Saba Karim
-
టీమిండియా టీ20 కెప్టెన్‌గా వాళ్లిద్దరి మధ్యే పోటీ
అంతర్జాతీయ టీ20లలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా శకం టీ20 ప్రపంచకప్-2024తో ముగిసింది. ఈ మెగా ఈవెంట్ తర్వాత ఈ ముగ్గురూ టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు.ఈ నేపథ్యంలో టీ20లలో భారత జట్టు కొత్త కెప్టెన్ ఎవరా అన్న అంశంపై క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం తన అభిప్రాయాలు పంచుకున్నాడు.తన దృష్టిలో టీమిండియాకు ముందుకు నడిపే సామర్థ్యం ఇద్దరు స్టార్లకు ఉందన్న ఈ మాజీ వికెట్ కీపర్.. కొత్త కోచ్ గౌతం గంభీర్, సెలక్టర్ల నిర్ణయం పైనే అంతా ఆధారపడి ఉందని పేర్కొన్నాడు.ఈ మేరకు సబా కరీం మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ అయ్యాడు. ఇకపై అతడు టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట ఆడడు.కాబట్టి అతడి వారసుడి ఎంపికపైనే ప్రస్తుతం అందరి దృష్టి పడింది. నా దృష్టిలో ఇద్దరికి ఆ అవకాశం ఉంది. లాజికల్‌గా చూస్తే హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌ను చేయాలి.ఎందుకంటే టీ20 ప్రపంచకప్-2024లో అతడిని వైస్ కెప్టెన్‌గా నియమించింది బోర్డు. గతంలోనూ రోహిత్ గైర్హాజరీలో అతడు సారథిగా వ్యవహరించాడు.రానున్న రెండేళ్లలో మరోసారి టీమిండియా పొట్టి వరల్డ్‌కప్ ఆడనుంది. అప్పటికి పూర్తి స్థాయిలో జట్టు సన్నద్ధం కావాలి. ముఖ్యంగా కెప్టెన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి.సూర్యకుమార్ యాదవ్ గురించి కూడా చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అతడు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును గెలిపించాడు.కచ్చితంగా అతడు కూడా టీమిండియా టీ20 కెప్టెన్‌గా సరైన ఆప్షనే అనిపిస్తాడు. వీరిద్దరిలో ఎవరిని సారథిని చేయాలన్న అంశంపై సెలక్టర్లు, కొత్త కోచ్ నిర్ణయం తీసుకుంటారు’’ అని పేర్కొన్నాడు. తానైతే ఇద్దరికీ కెప్టెన్ అయ్యే అర్హత ఉందని చెబుతానంటూ సబా కరీం సోనీ స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు. -
ఆరోజు గంగూలీతో నేను చెప్పాను.. కానీ ధోని విషయంలో అలా: మాజీ సెలక్టర్
Ex-Selector Comments On MS Dhoni: ‘‘ఎంఎస్ ధోని.. రంజీ ట్రోఫీ సెకండ్ సీజన్లో ఆడుతున్నపుడు తనను తొలిసారి కలిశాను. అప్పుడు అతడు బిహార్ జట్టుకు ఆడుతూ ఉండేవాడు. బ్యాటింగ్ చేయడంతో పాటు కీపర్‌గానూ వ్యవహరించేవాడు. స్పిన్నర్ అయినా పేసర్ అయినా దూకుడుగానే బ్యాటింగ్ చేసేవాడు. కానీ.. వికెట్ కీపర్‌గా తన ఫుట్‌వర్క్ విషయంలో మెరుగుపడాల్సి ఉందనుకున్నాను. అదే విషయాన్ని అతడితో చర్చించాను. నాడు నేర్చుకున్న పాఠాలను నేటికీ ధోని పాటిస్తున్నాడు. ధోని కెరీర్లో అదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు’’ అని టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం అన్నాడు. కెరీర్ తొలినాళ్లలో వికెట్ కీపింగ్ విషయంలో కాస్త ఇబ్బంది పడ్డ ధోని.. ప్రస్తుతం ప్రపంచంలోనే మేటి కీపర్లలో ఒకడిగా ఎదిగాడని పేర్కొన్నాడు. భారత జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని గురించి జియో సినిమా షోలో పలు ఆసక్తికర విషయాలను మాజీ వికెట్ కీపర్ సబా కరీం పంచుకున్నాడు. ‘‘కెన్యాలో ఇండియా-ఏ, పాకిస్తాన్-ఏ, కెన్యా- ఏ జట్ల మధ్య జరిగిన ట్రై సిరీస్ ధోని కెరీర్లో రెండో టర్నింగ్ పాయింట్. దినేశ్ కార్తిక్ జాతీయ జట్టుకు ఆడుతున్న క్రమంలో ధోనికి ఈ సిరీస్ ఆడే అవకాశం వచ్చింది. అక్కడ తను వికెట్ కీపర్‌గా సేవలు అందించాడు. ఇక బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! అత్యద్భుతంగా బ్యాటింగ్ చేసి మా నమ్మకాన్ని నిలబెట్టాడు’’ అని సబా కరీం.. ధోనిపై ప్రశంసలు కురిపించాడు. నేను గంగూలీకి చెప్పాను.. కానీ.. ఇక 2004లో ధోని పాకిస్తాన్ టూర్ మిస్సవడానికి గల కారణాన్ని కూడా సబా కరీం ఈ సందర్భంగా బయటపెట్టాడు. ‘‘కెన్యాలో అద్భుత ప్రదర్శన తర్వాత అతడి పేరు మారుమ్రోగిపోయింది. అప్పుడు నేను కలకత్తాలో ఉన్నాను. నాడు సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్నాడు. ఒక వికెట్ కీపర్ ఉన్నాడు.. అతడు అద్భుత నైపుణ్యాలు కలిగి ఉన్నాడని గంగూలీతో చెప్పాను. జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని కూడా అన్నాను. కానీ దురదృష్టవశాత్తూ.. ఎందుకో సౌరవ్ అప్పుడు అప్‌కమింగ్ ఆటగాడిపై నమ్మకం ఉంచలేకపోయాడు. ధోనిని మేము అప్పుడు జాతీయ జట్టుకు సెలక్ట్ చేయలేదు. అయితే, ఆ తర్వాత వెంటనే టీమిండియాలోకి వచ్చాడు’’ అని సబా కరీం చెప్పుకొచ్చాడు. కాగా 2004లో బంగ్లాదేశ్ టూర్‌కు ఎంపికైన ధోని.. తొలి మ్యాచ్‌లో నిరాశపరిచినా అనతికాలంలోనే కెప్టెన్‌గా ఎదిగాడు. ఇక మిగిలిందంతా చరిత్రే!! చదవండి: వారణాసి అమ్మాయి.. వెస్టిండీస్ క్రికెటర్ భార్య! భోజ్‌పురీలో మాట్లాడగలదు.. ఇంకా! -
అస్సలు ఊహించలేదు.. అతడు ఓపెనర్‌గా వస్తాడని! కచ్చితంగా జట్టులో ఉండాలి
వెస్టిండీస్ గడ్డపై టీమిండియా జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు.. ఇప్పడు వన్డే సిరీస్ విజయం దిశగా దూసుకెళ్తోంది. మూడో వన్డేల సిరీస్‌ను గెలుపుతో ఆరంభించిన భారత్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బార్బోడస్ వేదికగా విండీస్‌తో రెండో వన్డేలో రోహిత్ సేన అమీతుమీ తెల్చుకోనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో చెలరేగిన టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్‌పై భారత మాజీ ఆటగాడు సబా కరీం ప్రశంసల వర్షం కురిపించాడు. కిషన్‌కు ఓపెనర్‌గానే కాకుండా మిడిలార్డర్లో రాణించే సత్తా ఉందని అతడు కొనియాడాడు. కాగా విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ.. కిషన్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేశాడు. ఓపెనర్‌గా వచ్చిన కిషన్ 52 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో కరీం జియో సినిమాతో మాట్లాడుతూ.. "కిషన్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడని అస్సలు నేను ఊహించలేదు. కానీ తనకు వచ్చిన అవకాశాన్ని కిషన్ చక్కగా ఉపయోగించుకున్నాడు. అతడి ఇన్నింగ్స్ జట్టులో తన విలువను మరింత పెంచింది. ప్రస్తుతం పంత్ అందుబాటులో లేడు కాబట్టి రాహుల్‌ను ప్రధాన వికెట్ కీపర్‌గా పరిగిణలోకి తీసుకుంటారని నాకు తెలుసు. అయితే రాహుల్ కూడా తన ఫిట్నెస్తో పోరాడతున్నాడు. కాబట్టి కిషన్‌ను బ్యాకప్ వికెట్ కీపర్‌గా పరిగణలోకి తీసుకోవాలి. అతడికి వికెట్ కీపింగ్‌తో పాటు ఓపెనింగ్, మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే సత్తా కూడా ఉంది. అతడికి జట్టులో రెగ్యూలర్‌గా అవకాశాలు ఇవ్వాలి. వరల్డ్‌కప్‌కు బ్యాకప్ ఓపెనర్‌గా అతడిని ఎంపిక చేయాలని" చెప్పుకొచ్చాడు. చదవండి: MLC 2023: జూనియర్ 'ఏబీడీ' సూపర్ ఇన్నింగ్స్.. ఫైనల్‌కు చేరిన ముంబై ఇండియన్స్ టీమ్ -
వాళ్లిద్దరు అద్భుతం.. రోహిత్, కోహ్లి పనైపోయింది: టీమిండియా మాజీ క్రికెటర్
IPL 2023- Virat Kohli- Rohit Sharma: ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు తమ అద్భుత బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రేమికులను అమితంగా ఆకట్టుకున్న క్రికెటర్లు అంటే.. టక్కున గుర్తొచ్చే పేర్లు.. సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైశ్వాల్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్య ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. పరుగుల సునామీ సృష్టించిన సూర్య ఆర్సీబీతో మంగళవారం (మే 9) నాటి మ్యాచ్‌లో 35 బంతుల్లో 7 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో ఈ మిస్టర్ 360 ప్లేయర్ 83 పరుగులు సాధించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల సునామీ సృష్టించి ముంబైకి విజయం అందించి ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు తీసుకువచ్చాడు. సరికొత్త రికార్డుతో యశస్వి ఇలా ఇక ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో గురువారం (మే 11) నాటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే! 13 బంతుల్లో అర్ధ శతకం సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడీ 21 ఏళ్ల ముంబై బ్యాటర్. మొత్తంగా 47 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఏకంగా 98 పరుగులు రాబట్టాడు. సెంచరీ మిస్.. మనసులు గెలిచాడు కీలక మ్యాచ్‌లో ఆఖరి వరకు అజేయంగా నిలిచి బౌండరీ బాది రాజస్తాన్‌ను విజయతీరాలకు చేర్చిన యశస్వి.. కేవలం రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ కావడం మ్యాచ్ చూస్తున్న ప్రతీ ఒక్కరి మనసును మెలిపెట్టిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో విజయానంతరం యశస్వి మాట్లాడుతూ.. వ్యక్తిగత రికార్డుల గురించి తాను ఆలోచించలేదని, జట్టు రన్‌రేటు పెంచడమనే విషయమే తన మైండ్‌లో ఉందని చెప్పడం మరోసారి అభిమానుల హృదయాలను గెలిచింది. రోహిత్, కోహ్లి పనైపోయింది! నేపథ్యంలో యశస్వి అద్భుత ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్, మాజీ సెలక్టర్ సబా కరీం చేసిన ట్వీట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ‘‘జైశ్వాల్, స్కై(సూర్యకుమార్ యాదవ్) బ్యాటింగ్ చూస్తుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి నుంచి టీ20 క్రికెట్ మూవ్ ఆన్ అయినట్లు కనిపిస్తోంది’’ అని ట్వీట్ చేసిన సబా కరీం.. అనిల్ కుంబ్లే, హర్షా కుంబ్లేలను ట్యాగ్ చేశాడు. ఇందుకు నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘మీరు చెప్పిందే సరైందే! ప్రస్తుతం రోహిత్, కోహ్లి టీ20 క్రికెట్లో మునుపటిలా తమదైన ముద్ర చూపలేకపోతున్నారు’’ అంటూ కొంతమంది సబాకు మద్దతు ప్రకటిస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ‘‘లీగ్ క్రికెట్‌కు, అంతర్జాతీయ క్రికెట్‌కు చాలా తేడా ఉంటుంది. ఇలా మాట్లాడటం సరికాదు యశస్వి, సూర్యను ప్రశంసించడంలో తప్పులేదు. కానీ.. టీమిండియాను ఒంటిచేత్తో ఎన్నో మ్యాచ్‌లలో గెలిపించిన రోహిత్- కోహ్లిలను తక్కువ చేయకూడదు. కెప్టెన్ రోహిత్ పరుగులు రాబట్టడంలో ఇబ్బంది పడుతున్నాడన్న మాట వాస్తవం. కానీ కోహ్లి ఆసియా టీ20 కప్-2022, టీ20 ప్రపంచకప్-2022లో ఆడిన ఇన్నింగ్స్ ఎలా మర్చిపోతారు. ఆసియాకప్‌లో సెంచరీ చేసిన కోహ్లిని టీ20 ఫార్మాట్లో ఇక తనదైన ముద్ర చూపలేకపోవచ్చని ఎలా అంటారు? ఐపీఎల్-2023లోనూ కోహ్లి తన హవా చూపిస్తున్నాడు కదా!’’ అని సబా కరీంకు చురకలు అంటిస్తున్నారు. కాగా ఐపీఎల్-2023లో యశస్వి జైశ్వాల్ ఇప్పటి వరకు 12 ఇన్నింగ్స్‌లో 167.15 స్ట్రైక్‌రేటుతో 575 పరుగులు సాధించాడు. ఇక సూర్య 186.13 స్ట్రైక్‌రేటుతో 376 పరుగులు చేయగా.. ఆర్సీబీ బ్యాటర్ కోహ్లి 11 ఇన్నింగ్స్‌లో 133.75 స్ట్రైక్‌రేటుతో 420 పరుగులు సాధించాడు. ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 11 ఇన్నింగ్స్‌లో అతడు చేసిన పరుగులు 191. ఈ ఓపెనర్ బ్యాటర్ నమోదు చేసిన అత్యధిక స్కోరు: 65. ఈ నేపథ్యంలో సబా కరీం ఈ మేరకు ట్వీట్ చేయడం గమనార్హం. చదవండి: జైస్వాల్ సెంచరీ చేయకుండా అడ్డుకున్న సుయాశ్.. ఏకి పారేసిన ఆకాశ్ నాకే ఎందుకిలా? వెక్కి వెక్కి ఏడ్చా.. గుండు చేసుకున్నా: సూయశ్ శర్మ Up Above The World So High Like A Diamond His Name Is SKY 🤩#TATAIPL | #MIvRCB | @surya_14kumar | @mipaltan pic.twitter.com/EgUDqe7aao — IndianPremierLeague (@IPL) May 9, 2023 The Yashasvi effect❤️🔥 - FASTEST 50 in #TATAIPL history!! 🤯💪#KKRvRR #IPL2023 #IPLonJioCinema | @rajasthanroyals @ybj_19 pic.twitter.com/WgNhYJQiUN — JioCinema (@JioCinema) May 11, 2023 When one sees Jaiswal and SKY bat, it is amply clear that T20 game has moved on from Rohit sharma and Virat Kohli!!@anilkumble1074 @bhogleharsha — Syed Saba Karim (@SyedSabaKarim5) May 11, 2023 -
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కేఎల్ రాహుల్ వద్దు.. భరత్ సరైనోడు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్ పర్వాలేదనపించాడు. తొలి మూడు టెస్టులో పెద్దగా ఆకట్టుకోపోయిన భరత్.. ఆఖరి టెస్టులో మాత్రం 44 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్ విషయం పక్కన పెడితే.. వికెట్ల వెనుక మాత్రం భరత్ అద్భుతంగా రాణించాడు. రివ్యూల విషయంలో కూడా కెప్టెన్ రోహిత్ శర్మకు విలువైన సూచనలు చేశాడు. ఈ నేపథ్యంలోనే భరత్‌ను ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి కొంత మంది అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌ను వికెట్ కీపర్‌గా అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. కాగా ఆసీస్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో రాహుల్ తీవ్రంగా నిరాశ పరిచాడు. దీంతో అతడు ఆఖరి రెండు టెస్టులకు జట్టులో స్థానం కోల్పోయాడు. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అదరగొట్టాడు. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు భారత జట్టులో రాహుల్ చోటు దక్కడం ప్రస్తుతం ప్రశ్నర్థకంగా మారింది. ఈ నేపథ్యంలో భారత మాజీ సెలెక్టర్ సబా కరీమ్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. కెఎస్ భరత్ అద్భుతమైన ఆటగాడని, అతడికి మరిన్ని అవకాశాలు టీమిండియా అవకాశాలు ఇవ్వాలని కరీం సూచించాడు. హిందూస్తాన్ టైమ్స్‌తో కరీం మాట్లాడుతూ.. "డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో ఎవరు ఉంటారన్నది మేనేజ్మెంట్ నిర్ణయిస్తోంది. అయితే ఇటీవలి కాలంలో భారత జట్టు మేనేజ్మెంట్ చాలా మంది యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. అది భారత క్రికెట్‌కు శుభసూచికం. ముఖ్యంగా కేఎస్ భరత్ వంటి ఆటగాడు టీమిండియా తరపున అరంగేట్రం చేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే అరంగేట్ర సిరీస్‌లోనే ఎవరూ అద్భుతాలు సృష్టించలేరు కదా. కాబట్టి కెఎస్ భరత్‌కి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. భారత పరిస్థితుల్లో రాణించడం అంత సులభం కాదు. అతడు స్టంప్‌ల వెనుక కూడా చాలా చురుకుగా ఉన్నాడు. భరత్ నెమ్మదిగా తన ఆటతీరును మార్చుకుంటున్నాడు. కాబట్టి అతడికి కాస్త సమయం ఇస్తే అతడు అద్భుతాలు సృష్టిస్తాడు. ఒక వేళ డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో కేఎల్ రాహుల్ ఉన్న భరత్‌నే వికెట్ కీపర్‌గా కొనసాగించాలి అని అతడు పేర్కొన్నాడు. కాగా లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 7- 11 వరకు భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. -
'వన్డే ప్రపంచకప్‌లో భారత ఓపెనర్లు వారిద్దరే'
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ టీ20 కెరీర్‌కు దాదాపు ఎండ్ కార్డ్ పడినట్లే. గతేడాది జూలైలో భారత్ తరపున ధావన్ తన అఖరి టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతడిని భారత సెలక్టర్లు పక్కన పెట్టారు. కాగా ధావన్ టీ20లకు దూరంగా ఉన్నప్పటికీ.. వన్డేల్లో మాత్రం చోటు దక్కించుకుంటున్నాడు. ధావన్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ సారథ్యంలోని భారత సీనియర్ జట్టు టీ20 ప్రపంచకప్-2022 కోసం ఆస్ట్రేలియాకు వెళ్లడంతో ధావన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు. ఇక ఇది ఇలా ఉండగా.. వన్డే వరల్డ్‌కప్-2023 భారత్ వేదికగా జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌కు భారత జట్టులో ధావన్‌కు ఖచ్చితంగా చోటు దక్కుతుందని టీమిండియా మాజీ సెలెక్టర్ సబా కరీం థీమా వ్యక్తం చేశాడు. అదే విధంగా రోహిత్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను శిఖర్ ప్రారంభిస్తాడని కరీం జోస్యం చెప్పాడు. ఇండియా న్యూస్‌తో కరీం మాట్లాడుతూ.. "వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టులో శిఖర్ ధావన్‌కు స్థానం దాదాపు ఖారారైంది. అతడు అద్భుతమైన ఆటగాడు. అతడు విఫలమైన మ్యాచ్‌లు ఒకటి లేదా రెండు మాత్రమే ఉంటాయి. ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, ధావన్‌ను ఓపెనర్లుగా ఉండాలని సెలక్టర్లు ఇప్పటికే నిర్ణయించారని నేను భావిస్తున్నాను" పేర్కొన్నాడు. చదవండి: Ravindra Jadeja: తన క్రష్ ఏంటో చెప్పిన జడేజా.. షాకైన అభిమానులు -
T20 WC 2022: 'భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్ కాదు.. టీ20 ప్రపంచకప్ విజేత ఆ జట్టే'
టీ20 ప్రపంచకప్-2022 ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే జట్లు అన్నీ తమ సన్నాహాకాలను కూడా ప్రారంభించాయి. ఇక ఈ టోర్నీకి దాదాపు నెల రోజుల సమయం ఉన్నప్పటకీ.. క్రికెట్ నిపుణులు, మాజీలు మాత్రం టోర్నీ విజేతలను ముందుగానే అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి భారత మాజీ ఆటగాడు సబా కరీం చేరాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను గెలిచే సత్తా అతిథ్య ఆస్ట్రేలియాకు ఉంది అని అతడు జోస్యం చెప్పాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగనుంది. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి తొలి సారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ఆసీస్ ముద్దాడింది. ఇక ఇది ఇలా ఉండగా.. బ్యాటింగ్ పరంగా ప్రస్తుతం ఆస్ట్రేలియా పటిష్టంగా కన్పిస్తోంది అని కరీమ్ అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో స్పోర్ట్స్18తో కరీం మాట్లాడూతూ.. "ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా మళ్లీ సొంతం చేసుకుంటుందని భావిస్తున్నాను. ఆస్ట్రేలియా ప్రస్తుతం టీ20 క్రికెట్లో అద్భుతంగా రాణిస్తోంది. ముఖ్యం వారు తమ సొంత గడ్డపై ఆడనున్నారు. అది వారికి బాగా కలిసి వస్తుంది. అదే విధంగా ఆసీస్ ప్రస్తుతం కొత్త లూక్లో కన్పిస్తోంది. ఇటువంటి మెగా టోర్నమెంట్లలో విజయం సాధించడానికి తగ్గట్టుగా తమ జట్టును ఆసీస్ తాయారు చేసుకుంది. ఇక ఆస్ట్రేలియాలో గ్రౌండ్లు పెద్దగా ఉంటాయి. కాబట్టి ప్రతీ జట్టుకు పవర్ హిట్టర్లు అవసరం. ఆసీస్ జట్టులో టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్వెల్ వంటి హిట్టర్లు ఉన్నారు. కాగా ప్రస్తుతం మిచెల్ మార్ష్, స్టోయినిస్ జట్టుకు దూరంగా ఉన్నారు. వారిద్దరూ తిరిగి మళ్లీ జట్టులోకి వస్తే ఆసీస్‌కు ప్రపంచకప్‌లో ఇక తిరుగుండదు" అని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం మూడు టీ20ల సిరీస్ నిమిత్తం భారత్‌లో పర్యటిస్తోంది. మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో విజయం సాధించిన ఆసీస్.. ఈ సిరీస్‌లో 1-0తేడాతో ముందుంజలో ఉంది. ఇక నాగ్‌పూర్ వేదికగా ఇరు జట్లు మధ్య రెండో టీ20 శుక్రవారం జరగనుంది. చదవండి: T20 WC 2022: పంత్‌కు కచ్చితంగా తుది జట్టులో చోటు ఇవ్వాల్సిందే: ఆసీస్ దిగ్గజం -
T20 WC 2022: హనీమూన్ పీరియడ్ అయిపోయింది.. ద్రవిడ్‌కు కష్టకాలం: మాజీ సెలక్టర్
T20 World Cup 2022- Team India- Rahul Dravid: ఆసియా కప్-2022 టోర్నీలో డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా కనీసం ఫైనల్ కూడా చేరుకుండానే ఇంటిబాట పట్టడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పొట్టి ఫార్మాట్లో వరుస విజయాలతో దూసుకుపోతూ హాట్ ఫేవరెట్‌గా మెగా ఈవెంట్లో అడుగుపెట్టిన రోహిత్ సేన.. అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకున్న సంగతి తెలిసిందే. జట్టు ఎంపిక మొదలు తుది జట్టు కూర్పు వరకు కొన్నిసార్లు మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలు ఫ్యాన్స్‌తో పాటు విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. వరుస విజయాలు.. కానీ అసలు పోరులో చేతులెత్తేశారు! కాగా.. కెప్టెన్ రోహిత్.. హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన మొట్టమొదటి మెగా టోర్నీ ఇది. ఈ ఈవెంట్‌కు ముందు.. వీరిద్దరి నేతృత్వంలో టీమిండియా టీ20 ఫార్మాట్లో దుమ్ములేపిన విషయం తెలిసిందే. వరుస విజయాలతో ప్రపంచ రికార్డులు సృష్టించింది. కానీ.. టీ20 ప్రపంచకప్-2022కు సన్నాహకంగా భావించిన ఆసియా కప్ ఈవెంట్లో మాత్రం చతికిలపడింది. ఇదిలా ఉంటే.. ఓవైపు దాయాది పాకిస్తాన్.. మరోవైపు పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పొరుగు దేశం శ్రీలంక ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం.. టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. హనీమూన్ పీరియడ్ అయిపోయింది.. ఆసియా కప్‌లో టీమిండియా ప్రదర్శన ద్రవిడ్‌కు కష్టకాలం తెచ్చిపెట్టిందని.. భవిష్యత్తులో అతడు మరిన్ని కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందన్నాడు. అదే విధంగా రానున్న రెండు మెగా ఐసీసీ ఈవెంట్లలో గెలిస్తేనే కోచ్‌గా అతడికి సంతృప్తి దొరుకుతుందని పేర్కొన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్ 18తో మాట్లాడుతూ.. ‘‘తన హనీమూన్ పీరియడ్ అయిపోయిందని రాహుల్ ద్రవిడ్‌కు తెలుసు. జట్టును అత్యుత్తమ స్థితిలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు. అప్పుడే ద్రవిడ్‌కు సంతృప్తి కానీ అతడి ప్రయత్నాలు అందుకు సరిపోవడం లేదు. నిజంగా రాహుల్ ద్రవిడ్‌కు ఇది కష్టకాలం. టీ20 వరల్డ్‌కప్, వన్డే వరల్డ్‌కప్ రూపంలో రెండు మెగా ఐసీసీ ఈవెంట్లు ముందున్నాయి. ఈ రెండు టోర్నీల్లో ఇండియా గెలిస్తేనే రాహుల్ ద్రవిడ్‌కు సంతృప్తి దొరుకుతుంది’’ అని సబా కరీం పేర్కొన్నాడు. అదే విధంగా తన మార్గదర్శనంలో సెనా(SENA- సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో టీమిండియా టెస్టు సిరీస్‌లు గెలిస్తే ద్రవిడ్ సంతోషడతాడంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: రవీంద్ర జడేజాపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం -
'శ్రీలంకతో మ్యాచ్‌కు అతడిని జట్టులోకి తీసుకురండి'
ఆసియాకప్-2022 సూపర్-4లో భాగంగా డూ ఆర్ డై మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడేందుకు భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా భారత్ తమ సూపర్-4 తొలి మ్యాచ్‌లో పాక్ చేతిలో ఓటమి పాలవ్వడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది. భారత్ ఫైనల్‌కు చేరాలంటే వరుసగా శ్రీలంక, ఆఫ్గానిస్తాన్‌పై విజయం సాధించాలి. ఇక గత మ్యాచ్‌లో పాక్‌పై జట్టులో నాలుగు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా.. శ్రీలంకతో మ్యాచ్‌లో జట్టులో ఏమైనా మార్పులు చేస్తుందా లేదా అదే జట్టుతో ఆడుతోందా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ క్రమంలో శ్రీలంకతో కీలక పోరుకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని ఎంపిక చేయాలని భారత మాజీ క్రికెటర్ సబా కరీం సూచించాడు. కాగా ఈ మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు అశ్విన్ కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇండియా స్పోర్ట్స్ న్యూస్‌తో కరీం మాట్లాడుతూ.. శ్రీలంకతో జరిగే కీలక మ్యాచ్‌కు హుడా స్థానంలో అశ్విన్‌ను జట్టులోకి తీసుకోవాలి. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాతో కలిపి ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగాలి. అశ్విన్ అద్భుతమైన ఆఫ్ స్పిన్నర్. అతడికి కీలక సమయాల్లో వికెట్లు తీసే సత్తా ఉంది అని" కరీం పేర్కొన్నాడు. శ్రీలంకతో మ్యాచ్‌కు భారత తుది జట్టు (అంచనా).. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ చదవండి: Asia Cup 2022: 'శ్రీలంకతో కీలక పోరు.. చాహల్‌ను పక్కన పెట్టి అతడిని తీసుకోండి' -
'జడేజా స్థానంలో అతడిని జట్టులోకి తీసుకోవాల్సింది'
ఆసియాకప్-2022 టోర్నీ మధ్య నుంచి భారత్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో స్టాండ్‌బైగా ఉన్న అక్షర్ పటేల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత మాజీ ఆటగాడు సబా కరీమ్ తప్పుబట్టాడు. అక్షర్ పటేల్ బదులగా పేసర్ దీపక్ చహర్‌ను జట్టులోకి తీసుకోవాల్సింది అని కరీమ్ అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో ఇండియా న్యూస్‌తో కరీమ్ మాట్లాడుతూ.. ఈ మెగా ఈవెంట్ తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత పేసర్లు ప్రధాన పాత్ర పోషించారు. పాకిస్తాన్‌తో సూపర్-4 మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగడం మనం చూశాం. కాబట్టి గాయపడిన జడేజా స్థానంలో పేసర్ దీపక్ చాహర్‌ను ఎంపిక చేయాల్సింది. చాహర్ టీ20 స్పెషలిస్టు. అతడికి కొత్త బంతితో వికెట్లు తీసే సత్తా ఉంది. అతడు జట్టులో ఉంటే పాకిస్తాన్ అంత పెద్ద టార్గెట్‌ను చేధించేది కాదు. కాగా ఇప్పటికే భారత జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. ఇప్పుడు అక్షర్ రూపంలో నాలుగో స్పిన్నర్‌ను ఎందుకు జట్టులోకి తీసుకున్నారో నాకు అర్ధం కావడం లేదని పేర్కొన్నాడు. ఇక ఆసియాకప్ సూపర్-4లో భాగంగా మంగళవారం శ్రీలంకతో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. చదవండి: కోహ్లిపై మండిపడ్డ బీసీసీఐ.. మళ్లీ అగ్గి రాజేసిన రన్ మెషీన్ వ్యాఖ్యలు -
Ind Vs Pak: చెత్త ప్రదర్శన.. అయినా వాళ్లిద్దరినీ పాక్‌తో మ్యాచ్‌లో ఆడించాల్సిందే!
Asia Cup 2022 Super 4 - India Vs Pakistan: ఆసియా కప్-2022 టోర్నీ తుది అంకానికి చేరుకుంటోంది. గ్రూప్- ఏ నుంచి టీమిండియా- పాకిస్తాన్, గ్రూప్- బి నుంచి అఫ్గనిస్తాన్- శ్రీలంక సూపర్-4కు చేరుకున్నాయి. ఈ క్రమంలో గ్రూప్- బిలోని అఫ్గన్- లంక జట్టు షార్జా వేదికగా సూపర్-4 స్టేజ్‌లో శనివారం మొదటి మ్యాచ్ ఆడనున్నాయి. మరో బిగ్ సండే ఆ మరుసటి రోజే మరో బిగ్ మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ వేదికగా ఇండియా- పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మెగా ఈవెంట్ తాజా ఎడిషన్‌లో దాయాదులు ముఖాముఖి పోటీపడటం ఇది రెండోసారి. ఫైనల్‌కు చేరే క్రమంలో కీలకమైన పోరులో చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా భారత తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందన్న అంశంపై క్రీడావర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సబా కరీం వాళ్లిద్దరికీ అవకాశం ఇవ్వాలి! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం కీలక వ్యాఖ్యలు చేశాడు. యువ బౌలర్లు ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్‌కు పాక్ మ్యాచ్‌లో అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. కాగా హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో ఈ ఇద్దరు యువ పేసర్లు తేలిపోయిన విషయం తెలిసిందే. పసికూనతో మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్ ఏకంగా 53 పరుగులు ఇవ్వగా.. అర్ష్‌దీప్ 44 పరుగులు సమర్పించుకుని చెరో వికెట్ తీశారు. వీరిద్దరి బౌలింగ్‌లో హాంగ్ కాంగ్ బ్యాటర్లు ఏకంగా 97 పరుగులు రాబట్టారు. దీంతో వీళ్లిద్దరి ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. వీళ్లను నమ్ముకుంటే కీలక మ్యాచ్‌లలో నట్టేట ముంచుతారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సమస్య అదే! అందుకే మునుపటి జట్టుతోనే ఈ నేపథ్యంలో సబా కరీం మాత్రం ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్‌లకు అండగా నిలిచాడు. ఇండియా న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్‌లు ఇప్పుడిప్పుడే తమను తాము నిరూపించుకుంటున్నారు. వాళ్లు మరింత అనుభవం గడించాల్సి ఉంది. అంతేగానీ.. ఒకటీ రెండు ప్రదర్శనల కారణంగా వారిని తుది జట్టు నుంచి తప్పించడం సరికాదు. ఫామ్‌తో సంబంధం లేకుండా జట్టులో కచ్చితంగా ముగ్గురు సీమర్లు ఉండాల్సిందే. కాబట్టి గత మ్యాచ్‌లో ఆడించిన జట్టుతోనే ముందుకు వెళ్లాలి. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మునుపటి జట్టును కొనసాగించాలి. ఎందుకంటే.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే.. కచ్చితంగా ఒకరికి పవర్ ప్లేలో ఒకటీ లేదంటే రెండు ఓవర్లు ఇవ్వాలి. అయితే, పాకిస్తాన్‌తో మ్యాచ్ కాబట్టి రిస్క్ తీసుకోకూడదు. పాక్‌తో గత మ్యాచ్‌లో పేసర్లు అద్బుతంగా ఆడారు. అందుకే మార్పుల్లేకుండానే సూపర్-4 మొదటి మ్యాచ్ ఆడితే మంచిది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా ఆసియా కప్ 15 ఎడిషన్‌లో పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్ రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 19 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్(ఫఖర్ జమాన్) తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. అర్ష్‌దీప్ సింగ్ 3.5 ఓవర్ల బౌలింగ్‌లో 33 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. చదవండి: Asia Cup 2022: మరోసారి తలపడనున్న భారత్-పాక్.. సూపర్-4 షెడ్యూల్ ఇదే Asia Cup 2022: రోహిత్, బాబర్ సేనలకు భారీ షాక్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Asia Cup: జట్టులో పంత్‌కు ప్రస్తుతం చోటు లేదు! ఆ స్థానం ఖాళీ అయితే గానీ!
Asia Cup 2022- Rishabh Pant: ఆసియా కప్-2022 టోర్నీలో టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు తుది జట్టులో స్థానం దక్కకపోవచ్చని మాజీ సెలక్టర్ సబా కరీం అభిప్రాయపడ్డాడు. మిగిలిన మ్యాచ్‌లలో కూడా టీమిండియా.. దినేశ్ కార్తిక్‌తోనే బరిలోకి దిగుతుందని అంచనా వేశాడు. కాగా మెగా ఈవెంట్లో పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడిన భారత తుది జట్టులో చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. పంత్‌ను కాదని! పంత్‌ను కాదని అనుభవజ్ఞుడైన, ఫినిషర్‌గా ఆకట్టుకుంటున్న దినేశ్ కార్తిక్(డీకే) వైపే యాజమాన్యం మొగ్గుచూపింది. అందుకు తగ్గట్టుగానే వికెట్ కీపర్ డీకే.. పాక్‌తో మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి జట్టు కీలక ఆటగాళ్లు ఇచ్చిన క్యాచ్‌లను ఒడిసిపట్టడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, నవాజ్‌లను పెవిలియన్‌కు పంపడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆకట్టుకున్న జడేజా! మరోవైపు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నాలుగో స్థానంలో బరిలోకి దిగి అదరగొట్టాడు. 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. తద్వారా జట్టు విజయంలో కీలకంగా మారాడు ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. ఈ నేపథ్యంలో సబా కరీం.. పంత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఎడమచేతి వాటం గల బ్యాటర్‌కు మున్ముందు అవకాశాలు కష్టతరంగా మారే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. పంత్‌కు చోటు కష్టమే! ఈ మేరకు సబా కరీం మాట్లాడుతూ.. ‘‘టీ20లలో భారత తుది జట్టులో పంత్‌కు చోటు కష్టంగా కనిపిస్తోంది. పూర్తిగా కాకపోయినా.. ఆసియా కప్ వరకైనా టీమిండియా దినేశ్ కార్తిక్‌నే వికెట్ కీపర్‌గా కొనసాగించే అవకాశం ఉంది. ఎందుకంటే నాలుగో స్థానంలో రవీంద్ర జడేజాను పంపాలని నిర్ణయించుకున్నారు. జడ్డూ సైతం పాక్‌తో మ్యాచ్‌లో తనదైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అంతేకాదు నాలుగో స్థానానికి తాను సరిపోతానని నిరూపించాడు. ఐదో స్థానంలోనూ ఈ లెఫ్టాండర్ రాణించగలడు. ఇక లోయర్ ఆర్డర్ గురించి చెప్పనవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరో లెఫ్టాండర్ బ్యాటర్ పంత్‌కు అవకాశం ఇవ్వాలంటే డీకే తన స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. కానీ.. అతడిని వికెట్ కీపర్‌గా ఆడిస్తున్నారు. రాహుల్‌ను తప్పిస్తే తప్ప! ఫినిషర్‌గానూ పని పూర్తి చేయగలడు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో రిషభ్ పంత్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశమే కనిపించడం లేదు’’ అని చెప్పుకొచ్చాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ పేలవ ఫామ్ కొనసాగితే.. ఓపెనర్ స్థానం ఖాళీ అయితే తప్ప పంత్‌కు ఛాన్స్ రాదని అభిప్రాయపడ్డాడు. అయితే, పాక్‌తో మ్యాచ్‌కు ముందు సబా కరీం తన అభిప్రాయాలు పంచుకుంటూ.. రిషభ్ పంత్‌ను ఎక్స్ ఫ్యాక్టర్‌గా అభివర్ణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ప్రస్తుత వ్యాఖ్యలను సమర్థించుకుంటూ.. ‘‘ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉన్న ప్లేయర్‌ను పక్కన పెడతారని ఎవరూ అనుకోరు. నాకైతే దినేశ్ కార్తిక్ కంటే ఇప్పటికీ తనే బెటర్ అనిపిస్తాడు’’ అని పేర్కొన్నాడు. అయితే, కొన్నిసార్లు జట్టు ప్రయోజనాల దృష్ట్యా కొంతమంది ఆటగాళ్లు త్యాగం చేయాల్సి ఉంటుందని పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. ఇక హాంకాంగ్‌తో టీమిండియా ఆసియా కప్ ఈవెంట్లో దుబాయ్ వేదికగా బుధవారం(ఆగష్టు 31)తమ రెండో మ్యాచ్ ఆడనుంది. చదవండి: Asia Cup 2022: శ్రీలంకతో మ్యాచ్! మాకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి.. -
Asia Cup 2022: టీమిండియా ఎక్స్ ఫ్యాక్టర్ అతడే.. కాబట్టి: మాజీ సెలక్టర్
Asia Cup 2022: క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా టోర్నీకి సమయం ఆసన్నమైంది. ఆసియా కప్-2022 ఆరంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. దుబాయ్ వేదికగా ఆగష్టు 27న ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు తెరలేవనుంది. ఇక ఆసియా కప్ ట్రోఫీని అందుకున్న జట్టుకు టీమిండియాకు పేరున్న విషయం తెలిసిందే. భారత జట్టు ఇప్పటివరకు అత్యధిక ఏడుసార్లు విజేతగా నిలిచింది. ఇక ఈసారి కూడా ఈ డిఫెండింగ్ చాంపియన్ ఫేవరెట్‌గానే బరిలోకి దిగుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, దినేశ్ కార్తిక్, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లు రిషభ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్ తదితరులు జట్టులో చోటుదక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తానైతే తుది జట్టులో వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తిక్‌కు మాత్రం అవకాశం ఇవ్వనని పేర్కొన్నాడు. రిషభ్ పంత్‌కే ఆ ఛాన్స్ ఇస్తానని స్పష్టం చేశాడు. మెగా టోర్నీలో పంత్ టీమిండియాకు ఎక్స్ ఫ్యాక్టర్(కీలక ఆటగాడు) కాగలడని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2022లో ఆర్సీబీ ఫినిషర్‌గా అద్భుత ప్రదర్శన కనబరిచి వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ భారత జట్టులోకి పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంత్‌తో పాటు డీకేకు కూడా వికెట్ కీపర్‌గా అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సబా కరీం స్పోర్ట్స్ ఓవర్ ది టాప్ షోలో మాట్లాడుతూ.. ‘‘తుదిజట్టులో ఒకే ఒక వికెట్ కీపర్ బ్యాటర్ ఉండాలి కదా! కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లితో పాటు రిషభ్ పంత్ ఎంతో కీలకం. కాబట్టి దినేశ్ కార్తిక్ బదులు నేను పంత్‌కే నా జట్టులో స్థానం ఇస్తాను. టీమిండియాలో తను కీలక బ్యాటర్. ఈ టోర్నీలో అతడు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటాడని భావిస్తున్నా’’ అని తెలిపాడు. టీ20 ప్రపంచకప్-2022కు ముందు ఈ మెగా టోర్నీ ఆడటం అతడికి ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డాడు. చదవండి: Rohit Sharma: షాట్లతో అలరించిన రోహిత్, కోహ్లి! మరీ ఇంత హైప్ అవసరం లేదు! ఆఫ్రిది లేకున్నా మాకు ఆ ముగ్గురు ఉన్నారు.. భారత బ్యాటర్లకు సవాల్! ముందు అరంగేట్రం చేయనివ్వు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'కోహ్లికి బ్యాకప్ ఎవరన్నది సెలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలి'
వెస్టిండీస్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరం కావడంతో అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న శ్రేయస్ అయ్యర్( 0 ,10,24) ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అయ్యర్ పూర్తిగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో అయ్యర్ స్థానంలో దీపక్ హుడాకు అవకాశం ఇవ్వాలని మాజీలు క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఐర్లాండ్ సిరీస్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్ హుడా అదరగొట్టాడు. ఈ సిరీస్‌లో అతడు అద్భుతమైన సెంచరీ కూడా సాధించాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు సబా కరీమ్ కీలక వాఖ్యలు చేశాడు. ఆసియాకప్‌లో టీమిండియా బ్యాకప్ నంబర్ త్రీ బ్యాటర్‌గా శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడాలో ఎవరు ఉండాలనేది సెలక్టర్లు నిర్ణయించడానికి ఇదే సరైన సమయమని కరీం అభిప్రాయపడ్డాడు. ఇండియా న్యూస్ స్పోర్ట్స్‌తో కరీం మాట్లాడుతూ.. "విరాట్ కోహ్లి జట్టులో ఉంటే అతడే సహజంగా నంబర్ 3లో బ్యాటింగ్‌కు వస్తాడు. ఒక వేళ కోహ్లి అందుబాటులో లేకపోతే అతడికి బ్యాకప్ బ్యాటర్‌గా ఎవరు ఉండాలో సెలెక్టర్లు నిర్ణయించే సమయం ఆసన్నమైంది. సెలెక్టర్లు శ్రేయస్ అయ్యర్ కొనసాగించాలని అనుకుంటే అతడికి ప్రతీ మ్యాచ్‌లోనూ అవకాశాలు ఇవ్వాలి. అతడు తన ఫామ్‌ను తిరిగి పొందుతాడని ఆశిస్తున్నాను. అయితే జట్టు మేనేజేమెంట్ ప్రయోగాలు చేయాలని భావిస్తే దీపక్ హుడాకు కూడా ఛాన్స్ ఇవ్వడానికి ఇదే సరైన సమయం. హుడా బ్యాట్‌తో బాల్‌తోనూ అద్భుతంగా రాణించగలడు. అది జట్టుకు చాలా ఉపయోగపడుతుంది. అయితే అతడిని నాలుగో స్థానానికి భారత్ సిద్దం చేస్తున్నట్లు ఉంది. ఎందుకంటే ఒకట్రెండు ఓవర్లలో ఓపెనర్ల వికెట్లను భారత్ కోల్పోతే ఇన్నింగ్స్ చక్కదిద్దే సత్తా హుడాకి ఉంది" అని పేర్కొన్నాడు. చదవండి: India Probable XI: ఓపెనర్‌గా ఇషాన్ కిషన్.. అవేష్ ఖాన్‌కు నో ఛాన్స్! -
Ind Vs WI: అవును.. సూర్య ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తేనే బెటర్!
India Vs West Indies 3rd T20- Suryakuma Yadav: వెస్టిండీస్‌తో మూడో టీ20లో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్‌గా బరిలోకి దిగి ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి 76 పరుగులు సాధించాడు. తద్వారా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు సూర్య. కాగా నాలుగో స్థానంలో అద్భుతంగా రాణించే ఈ ముంబై బ్యాటర్‌ను విండీస్ పర్యటనలో ఓపెనర్‌గా పంపడంపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి రెండు మ్యాచ్‌లలో ఓపెనర్‌గా సూర్య నిరాశపరచడం(వరుసగా 24,11)తో మాజీ సారథి క్రిష్టమాచారి శ్రీకాంత్ సహా పలువురు మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. అయితే, రోహిత్ శర్మ మాత్రం ఎప్పటికప్పుడు తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటూనే ఉన్నాడు. టీ20 వరల్డ్‌కప్-2022 సన్నాహకాల్లో భాగంగానే ప్రయోగాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో మూడో టీ20లో సూర్య రాణించడంతో టీమిండియా, ఫ్యాన్స్ ఖుషీ అవుతుండగా.. భారత జట్టు మాజీ సెలక్టర్, వికెట్ కీపర్ సబా కరీం మాత్రం భిన్నంగా స్పందించాడు. సబా కరీం నాలుగో స్థానంలో వస్తేనే! ఈ మ్యాచ్‌లో సూర్య ఓపెనర్‌గా రాణించినా.. బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానమే అతడికి అత్యుత్తమమైందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో సూర్యను మిడిలార్డర్లో ఆడిస్తేనే ఫలితం బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఇండియా న్యూ స్పోర్ట్స్‌తో సబా కరీం మాట్లాడుతూ.. ‘‘ఐసీసీ ఈవెంట్లలో బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానం అనేది అత్యంత కీలకమైనది. అక్కడ సూర్యకుమార్ లాంటి ఆటగాడి అవసరం ఎంతగానో ఉంటుంది. పేసర్లనైనా.. స్పిన్నర్లనైనా అతడు సమర్థవంతంగా ఎదుర్కోగలడు. మెరుగైన స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేయగలడు. ఇప్పటికీ తను నాలుగో స్థానానికి మాత్రమే సరైనవాడని నేను బలంగా నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నాడు. అవును మిడిలార్డర్లో అయితేనే! టీమిండియా మరో మాజీ క్రికెటర్ రితీందర్ సోధి సైతం అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే పలు అద్భుత ఇన్నింగ్స్ ఆడి సూర్యకుమార్ తానేంటో నిరూపించుకున్నాడన్నాడు. అతడు అత్యుత్తమ మిడిలార్డర్ బ్యాటర్ అని కొనియాడాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగితేనే సూర్య మరింత గొప్పగా రాణించగలుగుతాడని అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా సూర్యకుమార్ యాదవ్ ఆఖరిదైన మూడో టీ20లో సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక విండీస్ టూర్లో భాగంగా మూడో టీ20లో అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. దీంతో 7 వికెట్ల తేడాతో గెలుపొందిన రోహిత్ సేన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య శనివారం(ఆగష్టు 6) నాలుగో టీ20 మ్యాచ్ జరుగనుంది. వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మూడో టీ20: ►వేదిక: వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్, వెస్టిండీస్ ►టాస్: ఇండియా- బౌలింగ్ ►వెస్టిండీస్ స్కోరు: 164/5 (20) ►ఇండియా స్కోరు: 165/3 (19) ►విజేత: ఏడు వికెట్ల తేడాతో ఇండియా గెలుపు ►ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఇండియా ముందంజ ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సూర్యకుమార్ యాదవ్(44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 76 పరుగులు) చదవండి: Rohit Sharma Retired-Hurt: రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్.. బీసీసీఐ కీలక అప్డేట్.. ఆసియా కప్‌కు దూరమయ్యే చాన్స్! This elegant knock from @surya_14kumar won India the game. Spectacular batting! Watch all the action from the India tour of West Indies LIVE, exclusively on #FanCode 👉 https://t.co/RCdQk12YsM@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/Z7XHntlaFS — FanCode (@FanCode) August 2, 2022 -
Ind Vs Eng: టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ ఇది! రోహిత్‌పై మరింత భారం!
India Tour of England 2022: ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టు నేపథ్యంలో టీమిండియా కేఎల్ రాహుల్ సేవలను కోల్పోవడం పెద్ద ఎదురుదెబ్బేనని భారత మాజీ క్రికెటర్, మాజీ సెలక్టర్ సబా కరీం అన్నాడు. గతేడాది ఈ కర్ణాటక బ్యాటర్ ఇంగ్లండ్ గడ్డ మీద మంచి స్కోరు నమోదు చేశాడని కొనియాడాడు. అలాంటి మేటి ఆటగాడు ఇప్పుడు జట్టుకు దూరం కావడం తీరని లోటు అని పేర్కొన్నాడు. అప్పుడు కోహ్లి సారథ్యంలో.. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మపై మరింత ఒత్తిడి పెరుగుతుందని, ఓపెనర్‌గా మరింత మెరుగ్గా రాణించాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు గతేడాది ఆగష్టులో ఇంగ్లండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు డ్రా కాగా.. రెండో టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ(129)తో చెలరేగడంతో కోహ్లి సేన విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 76 పరుగులతో విజయం సాధించగా.. నాలుగో టెస్టులో రోహిత్ శర్మ అద్భుత శతక ఇన్నింగ్స్(127) కారణంగా ఆతిథ్య జట్టుపై గెలుపొంది టీమిండియా 2-1 ఆధిక్యం సాధించింది. అయితే, కోవిడ్ కారణంగా ఐదో టెస్టు నిరవధికంగా వాయిదా పడగా.. ఈ ఏడాది జూలై 1న రీషెడ్యూల్ చేశారు. అదరగొట్టిన ఓపెనింగ్ జోడి.. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారాయి. ఇంగ్లండ్‌తో సిరీస్ తర్వాత దక్షిణాఫ్రికాలో ఎదురైన పరాభవం నేపథ్యంలో విరాట్ కోహ్లి కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్ శర్మ ప్రస్తుత మ్యాచ్ నుంచి టీమిండియా టెస్టు జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక ఈ సిరీస్‌లో భారత్ నమోదు చేసిన విజయాల్లో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ది కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. కేఎల్ రాహుల్(PC: BCCI) రాహుల్ లేడు కాబట్టి.. ఈ నేపథ్యంలో సబా కరీం మాట్లాడుతూ.. ‘‘ఈ కీలక సమయంలో భారత్ స్టార్ ఆటగాడి సేవలను కోల్పోయింది. కేఎల్ రాహుల్ లేకపోవడం పెద్ద లోటు. గతేడాది టీమిండియా ఇంగ్లండ్ మీద గెలిచిన రెండు మ్యాచ్‌లలో అతడు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గెలుపులో తన వంతు సహాయం చేశాడు. కాబట్టి ఈసారి అతడి సేవలను భారత జట్టు తప్పకుండా మిస్సవుతుంది’’ అని అభిప్రాయపడ్డాడు. రాహుల్ స్థానంలో శుబ్‌మన్ గిల్ రోహిత్‌తో ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశాడు. ఈసారి మరింత మెరుగ్గా.. ఇక రోహిత్ శర్మ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘రాహుల్ గైర్హాజరీతో రోహిత్‌కు బాధ్యత రెట్టింపు అయింది. గతేడాది అతడు రాహుల్‌తో కలిసి భారత్‌కు శుభారంభాలు అందించాడు. ఈసారి కూడా అదే స్థాయిలో రాణించాల్సి ఉంది. ఓపెనింగ్ జోడి బ్యాట్ ఝులిపిస్తేనే టీమిండియా మంచి స్కోరు నమోదు చేయగలదు’’ అని సబా కరీం ఇండియా న్యూస్‌తో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కాగా ఈ సిరీస్‌లో రాహుల్ 39.37 సగటుతో 315 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 368 పరుగులతో అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇక జూలై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఐదో టెస్టు జరుగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీసులో తలమునకలైంది. చదవండి: Ind Vs Eng: విరాట్ కోహ్లికి కరోనా పాజిటివ్..? Practice 🔛 Strength and Conditioning Coach, Soham Desai, takes us through Day 1⃣ of #TeamIndia's practice session in Leicester as we build up to the #ENGvIND Test. 💪 pic.twitter.com/qxm2f4aglX — BCCI (@BCCI) June 21, 2022 -
కెప్టెన్‌గా ఓకే రోహిత్.. మరి బ్యాటింగ్ సంగతి ఏంటి ?
స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ అద్భుతంగా రాణించినప్పటికీ.. బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ కేవలం 50 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మపై భారత మాజీ క్రికెటర్ సబా కరీమ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. తన బ్యాటింగ్ కారణంగానే రోహిత్ జట్టులో ఉన్నడాని, కెప్టెన్సీ అనేది కేవలం అదనపు బాధ్యత అని కరీమ్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ తన బ్యాటింగ్ కారణంగా జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్నాడు. "కెప్టెన్సీ అనేది కేవలం అదనపు బాధ్యత మాత్రమే. రోహిత్ బ్యాటింగ్‌పై పట్టును కోల్పోకూడదు. జట్టును నడిసించే అదనపు బాధ్యత కారణంగా కెప్టెన్లు బ్యాటింగ్‌లో రాణించలేకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. రోహిత్ విషయంలో ఇది జరగకూడదు. రోహిత్‌కు కెప్టెన్‌గా ఇది ప్రారంభ దశ మాత్రమే. జట్టుకు తన బ్యాటింగ్ ఎంతో అవసరమో అతడు గ్రహించాలి. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్-2022లో రోహిత్ ప్రదర్శన చాలా కీలకం. అక్కడి గ్రౌండ్లు చాలా పెద్దవిగా ఉంటాయి. ప్రత్యర్ధి జట్టులో అత్యత్తుమ బౌలర్లు ఉంటారు. కాబట్టి వారిని ఎదుర్కొని రోహిత్ ఈ మెగా టోర్నమెంట్లో రాణించాలి" అని సబా కరీమ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం -
రోహిత్ శర్మపై భారత మాజీ సెలక్టర్ సంచలన వ్యాఖ్యలు... కనీసం సెలక్షన్కైనా..
