johannesburg
-
దక్షిణాఫ్రికాలో పెను విషాదం
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద నగరం జొహన్నెస్‌బర్గ్‌లో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో 73 మంది చనిపోయారు. మరో 52 మంది గాయపడ్డారు. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన ఈ ఘటనలో బాధితులంతా బతుకుదెరువు కోసం వచ్చిన వలసదారులేనని అధికారులు తెలిపారు. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో భవనంలో చెలరేగిన మంటలకు కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ప్రమాదం విషయం తెలియగానే తమ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పారని నగర అత్యవసర సేవల విభాగం ప్రతినిధి రాబర్ట్ ములౌడ్జి అన్నారు. భవనంలోని అయిదంతస్తుల్లోనూ మంటలు వ్యాపించాయన్నారు. అందులో చిక్కుకున్న వారిని సాధ్యమైనంత వరకు రక్షించామన్నారు. మొత్తం 73 మృతదేహాలను వెలికితీశామని చెప్పారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన, ఊపిరాడక స్పృహతప్పిన మరో 52 మందిని ఆస్పత్రులకు తరలించామన్నారు. ‘భవనంలోని ప్రతి అంతస్తులోనూ అనధికారికంగా పలు నిర్మాణాలు ఉండటంతో చాలా మంది లోపలే చిక్కుకుపోయారు. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. నేరగాళ్ల ముఠాలు తిష్ట వేయడంతో భవనానికి కరెంటు, నీరు, శానిటేషన్ వసతులను మున్సిపల్ అధికారులు కట్ చేశారు. ఇవి లేకున్నా వలసదారుల కుటుంబాలు ఉంటున్నాయి. కొందరికి పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి భవనాలు ఇక్కడ చాలానే ఉన్నాయి’అని రాబర్ట్ చెప్పారు. -
అగ్నిప్రమాదంలో 73కు పెరిగిన మరణాలు
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జొహన్నెస్‌బర్గ్‌లోని ఐదంస్థుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 73 మందికిపైగా సజీవదహనం అయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది శరణార్థులే ఉన్నట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ సేవల అధికార ప్రతినిధి రాబర్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. మరో 43 మంది గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. తెల్లవారడానికి ముందే ఈ ఘోర ప్రమాదం జరిగిందని.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారాయన. మంటల్ని అదుపులోకి తెచ్చిన అధికారులు.. భవనంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మరిన్ని మృతదేహాలు బయటకు వస్తున్నాయని తెలిపారాయన. మరోవైపు బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా మారుమోగుతోంది. The death toll in a fire in the Johannesburg CBD has risen to 55 & likely to increase. Over 43 other people have also been injured. It has been reported that the building that caught fire this morning in Johannesburg CBD is a hijacked building full of illegal immigrants. pic.twitter.com/OTEAiQVZ8j — Man’s NOT Barry Roux (@AdvoBarryRoux) August 31, 2023 -
బ్రిక్స్‌లోకి మరో ఆరు దేశాలు
న్యూఢిల్లీ: బ్రిక్స్ కూటమిలోకి మరో ఆరు దేశాలు వచ్చి చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని కూటమి నిర్ణయించింది. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న మూడు రోజుల శిఖరాగ్ర భేటీలో ఆఖరు రోజైన గురువారం మీడియా సమావేశంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఈ మేరకు ప్రకటించారు. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి ఆరు దేశాల సభ్యత్వం అమల్లోకి వస్తుందని తెలిపారు. బ్రిక్స్ బలం అయిదు నుంచి 11 దేశాలకు పెరగనుంది. ఈ నిర్ణయంపై ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా హర్షం వ్యక్తం చేశారు. బ్రిక్స్ అధ్యక్ష పీఠంపై ఉన్న దక్షిణాఫ్రికాలో కూటమి శిఖరాగ్ర సమ్మేళనం జరుగుతోంది. ‘సిద్ధాంతాలు, ప్రమాణాలు, విధానాల ప్రాతిపదికన విస్తరణ ప్రక్రియను ఏకాభిప్రాయంతో చేపట్టాం. మున్ముందు కూడా కూటమిని విస్తరిస్తాం’అని రమఫోసా చెప్పారు. బ్రిక్స్ విస్తరణ, ఆధునీకరణ.. ప్రపంచంలోని అన్ని సంస్థలు మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలనే సందేశం ఇస్తుందని ప్రధాని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. ‘బ్రిక్స్ విస్తరణకు భారత్ మొదట్నుంచీ మద్దతుగా నిలిచింది. కొత్తగా సభ్య దేశాలను చేర్చుకోవడం ద్వారా బ్రిక్స్ మరింత బలోపేతమవుతుంది. ఉమ్మడి ప్రయత్నాలకు కొత్త ఊపునిస్తుంది. బహుళ ధ్రువ ప్రపంచ క్రమతపై విశ్వాసం పెంచుతుంది’అని ప్రధాని మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన వర్చువల్ ప్రసంగంలో బ్రిక్స్ తాజా విస్తరణపై హర్షం వ్యక్తం చేశారు. కూటమిలో సహకారానికి కొత్త అధ్యాయం మొదలైందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. బ్రిక్స్ భాగస్వామ్య దేశం నమూనా, కూటమిలో చేరాలనుకునే దేశాల జాబితాను ఏడాది జరిగే శిఖరాగ్ర సమ్మేళనం నాటికి సిద్ధం చేసే బాధ్యతను విదేశాంగ మంత్రులకు అప్పగించినట్లు రమఫోసా చెప్పారు. స్థానిక కరెన్సీలు, చెల్లింపు విధానాల్లో తలెత్తే సమస్యల పరిష్కారంపై నివేదిక రూపొందించాల్సిందిగా బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు సూచించేందుకు అంగీకారానికి వచి్చనట్లు ఆయన వివరించారు. 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలు బ్రిక్‌గా ఏర్పాటయ్యాయి. దక్షిణాఫ్రికా చేరికతో 2010 నుంచి బ్రిక్స్‌గా రూపాంతరం చెందింది. బ్రిక్స్‌లో చేరేందుకు 40 వరకు దేశాలు ఆసక్తి చూపుతుండగా వీటిలో 23 దేశాలు సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రస్తుత కూటమి ప్రపంచ జనాభాలో 41%, ప్రపంచ జీడీపీలో 24%, ప్రపంచ వాణిజ్యంలో 16% వరకు వాటా కలిగి ఉంది. పశి్చమదేశాల కూటమికి బ్రిక్స్‌ను ప్రధాన పోటీ దారుగా భావిస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని భేటీ బ్రిక్స్ భేటీ సందర్భంగా ప్రధాని మోదీ గురువారం ఇరాన్ అధ్యక్షుడు ౖఇబ్రహీం రైసీ సహా పలు దేశాల నేతలతో సమావేశమయ్యారు. రైసీతో చర్చల సందర్భంగా ఇరువురు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ, ఉగ్రవాదం, అఫ్గానిస్తాన్ వంటి ద్వైపాక్షిక అంశాలతో చాబహర్ పోర్టు అభివృద్ధిపైనా చర్చించారు. బ్రిక్స్‌లో ఇరాన్ చేరికకు మద్దతుగా నిలిచినందుకు ప్రధాని మోదీకి రైసీ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రయాన్–3 విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు తెలియజేశారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వివరించారు. ప్రధాని మోదీ ఇథియోపియా అధ్యక్షుడు అబీ అహ్మద్ అలీ, సెనెగల్ అధ్యక్షుడు మాకీ సాల్, మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసీ తదితరులతో జరిగిన భేటీలో పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు గల అవకాశాలపై ప్రధాని మోదీ చర్చించారని బాగ్చీ వివరించారు. కాగా, బ్రిక్స్ శిఖరాగ్రం అనంతరం ప్రధాని మోదీ గురువారం సాయంత్రం జొహన్నెస్‌బర్గ్ నుంచి గ్రీస్‌కు బయలుదేరారు. ఆఫ్రికాకు భారత్ విశ్వసనీయ భాగస్వామి ‘ఎజెండా 2063’సాధనలో ఆఫ్రికాకు భారత్ సన్నిహిత, విశ్వసనీయ భాగస్వామి అని ప్రధాని మోదీ అన్నారు. గ్లోబల్ సౌత్‌కు భారత్ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం, ఆహారం, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో సహకారానికి ఎన్నో అవకాశాలున్నాయని చెప్పారు. బ్రిక్స్, ఆఫ్రికా దేశాల ముఖ్య నేతలతో గురువారం జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఆఫ్రికా యూనియన్ శక్తివంతంగా రూపుదిద్దుకునేందుకు వచ్చే 50 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలపై 2013లో తయారు చేసిన ఆర్థికాభివృద్ధి నమూనాయే ‘అజెండా 2063’. ప్రపంచమే ఒక కుటుంబమనే భావనను భారత్ వేల ఏళ్లుగా విశ్వసిస్తోందని ప్రధాని చెప్పారు. ఆఫ్రికా దేశాలతో వాణిజ్యం, పెట్టుబడుల్లో భారత్ నాలుగు, అయిదో స్థానాల్లో ఉందన్నారు. ఎల్ఏసీని గౌరవిస్తేనే సాధారణ సంబంధాలు న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవ«దీన రేఖ(ఎల్ఏసీ) పరిధిలో అపరిష్కృతంగా ఉన్న అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా ఉద్దేశాలు, అభిప్రాయాలు చైనా అధినేత షీ జిన్‌పింగ్ దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో గురువారం జిన్‌పింగ్‌తో మోదీ మాట్లాడారు. భారత్–చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతి, స్నేహభావం నెలకొనాలని, ఎల్ఏసీని గౌరవించాలని మోదీ తేలి్చచెప్పారు. ఎల్ఏసీ నుంచి ఇరుదేశాల బలగాలను ఉపసంహరించే చర్యలను వేగవంతం చేసేలా తమ అధికారులను ఆదేశించాలని ఇరువురు నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. 2020 మే నెలలో తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య త్రీవస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. -
జిన్‌పింగ్, మోదీ ముచ్చట్లు.. కరచలనం
జొహెన్నస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్-2023 సదస్సులో ఇవాళ ప్రధానకర్షణగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నిలిచారు. కరచలనంతో పాటు ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి బ్రిక్స్ వేదికగా అయినా ఇద్దరూ సమావేశం అవుతారనే అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటు భారత, అటు చైనా విదేశీ వ్యవహారాల శాఖలు ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ తరుణంలో.. ఈ ఇద్దరి మధ్య బ్రిక్స్ వేదికగా ప్రత్యేక భేటీ జరగనప్పటికీ ముచ్చట్లు మాత్రం సాగాయి. బ్రిక్స్‌కు హాజరైన నేతలు వేదికపైకి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో.. జింగ్‌పిన్‌తో మోదీ ఏదో ముచ్చటించారు. ఆపై వేదికపై ఇద్దరూ కరచలనం చేసుకున్నారు కూడా. ఆ సమయంలో అందరి చూపు ఆ ఇద్దరివైపే ఉండిపోయింది. ఇరుదేశాల వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితుల తర్వాత ఈ ఇద్దరూ ప్రత్యేకంగా భేటీ అయ్యింది లేదు. కాకుంటే.. గత ఏడాది జీ20 సదస్సులో ఇద్దరూ మాట్లాడుకున్న వీడియోలు ఒకటి బాగా వైరల్ అయ్యింది. అది కొద్దిసేపే అయినా ఏం మాట్లాడుకున్నారనే చర్చ నడిచింది. ఇక బ్రిక్స్‌లో దక్షిణాఫ్రికా, భారత, చైనా, రష్యా, బ్రెజిల్ సభ్య దేశాలు కాగా.. ఉక్రెయిన్ యుద్ధ నేరాలకు సంబంధించి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్‌జారీ చేయడంతో రష్యా తరపున వ్లాదిమిర్ పుతిన్ కాకుండా సెర్గీ లావ్రోవ్ హాజరయ్యారు. Moments when PM @narendramodi and Chinese President Xi Jinping had brief exchange of greetings, hand shake or some small conversations at #BRICSSummit2023 in #Johannesburg pic.twitter.com/OsXtKXhQ89 — Abhishek Jha (@abhishekjha157) August 24, 2023 -
BRICS summit 2023: బ్రిక్స్ విస్తరణకు భారత్ మద్దతు
జోహెన్నెస్‌బర్గ్: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్)ల దేశాలతో కూడిన బ్రిక్స్ కూటమిని విస్తరించాలన్న ప్రతిపాదనతో భారత్ ముందుకు వచ్చింది. అయితే ఈ విస్తరణ ఏకాభిప్రాయంతో జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికా జోహెన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ వార్షిక సదస్సులో బుధవారం నాడు ప్రధాని మోదీ ప్రసంగించారు. అద్భుతమైన భవిష్యత్‌కు బ్రిక్స్ సంసిద్ధంగా ఉండాలంటే మనం మన సమాజాలను భవిష్యత్‌కు సిద్ధం చేయాలని ప్రధాని మోదీ చెప్పారు. ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వాన్ని తాము ప్రతిపాదిస్తున్నట్టుగా చెప్పారు. ‘‘జీ 20 సదస్సును భారత్‌లో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో నిర్వహిస్తున్నాం. బ్రిక్స్ దేశాలన్నీ అందులో శాశ్వత సభ్యులే. ఆఫ్రికన్ యూనియన్‌కు కూడా జీ–20లో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని మేము ప్రతిపాదిస్తున్నాం. బ్రిక్స్ భాగస్వామ్య పక్షాలన్నీ ఇందుకు అంగీకరిస్తాయని భావిస్తున్నాం’’ అని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. గ్లోబల్ సౌత్ దేశాలకు బ్రిక్స్ సదస్సులో ప్రాధాన్యం కల్పించడాన్ని ప్రధాని స్వాగతించారు. జీ–20 సదస్సులో భారత్ కూడా గ్లోబల్ సౌత్ దేశాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు. గత రెండు దశాబ్దాల్లో బ్రిక్స్ దేశాలు పరస్పర సహకారంతో అత్యంత అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగించాయని ప్రధాని మోదీ అన్నారు. గ్లోబల్ సౌత్ అభివృద్ధిలో బ్రిక్స్‌కు చెందిన న్యూ డెవలెప్మెంట్ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రైల్వే రీసెర్చ్ నెట్వర్క్, స్టార్టప్ రంగాల్లో భారత్ చేసిన సూచనలతో అపారమైన అభివృద్ధి జరుగుతోందని అన్నారు. పశ్చిమ దేశాల వల్లే ఉక్రెయిన్ యుద్ధం: పుతిన్ బ్రిక్స్ సదస్సులో వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రసంగించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం పశ్చిమ దేశాల పాపమేనని ఆరోపించారు. డాన్బాస్ ప్రాంతంలో నివసించే ప్రజలకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌లో యుద్దానికి దిగుతున్నాయని నిందించారు. యుద్ధాన్ని నిలిపివేయడమే రష్యా మిలటరీ లక్ష్యమని పుతిన్ అన్నారు. దక్షిణాఫ్రికాకు వస్తే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్లు మేరకు తనని అరెస్ట్ చేసే అవకాశం ఉందని అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నట్టు చెప్పారు. -
Chandrayaan 3: భూమిపై సంకల్పం.. జాబిల్లిపై సాకారం
న్యూఢిల్లీ: చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిపించారు. వారికి అభినందనలు తెలియజేశారు. భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇప్పుడు చంద్రుడిపై భారత్ అడుగుపెట్టిందని అన్నారు. ఇది కేవలం భారత్ విజయం కాదని చెప్పారు. ఈ ఘనత ప్రపంచంలోని ప్రజలందరికీ చెందుతుందని చెప్పారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వెళ్లిన మోదీ బుధవారం సాయంత్రం చంద్రయాన్–3 సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను టీవీలో ప్రత్యక్షంగా వీక్షించారు. ల్యాండింగ్ సకెŠస్స్ అయిన వెంటనే ఇస్రో సైంటిస్టులను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. బ్రిక్స్ సదస్సు కోసం ప్రస్తుతం తాను దక్షిణాఫ్రికాలో ఉన్నప్పటికీ తన మనసు, ఆత్మ మొత్తం భారత్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలోని బలమైన జీ20 కూటమికి భారత్ నాయకత్వం వహిస్తున్న ఈ శుభసందర్భంలో చంద్రయాన్–3 ప్రయోగం సఫలం కావడం మరింత ఆనందాన్ని ఇస్తోందన్నారు. భూగోళంపై మనం తీసుకున్న సంకల్పం చందమామపై నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం చిరస్మరణీయమని తెలిపారు. ఈ అద్భుత క్షణం శాశ్వతంగా మదిలో నిలిచిపోతుందని చెప్పారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందంటూ ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఇదొక చరిత్రాత్మక సందర్భమని ఉద్ఘాటించారు. అభివృద్ధి చెందుతున్న భారత్‌కు ఇది ప్రతీక అని చెప్పారు. కొత్త చరిత్రను భారత్ లిఖించిందని వెల్లడించారు. నవ భారతదేశంలో నూతన శిఖరాలకు చేరుకుంటున్నామని, అందుకు మనమంతా సాకు‡్ష్యలమని వివరించారు. శాస్త్రవేత్తల అంకితభావం వల్లే.. అమృతకాలంలో ఇది మొదటి విజయమని అన్నారు. ఇది అమృత వర్షమని అభివర్ణించారు. ఆకాశమే హద్దు కాదని భారత్ పదేపదే నిరూపిస్తోందని ప్రధాని మోదీ చమత్కరించారు. ఇప్పటిదాకా ఎవరూ చేరుకోని జాబిల్లి దక్షిణ ధ్రువానికి భారత్ చేరుకుందని ఉద్ఘాటించారు. మన శాస్త్రవేత్తల అంకితభావం, నైపుణ్యం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. చందమామకు సంబంధించిన మన ఊహాగానాలు, ప్రచారంలో ఉన్న కథలు ఇక మారుతాయని, సామెతలు కొత్త తరం కోసం కొత్త అర్థాలను వెతుక్కుంటాయని వ్యాఖ్యానించారు. భూమిని తల్లిగా, చంద్రుడిని మామగా మనం భావిస్తామని చెప్పారు. ‘చందమామ దూర్ కే’ అంటుంటామని, ఇకపై ‘చందమామ ఏక్ టూర్ కే’ అనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వివరించారు. తద్వారా జాబిల్లిపై పర్యటనలు త్వరలో ప్రారంభమవుతాయని పరోక్షంగా స్పష్టం చేశారు. సూర్యుడిపై పరిశోధనల కోసం ‘ఆదిత్య–ఎల్1’ ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోందని చెప్పారు. శుక్రగ్రహంపైనా అధ్యయనం చేసే ప్రణాళిక ఉందన్నారు. అనంతరం ప్రధాని మోదీ ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్‌తో మాట్లాడారు. అభినందనలు తెలిపారు. -
Brics Summit 2023: ప్రపంచానికి ‘గ్రోత్ ఇంజిన్’ భారత్
జోహన్నెస్‌బర్గ్: రాబోయే రోజుల్లో ప్రపంచానికి భారత్ ‘గ్రోత్ ఇంజిన్’గా మారబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్‌లో సంస్కరణలను మిషన్ మోడ్‌లో అమలు చేస్తున్నామని, సులభతర వాణిజ్యంలో వేగం పుంజుకుందని చెప్పారు. మంగళవారం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ బిజినెస్ ఫోరం లీడర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. భారత్ త్వరలోనే 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్‌లో ఉందన్నారు. 100కుపైగా యూనికార్న్ కంపెనీలు పని చేస్తున్నాయని వెల్లడించారు. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య భవిష్యత్ సహకారానికి అనువైన రంగాలను గుర్తించడంలో 15వ బ్రిక్స్ సదస్సు సఫలమవుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రోజులపాటు జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం ఆయన దక్షిణాఫ్రికా చేరుకున్నారు. కాగా, ఉక్రెయిన్ యుద్ధం విషయమై అంతర్జాతీయ నేర న్యాయస్థానం రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆయన వర్చువల్‌గా పాల్గొననున్నారు. -
వైరల్ వీడియో: దక్షిణాఫ్రికా పేలుడును చూస్తే మన దర్శకులు బిత్తెరపోతారు
-
గాల్లో విమానం.. పైలట్ సీట్లోకి నాగు పాము.. తర్వాత ఏం జరిగిందంటే!
జోహన్నెస్‌బర్గ్: గాల్లో ఎగురుతున్న ఓ విమానంలోని అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాక్ పిట్లోకి ప్రవేశించిన అత్యంత విషపూరితమైన కేప్ కోబ్రా ఏకంగా పైలట్ సీట్ పక్కన దర్శనమిచ్చింది. పామును గమనించిన పైలట్ భయపడకుండా చాకచక్యంగా వ్యవహరించడంతో విమానంలో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో సోమవారం చోటు చేసుకుంది. విమానంలో పామును చూసిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. సోమవారం నలుగురు ప్రయాణికుతో చిన్న విమానం వార్సెస్టర్ నుంచి నెల్సుప్రీట్‌కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ రుడోల్ఫ్ ఎరాస్మస్కు తన వెనుక భాగంలో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. తల తిప్పి చూడగా.. ఓ నాగుపాము తన సీటు కింద కదులుతూ కనిపించింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అయితే పాముని చూసి బెంబేలెత్తకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. ఈ విషయాన్ని ముందుగా గ్రౌండ్ కంట్రోల్ సిబ్బందికి తెలియజేశాడు. ఏటీసీ సూచనలతో విమానాన్ని జోహన్నెస్‌బర్గ్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో ప్రాయణికులకు ప్రాణాపాయం తప్పింది. విమానంలోని వారిని దింపేసి తనిఖీలు చేయగా.. పైలట్ సీటు కింద పాము చుట్టుకొని ఉండటాన్ని గుర్తించారు. వాస్తవానికి ప్రయాణానికి ముందు రోజు ఆదివారం మధ్యాహ్నం వార్సెస్టర్ ఎయిర్‌పోర్టు సిబ్బంది విమానం రెక్కల కింద నాగుపామును గుర్తించారు. దాన్ని పట్టుకునేందుకు వారు ప్రయత్నించినా దాని ఆచూకీ లభించకపోవడంతో బయటకు వెళ్లిపోయిందని భావించారు. అనూహ్యంగా మర్నాడు కాక్‌పిట్‌లో ప్రత్యక్షమైంది. మరోవైపు సంయమనం పాటించి, విమానాన్ని జాగ్రత్తగా ల్యాండింగ్ చేసిన పైలెట్‌ను అభినందిస్తూ అతని ధైర్య సాహసాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
SA Vs WI: జేసన్ హోల్డర్ ఒంటరి పోరాటం.. అయినా పాపం!
South Africa vs West Indies, 2nd Test- జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 251 పరుగులకు ఆలౌటైంది. జేసన్ హోల్డర్ (117 బంతుల్లో 81 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఇతర బ్యాటర్లలో కైల్ మేయర్స్ (29), రోస్టన్ ఛేజ్ (28), జొషువా డ సిల్వ (26) కొన్ని పరుగులు జోడించగలిగారు. సఫారీ బౌలర్లలో కోయెట్జీ 3 వికెట్లు పడగొట్టగా...రబడ, హార్మర్ చెరో 2 వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్‌లో 69 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్ కోల్పోకుండా 4 పరుగులు చేసింది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 311/7తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 320 పరుగులకు ఆలౌటైంది. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్ సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది. ఫిబ్రవరి 28న ఆరంభమైన టెస్టు సిరీస్‌లో భాగంగా ఆతిథ్య ప్రొటిస్ తొలి మ్యాచ్‌లో 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక మార్చి 8న మొదలైన రెండో టెస్టులోనూ విండీస్‌పై బవుమా బృందానిదే పైచేయిగా ఉంది. ఇదిలా ఉంటే.. మార్చి 16-21 వరకు వన్డే, మార్చి 25-28 వరకు సౌతాఫ్రికా- వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ జరుగనుంది. చదవండి: Wanindu Hasaranga: పెళ్లి చేసుకున్న శ్రీలంక ఆల్‌రౌండర్.. ఫొటోలు వైరల్! Steve Smith: అంతా బాగానే ఉంది కానీ.. ఇదేంటి స్మిత్! మరీ ఇలా.. కెరీర్లో ఇదే తొలిసారి! -
ఆ సత్తా భారత్‌కే ఉంది: ఎగ్జిమ్ బ్యాంక్ నివేదిక
జోహన్నస్బర్గ్: ఆఫ్రికా దేశాలు తమ నౌకా, వైమానిక, రక్షణ ఉపకరణాలు సమకూర్చుకునేందుకు భారత్‌పైనే ఆధారపడ్డాయని ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ ‘రీఇన్విరోగేటింగ్ ఇండియాస్ ఎకనమిక్ ఎంగేజ్మెంట్స్ విత్ సదరన్ ఆఫ్రికా’ నివేదికలో స్పష్టంచేసింది. ‘ 2017–2021 కాలంలో మారిషస్, మొజాంబిక్, సీషెల్స్ వంటి ఆఫ్రికా దేశాల కీలక రక్షణ అవసరాలు తీర్చడంలో భారత్ పెద్దదిక్కుగా మారింది. భారత ఆయుధాలను ఈ దేశాలు భారీమొత్తంలో కొన్నాయి. ఉత్పత్తి సామర్థ్యం పెంపు, మానవతా సాయం, వేరే దేశ సైన్యానికి శిక్షణ అంశాలపైనా భారత్ దృష్టిసారించాలి. అప్పుడే 2025 కల్లా 5 బిలియన్ డాలర్ల రక్షణ ఉత్పత్తుల ఎగుమతి సామర్థ్య లక్ష్యాన్ని భారత్ సాకారం చేసుకోగలదు. ఇందులో రక్షణ ఉత్పత్తుల తయారీసంస్థలైన టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ తమ వంతు భాగస్వామ్య పాత్ర పోషిస్తున్నాయి. ఇక, కొత్త తరం స్వదేశీ సాంకేతికతల సాయంతో నావికారంగంలో మానవరహిత జలాంతర్గత వ్యవస్థలు, డ్రోన్లను అభివృద్ధిచేయాలి’ అని నివేదిక పేర్కొంది. జోహన్నస్‌బర్గ్‌లో భారత్–దక్షిణాఫ్రికా దేశాల అభివృద్ధి భాగస్వామ్యం కోసం సీఐఐ–ఎగ్జిమ్ బ్యాంక్ ప్రాంతీయ సదస్సును నిర్వహించాయి. సదస్సులో ఈ నివేదికను ఆవిష్కరించారు. హిందూ సముద్ర ప్రాంత భద్రత, రక్షణలో భారత్, ఆఫ్రికా దేశాల పాత్ర కీలకమైనదని నివేదిక శ్లాఘించింది. సైబర్ సెక్యూరిటీలోనూ దేశాల పరస్పర సహకారం ప్రధానమని సూచించింది. ఈ సదస్సులో పలు ప్రభుత్వాల ఉన్నతాధికారులు, పరిశ్రమల, వ్యాపార సంస్థల అధినేతలు పాల్గొని ఏఏ అంశాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పటిష్టంచేసుకోవాలో చర్చించారు. -
