దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ ఫిట్‌నెస్ కారణంగా సౌతాఫ్రికాతో టెస్టులకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా శనివారం దృవీకరించింది. షమీ ఫిట్‌నెస్‌పై మెడికల్ టీమ్ ఇంకా క్లియర్స్ ఇవ్వలేదని, అందువల్ల షమీ దక్షిణాఫ్రికు వెల్లడం లేదని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా షమీ ప్రస్తుతం మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. మోకాలి నొప్పికి అతడు చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడిని జట్టు నుంచి బీసీసీఐ తప్పించింది. అతడు తిరిగి వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
అదే విధంగా భారత యువ పేసర్ దీపక్ చాహర్.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ప్రోటీస్ పర్యటనకు దూరంగా ఉండాలని చాహర్ నిర్ణయించకున్నాడు. దీంతో అతడి స్ధానాన్ని బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్‌తో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దీపక్ చాహర్ తండ్రి ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తండ్రిని దగ్గరుండి చాహర్ చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడు వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు.
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) December 16, 2023
Deepak Chahar withdrawn from the ODI series; Mohd. Shami ruled out of the Test series.
Details 🔽 #TeamIndia | #SAvIND https://t.co/WV86L6Cnmt pic.twitter.com/oGdSJk9KLK
Comments
Please login to add a commentAdd a comment