Virat Kohli has been sacked as ODI captain due to his inability to win an ICC trophy: టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్‌గా వన్డేల్లో విరాట్ కోహ్లి శకం ముగిసింది. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు సాబా కరీం అసక్తికర వాఖ్యలు చేశాడు. టీ20 క్రికెట్‌లో భారత కెప్టెన్సీ నుంచి తప్పకున్న కోహ్లి, వన్డేల్లో సారధిగా కొనసాగాలని భావించాడని కరీం తెలిపాడు. ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేకపోవడమే కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించడానికి ప్రాధాన కారణమని కరీం అభిప్రాయపడ్డాడు.
"నిజం చెప్పాలంటే కోహ్లి ఉద్వాసనకు గురయ్యాడు. టీ20 కెప్టెన్సీ భాధ్యతలనుంచి తప్పుకున్నప్పడు.. వన్డే కెప్టెన్సీ గురించి కోహ్లి ఎటువంటి ప్రకటన చేయలేదు. దాని అర్ధం ఏంటింటే.. అతను వన్డే కెప్టెన్‌గా కొనసాగాలని భావించాడు. కానీ కోహ్లి సారథ్యంలో ఇంతవరకు భారత్ ఒక్క ఐసీసీ ట్రోఫి కూడా గెలవలేదు. ఇదే అతడి కెప్టెన్సీను కోల్పోవడానికి ప్రధాన కారణమైంది" అని సాబా కరీం పేర్కొన్నాడు.
భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ లేదా బీసీసీఐకి చెందిన ఏదైనా అధికారి కోహ్లితో కెప్టెన్సీ గురించి మాట్లాడి ఉంటారని సాబా కరీం అభిప్రాయపడ్డాడు. ద్రవిడ్.. కోహ్లితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని కరీం తెలిపాడు. కాగా అంతకు ముందు భారత టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడంతో రోహిత్‌ని పూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా నియమించారు.
చదవండి: David Warner Wife Candice: నా భర్తకు దూరంగా... నాతో పాటు నా పిల్లలు కూడా... వెక్కి వెక్కి ఏడుస్తూ..
Comments
Please login to add a commentAdd a comment