
సాధారణంగా ఏదైనా మ్యాచ్‌లో క్యాచ్ పడితే ఫీల్డర్ సెలెబ్రేషన్స్ వేరే విధంగా ఉంటాయి. అయితే పట్టిన క్యాచ్ నోబాల్ అయితే.. ఫీల్డర్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఊహించవచ్చు. అచ్చెం ఇటువంటి సంఘటనే యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో చోటు చేసుకుంది. యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో భాగంగా బ్రెస్సియా క్రికెట్ క్లబ్, టర్కీ జైటిన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. బ్రెస్సియా ఇన్నింగ్స్‌లో చాలా ఈజీ క్యాచ్‌లను టర్కీ ఫీల్డర్‌లు జారవిడిచారు.
అయితే బ్రెస్సియా ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన అభిషేక్ కుమార్ బౌలింగ్‌లో.. బాబర్ హుస్సేన్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్ క్యాచ్‌గా అందుకున్నాడు. క్యాచ్ పట్టిన ఆనందంలో ఫీల్డర్ సెలెబ్రేషన్‌లో మునిగిపోయాడు. అయితే అతడు ఆనందం కొంత సమయం మాత్రమే మిగిలింది. ఎందుకంటే సదరు ఫీల్డర్ క్యాచ్ పట్టిన బంతిను అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. దీంతో అతడికి ఒక్క సారిగా గుండె జారినంత పనైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను యూరోపియన్ క్రికెట్ ట్విటర్‌లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: Ind Vs SL T20I: ఓపెనర్లుగా వారిద్దరు.. రోహిత్‌కి నో ఛాన్స్!
When your team finally hold onto a catch... 🥳
— European Cricket (@EuropeanCricket) February 23, 2022
But it's a free-hit 😭
So many emotions in one ball! 😂 #ECL2022 pic.twitter.com/HoJxGc8tJJ