జొహన్నెస్‌బర్గ్ కెప్టెన్‌గా డుప్లెసిస్
కేప్‌టౌన్: చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) పాత మిత్రులు స్టీఫెన్ ఫ్లెమింగ్, డుప్లెసిస్ మళ్లీ జట్టు కట్ట నున్నారు. సీఎస్కే యాజమాన్యం దక్షిణాఫ్రికా టి20 లీగ్‌లో కొనుగోలు చేసిన జొహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ కోసం ఇద్దరు కలిసి పని చేయనున్నారు. ఈ జట్టుకు ఫ్లెమింగ్ కోచ్ కాగా, డుప్లెసిస్ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు చెన్నై డుప్లెసిస్‌ను విడుదల చేశాక ఈ ఏడాది బెంగళూరుకు సారథ్యం వహించి జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) టి20 లీగ్‌లో ఓ మినీ సీఎస్కే జట్టే బరిలోకి దిగబోతోంది. ఎందుకంటే మొయిన్ అలీ (ఇంగ్లండ్), మహీశ్ తీక్షణ (శ్రీలంక), రొమారియో షెఫర్డ్ (విండీస్)లు కూడా జొహన్నెస్‌బర్గ్ జట్టులో ఉన్నారు. ఆటగాళ్లే కాదు కోచింగ్ సిబ్బంది కూడా సీఎస్కేతోనే నిండిపోతోంది. ఫ్లెమింగ్ హెడ్‌కోచ్‌గా, ఎరిక్ సిమన్స్ సహాయ కోచ్‌గా వ్యవహరిస్తారు. ఒకప్పుడు సీఎస్కేకు ఆడిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఆల్బీ మోర్కెల్‌ను కూడా జొహన్నెస్‌బర్గ్ జట్టు కోచింగ్ సిబ్బందిలో నియమించనున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఆరంభంలో సీఎస్ఏ టి20 లీగ్ జరిగే అవకాశముంది. -
మోడల్స్‌పై గ్యాంగ్ రేప్.. 67 మంది అరెస్ట్
జోహెన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో అక్రమ చొరబాటుదారులు పైశాచికానికి తెగబడ్డారు. మ్యూజిక్ వీడియో షూట్‌లోకి ఆయుధాలతో చొరబడి.. మోడల్స్‌పై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. అంతేకాదు.. మగవాళ్ల దుస్తులు ఊడదీసి.. వాళ్లతో డ్యాన్సులు చేయించి మరీ పైశాచిక ఆనందం పొందారు. దక్షిణాఫ్రికా జోహెన్నెస్‌బర్గ్ పశ్చిమంగా ఉన్న క్రూగర్స్‌డ్రాప్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. నిందితులను జామా జామాలుగా గుర్తించిన జోహెన్నెస్‌బర్గ్ పోలీసులు.. అక్రమ మైనింగ్ కోసం పొరుగు ప్రాంతాల నుంచి అక్రమంగా చొరబడతారని, తరచూ దోపిడీలకు పాల్పడతారని వెల్లడించారు. వాళ్లు దాడి చేసింది దోపిడీ కోణంలోనే అయినా.. మోడల్స్ కనిపించేసరికి అత్యాచారానికి తెగబడ్డారని, ఇలా జరగడం ఇదే మొదటి ఘటన అని పోలీసులు తెలిపారు. బాధితులంతా 35 ఏళ్ల లోపువాళ్లేనని తెలుస్తోంది. ఆపై మగవాళ్లతో నగ్న నృత్యాలు చేయించి.. వాళ్ల దగ్గర ఉన్న సొమ్ము, నగలను దోచుకెళ్లారు. గుంపుగా దుండగులు దాడి చేసినట్లు బాధితులు వెల్లడించగా.. 67 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లలో చాలామంది అక్రమ చొరబాటులేనని నిర్ధారించారు. ఇక ఘటనపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా స్పందించారు. అలాంటి మృగాలకు బతికే హక్కు లేదని, కఠిన శిక్ష విధించి తీరతామని తెలిపారు. -
సౌతాఫ్రికా టి20 లీగ్‌లో ఆడనున్న ఎంఎస్ ధోని?
ఐపీఎల్‌కు చెందిన ఆరు ఫ్రాంచైజీలు సౌతాఫ్రికా టి20 లీగ్‌లో ఉన్న జట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో సౌతాఫ్రికా టి20 లీగ్ తొలి సీజన్ ప్రారంభించేందుకు క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) కసరత్తులు చేస్తోంది. టోర్నీలో మొత్తం ఆరు జట్లు ఉండగా.. కేప్‌టౌన్‌ను-ముంబై ఇండియన్స్, జోహన్నెస్‌బర్గ్- చెన్నై సూపర్ కింగ్స్, డర్బన్- లక్నో సూపర్ జెయింట్స్, పోర్ట్ ఎలిజిబెత్- ఎస్ఆర్హెచ్, ప్రిటోరియా-ఢిల్లీ క్యాపిటల్స్, పార్ల్- రాజస్తాన్ రాయల్స్ దక్కించకున్నాయి. కాగా జోహన్నెస్‌బర్గ్‌ను దక్కించుకున్న సీఎస్కే నుంచి ఇంకో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. సీఎస్కే తరపున విజయవంతమైన కెప్టెన్‌గా పేరు పొందిన ఎంఎస్ ధోని సౌతాఫ్రికా టి20లీగ్‌లో ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎస్కేతో ఉన్న అనుబంధం దృశ్యా ప్రొటిస్ టి20 లీగ్‌లో ఆడనున్నట్లు తెలిసింది. ఇది నిజమైతే మాత్రం సీఎస్కే కొనుగోలు చేసిన జోహన్నెస్‌బర్గ్‌కు ధోని కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఐపీఎల్లో ధోని ఎంత సక్సెస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి సీఎస్కేలో కొనసాగిన ధోని జట్టును నాలుగుసార్లు విజేతగా(20210, 2011,2018, 2021).. మరో ఐదుసార్లు రన్నరప్‌గా(2008,2012,2013,2015,2019) నిలిపాడు. 2010, 2014లో ధోని సీఎస్కేకు చాంపియన్స్ లీగ్ టి20 టైటిల్స్ అందించాడు. గత ఐపీఎల్ సీజన్లో ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాడు. కానీ అంచనాలకు భిన్నంగా దారుణంగా విఫలమైన సీఎస్కే నిరాశపరిచింది. దీంతో సీజన్ మధ్యలోనే జడ్డూ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. మళ్లీ ధోనినే కెప్టెన్సీ అందుకున్నాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 10 ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2022 సీజన్ ధోనికి ఆఖరిదని అంతా భావించినప్పటికి.. ఆ వార్తలను ఖండించిన ధోని తర్వాతి సీజన్లోనూ ఆడనున్నట్లు స్పష్టం చేశాడు. చదవండి: పేరుకే సౌతాఫ్రికా టి20 లీగ్.. అన్ని ఫ్రాంచైజీలు మనోళ్లవే.. Graeme Smith: కీలక పదవి చేపట్టనున్న సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ -
మనందరి పూర్వీకుల పురిటిగడ్డ ఆఫ్రికా...
