స్వదేశంలో శ్రీలంకతో జరిగే టీ20, టెస్టు సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటన చేసింది. ఈ సిరీస్ లకు రోహిత్ శర్మ కెప్టెన్సీలో మొత్తం 18 మంది ఆటగాళ్లను చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అదే విధంగా భారత టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్‌ను నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇక శ్రీలంకతో టీ20 సిరీస్‌కు విరాట్ కోహ్లి, రిషబ్ పంత్‌కి సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. మధ్యప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ భారత తరుపున టీ20ల్లో అరంగేట్రం చేయనున్నాడు. అదే విధంగా సంజు శాంసన్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు.
మరో వైపు గాయం కారణంగా కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ శ్రీలంకతో సిరీస్‌లకు దూరమయ్యారు. ఇక గాయం కారణంగా కొంత కాలంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి పునరాగమనం చేశాడు. ఇక విండీస్‌తో సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న ఫాస్ట్ బౌలర్ జస్పీత్ర్ బూమ్రా కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక టెస్టు జట్టు విషయానికి వస్తే.. గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సీనియర్ బ్యాటర్లు రహానే, పుజారాలపై సెలెక్టర్లు వేటు వేశారు. అదే విధంగా ఉత్తర ప్రదేశ్ స్పిన్నర్ సౌరభ్ కూమార్ టెస్టుల్లో భారత తరుపున అరంగేట్రం చేయనున్నాడు.
భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, జస్ప్రీత్ బుమ్రా బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్, బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్
భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కెఎస్ భరత్, ఆర్ అశ్విన్ , రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, సౌరభ్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment