Catches
-
జో రూట్ డబుల్ సెంచరీ
లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. రూట్ ఇదే మ్యాచ్‌లో ఓ డబుల్ సెంచరీ కూడా సాధించాడు. అదెలా అనుకుంటున్నారా..? ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో నిషన్ మధుష్క, పథుమ్ నిస్సంక క్యాచ్‌లు పట్టుకున్న రూట్.. టెస్ట్‌ల్లో 200 క్యాచ్‌ల అరుదైన మైలురాయిని తాకాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో రూట్ సహా కేవలం నలుగురు నాన్ వికెట్కీపర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. టెస్ట్‌ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న నాన్ వికెట్‌కీపర్ ఫీల్డర్‌గా ద్రవిడ్ (210 క్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక మాజీ మహేళ జయవర్దనే (205) రెండో స్థానంలో.. రూట్, కల్లిస్ (200) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ పట్టు బిగించింది. ఈ మ్యాచ్‌లో లంక నెగ్గాలంటే మరో 291 పరుగులు చేయాల్సి ఉంది. ఆ జట్టు చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. నాలుగో రోజు రెండో సెషన్ సమయానికి శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. చండీమల్ (58), ధనంజయ డిసిల్వ (11) క్రీజ్‌లో ఉన్నారు. లంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో దిముత్ కరుణరత్నే (55) అర్ద సెంచరీతో రాణించగా.. ఏంజెలో మాథ్యూస్ (36) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ స్టోన్ 2, షోయబ్ బషీర్, అట్కిన్సన్, వోక్స్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు రూట్ శతక్కొట్టడంతో ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 251 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 196 పరుగులకు ఆలౌటైంది. రూట్‌తో పాటు (143) అట్కిన్సన్ (118) సెంచరీ చేయడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 427 పరుగులు చేసింది. అశిత ఫెర్నాండో ఐదు వికెట్లు పడగొట్టాడు. -
IPL 2024: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్‌లో రియాన్ పరాగ్ క్యాచ్ పట్టడం ద్వారా ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఈ క్యాచ్‌తో విరాట్ ఐపీఎల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన నాన్ వికెట్‌కీపర్ ఫీల్డర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో విరాట్ మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా రికార్డును బద్దలుకొట్టాడు. ఐపీఎల్లో రైనా 205 మ్యాచ్‌ల్లో 109 క్యాచ్‌లు పట్టగా.. విరాట్ 242 మ్యాచ్‌ల్లో 110 క్యాచ్‌లు పట్టి క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా అవతరించాడు. కోహ్లి, రైనా తర్వాత ఐపీఎల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఘనత కీరన్ పోలార్డ్‌కు దక్కింది. పోలార్డ్ 189 మ్యాచ్‌ల్లో 103 క్యాచ్‌లు అందుకున్నాడు. వీరి తర్వాత రోహిత్ శర్మ (99), శిఖర్ ధవన్ (98) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విరాట్ మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు (9) చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి (గేల్ 22, బాబర్ ఆజమ్ 11 తర్వాత) ఎగబాకాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు (8) చేసిన ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఐపీఎల్లో విరాట్ చేసిన సెంచరీలు.. 2016లో గుజరాత్ లయన్స్‌పై 63 బంతుల్లో 100 నాటౌట్ 2016లో పూణేపై 58 బంతుల్లో 108 నాటౌట్ 2016లో గుజరాత్ లయన్స్‌పై 55 బంతుల్లో 109 2016లో కింగ్స్ పంజాబ్‌పై 50 బంతుల్లో 113 2019లో కేకేఆర్‌పై 58 బంతుల్లో 100 2023లో సన్‌రైజర్స్‌పై 63 బంతుల్లో 100 2023లో గుజరాత్ టైటాన్స్‌పై 61 బంతుల్లో 101 నాటౌట్ 2024లో రాజస్థాన్ రాయల్స్‌పై 72 బంతుల్లో 113 నాటౌట్ ఇదిలా ఉంటే, రాయల్స్‌తో మ్యాచ్‌లో విరాట్ సెంచరీ చేసినా ఆర్సీబీ ఓటమిపాలైంది. జోస్ బట్లర్ మెరుపు శతకం చేసి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో (72 బంతుల్లో 113 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) కదంతొక్కడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. డుప్లెసిస్ (44) రాణించాడు. రాయల్స్ స్పిన్నర్లు అశ్విన్ (4-0-28-0), చహల్ (4-0-34-2) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. బట్లర్ సుడిగాలి శతకంతో (58 బంతుల్లో 100 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకపడటంతో మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. బట్లర్‌తో పాటు సంజూ శాంసన్ (42 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. రాయల్స్ విజయానికి ఆరు బంతుల్లో ఒక్క పరుగు చేయాల్సిన తరుణంలో బట్లర్ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకుని మ్యాచ్‌ను ముగించాడు. ఈ విజయంతో రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. తాజా ఓటమితో ఆర్సీబీ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. -
చరిత్ర సృష్టించిన ధోని.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. టీ20 క్రికెట్లో 300 వికెట్లలో భాగమైన తొలి వికెట్ కీపర్‌గా ధోని నిలిచాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా క్యాచ్‌ను అందుకున్న ధోని.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ జాబితాలో మరే వికెట్ కీపర్ కూడా ధోనీకి దరిదాపుల్లో కూడా లేరు. ఈ జాబితాలో ధోనీ(300) అగ్రస్థానంలో ఉండగా.. కమ్రాన్ అక్మల్(274), దినేశ్ కార్తీక్(274) రెండో స్థానంలో కొనసాగుతున్నారు. క్వింటన్ డికాక్(270), జోస్ బట్లర్(209) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఢిల్లీ చేతిలో 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సీఎస్కే ఓటమిపాలైనప్పటికి.. ఎంఎస్ ధోని మాత్రం మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 16 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మిస్టర్ కూల్.. 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. -
రాక్షస అనకొండ..అలా.. ఎలా సామీ: వైరల్ వీడియో
మామూలు పాము అంటేనే ఆమడ దూరం పారిపోతాం. ఇక అనకొండను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. వన్య ప్రాణ సంరక్షణ కార్యకర్తలు, జూ సంరక్షకులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటారు. ఎంతటి క్రూర మృగాలైనా వాటిని మచ్చిక చేసుకుని, వాటితో స్నేహంగా ఉంటారు. కానీ ఒక భారీ అనకొండను నిర్భయంగా ఉత్తి చేతులతో అలా అలవోకగా, మేనేజ్ చేసిన వీడియో తాజాగా నెట్టింట్ సందడి చేస్తోంది. అతని అసాధారణ సాహసానికి, నైఫుణ్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ విడియో వైరల్‌గా మారింది. ఫ్లోరిడాలోని మియామికి చెందిన జూ కీపర్ మైక్ హోల్స్టన్ Instagramలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. తనను తాను ది రియల్ టార్జాన్, ది కింగ్ ఆఫ్ ది జంగిల్ అని చెప్పుకునే హోల్స్టన్ తరచుగా వన్యప్రాణులకు సంబంధించిన చాలా ఆసక్తికరమైన వీడియోలను చాలా షేర్ చేస్తూ ఉంటాడు. ఇది కూడా అలాంటిదే. నీటిలో దాగి వున్న ఈ భారీ అనకొండను జాగ్రత్తగా సమీపించి, మెల్లిగా వెళ్లి, చటుక్కున దాని తలను ఒడిసిపట్టుకోవడంతో ఈ వీడియో మొదలవుతుంది. సాధారణంగా అనకొండ ఎంత బలిష్టమైన వారినైనా తన పట్టుతో లొంగదీసుకుంటుంది. కానీ తన నైపుణ్యంతో బలీయమైన అనకొండను పట్టుకోవడం, దానిపై నియంత్రణ సాధించడం,చివర్లో దాని ముద్దు పుట్టుకోవడం విశేషంగా నిలిచింది. దీన్ని లొంగదీసుకున్న వైనం అందర్నీ షాక్‌కు గురిచేస్తుంది. ఈ వీడియోను ఆ సాంతం గుడ్లప్పగించి, ఉత్కంఠగా చూస్తారు. వాట్ యాన్ ఎక్స్పిడిషన్ వెనిజులాకు మాన్స్టర్ అనకొండను విజయవంతంగా పట్టుకున్నాం అనే క్యాప్షన్‌తో దీన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 5 రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియో 11.2 మిలియన్లకు పైగా వ్యూస్‌లను సాధించింది. మూడు లక్షలకు కమెంట్లను సాధించింది. బహుశా ఈ గ్రహం మీద అత్యంత ధైర్యవంతుడు అంటూ కమెంట్లు వెల్లువెత్తాయి. View this post on Instagram A post shared by Mike Holston (@therealtarzann) Homie caught a huge anaconda! 👀 @therealtarzann Download the Topmixtapes app for Android to stay updated: https://t.co/vpyvPCzn45 Download the Topmixtapes app for iOS to stay updated: https://t.co/tk3g7a7reZ pic.twitter.com/1P7IH2YREb — TopMixtapes.com (@topmixtapescom) November 16, 2023 -
CWC 2023 ENG VS AFG: వరల్డ్‌కప్ రికార్డును సమం చేసిన రూట్
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 15) జరుగుతున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ ఓ వరల్డ్‌కప్ రికార్డును సమం చేశాడు. బ్యాటర్, బౌలర్ మాత్రమే కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరైన రూట్.. ఈ మ్యాచ్‌లో ఏకంగా నాలుగు క్యాచ్‌లు పట్టి, వరల్డ్‌కప్ మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు ఆందుకున్న నాన్ వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో మొహమ్మద్ కైఫ్ (2003లో శ్రీలంకపై), సౌమ్య సర్కార్ (2015లో స్కాట్లాండ్పై), ఉమర్ అక్మల్ (2015లో ఐర్లాండ్‌పై), క్రిస్ వోక్స్ (2019లో పాకిస్తాన్‌పై)లు వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో నాలుగు క్యాచ్‌లు పట్టిన నాన్ వికెట్కీపర్లుగా ఉన్నారు. తాజా ప్రదర్శనతో రూట్ వీరి సరసన చేరాడు. ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో రూట్ నాలుగు క్యాచ్‌లు పట్టడంతో పాటు ఓ వికెట్ కూడా పడగొట్టాడు. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ షాహీదిని రూట్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రూట్ పట్టిన రషీద్ ఖాన్ క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. లాంగ్ ఆన్‌లో పరిగెత్తుకుంటూ వచ్చి తన కుడిపక్కకు డైవ్ చేస్తూ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు రూట్. View this post on Instagram A post shared by ICC (@icc) కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ (57 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆఖర్లో ఇక్రమ్ అలీఖిల్ (66 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (28), రషీద్ ఖాన్ (23), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (28) రాణించడంతో ఆ జట్టు 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు ఇది రెండో అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4-0-41-0), మార్క్ వుడ్ (9-0-50-2), సామ్ కర్రన్ (4-0-46), రీస్ టాప్లే (8.5-1-52-1) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. ఆదిల్ రషీద్ (10-1-42-3), లియామ్ లివింగ్‌స్టోన్ (10-0-33-1), జో రూట్ (4-0-19-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు. అనంతరం 285 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బెయిర్‌స్టోను (2) ఫజల్ హక్ ఫారూఖీ.. రూట్‌ను (11) ముజీబ్ ఔట్ చేశారు. 7 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 33/2గా ఉంది. డేవిడ్ మలాన్ (19), హ్యారీ బ్రూక్ క్రీజ్‌లో ఉన్నారు. -
ENG VS NZ 2nd ODI: ఇదెక్కడి క్యాచ్ రా సామీ.. ఫ్యూజులు ఎగిరిపోయాయి..!
సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య నిన్న (సెప్టెంబర్ 10) జరిగిన రెండో వన్డేలో రెండు అద్భుతమైన క్యాచ్‌లు అభిమానులకు కనువిందు చేశాయి. ఇందులో మొదటిది బౌల్ట్ బౌలింగ్‌లో సాంట్నర్ పట్టగా (బెయిర్‌స్టో).. రెండోది సౌథీ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ (మొయిన్ అలీ) అందున్నాడు. సాంట్నర్ గాల్లోకి పైకి ఎగురుతూ ఒంటిచేత్తో పట్టుకున్న క్యాచ్ అద్భుతమైతే.. అసాధ్యమైన క్యాచ్‌ను పట్టుకున్న ఫిలిప్స్ అత్యద్భుతం. Some catch 👏 Jonny Bairstow is forced to depart early...#EnglandCricket | #ENGvNZ pic.twitter.com/hrB15EWVgt — England Cricket (@englandcricket) September 10, 2023 మొయిన్ అలీ బ్యాట్ లీడింగ్ ఎడ్జ్ తీసుకుని బంతి గాల్లోకి లేవగా, చాలా దూరం నుంచి పరిగెడుతూ వచ్చి గాల్లోకి డైవ్ చేస్తూ ఫిలిప్స్ ఈ క్యాచ్‌ను అందకున్నాడు. రిస్క్‌తో కూడుకున్న ఈ క్యాచ్‌ను పట్టుకుని ఫిలిప్స్ పెద్ద సాహసమే చేశాడు. క్యాచ్ పట్టే క్రమంలో ఒకవేళ అటుఇటు అయివుంటే అతను తీవ్రంగా గాయపడేవాడు. అయితే ఫిలిప్స్ ఎంతో చాకచక్యంగా, ఎలాంటి దెబ్బలు తగిలించుకోకుండా ఈ క్యాచ్‌ను అందుకుని అందరి మన్ననలు అందుకున్నాడు. Glenn Phillips ... Flying bird ...#ENGvNZ pic.twitter.com/Y1h08pWRE8 — Manikanta Aravind (@MA_Aravind) September 10, 2023 ఈ రెండు క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి. నెటిజన్లు సాంట్నర్ క్యాచ్‌తో పోలిస్తే ఫిలిప్స్ క్యాచ్‌కు ఎక్కువగా ఫిదా అవుతున్నారు. వారు ఫిలిప్స్‌ను ఫ్లయింగ్ బర్డ్‌తో పోలుస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నా, ఆ జట్టు మాత్రం 79 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. లివింగ్‌స్టోన్ (95 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లు బౌల్ట్ 3, సౌథీ 2, హెన్రీ, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 227 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్.. ఇంగ్లీష్ బౌలర్లు డేవిడ్ విల్లే (3/34), రీస్ టాప్లే (3/27), మొయిన్ అలీ (2/30), అట్కిన్సన్ (1/23) ధాటికి 26.5 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. కివీస్ ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్ (57) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
పరుగులే కాదు క్యాచ్‌ల విషయంలోనూ రికార్డులే
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో జైశ్వాల్ క్యాచ్ అందుకోవడం ద్వారా ఐపీఎల్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న ఫీల్డర్‌గా(నాన్-వికెట్‌కీపర్) కోహ్లి రెండోస్థానానికి ఎగబాకాడు. ఈ నేపథ్యంలో కీరన్ పొలార్డ్ 103 క్యాచ్‌ల రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. ప్రస్తుతం కోహ్లి 104 క్యాచ్‌లతో రెండో స్థానంలో ఉండగా.. 109 క్యాచ్‌లతో సురేశ్ రైనా తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆర్సీబీతో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఘోర ప్రదర్శన చేసింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 59 పరుగులకే కుప్పకూలింది. వేన్ పార్నెల్ మూడు వికెట్లు పడగొట్టగా.. కర్ణ్ శర్మ, బ్రాస్‌వెల్ తలా రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, మ్యాక్స్‌వెల్‌లు చెరొక వికెట్ తీశారు. ఈ క్రమంలో రాజస్తాన్ ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ఓటమిని మూటగట్టుకుంది. కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్‌లు చెలరేగి ఆడడంతో భారీ విజయం దక్కించుకున్న అదే రాజస్తాన్ తాజాగా ఆర్సీబీతో మాత్రం ఘోర ఓటమి చవిచూసింది. చదవండి: #AnujRawat: తొలిసారి తన పాత్రకు న్యాయం చేశాడు -
RCB VS RR: కోహ్లి సెంచరీ కొట్టాడు.. గోల్డెన్ డకౌట్ అయిన మ్యాచ్‌లోనే..!
రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్‌లో తానెదుర్కొన్న తొలి బంతికే డకౌటైన విరాట్ కోహ్లి.. ఫీల్డర్‌గా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో 100 క్యాచ్‌లు పూర్తి చేసుకున్న మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. నిన్నటి మ్యాచ్‌లో దేవ్‌దత్ పడిక్కల్ క్యాచ్ పట్టడం ద్వారా ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో మరో క్యాచ్ (యశస్వి జైస్వాల్) కూడా పట్టిన కోహ్లి.. 230 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 101 క్యాచ్‌లు అందుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక క్యాచ్‌ల రికార్డు సురేశ్ రైనా పేరిట ఉంది. రైనా 205 మ్యాచ్‌ల్లో 109 క్యాచ్‌లు అందుకోగా.. రెండో స్థానంలో ఉన్న కీరన్ పోలార్డ్ 189 మ్యాచ్‌ల్లో 103 క్యాచ్‌లు పట్టాడు. వీరిద్దరి తర్వాత కోహ్లి మూడో స్థానంలో, రోహిత్ శర్మ (98 క్యాచ్‌లు), శిఖర్ ధవన్ (93) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇక ఇదే మ్యాచ్‌లో మరో ఆటగాడు కూడా కోహ్లిలాగే సెంచరీ చేశాడు. అది కూడా కోహ్లినే ఔట్ చేసి సెంచరీ మార్కును అందుకున్నాడు. రాజస్థాన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కోహ్లి వికెట్ పడగొట్టడం ద్వారా ఐపీఎల్లో 100 వికెట్ల మార్కును అందుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తం 84 మ్యాచ్‌లు ఆడిన బౌల్ట్.. 101 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (62), మ్యాక్స్‌వెల్ (77) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 189 పరుగులు చేయగా,. ఛేదనలో తడబడిన ఆర్ఆర్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి, ఓటమిపాలైంది. -
వైరల్ వీడియో : సముద్రంలో ఎగురుతున్న డ్రోన్‌ను పట్టుకున్న ఎలిగేటర్
-
బంగ్లాపై టీమిండియా విజయం.. విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు
Virat Kohli: చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పుజారా (90, 102 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (20, 110), శ్రేయస్ అయ్యర్ (86), రవిచంద్రన్ అశ్విన్ (58), కుల్దీప్ యాదవ్ (40, 5/40, 3/73), అక్షర్ పటేల్ (1/10, 4/77) రాణించడంతో రాహుల్ సేన బంగ్లాదేశ్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించింది. ఫలితంగా 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 22 నుంచి ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో 8వ స్థానానికి ఎగబాకాడు. బంగ్లా సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జకీర్ హసన్ క్యాచ్ పట్టడంతో అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి క్యాచ్‌ల సంఖ్య 291కి చేరింది. మూడు ఫార్మాట్లలో 482 మ్యాచ్‌ల్లో 572 ఇన్నింగ్స్‌ల్లో బరిలోకి దిగిన కోహ్లి ఈ ఫిగర్‌ను చేరుకున్నాడు. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్ధనే (768 ఇన్నింగ్స్‌ల్లో 440 క్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (364), న్యూజిలాండ్ మాజీ సారధి రాస్ టేలర్ (351), సౌతాఫ్రికా లెజెండరీ ఆల్‌రౌండర్ జాక్ కలిస్ (338), ద వాల్ రాహుల్ ద్రవిడ్ (334), న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (306), సఫారీ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (292)లు కోహ్లి కంటే ముందున్నారు. కోహ్లి ఈ ఫీట్ సాధించడంతో అతని అభిమానులు సంబురపడిపోతున్నారు. రన్‌మెషీన్, కింగ్ కోహ్లి, క్యాచింగ్‌లోనూ కింగే అంటూ సంకలు గుద్దుకుంటున్నారు. -
ఎంత పని చేశావు విహారి.. ఆ ఒక్క క్యాచ్ పట్టి ఉంటే..!
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2లో సమమైంది. కాగా 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ విజయంలో బెయిర్ స్టో(114), రూట్(142) పరుగులతో కీలక పాత్ర పోషించారు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ భారత్ తీవ్రంగా నిరాశ పరిచింది. ఇంగ్లండ్ విజయంలో హీరోగా నిలిచిన జానీ బెయిర్ స్టో ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను.. సెకెండ్ స్లిప్‌లో హనుమా విహారి జారవిడిచాడు. ఈ తప్పిదానికి భారత్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బతికిపోయిన బెయిర్ స్టో.. ఏకంగా సెంచరీతో చెలరేగాడు. ఇక సులభమైన క్యాచ్ విడిచి పెట్టిన విహారిపై భారత అభిమానులు మండిపడుతున్నారు. ట్విటర్ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. "ఎంత పనిచేశావు విహారి.. క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది" అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్ వివరాలు.. టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 378/3 ఫలితం: భారత్‌పై ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం చదవండి: IND Vs ENG 5th Test: భారత్‌పై ఇంగ్లండ్ సూపర్ విక్టరీ.. సిరీస్ సమం Hanuma vihari dropped catch of Jonny bairstow. #hanumavihari #Vihari dropped catch of #JonnyBairstow #INDvsENG #INDvENG pic.twitter.com/YVp40t0zNs — Shribabu Gupta (@ShribabuG) July 5, 2022 -
ఇదేందయ్యా ఇది.. క్యాచ్ పట్టడానికి ప్రయత్నించిన అంపైర్.. వీడియో వైరల్!