తెలుగు తల్లి.. భారత మాత.. మనకు తెలుసు. ఈ ‘ఆదిమ అమ్మ’ ఎవరు? ఎప్పుడూ వినలేదే.. అనే కదా మీ ఆశ్చర్యం..?! ‘ఆదిమ అమ్మ’ గురించి తెలుసుకోవాలంటే.. మనందరి పూర్వీకుల పురిటిగడ్డగా భావిస్తున్న ఆఫ్రికా వెళ్లాలి! ఇంకా చెప్పాలంటే దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నగరానికి దగ్గర్లో ఉన్న అతి పురాతన గుహల్లోకి వెళ్లాల్సిందే!! మనిషి బుద్ధిజీవి. అసలు మనిషి పుట్టుకకు ముందు సుదీర్ఘమైన పరిణామ క్రమం ఉంది. పురాతన కాలపు చరిత్రకు శాస్త్రీయ, సజీవ, సుసంపన్న, అమూల్య సాక్ష్యంగా నిలిచింది ఆఫ్రికా.. మరీ ముఖ్యంగా సౌతాఫ్రికా! 98 ఏళ్లుగా కొనసాగుతున్న తవ్వకాల్లో ఇందుకు గట్టి సాక్ష్యాలు దొరికాయి. అనేక ఆదిమ, ఆధునిక మానవ జాతులకు సంబంధించిన శిలాజాలను శాస్త్రవేత్తలు సేకరించి, విశ్లేషించారు. అందుకే ఈ గుహల సముదాయానికి ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’ అని పేరు వచ్చింది. ప్రపంచ మానవాళికి పురుడుపోసిన ఈ ‘క్రెడిల్’ను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించింది. ఇటీవల జోహన్నెస్‌బర్గ్ వెళ్లిన సందర్భంగా అక్కడ నేను తెలుసుకున్న విశేషాలు... 25 లక్షల ఏళ్ల నాటి ‘మిసెస్ ప్లెస్’ జోబర్గ్(స్థానికంగా జోహన్నెస్‌బర్గ్‌ను అలా అంటారు)కు 45 కిలోమీటర్ల దూరంలో విస్తారమైన గడ్డి భూముల నడుమ ఆదిమానవులు లక్షలాది ఏళ్ల క్రితం నివసించిన గుహలున్నాయి. ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’గా ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ ప్రాంతం సుమారు 450 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అందులో దాదాపు 300 చారిత్రక గుహల సముదాయం ఉంది. కనీసం 15 గుహల్లో మానవాళి పుట్టుక ఇక్కడే అని ధ్రువీకరించే కీలక శిలాజాలు లభించాయి, ఇంకా లభిస్తున్నాయి. అటువంటి సుసంపన్న శిలాజ గనుల్లో అతి ముఖ్యమైనది ‘స్టెర్క్ఫాంటీన్’ గుహ. కుటుంబ సభ్యులు, సహ పర్యాటకులతో కలసి ఎంతో ఉత్సుకతతో ఈ గుహలోకి అడుగుపెట్టాను. లక్షల ఏళ్ల క్రితం అక్కడ జీవించి, అదే మట్టిలో కలిసిపోయిన మానవ జాతుల విశేషాల గురించి గైడ్ ఉద్వేగంగా చెబుతుండగా.. అదే గుహలో 1947లో ‘పాలియో ఆంత్రపాలజిస్టు’లు డా. రాబర్ట్ బ్రూమ్, డా. జాన్ టి. రాబిన్సన్లు కనుగొన్న పురాతన మహిళ ‘మిసెస్ ప్లెస్’ కపాలం నమూనాను చేతుల్లోకి తీసుకున్నాను. 25 లక్షల సంవత్సరాల క్రితం ఆమె జీవించిందట. డోలమైట్‌తో కలగలిసిన సున్నపు రాతి నిల్వలున్న గుహ అది. అక్కడి మట్టిని తాకి.. చిన్న సున్నపు రాతి ముక్కను తీసుకున్నాను. గుహ అడుగున కొద్దిపాటి నీటి మడుగు ఉంది. సుదీర్ఘ మానవ చరిత్రను మౌనంగా వీక్షిస్తున్న ఆ చల్లని నీటిని చేతి వేళ్లతో తాకాను. ఉన్నట్టుండి.. మా చేతుల్లో ఉన్న టార్చ్లైట్లన్నిటినీ ఒక్క నిమిషం ఆర్పేయమని గైడ్ చెప్పింది. 60 గజాల లోతున చల్లని గుహంతా చిమ్మచీకట్లతో కూడిన నిశ్శబ్దం ఆవరించింది. మన అందరి కుటుంబ వృక్షం వేరు మూలాలను తడుముతున్నట్లు ఆ క్షణంలో.. నా మనసంతా మాటల్లో చెప్పలేని ఉద్వేగంతో నిండిపోయింది! షీ ఈజ్ అజ్! మనుషులంటే పురుషుడేనా? మహిళ కాదా? తెల్లజాతీయుల నుంచి దారుణమైన జాతి వివక్షను ఎదుర్కొన్న మనమే ఇలా పప్పులో కాలేస్తే ఎలా? అని మరపెంగ్ సమచార కేంద్రం నిర్వాహకులు ఆలస్యంగా నాలుక కరచుకొని ఆనక దిద్దుబాటు చేశారు. ఆసియావాసుల పోలికలతో చామన ఛాయలో ఉన్న ఆధునిక మహిళ ముఖచిత్రాన్ని సైతం రెండేళ్ల క్రితం జోడించి ఈ ప్రపంచ వారసత్వ మ్యూజియానికి పరిపూర్ణత చేకూర్చారు. అంతేకాదు మనం ఏ దేశవాసులమైనా ప్రపంచ ప్రజలందరి పూర్వీకులూ బంధువులేనన్న భావనతో ‘ఆమే మనం (షీ ఈజ్ అజ్)’ అని కూడా ప్రకటించారు! ఇదీ దక్షిణాఫ్రికాలోని ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’లో మెరిసిన మన ‘ఆదిమ అమ్మ’ కథ!! ∙∙ శాస్త్ర సాంకేతిక పురోగతి వెలుగులో అనేకానేక సంక్లిష్టతలను అధిగమిస్తున్నప్పటికీ పురాతన చారిత్రక విషయాల్లో ఊహకు అందని చీకటి అంకాలెన్నో ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ కారణంగానే సాధ్యమైనంత వరకు ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’ దృష్టికోణం నుంచే ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిలాజాల పుట్ట దక్షిణాఫ్రికాలోని జోబర్గ్ సమీపంలో హాటెంగ్, నార్త్‌వెస్ట్ రాష్ట్రాల సరిహద్దుల్లో 47 వేల హెక్టార్ల విస్తీర్ణంలో రమణీయ కొండ కోనల మధ్య విస్తరించిన అందమైన గడ్డి భూముల్లో సుమారు 300 వరకు పురాతన గుహలున్నాయి. వీటిలో పన్నెండు గుహల్లో ఎన్నో ఆది, ఆధునిక మానవ జాతుల ఉనికిని బలంగా ఎలుగెత్తి చాటే శిలాజాలు లభించాయి. 1924లో ‘టాంగ్ చైల్డ్’, మొదలుకొని మిసెస్ ప్లెస్, ‘హోమో నలెడి’ వరకూ.. గత 98 ఏళ్లుగా ఈ గనుల్లో లభించిన అనేక శిలాజాలే ఇందుకు నిదర్శనాలు. యునెస్కో 1999లో ‘ప్రపంచ వారసత్వ స్థలం’గా గుర్తించడంతో.. విశ్వ పర్యాటకులకు ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’ ఆకర్షణగా నిలిచింది. మరో 9 వారసత్వ స్థలాలు కూడా సౌతాఫ్రికాలో ఉన్నాయి. చెట్టుదిగి నడవటమే గొప్ప మలుపు సుమారు 2,600 కోట్ల ఏళ్లకు పూర్వం (నియో ఆర్చియన్ యుగంలో) ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’ ప్రాంతం సముద్రపు నీటిలో మునిగి ఉండేది. కాలక్రమంలో సున్నపు రాళ్లు–డోలమైట్‌తో కలగలిసిన గుహలు రూపుదిద్దుకున్నాయి. అటువంటి వందలాది అతిపురాతన గుహలు జోబర్గ్ పరిసర ప్రాంతంలో ఉన్నాయి. వాతావరణ మార్పుల మూలంగా క్రమంగా సముద్రం వెనక్కి తగ్గటంతో.. తదనంతర కాలంలో చింపాంజీలు, ఏప్(వాలిడులు)లకు, ఆది మానవులకు, జంతుజాలానికి భూమి ఆలవాలమయింది. మారుతున్న పర్యావరణ పరిస్థితుల కారణంగా ఆదిమానవులు అడవిలో చెట్ల మీద నుంచి నేల మీదకు దిగి, రెండు కాళ్లపై నిలబడి పచ్చిక బయళ్లున్న ప్రాంతాల్లోకి నడిచారు. మానవ పరిణామ చరిత్రను మలుపు తిప్పిన ఘట్టం ఇది! అయితే, ఏప్‌ల నుంచి మనిషి ఎలా విడిపోయాడనేదానికి ఇప్పటికీ సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు. శీతోష్ణ పరిస్థితుల రీత్యా ఆఫ్రికా గడ్డపైనే ఈ పరిణామం చోటు చేసుకుందని చెబుతారు. ఆ విధంగా అనేక ఆదిమ జాతులతో పాటు కాలక్రమంలో దాదాపు 2 లక్షల ఏళ్ల నాడు ఆలోచనా శక్తి కలిగిన ఆధునిక మానవజాతి (హోమోసెపియన్) ఆవిర్భవించింది. మొదటి శిలాజ ఆవిష్కరణ మానవాళి చరిత్రలో దక్షిణాఫ్రికా ప్రాధాన్యాన్ని లోకానికి చాటిన మొదటి శిలాజ ఆవిష్కరణ ‘టాంగ్ చైల్డ్’. ఇది ‘ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికనస్’ జాతి శిశువుకు చెందిన కపాల శిలాజం. 1924 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాలోని నార్త్ వెస్ట్ ప్రావిన్స్‌లోని టౌంగ్లో దీన్ని క్వారీ కార్మికులు గుర్తించారు. జోహన్నెస్‌బర్గ్‌లోని విట్వాటర్స్రాండ్ విశ్వవిద్యాలయ శరీర నిర్మాణ శాస్త్రవేత్త ప్రొ. రేమండ్ డార్ట్ దీని విశిష్టతను గుర్తించి ‘నేచర్’లో వ్యాసం రాశారు. దీనికి ‘ఆస్ట్రాలోపిథెకస్ ఆఫ్రికనస్’ లేదా ‘ఆఫ్రికా దక్షిణ కోతి‘ అని పేరు పెట్టినప్పటికీ, శిలాజం తాలూకు శిశువుకు మనిషి లక్షణాలున్నాయని ఆయన గుర్తించారు. మానవ పరిణామాన్ని మలుపు తిప్పిన శిలాజాలు లభించిన మరికొన్ని ప్రపంచ వారసత్వ స్థలాల గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి. ఇండోనేషియా జావాలోని సంగిరన్ ఎర్లీ మాన్ సైట్, చైనాలోని జౌకౌడియన్, ఇథియోపియాలోని లోయర్ వాలీ ఆఫ్ ద అవష్, లోయర్ వ్యాలీ ఆఫ్ ఓమోతోపాటు.. టాంజానియాలోని ఓల్డ్వాయ్ జార్జ్, ఎర్లీ హోమినిడ్ ఫుట్‌ప్రింట్స్ (లెటోలి). వీటిలో 36 లక్షల ఏళ్ల నాటి పురాతన మానవుల శిలాజాలు లభించటం విశేషం. ‘తెలివి’కి 2 లక్షల ఏళ్లు! మానవ పరిణామ చర్రితను స్థూలంగా ‘హోమోసెపియన్’ జాతికి ముందు.. తర్వాత.. అని విభజిస్తే అర్థం చేసుకోవటం సులభం. ఈ జాతీయులకు అంతకు పూర్వీకులైన ‘ఆస్ట్రాలోపిథెసిన్’ల కంటే పెద్ద మెదడు ఉంది. రాతి పనిముట్లను రూపొందించే శారీరక సామర్థ్యంతో పాటు.. మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న మొదటి మానవ జాతి ఇది. ‘హోమోసెపియన్’ జాతీయులు సుమారు 23 లక్షల సంవత్సరాల క్రితం తొలుత ఆఫ్రికాలో జీవించారు. ఇందులో అనేక ఉప జాతులున్నాయి. మొదటిది.. హోమోహబిలిస్. వీరు 19 లక్షల సంవత్సరాల క్రితం జీవించారు. వీళ్ల వారసులే ‘హోమోఎర్గాస్టర్’లు. దాదాపు 17 లక్షల సంవత్సరాల క్రితం జీవించారట. ఆధునిక సాధనాల ఉపయోగం, వంట, వెచ్చదనం కోసం అగ్నిని ఉపయోగించుకునే సామర్థ్యం వీరికుంది. ఈ సామర్థ్యమే వీరి వారసులు ఆఫ్రికాను వదలి చల్లని ప్రదేశాలకు వలస వెళ్లేలా చేసిందట. ఆ కొన్నాళ్లకే ‘హోమోఎరెక్టస్’ ఉద్భవించింది. హోమోసేపియన్ జాతీయులు అభివృద్ధి చెందే కొద్దీ, నైపుణ్యాలను అందిపుచ్చుకునే కొద్దీ వారి మెదడు కూడా వికసించింది. ఆ క్రమంలోనే సుమారు 2 లక్షల సంవత్సరాల క్రితం తొలి ఆధునిక మానవులైన ‘హోమోసేపియన్లు’ ఆఫ్రికాలో ఉద్భవించారు. లాటిన్లో హోమో అంటే ‘మానవులు‘, సేపియన్స్ అంటే ‘తెలివైన’అని అర్థం. క్రీ.శ. 1758లో కార్ల్ లిన్నేయస్ ఈ పదబంధాన్ని తొలిసారి వాడారు. ఇథియోపియాతోపాటు దక్షిణాఫ్రికాలో హొమో సేపియన్ జాతి శిలాజాలు కొన్ని బయటపడ్డాయి. ఈ క్రమంలోనే కనీసం 70 వేల సంవత్సరాల నుంచే మనుషులు అలంకరణ, కళాకృతుల తయారీ వంటి ఆధునిక పోకడలను సైతం అలవర్చుకున్నారు. హోమో సేపియన్లు కాలక్రమంలో ఆఫ్రికా నుంచి భూగోళం మీదున్న అన్ని భూభాగాలకూ విస్తరించారంటున్నారు పరిశోధకులు. నిజంగా మానవాళి పురిటి గడ్డేనా?∙ 1920–30లలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన శిలాజాల చారిత్రక ప్రాముఖ్యతను చాలా మంది శాస్త్రవేత్తలు, ముఖ్యంగా ఆఫ్రికా వెలుపల ఉన్నవారు, తొలుత కొట్టిపారేశారు. 1912లో ఇంగ్లండ్‌లోని ససెక్స్‌లో బయటపడిన ‘పిల్ట్‌డౌన్ మ్యాన్‘ అనే మానవ కపాల శిలాజంపైనే వారి దృష్టి ఎక్కువగా కేంద్రీకృతమైంది. దీన్ని ‘ఎయోంత్రోపస్ డాసోని’ జాతిగా వర్గీకరించారు. ఈ పుర్రెను చార్లెస్ డాసన్ కనుగొన్నందున ఆయన పేరునూ దీనికి జోడించారు. ఐరోపాలో వెలుగుచూసిన సుదూర మానవ పూర్వీకుడుగా ‘పిల్ట్‌డౌన్ మ్యాన్’ ను అభివర్ణించారు. కోతిలాంటి దవడను, ఆధునిక మానవు (హోమోసేపియ¯Œ )ల మాదిరిగా పెద్ద మెదడు కలిగిన జీవిగా చెప్పుకొచ్చారు. దక్షిణాఫ్రికాలో శిలాజాల ప్రాధాన్యాన్ని తెలియజెబుతూ ప్రొ. రేమండ్ డార్ట్, డా. రాబర్ట్ బ్రూమ్ చేసిన విశ్లేషణలపై పాశ్చాత్య శాస్త్రవేత్తలు వివాదానికి దిగారు. వీరిద్దరూ దక్షిణాఫ్రికాలో కనుగొన్న ‘ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికనస్’ శిలాజాల మెదడు పరిమాణం చిన్నగా ఉండటం విమర్శకులకు అనుకూలించింది. అయితే, దశాబ్దాలు గడచిన తర్వాత, నిజం నిలకడ మీద బయటపడింది. ‘పిల్ట్‌డౌన్ మ్యాన్’ శిలాజం నకిలీదని చివరికి 1953లో శాస్త్రీయ పరిశోధనల్లో బట్టబయలైంది. మానవ పుర్రెకు ఒరాంగుటాన్ జంతువు దవడ (దంతాలను అరగదీసి మనిషివిగా చిన్నగా కనిపించేలా చేశారు)తో కలిపి పాతిపెట్టి.. సహజమైన శిలాజంగా నమ్మించే ప్రయత్నం చేశారని తేలింది. పిల్ట్‌డౌన్ బూటకం చాలామంది శాస్త్రవేత్తలను 40 ఏళ్లకు పైగా తప్పుదోవ పట్టించింది. దక్షిణాఫ్రికా శిలాజాల చారిత్రక ప్రాధాన్యాన్ని అందరూ గుర్తించడం ఆ మేరకు ఆలస్యమైనా.. శాస్త్రీయంగా రూఢి అయ్యింది. ఈ బూటకపు శిలాజం సృష్టికర్తలెవరో నేటికీ కచ్చితంగా తెలియరాలేదు. దక్షిణాఫ్రికాలో ‘ఆస్ట్రాలోపిథెకస్ ఆఫ్రికనస్’ జాతికి చెందిన అనేక శిలాజాల ఆవిష్కరణలు ఆ తర్వాత కూడా వెలుగులోకి వస్తుండటం, పిల్ట్‌డౌన్ స్కామ్ బహిర్గతం కావటంతో.. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ‘మానవజాతి పురిటి గడ్డ’ ఆఫ్రికా అని ఎట్టకేలకు అంగీకరించారు. దక్షిణాఫ్రికా శిలాజ వారసత్వం ప్రాముఖ్యతను గుర్తించిన మొదటి తరం ఆంగ్ల శాస్త్రవేత్తల్లో సర్ విల్ఫ్రెడ్ లీ గ్రాస్ క్లార్క్ ఒకరు. ∙∙ ఈ పూర్వరంగంలో పురాతన నాగరికతలు 10,000 ఏళ్ల క్రితం పురుడుపోసుకున్నాయి. లిపి ఆవిర్భవించిన తర్వాత మానవ వికాసం మనకు తెలిసిన చరిత్రే. మానవ జనాభా 2000 ఏళ్ల క్రితం 20 కోట్లు ఉండేది. 790 కోట్లకు పెరిగింది. భూగోళంపైన, కొండ శిఖరాల నుంచి దీవుల వరకు, మట్టి కనిపించే ప్రతి చోటుకూ మనం విస్తరించాం. ధ్వని కన్నా వేగంగా భూగోళం ఆ దరి నుంచి ఈ దరికి ప్రయాణించగలుగుతున్నాం. కానీ, పుడమి పర్యావరణాన్ని మనం కలుషితం చేస్తున్నాం.. ప్రకృతిసిద్ధమైన జంతుజాలం ఆవాసాలను నాశనం చేస్తున్నాం.. అత్యాధునిక రూపాల్లో యుద్ధాలకు తెగబడుతున్నాం.. సుదీర్ఘ పరిణామ క్రమంలో అందివచ్చిన గొప్ప తెలివి తేటలు మనల్ని దీర్ఘకాలం జీవించనిస్తాయా? లేక గంపగుత్తగా దుంపనాశనం చేస్తాయా? పుట్టింటికి పునరాహ్వానం! యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’కు సంబంధించిన అధికారిక మ్యూజియం కమ్ సమాచార కేంద్రం పేరు ‘మరపెంగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్’. మేం చూసిన ‘స్టెర్క్ఫాంటీన్’ గుహకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఇది ఉంది. 29 మిలియన్ డాలర్ల ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. 2005 డిసెంబర్ 7న ప్రారంభమైన ‘మరపెంగ్’.. మానవ పరాణామ విజ్ఞానశాస్త్ర గని అని చెప్పొచ్చు. పర్యాటకులను, మానవ పరిణామ శాస్త్ర అధ్యయనకారులను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే రీతిలో విశేషాలేన్నిటినో ఇక్కడ పొందికగా ఆవిష్కరించారు. మరపెంగ్ అంటే.. స్థానిక ‘సెస్త్వానా’ భాషలో ‘పుట్టింటికి పునరాహ్వానం’ అని అర్థం. ‘వెల్కమ్ హోమ్.. ఎక్స్ప్లోర్ యువర్ హ్యూమన్ హెరిటేజ్’ అంటూ తెల్లని పతాకం మనల్ని లోపలికి ఆహ్వానిస్తుంటుంది. విశ్వం, భూమి, జీవుల పుట్టుక.. తదనంతర పరిణామక్రమంలో ఆది మానవుల పుట్టుక, నిప్పు వాడుక/ నియంత్రణ, రాతి పరికరాల వాడటం.. ఆధునిక మానవుల పుట్టుక, జీవన వికాసాలకు సంబంధించిన ముఖ్య ఘట్టాలను ‘మరపెంగ్’లోని భూగర్భ మ్యూజియం అత్యద్భుతంగా పర్యాటకుల కళ్లకు కడుతోంది. ఆదిమ, ఆధునిక మానవ జాతులకు ప్రతీకలుగా రూపొందించిన కొన్ని విగ్రహాలను, సజీవ వ్యక్తులను తలపించేలా చారిత్రక ఔచిత్యంతో రూపకల్పన చేసిన ముఖచిత్రాలను ప్రదర్శించారు. కోతిని పోలిన నలుపు/చామన ఛాయ ఆదిమానవుల దగ్గర నుంచి జర్మనీ మూలాలున్న నియాండర్తల్ తెల్ల జాతీయుడి ముఖచిత్రం వరకు ఇందులో ఉన్నాయి. అయితే, వాటిలో చాలా వరకు పురుషుల ముఖ చిత్రాలే! భూగర్భ వ్యోమగాములు! అవును.. మీరు చదివింది నిజమే.. వ్యోమగాముల అవసరం రోదసిలోనే కాదు, ఒక్కోసారి భూగర్భంలోనూ ఉంటుంది. గుహలో అత్యంత క్లిష్టమైన స్థితిలో శిలాజాల అన్వేషణలో క్లిష్ట దశను అధిగమించడానికి అవసరమైంది. ఆ సాహస కార్యాన్ని ఆరుగురు మహిళా శాస్త్రవేత్తలు అద్భుతంగా నెరవేర్చి శభాష్ అనిపించుకున్నారు. ‘భూగర్భ వ్యోమగాముల’ను మేం ముద్దుగా పిలుచుకుంటున్న ఈ ఆరుగురు మహిళా శాస్త్రవేత్తలు లేకుండా మన దగ్గరి బంధువైన ఓ కొత్త జాతి ఆవిష్కరణ సాధ్యమయ్యేది కాదని ప్రధాన పరిశోధకుడు ప్రొ. లీ బెర్గర్ 2015 సెప్టెంబర్‌లో ప్రకటించారు. ఈ ఆదిమ జాతికి ‘హోమో నెలడి’ అని పేరుపెట్టారు. ఏడేళ్ల కిందట.. జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్‌కైండ్’ గుహల సముదాయంలోని రైజింగ్ స్టార్ అనే గుహలో శిలాజాల కోసం అన్వేషణ ఉత్కంఠభరితంగా సాగుత్ను రోజులవి. 18 సెం.మీ. ఖాళీలోంచి.. ప్రొ. లీ బెర్గర్ బృందం గని లోపల తవ్వకాలు చేస్తుండగా. ఆది మానవుల శిలాజాలు కొన్ని దొరికాయి. అక్కడి నుంచి కిందికి చిన్న దారి కనిపించింది. ఆ లోపల 30 మీటర్ల కింద మరో చిన్న గది కనిపించింది. అందులో ఇంకా మానవ శిలాజాలు ఉన్నాయని ప్రత్యేక పరికరాల ద్వారా త్రీడీ స్కాన్ ద్వారా కనుగొన్నారు. అయితే, ఆ దారిలో రెండు బండరాళ్ల మధ్య కేవలం 18 సెంటీమీటర్ల (ఫుట్‌బాల్ కన్నా తక్కువ) ఖాళీ మాత్రమే ఉంది. మనిషి లోపలికి వెళ్లకుండా శిలాజాలను సేకరించలేం. అంత సన్నని దారిలోంచి లోపలికి వెళ్లటం ఎలా? అంత సన్నగా ఉండే మనుషులైతే లోపలికి వెళ్లగలరన్న ఆలోచనతో ప్రొ. లీ బెర్గర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేశారు. 18 సెం.మీ. కన్నా సన్నని శరీరం కలిగిన పురావస్తు తదితర శాస్త్రాల్లో పీజీ చదివి ఉండి, గుహల్లోకి దిగే అనుభవం ఉన్న వారెవరైనా సంప్రదించమని కోరారు. పది రోజుల్లో 60 దరఖాస్తులు వచ్చాయి. అందులో నుంచి అన్ని అర్హతలున్న 6గురు మహిళా శాస్త్రవేత్తలను ఎంపిక చేశారు. వారే.. ఈ భూగర్భ వ్యోమగాములు.. మెరీనా ఇలియట్ (కెనడా), బెక్కా పీక్సోటో (వాషింగ్టన్ డిసి), లిండ్సే హంటర్ (అయోవా), ఎలెన్ ఫ్యూరిగెల్ (ఆస్ట్రేలియా), హన్నా మోరిస్ (ఒహైయో), అలియా గుర్టోవ్ (విస్కాన్సిన్). 30 మీటర్ల దిగువ వరకు పాక్కుంటూ వెళ్లి శిలాజాలను వెలికితీయటమే ఈ మహిళా శాస్త్రవేత్తలు చేసిన సాహసం. దాదాపు 3 వారాల పాటు సాగిందీ అన్వేషణ. దాదాపు 15 మందికి చెందిన 1500 ఎముకలు లభించాయి. ఆఫ్రికాలో ఒకేచోట ఇన్ని మానవ శిలాజాలు దొరకటం ఓ రికార్డు. యూరేసియా కూడా ముఖ్య రంగస్థలమే! ఆఫ్రికాయే మానవుల పురిటిగడ్డ అనే వాదనతో విభేదించే వారూ లేకపోలేదు. వీరిలో హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జెనెటిక్స్ ప్రొఫెసర్ డేవిడ్ రైక్ ఒకరు. ‘హూ వియార్ అండ్ హౌ వియ్ గాట్ హియర్’ అనే పుస్తకాన్ని ఇటీవలే వెలువరించారు. ప్రాచీన మానవ డీఎన్ఏ విశ్లేషణకు తోడ్పడిన పదిమంది మార్గదర్శకులలో ఒకరిగా డేవిడ్ రైక్‌కు గుర్తింపుంది. మానవ సంబంధ ఆవిష్కారాలన్నీ ఆఫ్రికాలోనే సంభవించాయని, అక్కడి వారే మిగతా ప్రపంచమంతా విస్తరించారనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు డేవిడ్ రైక్ . మానవ పరిణామక్రమంలో పురాతన మానవ జాతి నియాండర్తల్స్ నివసించిన యూరేసియా (యూరప్, ఆసియాలు మొత్తం విస్తరించిన ప్రాంతం) కూడా ముఖ్య రంగస్థలమే అంటున్నారాయన. ‘మానవులు అంతర్గతంగా మిశ్రమ పూర్వీకుల నుంచి ఉద్భవించారు. ఏ జనసమూహం కూడా స్వచ్ఛమైనది కాదు. భిన్నమైన సమూహాల కలయిక మానవ స్వభావపు సాధారణ లక్షణం. గతం నుంచి మనం నేర్చుకోవాలి.. మరింత కనెక్ట్ అవ్వాలి’ అంటున్నారు ప్రొ. డేవిడ్ రైక్. -పంతంగి రాంబాబు , సాక్షి ప్రత్యేక ప్రతినిధి, (జోహన్నెస్‌బర్గ్ నుంచి) -
కుంబ్లే సరసన శార్దూల్.. అరుదైన ఘనత సాధించిన బౌలర్‌గా రికార్డు
IND Vs SA 2nd Test Day 2: దక్షిణాఫ్రికాతో జొహనెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ ఐదు వికెట్లతో చెలరేగాడు. రెండో రోజు లంచ్ విరామానికి ముందు స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టిన అతను.. రెండో సెషన్లోనూ వరుస ఓవర్లలో రెండు వికెట్లు సాధించి తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించాడు. దీంతో జొహనెస్‌బర్గ్ వేదికగా ఈ ఘనత సాధించిన ఆరో ఇండియన్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ వేదికపై భారత దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే (6/53) తొలుత ఈ ఫీట్‌ను నమోదు చేయగా, ఆతర్వాత జవగళ్ శ్రీనాథ్ (5/104), శ్రీశాంత్ (5/40), జస్ప్రీత్ బుమ్రా (5/54), మహ్మద్ షమీ (5/29)లు ఈ మార్క్‌ని అందుకున్నారు. తాజాగా శార్దూల్ (5/37) వీరి సరసన చేరాడు. కెరీర్లో ఆరో టెస్ట్ ఆడుతున్న శార్ధూల్‌కి ఇదే తొలి 5 వికెట్ల ఘనత కావడం విశేషం. ఇదిలా ఉంటే, రెండో రోజు ఆటలో శార్ధూల్ చెలరేగడంతో టీమిండియా పట్టుబిగించింది. టీ విరామం సమయానికి 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. క్రీజ్‌లో జన్సెన్(2), కేశవ్ మహారాజ్(11) ఉన్నారు. శార్ధూల్‌తో పాటు షమీ(2/52) కూడా రాణించాడు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: Ind Vs Sa: అనవసరంగా బలైపోయాం.. కెప్టెన్ రాహుల్ అతడిని వెనక్కి పిలవొచ్చు! -
Ind Vs Sa 2nd Test: ప్రొటిస్‌కు అత్యధిక పరాజయాలు ఇక్కడే.. మరి ఈసారి?
