స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ అద్భుతంగా రాణించినప్పటికీ.. బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ కేవలం 50 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మపై భారత మాజీ క్రికెటర్ సబా కరీమ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. తన బ్యాటింగ్ కారణంగానే రోహిత్ జట్టులో ఉన్నడాని, కెప్టెన్సీ అనేది కేవలం అదనపు బాధ్యత అని కరీమ్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ తన బ్యాటింగ్ కారణంగా జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్నాడు.
"కెప్టెన్సీ అనేది కేవలం అదనపు బాధ్యత మాత్రమే. రోహిత్ బ్యాటింగ్‌పై పట్టును కోల్పోకూడదు. జట్టును నడిసించే అదనపు బాధ్యత కారణంగా కెప్టెన్లు బ్యాటింగ్‌లో రాణించలేకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. రోహిత్ విషయంలో ఇది జరగకూడదు. రోహిత్‌కు కెప్టెన్‌గా ఇది ప్రారంభ దశ మాత్రమే. జట్టుకు తన బ్యాటింగ్ ఎంతో అవసరమో అతడు గ్రహించాలి. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్-2022లో రోహిత్ ప్రదర్శన చాలా కీలకం. అక్కడి గ్రౌండ్‌లు చాలా పెద్దవిగా ఉంటాయి. ప్రత్యర్ధి జట్టులో అత్యత్తుమ బౌలర్లు ఉంటారు. కాబట్టి వారిని ఎదుర్కొని రోహిత్ ఈ మెగా టోర్నమెంట్‌లో రాణించాలి" అని సబా కరీమ్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం
Comments
Please login to add a commentAdd a comment