నేలపై జెండా.. ప్రధాని మోదీ ఏం చేశారంటే..  | Viral Video: PM Modi Notices Indian Flag On The Floor At BRICS Summit - Sakshi
Sakshi News home page

వీడియో: నేలపై జెండా.. ప్రధాని మోదీ ఏం చేశారంటే.. 

Published Wed, Aug 23 2023 8:12 PM | Last Updated on Wed, Aug 23 2023 8:19 PM

PM Modi Notices Indian Flag On The Floor At BRICS summit - Sakshi

జోహన్నెస్‌బర్గ్‌లో ఇవాళ జరిగిన బ్రిక్స్‌ సమావేశం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది.  ప్రధాని నరేంద్ర మోదీ తన దేశభక్తిని చాటుకున్నారు. కింద ఉంచిన జాతీయ జెండాను గమనించి అప్రమత్తయ్యారు ఆయన. 

బ్రిక్స్‌ సమావేశాల సందర్భంగా.. ఇవాళ హాజరైన నేతలతో ఓ ఫొటోషూట్‌ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా వేదిక ఎక్కబోయారు. తమకు కేటాయించిన స్థానాల్లో నిల్చుని ఫొటోలు దిగాల్సి ఉంది. అయితే.. అక్కడ నేతలు ఎవరెక్కడ నిల్చోవాలనే గుర్తు కోసం ఆయా నేతలకు సంబంధించిన దేశాల జెండాల పేపర్‌ పీస్‌లను ఉంచారు. 

ఈ క్రమంలో వేదిక ఎక్కబోతూ.. అక్కడ జెండాను గమనించిన మోదీ.. దానిని తీసుకుని తన జాకెట్‌ జేబులో పెట్టుకున్నారు. మరోవైపు అప్పటికే తమ దేశపు జెండాపై అడుగేసిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు.. మోదీ చర్యను గమనించి అక్కడే ఉన్న సిబ్బందికి ఆ జెండాను అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement