MI Vs SRH: ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన మహ్మద్‌ నబీ | Mohammad Nabi Took 5 Catches Today The Most by a Non Keeper in IPL | Sakshi
Sakshi News home page

MI Vs SRH: ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన మహ్మద్‌ నబీ

Published Fri, Oct 8 2021 11:02 PM | Last Updated on Sat, Oct 9 2021 10:53 AM

Mohammad Nabi Took 5 Catches Today The Most by a Non Keeper in IPL - Sakshi

PC: IPL

Mohammad Nabi Took 5 Catches New Record: ముంబై ఇండియన్స్‌తో అబుదాబిలో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఆల్‌రౌండర్‌  మహ్మద్‌ నబీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన నాన్‌ వికెట్‌ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో నబీ ఐదు క్యాచ్‌లు అందుకున్నాడు. కాగా మ్యాచ్‌ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్‌ భారీ స్కోరు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (84) సూర్యకుమార్‌ యాదవ్‌(82) పరుగులతో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించడంతో ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. 

ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి... 193 పరుగులు మాత్రమే చేసింది. తద్వారా మరోసారి ఓటమిని మూటగట్టుకుని... ఆఖరి స్థానంతో లీగ్‌ను ముగించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ముంబై ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ నిలిచాడు.

స్కోర్లు:
ముంబై: 235/9 (20)
హైదరాబాద్‌: 93/8 (20)

చదవండి: ఉమ్రాన్ మాలిక్‌ మరోసారి అత్యంత ఫాస్ట్‌బాల్‌; సూర్యకుమార్‌ విలవిల
SRH Vs MI: ఇద్దరే 166 బాదారు.. ఒక్క మ్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించారు
RCB Vs DC: భళా భరత్‌... చివరి బంతికి సిక్సర్‌తో గెలిపించిన ఆంధ్ర బ్యాట్స్‌మెన్‌!

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement