ఆసియాకప్-2022 టోర్నీ మధ్య నుంచి భారత్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో స్టాండ్‌బైగా ఉన్న అక్షర్ పటేల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత మాజీ ఆటగాడు సబా కరీమ్ తప్పుబట్టాడు. అక్షర్ పటేల్ బదులగా పేసర్ దీపక్ చహర్‌ను జట్టులోకి తీసుకోవాల్సింది అని కరీమ్ అభిప్రాయపడ్డాడు.
ఈ క్రమంలో ఇండియా న్యూస్‌తో కరీమ్ మాట్లాడుతూ.. ఈ మెగా ఈవెంట్ తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత పేసర్లు ప్రధాన పాత్ర పోషించారు. పాకిస్తాన్‌తో సూపర్-4 మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగడం మనం చూశాం. కాబట్టి గాయపడిన జడేజా స్థానంలో పేసర్ దీపక్ చాహర్‌ను ఎంపిక చేయాల్సింది. చాహర్ టీ20 స్పెషలిస్టు. అతడికి కొత్త బంతితో వికెట్లు తీసే సత్తా ఉంది.
అతడు జట్టులో ఉంటే పాకిస్తాన్ అంత పెద్ద టార్గెట్‌ను చేధించేది కాదు. కాగా ఇప్పటికే భారత జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. ఇప్పుడు అక్షర్ రూపంలో నాలుగో స్పిన్నర్‌ను ఎందుకు జట్టులోకి తీసుకున్నారో నాకు అర్ధం కావడం లేదని పేర్కొన్నాడు. ఇక ఆసియాకప్ సూపర్-4లో భాగంగా మంగళవారం శ్రీలంకతో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది.
చదవండి: కోహ్లిపై మండిపడ్డ బీసీసీఐ.. మళ్లీ అగ్గి రాజేసిన రన్ మెషీన్ వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment