మొహాలి : సారథి డికాక్ (52; 37 బంతుల్లో 8ఫోర్లు), బవుమా(49; 43 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్సర్)రాణించడంతో టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో దక్షిణాఫ్రికా 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొహాలి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంలో టాస్ గెలిచిన టీమిండియా సారథి విరాట్ కోహ్లి చేజింగ్ వైపు మొగ్గు చూపాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టుకు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ రీజా హెండ్రిక్స్(6) పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బవుమాతో కలిసి సారథి డికాక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే టీమిండియా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌కు సఫారీ బ్యాట్స్‌మెన్ ఇబ్బందులకు గురయ్యారు. లైన్‌అండ్‌లెంగ్స్‌తో సఫారీ బ్యాట్స్‌మెన్ పరుగులు తీయకుండా అడ్డుకున్నారు.
అయితే బవుమా స్లో బ్యాటింగ్‌తో నిరత్సాహపరిచినా.. డికాక్ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ పెంచే ప్రయత్నం చేశాడు. అయితే అర్దసెంచరీ తర్వాత డికాక్‌ను నవదీప్ సైనీ ఔట్ చేయడంతో దక్షిణాఫ్రికాకు కష్టాలు మొదలయ్యాయి. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకోడానికి నానాతంటాలు పడ్డారు. అయితే బవుమా కూడ హాఫ్ సెంచరీ సాధించకుండానే దీపక్ చహర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. డసెన్(1), మిల్లర్(18) విఫలమవ్వడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో దీపక్ చహర్ రెండు వికెట్లతో రాణించగా.. సైనీ, జడేజా, హార్దిక్ పాండ్యాలు తలో వికెట్ దక్కించుకున్నారు.
టీమిండియా లక్ష్యం 150
Published Wed, Sep 18 2019 8:43 PM | Last Updated on Wed, Sep 18 2019 8:56 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment