగిన చాహర్ బ్రదర్స్
దేశవాలీ 50 ఓవర్ల టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2023లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. నిన్న (నవంబర్ 23) జరిగిన మ్యాచ్‌ల్లో మయాంక్ అగర్వాల్ (157), దేవ్‌దత్ పడిక్కల్ (71), యుజ్వేంద్ర చహల్ (6/26) వివిధ జట్లపై చెలరేగిపోయారు. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు, రాజస్థాన్ ప్లేయర్స్ దీపక్ హుడా (114, 1/5), దీపక్ చాహర్ (66 నాటౌట్), రాహుల్ చాహర్ (5/34) రాణించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. దీపక్ హుడా, మానవ్ సుథర్ (41), దీపక్ చాహర్ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లలో నబమ్ అబో 4 వికెట్లు పడగొట్టగా.. యోర్జుమ్ సెరా 2, అక్షయ్ జైన్, తెచి డోరియా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 348 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన అరుణాచల్ ప్రదేశ్.. రాహుల్ చాహర్, మానవ్ సుథర్ (10-2-36-2), ఖలీల్ అహ్మద్ (7.2-0-44-2), దీపక్ హుడా (2-0-5-1) ధాటికి 46.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. అరుణాచల్ ప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సచిన్ శర్మ (63), అప్రమేయ జైస్వాల్ (63) అర్ధసెంచరీలతో రాణించగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. హైదరాబాద్ బోణీ.. జైపూర్: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. మణిపూర్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన మణిపూర్ సరిగ్గా 50 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ (3/71), రక్షణ్ రెడ్డి (2/28), తనయ్ త్యాగరాజన్ (2/24) రాణించారు. అనంతరం హైదరాబాద్ కేవలం 29.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసి నెగ్గింది. హైదరాబాద్ కెపె్టన్ గౌవ్లత్ రాహుల్ సింగ్ (47 బంతుల్లో 70; 13 ఫోర్లు), చందన్ సహని (32 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్), రవితేజ (11 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. ఆంధ్ర పరాజయం.. మరోవైపు చండీగఢ్‌లో ఆంధ్ర జట్టు పరాజయంతో ఈ టోర్నీని ప్రారంభించింది. గ్రూప్ ‘డి’లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా ఆంధ్ర జట్టు 47.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ రెడ్డి (59 బంతుల్లో 47; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనీశ్ గోలమారు (60 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్ 43.3 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగులు చేసి విజయం సాధించింది. అమిత్ (78 నాటౌట్; 11 ఫోర్లు), ఆకాశ్ వశిష్ట్ (53; 2 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. -
నువ్వో, నేనో తేల్చుకుందాం.. సీఎస్కే ఆటగాళ్ల మధ్య ఫైట్
ఐపీఎల్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఇద్దరు ఆటగాళ్ల మధ్య సరదా ఫైట్ జరిగింది. జట్టులో స్థానం కోసం ఆల్‌రౌండర్లు శివమ్ దూబే, దీపక్ చాహర్ మాటల యుద్దానికి దిగారు. తన ఆల్‌టైమ్ బెస్ట్ సీఎస్కే ప్లేయింగ్ ఎలెవెన్‌లో స్థానం కల్పించకపోవడంతో చాహర్.. దూబేకు ఓ ఛాలెంజ్ విసిరాడు. వచ్చే ఏడాది నువ్వు (దూబే), నేను (చాహర్) ఓ సింగిల్ ఓవర్ మ్యాచ్ ఆడదాం. నేను నీకొక ఓవర్ బౌల్ చేస్తాను. నువ్వు నాకు ఒక ఓవర్ బౌల్ చెయ్యి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారిదే సీఎస్కే ఆల్‌టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో స్పాట్ అని చాహర్.. దూబేను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. చాహర్ సరదాగా చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతుంది. ఛాంపియన్ జట్టులో స్థానం కోసం ఈ మాత్రం పోటీ ఉండాల్సిందే అని అభిమానులు అంటున్నారు. కాగా, దూబే తన ఆల్‌టైమ్ బెస్ట్ సీఎస్కే జట్టులో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా తనతో పాటు అల్బీ మోర్కెల్, డ్వేన్ బ్రేవోలను ఎంపిక చేసి, ఇదే కేటగిరీకి చెందిన దీపక్ చాహర్‌కు అవకాశం కల్పించలేదు. ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023 ఎడిషన్‌లో శివమ్ దూబే సీఎస్కే విజయాల్లో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో అతను 16 మ్యాచ్‌ల్లో 159.92 స్ట్రయిక్‌రేట్‌తో 3 అర్ధసెంచరీల సాయంతో 411 పరుగులు చేశాడు. దూబే ఈ సీజన్లో ఏకంగా 35 సిక్సర్లు బాది ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. మరోవైపు ఇదే సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన దీపక్ చాహర్ బంతితో ఓ మోస్తరుగా రాణించి 13 వికెట్లు పడగొట్టాడు. ఓ రకంగా చూస్తే వీరిద్దరూ తమతమ స్థానాలకు న్యాయం చేశారు. -
అంతర్జాతీయ టీ20ల్లో మహాద్భుతం.. ఓ బౌలర్‌కు 7 వికెట్లు, అన్ని క్లీన్‌బౌల్డ్‌లే..!
అంతర్జాతీయ టీ20ల్లో మహాద్భుతం చోటు చేసుకుంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ ఆసియా క్వాలిఫయర్-బి పోటీల్లో భాగంగా చైనాతో ఇవాళ (జులై 26) జరిగిన మ్యాచ్‌లో మలేసియా బౌలర్ శ్యాజ్రుల్ ఇద్రుస్ (4-1-8-7) ఏకంగా 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఇద్రుస్ పడగొట్టిన 7 వికెట్లు క్లీన్‌బౌల్డ్‌లే కావడం విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో ఏ బౌలర్ ఇప్పటివరకు 7 వికెట్ల ఘనత సాధించలేదు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో ఓ మొయిడిన్ వేసి 8 పరుగులకు 7 వికెట్లు పడగొట్టిన ఇద్రుస్.. టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన 32 ఏళ్ల ఇద్రుస్.. తన స్వింగ్ మాయాజాలంతో పేట్రేగిపోవడంతో చైనా 11.2 ఓవర్లలో 23 పరుగులకే కుప్పకూలింది. ఇద్రుస్తో పాటు పవన్‌దీప్ సింగ్ (4-0-9-2), విజయ్ ఉన్ని (1.2-1-1-1) కూడా రాణించారు. చైనా ఇన్నింగ్స్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోగా.. ఏకంగా ఆరుగురు డకౌట్లయ్యారు. చైనా ఇన్నింగ్స్‌లో వై గులే చేసిన 7 పరుగులే అత్యధికం. అనంతరం 24 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా 4.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్వల్ప ఛేదనలో మలేసియా బ్యాటర్లు సైతం ఆరంభంలో తడబడ్డారు. ఓపెనర్లిద్దరూ డకౌట్లు అయ్యారు. వన్‌డౌన్ బ్యాటర్ షార్వీన్ సురేంద్రన్ (4 నాటౌట్), విరన్‌దీప్ సింగ్ (19 నాటౌట్) మలేసియాను విజయతీరాలకు చేర్చారు. చైనా బౌలర్లలో టియాన్ సెన్క్వన్, కెప్టెన్ వాంగ్ కీ తలో వికెట్ పడగొట్టారు. అంతర్జాతీయ టీ20ల్లో టాప్ 10 అత్యుత్తమ గణాంకాలు.. శ్యాజ్రుల్ ఇద్రుస్ (మలేసియా) (4-1-8-7) పీటర్ అహో (నైజీరియా) (3.4-1-5-6) దీపక్ చాహర్ (భారత్) (3.2-0-7-6) నక్రాని (ఉగాండ) (4-1-7-6) అజంతా మెండిస్ (శ్రీలంక) (4-2-8-6) జెజె స్మిట్ (నమీబియా) (4-1-10-6) అజంతా మెండిస్ (శ్రీలంక) (4-1-16-6) ఓబెడ్ మెక్కాయ్ (వెస్టిండీస్) (4-1-17-6) లాంగట్ (కెన్యా) (4-1-17-6) ఫెన్నెల్ (అర్జెంటీనా) (4-0-18-6) -
అతడు డ్రగ్లాంటి వాడు.. నా జీవితకాలంలో.. : ధోని ఆసక్తికర వ్యాఖ్యలు
MS Dhoni On India, CSK Star: ‘‘దీపక్ చహర్ డ్రగ్ లాంటివాడు. ఒకవేళ తను మన చుట్టుపక్కలే ఉంటే.. ఎక్కడున్నాడు అని వెతుక్కోవాలి. ఒకవేళ మన పక్కనే ఉంటే.. ఇతడు ఇక్కడెందుకు ఉన్నాడని అనుకునేలా చేస్తాడు. అతడు రోజురోజుకీ పరిణతి చెందడం హర్షించదగ్గ విషయం. పూర్తిస్థాయిలో పరిణతి సాధించాలంటే చాలా సమయం పడుతుంది. అయినా పర్లేదు! కానీ నా జీవితకాలంలో మాత్రం అతడిని మెచ్యూర్ పర్సన్‌గా చూడలేను’’ అని చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. కాగా టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ చహర్‌కు ధోనితో ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. 2016లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ చహర్‌ను తీసుకున్నపుడు అక్కడే మిస్టర్కూల్తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో 2017 తర్వాత అతడిని సీఎస్కేలోకి తీసుకువచ్చాడు తలా!! చహర్‌కు అండగా నిలిచి ఇక 2018లో చహర్‌ను ఆడించడానికి సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ నిరాకరించగా.. ధోని మాత్రం 14 మ్యాచ్‌లలో అతడిని ఆడించాడు. చహర్‌కు అండగా నిలబడి తన కెరీర్ ఊపందుకునేందుకు ఊతమిచ్చాడు. కాగా గాయం కారణంగా ఐపీఎల్-2022 మొత్తానికి దూరమైన చహర్.. తాజా ఎడిషన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు కూల్చాడు. నిర్మాత ధోని ఇంతకీ ధోని ఏ సందర్భంలో చహర్ గురించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడో చెప్పనేలేదు కదూ! ధోని సినీ నిర్మాతగా కొత్త అవతారమెత్తాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీఎస్కేలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న తలా.. ధోని ఎంటర్టైన్మెంట్ పేరిట సౌత్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. LGM పేరిట తన ప్రొడక్షన్లో మొదటి సినిమా నిర్మించాడు. దీనికి సంబంధించిన ట్రైలర్, ఆడియో లాంచ్ ఫంక్షన్‌ను సోమవారం చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా చహర్ గురించి ప్రస్తావన రాగా.. ధోని పైవిధంగా స్పందించాడు. చదవండి: Ashes 2023: కీలకమైన టెస్టుకు మళ్లీ అదే జట్టు! మొండిగా వ్యవహరిస్తే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ కాదు.. ఆ జట్టుతో చాలా డేంజర్! లేదంటే? -
WC 2023: అతడి పేరును కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు.. అందుకే ఇలా!
Asian Games 2023: చైనాలో జరుగనున్న ఆసియా క్రీడల్లో భారత పురుష, మహిళా క్రికెట్ జట్లు పాల్గొనేందుకు బీసీసీఐ అధికారిక ముద్ర వేసిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 23- అక్టోబరు 8 వరకు జరుగనున్న ఈ టోర్నీకి పురుషుల విభాగంలో ద్వితీయ శ్రేణి జట్టును పంపనున్నారు. అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్ ఈవెంట్ ఆరంభం కానుండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టు బౌలింగ్ విభాగం కూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆల్‌రౌండర్ దీపక్ చహర్‌కు తన జట్టులో తప్పకుండా స్థానం ఇస్తానని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. అతడిని పట్టించుకోలేదు ‘‘వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే క్రమంలో సెలక్టర్లు దీపక్ చహర్ పేరును కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. నిజానికి తను చాలా కాలంగా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. ఇప్పుడైతే బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నాడు. కాబట్టి ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టులో అతడికి అవకాశం ఇస్తారని భావిస్తున్నా. అదే విధంగా ఉమ్రాన్ మాలిక్‌కు కూడా నా జట్టులో చోటు ఇస్తాను. దీపక్ మాదిరే వరల్డ్‌కప్ జట్టులో ఉమ్రాన్‌కు కూడా స్థానం దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి తను ఆసియా క్రీడల జట్టులో తప్పక ఉంటాడు. ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదా! గంటకు 150 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేసే ఆటగాడికి ఈ మాత్రం గౌరవమైనా ఇవ్వాలి కదా! ఇక రవి బిష్ణోయి. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా.. వీరంతా ప్రపంచ కప్ జట్టులో స్థానం ఖాయం చేసుకునే జాబితాలో ముందున్న వాళ్లు. అలాంటపుడు రవి బిష్ణోయి అవకాశాలు సన్నగిల్లినట్లే కదా! కాబట్టి రవి బిష్ణోయి కూడా చైనాకు వెళ్లే ద్వితీయ శ్రేణిలో జట్టులో ఉంటే మంచిది. వరుణ్ చక్రవర్తికి మరో స్పిన్నర్‌గా నా జట్టులో స్థానం కల్పిస్తాను. గతంలో వరల్డ్‌కప్ టోర్నీ ఆడిన అనుభవం అతడికి ఉంది’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. తన జట్టులో మూడో స్పిన్నర్‌గా మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మకు పార్ట్‌టైమ్ స్పిన్ బౌలర్‌గా ఛాన్స్ ఇస్తానని తెలిపాడు. చదవండి: Ind Vs WI: షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు.. పూర్తి వివరాలివే నాకు నమ్మకం ఉంది.. టీమిండియాను మా జట్టు ఓడిస్తుంది: బ్రియాన్ లారా -
ఆటోగ్రాఫ్ ఇవ్వని ధోని బతిమాలుకున్న చాహర్..!
-
ఒక్క ఆటోగ్రాఫ్ కోసం బతిమాలించుకున్నాడు!
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సీఎస్కే ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జడేజా ఆఖర్లో వచ్చి సిక్స్, ఫోర్‌తో సీఎస్కేకు విజయాన్ని అందించాడు. కాగా సీఎస్కే ఐపీఎల్ టైటిల్ గెలవడం ఇది ఐదోసారి. ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన జాబితాలో ముంబై ఇండియన్స్‌తో కలిసి సీఎస్కే సమంగా నిలిచింది. ఈ విషయం పక్కనబెడితే.. ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం ధోని, దీపక్ చహర్ల మధ్య జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీపక్ చహర్ తన షర్ట్‌పై ఆటోగ్రాఫ్ అడిగితే తొలుత ఇవ్వడానికి ధోని నిరాకరించడం వైరల్‌గా మారింది. అయితే చహర్ ధోనిని బతిమిలాడడంతో చివరకు షర్ట్‌పై తన సంతకం చేశాడు. అయితే ఇదంతా సరదా కోసం మాత్రమే. ఎందుకంటే చహర్ అడిగినప్పుడు స్పందించని ధోని.. మళ్లీ చిరునవ్వుతో అతని జెర్సీపై సంతకం చేయడం.. ఆ తర్వాత స్వయంగా ధోనినే చహర్‌ను హగ్ చేసుకోవడం కనిపించింది. ఈ ఇద్దరి మధ్య ఎంత మంచి రిలేషన్షిప్ ఉందనేది దీన్నబట్టే అర్థమవుతుంది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ క్యాచ్‌ను దీపక్ చహర్ మిస్ చేసిన సంగతి తెలిసిందే. మూడు పరుగుల వద్ద లభించిన లైఫ్‌తో గిల్ 39 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా చహర్ క్యాచ్ మిస్ చేయడంతోనే ధోని అతనికి ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి నిరాకరించాడని అభిమానులు కామెంట్ చేశారు. MS Dhoni when Deepak Chahar came for Autograph. Their bond is so cute.#ChennaiSuperKings #MSDhoni𓃵 #csk pic.twitter.com/3ggKY2mAFM — MS Dhoni Fan (@dhonizero7) May 30, 2023 చదవండి: డానిల్ మెద్వెదెవ్కు షాక్.. ఐదోసారి కలిసి రాని 'ఫ్రెంచ్' -
దీపక్ చహర్ అరుదైన ఘనత..
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే బౌలర్ దీపక్ చహర్ అరుదైన ఘనత సాధించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో సాహాను ఔట్ చేయడం ద్వారా దీపక్ చహర్ ఒక రికార్డు అందుకున్నాడు. అదేంటంటే ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో దీపక్ చహర్ మూడో స్థానంలో నిలిచాడు. పవర్ ప్లేలో ఇప్పటివరకు దీపక్ చహర్ 53 వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్ కూడా అన్నే వికెట్లతో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో భువనేశ్వర్ కుమార్ 61 వికెట్లతో ఉండగా.. 55 వికెట్లతో సందీప్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ 52 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. Deepak Chahar 🤝 Wickets in Powerplay 🕺 A #Yellove story for the ages! 💯#GTvCSK #TATAIPL #Qualifier1 #IPLonJioCinema | @ChennaiIPL @deepak_chahar9 pic.twitter.com/Ethh2nnjZu — JioCinema (@JioCinema) May 23, 2023 చదవండి: #NoBall: ఒక్క నోబాల్ ఖరీదు 60 పరుగులు.. -
వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని
IPL 2023 CSK vs KKR- MS Dhoni Comments: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు తమ ఆటగాళ్లు శాయశక్తులా ప్రయత్నించారని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. కేకేఆర్ చేతిలో ఓటమికి తమ బ్యాటర్లు లేదంటే బౌలర్లను నిందించాలనుకోవడం సరికాదని.. పిచ్ పరిస్థితులే ఇందుకు కారణమని పేర్కొన్నాడు. ఐపీఎల్-2023 లీగ్ దశలో సీఎస్కే సొంతగడ్డపై ఆదివారం ఆఖరి మ్యాచ్ ఆడేసింది. దూబే హిట్టింగ్ చెపాక్ వేదికగా కేకేఆర్‌తో తలపడిన చెన్నై టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డెవాన్ కాన్వే 30 పరుగులతో రాణించగా.. ఐదో స్థానంలో వచ్చిన శివం దూబే 34 బంతుల్లో 48 పరుగులు రాబట్టి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో రవీంద్ర జడేజా(20) తప్ప ఎవరూ కూడా 20 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. అదరగొట్టిన దీపక్ చహర్.. కానీ ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు దీపక్ చహర్ ఆరంభంలోనే షాకిచ్చాడు. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్(1), జేసన్ రాయ్(12)లను స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు పంపాడు. రాణా, రింకూ హాఫ్ సెంచరీలతో వన్‌డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్(9)ను త్వరగా అవుట్ చేశాడు. ఈ క్రమంలో నితీశ్ రాణా కెప్టెన్ ఇన్నింగ్స్(44 బంతుల్లో 57 పరుగులు, నాటౌట్)తో ఆకట్టుకోగా.. రింకూ సింగ్ 43 బంతుల్లో 54 పరుగులు సాధించాడు. వీరిద్దరి అర్ధ శతకాలతో కేకేఆర్ 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ధోని సేనపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపరచుకుంది. ఇక ఓటమితో సీఎస్కే ఖాతాలో ఐదో పరాజయం నమోదైంది. అయినప్పటికీ ఇప్పటికే 13 మ్యాచ్‌లకు గాను ఏడు గెలిచిన చెన్నై 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు దాదాపు అర్హత సాధించినట్లే! అదే తీవ్ర ప్రభావం చూపింది ఈ నేపథ్యంలో కేకేఆర్ చేతిలో ఓటమి అనంతరం ధోని మాట్లాడుతూ.. గెలిచేందుకు తమ ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డారని, పరాజయానికి వారిని తప్పుపట్టాలనుకోవడం లేదన్నాడు. ‘‘టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నపుడు సెకండ్ ఇన్నింగ్స్ నుంచి బంతి మంచిగా టర్న్ అయినపుడు.. ఇది 180 పరుగుల వికెట్ అని తెలిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన మేమైతే ఈ స్కోరు దరిదాపులకు కూడా వెళ్లలేకపోయాం. డ్యూ(తేమ) ప్రభావం చూపింది. తొలి, రెండో ఇన్నింగ్స్‌కు తేడా మీరు కూడా చూసే ఉంటారు. మొదటి ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్.. రెండో ఇన్నింగ్స్‌లో పేసర్లకు అనుకూలంగా మారింది. మా ఓటమికి పరిస్థితుల ప్రభావమే కారణం’’ అని ధోని చెప్పుకొచ్చాడు. దూబే అద్భుతం.. చహర్ విలువైన ఆస్తి ఇక శివం దూబే అద్బుతంగా రాణిస్తున్నాడని ప్రశంసించిన ధోని.. అతడు ఇలాగే నిలకడైన ఆట తీరు కొనసాగించాలని ఆకాంక్షించాడు. అదే విధంగా ఫాస్ట్‌బౌలర్ దీపక్ చహర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘బంతిని అద్భుతంగా స్వింగ్ చేయగలడు. ఎలా బౌల్ చేయాలి.. ఫీల్డింగ్ ఎలా సెట్ చేసుకోవాలన్న అంశాలపై అతడికి పూర్తి అవగాహన ఉంటుంది. నిజంగా జట్టుకు తనొక విలువైన ఆస్తి. తను ఇప్పుడు అనుభవజ్ఞుడైన బౌలర్‌గా కనిపిస్తున్నాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్నాడు’’ అని ధోని.. చహర్‌పై ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులు ఇచ్చిన చహర్.. మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్బుతంగా బ్యాటింగ్ చేసి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించిన రింకూ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: IPL 2023: మార్క్రమ్ చేసిన తప్పు.. ఆలస్యంగా వెలుగులోకి 'అరె లొల్లి సల్లగుండ'.. ప్రశ్న అర్థంగాక ధోని ఇబ్బంది 𝙔𝙚𝙡𝙡𝙤𝙫𝙚! 💛 A special lap of honour filled with memorable moments ft. @msdhoni & Co. and the ever-so-energetic Chepauk crowd 🤗#TATAIPL | #CSKvKKR | @ChennaiIPL pic.twitter.com/yHntEpuHNg — IndianPremierLeague (@IPL) May 14, 2023 -
దీపక్ చాహర్ ని కొట్టిన ధోని..!
-
ధోని చేసిన పనికి షాక్ తిన్న చహర్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాస్ ముగిసిన తర్వాత ధోని పెవిలియన్ వైపు నడుస్తున్న సమయంలో దీపక్ చహర్ కనిపించాడు. అయితే ధోని పోతూ పోతూ చహర్వైపు సీరియస్ లుక్స్ ఇచ్చాడు. ఆ తర్వాత అతని పక్కనుంచి వెళ్లిన ధోని.. చహర్ తలపై కొట్టినంత పని చేశాడు. దీంతో ఆశ్చర్యానికి గురైన చహర్ ధోని వైపు తిరగ్గా.. సీఎస్కే కెప్టెన్ అతని వైపు చూడకుండా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. 'అమ్మ ధోని.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా' అంటూ ఫన్నీగా పేర్కొన్నారు. ధోని.. చహర్‌ను కొట్టడం అనేది ఫన్నీవేలోనే చేసినప్పటికి అభిమానులు మాత్రం తమకు నచ్చింది ఊహించుకున్నారు.''ఈ సీజన్లో చహర్ ప్రదర్శన పట్ల ధోని అసంతృప్తిగా ఉన్నాడు.. అందుకే ఇలా చేశాడు.. ఒక సీఎస్కే అభిమాని చహర్‌పై ఎంత కోపంగా ఉన్నాడనేది ధోని చూపించాడు'' అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ సీజన్లో గాయంతో చహర్ తొలి అంచె పోటీలకు దూరమయ్యాడు. రెండో అంచె పోటీల్లో ఆడుతున్న చహర్ ఇప్పటివరకు 4 మ్యాచ్‌లాడి రెండు వికెట్లు పడగొట్టాడు. Thala expressing what every CSK fan feel about chahar 😂😂😂#CSKvDC #Dhoni #shivamdube #rayudu pic.twitter.com/IuYyLvE9MR — Mr Leo (@mrleooffl) May 10, 2023 చదవండి: 'పొరపాటులో మరిచిపోయాడు.. వదిలేయండి!' -
'568 రోజులు తర్వాత ఎట్టకేలకు వికెట్'
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే స్టార్ బౌలర్ దీపక్ చహర్ ఎట్టకేలకు తొలి వికెట్ సాధించాడు. శనివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ను ఔట్ చేయడం ద్వారా వికెట్ సాధించాడు. దాదాపు 568 రోజుల తర్వాత దీపక్ చహర్ ఐపీఎల్లో వికెట్ తీయడం విశేషం. చివరిగా ఐపీఎల్ 2021 ఫైనల్లో వికెట్ తీసిన చహర్ ఆ తర్వాత గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఇక ఈ సీజన్లోనూ సీఎస్కే ఆడిన ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. కాగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 41 పరుగులు సమర్పించుకోవడంతో దీపక్ చహర్‌పై విమర్శలు వచ్చాయి. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన దీపక్ చహర్ 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే చహర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ రెండో బంతికి తొలుత ఇషాన్ కిషన్‌ను ఔట్ చేసిన చహర్.. ఆ తర్వాత నాలుగో బంతికి ధోని సూచనలు పాటిస్తూ రోహిత్‌ను బుట్టలో వేసుకొని రెండో వికెట్ సంపాదించాడు. ఇక సీఎస్కే దీపక్ చహర్‌ను రూ.14 కోట్లు పెట్టి కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్లో చహర్ వికెట్ సాధించగానే.. ''568 రోజులు.. 28 కోట్లు.. ఒక్క వికెట్'' అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయడం ఆసక్తి కలిగించింది. 568 days and 28 crores later Finally an IPL wicket for Deepak Chahar pic.twitter.com/HXmOjtL4fi — Titu (@TituTweets_) May 6, 2023 👉MSD comes up to the stumps 😎 👉Rohit Sharma attempts the lap shot 👉@imjadeja takes the catch 🙌 Watch how @ChennaiIPL plotted the dismissal of the #MI skipper 🎥🔽 #TATAIPL | #MIvCSK pic.twitter.com/fDq1ywGsy7 — IndianPremierLeague (@IPL) May 6, 2023 చదవండి: రోహిత్ డకౌట్ వెనుక ధోని మాస్టర్‌మైండ్! -
పని చేయని ధోని మంత్రం.. పూర్తిగా విఫలమయ్యాడు
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే స్టార్ బౌలర్ దీపక్ చహర్ పెద్దగా మెరవడం లేదు. గాయం కారణంగా సీజన్లో చహర్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. మూడు మ్యాచ్‌లు కలిపి 97 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. తాజాగా లక్నో సూపరజెయింట్స్తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చహర్ ఘోరంగా ఫెయిలయ్యాడు. నాలుగు ఓవర్లు వేసి 10.25 ఎకానమీ రేటుతో 41 పరుగులు సమర్పించుకున్నాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చిన దీపక్ చహర్ తన కెప్టెన్ ధోని నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు. టాస్ సమయంలో చహర్ గురించి ధోని ప్రస్తావించాడు. ''చహర్ గాయం నుంచి కోలుకోవడంతో ఆకాశ్ సింగ్‌ను తప్పించాం.. స్లోపిచ్‌పై చహర్ మెరిసే అవకాశం ఉంది. అందుకే అతను తుది జట్టులోకి తీసుకున్నాం'' అని ధోని పేర్కొన్నాడు. కానీ ధోని మంత్రం పనిచేయకపోగా.. చహర్ విఫలమయ్యాడు. 2019లో సీఎస్కే తరపున 22 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించిన దీపక్ చహర్ ఆ తర్వాత 2020లో 14 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీశాడు. ఇక 2021 సీస్కే ఛాంపియన్‌గా నిలవడంలో దీపక్ చహర్ కీలకపాత్ర పోషించాడు. 15 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసిన చహర్‌ను ఆ తర్వాత జరిగిన మెగా వేలంలో సీఎస్కే రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ దీపక్ చహర్ గాయం కారణంగా 2022 ఐపీఎల్ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ సీజన్లోనూ గాయంతో పెద్దగా ఆడింది లేదు. చదవండి: 'నా చివరి ఐపీఎల్ అని మీరే డిసైడ్ అయ్యారా?' -
సీఎస్కేకు మరో బిగ్ షాక్.. కోట్లు పోసి కొన్న ఆటగాడు ఔట్..!
ఐపీఎల్-2023లో ఫోర్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌ను గాయాల బెడద వెంటాడుతూ ఉంది. ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్ సందర్భంగా హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ తిరగబెట్టడంతో రూ. 14 కోట్ల ఆటగాడు దీపక్ చాహర్ లీగ్‌లో తదుపరి కొనసాగేది అనుమానంగా మారగా.. తాజాగా మరో ఆటగాడు, రూ. 16.25 కోట్ల ప్లేయర్ బెన్ స్టోక్స్ బొటనవేలి గాయం కారణంగా వారం రోజులు లీగ్‌ను దూరంగా ఉంటాడని తెలుస్తోంది. సీఎస్కే మేనేజ్మెంట్ చాహర్ 4 లేదా 5 మ్యాచ్‌లకే దూరంగా ఉంటాడని చెబుతున్నప్పటికీ అతని గాయం తీవ్రత అధికంగా ఉందని సమాచారం. చాహర్ ఇదే గాయం కారణంగా గత సీజన్ మొత్తానికి దూరమైన నేపథ్యంలో ఈ సీజన్ పరిస్థితి ఏమోనని సీఎస్కే యాజమాన్యం లోలోపల ఆందోళన చెందుతుంది. చాహర్ గురించే తలలు పట్టుకున్న సీఎస్కేకు స్టోక్స్ రూపంలో మరో స్ట్రోక్ తగలడంతో బెంబేలెత్తిపోతుంది. స్టోక్స్‌కు తగిలిన గాయాన్ని చిన్నదిగా చూపించాలని ఎల్లో ఆర్మీ భావిస్తున్నప్పటికీ, ఆ జట్టు కంగారు పడుతున్న తీరు చూస్తుంటే, 16.25 కోట్ల ఆటగాడు సీజన్ మొత్తానికే దూరమవుతాడా అన్న అనుమానం కలుగుతుంది. ఇవి చాలవన్నట్లు కోట్లు పోసి సొంతం చేసుకున్న మరో ఆటగాడు మొయిన్ అలీ కూడా అనారోగ్యంగా ఉన్నాడని తెలుస్తోంది. ఒకవేళ ఇతను కూడా తదుపరి మ్యాచ్‌లకు దూరమైతే సీఎస్కే విజయావకాశాలపై భారీ ప్రభావం పడుతుంది. ఇన్ని టెన్షన్స్ మధ్య ముంబైతో మ్యాచ్‌లో రహానే రాణించడం ఒక్కటి సీఎస్కేకు ఊరట కలిగిస్తుంది. ఒకవేళ సీఎస్కే నిజంగా చాహర్, స్టోక్స్ సేవలు కొన్ని మ్యాచ్‌లకైనా సరే కోల్పోవాల్సి వస్తే, ఆ జట్టు గత సీజన్లో మాదిరే పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉండాల్సి వస్తుంది. -
సంబురాల్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్..!
ముంబై ఇండియన్స్‌పై గెలుపుతో సంబురాల్లో మునిగితేలుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ గాయం తిరగబెట్టడంతో తదుపరి సీఎస్కే ఆడబోయే 4-5 మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వస్తుంది. నిన్న (ఏప్రిల్ 8) ముంబైతో జరిగిన మ్యాచ్‌లో గాయం (లెఫ్ట్ హ్యామ్‌స్ట్రింగ్) తిరగబెట్టడడంతో కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేయగలిగిన చాహర్.. అది వేసేందుకు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. గాయాల కారణంగా ఇప్పటికే పలువురు ఆటగాళ్ల సేవలు కోల్పోయిన సీఎస్కేకు చాహర్ గాయంం మరింత కలవరానికి గురి చేస్తుంది. చాహర్ గత సీజన్లోనూ ఇలాగే మధ్యలోనే వైదొలిగి, సీజన్ మొత్తానికే దూరం అయ్యాడు. ప్రస్తుతానికి సీఎస్కే ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పర్వాలేదనిపిస్తున్నప్పటికీ, చాహర్ అందుబాటులో ఉండడన్న విషయం ఆ జట్టును ఆందోళనకు గురి చేస్తుంది. ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత రవీంద్ర జడేజా బంతితో (4-0-20-3) ఇరగదీయగా.. ఆతర్వాత బ్యాటింగ్‌లో వెటరన్ రహానే (27 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రహానేకు రుతురాజ్ (36 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) జతకలవడంతో సీఎస్కే 18.1 ఓవర్ల సునాయాసంగా లక్ష్యాన్ని (158) ఛేదించింది. -
CSK Vs LSG: చెత్త బౌలింగ్.. పేసర్లకు ధోని స్ట్రాంగ్ వార్నింగ్! ఇలాగే కొనసాగితే
IPL 2023- Chennai Super Kings vs Lucknow Super Giants- MS Dhoni Comments: నాలుగేళ్ల తర్వాత సొంత మైదానంలో మ్యాచ్.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఐపీఎల్-2023 ఆరంభ మ్యాచ్‌లో చెలరేగిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈసారి కూడా అర్ధ శతకం(31 బంతుల్లో 57 పరుగులు)తో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే సైతం బ్యాట్ ఝులిపించాడు. కానీ.. హాఫ్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మిగతా వాళ్లతో అంబటి రాయుడు(27 నాటౌట్), ఆఖర్లో మిస్టర్ కూల్ కెప్టెన్ ధోని సిక్సర్లతో చెలరేగడం అభిమానులను ఖుషీ చేసింది. చెపాక్ మైదానంలో తలైవా హిట్టింగ్ ఆడటం వారిని ఆకట్టుకుంది. అంతా బాగానే ఉంది. సీఎస్కే మంచి స్కోరే సాధించింది. భయపెట్టిన మేయర్స్ ఇక మిగిలింది లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లను కట్టడి చేయడమే అని అభిమానులు కాస్త కూల్‌గానే ఉన్నారు. కానీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నోకు ఓపెనర్ కైలీ మేయర్స్ అదిరిపోయే ఆరంభం అందించాడు. ధోని బౌలర్లను మారుస్తున్నా అతడిలో వేగం తగ్గలేదు. చెత్త బౌలింగ్ పైగా తుషార్ దేశ్‌పాండే, దీపక్ చహర్ వైడ్లు, నోబాల్స్ రూపంలో చెత్త బౌలింగ్‌తో ధోనితో పాటు మ్యాచ్ చూస్తున్న అభిమానులకు కూడా చిరాకు తెప్పించారు. అయితే, మొయిన్ అలీ అద్భుత బంతితో మేయర్స్‌ను ట్రాప్ చేశాడు. మేయర్స్ ఇచ్చిన క్యాచ్‌ను కాన్వే ఒడిసిపట్టడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో చెన్నై ఊపిరిపీల్చుకుంది. ఇక ఆ తర్వాత ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో చివరికి చెన్నైదే పైచేయి అయింది. 12 పరుగుల తేడాతో ధోని సేన గెలుపొందింది. అయితే, ఈ గెలుపు పట్ల సంతోషపడిన ధోని.. తమ బౌలర్ల ఆట తీరుపై మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాదు.. పరిస్థితి ఇలాగే ఉంటే కొత్త కెప్టెన్ సారథ్యంలో ఆడాల్సి వస్తుంద(తాను తప్పుకొంటానని)ని నవ్వుతూనే గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ముఖ్యంగా పేసర్లను ఉద్దేశించి ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశాడు. లక్నో ఇన్నింగ్స్‌లో చెన్నై బౌలర్లు ఎక్స్‌ట్రాల రూపంలో 18 పరుగులు ఇవ్వడం.. అందులో 13 వైడ్లు, మూడు నోబాల్స్ ఉండటం ధోని అసంతృప్తికి కారణం. ఇంకోసారి నోబాల్స్, వైడ్లు వేస్తే ఈ విషయం గురించి మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. ‘‘మా ఫాస్ట్ బౌలింగ్ విభాగం మరింత మెరుగుపడాల్సి ఉంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ అందుకు అనుగుణంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. ప్రత్యర్థి బౌలర్లు ఎలాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారో కూడా ఓ కన్నేసి ఉంచాలి. నోబాల్స్, ఎక్స్ట్రా వైడ్స్ అస్సలు ఉపేక్షించలేం. ఇది ఇలాగే కొనసాగితే వాళ్లు కొత్త నాయకుడి నేతృత్వంలో ఆడాల్సి ఉంటుంది. ఇది నా సెకండ్ వార్నింగ్’’ అంటూ పేసర్లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక వికెట్ తమను పూర్తిగా ఆశ్చర్యపరిచిందన్న ధోని.. స్లోగా ఉంటుందనుకుంటే.. పరుగుల వరద పారిందని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో దీపక్ చహర్ తన కోటా పూర్తి చేసి 55 పరుగులు ఇవ్వగా.. తుషార్ 45 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. చదవండి: ఈ మాత్రం ఆటకి 16 కోట్లు దండగ! ఒక్క సిక్సర్ కూడా లేదు! సెట్ కాడు IPL 2023: కేకేఆర్‌కు షాకిచ్చిన బంగ్లా బోర్డు! తప్పుకొన్న షకీబ్.. ఆ స్టార్ బ్యాటర్ కూడా #CSK bowlers today bowled 13 wides and 3 no balls against #LSG and Captain @msdhoni, in his inimitable style, had this to say. 😁😆#TATAIPL | #CSKvLSG pic.twitter.com/p6xRqaZCiK — IndianPremierLeague (@IPL) April 3, 2023 -
IPL 2023: ‘ధోని పూర్తి ఫిట్‌గా ఉన్నాడు.. మరో మూడు, నాలుగేళ్లు ఐపీఎల్ ఆడతాడు’
Will MS Dhoni Retire From IPL In 2023?: మహేంద్ర సింగ్ ధోని.. ఐపీఎల్-2023 తర్వాత రిటైర్ అవుతాడా? తలా అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. మిస్టర్ కూల్ ధోనికి ఇదే ఆఖరి సీజన్ అన్న అంచనాల నేపథ్యంలో ఈ అంశంపై క్రీడావర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ ఏడాది వేలంలో ఇంగ్లండ్ సారథి బెన్‌స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకోవడంతో.. అతడిని కెప్టెన్‌ను చేసి ధోని ఇక విశ్రాంతి తీసుకుంటాడనే సంకేతాలు వచ్చాయి. ఈ క్రమంలో స్టోక్స్ జట్టుపై పూర్తిగా పట్టు సాధించిన తర్వాత పగ్గాలు అతడికి అప్పజెప్పి తలా రిటైర్ అవుతాడనే వార్తలు వినిపించాయి. ఈ విషయంపై సీఎస్కే ఫాస్ట్‌బౌలర్ దీపక్ చహర్‌కు ప్రశ్న ఎదురుకాగా అతడు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘‘ధోనికి ఐపీఎల్లో ఇదే చివరి ఏడాది అని ఎవరు చెప్పారు. నిజానికి ఆయన కూడా స్వయంగా ఎప్పుడూ ఈ మాట అనలేదు. నాకు తెలిసి ధోని ఇంకొన్నాళ్లు ఆడతాడు. ఆడాలని కోరుకుంటున్నా కూడా! ఎప్పుడు రిటైర్ అవ్వాలో ధోనికి బాగా తెలుసు. టెస్టు క్రికెట్‌కు, తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికే సమయంలో ధోని తీసుకున్న నిర్ణయాలు మనమంతా చూశాం కదా! నేనైతే ధోని ఇంకొన్నాళ్లు ఆడతాడనే అనుకుంటున్నా. ఆయన సారథ్యంలో.. ఆయనతో కలిసి క్రికెట్ ఆడటమనే నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉన్నా. ధోని ఇప్పటికీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈసారి ఐపీఎల్లో తలా బ్యాటింగ్ చూస్తే మీకే ఆ విషయం అర్థమవుతుంది. ధోని రిటైర్మెంట్ గురించి మాకైతే అస్సలు ఐడియా లేదు’’ అని దీపక్ చహర్ న్యూ ఇండియా స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు. మరో మూడు, నాలుగేళ్లు.. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ సైతం ధోని ఐపీఎల్ కెరీర్ గురించి స్పందిస్తూ.. ‘‘ధోనికి ఇదే ఆఖరి సీజన్ అని నేను విన్నాను. నా దృష్టిలో మాత్రం మరో మూడు నాలుగేళ్ల పాటు క్రికెట్ ఆడగల సత్తా ధోనికి ఉంది. ఇప్పటికీ తను ఫిట్‌గా ఉన్నాడు. అద్భుతంగా వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. తనొక గొప్ప నాయకుడు. సీఎస్కే విజయవంతం కావడానికి ప్రధాన కారణం అతడి కెప్టెన్సీనే. నాకు తెలిసి ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ కాదు.. అతడు ఇంకొంత కాలం కొనసాగుతాడు’’ అని ఏఎన్ఐతో పేర్కొన్నాడు. కాగా టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ధోని.. ఐపీఎల్లో చెన్నై జట్టును నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Aus 2nd ODI: ఘోర ఓటమి.. టీమిండియా చెత్త రికార్డులివే! మరీ దారుణంగా.. IND vs AUS: అతడు లేకపోవడం వల్లే టీమిండియాకు ఓటమి.. లేదంటేనా ఆసీస్‌కు చుక్కలే -
ఐపీఎల్‌కు ముందు చెన్నైకి గుడ్ న్యూస్.. స్టార్ ఆటగాడు వచ్చేస్తున్నాడు!
గత కొంత కాలంగా గాయంతో బాధపడుతున్న టీమిండియా యువ పేసర్ దీపక్ చాహర్ ఇప్పుడు పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించాడు. దీంతో ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున బరిలోకి దిగేందుకు చాహర్ సిద్దమయ్యాడు. దీపక్ చహర్ చివరగా భారత్ తరుపున గతేడాది ఆఖరిలో బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో ఆడాడు. అయితే ఈ మ్యాచ్‌లో కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేసిన అతడికి వెన్ను నొప్పి మళ్లీ తిరగబెట్టింది. దీంతో అతడు మిగిలిన సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. 2022 ఏడాదిలో కేవలం 15 మ్యాచ్‌లు మాత్రమే భారత్ తరపున ఆడాడు. అదే విధంగా గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు కూడా చాహర్ దూరమయ్యాడు. ఇక చాహర్ తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన పలు విషయాలును పీటీఐతో వెల్లడించాడు. "నేను పూర్తి ఫిట్నెస్ సాధించడానికి గత రెండు మూడు నెలలుగా తీవ్రంగా శ్రమిస్తున్నాను. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాను. ఈ ఏడాది ఐపీఎల్ కోసం ఇప్పటినుంచే నేను సన్నద్దం అవుతున్నాను. పూర్తి ఫిట్నెస్గా ఉండి బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించడమే నా లక్ష్యం. ఏ జట్టుకు ఆడిన 100 శాతం ఎఫక్ట్ పెడతాను. అంతే తప్ప నా గురించి ఎవరు ఏమీ మాట్లాడిన నేను పట్టించుకోను" అని పీటీఐతో దీపక్ చాహర్ పేర్కొన్నాడు. తొలి మ్యాచ్‌లో సీఎస్కే వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2023 ఎడిషన్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 31 నుంచి మే 28 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ల మధ్య అహ్మదాబాద్‌లో జరిగే తొలి పోరుతో ఐపీఎల్–16 ప్రారంభం కానుంది. ఇక ఫైనల్ మే 28న జరుగనుంది. చదవండి: Suryakumar Yadav: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూర్యకుమార్ యాదవ్ -
దీపక్ చహర్ భార్యకు బెదిరింపులు
టీమిండియా స్టార్ క్రికెటర్ దీపక్ చాహర్ భార్య జయా భరద్వాజ్‌కు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడం సంచలనం కలిగించింది. తనకు ఇవ్వాల్సిన రూ. 10 లక్షలు తిరిగి ఇవ్వమన్నందుకు సదరు దుండగులు ఆమెను చంపేస్తామంటూ బెదిరించారు. ఈ విషయమై దీపక్ చహర్ తండ్రి ఆగ్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విషయంలోకి వెళితే.. రిఖ్ స్పోర్ట్స్ యజమాని ధ్రువ్ పరేక్, అతని తండ్రి కమలేశ్ పరేక్ జయ భరద్వాజ్ దగ్గర రూ. 10లక్షలు అప్పుగా తీసుకున్నారు. వ్యాపారం కోసం అని చెప్పడంతో 2022 అక్టోబర్ 7న ఆన్లైన్లో రూ.10 లక్షలు పంపించారు. కానీ ఆ డబ్బును వారు దుర్వినియోగం చేసినట్లు తెలుసుకున్న జయా భరద్వాజ్ డబ్బు తిరిగి చెల్లించాలని అడిగారు. అయితే తండ్రి, కొడుకులు డబ్బు తిరిగి ఇవ్వడమే కాకుండా ఫోన్ చేసి అసభ్యకర వ్యాఖ్యలతో దుర్భాషలాడారని.. చంపేస్తామంటూ బెదిరించారని దీపక్ చహర్ తండ్రి పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధికారి, ఆయన కుమారుడు ఉన్నట్లు ఆరోపణులు వస్తున్నాయి. మోసం చేసిన వారిద్దరికీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌తో సంబంధం ఉన్నట్లు తెలియడంతో కంపెనీ యజమానుల వివరాలను సేకరిస్తున్నారు. కాగా దీపక్ చహర్ కుటుంబం ప్రస్తుతం ఆగ్రాలో నివసిస్తోంది. దీపక్, జయ భరద్వాజ్‌ల వివాహం గతేడాది జూన్ 1న జరిగింది. వీరిద్దరూ చాలాకాలం ప్రేమించుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా టీమిండియాతో పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్నాడు చహర్. చహర్ టీమిండియా తరపున ఏడు వన్డేల్లో 10 వికెట్లు, 24 టి20 మ్యాచ్‌ల్లో 29 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఎన్బీఏ స్టార్ క్రేజ్ మాములుగా లేదు; ఒక్క టికెట్ ధర 75 లక్షలు -
ఇక ఆటగాళ్లకు కఠిన పరీక్ష.. ఏమిటీ ‘యో–యో’ టెస్టు? కోహ్లి కంటే వీళ్లే ముందు!
BCCI- ODI World Cup 2023- Yo-Yo Test: కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సహా కేఎల్ రాహుల్, దీపక్ చహర్ తదితర టీమిండియా ఆటగాళ్లు తరచూ గాయాల బారిన పడటం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఫిట్నెస్ సమస్యల కారణంగా రోహిత్ అందుబాటులో లేకపోవడం సహా పని ఒత్తిడిని తగ్గించే క్రమంలో గతేడాది దాదాపు ఏడుగురు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఇక ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో పేస్ దళ నాయకుడు బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. జడేజా సైతం గాయం కారణంగా ఐసీసీ ఈవెంట్‌కు దూరం కావడం ప్రభావం చూపింది. వెరసి కీలక ఈవెంట్లలో టీమిండియా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. వరుస వైఫల్యాల కారణంగా విమర్శల పాలైంది. ఈ క్రమంలో ఆటగాళ్ల ఫిట్నెస్ చర్చనీయాంశమైంది. కాగా 2023లో సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో లోపాలు సవరించుకుని బరిలోకి దిగాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్లేయర్ల ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తూ యో- యో టెస్టును తిరిగి ప్రవేశపెట్టేందుకు సమాయత్తమైంది. దీంతో పాటు ఎముకల పరిపుష్టి(డెక్సా) పరీక్ష నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఇంతకీ యో- యో టెస్టు అంటే ఏమిటి? ఈ టెస్టులో టాప్- 5 స్కోరర్లు ఎవరో తెలుసుకుందాం! ఏమిటీ ‘యో–యో’ టెస్టు?! రెండు కోన్ల (ప్లాస్టిక్ స్థంభాలు) మధ్య బీప్ సౌండ్‌తో పరిగెత్తించే పరీక్షే యో–యో టెస్టు. రెండు కోన్ల మధ్య 20 మీటర్ల దూరం ఉంటుంది. మూడు బీప్ సౌండ్లు మోగేలోపు ఈ దూరాన్ని పూర్తి చేయాలి. అంటే మొదటి బీప్నకు ఇక్కడి కోన్ నుంచి పరుగు ప్రారంభించి... రెండో బీప్ సౌండ్లోపు అవతలి కోన్‌కు చేరాలి. మూడో బీప్ మోగే సరికి ఇవతలి కోన్ చేరాలి. దీనికి స్కోరు ఉంటుంది. అంటే నిర్ణీత సమయంలోపు పూర్తి చేస్తే మెరుగైన స్కోరు, ఆ తర్వాత సగటు స్కోరు ఇస్తారు. అసాధారణ ఫిట్నెస్తో ఉండే కోహ్లి యో–యో టెస్టు పాసైనప్పటికీ టాప్–5 స్కోరర్స్‌లో లేడు. అతను 19 స్కోరు చేసి 8వ స్థానంలో ఉన్నాడు. గతంలో షమీ, సంజూ సామ్సన్, రాయుడు, రైనా, పృథ్వీ షా, వాషింగ్టన్ సుందర్ యో–యో టెస్టులో ఫెయిలయ్యారు. టాప్–5 యో–యో స్కోర్లు 1. షాన్ మసూద్ (పాక్) 22.1 2. బెయిర్‌స్టో (ఇంగ్లండ్) 21.8 3. మయాంక్ డాగర్ (భారత్) 19.3 4. బెత్ లాంగస్టన్ (ఇంగ్లండ్) 19.2 5. రిజ్వాన్ (పాక్) 19.2 చదవండి: WC 2023: సర్వ సన్నద్ధం కోసం... బీసీసీఐ సమావేశం! 20 మందితో ప్రపంచకప్ సైన్యం ఇలా చేయడం సిగ్గుచేటు.. రోహిత్ శర్మ భార్య ఆగ్రహం -
Ind Vs Ban: జట్టులోకి కుల్దీప్ యాదవ్.. రోహిత్ గాయంపై బీసీసీఐ అప్డేట్
India tour of Bangladesh, 2022 - 3rd ODI: బంగ్లాదేశ్‌తో మూడో వన్డేకు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు టీమిండియాలో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో అతడు జట్టుతో కలవనున్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో ఓటమి పాలై సిరీస్ చేజార్చుకున్న టీమిండియా శనివారం నాటి ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. గాయాల బెడద ఇక రెండో వన్డే సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డ విషయం తెలిసిందే. టాస్ ఓడి ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించారు. అయితే, నొప్పిని భరిస్తూనే మైదానంలో అడుగుపెట్టి అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ రోహిత్ శ్రమ వృథాగా పోయింది. మరోవైపు.. యువ పేసర్ కుల్దీప్ సేన్ వెన్ను నొప్పితో రెండో వన్డేకు దూరం కాగా.. దీపక్ చహర్‌ను సైతం ఫిట్నెస్ సమస్యలు వేధిస్తున్నాయి. రెండో మ్యాచ్ సందర్భంగా అతడు కూడా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు ఆఖరి మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయారు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్‌ను జట్టుకు ఎంపిక చేసినట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. టెస్టులకు రోహిత్ దూరం? అదే విధంగా... రోహిత్ శర్మ, కుల్దీప్ సేన్, దీపక్ చహర్ స్వదేశానికి తిరిగి వచ్చారని పేర్కొంది. రోహిత్ చికిత్స కోసం ముంబై ఆస్పత్రిలో స్పెషలిస్టును సంప్రదించగా.. కుల్దీప్, దీపక్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నట్లు తెలిపింది. ఇక కెప్టెన్ రోహిత్ టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడో లేదోనన్న అంశంపై వీలైనంత త్వరగా అప్డేట్ ఇస్తామని మేనేజ్మెంట్ పేర్కొంది. బంగ్లాదేశ్‌తో మూడో వన్డేకు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్. చదవండి: Ind A Vs Ban A: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారీ విజయం FIFA WC 2022: ఏం గుండెరా నీది.. చచ్చేంత సమస్య ఉన్నా దేశం కోసం బరిలోకి -
బంగ్లాదేశ్‌తో మూడో వన్డే.. టీమిండియాకు భారీ షాక్! రోహిత్‌తో పాటు
బంగ్లాదేశ్ చేతిలో వరుసగా రెండు వన్డేల్లో ఓడి సిరీస్‌ను కోల్పోయిన భారత్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ పేసర్లు దీపక్ చహర్, కుల్దీప్ సేన్ గాయం కారణంగా మూడో వన్డేకు దూరం కానున్నారు. ఢాకా వేదికగా జరిగిన మూడో వన్డేలో రోహిత్ చేతి వేలికి గాయం కాగా.. దీపక్ చహర్‌కు కండరాలు పట్టేశాయి. అదే విధంగా తొలి వన్డేలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యువ పేసర్ కుల్దీప్ సేన్ ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో వీరు ముగ్గురు గురువారం స్వదేశానికి పయనం కానున్నారు. ఈ విషయాన్ని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా దృవీకరించాడు. ఇక అఖరి వన్డేలోనైనా గెలిచి పరువు నిలబెట్టు కోవాలని భారత జట్టు భావిస్తోంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే చటోగ్రామ్ వేదికగా శనివారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. అయితే దీపక్, రోహిత్,కుల్దీప్ రిప్లేస్మెంట్ను బీసీసీఐ ప్రకటించలేదు. కాబట్టి ప్రస్తుతం జట్టులో సిరాజ్, శార్థూల్, ఉమ్రాన్ మినహా అదనపు పేసర్ ఒక్కరు కూడా లేరు. ఇక బంగ్లాతో అఖరి వన్డేకు రోహిత్ దూరం కావడంతో కేఎల్ రాహుల్ భారత కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించున్నాడు. చదవండి: చేతి వేలికి ఫ్రాక్చర్ కాలేదు.. ఎముక పక్కకు జరిగింది: రోహిత్ శర్మ -
దీపక్ చాహర్‌కు చేదు అనుభవం.. కనీసం ఫుడ్ కూడా లేదంటూ మండిపాటు
వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా పేసర్ దీపక్ చాహర్‌కు చేదు అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా ఉన్న దీపక్ చాహర్, శిఖర్ ధావన్, వాషింగ్టన్ సుందర్, శ్రేయస్ అయ్యర్ నేరుగా వెల్లింగ్టన్ నుంచి మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఢాకాకు చేరుకున్నారు. కానీ మలేషియా ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా దీపక్ చాహర్ లగేజ్ మాత్రం ఢాకాకు రాలేదు. ఈ క్రమంలో అసహనానికి గురైన చాహర్ మలేషియా ఎయిర్‌లైన్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. నేను ఇప్పటి వరకు ఇంత చెత్త సర్వీస్‌ను చూడలేదంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీసం ఫుడ్ కూడా లేదు "మలేషియా ఎయిర్‌లైన్స్‌లో దారుణమైన అనుభవం ఎదురైంది. తొలుత మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మా ఫ్లైట్ మార్చారు. మేము బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించినప్పటికీ.. ఎటువంటి ఆహారం కూడా అందజేయలేదు. మాతో పాటు లగేజ్ కూడా రాలేదు. గత 24 గంటల నుంచి లగేజ్ కోసం మేము ఎదురుచూస్తున్నాము. ఇప్పటి వరకు నా లగేజ్ రాకపోతే.. రేపు మ్యాచ్‌కు ఏ విధంగా సన్నద్దం అవుతాను" అని చాహర్ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా చాహర్‌తో పాటు మరి కొంత మంది ప్రయాణికుల లగేజ్ కూడా రాలేదు. ఇక దీపక్ చాహర్ ట్వీట్‌పై మలేషియా ఎయిర్‌లైన్స్ నిమిషాల వ్యవధిలోనే స్పందించింది. చాహర్‌కు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది. ఇక భారత్- బంగ్లాదేశ్ మధ్య తొలి వన్డే ఆదివారం(డిసెంబర్ 4)న ఢాకా వేదికగా జరగనుంది. Had a worse experience traveling with Malaysia airlines @MAS .first they changed our flight without telling us and no food in Business class now we have been waiting for our luggage from last 24hours .imagine we have a game to play tomorrow 😃 #worse #experience #flyingcar — Deepak chahar 🇮🇳 (@deepak_chahar9) December 3, 2022 చదవండి: Ricky Ponting: చాలా మందిని భయపెట్టా.. నాకు కూడా భయమేసింది.. ఇప్పుడిలా! -
అసలేం చేస్తున్నారు.. టీమిండియాను భ్రష్టు పట్టించకండి: నెహ్రా ఘాటు వ్యాఖ్యలు! కోచ్‌గా..
India tour of New Zealand, 2022 : న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత జట్టు కూర్పుపై టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా విస్మయం వ్యక్తం చేశాడు. మేనేజ్మెంట్ అసలేం ఆలోచిస్తుందో అర్థం కావడం లేదని.. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన ఆటగాళ్లను పక్కనపెట్టడం సరికాదని విమర్శించాడు. తప్పుడు నిర్ణయాలతో జట్టును భ్రష్టు పట్టించవద్దని ఘాటు విమర్శలు చేశాడు. దీపక్ బౌలింగ్ ఆప్షన్ కాదు! కాగా కివీస్‌తో మొదటి వన్డేలో చోటు దక్కించుకున్న బ్యాటర్ సంజూ శాంసన్, బౌలర్ శార్దూల్ ఠాకూర్లను ఆదివారం నాటి రెండో మ్యాచ్‌లో పక్కనపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజూ స్థానంలో దీపక్ హుడా, శార్దూల్ స్థానంలో దీపక్ చహర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ బ్రాడ్‌కాస్టర్ అమెజాన్ ప్రైమ్ వీడియో చర్చలో పాల్గొన్న ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగడం మనం చూశాం. దీపక్ హుడాను బౌలింగ్ ఆప్షన్‌గా తీసుకున్నారని నేనైతే అనుకోవడం లేదు. నిజానికి అతడు వరల్డ్‌కప్ టోర్నీలో వికెట్లు తీసి ఉండవచ్చు. అయితే, ఇప్పుడు జట్టులో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు కదా! నిజానికి వాళ్లకు దీపక్ హుడా ఆరో బౌలింగ్ ఆప్షన్ కావొచ్చు. కానీ మరీ అంత గొప్ప ఆల్‌రౌండర్ ఏమీ కాదు. చహర్ బెటర్.. అయినా శార్దూల్ ఠాకూర్ గత మ్యాచ్‌లో బాగా ఆడలేదని కాదు.. అయితే తనకంటే దీపక్ చహర్ బెటర్. అయినా మొదటి మ్యాచ్‌లో చహర్‌ను కాదని ఠాకూర్‌ను ఆడించారు. కానీ.. ఆ మరుసటి మ్యాచ్‌కే ఠాకూర్‌ను తప్పించారు. ఇది సరికాదు’’ అని నెహ్రా అభిప్రాయపడ్డాడు. ఇక సంజూ శాంసన్ గురించి స్పందిస్తూ.. ‘‘ఒకవేళ నేను సెలక్టర్‌గా ఉంటే.. సంజూను కాదని హుడానే ఆడించేవాడిని. హుడా కోసం సంజూను బలి చేయాలా? అయితే, ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా మాత్రం కాదు’’ అంటూ హుడాకు మద్దతుగా నిలవడం గమనార్హం. అయితే, చర్చలో భాగంగా ఇందుకు స్పందించిన మరో మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్.. ‘‘ఆశిష్ అన్నట్లు హుడాను బ్యాటర్‌గా ఎంపిక చేయడం వరకు ఒకే! బౌలింగ్ ఆప్షన్‌గా కూడా వాడుకోవడం మంచి విషయమే. హుడా తుది జట్టులోకి రావడం కోసం మరొకరిని పక్కన పెట్టడం సరికాదు. నిజానికి, సంజూ శాంసన్ గత కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన కనబరస్తున్నప్పటికీ అతడికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇప్పుడేమో ఇలా ఒక్క మ్యాచ్ తర్వాత మళ్లీ పక్కన పెట్టారు’’ అని సంజూకు అండగా నిలబడ్డాడు. అయితే, తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నీ ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని కార్తిక్ అభిప్రాయపడ్డాడు. కావాలనే చేశారు! అదేం కాదు.. మొదటి వన్డేలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సంజూ శాంసన్ 36 పరుగులతో రాణించాడు. అయితే, గత కొంతకాలంగా విఫలమవుతున్న మరో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రం మరోసారి తక్కువ స్కోరు(15)కే పెవిలియన్ చేరాడు. దీంతో సంజూను వివక్షపూరితంగానే పక్కన పెట్టారంటూ అతడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీసీసీఐని ట్రోల్ చేశారు. ఇక ఈ మ్యాచ్ వర్షార్పణమైన తర్వాత కెప్టెన్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. ఆరో బౌలర్ అవసరమైనందు వల్లే సంజూకు బదులు హుడాను తీసుకున్నామని తెలిపాడు. అదే విధంగా పిచ్ స్వింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావించి ఠాకూర్‌ను తప్పించి చహర్‌కు ఛాన్స్ ఇచ్చినట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు.. సంజూ అభిమానులు మాత్రం స్పిన్ బౌలింగ్ చేయగల హుడాను తీసుకున్నప్పటికీ.. వికెట్ కీపర్‌గా పంత్‌ను కాదని శాంసన్‌కు అవకాశం ఇవ్వొచ్చు కదా అని కామెంట్ చేస్తున్నారు. చదవండి: గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన ఐపీఎల్ 2022 ఫైనల్.. ఎందుకంటే..? IPL 2023: పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లకు భారీ ధర.. అసలు ఎలా ఎంపిక చేస్తారు? -
భువీని తీసేయండి.. అతడిని జట్టులోకి తీసుకురండి!
టీ20 ప్రపంచకప్ 2022లో ఘోర పరాభవం తర్వాత.. భారత జట్టులో మార్పులు చేయాలని మాజీ క్రికెటర్లు పలు సూచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. భారత టీ20 జట్టులోకి వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో దీపక్ చహర్‌ను తీసుకురావాలని కనేరియా అభిప్రాయపడ్డాడు. చాహర్ గాయాలతో బాధపడుతున్నప్పటికీ భువీ కంటే మెరుగైన ఆటగాడు అని అతడు తెలిపాడు. ఇక న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడిన భువీకి వన్డే సిరీస్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇక టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న దీపక్ చహర్ వన్డే సిరీస్‌కు భారత జట్టులోకి వచ్చాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే ఆక్లాండ్ వేదికగా శుక్రవారం జరగనుంది. ఈ క్రమంలో తన యూట్యూబ్ ఛానల్లో కనేరియామాట్లాడూతూ... "దీపక్ చాహర్ అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. అతడిని భారత జట్టు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. టీ20 జట్టులో భువనేశ్వర్ కుమార్ స్థానంలో చాహర్‌ని తీసుకోవాలి. అతడు భువీ కంటే అద్భుతంగా రాణించగలడు. అతడు పవర్ ప్లేలో కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తాడు. మీకు నాలుగు ఓవర్లలో 35 నుంచి 40 పరుగులు ఇచ్చే బౌలర్ కావాలా? భువీకి గుడ్‌బై చెప్పే సమయం ఇది. ప్రసిద్ధ్ కృష్ణ, టి నటరాజన్ వంటి పేస్ బౌలర్లు అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నారు. 2024 టీ20 ప్రపంచకప్ సమయానికి భువీ ఫిట్‌గా ఉండడానికి మనకు తెలుసు. కాబట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సమయం"అని అతడు పేర్కొన్నాడు. చదవండి: Dinesh Karthik Retirement?: దినేష్ కార్తీక్ సంచలన నిర్ణయం..! భావోద్వేగ పోస్టు.. ప్లీజ్ డీకే.. వద్దు అంటున్న ఫ్యాన్స్ -
బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు.. మహ్మద్ షమీ? దీపక్ చాహర్?
టీ20 ప్రపంచకప్-2022కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. అయితే బుమ్రా రిప్లేస్మెంట్ లేకుండానే భారత జట్టు ఆస్ట్రేలియాకు పయనమైంది. ఇప్పటి వరకు ఇంకా బుమ్రా స్థానాన్ని బీసీసీఐ భర్తీ చేయలేదు. ఆక టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే ఆయా దేశాలు తమ జట్లలో మార్పులు చేసుకునేందుకు ఆదివారం(ఆక్టోబర్9) వరకు మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని బీసీసీఐ ఆదివారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా బుమ్రా స్థానం కోసం ముఖ్యంగా ఇద్దరు పేసర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒకరు వెటరన్ పేసర్ మహ్మద్ షమీ కాగా.. మరొకరు యువ పేసర్ దీపక్ చాహర్. కాగా టీ20 ప్రపంచకప్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో వీరిద్దరికి చోటు దక్క లేదు. చాహర్, షమీకి స్టాండ్‌బై ఆటగాళ్లగా సెలక్టర్లు ఎంపికచేశారు. అయితే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికైన షమీ.. కొవిడ్ బారిన పడడంతో దూరమయ్యాడు. ఇక దీపక్ చహర్ ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికైనప్పటికీ కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. అనంతరం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో మాత్రం దీపక్ అదరగొట్టాడు. కాగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు దీపక్ చాహర్ కాలికి స్వల్ప గాయమైంది. దీంతో అతడు వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే చాహర్ గాయం అంతతీవ్రమైనది కాదు అని బీసీసీఐ అదికారి ఒకరు పేర్కొన్నారు. ఇక షమీ, చాహర్ ప్రస్తుతం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నారు. వీరిద్దరూ పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించే పనిలో పడ్డారు. అయితే బుమ్రా స్థానంలో అనుభవం ఉన్న షమీనే ఎంపిక చేస్తారని క్రికెట్ విశ్లేషుకులు అభిప్రాయనపడుతున్నారు. చదవండి: Ind vs SA : రెండో వన్డేకు వర్షం ముప్పు.. మ్యాచ్ జరిగేనా? -
దీపక్ చాహర్‌కు గాయం.. వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా పేసర్ దీపక్ చాహర్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. దీంతో చాహర్ స్థానంలో మిగిలిన రెండు వన్డేలకు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ శనివారం ప్రకటించింది. కాగా సుందర్ కూడా గాయం కారణంగా గత కొంత కాలం నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇప్పటి వరకు సుందర్ కేవలం నాలుగు వన్డేలు మాత్రమే ఆడాడు. అతడు చివరసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విండీస్‌తో జరిగిన వన్డేలో భారత్ తరపున ఆడాడు. కాగా ప్రోటీస్‌తో తొలి వన్డేకు ముందు గాయపడిన చాహర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. ఇక అఖరి రెండు వన్డేలకు సుందర్ భారత జట్టుతో కలవనున్నాడు. ఇక దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో ఓటమి చెందిన టీమిండియా.. రాంఛీ వేదికగా రెండో వన్డేలో ఆదివారం తలపడనుంది. ఈ మ్యాచ్‌కు భారత తుది జట్టులో బిష్నోయ్ స్థానంలో సుందర్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. తుది జట్లు(అంచనా) టీమిండియా: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభమన్ గిల్, రజిత్ పటిదార్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్ దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, తబ్రైజ్ షమ్సీ -
దీపక్ చహర్‌కు గాయం..!
టీమిండియా బౌలర్ దీపక్ చహర్ చీలమండ గాయంతో సౌతాఫ్రికాతో జరగనున్న మిగతా రెండు వన్డేలకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ సెషన్లో బౌలింగ్ చేసిన దీపక్ చహర్‌కు కాలు బెణికింది. దీంతో తొలి వన్డేకు చహర్ దూరంగా ఉన్నాడు. అయితే గాయం తీవ్రత పెద్దగా లేకపోయినప్పటికి టి20 ప్రపంచకప్ దృశ్యా మిగతా రెండు వన్డేల నుంచి దీపక్ చహర్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు జట్టు మేనేజ్మెంట్ తెలిపింది. ''కాలు బెణికినప్పటికి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. కొద్దిరోజులు రెస్ట్ తీసుకుంటే బెటర్ అని మా అభిప్రాయం. అందునా టి20 ప్రపంచకప్‌కు దీపక్ చహర్ స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్నాడు. గాయంతో టి20 ప్రపంచకప్‌కు దూరమైన బుమ్రా స్థానంలో షమీ లేదా దీపక్ చహర్‌లలో ఒకరిని ఆడించాలని చూస్తోంది. ఒకవేళ షమీ ఫిట్నెస్ నిరూపించుకుంటే చహర్ స్టాండ్ బై ప్లేయర్‌గానే ఉంటాడు. అలా కాకుండా షమీ ఫిట్‌నెస్‌లో విఫలమైతే మాత్రం అప్పుడు దీపక్ చహర్ అవసరం ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకొనే చహర్‌కు ప్రస్తుతం విశ్రాంతి ఇచ్చినట్లు'' బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక దీపక్ చహర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. డెత్ ఓవర్లలో మంచి బౌలింగ్ కనబరిచే చహర్ మ్యాచ్‌కు దూరమవడంతో శిఖర్ ధావన్ నేతృత్వంలోని టీమిండియా విజయానికి తొమ్మిది పరుగుల దూరంలో ఆగిపోయింది. బ్యాటింగ్‌లో సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్లు రాణించినప్పటికి టాపార్డర్ విఫలం కావడంతో టీమిండియా పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇక సౌతాఫ్రికా, టీమిండియాల మధ్య రెండో వన్డే ఆదివారం(అక్టోబర్ 9న) రాంచీ వేదికగా జరగనుంది. చదవండి: ఎదురులేని రిజ్వాన్.. గెలుపుతో పాక్ బోణీ మహిళా అంపైర్‌తో దురుసు ప్రవర్తన.. అందుకే గొడవ -
IND Vs SA T20: సిరాజ్‌కు కలిసిరాని రీఎంట్రీ.. రోహిత్ శర్మ సీరియస్
దక్షిణాఫ్రికాతో ఇండోర్‌లో జరిగిన మూడో టీ20తో ఎంట్రీ ఇచ్చిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఏదీ కలిసిరాలేదు. ఎన్నో అంచనాల మధ్య జట్టులో చోటు దక్కించుకున్న సిరాజ్ తన స్థాయి మేర రాణించలేదు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అతను వికట్లేమీ లేకుండా ఏకంగా 44 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతోపాటు ఫీల్డింగ్‌లోనూ పొరపాట్లు చేసి.. బౌలర్ దీపక్ చహర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. తడబడి.. సిక్సర్‌గా అసలేం జరిగిందంటే.. అప్పటికే పరుగుల వరద పారించిన ప్రొటీస్ జట్టు బ్యాట్స్‌మెన్ చహర్ బౌల్ చేసిన చివరి ఓవర్లోనూ రెచ్చిపోయారు. ఈక్రమంలో ఓవర్ ఐదో బంతికి డేవిడ్ మిల్లర్ (5 బంతుల్లో 19) బంతిని గాల్లోకి బాదాడు. అది లాంగాఫ్‌లో ఉన్న సిరాజ్ వైపుగా వెళ్లింది. కాస్త చాకచక్యంతో దాన్ని ఒడిసిపట్టాల్సిన సిరాజ్ తడబడ్డాడు. క్యాచ్ అయితే పట్టాడు కానీ, బౌండరీ లైన్‌పై అడుగేశాడు. దాంతో అది సిక్సర్ అయింది. అదిచూసి బౌలింగ్ చేస్తున్న చహర్, కెప్టెన్ రోహిత్ సిరాజ్‌పై అసహనం వ్యక్తం చేశారు. రోహిత్ అయితే, ఏకంగా.. ఏం ఫీల్డింగ్ రా బూబూ! అన్నట్టు ఓ లుక్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. (చదవండి: 'టీ20 ప్రపంచకప్ టైటిల్ రేసులో ఆ మూడు జట్లే నిలుస్తాయి') అశ్విన్ బౌలింగ్‌లోనూ.. అశ్విన్ వేసిన తొమ్మిదో ఓవర్ చివరి బంతికి కూడా సిరాజ్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రోసో (వ్యక్తిగత స్కోరు 24) ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీపై సిరాజ్ అందుకోలేకపోయాడు. అది సిక్స్‌గా మారింది. ఇక మొత్తంగా 20వ ఓవర్లో 24 పరుగులు రావడంతో పర్యాటక జట్టు మూడు వికెట్లు కోల్పోయి భారత్‌కు 228 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టార్గెట్ ఛేదనలో పేలవ ప్రదర్శన కనబర్చిన టీమిండియా 18.3 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రెండు మ్యాచుల్లో విజయం సాధించిన రోహిత్ సేన సిరీస్‌ను 2-1తో దక్కించుకుంది. (చదవండి: దక్షిణాఫ్రికాతో తొలి వన్డే .. పటిదార్ అరంగేట్రం! భారత జట్టు ఇదే!) pic.twitter.com/ElkZ1E8zNV — Guess Karo (@KuchNahiUkhada) October 4, 2022 -
శబాష్ దీపక్ చాహర్.. రనౌట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ..!
ఇండోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 49 పరుగుల తేడాతో పరాజాయం పాలైంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత పేసర్ దీపక్ చాహర్ క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. సౌతాఫ్రికా ఆటగాడు ట్రిస్టాన్ స్టబ్స్‌ను రనౌట్(మన్కడింగ్) చేసే అవకాశం ఉన్నప్పటికీ.. అఖరి నిమిషంలో తన మనసును చాహర్ మార్చుకున్నాడు. జరిగిందంటే.. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 16వ ఓవర్లో తొలి బంతి వేయడానికి దీపక్ చాహర్ సిద్దమయ్యాడు. ఈ క్రమంలో నాన్‌స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న ట్రిస్టాన్ స్టబ్స్.. బౌలర్‌ను గమనించకుండా క్రీజు వదిలి చాలా దూరం ముందుకు వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన చాహర్.. బంతిని వేయకుండా ఆపేసి రనౌట్ చేస్తానని నవ్వుతూ హెచ్చరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా దీపక్ క్రీడా స్పూర్తికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక భారత స్టార్ మహిళా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ.. మూడో వన్డే సందర్భంగా ఇంగ్లండ్ క్రికెటర్ చార్లీ డీన్‌ను రనౌట్ (మన్కడింగ్) చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రనౌట్‌పై రాజుకున్న వివాదం ఇంకా చల్లారలేదు. Not Mankading! The ever smiling and dashing Deepak Chahar maintains the rule, law, spirit, fairness, glory and beauty of cricket! Respect ✊ #INDvSA #ICC2022 #BCCI #CricketTwitter #respect #chennaisuperkings #mankad pic.twitter.com/8pT4SXleEY — Narasimha R N (@NarasimhaRN5) October 4, 2022 చదవండి: IND Vs SA: రోహిత్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! -
చాహర్ అద్భుతమైన ఇన్ స్వింగర్.. ప్రోటీస్ కెప్టెన్‌కు ప్యూజ్‌లు ఔట్
టీమిండియా పేసర్ దీపక్ చాహర్ ఘనమైన పునరాగమనం చేశాడు. తిరువనంతపురం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో రెండు కీలక వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ప్రోటీస్ కెప్టెన్ టెంబా బవుమాను చాహర్ ఔట్ చేసిన విధానం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. చాహర్ ఓ సంచలన బంతితో టెంబా బావుమాను పెవిలియన్‌కు పంపాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన చాహర్.. అద్భుతమైన ఇన్ స్వింగర్‌తో బావుమాను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో బావుమా కూడా ఒక్క సారిగా ఆశ్చర్యపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 గౌహతి వేదికగా ఆక్టోబర్2న జరగనుంది. Wat a delivery #INDvSA Take a bow @deepak_chahar9 👏🔥 pic.twitter.com/x6h5wTWJXR — Trending Killer (@Trending_007) September 28, 2022 చదవండి: IND vs SA: సూర్యకుమార్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా -
టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు.. దీపక్ చాహర్‌కు నో ఛాన్స్!
టీ20 ప్రపంచకప్-2022 ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పొట్టి ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి ఆగ్రశేణి టీంలు ఇప్పటికే తమ జట్టులను ప్రకటించాయి. ఇక మెగా ఈవెంట్ కోసం భారత జట్టును బీసీసీఐ సెప్టెంబర్ 16న ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ మెగా టోర్నీ ముందు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయాల బారిన పడటం భారత అభిమానులను ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 ప్రపంచకప్‌లో పాల్గోనే భారత జట్టును మాజీలు, క్రికెట్ నిపుణులు ముందుగానే అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా చేరాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అంచనావేశాడు. బ్యాటర్ల కోటాలో కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్. దినేష్ కార్తీక్‌ను ఎంపిక చేశాడు. అదే విధంగా ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దీపక్ హుడాకు నెహ్రా చోటిచ్చాడు. ఇక తన జట్టులో స్పెషలిస్టు స్సిన్నర్లగా యుజవేంద్ర చాహల్, అశ్విన్‌ను మాత్రమే ఎంపిక చేశాడు. అదే విధంగా ఫాస్ట్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ అవకాశమిచ్చాడు. కాగా నెహ్రా తన ఎంపిక చేసిన జట్టులో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, యువ బౌలర్ దీపక్ చాహర్‌కు చోటు దక్కక పోవడం గమనార్హం. టీ20 ప్రపంచకప్‌కు ఆశిష్ నెహ్రా ఎంచుకున్న భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, దినేష్ కార్తీక్, జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, దీపక్ హుడా చదవండి: Asia Cup 2022: కోహ్లి, రోహిత్ కాదు.. టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణం ఇదే! -
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న భారత్.. ఆవేశ్ స్థానంలో దీపక్ చాహర్ ఎంట్రీ..!
Deepak Chahar Replaces Avesh Khan: ఆసియా కప్ 2022లో టీమిండియా పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది. నిఖార్సైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేక సూపర్-4 దశలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న టీమిండియా.. అన్ని అయిపోయాక దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది. అస్వస్థతతో జట్టుకు దూరంగా ఉన్న ఆవేశ్ ఖాన్ స్థానంలో తదుపరి ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడబోయే మ్యాచ్‌లో బౌలింగ్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్‌కు అవకాశం కల్పించాలని టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. ఇదే పని సూపర్-4 దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందే చేసి ఉంటే ఈ దుస్థితి దాపురించేది కాదని టీమిండియా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. లంక చేతిలో ఓటమితో టీమిండియా ఫైనల్‌కు చేరే అవకాశాలు దాదాపుగా మూసుకుపోయిన దశలో ఈ మార్పు చేయడం వల్ల ప్రయోజనం ఏంటని ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. జట్టు ఎంపికలో మున్ముందైనా ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని భారత సెలెక్టర్లను హెచ్చరిస్తున్నారు. జట్టులో కనీసం ముగ్గురు ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పుడు బ్యాటర్లు, బౌలర్లను కాకుండా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లను కూడా సాన పట్టేలా ప్రణాళికలు రూపొందించాలని కోరుతున్నారు. త్వరలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు కనీసం ముగ్గురు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, గాయం కారణంగా గత ఆరు నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న దీపక్ చాహర్.. ఇటీవలే జింబాబ్వే సిరీస్ ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లతో రాణించాడు. చాహర్ జింబాబ్వే సిరీస్‌లో పర్వాలేదనిపించినా ఆసియా కప్‌కు ఎంపిక చేయకపోవడంతో టీమిండియా తగిన మూల్యమే చెల్లించుకుంది. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు చాహర్‌ను జట్టులోకి తీసుకోవాలని యాజమాన్యం భావిస్తుంది. కాగా, ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో దీపక్ చాహర్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్‌లు స్టాండ్ బై ప్లేయర్లు ఎంపికైన విషయం తెలిసిందే. చదవండి: దేశం కోసం గెలవాలన్న కసి టీమిండియాలో పోయింది.. ఐపీఎల్ బాయ్‌కాట్ చేస్తేనే..! -
'జడేజా స్థానంలో అతడిని జట్టులోకి తీసుకోవాల్సింది'
ఆసియాకప్-2022 టోర్నీ మధ్య నుంచి భారత్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో స్టాండ్‌బైగా ఉన్న అక్షర్ పటేల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత మాజీ ఆటగాడు సబా కరీమ్ తప్పుబట్టాడు. అక్షర్ పటేల్ బదులగా పేసర్ దీపక్ చహర్‌ను జట్టులోకి తీసుకోవాల్సింది అని కరీమ్ అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో ఇండియా న్యూస్‌తో కరీమ్ మాట్లాడుతూ.. ఈ మెగా ఈవెంట్ తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత పేసర్లు ప్రధాన పాత్ర పోషించారు. పాకిస్తాన్‌తో సూపర్-4 మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగడం మనం చూశాం. కాబట్టి గాయపడిన జడేజా స్థానంలో పేసర్ దీపక్ చాహర్‌ను ఎంపిక చేయాల్సింది. చాహర్ టీ20 స్పెషలిస్టు. అతడికి కొత్త బంతితో వికెట్లు తీసే సత్తా ఉంది. అతడు జట్టులో ఉంటే పాకిస్తాన్ అంత పెద్ద టార్గెట్‌ను చేధించేది కాదు. కాగా ఇప్పటికే భారత జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. ఇప్పుడు అక్షర్ రూపంలో నాలుగో స్పిన్నర్‌ను ఎందుకు జట్టులోకి తీసుకున్నారో నాకు అర్ధం కావడం లేదని పేర్కొన్నాడు. ఇక ఆసియాకప్ సూపర్-4లో భాగంగా మంగళవారం శ్రీలంకతో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. చదవండి: కోహ్లిపై మండిపడ్డ బీసీసీఐ.. మళ్లీ అగ్గి రాజేసిన రన్ మెషీన్ వ్యాఖ్యలు -
పాకిస్తాన్‌తో మ్యాచ్.. అవేష్ ఖాన్‌కు నో ఛాన్స్! భారత యువ పేసర్ ఎంట్రీ!
ఆసియాకప్-2022లో దాయాదుల పోరుకు మరి కొద్ది గంటల్లో తెరలేవనుంది. ఈ మెగా టోర్నీ సూపర్-4లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్-పాక్ జట్లు ఆదివారం తలపడనున్నాయి. ఈ మెగా ఈవెంట్ లీగ్ దశలో పాక్‌ను మట్టికరిపించిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా ఆసియా కప్ మధ్యలోనుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో స్టాండ్‌బైగా ఉన్న పేస్ బౌలర్ దీపక్ చహర్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మెగా టోర్నీలో దారుణంగా విఫలమవుతున్న అవేష్ ఖాన్ పక్కన బెట్టి చహర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మేనేజేమెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు చాహర్ నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. కాబట్టి పాక్‌తో మ్యాచ్‌కు చాహర్ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. చాహర్ పవర్‌ప్లే కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు గాయపడిన చాహర్.. తిరిగి జింబాబ్వే సిరీస్‌తో పునరాగమనం చేశాడు. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన చాహర్ 5 వికెట్లతో అదరగొట్టాడు. View this post on Instagram A post shared by Deepak Chahar (@deepak_chahar9) చదవండి: Asia Cup 2022: పాకిస్తాన్‌తో మ్యాచ్.. ప్రపంచ రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ! -
'దీపక్ చహర్ గాయపడలేదు.. ఆ వార్తలు నమ్మకండి'
టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చహర్ గాయపడినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అవన్నీ పుకార్లని బీసీసీఐ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. గురువారం మధ్యాహ్నం దీపక్ చహర్ గాయంతో ఆసియాకప్‌కు దూరమయ్యాడని.. అతని స్థానంలో కుల్దీప్ సేన్‌ను స్లాండ్ బై ప్లేయర్‌గా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన బీసీసీఐ.. అవన్నీ తప్పుడు వార్తలని.. దీపక్ చహర్ జట్టుతోనే ఉన్నాడని తెలిపింది. ''దీపక్ చహర్ గాయపడినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అదంతా నాన్సెన్స్. దీపక్ చహర్ ఆసియా కప్‌లో ఆడుతున్నాడు. ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న అతను ప్రాక్టీస్ కూడా ఆరంభించాడు. అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక రాజస్తాన్ రాయల్స్ బౌలర్ కుల్దీప్ సేన్‌ను కేవలం నెట్‌బౌలర్‌గానే జట్టులోకి తీసుకున్నాయి. టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే కుల్దీప్ సేన్‌ను నెట్‌బౌలర్‌గా ఎంపిక చేశాము. అతనికి మంచి భవిష్యత్తు ఉంది.. కానీ జట్టులోకి రావడానికి సమయం ఉంది.'' అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. కుల్దీప్ సేన్(PC: IPL Twitter) ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో గాయపడిన దీపక్ చాహార్, ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ సిరీస్‌లకు దూరంగా ఉన్న దీపక్ చాహార్, కమ్‌బ్యాక్ తర్వాత జింబాబ్వేతో రెండు వన్డేలు మాత్రమే ఆడాడు. ఈలోగానే దీపక్ చాహార్ మళ్లీ గాయపడ్డాడనే వార్తలు రావడం అతని ఫ్యాన్స్‌ని కలవరబెట్టింది. అయితే దీపక్ చహర్‌కు ఏం కాలేదని తెలుసుకొని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆసియాకప్‌కు ప్రకటించిన జట్టులో భువనేశ్వర్ కుమార్ సీనియర్ ఫాస్ట్ బౌలర్‌గా ఉన్నాడు. అతనితో పాటు టోర్నీకి ఎంపికైన ఆవేశ్ ఖాన్ జింబాబ్వే టూర్లో అట్టర్ ఫ్లాప్ కాగా... అర్ష్‌దీప్ సింగ్‌కి పట్టుమని ఐదు అంతర్జాతీయ మ్యాచులు ఆడిన అనుభవం కూడా లేదు. దీంతో దీపక్ చహర్ స్టాండ్-బైగా ఉన్నప్పటికి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అతను బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆసియా కప్ 2022 కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ స్టాండ్ బై - శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్ నెట్ బౌలర్- కుల్దీప్ సేన్ చదవండి: ఆరోజు కోహ్లి రెండున్నర గంటల పాటు బ్యాటింగ్ చేశాడు.. నేను షాకయ్యా! కన్నీళ్లు తెప్పించిన సజీవదహనం ఫోటోలు.. '31 మిలియన్ డాలర్లు చెల్లించండి' -
ASIA CUP 2022: జింబాబ్వే సిరీస్‌లో అదరగొట్టాడు.. ప్రమోషన్ కొట్టేశాడు!
టీమిండియా యువ పేసర్ దీపక్ చాహర్‌ను ఆసియాకప్‌కు స్టాండ్‌బైగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే స్టాండ్‌బైగా ఉన్న చాహర్‌ను ప్రధాన జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై భారత సెలక్టర్లు రానున్న 24 గంటల్లో ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా గాయం కారణంగా కొంతకాలం జట్టుకు దూరమైన చాహర్.. తిరిగి జింబాబ్వే సిరీస్‌తో అద్భుతమైన పునరాగమనం చేశాడు.ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన చహర్ 5 వికెట్లతో అదరగొట్టాడు. ఇక ఆసియాకప్ కోసం భారత జట్టు ఇప్పటికే యూఏఈకు చేరుకుంది. ఇక ఇదే విషయంపై టీమిండియా మాజీ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ స్పందిస్తూ.."చాహర్ ఆసియాకప్ ప్రధాన జట్టలోకి చేరడం ఖాయం. అతడు కొంత కాలం ఆటకు దూరమైన తన రిథమ్‌ను ఏ మాత్రం కోల్పోలేదు. చాహర్ పవర్ ప్లేలో ఒకట్రెండు వికెట్లు పడగొట్టి జట్టుకు అద్భుతమైన శుభారంభం అందించగలడు. కాబట్టి టీ20 ఫార్మా్ట్కు జట్టును ఎంపిక చేసే ముందు అతడిని ప్రాధాన ఎంపికగా భావించాలి. అయితే ప్రస్తుతం భారత జట్టులో చాలా మంది బౌలర్లు ఉన్నారు. కానీ వారిలో కొత్త బంతితో వికెట్లు తేసే సత్తా ఎవరుకి ఉందో వారికే అవకాశం ఇవ్వాలి. జట్టుకు బుమ్రా, షమీ వంటి ఆటాకింగ్ బౌలర్లు అందుబాటులో లేకపోతే చాహర్ వాళ్ల స్థానాన్ని భర్తీ చేయగలడు" అని పేర్కొన్నాడు. ఇక ఆసియాకప్-2022 ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా జరగనుంది. టీమిండియా విషయానికి వస్తే.. తొలి మ్యాచ్‌లో ఆగస్టు 28న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఆసియాకప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ స్టాండ్‌బై ఆటగాళ్లు: శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్ చదవండి: IND Vs PAK: ఇటు బుమ్రా.. అటు షాహిన్; లోటును భర్తీ చేసేది ఎవరు? -
ఏంటి చాహర్ ఇది..? అశ్విన్‌ను చూసి నేర్చుకున్నావా! వీడియో వైరల్
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభంకు ముందు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. అతిథ్య జట్టుకు 290 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం 290 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు జింబాబ్వే ఓపెనర్లు ఇన్నోసెంట్ కైయా, కైటినో బరిలోకి దిగారు. అయితే భారత పేసర్ దీపక్ చాహర్ తొలి ఓవర్ వేసే క్రమంలో నాన్ స్ట్రైక్‌లో ఉన్న కైయాను మన్కడింగ్(రనౌట్) చేసే ప్రయత్నం చేశాడు. కాగా చాహర్ బెయిల్స్ పడగొట్టే సమయానికి.. కైయా క్రీజు నుంచి దూరంగా ఉన్నాడు. అయితే చాహర్ బెయిల్స్ పడగొట్టినప్పటికీ రనౌట్‌కు మాత్రం అప్పీల్ చేయలేదు. ఒక వేళ చాహర్ అప్పీల్ చేసి వుంటే మాత్రం కచ్చితంగా రనౌట్‌గానే అంపైర్ ప్రకటించే వాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. చహర్‌ను టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పోలుస్తున్నారు. ఇక ఇదే విషయంపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. "ఏంటి చాహర్ ఇది.. అశ్విన్‌ను చూసి నేర్చుకున్నావా..?" అంటూ కామెంట్ చేశాడు. కాగా 2012లో శ్రీలంకపై, 2019 ఐపీఎల్ సీజన్లో జోస్ బట్లర్‌ను ఈ విధంగానే అశ్విన్ ఔట్ చేశాడు. అయితే బట్లర్‌ను మన్కడింగ్ చేసిన అశ్విన్ అప్పట్లో తీవ్ర విమర్శల పాలయ్యాడు. కాగా భారత క్రికెట్ దిగ్గజం వినూ మన్కడ్ పేరు మీద ఉన్న ‘మన్కడింగ్’ ఔట్ ను సాధారణ రనౌట్ గా చేస్తూ ఈ ఏడాది మార్చిలో మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిర్ణయం తీసుకుంది. Deepak Chahar didn't Appeal on Mankad 😂 pic.twitter.com/4ihfnljbMl — Keshav Bhardwaj 👀 (@keshxv1999) August 22, 2022 Shades of Ashwin in Deepak Chahar. Kaia was almost Mankad had he appealed. — Gagan Thakur (@gagan_gt) August 22, 2022 చదవండి: Ind Vs Pak- Virat Kohli: పాక్‌తో మ్యాచ్‌లో ఫిఫ్టీ కొడితే ఆ నోళ్లన్నీ మూతపడతాయి! -
అతడిని ముట్టుకున్నా.. జింబాబ్వే యువతి సంతోషం! ఫిదా చేసిన భారత క్రికెటర్!
India Vs Zimbabwe 1st ODI- Deepak Chahar: తమకు ఇష్టమైన క్రికెటర్‌ను నేరుగా చూస్తేనే చాలు జన్మ ధన్యమైపోయిందనుకునే వీరాభిమానులు చాలా మందే ఉంటారు. మరి ఏకంగా ఆ ఆటగాడు తమ దగ్గరికి రావడం.. భుజం మీద చేయి వేసుకుని మరీ ఫొటో దిగే ఛాన్స్ ఇస్తే! ఎగిరి గంతేయడం ఖాయం! జింబాబ్వే యువతులు ముగ్గురు ప్రస్తుతం ఇలాంటి ఆనందంలో మునిగిపోయారు. ఇటు అద్భుతమైన బంతులతో మైదానంలో బ్యాటర్లను.. అటు హుందాతనంతో అభిమానులను బౌల్డ్ చేసిన ఆ ఆటగాడు దీపక్ చహర్. కాగా గాయం కారణంగా ఆర్నెళ్ల పాటు జట్టుకు దూరమైన చహర్.. జింబాబ్వేతో వన్డే సిరీస్‌తో తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. అద్భుతమైన బౌలింగ్‌తో! ఈ క్రమంలో హరారే వేదికగా గురువారం(ఆగష్టు 18) నాటి మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. అలా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు చహర్. ఈ నేపథ్యంలో ఈ టీమిండియా స్టార్‌తో ఫొటోలు దిగాలని కొంతమంది యువతులు భావించారు. PC: BCCI ఇందుకు నవ్వుతూ అంగీకరించిన దీపక్ చహర్.. తన భుజంపై చేయి వేసి ఫొటో దిగాలనుకున్న వారి అభ్యర్థనను కాదనలేకపోయాడు. దీంతో వాళ్లు సంతోషంగా ఈ పేసర్‌తో ఫొటోలు దిగి ఆనందడోలికల్లో తేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను జర్నలిస్టు విమల్ కుమార్ తన యూట్యూబ్ చానెల్లో షేర్ చేయగా వైరల్ అవుతోంది. తనను తాకే అవకాశం ఇచ్చాడు! ఇక ఈ విషయం గురించి చహర్‌తో ఫొటో దిగిన ఓ మహిళాభిమాని మాట్లాడుతూ.. ‘‘చహర్ ఎంతో అణకువ గల వ్యక్తి. తనతో ఇలా ఫొటో దిగడం చాలా చాలా సంతోషంగా ఉంది. తనను తాకే అవకాశం నాకు ఇవ్వడమంటే మామూలు విషయం కాదు(నవ్వులు).. ఎందుకంటే చాలా మంది ఇతరులు తమను తాకడానికి ఏమాత్రం ఇష్టపడరు. అయితే, అతడు మాత్రం మమ్మల్ని నిరాశకు గురిచేయకుండా హుందాగా వ్యవహరించాడు’’ అని చెప్పుకొచ్చింది. ఇక అభిమానులతో మమేకం కావడంపై దీపక్ చహర్ స్పందిస్తూ.. ‘‘నాకు ఆనందంగా ఉంది. మాతృ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడటం అనే చిన్ననాటి కల నెరవేరింది. మరి ఫ్యాన్స్‌తో ఇలా కలిసిపోవడం కూడా కూడా గొప్పగానే ఉంటుంది కదా!’’ అని పేర్కొన్నాడు. చదవండి: Deepak Chahar: చాలా కాలం దూరమైతే అంతే! ప్రపంచకప్ జట్టుకు ఎంపికవడం నా చేతుల్లో లేదు! Rohit Sharma: రోహిత్ శర్మ నిర్లక్ష్యపు షాట్లు ఆడేవాడు.. అందుకే అలా: దినేశ్ కార్తిక్ -
T20 WC 2022: జట్టుకు ఎంపికవడం నా చేతుల్లో లేదు! ఒక్కసారి దూరమైతే అంతే!
Ind Vs Zim 1st ODI- Deepak Chahar- T20 World Cup 2022: ‘‘మనం చాలా కాలం పాటు జట్టుకు దూరమైతే.. ఇతరులు మన స్థానాన్ని భర్తీ చేస్తారు. ఒకవేళ వాళ్లు మెరుగ్గా రాణించినట్లయితే జట్టులో స్థానం సుస్థిరమవుతుంది. ఒకవేళ మనం మళ్లీ టీమ్‌లోకి తిరిగి రావాలంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మెరుగైన ప్రదర్శన కనబరచాల్సి ఉంటుంది. కాబట్టి చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చినపుడు కచ్చితంగా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాపై కూడా చాలా అంచనాలే ఉన్నాయి. వాటిని ఎలా అందుకోవాలన్న అంశం మాత్రమే నా చేతుల్లో ఉంటుంది. మిగతా విషయాల్లో నేనేమీ చేయలేను’’ అని టీమిండియా పేసర్ దీపక్ చహర్ అన్నాడు. deepak chahar(PC: BCCI) అదిరిపోయే రీఎంట్రీ! గాయాల కారణంగా దీపక్ చహర్ దాదాపు ఆర్నెళ్ల పాటు జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫిట్నెస్ సాధించిన అతడు జింబాబ్వే టూర్‌కు ఎంపికయ్యాడు. ఇందులో భాగంగా హరారే వేదికగా గురువారం(ఆగష్టు 18) జరిగిన మొదటి వన్డేలో ఆడిన చహర్.. 7 ఓవర్ల బౌలింగ్‌లో 27 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఆతిథ్య జింబాబ్వేను 189 పరుగులకే కట్టడి చేసి.. ఆపై టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు చహర్. ఇదిలా ఉంటే.. సుదీర్ఘ కాలంగా జట్టుకు దూరమైన చహర్‌కు ఆసియా కప్-2022కు ప్రకటించిన ప్రధాన జట్టులో చోటు దక్కలేదు. 30 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌ను స్టాండ్‌బైగా ఎంపిక చేశారు సెలక్టర్లు. deepak chahar(PC: BCCI) వాళ్లకు అవకాశాలు అదే సమయంలో జట్టులోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లు మాత్రం ప్రధాన జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో చహర్ మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు. జట్టుకు దూరమైన కారణంగా మ్యాచ్‌లు ఆడే అవకాశం రాకపోవడం వల్లే తాను సెలక్ట్ కాలేకపోయానని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపిక నా చేతుల్లో లేదు కదా! ఇక ఆగష్టు 27 నుంచి ఆరంభం కానున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ముగిసిన తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లు ఆడనుంది టీమిండియా. ఆ తర్వాత ఐసీసీ ఈవెంట్ టీ20 వరల్డ్‌కప్-2022 బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో జట్టులో స్థానం కోసం పోటీపడటం మాత్రమే తన చేతుల్లో ఉందని.. అంతేతప్ప జట్టుకు ఎంపికవుతానా లేదా అన్నది తన ఆధీనంలో ఉన్న విషయం కాదని చెప్పుకొచ్చాడు చహర్. అదే విధంగా... జింబాబ్వేతో తొలి వన్డేలో తాను విజయవంతం కావడంపై స్పందిస్తూ.. ఏడు ఓవర్ల పాటు బౌలింగ్ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఫిట్నెస్ సాధించడానికి.. ఆటను మెరుగుపరచుకోవడానికి కఠిన శ్రమకోర్చానని.. దాని ఫలితం ఇప్పుడు చూస్తున్నానంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఇప్పుడు తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని తెలిపాడు చహర్. ఇక టీమిండియా- జింబాబ్వే మధ్య హరారే వేదికగా శనివారం(ఆగష్టు 20) రెండో వన్డే జరుగనుంది. చదవండి: Babar Azam: భారత్‌పై గెలుపొక్కటే కాదు.. ఆసియా కప్ కొట్టాలని కంకణం! KL Rahul: ఒక్క విజయంతో దిగ్గజాల సరసన చోటు.. A brilliant comeback for @deepak_chahar9 as he is adjudged Player of the Match for his bowling figures of 3/27 👏👏#TeamIndia go 1-0 up in the three-match ODI series.#ZIMvIND pic.twitter.com/HowMse2blr — BCCI (@BCCI) August 18, 2022 -
India vs Zimbabwe 1st ODI: శుభారంభం ఓపెనర్లతోనే...
వరుస పర్యటనలో, వరుస సిరీస్ వేటలో భారత్ శుభారంభం చేసింది. చాలా కాలం తర్వాత పునరాగమనం చేసిన దీపక్ చహర్ (3/27) బౌలింగ్‌లో జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్‌ను బెంబేలెత్తిస్తే... విజయవంతమైన గిల్–ధావన్ ఓపెనింగ్ జోడి మరొకరికి చాన్స్ ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించింది. హరారే: ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ అజేయ అర్ధసెంచరీల కంటే కూడా దీపక్ చహర్ స్పెల్ (7–0–27–3) ఈ మ్యాచ్‌లో హైలైట్. ఆరు నెలల తర్వాత బరిలోకి దిగిన చహర్ పిచ్ పరిస్థితుల్ని అనుకూలంగా మలచుకొని వైవిధ్యమైన బంతులతో టాపార్డర్‌లో ఏ ఒక్కరిని పట్టుమని 10 పరుగులైనా చేయనివ్వలేదు. ఛేదన సులువయ్యేందుకు అతని స్పెల్ కారణమైంది. ఇదే పిచ్‌పై రెండు వారాల క్రితం వరుస మ్యాచ్‌ల్లో 290, 303 పరుగులు నమోదయ్యాయి. సులువుగా ఛేదించడం కూడా జరిగింది. అలాంటి పిచ్‌పై చహర్ బౌలింగ్ అసాధారణమనే చెప్పాలి. దీంతో గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ రెగిస్ చకాబ్వా (51 బంతుల్లో 35; 4 ఫోర్లు), రిచర్డ్ ఎన్గరవా (42 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), ఇవాన్స్ (29 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మన బౌలింగ్‌కు కాస్త ఎదురు నిలిచారు. స్పిన్నర్ అక్షర్ పటేల్, సీమర్లు దీపక్ చహర్, ప్రసిధ్ కృష్ణ తలా 3 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 30.5 ఓవర్లలో అసలు వికెట్టే కోల్పోకుండా 192 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్ (72 బంతుల్లో 82 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్), ధావన్ (113 బంతుల్లో 81 నాటౌట్; 9 ఫోర్లు) ఇద్దరే లక్ష్యాన్ని ఛేదించేశారు. చహర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభించింది. రేపు ఇదే వేదికపై రెండో వన్డే జరుగుతుంది. చహర్ దెబ్బకు ‘టాప్’టపా వికెట్లు కొత్త బంతితో దీపక్ చహర్ చెలరేగాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఇన్నోసెంట్ కైయా (4)ను కీపర్ క్యాచ్‌తో పంపాడు. తన మరుసటి ఓవర్ తొలి బంతికి మరుమని (8)ని కూడా కీపర్ క్యాచ్‌తోనే పెవిలియన్ చేర్చాడు. వెస్లీ మదెవెర్ (5)ను ఎల్బీగా ఔట్ చేశాడు. అంతకుముందు ఓవర్లో సిరాజ్... సియాన్ విలియమ్స్ (1) వికెట్ తీశాడు. జింబాబ్వే 31 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది. మిడిలార్డర్ సంగతి ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ చూసుకోవడంతో ఒక దశలో జింబాబ్వే 110/8 స్కోరుతో ఆలౌట్‌కు దగ్గరైంది. బ్రాడ్ ఇవాన్స్, రిచర్డ్ తొమ్మిదో వికెట్‌కు 70 పరుగులు జోడించడంతో ఆమాత్రం స్కోరు చేయగలిగింది. ఇద్దరే పూర్తి చేశారు టాపార్డర్‌లో ఓపెనింగ్‌ను ఇష్టపడే కెప్టెన్ రాహుల్ తను కాదని విజయవంతమైన ధావన్–గిల్ జోడితోనే ఓపెన్ చేయించాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా శిఖర్–శుబ్‌మన్ జోడీ ఈ రెండు నెలల్లో మూడో శతక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. విండీస్ గడ్డపై కనబరిచిన జోరునే జింబాబ్వేపై కూడా కొనసాగించారు. మైదానంలో బౌండరీలు, భారత్‌కు పరుగులు వస్తున్నాయి కానీ పాపం ఆతిథ్య బౌలర్లకే వికెట్ గగనమైంది. ఏకంగా ఎనిమిది మంది బౌలర్లతో వేయించిన ప్రయత్నం కూడా ఫలితాన్నివ్వలేదు. ముందుగా ధావన్ (76 బంతుల్లో 5ఫోర్లతో) ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... జట్టు స్కోరు 20వ ఓవర్లో 100 పరుగులు దాటింది. శుబ్‌మన్ కూడా (51 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో భారత్ లక్ష్యాన్ని చేరేందుకు 30.5 ఓవర్లే సరిపోయాయి. దాదాపు 20 ఓవర్ల ముందే ఇద్దరే బ్యాటర్లు జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు జింబాబ్వే ఇన్నింగ్స్: కైయా (సి) సామ్సన్ (బి) చహర్ 4; మరుమని (సి) సామ్సన్ (బి) చహర్ 8; వెస్లీ (ఎల్బీ) (బి) చహర్ 5; సియాన్ విలియమ్స్ (సి) ధావన్ (బి) సిరాజ్ 1; సికందర్ రజా (సి) ధావన్ (బి) ప్రసిధ్ 12; చకాబ్వా (బి) అక్షర్ 35; రియాన్ బర్ల్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 11; ల్యూక్ జాంగ్వే (ఎల్బీ) (బి) అక్షర్ 13; ఇవాన్స్ నాటౌట్ 33; రిచర్డ్ (బి) ప్రసిధ్ 34; విక్టర్ (సి) గిల్ (బి) అక్షర్ 8; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (40.3 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–25, 2–26, 3–31, 4–31, 5–66, 6–83, 7–107, 8–110, 9–180, 10–189. బౌలింగ్: దీపక్ చహర్ 7–0–27–3, సిరాజ్ 8–2–36–1, కుల్దీప్ 10–1–36–0, ప్రసిధ్ 8–0–50–3, అక్షర్ 7.3–2–24–3. భారత్ ఇన్నింగ్స్: ధావన్ నాటౌట్ 81; శుబ్‌మన్ గిల్ నాటౌట్ 82; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (30.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 192. బౌలింగ్: రిచర్డ్ ఎన్గరవా 7–0–40–0, విక్టర్ 4–0–17–0, ఇవాన్స్ 3.5–0–28–0, సియాన్ 5–0–28–0, సికందర్ రజా 6–0–32–0, ల్యూక్ జాంగ్వే 2–0–11–0, వెస్లీ 2–0–16–0, రియాన్ బర్ల్ 1–0–12–0. -
ఆరు నెలల తర్వాత రీ ఎంట్రీ.. బ్యాటర్లకు చుక్కలు చూపించిన చాహర్!
ఆరు నెలల తర్వాత జట్టులోకి వచ్చిన భారత పేసర్ దీపక్ చాహర్ అదరగొట్టాడు. హరారే వేదికగా జింబాబ్వే జరుగుతోన్న తొలి వన్డేలో చాహర్ నిప్పులు చేరిగాడు. ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన చహర్ మూడు కీలక వికెట్లు పడగొట్టి 27 పరుగులు ఇచ్చాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేను ఆదిలోనే ఓపెనర్లు కియా, మారుమణి పెవిలియన్‌కు పంపి చాహర్ కోలుకోలేని దెబ్బకొట్టాడు. అనంతరం వన్‌డౌన్ బ్యాటర్ మాధేవేరేను కూడా ఔట్ చేసి చాహర్ మూడో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా చాహర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో గాయపడ్డాడు. దీంతో అతడు ఐపీఎల్‌తో పాటు పలు సిరీస్‌లకు కూడా దూరమయ్యాడు. అనంతరం గాయం నుంచి కోలుకున్న చాహర్ జింబాబ్వే సిరీస్‌తో పునరాగామనం చేశాడు. అదే విధంగా ఆసియా కప్-2022కు స్టాండ్‌బైగా చహర్ ఎంపికయ్యాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారత బౌలర్లు చేలరేగడంతో 189 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో చహర్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఒక్క వికెట్ తీశాడు. ఇక జింబాబ్వే ఇన్నింగ్స్‌లో టెయిలండర్లు రిచర్డ్ నగరవా(34), బ్రాడ్ ఎవన్స్(33) అద్భుతమైన ఆటతీరుతో అకట్టుకున్నారు. Deepak Chahar announced his comeback with a scintillating performance 💛🥳 7 Overs | 27 Runs | 3 Wickets#ZIMvIND #WhistlePodu @deepak_chahar9 📷 Getty Images pic.twitter.com/nEVR0IWRnY — WhistlePodu Army ® - CSK Fan Club (@CSKFansOfficial) August 18, 2022 చదవండి: ZIM vs IND: టీమిండియాపై జింబాబ్వే టెయిలండర్ల కొత్త చరిత్ర ! -
టీమిండియాపై జింబాబ్వే టెయిలండర్ల కొత్త చరిత్ర!
హరారే వేదికగా జరుగుతోన్న తొలి వన్డేలో జింబాబ్వే బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 44. 3 ఓవర్లలో 189 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లలో దీపక్ చహర్, ప్రసిధ్ కృష్ణ అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్ ఒక్క వికెట్ సాధించాడు. కాగా ఒక దశలో జింబాబ్వే స్కోర్ 150 పరుగుల మార్క్‌ను దాటడం కష్టమనుకున్న సమయంలో టెయిలండర్లు రిచర్డ్ నగరవా(34), బ్రాడ్ ఎవన్స్(33) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 70 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా టీమిండియాపై వీరిద్దరూ సరికొత్త రికార్డును నమోదు చేశారు. వన్డేల్లో భారత్‌పై తొమ్మిదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జింబాబ్వే జోడిగా నిలిచారు. #1stODI | INNINGS BREAK: 🇿🇼 bowled out for 189 in 40.3 overs Richard Ngarava and Brad Evans put on 70-run together, the highest ninth-wicket partnership for 🇿🇼 against India#ZIMvIND | #KajariaODISeries | #VisitZimbabwe pic.twitter.com/H9bQa4giSa — Zimbabwe Cricket (@ZimCricketv) August 18, 2022 చదవండి: IND vs ZIM ODI Series: సిరాజ్ గొప్ప బౌలర్.. అతడి బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు సాధిస్తే: జింబాబ్వే బ్యాటర్ -
IND VS ZIM: జింబాబ్వేకు బీసీసీఐ ఇస్తున్న ‘ఆర్థిక బహుమతి’... మరో సిరీస్ వేటలో టీమిండియా!
India Tour Of Zimbabwe- హరారే: ఈ మధ్య విదేశానికెళ్లిన చోటల్లా విభిన్న కెప్టెన్లతో బరిలోకి దిగుతున్న టీమిండియా ఫలితాల్లో మాత్రం నిలకడగా సిరీస్ విజయాలను సాధిస్తోంది. ఇప్పుడు కూడా మరో ప్రయత్నం మరో సారథితో చేస్తోంది. జింబాబ్వే పర్యటనలో కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత్ నేడు తొలి వన్డే ఆడనుంది. ఈ పర్యటన జింబాబ్వేకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇస్తున్న ‘ఆర్థిక బహుమతి’. కేవలం ఈ మూడు వన్డేల సిరీస్‌తో వచ్చే రాబడితోనే జింబాబ్వే బోర్డు సగం ఏడాదికి సరిపడా ఖర్చుల్ని వెళ్లదీసుకుంటుందంట! ఈ నేపథ్యంలో ఇక్కడ సిరీస్ ఆసక్తికరమనే కంటే కూడా... ఆతిథ్య బోర్డుకు ఆర్థిక పుష్టికరమని చెప్పాలి. అందరి కళ్లు రాహుల్, చహర్లపైనే... ఇక సిరీస్ విషయానికొస్తే జట్టు కంటే కూడా... కొత్త కెప్టెన్ రాహుల్‌కు అగ్ని పరీక్షలాంటిది. ఎందుకంటే టీమిండియా ఇటీవల ఏ దేశమేగినా... ఎందుకాలిడినా గెలుస్తూనే వస్తోంది. ఎటొచ్చి ‘స్పోర్ట్స్ హెర్నియా’ సర్జరీతో రెండు నెలలుగా ఆటకు దూరమైన రాహుల్ ఫిట్‌నెస్‌కే ఇది టెస్ట్! ఇక్కడ ఈ టాపార్డర్ బ్యాటర్ త్రిపాత్రాభినయం చేయాల్సి వస్తుంది. 100 ఓవర్ల పాటు మైదానంలో ఫిట్నెస్ నిరూపించుకోవాలి. సారథిగా జట్టును నడిపించాలి. టాపార్డర్‌లో బ్యాట్‌తో సత్తా చాటాలి. అలాగే మరో ఆటగాడు కూడా సవాలుకు సిద్ధమయ్యాడు. గాయంతో ఫిబ్రవరి నుంచి అసలు మైదానంలోకే దిగని దీపక్ చహర్ సుమారు ఆరు నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌ల కోసం అతన్ని పరిశీలించాలంటే అందుబాటులో ఉన్న ఈ కొద్ది మ్యాచ్‌ల్లోనే ఆల్‌రౌండర్‌గా నిరూపించుకోవాలి. ధావన్, గిల్, సామ్సన్ అంతా ఫామ్‌లోనే ఉన్నారు. బౌలింగ్‌లోనూ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్లతో భారత జట్టే బలంగా ఉంది. ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ తన వన్డే కెరీర్‌ను... అక్షర్ పటేల్, సంజూ సామ్సన్ తమ టి20 కెరీర్‌ను జింబాబ్వేలోనే ప్రారంభించారు. జోరు మీదుంది కానీ... ఈ నెలలోనే తమ దేశానికి వచ్చిన బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన జింబాబ్వే జోరుమీదుంది కానీ... భారత్‌లాంటి అసాధారణ ప్రత్యర్థితో ఎలా ఆడుతుందనేదే అసక్తికరం. ఏ రకంగా చూసినా కూడా టీమిండియాకు దీటైన ప్రత్యర్థి కాదు. కానీ సొంతగడ్డపై ఉన్న అనుకూలతలతో, ఇటీవలి విజయాలిచ్చిన ఆత్మవిశ్వాసంతో గట్టి పోటీ ఇచ్చేందుకు జింబాబ్వే తహతహలాడుతోంది. కెప్టెన్, వికెట్ కీపర్ రెగిస్ చకాబ్వా, సికందర్ రజా, ఇన్నోసెంట్ కయా చక్కని ఫామ్‌లో ఉన్నారు. అయితే బౌలింగ్ మాత్రం పేలవమనే చెప్పాలి. టీమిండియాలాంటి టాప్ ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే బౌలింగ్ విభాగం కూడా మెరగవ్వాలి. చదవండి: Vinod Kambli: ఏదైనా పని ఉంటే ఇప్పించండి.. చాలీచాలని జీతంతో బ్రతుకీడుస్తున్నా..! WI VS NZ 1st ODI: రెచ్చిపోయిన బౌలర్లు.. బోణీ కొట్టిన విండీస్ IRE VS AFG 5th T20: ఆఫ్ఘనిస్తాన్‌కు షాకిచ్చిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం -
Ind Vs Zim: జింబాబ్వేకు పయనమైన టీమిండియా ఆటగాళ్లు..
Ind Vs Zim ODI Series: వరుస సిరీస్‌లతో బిజీ బిజీగా గడుపుతున్న భారత క్రికెట్ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. ఈనెల 18 నుంచి జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు శనివారం జింబాబ్వేకు పయనమయ్యారు. శిఖర్ ధావన్, దీపక్ చహర్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్ తదితరులు విమానంలో బయల్దేరారు. వీరితో పాటు కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం పయనమయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌లో టీమిండియాను విజేతగా నిలిపిన శిఖర్ ధావన్‌ను తొలుతు జింబాబ్వే టూర్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే, గాయం కారణంగా జట్టుకు దూరమైన పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కోలుకోవడంతో.. గబ్బర్ను తప్పించి అతడికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పారు. ఇక ఈ పర్యటనలో హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు బదులు వీవీఎస్ లక్ష్మణ్ భారత జట్టుకు మార్గరదర్శనం చేయనున్నాడు. జింబాబ్వే సిరీస్‌కు, ఆగష్టు 27 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్-2022 టోర్నీకి మధ్య తక్కువ వ్యవధి ఉండటమే ఇందుకు కారణం. ఇక హరారే వేదికగా టీమిండియా- జింబాబ్వే జట్ల మధ్య ఆగష్టు 18న మొదటి వన్డే, ఆగష్టు 20న రెండో వన్డే, ఆగష్టు 22న మూడో వన్డే జరుగనున్నాయి. కాగా ఇటీవల స్వదేశంలో జింబాబ్వే మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. తమ దేశంలో పర్యటించిన బంగ్లాదేశ్‌కు షాకిస్తూ టీ20, వన్డే సిరీస్‌లను 2-1తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు సైతం గట్టి పోటీనిస్తామంటూ జింబాబ్వే కోచ్ డేవిడ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చదవండి: IND vs ZIM: జింబాబ్వేతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. జట్టు ఇదే -
వైస్ కెప్టెన్ వచ్చేస్తున్నాడు.. మరి కోహ్లి సంగతి!
ఆసియా కప్ 2022కు సంబంధించి టీమిండియా జట్టును ఆగస్టు 8(సోమవారం) ప్రకటించనున్నారు. ఉపఖండంలో జరిగే ఈ మెగాటోర్నీని టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రానున్న టి20 ప్రపంచకప్‌కు ఇది సన్నాహకంగా మారుతుందని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్‌కు బెస్ట్ టీమ్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తుంది. కాగా ఇటీవలే గాయాలు.. ఫిట్నెస్ లేమి.. కరోనా కారణంగా జట్టుకు దూరమయిన టీమిండియా వైట్‌బాల్ వైస్‌కెప్టెన్ కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. కేఎల్ రాహుల్‌తో పాటు పేసర్ దీపక్ చహర్ కూడా ఆసియాకప్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్ ఓపెనర్ అయిన కేఎల్ రాహుల్ దూరం కావడంతో రోహిత్ శర్మతో కలిసి పంత్, సూర్యకుమార్ యాదవ్‌లు ఆరు మ్యాచ్‌ల్లో ఓపెనింగ్ ఆటగాళ్లుగా బరిలోకి దిగారు. సూర్యకుమార్ ఓపెనర్‌గా సక్సెస్ అయినప్పటికి.. కేఎల్ రాహుల్ వస్తే.. సూర్య మళ్లీ తన పాత స్థానానికే వెళ్లనున్నాడు. ఆసియా కప్‌తోనే కేఎల్ రాహుల్ టీమిండియా జట్టులోకి రానున్నాడని బీసీసీఐ సంకేతాలు ఇచ్చింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు దుబాయ్, షార్జా వేదికల్లో టి20 ఫార్మాట్లో ఆసియా కప్ 2022 జరగనుంది. ''కేఎల్ రాహుల్ కొత్తగా నిరూపించుకోవడానికి ఏం లేదు. అతను ఇప్పటికే క్లాస్ ప్లేయర్. ఒక టి20 మ్యాచ్ ఆడుతున్నాడంటే కచ్చితంగా స్పెషలిస్ట్ ఓపెనర్‌గానే బరిలోకి దిగుతాడు. పంత్, సూర్యకుమార్‌లు ఎప్పటిలాగే మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తారు. ఇందులో ఎలాంటి మార్పులు ఉండవు.'' అంటూ బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కోహ్లి సంగతేంటి..? టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఆసియా కప్‌కు అందుబాటులో ఉండనున్నట్లు ఇప్పటికే సెలెక్టర్లకు హింట్ ఇచ్చాడు. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న కోహ్లిని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆసియా కప్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. రానున్న టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని జట్టును ఎంపికచేయనుంది. ఆసియాకప్తోనైనా కోహ్లి ఫామ్‌లోకి వస్తాడని నమ్మితే అతనికి జట్టులో చోటు దక్కుతుంది. ఒకవేళ కోహ్లి జట్టులోకి ఎంపికైతే.. యథాతధంగా మూడో స్థానంలోనే వస్తాడు. కోహ్లిని పక్కనబెడితే.. వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ దిగనున్నాడు. అయితే ఇషాన్ కోహ్లికి బ్యాకప్‌గా ఉంటాడు. ఇక మిడిలార్డర్లో సంజూ శాంసన్‌ను బ్యాకప్‌గా ఉంచనున్నారు. ఇక చేతన్ శర్మ ఆధ్యరంలోని సెలెక్టర్ల కమిటీ ఆసియా కప్‌కు 15 నుంచి 17 మందితో కూడిన ప్రాబబుల్స్‌ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. కేఎల్ రాహుల్‌తో పాటు బౌలర్ దీపక్ చహర్ పేరును కూడా పరిశీలిస్తుంది. టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆసియా కప్‌లో జరగనున్న మ్యాచ్‌లు టీమిండియాకు మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. ఆసియా కప్‌కు టీమిండియా జట్టు అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్. బ్యాకప్ బ్యాటర్లు: దీపక్ హుడా/ఇషాన్ కిషన్/సంజు శాంసన్ బ్యాకప్ పేసర్లు: అర్ష్‌దీప్ సింగ్/అవేష్ ఖాన్/దీపక్ చాహర్/హర్షల్ పటేల్. బ్యాకప్ స్పిన్నర్లు: అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్/రవి బిష్ణోయ్. చదవండి: Hardik Pandya May Vice Captain: రోహిత్ బాటలోనే కేఎల్ రాహుల్.. హార్దిక్‌కు ప్రమోషన్! కోహ్లి విషయంలో వాళ్లదే తుది నిర్ణయం: బీసీసీఐ అధికారి -
ఒబెడ్ మెకాయ్ ఇరగదీశాడు.. కానీ ఆ రికార్డు ఇప్పటికీ దీపక్ చహర్‌దే!
సెయింట్స్ కిట్స్ వేదికగా సోమవారం భారత్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ పేసర్ ఒబెడ్ మెకాయ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మెకాయ్ తన టీ20 కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 17 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్ కోటాలో ఒక మెయిడెన్ ఓవర్ కూడా ఉండడం గమనార్హం. ఈ క్రమంలో మెకాయ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 6 వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ ఘనతను నాలుగురు బౌలర్లు అందుకున్నారు. అజంతా మెండిస్ రెండు సార్లు ఆరు వికెట్ల ఫీట్‌ను నమోదు చేశాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో దీపక్ చహర్(6/7, బంగ్లాదేశ్‌పై), అజంతా మెండిస్(6/8, జింబాబ్వేపై), అజంతా మెండిస్ (6/16, ఆస్ట్రేలియాపై), యజ్వేంద్ర చహల్(6/25, ఇంగ్లండ్‌పై ), ఆస్టన్ ఆగర్(6/30, న్యూజిలాండ్‌పై) ఉన్నారు. అయితే అత్యంత తక్కువ పరుగులు ఇచ్చి ఆరు వికెట్లను పడగొట్టిన రికార్డు మాత్రం భారత పేసర్ దీపక్ చహర్ పేరిట ఉంది. చహర్ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేదు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో చాహర్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక జింబాబ్వేపై 8 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టిన శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ రెండో స్థానంలో ఉన్నాడు. చదవండి: Asia Cup 2022 Schedule: భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..? -
Zimbabwe vs India ODI series: చహర్ పునరాగమనం
ముంబై: జింబాబ్వే గడ్డపై జరిగే 3 వన్డేల సిరీస్ కోసం భారత టీమ్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. ఆగస్టు 18, 20, 22 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. గాయాల కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరమైన దీపక్ చహర్, వాషింగ్టన్ సుందర్ కోలుకొని పునరాగమనం చేయగా, రాహుల్ త్రిపాఠిని తొలిసారి వన్డేలకు ఎంపిక చేశారు. రోహిత్, కోహ్లి, పంత్, షమీ, బుమ్రా, హార్దిక్ ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకోగా... రొటేషన్ పాలసీలో భాగంగా ఇతర కీలక ఆటగాళ్లు శ్రేయస్, సూర్యకుమార్, జడేజా, చహల్, అర్‡్షదీప్‌లను కూడా ఈ టూర్‌కు పంపరాదని సెలక్టర్లు నిర్ణయించారు. కరోనా బారిన పడిన కేఎల్ రాహుల్ కోలుకోకపోవడంతో ఎంపిక చేయలేదు. జట్టు వివరాలు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సామ్సన్, సుందర్, శార్దుల్, అక్షర్, కుల్దీప్, అవేశ్, ప్రసిధ్, సిరాజ్, దీపక్ చహర్. -
రంజీ ట్రోఫీ 2022 ఫైనల్.. దీపక్ చహర్‌కు వింత అనుభవం
రంజీ ట్రోఫీ 2022 భాగంగా మధ్యప్రదేశ్, ముంబై మధ్య జరుగుతున్న ఫైనల్ ఆసక్తికరంగా మారింది. మధ్య ప్రదేశ్ తొలిసారి రంజీ ట్రోపీ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులకు ఆలౌట్ కాగా.. మధ్య ప్రదేశ్ మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో 536 పరుగులకు ఆలౌటైంది. ముగ్గరు మధ్య ప్రదేశ్ ఆటగాళ్లు(రజత్ పాటిదార్, శుభమ్ శర్మ, యష్ ధూబేలు) సెంచరీలతో చెలరేగడంతో మధ్య ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ముంబై వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడం ద్వారా మధ్యప్రదేశ్ తొలిసారి రంజీ చాంపియన్‌గా అవతరించనుంది. ఇంతకముందు 1998-99 రంజీ సీజన్లో మధ్య ప్రదేశ్ రన్నరప్‌గా నిలిచింది. ఇక ఫైనల్ మ్యాచ్‌ను ఆట ఆఖరి రోజున చూసేందుకు వచ్చిన సీఎస్కే స్టార్ దీపక్ చహర్‌కు వింత అనుభవం ఎదురైంది. మ్యాచ్ చూసేందుకు స్టాండ్స్‌లోకి అడుగుపెట్టగానే ప్రేక్షకులు.. సీఎస్కే.. సీఎస్కే అని గట్టిగా అరవడం మొదలుపెట్టారు. చహర్ కూడా చిరునవ్వుతో అక్కడున్న ప్రేక్షకులని కృతజ్ఞతలు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక దీపక్ చహర్ గాయంతో ఈ ఏడాది ఐపీఎల్ 2022 సీజన్‌కు దూరమయ్యాడు. మెగావేలంలో రూ.14 కోట్లకు దీపక్ చహర్‌ను సీఎస్కే కొనుగోలు చేసింది. గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చహర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలోనే ఉంటున్నాడు. Look who's here! pic.twitter.com/AkXyy7mor2 — cricket fan (@cricketfanvideo) June 25, 2022 చదవండి: కోహ్లి చేతిపై 11 పచ్చబొట్ల వెనుక రహస్యం ఏంటంటే.. -
ఇంగ్లండ్‌కు బయల్దేరనున్న సుందర్.. గాయం నుంచి కోలుకోని చాహర్
టీమిండియా కీలక ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ త్వరలో ఇంగ్లండ్‌కు బయల్దేరనున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డ (చేతికి గాయం) సుందర్ ఇటీవలే గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధించడంతో ఇంగ్లండ్ కౌంటీ జట్టు లంకాషైర్ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రిహాబిలిటేషన్‌లో ఉన్న సుందర్.. త్వరలో ప్రారంభంకానున్న కౌంటీ సీజన్లో సత్తా చాటి టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నాడు. కాగా, గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటడం ద్వారా సుందర్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు శ్రీలంకతో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడిన మరో ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ ఇంకా కోలుకోలేదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. సుందర్‌తో పాటు ఎన్సీఏ రిహాబిలిటేషన్‌లో ఉన్న చాహర్.. పూర్తిగా కోలుకోవడానికి మరో ఐదు వారాల సమయం పడుతుందని మీడియాలో కధనాలు వినిపిస్తున్నాయి. దీంతో అతన్ని ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు పరిగణలోకి తీసుకోవడంలేదని ప్రచారం జరుగుతుంది. కాగా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్‌లను గతేడాది ఐపీఎల్ మెగా వేలంలో ఆయా ఫ్రాంఛైజీలు భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: రోహిత్, కోహ్లిలకు బీసీసీఐ వార్నింగ్..! -
Deepak Chahar: ఓ తమ్ముడికి ఇచ్చే సలహా ఇదేనా? మరీ ఇంత నీచంగా!
Tolls On Deepak Chahar Sister Malti Over Honeymoon Advice: టీమిండియా క్రికెటర్ దీపక్ చహర్ సోదరి మాలతి చహర్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఒక అక్కగా ఏం మాట్లాడాలో తెలియదా? పాశ్చాత్య సంస్కృతి ప్రభావం మీ మీద బాగా పడినట్లుంది? అంటూ ట్రోల్ చేస్తున్నారు. దయచేసి ఇంకెప్పుడూ మరీ ఇంత పబ్లిక్‌గా ఇలాంటి కామెంట్లు చేయకండి అంటూ హితవు పలుకుతున్నారు. తమ్ముడు దీపక్, అతడి భార్యను ఉద్దేశించి మాలతి చేసిన ట్వీట్ ఇందుకు కారణమైంది. శుభాకాంక్షల వెల్లువ అసలు విషయం ఏమిటంటే.. భారత పేసర్ దీపక్ చహర్ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన చిరకాల ప్రేయసి జయా భరద్వాజ్‌ను జూన్ 2న ఆగ్రాలో వివాహమాడాడు. ఈ క్రమంలో కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దీపక్ సోదరి మాలతి సైతం తమ్ముడు, మరదల్ని విష్ చేశారు. ఈమె మా ఇంటిపిల్ల.. నవ దంపతులతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్న ఆమె.. ‘‘ఇప్పుడు ఈమె మా ఇంటిపిల్ల అయిపోయింది. మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. మీకు దిష్టి తగలకూడదు’’ అని పేర్కొన్నారు. అసలే ప్రపంచకప్ టోర్నీ సమీపిస్తోందని.. హనీమూన్ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ కామెంట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు మాలతిని విమర్శిస్తున్నారు. మరీ ఇంత ఓవరాక్షన్ అవసరం లేదని, ఒక అక్కగా మీరు మాట్లాడే మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ విరుచుకుపడుతున్నారు. అయినా, దీపక్‌ను వరల్డ్‌కప్ జట్టులోకి తీసుకుంటారని ఫిక్స్ అయిపోయారా? అతడి సేవలు ఇప్పుడు ఏమీ అవసరం లేదు.. భువీ ఉన్నాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ప్రతీ విషయానికి తప్పు అర్థాలు ఆపాదించి, విమర్శించడం అలవాటుగా మారిందంటూ మాలతికి అండగా నిలుస్తున్నారు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో 14 కోట్లకు సీఎస్కే దీపక్ చహర్‌ను కొనుగోలు చేయగా గాయం కారణంగా సీజన్ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కూడా అతడు ఎంపికకాలేదు. Ab ladki hui humari….Wish you guys a very happy married life🧿 @deepak_chahar9 please take care of your back during your honeymoon..we have World Cup ahead 😜#family #brother #marriage #siblings pic.twitter.com/Hm2unculO7 — Malti Chahar🇮🇳 (@ChaharMalti) June 3, 2022 Deepak Chahar and Rahul Chahar were seen dancing during Haldi Ceremony#deepakchahar #haldiceremony #deepakchaharwedding pic.twitter.com/5Jl2KhbdfA — Shriyansh Bhardwaj (@Shriyansh836821) June 1, 2022 View this post on Instagram A post shared by Deepak Chahar (@deepak_chahar9) -
Deepak Chahar Marriage : వైభవంగా క్రికెటర్ దీపక్ చహర్ పెళ్లి (ఫొటోలు)
-
వైభవంగా టీమిండియా క్రికెటర్ పెళ్లి.. ఫోటోలు వైరల్
టీమిండియా క్రికెటర్ దీపక్ చహర్ ఒక ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు.. గర్ల్‌ఫ్రెండ్ జయా భరద్వాజ్‌ను కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మనువాడాడు. ఆగ్రాలోని జైపీ ప్యాలెస్‌లో బుధవారం అర్థరాత్రి దాటిన వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం తమ వెడ్డింగ్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన దీపక్ చహర్.. ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. ''జయా భరద్వాద్.. నిన్ను మొదటిసారి కలిసినప్పుడు నువ్వే నాకు కరెక్ట్ అనే ఫీలింగ్ కలిగింది. ఇప్పటివరకు మన జీవితంలో జరిగిన ప్రతీ మూమెంట్‌ను ఆనందంగా ఎంజాయ్ చేశాం. పెళ్లితో ఒక్కటైన మనం.. ఇకపై కూడా అంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. నిన్ను ఆనందంగా ఉంచుతానని ప్రామిస్ కూడా చేస్తున్నా. నా జీవితంలో బెస్ట్ మూమెంట్ ఇదే. మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి'' అంటూ పేర్కొన్నాడు. కాగా దీపక్ చహర్ అర్థాంగి జయా భరద్వాజ్ ఢిల్లీలోని ఎన్సీఆర్లో కార్పోరేట్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తుంది. కాగా జయా భరద్వాజ్ సోదరుడు బిగ్‌బాస్ ఫేమ్ సిద్ధార్థ్ భరద్వాజ్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం దీపక్ చహర్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీపక్ చహర్- జయా భరద్వాజ్‌ల రిసెప్షన్ వేడుక ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లోని కమల్ మహల్లో నిర్వహించనున్నారు. చదవండి: Deepak Chahar: ప్రేయసిని పెళ్లాడనున్న టీమిండియా పేసర్.. శుభలేఖ వైరల్..! ఈ వేడుకకు సీఎస్కే టాప్ స్టార్స్ సహా కోహ్లి, అనుష్క దంపతులు హాజరుకానున్నారు. రిపోర్ట్స్ ప్రకారం 60 మంది క్రికెటర్లు ఆహ్వానాలు పంపారని.. వారిలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి సహా మరికొంతమంది హాజరుకానున్నారు. ఇక గతేడాది ఐపీఎల్ సీజన్లోనే దీపక్ చహర్ తన ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత స్టాండ్స్‌లో ఉన్న జయా భరద్వాజ్ వద్దకు వచ్చి లవ్ ప్రపోజ్ చేసిన దీపక్ చహర్ ఆమె చేతికి రింగ్‌ను తొడిగాడు. మొదట షాక్ తిన్నప్పటికి జయా భరద్వాజ్ దీపక్ లవ్ప్రపోజ్ను ఎంతో ఇష్టంతో స్వీకరించింది. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లోనే వైరల్ అయింది.ఇక గాయం కారణంగా దీపక్ చహర్ ఐపీఎల్ 2022 సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఐపీఎల్ మెగావేలంలో దీపక్ చహర్‌ను రూ 14 కోట్లకు సీఎస్కే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా గతేడాది సీజన్లో సీఎస్కే విజేతగా నిలవడంతో దీపక్ చహర్ ముఖ్యపాత్ర పోషించాడు. ఈ సీజన్లో మాత్రం అంతగా ఆకట్టుకోని సీఎస్కే 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 10 ఓటమలుతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. చదవండి: Deepak Chahar: వైభవంగా దీపక్ చహర్ పెళ్లి వేడుక.. డ్యాన్స్‌తో దుమ్మురేపిన పెళ్లి కొడుకు View this post on Instagram A post shared by Deepak Chahar (@deepak_chahar9) View this post on Instagram A post shared by Deepak Chahar (@deepak_chahar9) -
వైభవంగా దీపక్ చహర్ పెళ్లి వేడుక.. డ్యాన్స్‌తో దుమ్మురేపిన పెళ్లి కొడుకు
టీమిండియా స్టార్ బౌలర్ దీపక్ చహర్ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తన చిన్ననాటి స్నేహితురాలు.. గర్ల్‌ఫ్రెండ్ జయా భరద్వాజ్‌ను ఇవాళ(జూన్ 1న) అర్థరాత్రి వివాహామాడనున్నాడు. పెళ్లి వేడుక ఆగ్రాలోని జైపీ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, బంధుమిత్రలు మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో మే 31 రాత్రి సంగీత్ ఫంక్షన్లో దీపక్ చహర్ దంపతులిద్దరు డ్యాన్స్‌తో అలరించారు. కాగా పెళ్లి వేడుకకు ముందు బుధవారం ఉదయం నిర్వహించిన హల్దీ వేడుకలో దీపక్ చహర్ డ్యాన్స్ చేయడం హైలైట్‌గా నిలిచింది. హల్దీ వేడుకలో భాగంగా కుటుంబసభ్యులు, మిత్రులు హల్దీ పెట్టేటప్పుడు దీపక్ చహర్ తీన్మార్ స్టెప్పులతో అలరించాడు. కాగా రిసెప్షన్ వేడుకను ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లోని కమల్ మహల్లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సీఎస్కే టాప్ స్టార్స్ సహా కోహ్లి, అనుష్క దంపతులు హాజరుకానున్నారు. రిపోర్ట్స్ ప్రకారం 60 మంది క్రికెటర్లు ఆహ్వానాలు పంపారని.. వారిలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, టీమిండియా స్టార్ విరాట కోహ్లి సహా మరికొంతమంది హాజరుకానున్నారు. ఇక గాయం కారణంగా దీపక్ చహర్ ఐపీఎల్ 2022 సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఐపీఎల్ మెగావేలంలో దీపక్ చహర్‌ను రూ 14 కోట్లకు సీఎస్కే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా గతేడాది సీజన్లో సీఎస్కే విజేతగా నిలవడంతో దీపక్ చహర్ ముఖ్యపాత్ర పోషించాడు. ఈ సీజన్లో మాత్రం అంతగా ఆకట్టుకోని సీఎస్కే 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 10 ఓటమలుతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. చదవండి: Happy Birthday Dinesh Karthik: దినేశ్ కార్తిక్.. ఫెయిల్యూర్ మ్యారేజ్ టూ సక్సెస్ఫుల్ లవ్‌స్టోరీ ఉత్కంఠపోరులో జపాన్‌పై విజయం.. టీమిండియా హాకీ జట్టుకు కాంస్య పతకం Deepak Chahar and Rahul Chahar were seen dancing during Haldi Ceremony#deepakchahar #haldiceremony #deepakchaharwedding pic.twitter.com/5Jl2KhbdfA — Shriyansh Bhardwaj (@Shriyansh836821) June 1, 2022 -
ప్రేయసిని పెళ్లాడనున్న టీమిండియా పేసర్.. శుభలేఖ వైరల్..!
టీమిండియా పేసర్ దీపక్ చాహర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరాకాల ప్రేయసి జయ భరద్వాజ్‌ను చాహర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. జూన్ 1న వీరిద్దరి వివాహం జరగనుంది. ఇక గతేడాది ఐపీఎల్ సీజన్లో సీఎస్కే మ్యాచ్ సందర్భంగా దీపక్ చాహర్ తన ప్రేయసి జయ భరద్వాజ్ కి ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన జయ భరద్వాజ్ ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేస్తోంది. కాగా వీరిద్దరి వివాహనికి సంబంధించిన ఆహ్వన పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో చాహర్‌ను సీఎస్కే రూ.14 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి చాహర్ దూరమయ్యాడు. త్వరలో జరగనున్న దక్షిణాఫ్రికా సిరీస్‌కు చాహర్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. చదవండి: IPL 2022: యార్కర్లతో అదరగొట్టాడు.. చివరి మ్యాచ్‌లోనైనా అవకాశమివ్వండి! View this post on Instagram A post shared by Deepak Chahar (@deepak_chahar9) -
ఒక్క ఆటగాడు గాయపడితే.. సీజన్ మొత్తం మరీ ఇంత చెత్తగా ఆడతారా?
IPL 2022- CSK Failure: డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఐపీఎల్-2022 సీజన్ అస్సలు కలిసిరాలేదు. టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఘోర వైఫల్యంతో విమర్శలు మూటగట్టుకుంది. పద్నాలుగింట కేవలం నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు సాధించి పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. తొలుత రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా నియమించడం.. వరుస పరాజయాలు.. ఆ తర్వాత మళ్లీ ధోనికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం వంటి నిర్ణయాలు ఆ జట్టులోని గందరగోళ పరిస్థితులను కళ్లకు కట్టాయి. ఎన్నో అంచనాలతో కోట్లు పెట్టి కొనుగోలు చేసిన దీపక్ చహర్ గాయం కారణంగా టోర్నీకి దూరం కావడం కూడా ప్రభావం చూపింది. అయితే, ఒకరిద్దరు మినహా మిగతావాళ్లంతా దాదాపుగా అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉన్నా సరే పరాజయాల పరంపర కొనసాగింది. ఇక రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లోనూ ఓటమి పాలై సీజన్‌ను చేదు అనుభవంతో ముగించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా.. ఈ ఎడిషన్‌లో సీఎస్కే ప్రయాణాన్ని, చివరి మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘చెన్నైకి ఇంతకంటే చెత్త సీజన్ మరొకటి లేదు. ఈసారి వాళ్లు పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. ఇది ఎంతమాత్రం ఆమోద్యయోగ్యం కాదు. తమ మార్కును అస్సలు చూపించలేకపోయారు. దీపక్ చహర్ ఒక్కడే గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. కానీ ఒక్క ప్లేయర్ లేనంత మాత్రాన మరీ ఇంత ఘోరంగా విఫలమవడం వారి స్థాయికి తగదు’’ అని యూట్యూబ్ చానెల్ వేదికగా ఘాటు విమర్శలు చేశాడు. ఇక రాజస్తాన్‌తో మ్యాచ్ గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. ‘‘ఈ మ్యాచ్ ముఖ్యంగా సీఎస్కే ఇన్నింగ్స్ చాలా ఆసక్తికరంగా సాగింది. మొదట టీ10, తర్వాత వన్డే.. ఆ తర్వాత టెస్టు క్రికెట్‌ను తలపించింది. మొదటి ఆరు ఓవర్లలో టీ10 మాదిరి.. మొయిన్ అలీ అదరగొట్టాడు. అయితే డెవాన్ కాన్వే అవుటైన తర్వాత 50-50 మ్యాచ్‌ను గుర్తు చేసింది. ఇక జగదీశన్, అంబటి రాయుడు అవుటైన తర్వాత టెస్టు క్రికెట్. ధోని 28 బంతుల్లో 26 పరుగులు చేయడం చూశాం కదా!’’ అంటూ ఆకాశ్ చోప్రా పెదవి విరిచాడు. చదవండి👉🏾Asia Cup and T20 WC: డీకేకు మొండిచేయి.. హార్దిక్, చహల్‌కు చోటు! బ్యాకప్ ప్లేయర్‌గా త్రిపాఠి చదవండి👉🏾Ravichandran Ashwin: 'రాసిపెట్టుకోండి.. రాజస్తాన్ కప్ కొట్టబోతుంది..' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
"దీపక్ భాయ్‌తో నిత్యం టచ్‌లో ఉంటా.. అతడు నాకు చాలా సాయం చేశాడు"
ఐపీఎల్-2022లో సీఎస్కే యువ పేసర్ ముఖేష్ చౌదరి సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ముఖేష్ కీలక పాత్ర పోషించాడు. ఇక సీఎస్కే స్టార్ పేసర్ దీపక్ చహర్ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే చహర్ స్థానాన్ని ముఖేష్ భర్తీ చేశాడు. పవర్‌ప్లేలో ముఖేష్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడు. గతేడాది సీజన్లో సీఎస్కే నెట్ బౌలర్‌గా ముఖేష్ ఉన్నాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ముఖేష్ 11 వికెట్లు పడగొట్టాడు. ఇక తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను ముఖేష్ వెల్లడించాడు."దీపక్ భాయ్ గత కొంతకాలంగా సీస్కేకు ఆడుతున్నాడు. అదే విధంగా సీస్కేకు అద్బుతంగా రాణించాడు. నేను అతడితో నిత్యం టచ్‌లో ఉంటా టచ్‌లో ఉంటాను. అతడు నా బౌలింగ్ మెరుగుపరుచుకునేందుకు చాలా సలహాలు ఇస్తున్నాడు. పరిస్థితుల బట్టి ఎలా బౌలింగ్ చేయాలో అతడు నాకు చెప్పాడు. టోర్నీ తొలి మ్యాచ్‌ల్లో నేను రాణించలేకపోయాను. దీపక్ భాయ్ నాకు ఫోన్ చేసి కొన్ని టిప్స్ చెప్పాడు. నేను సన్‌రైజర్స్‌పై 4 వికెట్లు పడగొట్టినప్పడు.. చాహర్ నాకు ఫోన్ చేసి ప్రశంసించాడు. అదే విధంగా ధోని భాయ్ సూచనలు పాటించమని చెప్పాడు. నిజంగా దీపక్ భాయ్ నాకు చాలా సహాయం చేశాడు. నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను, చాహర్ మాటలు నన్ను చాలా ప్రోత్సహించాయి" అని ముఖేష్ చౌదరి పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్లో ధావన్ అరుదైన ఫీట్.. కోహ్లి రికార్డు బద్దలు..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అదృష్టం అంటే దీపక్ చాహర్‌దే.. ఒక్క మ్యాచ్ ఆడకపోయినా 14 కోట్లు రికవరీ..!
Deepak Chahar: ఐపీఎల్ 2022 మెగా వేలంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే గాయం కారణంగా అతను ఐపీఎల్ సీజన్ మొత్తానికే దూరమై సీఎస్కేకు తీరని శోకాన్ని మిగిల్చాడు. చాహర్‌పై గంపెడాశలు పెట్టుకున్న చెన్నై టీమ్.. అతను సీజన్ మొత్తానికే దూరం అయ్యాడని తెలిసి నైరాశ్యంలో మునిగిపోయింది. వరుస ఓటములతో (5 మ్యాచ్‌ల్లో 4 ఓటములు) సతమతమవుతున్న సీఎస్కేకు దీపక్ చాహర్ లేని లోటు పూడ్చలేనిది. కాగా, ప్రస్తుత సీజన్‌కు సంబంధించి దీపక్ చాహర్ అంత అదృష్టవంతుడు మరొకరు లేరనడం అతిశయోక్తి కాదు. ఈ సీజన్లో అతను ఒక్క మ్యాచ్ ఆడకపోయినా మెగా వేలంలో దక్కించుకున్న 14 కోట్లు సొంతం చేసుకోనున్నాడు. అది ఎలాగంటే.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ గ్రేడ్ సీ ప్లేయర్ల లిస్టులో ఉన్న చాహార్‌కు ఇన్సురెన్స్ పాలసీ కారణంగా వేలంలో దక్కించుకున్న పూర్తి మొత్తం లభించనుంది. బీసీసీఐ స్వయంగా తమ కాంట్రాక్ట్ ప్లేయర్ల ప్రీమియం మొత్తం చెల్లిస్తుంది. దీంతో బీసీసీఐ పుణ్యమా అని దీపక్ చాహార్‌కు ఒక్క మ్యాచ్ ఆడకపోయినా ఇంచుమించు రూ.14 కోట్ల మొత్తం లభించనుంది. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ఐపీఎల్‌కు ముందు వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 సందర్భంగా దీపక్ చాహర్ గాయపడిన విషయం తెలిసిందే. చదవండి: ఔటైన కోపంలో ఇషాన్ కిషన్ ఏం చేశాడంటే.. వీడియో వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
దీపక్ చహర్ ఉదంతం.. ఎస్‌సీఏకు బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్
ఐపీఎల్ 2022 సీజన్‌కు దీపక్ చహర్ పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా చహర్ ఐపీఎల్‌తో పాటు రాబోయే టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీపక్ చహర్ ఉదంతంపై బీసీసీఐ సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే ఎన్సీఏ(నేషనల్ క్రికెట్ అకాడమీ) ఫిజియోలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒక గాయంతో బాధపడుతూ రీహాబిటేషన్‌లో ఉన్న ఆటగాడు కోలుకుంటున్న సమయంలోనే మరో గాయం బారిన పడడమేంటని.. అసలు ఫిజియోలు ఏం చేస్తున్నారని మండిపడింది. ''వినడానికి ఆశ్చర్యంగా ఉంది. గాయపడి రీహాబిటేషన్‌లో కోలుకుంటున్న ఆటగాడు మరో గాయం బారిన పడ్డాడు. అంటే ఎన్సీఏ ఫిజియోలు సరిగా పని చేయడం లేదు. ఒక విషయం క్లియర్‌గా మీకు తెలియజేస్తున్నాం. ఈ అంశాన్ని వీలైనంత తొందరగా పరిష్కరించండి. ఒక్క దీపక్ చహర్ మాత్రమే కాదు.. ఇంతకముందు కూడా గాయపడిన ఆటగాళ్లు రీహాబిటేషన్‌లో కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో జరగబోయే మేజర్ ఈవెంట్స్‌లో ఆటగాళ్ల ఎంపికలో చాలా సమస్యలు వస్తాయి. ఈ అంశంపై ఎన్సీఏ డైరెక్టర్లు నితిన్, వివిఎస్ లక్ష్మణ్‌తో చర్చలు నిర్వహిస్తాం. అసలెందుకు ఆటగాళ్లు గాయాల నుంచి త్వరగా కోలుకోవడం లేదనే దానిపై ఆరా తీస్తాం.. ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం. నిజం చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితిపై ఎవరం సంతోషంగా లేము. గాయాలనేవి ఆటగాళ్లకు సహజం. వాళ్లు కోలుకోవాలనే ఎన్సీఏ పేరుతో రీహాబిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశాం. కానీ అక్కడే పని జరగకపోతే ఏం లాభం. హార్దిక్ పాండ్యా సహా చాలా మంది క్రికెటర్ల విషయంలో ఇది జరిగింది. ఇక్కడి ఫిజియోలతో పని కాదంటే చెప్పండి.. విదేశాల నుంచి ఫిజియోలను తెప్పిస్తాం. అడ్వాన్సన్ టెక్నాలజీతో అన్ని ఏర్పాట్లు చేసినప్పటికి ఉపయోగం లేకుండా పోయింది.'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీపక్ చహర్ ఒక్కడే కాదు.. ఇంతకముందు హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి గాయం నుంచి కోలుకోవడానికి తొమ్మిది నెలల సమయం పట్టింది. ఈ క్రమంలోనే అతను ఫామ్ కోల్పోవడం.. జట్టులో స్థానం కోల్పోవడం జరిగిపోయాయి. జడేజా కూడా బొటనవేలి గాయంతో రీహాబిటేషన్‌లో చాలాకాలం గడపాల్సి వచ్చింది. రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్‌లకు చిన్న గాయాలే అయినప్పటికికోలుకోవడానికి చాలా సమయం పట్టింది. చదవండి: IPL 2022: దీపక్ చహర్ ఔట్.. సీఎస్కే అధికారిక ప్రకటన -
దీపక్ చహర్ ఔట్.. సీఎస్కే అధికారిక ప్రకటన
దీపక్ చహర్ ఐపీఎల్ 2022 సీజన్‌కు పూర్తిగా దూరమైనట్లు సీఎస్కే శుక్రవారం ట్విటర్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. ''మిస్ యూ దీపక్ చహర్.. తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం'' అంటూ క్యాప్షన్ జత చేసింది. దీపక్ చహర్ దూరమవ్వడం సీఎస్కేకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. గత సీజన్లో సీఎస్కే విజేతగా నిలవడంలో దీపక్ చహర్ కీలకపాత్ర పోషించాడు.ఈ సీజన్లో అతను లేని లోటు స్పష్టంగా కనిపించింది. నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా పరాజయాలు చవిచూసిన జడ్డూ సేన ఆర్సీబీతో మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టింది. ఇక రెండు రోజుల క్రితం దీపక్ చహర్ వెన్నుముక గాయంతో బాధపడుతున్నట్లు తేలింది. 📢 Official Announcement! Deepak Chahar will be missing the IPL 2022 due to a back injury. Send in all the #Yellove for a speedy recovery to namma Cherry! Read More ➡️ https://t.co/ju447A3Q2T pic.twitter.com/jujfCfSB6L — Chennai Super Kings (@ChennaiIPL) April 15, 2022 అంతకముందు తొడ కండరాల గాయంతో విండీస్‌తో సిరీస్‌కు దూరమైన చహర్.. ఎన్సీఏ రీహాబిటేషన్‌లో చేరి అక్కడే కోలుకున్నాడు. ఇక సీఎస్కేలో చేరతాడు అనే సమయానికి దురదృష్టవశాత్తూ చహర్‌కు వెన్నుముక గాయం తిరగబెట్టింది. నాలుగు నెలల విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు. దీంతో దీపక్ చహర్ ఐపీఎల్‌తో పాటు రాబోయే టి20 ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. Courtesy: IPL Twitter మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు అన్క్యాప్డ్ ప్లేయర్ రషీక్ సలామ్ వెన్నునొప్పి గాయంతో ఐపీఎల్ 2022 సీజన్ నుంచి వైదొలిగాడు. రషీక్ సలామ్ వెన్నుముక నొప్పితో బాధపడుతున్నట్లు తేలింది. స్కానింగ్‌లో నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో రషీక్ సీజన్‌కు దూరమవుతున్నట్లు కేకేఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా రషీక్ సలామ్ ఈ సీజన్లో కేకేఆర్ తరపున రెండు మ్యాచ్‌లు ఆడాడు. అతని స్థానంలో ఢిల్లీకి చెందిన హర్షిత్ రాణా కనీస ధర రూ.20 లక్షలకు కేకేఆర్ భర్తీ చేయనున్నట్లు ట్విటర్లో తెలిపింది. 🚨 UPDATE: Harshit Rana replaces an injured Rasikh Salam in the KKR squad. — KolkataKnightRiders (@KKRiders) April 15, 2022 -
దీపక్ చహర్‌కు ఒక్క రూపాయి కూడా దక్కకపోవచ్చు!
ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన మెగావేలంలో ఇషాన్ కిషన్ తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాడిగా దీపక్ చహర్ నిలిచాడు. రూ.14 కోట్లతో సీఎస్కే మూడేళ్ల కాలానికి(రూ.42 కోట్లు) చహర్‌ను దక్కించుకుంది. అయితే ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి ముందే గాయంతో దీపక్ చహర్ దూరమయ్యాడు. తొలుత ఆరంభ మ్యాచ్‌లకు మాత్రమే దూరమవుతాడని అంతా భావించారు. తాజాగా వెన్నుముక గాయంతో సీజన్ మొత్తానికే చహర్ దూరమవనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై బీసీసీఐ, సీఎస్కే ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఇంకో షాకింగ్ విషయమేంటంటే.. రానున్న టి20 ప్రపంచకప్ 2022కు కూడా దీపక్ చహర్ దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతోనే కనీసం నాలుగు నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ఈ లెక్కన చూసుకుంటే దీపక్ చహర్ టి20 ప్రపంచకప్ ఆడడం కష్టమే. ఇది సీఎస్కేకు బిగ్‌షాక్ అనే చెప్పాలి. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత ఆర్సీబీతో మ్యాచ్‌లో గెలిచి సీజన్లో బోణీ చేసింది. అయితే దీపక్ చహర్ పూర్తిగా దూరమయ్యాడన్న వార్త సీఎస్కేకు నష్టం కలిగించే అంశం. కొత్త బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం, నకుల్ బంతిని విడవడంలో.. వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడంలో దీపక్ చహర్‌ను ప్రత్యేక బౌలర్‌గా నిలిపాయి. అంతేకాదు లోయర్ ఆర్టర్లో బ్యాటింగ్‌లోనూ రాణించగల సత్తా అతని సొంతం. గతేడాది సీజన్లో సీఎస్కే విజేతగా నిలవడంలో దీపర్ చహర్ కీలకపాత్ర పోషించాడు. తాజాగా దీపక్ చహర్ అంశంలో ఒక ఆసక్తికర విషయం వెలుగుచూసింది. చహర్‌కు ఈ ఏడాది సీఎస్కే ఒక్క రూపాయి ఇచ్చే అవకాశం లేదు. ఐపీఎల్లో తెచ్చిన కొత్త రూల్స్ ప్రకారం ఒక ఆటగాడు సీజన్ ఆరంభానికి ముందు జట్టుకు దూరమై.. ఆ తర్వాత సీజన్ మొత్తానికి అందుబాటులోకి రాకుంటే సదరు ఆటగాడికి ఒక్క రూపాయి చెల్లించే అవకాశం ఉండదు. ఈ లెక్కన చహర్ రూ.14 కోట్లు కోల్పోతున్నట్లే. ఇంతకముందు ఒక ఆటగాడు ఒక్క మ్యాచ్ ఆడి ఆ తర్వాత సీజన్ మొత్తం దూరమైనా అతనికి సదరు ఫ్రాంచైజీ పూర్తి డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. ఇకపై అలా కుదరదు. తాజాగా సవరించిన రూల్స్ ఏం చెబుతున్నాయంటే.. ► సీజన్ ఆరంభానికి ముందే ఆటగాడు దూరమైతే సదరు ఫ్రాంచైజీ అతనికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ►ఒక ప్లేయర్ గాయంతోనో.. లేక వేరే మ్యాచ్‌లు ఆడాలన్న కారణంతో మధ్యలో వైదొలిగితే అతనికి చెల్లించాల్సిన మొత్తంలో కేవలం 10శాతం మాత్రమే ఇస్తారు. ►ఇక సీజన్ ప్రారంభానికి ముందు ఆటగాడు జట్టు క్యాంప్‌లో రిపోర్టు చేసి.. మ్యాచ్ సమయానికి గాయపడి సీజన్ మొత్తానికి దూరమైతే 50శాతం డబ్బును చెల్లిస్తారు. అంతేకాదు గాయపడిన ఆటగాడి ట్రీట్మెంట్ ఖర్చును కూడా భరిస్తుంది. చదవండి: IPL 2022 GT Vs RR: హార్ధిక్ చేసిన ఆ పని వల్ల లక్షల్లో నష్టం.. ! -
T20 World Cup 2022: టీమిండియాకు భారీ షాక్..!
టీమిండియా పేసర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా ఐపీఎల్-2022కు దూరమైన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయం నుంచి కోలుకున్న చాహర్.. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తుండగా మరో సారి గాయపడ్డాడు. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతడి వెన్నెముకకు గాయమైంది. దీంతో ఈ ఏడాది సీజన్లో సీఎస్కేకు సెకెండ్ హాఫ్‌లో ఎంట్రీ ఇస్తాడనుకున్న చాహర్ పూర్తిగా దూరమయ్యాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. కనీసం నాలుగు నెలలపాటు క్రికెట్‌కు దీపక్ చాహర్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. నాలుగు నెలలపాటు అతడికి విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపినట్లు సమాచారం.. ఈ క్రమంలో ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు చాహర్ అందుబాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒక వేళ టీ20 ప్రపంచకప్‌కు చాహర్ దూరమైతే భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా వంటి ఫాస్ట్ ట్రాక్ పిచ్‌లపై అద్భుతంగా రాణించే సత్తా చాహర్‌కు ఉంది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో చాహర్ రూ.14 కోట్ల భారీ ధరకు చాహర్‌ను సీఎస్కే కొనుగోలు చేసింది. కాగా ప్రస్తుత సీజన్లో చాహర్ లేని లోటు సీఎస్కే బౌలింగ్‌లో సృష్టంగా కన్పిస్తోంది. చదవండి: IPL 2022: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు.. తొలి జట్టుగా! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ క్రికెటర్‌ను తీసుకోవాల్సిందే.. సీఎస్కేకు అభిమానుల డిమాండ్
ఐపీఎల్ 2022లో సీఎస్కేకు ఏది కలిసి రావడం లేదు. ఇప్పటికే వరుసగా నాలుగు పరాజయాలు చవిచూసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. అసలే ఓటముల బాధలో ఉన్న సీఎస్కేకు దీపక్ చహర్ సీజన్ మొత్తానికే దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తేలడంతో పుండు మీద కారం చల్లినట్లయింది. గత ఫిబ్రవరిలో జరిగిన మెగావేలంలో దీపక్ చహర్‌ను రూ. 14 కోట్లు పెట్టి సీఎస్కే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీపక్ చహర్ సీజన్‌కు దూరమయ్యే అవకాశం ఉండడంతో టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మను చహర్ స్థానంలో తీసుకోవాలని అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. 33 ఏళ్ల ఇషాంత్ ఇటీవలే టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. ఫామ్ కోల్పోయి సతమతవుతున్న ఇషాంత్‌ను సెలెక్టర్లు పక్కనబెట్టేశారు. ఇక జట్టులోకి ఇషాంత్ రావడం కష్టమే. దీనికి తోడూ మెగావేలంలో అమ్మడుపోని జాబితాలో చేరిపోయాడు. ఇషాంత్‌కు ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న ముంబై, పూణే స్టేడియాలో సరిగ్గా సరిపోతాయని.. గతంలో అతనికి మంచి రికార్డు ఉందంటూ చాలా మంది ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. కష్టాల్లో ఉన్న సీఎస్కేకు ఇషాంత్ రాకతో మార్పు వస్తుందేమో.. అంటూ పేర్కొన్నారు. కాగా కొన్నిరోజుల క్రితం ఐపీఎల్ వర్చువల్ గెస్ట్ బాక్స్‌లో ఇషాంత్ దర్శనమిచ్చాడు. ఇది చాలా మంది అభిమానులకు నిరాశ కలిగించింది. అందుకే ఇషాంత్‌ను సీఎస్కే తీసుకోవాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఇషాంత్‌పై అభిమానులు చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా తొడ కండరాల గాయం నుంచి కోలుకుని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ సాధించేందుకు శ్రమిస్తున్న దీపక్ చాహర్‌కు మరో గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో అతను మరో నెల రోజుల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వస్తుందని సమాచారం. ఈలోపు ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు దశకు చేరుకుంటుంది కాబట్టి చాహర్ సీజన్ మొత్తానికే దూరంగా ఉంటాడని జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. చదవండి: Arjuna Ranatunga: దేశం తగలబడిపోతుంటే ఐపీఎల్ ముఖ్యమా.. వదిలి రండి! Jasprit Bumrah: 'సంధికాలం నడుస్తోంది.. మార్చాల్సిన సమయం వచ్చేసింది!' Ishant sharma can be a really good replacement for Chahar. Ishant was very good in powerplays last season. https://t.co/Ii3eCeWdly — Jainil (@jainilism) April 12, 2022 With Chahar's comeback being almost next to impossible right now, can we rope in Ishant Sharma quickly? — Chinmay Singhvi (@SinghviChinmay) April 12, 2022 -
IPL 2022: వరుస ఓటములతో కుంగిపోయిన సీఎస్కేకు మరో భారీ షాక్..!
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఐపీఎల్ 2022 సీజన్ బరిలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ప్రస్తుత సీజన్లో ఏదీ కలిసిరావడం లేదు. ఐపీఎల్ 15వ ఎడిషన్‌లో కొత్త కెప్టెన్ (రవీంద్ర జడేజా) నేతృత్వంలో బరిలోకి దిగిన ఆ జట్టు ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడగా అన్నింటిలోనూ ఓటమిపాలై మునుపెన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల నడుమ సీఎస్కేకు మరో భారీ షాక్ తగిలింది. 14 కోట్లు పోసి కొనుక్కున్న స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ సీజన్ మొత్తానికే దూరం కానున్నాడని ప్రముఖ జాతీయ మీడియా వెల్లడించింది. Deepak Chahar ruled out of IPL 2022. (Reported by TOI).— Mufaddal Vohra (@mufaddal_vohra) April 12, 2022 తొడ కండరాల గాయం నుంచి కోలుకుని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ సాధించేందుకు శ్రమిస్తున్న దీపక్ చాహర్‌కు మరో గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో అతను మరో నెల రోజుల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వస్తుందని సమాచారం. ఈలోపు ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు దశకు చేరుకుంటుంది కాబట్టి చాహర్ సీజన్ మొత్తానికే దూరంగా ఉంటాడని జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. అయితే ఈ విషయంపై సీఎస్కే మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా, ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 సందర్భంగా దీపక్ చాహర్ తొడ కండరాలకు గాయమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సీఎస్కే ఇవాళ (ఏప్రిల్ 12) తమ 5వ మ్యాచ్‌లో ఆర్సీబీతో తలపడనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సీజన్లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన ఆర్సీబీ మరో విజయం కోసం ఉరకలేస్తుండగా.. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన సీఎస్కే ఎలాగైనా బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. చదవండి: ఐపీఎల్ చరిత్రలో చెత్త బౌలింగ్ రికార్డును సమం చేసిన సన్‌రైజర్స్ బౌలర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: బరిలోకి దిగనున్న దీపక్ చాహర్.. ఎప్పటి నుంచి అంటే..?
Deepak Chahar: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు శుభవార్త అందింది. గాయం కారణంగా సీజన్ ప్రారంభ మ్యాచ్‌లు మిస్ అయిన స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్.. ఏప్రిల్ 25న పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్ నాటికి సిద్ధంగా ఉంటాడని సీఎస్కే యాజమాన్యం సూచనప్రాయంగా వెల్లడించింది. పంజాబ్‌తో మ్యాచ్ నాటికి ఫిట్‌గా ఉండేందుకు చాహర్ ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టాడు. జట్టుతో పాటు ప్రాక్టీస్ సెషన్స్‌లో చెమటోడుస్తున్నాడు. కాగా, ప్రస్తుత సీజన్లో సీఎస్కే ఓడిన రెండు మ్యాచ్‌ల్లో చాహర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. 2021 సీజన్లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన చాహర్‌ను సీఎస్కే ఏరికోరి మరీ 14 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. చాహర్ త్వరగా కోలుకుని బరిలోకి దిగాలని అభిమానులతో పాటు సీఎస్కే యాజమాన్యం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. ఇదిలా ఉంటే, చెన్నై సూపర్ కింగ్స్ ఇవాళ (ఏప్రిల్ 3) తమ మూడో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. సీజన్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన సీఎస్కే.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. చదవండి: IPL 2022: ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ అరుదైన ఘనత -
IPL 2022: సీఎస్కే అభిమానులకు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు!
IPL 2022: చెన్నై సూపర్‌కింగ్స్ అభిమానులకు గుడ్‌న్యూస్! గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ బౌలర్ దీపక్ చహర్ కాస్త ఆలస్యంగానైనా టీమ్‌లోకి తిరిగి రానున్నాడట. ముందుగా చెప్పినట్లుగా అతడికి సర్జరీ అవసరం లేదని, ఏప్రిల్ రెండో వారం నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా మిస్టర్ కూల్ ధోని సారథ్యంలోని సీఎస్కే 14 కోట్లు ఖర్చు చేసి దీపక్ చహర్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈసారి వేలంలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడిగా చహర్ నిలిచాడు. అయితే, వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో అతడు తొడ కండరాల గాయానికి గురికావడం, తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని మొదట్లో వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం.. జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్న చహర్‌కు సర్జరీ అవసరం లేదని ట్రెయినర్లు చెప్పినట్లు తెలుస్తోంది. రానున్న రెండు వారాల్లోగా అతడు.. జట్టుతో చేరనున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. సూరత్‌లో ప్రాక్టీసు చేస్తున్న ధోని సేనతో చహర్ కలువనున్నట్లు తెలిపింది. కాగా ఐపీఎల్ 2021 సీజన్లో 15 మ్యాచ్‌లాడిన దీపక్ చహర్ 14 వికెట్లు పడగొట్టి జట్టును చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక మార్చి 26న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్-2022 ఆరంభం కానుంది. చదవండి: IPL 2022- CSK: దీపక్ చహర్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీళ్లే! Namma Special 🦁 Footvolley segment is B⚽CK! 🔁#WhistlePodu pic.twitter.com/pXxIe994sG — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) March 7, 2022 -
దీపక్ చహర్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీళ్లే!
-
IPL 2022: దీపక్ చహర్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీళ్లే!
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ దీపక్ చహర్ గాయం కారణంగా జట్టుకు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా 14 కోట్ల రూపాయలు ఖర్చు చేసి చహర్‌ను సొంతం చేసుకున్న ఫ్రాంఛైజీకి భారీ షాక్ తగిలినట్లయింది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న చహర్ సగం మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడన్న కథనాల నేపథ్యంలో సీఎస్కే ఫ్యాన్స్ సైతం ఉసూరుమంటున్నారు. తనదైన రోజున మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగల స్టార్ దూరం అయితే పరిస్థితి ఏమిటని చర్చించుకుంటున్నారు. మరి చహర్ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు ఎవరో ఓ లుక్కేద్దామా! తుషార్ దేశ్‌పాండే ఐపీఎల్- 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున క్యాష్ రిచ్‌లీగ్‌లో అడుగుపెట్టాడు ఈ ముంబై పేసర్. గత సీజన్లో సీఎస్కేకు నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరగలడు. దేశవాళీ టోర్నీల్లో బ్యాటర్లకు చుక్కలు చూపించిన తుషార్.. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021లో ముంబై తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా 26 ఏళ్ల తుషార్ నిలిచాడు. రాజ్వర్ధన్ హంగర్కర్ అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు రాజ్వర్ధన్ హంగర్కర్. మెగా వేలంలో భాగంగా చెన్నై 1.5 కోట్లు చెల్లించి అతడిని సొంతం చేసుకుంది. ఈ యువ ఫాస్ట్ బౌలర్ గంటకు 140 కి.మీ. వేగంతో బంతిని విసరగలడు. అంతేకాదు దీపక్ చహర్లాగే జట్టుకు అవసరమైన సమయంలో బ్యాట్ ఝులిపించగలడు కూడా! వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో మూడు వరుస సిక్సర్లు బాది సత్తా చాటాడు. కేఎమ్ ఆసిఫ్ 2018 నుంచి సీఎస్కే జట్టులో ఉన్నాడు ఆసిఫ్. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడాడు. కేరళకు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ తొలుత దుబాయ్‌లో జీవించేవాడు. ఓ షాప్‌లో స్టోర్‌కీపర్‌గా పనిచేశాడు. యూఏఈ జట్టులో స్థానం సంపాదించేందుకు చాలా కష్టపడ్డాడు. కానీ ఫలితం దక్కలేదు. 2018లో సీఎస్కే కొనుగోలు చేయడంతో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది ఢిల్లీతో మ్యాచ్‌కు దీపక్ చహర్ గాయం కారణంగా దూరం కావడంతో ఆసిఫ్ అతడి స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2019-20 విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో ఏడు మ్యాచ్‌లలో 14 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్‌కు ముందు ఫ్రాంచైజీలకు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ -
చెన్నై సూపర్ కింగ్స్‌లోకి శ్రీశాంత్...!
ఐపీఎల్-2022కు గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ దీపక్ చాహర్ దూరమైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో చాహర్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు సీఎస్కే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్కేకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. టీమిండియా వెటరన్ పేసర్ శ్రీశాంత్‌తో చాహర్ స్థానాన్ని భర్తీ చేయాలని చెన్నై భావిస్తోంది అన్నది ఆ వార్త సారాంశం. కాగా రూ.50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అమ్ముడుపోని ఆటగాడిగా శ్రీశాంత్ మిగిలిపోయాడు. ఇక 2013లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన శ్రీశాంత్‌పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో బీసీసీఐ అతడిపై జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు స్పందిస్తూ.. శిక్ష కాలాన్ని తగ్గించమని బీసీసీఐను ఆదేశించింది. దీంతో బీసీసీఐ అతడిపై నిషేధాన్ని ఏడు ఏళ్లకు కుదించింది. దీంతో 13 సెప్టెంబర్ 2020 నుంచి అతడిపై నిషేధం ఎత్తివేయబడింది. అనంతరం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయహాజారే టోర్నీ, రంజీ ట్రోఫీల్లో కేరళ తరపున శ్రీశాంత్ ఆడుతున్నాడు. రంజీట్రోఫీలో భాగంగా మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. అంతే కాకుండా తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ఇబ్బంది పెట్టే స్కిల్స్ శ్రీశాంత్‌కు ఉన్నాయి. అదే విధంగా పవర్‌ప్లేలో కూడా బౌలింగ్ చేసే సత్తా శ్రీశాంత్‌కు ఉంది. ఈ కారణాలతోనే చెన్నై శ్రీశాంత్‌పై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: IND vs SL: విరాట్ కోహ్లి అరుదైన రికార్డు.. ప్రపంచంలో రెండో ఆటగాడిగా! -
చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం..!
ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా టోర్నీ సగం మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో తొడ కండరాల గాయానికి చాహర్ గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు గాయం నుంచి కోలుకోవడానికి కనీసం ఎనిమిది వారాలు పట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ సాధించేందుకు దీపక్ చాహర్ ప్రయత్నిస్తున్నాడు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో 14 కోట్లకు దీపక్ చాహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2021 సీజన్లో 15 మ్యాచ్‌లాడిన చాహర్ 14 వికెట్లు పడగొట్టాడు. ఇక చాహర్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పటికే సీఎస్కే కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇక ఐపీఎల్-2022లో అమ్ముడుపోని టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మను చాహర్ స్ధానంలో భర్తీ చేసేందుకు చెన్నై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లో సీఎస్కే విజయంలో చాహర్ కీలకపాత్ర పోషించాడు. తన పేస్‌తో పవర్ ప్లేలో బ్యాటర్లను ఇబ్బంది పెట్టేవాడు. ఇక చాహర్ పేస్ బౌలింగ్ బాధ్యతలను ఆడమ్ మిల్నే, క్రిస్ జోర్డాన్, డ్వైన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావోలు తీసుకోనున్నారు. చదవండి: Rod Marsh: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ కన్నుమాత..