లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. రూట్ ఇదే మ్యాచ్‌లో ఓ డబుల్ సెంచరీ కూడా సాధించాడు. అదెలా అనుకుంటున్నారా..? ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో నిషన్ మధుష్క, పథుమ్ నిస్సంక క్యాచ్‌లు పట్టుకున్న రూట్.. టెస్ట్‌ల్లో 200 క్యాచ్‌ల అరుదైన మైలురాయిని తాకాడు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో రూట్ సహా కేవలం నలుగురు నాన్ వికెట్‌కీపర్‌లు మాత్రమే ఈ ఘనత సాధించారు. టెస్ట్‌ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న నాన్ వికెట్‌కీపర్ ఫీల్డర్‌గా ద్రవిడ్ (210 క్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక మాజీ మహేళ జయవర్దనే (205) రెండో స్థానంలో.. రూట్, కల్లిస్ (200) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ పట్టు బిగించింది. ఈ మ్యాచ్‌లో లంక నెగ్గాలంటే మరో 291 పరుగులు చేయాల్సి ఉంది. ఆ జట్టు చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. నాలుగో రోజు రెండో సెషన్ సమయానికి శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
చండీమల్ (58), ధనంజయ డిసిల్వ (11) క్రీజ్‌లో ఉన్నారు. లంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో దిముత్ కరుణరత్నే (55) అర్ద సెంచరీతో రాణించగా.. ఏంజెలో మాథ్యూస్ (36) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ స్టోన్ 2, షోయబ్ బషీర్, అట్కిన్సన్, వోక్స్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు రూట్ శతక్కొట్టడంతో ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 251 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 196 పరుగులకు ఆలౌటైంది. రూట్‌తో పాటు (143) అట్కిన్సన్ (118) సెంచరీ చేయడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 427 పరుగులు చేసింది. అశిత ఫెర్నాండో ఐదు వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment