Saba Karim Comments On Saurabh Tiwari: ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేజ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ముంబై బ్యాట్స్‌మన్‌లో సౌరభ్ తివారీ(50) పోరాట పటిమను చూపిస్తూ అర్ధసెంచరీతో ఆజేయంగా నిలిచాడు. అయినప్పటకీ ముంబైను విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఈ సందర్భంగా సౌరభ్ తివారీపై భారత మాజీ వికెట్ కీపర్ సబా కరీమ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. తివారీ చాలా ప్రతిభ కలిగిన ఆటగాడు అని.. అతడు తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలని సబా కరీమ్ తెలిపాడు.
"నేను తివారీ ఫిటినెస్‌లో ఎటువంటి మార్పులను చూడలేదు. అతడు ఆడటం ప్రారంభించిన రోజు నుంచి తన టాలెంట్‌ని మేము చూశాము. నిన్న కూడా అతడు ఎంత ప్రతిభావంతుడో చూశాం. కానీ తివారీ డైట్ మీద దృష్టి పెట్టాలి, ఫిట్‌నెస్ స్థాయిలను కూడా మెరుగుపరచాలి" కరీమ్ పేర్కొన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై హాఫ్ సెంచరీ సాధించందినందకు తివారీను అతడు ప్రశంసించాడు. అంతర్జాతీయ క్రికెటర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంటే చాలా కష్టపడాల్సి ఉంటుందిని కరీమ్ అన్నాడు. కాగా 2010లో భారత్ తరుపున అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరేంగట్రం చేసిన సౌరభ్ తివారీ కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడాడు.
చదవండి: IPL 2021 2nd Phase RCB Vs KKR: ఆర్సీబీకి ఆదిలోనే భారీ షాక్.. కెప్టెన్ కోహ్లి(5) ఔట్
Comments
Please login to add a commentAdd a comment