Test Captaincy- Cannot Have Captain Who Gets Injured Start Of Series: టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి వైదొలిగిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు ఎవరా అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ పేరు దాదాపు ఖాయమైపోగా... భారత మాజీ క్రికెటర్లు కొందరు ఈ నిర్ణయం సరైంది కాదని అభిప్రాయపడతున్నారు. వయసు, ఫిట్నెస్ దృష్ట్యా హిట్‌మ్యాన్ సరైన ఆప్షన్ కాదేమోనని పేర్కొంటున్నారు. టీమిండియా మాజీ వికెట్ కీపర్, మాజీ సెలక్టర్ సబా కరీం కూడా ఇదే మాట అంటున్నారు. ఓ యూట్యూట్ చానెల్‌తో మాట్లాడిన ఆయన.. టీమిండియా టెస్టు కెప్టెన్సీ అంశం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉంటాడా? ‘‘రోహిత్ శర్మ తన అద్భుత ప్రదర్శనతో ఎంతో పేరు సంపాదించాడు. తను జట్టుకు ప్రధాన బలం. అయితే తన ముందున్న అసలైన సవాల్ ఏమిటంటే.. ఫిట్నెస్. అవును... అతడు ఫిట్‌గా ఉంటాడో లేదో తెలియదు. కెప్టెన్సీ విషయం పక్కనపెడితే.. అసలు రోహిత్‌కు మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉండటమే అతి పెద్ద టాస్క్. ఇప్పటికే ఎన్నోసార్లు గాయపడ్డాడు. ఇప్పుడిప్పుడే రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి తిరిగి వస్తున్నాడు. ఒకవేళ టెస్టు కెప్టెన్‌గా అతడిని నియమించాలని అనుకుంటే ముందుగా... ఫిట్నెస్ కోచ్, ఫిజియోతో చర్చించాలి. టెస్టు సిరీస్‌కు ముందు తరచుగా గాయపడే ఆటగాడిని సారథిని చేయడం సరికాదు కదా’’ అని పేర్కొన్నారు. ఇక రోహిత్ శర్మను వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లకు కెప్టెన్ చేసినా.. అది స్వల్పకాలానికి పరిమితమవుతుందని సబా కరీం అభిప్రాయపడ్డారు. ‘‘2023 టీమిండియాకు అత్యంత ముఖ్యమైనది. వన్డే వరల్డ్‌కప్ ఆడాల్సి ఉంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ సైకిల్ కూడా ఇదే ఏడాది ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. రోహిత్‌ను అన్ని ఫార్మాట్లకు సారథిని చేసినా.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరైన నాయకుడిని ఎంపిక చేయాలి. ప్రస్తుతానికి రోహిత్ ఒక్కడే ఆప్షన్. ఎందుకంటే.. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ వంటి ఆటగాళ్లు ఇంకా పరిణతి చెందాల్సి ఉంది. వాళ్లను నాయకులుగా తీర్చిదిద్దడానికి కాస్త సమయం పడుతుంది’’ అని సబా కరీం చెప్పుకొచ్చారు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు రోహిత్ శర్మను వన్డే కెప్టెన్‌గా, టెస్టు వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, టూర్ ఆరంభానికి ముందే అతడు గాయపడ్డాడు. ఈ క్రమంలో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత కోహ్లి సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం, రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ నేతృత్వం వహించిన వన్డే సిరీస్‌లో టీమిండియా వైట్‌వాష్‌కు గురికావడం వంటి పరిణామాలు జరిగాయి. ఇక ఇప్పుడు స్వదేశంలో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో రోహిత్ ఫిట్నెస్ అంశం, కెప్టెన్సీ మరోసారి చర్చనీయాంశమయ్యాయి. చదవండి: IND vs WI: అతడు వచ్చేశాడు.. టీమిండియాకు ఇక తిరుగు లేదు: పాక్ మాజీ కెప్టెన్ -
రానున్న దశాబ్ద కాలం రాహుల్‌దే.. కెప్టెన్‌గా అతనికి తిరుగుండదు..!
వాండరర్స్: దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌కు ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చివరి నిమిషంలో అనూహ్యంగా తప్పుకోవడంతో తాత్కాలిక సారధిగా బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్‌పై భారత మాజీ క్రికెటర్ సబా కరీం ప్రశంసల వర్షం కురింపించాడు. రాహుల్ ఇటీవలి కాలంలో ఫార్మాట్లకతీతంగా అద్భుతంగా రాణిస్తున్నాడని, టీమిండియా సారధ్య బాధ్యతలు చేపట్టేందుకు అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని పొగడ్తలతో ముంచెత్తాడు. రానున్న దశాబ్ద కాలం రాహుల్‌దేనని కొనియాడాడు. భవిష్యత్తులో అతను తిరుగులేని నాయకుడిగా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్లు కోహ్లి(టెస్ట్), రోహిత్(వన్డే, టీ20)ల గైర్హాజరీలో రాహుల్‌కు సారధ్య బాధ్యతలు అప్పజెప్పడం సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డాడు. టెక్నిక్‌తో పాటు దూకుడును ప్రదర్శించడంలో రాహుల్ దిట్ట అని.. ప్రస్తుతం కెరీర్ అత్యుత్తమ దశలో కొనసాగుతున్నాడని, ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే భవిష్యత్తులో అతనికి తిరుగుండదని ఆకాశానికెత్తాడు. బ్యాటర్‌గానే కాకుండా సారధిగా కూడా అతను ఇదివరకే నిరూపించుకున్నాడని, ఐపీఎల్లో పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరంచిన తీరే ఇందుకు నిదర్శమన్నాడు. భవిష్యత్తులో రాహుల్‌ను అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా నియమిస్తే.. జట్టును తిరుగులేని శక్తిగా నిలబెట్టడంతో పాటు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్‌గా అవతరిస్తాడని జోస్యం చెప్పాడు. ఈ క్రమంలో ఎవరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులు నెలకొల్పుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కోహ్లి స్ధానంలో విహారి జట్టులోకి వచ్చాడు. తొలి రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. పుజారా(3), రహానే(0)లు వైఫల్యాల పరంపరను కొనసాగించగా.. మయాంక్(37 బంతుల్లో 26; 5 ఫోర్లు) కాస్త పర్వాలేదనిపించినా నిలదొక్కుకునే సమయంలో అవుటయ్యాడు. క్రీజ్‌లో రాహుల్(74 బంతుల్లో 19; 4 ఫోర్లు), విహారి(12 బంతుల్లో 4) ఉన్నారు. సఫారీ బౌలర్లలో ఒలివర్ 2, జన్సెన్ ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. ఇది ప్రతి ఆటగాడి కల! -
Ind Vs Sa: ఇప్పుడు వైస్ కెప్టెన్... భవిష్యత్తులో అతడే కెప్టెన్.. అందుకే..
Saba Karim Praises KL Rahul: టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్‌పై మాజీ క్రికెటర్ సబా కరీం ప్రశంసల జల్లు కురిపించాడు. టీ20, వన్డే, టెస్టు.. మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడని.. దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా అతడి ఎంపిక నూటికి నూరుపాళ్లు సరైందే అన్నాడు. టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ గాయం కారణంగా సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి స్థానంలో విరాట్ కోహ్లికి డిప్యూటీగా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు. ఈ విషయంపై స్పందించిన మాజీ సెలక్టర్ సబా కరీం.. బీసీసీఐ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందన్నాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘దక్షిణాఫ్రికా సిరీస్ నేపథ్యంలో ఆచితూచి.. అన్ని విధాలుగా ఆలోచించి కేఎల్ రాహుల్‌ను టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. విరాట్ కోహ్లికి కూడా రోహిత్ గైర్హాజరీలో ఇదే కరెక్ట్ ఛాయిస్. నిజానికి భవిష్యత్తులో కేఎల్ రాహుల్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ సారథిగా తానేమిటో నిరూపించుకున్నాడు. అంతేకాదు మూడు ఫార్మాట్లలోనూ తన ముద్ర వేస్తున్నాడు. అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నాయకుడిని తయారు చేసే పనిలో భాగంగానే ఈ నియామకం జరిగి ఉండవచ్చు’’ అని ఈ మాజీ వికెట్ కీపర్ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటికే రాహుల్ పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా డిసెంబరు 26 నుంచి భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. చదవండి: SA Vs Ind: ఓవైపు భారత్‌తో సిరీస్.. మరోవైపు హెడ్‌కోచ్‌పై విచారణ Ashes Series 2nd Test: చివరి రోజు 69.5 ఓవర్ల పాటు బ్యాటింగ్... 50.4 ఓవర్లు ఎదుర్కొంది ఆ ఇద్దరే! -
'సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ సాధించడానికి ఇదే సువర్ణావకాశం'
టీమిండియా దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టింది. ఈ పర్యటనలో భాగంగా మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలు భారత్ ఆడనుంది. కాగా ఇంతవరకు సఫారీ గడ్డపై ఒక్క టెస్ట్ సిరీస్ కూడా భారత్ గెలవలేదు. దక్షిణాఫ్రికాలో 7 టెస్ట్ సిరీస్‌లు ఆడిన భారత్ 6 సిరీస్‌లో ఓటమిచెందింది. ఒక్క సిరీస్ డ్రాగా ముగిసింది. ఈ క్రమంలో తొలిసారిగా టెస్ట్ సిరీస్ గెలచి చరిత్ర సృష్టించాలని కోహ్లి సేన ఊవ్విళ్లూరుతోంది. సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26న దక్షిణాఫ్రికా-భారత్ తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు సబాకరీం ఆసక్తికర వాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ తొలి టెస్ట్ సిరీస్‌ను కచ్చితంగా కైవసం చేసుకుంటుందని సబాకరీం జోస్యం చెప్పాడు. ఇటీవలి కాలంలో ప్రోటీస్ జట్టు పెద్దగా రాణించకపోవడం, భారత్‌కు కలిసొస్తోంది అని అతడు అభిప్రాయపడ్డాడు. "రానున్న టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-0 కానీ, 2-1 తేడాతో తప్పనిసరిగా విజయం సాధిస్తుంది. ఇక వన్డేల్లో భారత జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పన అవసరంలేదు. ప్రస్తుత జట్టు అత్యుత్తమైనది. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. అంతేకాకుండా జట్టులో కొంత మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. వారు కూడా ప్రస్తుతం అద్బుతంగా రాణిస్తున్నారు. కాగా ఇటీవలి కాలంలో ప్రోటీస్ జట్టు పెద్దగా రాణించకపోవడంతో, విజయం సాధించడానికి భారత్‌కు ఇదే సువర్ణ అవకాశం" అని కరీం పేర్కొన్నాడు. చదవండి: Steve Smith: 'అర్ధరాత్రి పడుకోకుండా ఇదేం పని బాబు'.. వీడియో వైరల్ -
"హార్ధిక్ పాండ్యా స్ధానాన్ని భర్తీ చేసే ఆటగాడు దొరికేశాడు"
టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా గత కొద్ది కాలంగా పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్-2021లో హార్ధిక్ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. ప్రస్తుత పరిస్ధితుల దృష్ట్యా అతడి అంతర్జాతీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. జట్టులో స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్‌గా ఉన్న హార్ధిక్ స్ధానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న ప్రశ్న అందరిలో మొదలైంది. ఈ క్రమంలో టీమిండియా యువ ఆల్‌రౌండర్ వెంకేటేశ్ అయ్యర్ పేరును భారత మాజీ ఆటగాడు సబా కరీం తెరపైకి తీసుకొచ్చాడు. జట్టులో హార్ధిక్ స్ధానాన్ని భర్తీ చేసే సత్తా అయ్యర్‌కు ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. విజయ్ హాజారే ట్రోఫీలో వెంకేటేశ్ అయ్యర్ అద్భుతంగా రాణిస్తున్నాడని అతడు కొనియాడాడు. అదే విధంగా రోహిత్ శర్మ, రాహుల్‌కు బ్యాకప్ ఓపెనర్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేయాలని అతడు సూచించాడు. "వైట్-బాల్ ఫార్మట్‌లో వెంకటేష్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ బారత సీనియర్ జట్టు జట్టులోకి ఎంపిక అవుతారని నేను భావిస్తున్నాను. 2023 ప్రపంచకప్ దృష్ట్యా ఈ ఇద్దరు ఆటగాళ్లు వీలైనంత త్వరగా జట్టులో భాగం కావాలి. రోహిత్ శర్మ, రాహుల్‌కు బ్యాకప్ ఓపెనర్‌గా రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం ఇవ్వాలి. మరోవైపు, విజయ్ హజారే ట్రోఫీలో 5 స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా స్థానంలో అయ్యర్ సరైన ఆటగాడు" అని కరీమ్ యూట్యాబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో వెంకటేశ్ అయ్యర్.. 112, 71, 151 పరుగులతో సత్తాచాటాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ కూడా హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేసి నాలుగు మ్యాచ్‌ల్లోనే ఏకంగా 435 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. చదవండి: 6 Wickets In A Over: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒకే ఓవర్లో ఆరు వికెట్లు -
"ధావన్‌ని భారత జట్టుకు ఎంపిక చేయకపోవడం బెటర్"
దక్షిణాఫ్రికాతో త్వరలో జరగనున్న వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్ ఎంపిక చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ వికెట్ కీపర్ సబా కరీమ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో వన్డేలకు శిఖర్ ధావన్‌ను భారత్ మినహాయించాలని సబా కరీమ్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే టీమిండియా ఓపెనింగ్ స్ధానానికి తీవ్రమైన పోటీ నెలకొంది, ఈ నేపథ్యంలో ధావన్ జట్టుకు దూరం ఉండడం బెటర్ అని కరీమ్ తెలిపాడు. “ఒక వేళ ధావన్ జట్టులో ఉన్నప్పటికీ, అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దొరుకుతుందా ? కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ టెస్టులు, టీ20ల్లో ఓపెనర్లు కావడంతో వన్డేల్లోనూ ఓపెనింగ్ చేస్తారని నేను భావిస్తున్నాను. ధావన్‌ను జట్టులోకి తీసుకుంటే డగౌట్లో కూర్చుండబెట్టడం తప్ప మరో ఉపయోగం లేదు. అతడిని దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు సెలెక్టర్లు ఎంపిక చేయరని నేను భావిస్తున్నాను" అని కరీమ్ యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. "ధావన్‌కి మళ్లీ జాతీయ జట్టుకు ఆడే అవకాశం రావడం చాలా కష్టం. కానీ ఇటువంటి సీనియర్ ఆటగాడికి మరో అవకాశం ఇవ్వాలని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. మరి సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. అయితే ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హాజారే ట్రోఫిలో కూడా ధావన్ వరుసగా విఫలం అవుతున్నాడు. అతడికి ఇంకా ఈ టోర్నీలో ఒక మ్యాచ్ మాత్రమే ఉంది అని " అతడు పేర్కొన్నాడు. ఇక శ్రీలంక పర్యటనలో భారత యువ జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యం వహించాడు. టీ20 ప్రపంచకప్-2021, స్వదేశాన న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా ధావన్‌కు చోటు దక్కలేదు. ప్రస్తుతం రోహిత్-రాహుల్ ఓపెనింగ్ జోడి అద్బుతంగా రాణిస్తున్నారు. అంతే కాకుండా యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్,పృథ్వీ షా, వెంకటేష్ అయ్యర్లు దేశవాలీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తున్నారు. దీంతో శిఖర్ దావన్ అంతర్జాతీయ కెరీర్ సందిగ్ధంలో పడింది. చదవండి: David Warner: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్.. డేవిడ్ వార్నర్‌కు గాయం -
కోహ్లిని కెప్టెన్‌గా తప్పించడానికి ఇదే అసలు కారణం!
Virat Kohli has been sacked as ODI captain due to his inability to win an ICC trophy: టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్‌గా వన్డేల్లో విరాట్ కోహ్లి శకం ముగిసింది. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు సాబా కరీం అసక్తికర వాఖ్యలు చేశాడు. టీ20 క్రికెట్లో భారత కెప్టెన్సీ నుంచి తప్పకున్న కోహ్లి, వన్డేల్లో సారధిగా కొనసాగాలని భావించాడని కరీం తెలిపాడు. ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేకపోవడమే కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించడానికి ప్రాధాన కారణమని కరీం అభిప్రాయపడ్డాడు. "నిజం చెప్పాలంటే కోహ్లి ఉద్వాసనకు గురయ్యాడు. టీ20 కెప్టెన్సీ భాధ్యతలనుంచి తప్పుకున్నప్పడు.. వన్డే కెప్టెన్సీ గురించి కోహ్లి ఎటువంటి ప్రకటన చేయలేదు. దాని అర్ధం ఏంటింటే.. అతను వన్డే కెప్టెన్‌గా కొనసాగాలని భావించాడు. కానీ కోహ్లి సారథ్యంలో ఇంతవరకు భారత్ ఒక్క ఐసీసీ ట్రోఫి కూడా గెలవలేదు. ఇదే అతడి కెప్టెన్సీను కోల్పోవడానికి ప్రధాన కారణమైంది" అని సాబా కరీం పేర్కొన్నాడు. భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ లేదా బీసీసీఐకి చెందిన ఏదైనా అధికారి కోహ్లితో కెప్టెన్సీ గురించి మాట్లాడి ఉంటారని సాబా కరీం అభిప్రాయపడ్డాడు. ద్రవిడ్.. కోహ్లితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని కరీం తెలిపాడు. కాగా అంతకు ముందు భారత టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడంతో రోహిత్‌ని పూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా నియమించారు. చదవండి: David Warner Wife Candice: నా భర్తకు దూరంగా... నాతో పాటు నా పిల్లలు కూడా... వెక్కి వెక్కి ఏడుస్తూ.. -
రోహిత్, కోహ్లి.. ఇద్దరూ ఒకేసారి క్రీజులో ఉంటేనే అసలు సమస్య..
saba karim comments on virat kohli and Rohit sharma: టీ20ప్రపంచకప్-2021లో నవంబరు 3న కీలక మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ సబా కరీమ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జట్టు క్లిష్ట పరిస్థితిలో పడుతుందని అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే వాళ్లు ఇద్దరూ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభిస్తారని, వాళ్లు ఆటను వేగవంతం చేయడానికి చాలా సమయం పడుతుందని అతడు తెలిపాడు. "భారత్‌కు ఒక పెద్ద సమస్య ఏమిటంటే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ ఒకేలా ఆడతారు. వాళ్ల ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభిస్తారు. వారు మధ్యలో బౌండరీలు లేదా సిక్సర్లు కొట్టడం ద్వారా ఇన్నింగ్స్‌ను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇద్దరూ ఒకేసారి క్రీజులో ఉన్నప్పుడు సమస్య తలెత్తుతుంది. ఎవరూ రిస్కు తీసుకోవడానికి సాహసం చేయరు. కాబట్టి.. సహజంగానే అప్పుడు స్ట్రైక్ రేట్ తగ్గుతుంది. వాళ్ల స్ట్రైక్‌రేట్‌ను మెరుగుపరచకుండానే ఇద్దరూ చాలా బంతులను ఎదుర్కొంటారు. ఇది జట్టుని ఇబ్బందికరమైన స్థితిలో పడేస్తుంది. టీ20 క్రికెట్లో వేగవంతంగా ఆడే ఆటగాళ్లు కావాలి. ముఖ్యంగా భారత్ ఆరంభంలో వికెట్లు కోల్పోయినప్పుడు, వారిద్దరూ నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకోసం చాలా బంతులును వినియోగించుకుంటారు. కేవలం సింగిల్స్ తీయడం ద్వారా స్ట్రైక్ రోటేట్ చేస్తే ఓవర్లో ఆరు పరుగులు కూడా పొందలేరు. కాబట్టి బౌండరీలు వచ్చే విధంగా ఆడాలి" అని సబా కరీమ్ యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: అనుష్క శర్మ 88 బంతుల్లో 52 పరుగులు.. వైరలవుతున్న బీసీసీఐ ట్వీట్