జొహెన్నస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్-2023 సదస్సులో ఇవాళ ప్రధానకర్షణగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నిలిచారు. కరచలనంతో పాటు ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.
వాస్తవానికి బ్రిక్స్ వేదికగా అయినా ఇద్దరూ సమావేశం అవుతారనే అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటు భారత, అటు చైనా విదేశీ వ్యవహారాల శాఖలు ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ తరుణంలో.. ఈ ఇద్దరి మధ్య బ్రిక్స్ వేదికగా ప్రత్యేక భేటీ జరగనప్పటికీ ముచ్చట్లు మాత్రం సాగాయి.
బ్రిక్స్‌కు హాజరైన నేతలు వేదికపైకి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో.. జింగ్‌పిన్‌తో మోదీ ఏదో ముచ్చటించారు. ఆపై వేదికపై ఇద్దరూ కరచలనం చేసుకున్నారు కూడా. ఆ సమయంలో అందరి చూపు ఆ ఇద్దరివైపే ఉండిపోయింది.
ఇరుదేశాల వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితుల తర్వాత ఈ ఇద్దరూ ప్రత్యేకంగా భేటీ అయ్యింది లేదు. కాకుంటే.. గత ఏడాది జీ20 సదస్సులో ఇద్దరూ మాట్లాడుకున్న వీడియోలు ఒకటి బాగా వైరల్ అయ్యింది. అది కొద్దిసేపే అయినా ఏం మాట్లాడుకున్నారనే చర్చ నడిచింది. ఇక బ్రిక్స్‌లో దక్షిణాఫ్రికా, భారత, చైనా, రష్యా, బ్రెజిల్ సభ్య దేశాలు కాగా.. ఉక్రెయిన్ యుద్ధ నేరాలకు సంబంధించి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్‌జారీ చేయడంతో రష్యా తరపున వ్లాదిమిర్ పుతిన్ కాకుండా సెర్గీ లావ్రోవ్ హాజరయ్యారు.
Moments when PM @narendramodi and Chinese President Xi Jinping had brief exchange of greetings, hand shake or some small conversations at #BRICSSummit2023 in #Johannesburg pic.twitter.com/OsXtKXhQ89
— Abhishek Jha (@abhishekjha157) August 24, 2023
Comments
Please login to add a commentAdd a comment