కొలంబో వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఆరు వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఫీల్డర్‌కు బదులు అంపైర్ క్యాచ్ పట్టడానికి ప్రయత్నించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఆలెక్స్ క్యారీ షార్ట్ పిచ్ బాల్‌ను స్వ్కేర్ లెగ్ దిశగా ఆడాడు. కాగా స్క్వేర్-లెగ్‌లో అంపైర్‌గా ఉన్న కుమార్ ధర్మసేన క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించాడు. అయితే తను ఫీల్డర్ కాదని అంపైర్ అని గ్రహించి అఖరి క్షణంలో ధర్మసేన తన చేతులను వెనక్కి తీసుకున్నాడు. దీంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు అంతా ఒక్క సారిగా నవ్వుకున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అంపైర్ పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ధర్మసేన ఇప్పుడు అంపైర్‌గా కాదు శ్రీలంక ఆటగాడిగా ఫీలవుతున్నారని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంక 2-1తో ఆదిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్లు మద్య నాలుగో వన్డే కొలంబో వేదికగా మంగళవారం జరగనుంది. చదవండి: IND vs ENG 5th Test: రవిచంద్రన్ అశ్విన్ కు కరోనా పాజిటివ్.. తగ్గాకే ఇంగ్లండ్‌కు..! Kumar Dharmasena going for a catch in SL vs Aus Odi match pic.twitter.com/DYyxn6kEsy — Sportsfan Cricket (@sportsfan_cric) June 20, 2022 -
టీ20ల్లో రోహిత్ శర్మ స్పెషల్ రికార్డు.. తొలి భారత ఆటగాడిగా!
రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు విజయ పథంలో దూసుకుపోతుంది. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో విజయం సాధించిన భారత్.. వరుసగా మూడో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్పెషల్ రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్ చండీమాల్ క్యాచ్ పట్టిన రోహిత్.. టీ20ల్లో 50 క్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. అయితే అంతర్జాతీయ టీ20ల్లో 50 క్యాచ్‌లు పట్టిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ రికార్డులెక్కాడు. 50 క్యాచ్‌లతో రోహిత్ తొలి స్దానంలో ఉండగా.. విరాట్ కోహ్లి 44 క్యాచ్‌లతో రెండో స్దానంలో ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా ప్రపంచంలో రోహిత్ నాలుగో స్ధానంలో నిలిచాడు. అదే విధంగా రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును కూడా ఈ మ్యాచ్‌లో సాధించాడు. స్వదేశంలో టి20 కెప్టెన్‌గా 16వ విజయం సాధించిన హిట్ మ్యాన్.. స్వదేశంలో కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన తొలి కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. చదవండి: IND vs SL: శ్రీలంకతో మూడో టీ20.. టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం! -
క్యాచ్ పట్టిన ఫీల్డర్ సెలెబ్రేషన్స్ వేరే లెవల్.. చివర్లో ట్విస్ట్ అదిరిపోయిందిగా
సాధారణంగా ఏదైనా మ్యాచ్‌లో క్యాచ్ పడితే ఫీల్డర్ సెలెబ్రేషన్స్ వేరే విధంగా ఉంటాయి. అయితే పట్టిన క్యాచ్ నోబాల్ అయితే.. ఫీల్డర్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఊహించవచ్చు. అచ్చెం ఇటువంటి సంఘటనే యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో చోటు చేసుకుంది. యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో భాగంగా బ్రెస్సియా క్రికెట్ క్లబ్, టర్కీ జైటిన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. బ్రెస్సియా ఇన్నింగ్స్‌లో చాలా ఈజీ క్యాచ్‌లను టర్కీ ఫీల్డర్లు జారవిడిచారు. అయితే బ్రెస్సియా ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన అభిషేక్ కుమార్ బౌలింగ్‌లో.. బాబర్ హుస్సేన్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్ క్యాచ్‌గా అందుకున్నాడు. క్యాచ్ పట్టిన ఆనందంలో ఫీల్డర్ సెలెబ్రేషన్లో మునిగిపోయాడు. అయితే అతడు ఆనందం కొంత సమయం మాత్రమే మిగిలింది. ఎందుకంటే సదరు ఫీల్డర్ క్యాచ్ పట్టిన బంతిను అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. దీంతో అతడికి ఒక్క సారిగా గుండె జారినంత పనైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను యూరోపియన్ క్రికెట్ ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Ind Vs SL T20I: ఓపెనర్లుగా వారిద్దరు.. రోహిత్‌కి నో ఛాన్స్! When your team finally hold onto a catch... 🥳 But it's a free-hit 😭 So many emotions in one ball! 😂 #ECL2022 pic.twitter.com/HoJxGc8tJJ — European Cricket (@EuropeanCricket) February 23, 2022 -
బుసలు కొడుతూ పైకి లేచిన 14 అడుగుల కింగ్ కోబ్రా..
బ్యాంకాక్: సాధారణంగా చాలా మంది పాముని చూడగానే భయంతో వెన్నులో వణుకుపుడుతుంది. మరికొందరైతే పాము ఫలాన చోట కనిపించిందంటే.. ఆ దారిదాపుల్లోకి వెళ్లటానికి సాహసించరు. అయితే, ఒక్కొసారి పాములు తమ దారి తప్పి ఆవాసం కోసం, ఆహర అన్వేషణలో జనవాసాల మధ్యన చేరుతుంటాయి. ఇలాంటి సమయాల్లో ఆత్మరక్షణకు ఒక్కొసారి అవి కాటు వేస్తాయి. మరికొన్నిసార్లు అవి కూడా ప్రమాదాల బారిన పడతాయి. కొందరు పాములు కనిపిస్తే.. స్నేక్ సోసైటి వారికి సమాచారం అందించి వాటిని ఏ ఆపద తలపెట్టరు. ఇలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా, ఇలాంటి ఘటన ఒకటి థాయిలాండ్‌లో జరిగింది. దక్షిణ థాయి ప్రావిన్స్‌లో క్రాబీలోని ఒక తోటలో గిరినాగు ( కోబ్రా) ప్రత్యక్షమయ్యింది. దీంతో అక్కడి వారంతా భయంతో వణికిపోయారు. అది దాదాపు 14 అంగుళాల వరకు పోడవుంది. స్థానికులు వెంటనే పాములను పట్టే వారికి సమాచారం అందించారు. అయితే, నైవాధ్ అనే వ్యక్తి ఆ ప్రదేశంలో పాములను పడుతుంటాడు. అతను అక్కడికి చేరుకున్నాడు. ఆ తర్వాత కోబ్రాను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. గిరినాగు మాత్రం బుసలు కొడుతూ.. ఎంత సేపటికి అతనికి లొంగలేదు. అతను పట్టుకుందామనుకోనేసరికి బుసలు కొడుతూ.. కాటు వేయడానికి రాసాగింది. దాదాపు 20 నిముషాలు కష్టపడి చాకచక్యంగా కోబ్రాను లొంగతీసుకున్నాడు. ఆ తర్వాత నైవాధ్.. కోబ్రా.. ప్రపంచంలో అత్యంత విషపూరిత సర్పమని తెలిపాడు. ఇది పెద్ద పాములను సైతం తింటుందని తెలిపాడు. అత్యంత వేగంగా కూడా ప్రయాణిస్తుందని, కాటు వేస్తే తక్కువ సమయంలోనే మనిషి ప్రాణాలు గాల్లో కలుస్తాయని వివరించాడు. ఆ తర్వాత కోబ్రాను సమీపంలోని అడవిలో వదిలేశాడు. ఇవి దక్షిణ, ఆగ్నేయ ఆసియాలో ఎక్కువగా కనిపిస్తాయి. కాగా, అతను కోబ్రాను పట్టేటప్పుడు స్థానికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఎంత భయంకరంగా ఉంది..’, ‘కాటు వేస్తే.. అంతే సంగతులు..’, ‘మీ ధైర్యానికి జోహర్లు..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వంతెనను ప్రారంభించిన మహరాష్ట్ర మంత్రి.. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా -
ఒక్కరు కాదు ముగ్గురు క్యాచ్ పట్టారు.. ఊహించని ట్విస్ట్
South Australia Fielders Trying To Bizarre Catch: ఆస్ట్రేలియాలో జరుగుతున్న మార్ష్ కప్ టోర్నమెంట్లో బుధవారం జరిగిన దక్షిణ ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓ క్యాచ్‌ను పట్టేందుకు ముగ్గురు ఫీల్డర్స్ ప్రయత్నించారు. చివరకి ఏమి జరిగిందో మీకు తెలుసా.. క్వీన్స్‌ల్యాండ్ ఇన్నింగ్స్ 36 వ ఓవర్ వేసిన బ్రెండన్ డాగెట్ బౌలింగ్‌లో మైఖేల్ నాసర్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించగా.. అది మిస్ టైమ్ అయ్యి బంతి గాల్లోకి లేచింది. ఇక క్యాచ్ పట్టుకునేందకు ముగ్గురు ఫీల్డర్స్ బౌండరీ లైన్ వైపు పరిగెత్తారు. వీరిలో ఓ ఫీల్డర్ ఆ క్యాచ్‌ను అందుకున్నా.. అతడు అదుపు తప్పి బౌండరీ లైన్ దాటడంతో బంతిని గాల్లోకి విసిరేశాడు. మరో ఫీల్డర్ దాన్ని అందుకున్నప్పటికి .. అతడు కూడా అదుపు తప్పి బౌండరీ లైన్ దాటడంతో బంతిని గాల్లోకి విసిరేశాడు. ఈ క్రమంలో మూడో ఫీల్డర్ కూడా బంతిని అందుకునే క్రమంలో బౌండరీ లైన్ దాటేశాడు. చివరికి వీరి ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో అంపైర్ దాన్ని సిక్స్‌గా ప్రకటించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా 48 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆస్ట్రేలియా 392 పరుగుల భారీ లక్ష్యాన్ని క్వీన్స్లాండ్ ముందట ఉంచింది. 392 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన క్వీన్స్లాండ్ 40 ఓవర్లలో 312 పరుగులకే ఆలౌటైంది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 67 పరుగుల తేడాతో సౌత్ ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇదే మ్యాచ్‌లో సౌత్ ఆస్ట్రేలియా కెప్టెన్ ట్రెవీస్ హెడ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. Trying to salvage something out of 2021 😝 #MarshCup pic.twitter.com/WLxxeCHeWL — cricket.com.au (@cricketcomau) October 13, 2021 చదవండి: T20 World Cup 2021: హార్దిక్ పాండ్యా జట్టులోనే.. బౌలింగ్ మాత్రం చేయడు! -
MI Vs SRH: ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించిన మహ్మద్ నబీ
Mohammad Nabi Took 5 Catches New Record: ముంబై ఇండియన్స్‌తో అబుదాబిలో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన నాన్ వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో నబీ ఐదు క్యాచ్‌లు అందుకున్నాడు. కాగా మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ (84) సూర్యకుమార్ యాదవ్(82) పరుగులతో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి... 193 పరుగులు మాత్రమే చేసింది. తద్వారా మరోసారి ఓటమిని మూటగట్టుకుని... ఆఖరి స్థానంతో లీగ్‌ను ముగించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ముంబై ఆటగాడు ఇషాన్ కిషన్ నిలిచాడు. స్కోర్లు: ముంబై: 235/9 (20) హైదరాబాద్: 93/8 (20) చదవండి: ఉమ్రాన్ మాలిక్ మరోసారి అత్యంత ఫాస్ట్‌బాల్; సూర్యకుమార్ విలవిల SRH Vs MI: ఇద్దరే 166 బాదారు.. ఒక్క మ్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించారు RCB Vs DC: భళా భరత్... చివరి బంతికి సిక్సర్‌తో గెలిపించిన ఆంధ్ర బ్యాట్స్‌మెన్! -
ఐపీఎల్ చరిత్రలో తొలి వికెట్ కీపర్‌గా ధోని చరిత్ర
MS Dhoni Completes 100 Catches For CSK.. ఐపీఎల్లో సీఎస్కే వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోని అరుదైన ఘనత అందుకున్నాడు. ఆరంభం నుంచి సీఎస్కేకు( మధ్యలో ఒక సీజన్ మినహా) ఆడుతున్న ఎంఎస్ ధోని సీఎస్కే వికెట్ కీపర్‌గా 100 క్యాచ్‌లు అందుకున్నాడు. ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో వృద్దిమాన్ సాహా క్యాచ్ అందుకోవడం ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు. ధోని తర్వాత ఒకే జట్టుకు ఆడుతున్న జాబితాలో రైనా(సీఎస్కే) 98 క్యాచ్‌లతో రెండో స్థానంలో.. కీరన్ పొలార్డ్( ముంబై ఇండియన్స్) 94 క్యాచ్‌లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: ధోని కూతురు జీవా విజిల్ పోడు.. ఓవరాల్‌గా ధోని ఐపీఎల్లో వికెట్ కీపర్‌గా 215 మ్యాచ్‌ల్లో 158 డిస్‌మిసిల్స్(119 క్యాచ్‌లు, 39 స్టంప్స్ ) ఉన్నాయి. అంతేగాక ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ద్వారా ధోని మరో రికార్డును కూడా అందుకున్నాడు. ధోని వికెట్ కీపర్‌గా ఒకే మ్యాచ్‌లో ముగ్గురు అంతకంటే ఎక్కువ బ్యాటర్స్ క్యాచ్‌లు తీసుకోవడం ఇది 10వ సారి. ధోని తర్వాత ఏబీ డివిలియర్స్ 5 సార్లు ఒకే మ్యాచ్‌లో మూడు అంతకంటే ఎక్కువ బ్యాటర్స్ క్యాచ్‌లు తీసుకొని రెండో స్థానంలో ఉన్నాడు. Special cricketer, special milestone! 👏 👏@msdhoni completes 1⃣0⃣0⃣ IPL catches for @ChennaiIPL as a wicketkeeper. 🙌 🙌 #VIVOIPL #SRHvCSK Follow the match 👉 https://t.co/QPrhO4XNVr pic.twitter.com/OebX4cuJHq — IndianPremierLeague (@IPL) September 30, 2021 -
వైరల్: పాము ఆట కట్టించి ఔరా అనిపించిన మాజీ మంత్రి
ముంబై: నిత్యం వివాదాస్పద చర్యలతో వార్తల్లో ఉండే బీజేపీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి గిరీశ్ మహాజన్ పాము ఆట కట్టించి ఔరా అనిపించారు. ప్రజల మధ్యకు వచ్చిన పామును స్వయంగా చేతితో పట్టి బయటకు వదిలేశాడు. ఈ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని జమ్నీర్ పట్టణంలో మంగళవారం సాయంత్రం జనబాహుళ్యంలోకి అకస్మాత్తుగా పాము ప్రత్యక్షమైంది. గుడి వెనుకాల పాము కనపడడంతో కలకలం రేపింది. భయంతో పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడి ఉన్నారు. పామును పట్టుకుంటున్న మాజీ మంత్రి గిరీశ్ మహాజన్ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి గిరీశ్ మహాజన్ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అందరినీ పక్కకు జరిపి పాము వద్దకు ఆయన వెళ్లారు. అమాంతం ఐదడుగుల పామును స్వయంగా చేతితో పట్టుకున్నారు. తమ నాయకుడు పామును చాకచక్యంగా పట్టుకోవడంతో అక్కడ ఉన్నవారంతా కేరింతలు కొట్టారు. ఆయన సాహసాన్ని అందరూ మెచ్చుకున్నారు. పామును పట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన పాములకు స్నేహితుడు. పాములను పట్టుకుంటూ వాటిని ఆట పట్టిస్తూ ఉంటాడు. గతంలో ఎన్నో పాములు పట్టుకున్నారు. అయితే తాజాగా జన బాహుళ్యంలో నాయకుడి తెగువను చూసి నెటిజన్లు అభినందిస్తున్నారు. గిరీశ్ మహాజన్ మహారాష్ట్రలో కీలక నేత. బీజేపీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. అతడిపై గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయి. जळगाव: भाजपा नेते, माजी मंत्री गिरीष महाजनांनी पकडला साप. @girishdmahajan #girishmahajan @BJP4Maharashtra #Jalgaonhttps://t.co/CbvSFUjpi9 pic.twitter.com/DuAvEuYNOy — Lokmat (@MiLOKMAT) July 20, 2021 -
అదేమో కింగ్ కోబ్రా.. ఆ యువతి ఎలా పట్టేసుకుందో!
మనలోఎవరికైనా.. పాము కనిపిస్తే ఏంచేస్తారని ఒకవేళ అడిగితే.. ‘ ఇంకేంచేస్తాం.. గట్టిగా అరుస్తూ.. అక్కడి నుంచి పారిపోతామని’ చెప్తాం. అయితే, మరికొందరు భయస్తులు, పామును చూడటం అటుంచి, ఒకవేళ దాని పేరు తలుచుకున్న కూడా భయంతో వణికి పోతారనే విషయం మనకు తెలిసిందే. అయితే ఒక యువతి మాత్రం కింగ్ కోబ్రాను చూసినా భయం లేకుండా ఒంటి చేత్తో పట్టేసుకుంది. అయితే, ఆ పామును పట్టేక్రమంలో ఆమె మొహంలో భయం కించెత్తైనా లేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. నాగేశ్వరీ అనే యువతికి పాములను పట్టుకోవడం అంటే ఇష్టం. ఈ క్రమంలో ఎక్కడ పాములు కనిపించినా కూడా. వెంటనే సదరు స్థానికులు నాగేశ్వరీకి సమాచారం ఇస్తారు. దీంతో ఆమె అక్కడికి చేరుకొని ఆపాముని పట్టుకుంటుంది. అయితే, ఈ వీడియోలో కూడా నాగేశ్వరీ ఒక పామును పట్టుకోవడం కనిస్తోంది. దీనిలో ఒక పెద్ద నాగుపాము రాళ్ల వెనుక ఉండటాన్ని నాగేశ్వరీ గమనించింది. ఆమె వెంటనే, రాళ్లను పక్కకు జరిపి ఒంటి చేత్తోనే ఆ పాముని పట్టేసుకుంది. అయితే, ఆ యువతి మొహంలో ఏమాత్రం భయం కనిపించడంలేదు. ‘పాపం.. ఆ పాము మాత్రం, నాగేశ్వరీ చేతిలో నుంచి విడిపించుకోవటానికి విశ్వ ప్రయత్నాలన్ని చేస్తోంది’. ఆ యువతి అదేదో.. ఉడుము పట్టులా.. గట్టిగా పట్టుకొని, ఒక చేతిలో జారీపోతే.. మరో చేతిలో మార్చి మరీ పట్టుకుంటోంది. అంతటితో ఆగకుండా, పామును పట్టుకున్న సంతోషంలో ఆ యువతి నవ్వుతూ.. స్థానికులు తీస్తున్న ఫోటోలకు ఫోజిచ్చింది. ఆమె పాములను పట్టుకుని ‘నాగేశ్వరీ స్నేక్ లవర్..అనే ’తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఇంత ధైర్యమా తల్లి నీది..’ పాము ఎంత పెద్దదిగా ఉందో.. పాపం.. పాము వదిలించుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది..‘ ఇంతకీ పాముని ఏంచేశారో చెప్పలేదు..‘దాని ప్రాణాలు కాపాడిన మీకు హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: కరోనా భయంతో స్వీట్ వద్దన్నాడు! కోపంతో నేలకేసికొట్టిన వధువు -
అమ్మో.. కింగ్ కోబ్రా: భయంతో జనం పరుగులు
మాడుగుల రూరల్: మాడుగుల నూకాలమ్మ కాలనీలో 12 అడుగుల కింగ్ కోబ్రా గిరి నాగు ఆదివారం సాయంత్రం హల్చల్ చేసింది. కొత్త అమావాస్య సందర్భంగా ప్రజలు నూకాలమ్మ జాతరలో వుండగా.. గండి నాని ఇంటి గోడను ఆనుకొని గిరి నాగును గమనించిన జనం భయంతో పరుగులు తీశారు. ఈస్టర్ గార్డ్ వైల్డ్ లైఫ్ సొసైటీ (తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ) వారికి స్థానికులు ఫోన్ చెయ్యగా.. చోడవరం ఫారెస్టు రేంజర్ రామ్ నరేష్ బిర్లాంగి నేతృత్వంలో మాడుగులకు చెందిన స్నేక్ కేచర్ పి.వెంకటేశ్ గిరి నాగును పట్టుకొని తాటిపర్తి పంచాయతీ శివారు గరికబంద అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. గిరి నాగులు హాని చెయ్యవని, ఎక్కడ విషపూరిత సర్పజాతులు వుంటాయో వాటిని తినడానికి వస్తాయని అటవీ అధికార్లు పేర్కొన్నారు. ఈ పాము ఆకారం చూసి భయపడిన వారు కర్రలతో దాడి చేసి చంపడానికి సిద్ధపడుతున్నారు. చుట్టుపక్కల ఇటువంటి సర్పజాతులు కనబడితే వెంటనే అటవీ అధికార్లకు తెలియజేయ్యాలని అటవీ అధికారులు ప్రజలను కోరారు. చదవండి: పాజిటివ్ వచ్చింది బాబూ.. పకోడీలు వేసి వస్తా! అయ్యో బిడ్డా: దూసుకొచ్చిన మృత్యువు -
మెరుపులాంటి ఫీట్లు.. మతిపోయే క్యాచ్‌లు
క్యాచెస్ విన్ మ్యాచెస్.. ఇది అక్షర సత్యం. క్యాచ్‌లు పడితేనే క్రికెట్ మ్యాచ్‌లను గెలవలం. క్యాచ్‌లు డ్రాప్ చేసిన కారణంగానే వరల్డ్‌కప్ లాంటి మెగా ట్రోఫీలను కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. క్రికెట్ మ్యాచ్‌లో క్యాచ్‌లకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మ్యాచ్ టర్న్ కావడంలో ఫీల్డర్లు అందుకునే అద్భుతమైన క్యాచ్‌లు కీలక పాత్ర పోషిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. వరల్డ్ క్రికెట్లోనే కాదు.. ఐపీఎల్ వంటి క్యాష్ రిచ్ లీగ్‌లో కూడా ఫీల్డర్లు ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్న సందర్భాలు ఎన్నో. బౌండరీల వద్ద స్టన్నింగ్ క్యాచ్‌లు, సింగిల్ హ్యాండెడ్ క్యాచ్‌లు, అమాంతం గాల్లోకి ఎగిరి ఫీల్డర్లు ఒడిసి పట్టుకునే క్యాచ్‌లు ఇలా ఎన్నో ఉన్నాయి. గత ఐపీఎల్ సీజన్లో కూడా అద్భుతమైన ఫీల్డింగ్ మెరుపుల్ని చూశాం. ఈ సీజన్లో కూడా ఆ విన్యాసాల్ని కచ్చితంగా చూస్తాం కూడా. మరి ఐపీఎల్-14 సీజన్ ఆరంభం కానున్న తరుణంలో ఈ లీగ్ చరిత్రలో కొన్ని అత్యుత్తమ క్యాచ్‌లు గురించి ఒకసారి చూద్దాం. క్రిస్ లిన్(కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్, 2014) ఆర్సీబీ-కేకేఆర్ జట్ల మధ్య షార్జాలో జరిగిన మ్యాచ్ అది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయానికి 9 పరుగులు కావాలి. క్రీజ్‌లో ఏబీ డివిలియర్స్, అల్బీ మోర్కెల్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఇది ఆర్సీబీకి ఏ మాత్ర కష్టం కూడా కాదు. చివరి ఓవర్‌ను వినయ్ కుమార్ అందుకున్నాడు. మొదటి మూడు బంతులకు సింగిల్స్ వచ్చాయి. నాల్గో బంతికి ఏబీ స్ట్రైకింగ్‌కు వచ్చాడు. ఆ సమయంలో ఆర్సీబీకి ఆరు పరుగులు అవసరం. ఇక మ్యాచ్ ఫినిష్ చేయాలనుకున్నాడు ఏబీ. వినయ్ కుమార్ వేసిన నాల్గో బంతిని భారీ షాట్ ఆడాడు. అది గాల్లో బౌండరీ లైన్ దాటేస్తే ఆర్సీబి గెలుస్తుంది. కానీ కేకేఆర్ ఫీల్డర్ క్రిస్ లిన్ అ అవకాశం ఇవ్వలేదు. బౌండరీ లైన్‌కు కొద్దిగా ముందుగా ఉన్న లిన్ దాన్ని బౌండరీ దాటనివ్వలేదు. గాల్లోనే బంతిని అందుకున్నాడు. అదే సమయంలో నియంత్రణను సైతం కోల్పోలేదు. బంతిని క్యాచ్‌గా పట్టి బౌండరీ లైన్‌కు కొన్ని సెంటిమీటర్ల దూరంలో అద్భుతమైన బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ క్యాచ్‌ను సిక్స్ కానివ్వలేదు. ఆ మ్యాచ్‌లో కేకేఆర్ రెండు పరుగుల తేడాతో గెలిచింది. క్రిస్ లిన్ పట్టిన క్యాచ్ ఒక అసాధారణమైన క్యాచ్‌గా నిలిచిపోయింది. ఏబీ డివిలియర్స్(ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్, 2018) ఏబీడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇతను 360 డిగ్రీల ఆటగాడు. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు ఫీల్డింగ్‌లోనూ ఏబీదీ ప్రత్యేకమైన శైలి. ఈ ఆధునిక క్రికెట్లో అత్యుత్తుమ అథ్లెట్ ఏబీ. ఏబీ తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు తీసుకున్నాడు. అందులో 2018లో బెంగళూరు వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పట్టిన ఒక క్యాచ్ అతన్ని బెస్ట్ ఫీల్డర్లలో మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఆ మ్యాచ్ బెంగళూరు 219 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఈ క్రమంలోనే ఎస్ఆర్హెచ్ ధాటిగానే ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. అలెక్స్ హేల్స్ మంచి టచ్‌లో ఉన్న సమయంలో ఏబీ పట్టిన క్యాచ్ ఆ మ్యాచ్‌కే హైలైట్ కావడమే కాదు.. ఐపీఎల్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్‌ల్లో ఒకటిగా నిలిచింది. మొయిన్ అలీ వేసిన ఎనిమిదో ఓవర్ చివరి బంతికి హేల్స్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అది సిక్స్ అనుకున్నారంతా. కానీ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఏబీడీ స్టన్నింగ్ క్యాచ్‌తో హేల్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ బంతి ఏబీ పైనుంచి వెళ్లిపోతున్న క్రమంలో కరెక్ట్ పొజిషన్ తీసుకుని ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకున్న తీరు అమోఘం. అదే సమయంలో అంతే కచ్చితత్వంతో నియంత్రణ కోల్పోకుండా బౌండరీ లైన్ లోపాలే పడ్డాడు. ఈ క్యాచ్ కెప్టెన్ కోహ్లితో పాటు ఫ్యాన్స్‌లో కూడా మంచి మజాను తీసుకొచ్చింది. సూపర్‌మ్యాన్‌ను తలపించే ఆ క్యాచ్ ఇప్పటికీ అభిమానుల్లో మదిలో మెదులుతూనే ఉంటుంది. ట్రెంట్ బౌల్ట్(ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ డేర్‌డెవిల్స్, 2018) 2018లో ఢిల్లీ డేర్ డెవిల్స్-ఆర్సీబీల మధ్య జరిగిన రెండు లీగ్ మ్యాచ్‌ల్లో కూడా ఆర్సీబీనే విజయం సాధించింది. కాగా, ఇరు జట్ల మధ్య బెంగళూరులో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో మాత్రం ఢిల్లీ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ క్యాచ్ నిజంగానే అద్భుతం. ఏబీ డివిలియర్స్-విరాట్ కోహ్లిలు భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్న క్రమంలో ఢిల్లీకి ఒక మంచి బ్రేక్ త్రూ దొరికిన సందర్భం అది. కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్‌కు కాస్త ముందు బౌల్ట్ అందుకున్న తీరు ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఒక బంతిని లెగ్ సైడ్ వైపు ఫుల్ టాస్‌గా వేయగా, కోహ్లి దాన్ని బౌండరీగా తరలించాలనే భారీ షాట్ ఆడాడు. రాకెట్ స్పీడ్‌లో ఆ బంతిని కోహ్లి హిట్ చేయగా, అంతే స్పీడ్‌లో మిడ్ వికెట్ బౌండరీ లైన్ వద్ద ఉన్న గాల్లోకి ఎగిరి బంతిపై అంచనా తప్పకుండా అందుకున్నాడు. అదే సమయంలో తన నియంత్రణ కోల్పోకుండా బౌండరీ లైన్‌కు కొద్దిగా ముందుకు పడిపోయాడు. అతను బంతిని పట్టుకుని బౌండరీ లైన్ తాకాడా అనే అనుమానం వచ్చినా బ్యాలెన్స్ చేసుకుని లైన్‌కు ముందే ల్యాండ్ అయ్యాడు. ఈ మ్యాజికల్ క్యాచ్‌కు అందులోనూ కోహ్లి క్యాచ్ కావడంతో ఆర్సీబీ అభిమానులంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. కీరోన్ పొలార్డ్(ముంబై వర్సెస్ సీఎస్కే, 2019) ప్రపంచ అత్యుత్తమ ఫీల్డర్లు కీరోన్ పొలార్డ్ ఒకడు. క్యాచ్‌ల విషయంలో తనదైన మార్క్ చూపిస్తూ అభిమానులకు షాక్‌లు ఇస్తూ ఉంటాడు పొలార్డ్. పొలార్డ్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌ల్లో ఒకటి ఐపీఎల్లో కూడా ఉంది. ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ మెరుపులాంటి క్యాచ్‌ను అందుకున్నాడు. అది కూడా సురేష్ రైనా ఇచ్చిన క్యాచ్‌ను సింగిల్ హ్యాండ్‌తో అందుకుని ఔరా అనిపించాడు. ముంబై బౌలర్ జేసన్ బెహ్రెన్‌డార్ఫ్ వేసిన షార్ట్ పిచ్ డెలివరీని డీప్ పాయింట్ మీదుగా సిక్స్ తరలించాలనుకున్నాడు రైనా. ఆ పొజిషన్లో బౌండరీ లైన్ వద్ద ఉన్న పొలార్డ్ మాత్రం అందుకు అవకాశం ఇవ్వలేదు. ఆ బంతిని గాల్గోకి ఎగరకుండా వదిలేస్తే అది సిక్స్ వెళ్లడం ఖాయం. కానీ పొలార్డ్ మాత్రం బంతి గమనాన్ని కచ్చితంగా అంచనా వేసి గాల్లోకి ఎగిరాడు. బంతి దగ్గరకు వచ్చే వరకూ అలానే ఉండి ఒక్కసారిగా జంప్ తీసుకున్నాడు. అంతే వేగంతో క్యాచ్ అందుకున్నాడు. అది క్యాచ్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవడమే కాకుండా ఆ సీజన్లో బెస్ట్ క్యాచ్ అయ్యింది. డేవిడ్ హస్సీ(కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ -2010) ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కేకేఆర్‌తో జరిగిన ఆ మ్యాచ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు కీలకమైనది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ 40 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగా, కేకేఆర్ 137 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. కానీ ఆ మ్యాచ్‌లో కేకేఆర్ ఆటగాడు హస్పీ పట్టిన క్యాచ్ హైలైట్. ఢిల్లీ ఆఖరి ఓవర్ ఆడుతున్న సమయంలో చార్ల్ లాంగ్వెల్దత్ వేసిన ఫుల్ టాస్ బంతిని కాలింగ్‌వుడ్ లాంగాన్ షాట్ ఆడాడు. అది బౌండరీ దాటడం ఖాయం అనుకున్న సమయంలో హస్సీ మెరుపులాగా బంతిపైకి దూసుకొచ్చాడు. ముందు బంతిని సింగిల్ హ్యాండ్‌తో బౌండరీ దాటకుండా ఆపి మెల్లగా బయటకు తోసేశాడు. ఆ తర్వాత బౌండరీ లైన్ లోపలికి వెళ్లిన హస్పీ మళ్లీ బయటకొచ్చి క్యాచ్ అందుకున్నాడు. -
అదిరే ఫీల్డింగ్..కళ్లు చేదిరే క్యాచ్‌లు
-
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో సంఘటన
-
స్లిప్‌లో దగ్గరగా నిలబడుతున్నారు:వీవీఎస్ లక్ష్మణ్
వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్య లండన్: స్లిప్‌లో భారత ఫీల్డర్లు ఒకరికొకరు చాలా దగ్గరగా నిలబడుతున్నారని మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. దీనివల్ల క్యాచ్‌లు తీసుకునే విషయంలో వాళ్ల మధ్య గందరగోళం నెలకొంటుందన్నాడు. ఐదో టెస్టు రెండో రోజు కుక్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను స్లిప్‌లో విజయ్, రహానే జారవిడిచిన సంగతి తెలిసిందే. ‘మేం ఆడేటప్పుడు మూడు స్లిప్‌ల మధ్య కాస్త ఖాళీ ఉంచేవాళ్లం. కానీ ప్రస్తుతం చాలా దగ్గరగా నిల్చుంటున్నారు. ఉపఖండంలో ఆడేటప్పుడు వికెట్ నుంచి ఆరు అడుగులు వెనక్కి ఉండాలి. అదే విదేశాల్లో అయితే ఇది 7, 8 అడుగులు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బంతి బౌన్స్ ఎక్కువగా అవుతుంది. ఏదేమైనా స్లిప్ ఫీల్డర్ల మధ్య కొంతైనా ఖాళీ మాత్రం ఉండాల్సిందే’ అని స్లిప్ ఫీల్డింగ్ స్పెషలిస్ట్ లక్ష్మణ్ వెల్లడించాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేయడం బ్యాటింగ్, బౌలింగ్ మాదిరిగా చాలా ఆత్మవిశ్వాసంతో కూడుకున్నదని చెప్పాడు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న స్లిప్ ఫీల్డర్లలో ఇది కొరవడిన కారణంగానే క్యాచ్‌లు మిస్సవుతున్నాయన్నాడు. అయితే క్యాచ్‌లు తీసుకునే సామర్థ్యం వాళ్లలో ఉందని కితాబిచ్చాడు. ‘గతంలో విజయ్, రహానే అద్భుతమైన క్యాచ్‌లు తీసుకున్నారు. కాకపోతే నిలకడ ఉండాలి. స్లిప్ ఫీల్డర్లను ధోని పదేపదే మార్చకూడదు. దీని కోసం ప్రత్యేక ఆటగాళ్లను ఏర్పాటు చేసుకోవాలి. మ్యాచ్ కీలక దశలో క్యాచ్‌లను జారవిడిచారు. దీనివల్ల ఇంగ్లండ్ సిరీస్‌లో పుంజుకుంది’ అని లక్ష్మణ్ వివరించాడు.