Ind Vs Sa Test Series: ఆత్మవిశ్వాసంతో టీమిండియా... ఎదురుదెబ్బల నడుమ దక్షిణాఫ్రికా రెండో టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్నాయి. జొహన్నస్‌బర్గ్‌లోని వాండరర్స్ ఇందుకు వేదిక. ఈ మైదానంలో టీమిండియా ఇంతవరకు ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మరి.. ప్రొటిస్ రికార్డు ఇక్కడ ఎలా ఉందంటే... ►అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాక స్వదేశంలో వాండరర్స్ మైదానంలోనే దక్షిణాఫ్రికా అత్యధిక పరాజయాలు చవిచూసింది. ఓవరాల్‌గా ఈ వేదికపై దక్షిణాఫ్రికా 31 టెస్టులు ఆడింది. 11 టెస్టుల్లో ఓడి, 14 టెస్టుల్లో గెలిచింది, ఆరు టెస్టులు ‘డ్రా’ చేసుకుంది. ఇక రెండో టెస్టు సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు నమోదు చేయగలిగే రికార్డులు ఇవే ► ఈ మ్యాచ్‌లో మరో 6 వికెట్లు తీస్తే కపిల్‌దేవ్ (434 వికెట్లు)ను మూడో స్థానానికి నెట్టి టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత రెండో బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ (ప్రస్తుతం 429 వికెట్లు) గుర్తింపు పొందుతాడు. 619 వికెట్లతో అనిల్ కుంబ్లే టాపర్‌గా ఉన్నాడు. ► మరో 146 పరుగులు సాధిస్తే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టుల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఆరో క్రికెటర్‌గా గుర్తింపు పొందుతాడు. కోహ్లి ఇప్పటివరకు 98 టెస్టులు ఆడి 7,854 పరుగులు సాధించాడు. చదవండి: SA vs IND: ఇది గెలిస్తే... ప్రపంచాన్నే గెలిచినట్లు Ind Vs Sa 2nd Test: అక్కడ ఒక్కసారి కూడా భారత్ టెస్టు ఓడలేదు.. వాళ్లిద్దరికీ సూపర్ రికార్డు.. కాబట్టి -
ఇది గెలిస్తే... ప్రపంచాన్నే గెలిచినట్లు
‘టీమిండియా ఇంట్లో పులి... విదేశాల్లో పిల్లి’ అనే వ్యాఖ్య ఏళ్ల తరబడి భారత క్రికెట్ జట్టు ఘనవిజయాలను తక్కువ చేసేది. ఇప్పుడదే విమర్శకులు ‘భారత్ ఇంట్లో పులి... విదేశాల్లో బెబ్బులి’ అనే స్థాయికి టీమిండియా ఎదిగింది. ఇదంతా ఒక్క రోజులో రాలేదు. ఒకరిద్దరితో సాకారమవ్వలేదు. భారత్ పేసర్లు మన స్పిన్నర్లకు దీటుగా కొన్నేళ్లుగా శ్రమించడం వల్లే సాధ్యమైంది. ఇప్పుడు కూడా పేసర్ల ప్రతాపంతో ‘వాండరర్స్’లో ఈ ఒక్కటీ గెలిస్తే భారత టెస్టు చరిత్ర ఘనచరితగా మారనుంది. అంతర్జాతీయ టెస్టుల్లో విదేశీ పర్యటనల్లో అన్నింటా టెస్టు సిరీస్‌లు సాధించిన జట్టుగా నిలువనుంది. జొహన్నెస్‌బర్గ్: టెస్టుల్లో ‘గ్రేటెస్ట్’ అయ్యే అరుదైన అవకాశం కోహ్లి సేన ముందర ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)కు మించిన చరిత్ర లిఖించేందుకు ఒకే ఒక్క గెలుపు చాలు. ఈ దెబ్బకు సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ విజయమే కాదు... ప్రపంచ టెస్టు చరిత్రలో అన్ని దేశాలపై వారి సొంతగడ్డపై సిరీస్ విజయం సాధించిన అద్వితీయ రికార్డును భారత జట్టు సొంతం చేసుకుంటుంది. ఇంతకుముందే ఇంగ్లండ్, న్యూజిలాండ్ సహా ఆస్ట్రేలియాను కంగారూ పెట్టించినప్పటికీ దక్షిణాఫ్రికాపై మాత్రం దశాబ్దాలుగా సమర శంఖం పూరిస్తున్నా గెలిచే అవకాశం టీమిండియాకు దక్కలేదు. ఇప్పుడా సువర్ణావకాశం చేజిక్కించుకునేందుకు వాండరర్స్ మైదానం ఆహ్వానిస్తోంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సోమవారం నుంచి రెండో టెస్టు జరుగుతుంది. ఇందులో విరాట్ సేన విజయం సాధిస్తే మూడో టెస్టు దాకా సిరీస్ ఫలితం కోసం ఎదురు చూడాల్సిన పనే ఉండదు. సిరీస్ విజేతగా మరో చరిత్రను ఇక్కడే లిఖించవచ్చు. ఆత్మ విశ్వాసంతో భారత్... తొలి టెస్టు విజయం, సీమర్ల బలం భారత్‌ను పటిష్టస్థితిలో నిలిపింది. అలాగని బ్యాటింగ్‌లో తక్కువేం లేదు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌ల ఓపెనింగ్ జోడీకి ఫామ్‌లోకి వచ్చిన రహానే అనుభవం తోడయ్యింది. దీంతో భారత్ జట్టులో కండబలమే కాదు... గుండె బలం కూడా పెరిగిందని గట్టిగా చెప్పొచ్చు. పైగా వాండరర్స్‌లో ఏన్నడూ ఒడింది కూడా లేదు. ఇక్కడ ఐదు మ్యాచ్‌లాడిన భారత్ రెండు గెలిచి, మరో మూడు టెస్టుల్ని ‘డ్రా’గా ముగించింది. ఈ నేపథ్యంలో 2022 ఏడాదిలో కూడా మనకు శుభారంభం ఖాయమనుకోవచ్చు. ముఖ్యంగా బౌలింగ్ దళం మునుపెన్నడూ లేనంత దుర్భేద్యంగా తయారైంది. ఇంటాబయటా... వేదిక ఏదైనా మన పేసర్లకు ఎదురే లేకుండా పోతోంది. హైదరాబాదీ సీమర్ సిరాజ్... అనుభవజ్ఞులైన షమీ, బుమ్రాలతో పోటీపడి మరీ కీలక వికెట్లను పడగొట్టడం టీమిండియా సంతోషాన్ని రెట్టింపు చేసింది. బ్యాటింగ్‌లో కోహ్లి, పుజారా, రిషభ్ పంత్‌లు రాణిస్తే ప్రత్యర్థి బౌలర్లకు కంటిమీద కునుకుండదు. కానీ ఇక్కడ ప్రత్యర్థి కంటే వాతావరణంతోనే సమస్య ఎదురుకానుంది. టెస్ట్ జరిగే ఐదు రోజుల్లో నాలుగు రోజులపాటు వర్షం ముప్పు పొంచి ఉండటం కాస్త ఆందోళన పరిచే అంశం. డికాక్ చేసిన గాయంతో... ఉన్నపళంగా సిరీస్ మధ్యలోనే సీనియర్ వికెట్ కీపర్, బ్యాటర్ క్వింటన్ డికాక్ చేసిన రిటైర్మెంట్ గాయం జట్టు గత టెస్టు పరాజయానికంటే ఎక్కువగా ఉంది. అనుభవజ్ఞుల కొరతతో తల్లడిల్లుతున్న దక్షిణాