Video: బాలీవుడ్‌ పాటకు యూఎస్‌ దౌత్యవేత్త హుషారైన స్టెప్పులు | Viral Video: US Envoy Eric Garcetti Dances During Diwali Celebrations | Sakshi
Sakshi News home page

దివాళీ వేడుకల్లో యూఎస్‌ దౌత్యవేత్త.. హిట్‌ పాటకు హుషారైన స్టెప్పులు

Published Wed, Oct 30 2024 4:26 PM | Last Updated on Thu, Oct 31 2024 10:00 AM

Viral Video: US Envoy Eric Garcetti Dances During Diwali Celebrations

న్యూఢిల్లీ: ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో దీపావళి వేడుకలు బధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి మరోసారి తన నృత్య ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. వేడుకల్లో భాగంగా గార్సెట్టి స్టేజ్‌పై బాలీవుడ్‌ హిట్‌ పాటకు ఎంతో ఉత్సాహంగా  స్టెప్పులు వేశారు. 

సంప్రదాయ దుస్తులైన కుర్తా పైజామా ధరించి విక్కీ కౌశల్‌ నటించిన బ్యాడ్‌ న్యూస్‌ సినిమాలోని ‘తౌబా తౌబా’ పాటకు కాలు కదిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గార్సెట్టి ఇలా తన డ్యాన్స్‌ స్కిల్స్‌తో ఆకట్టుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో కూడా ఆయన చాలా సందర్భాల్లో  తన నృత్య ప్రదర్శనతో అందరిని మంత్రముగ్దులను చేశారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement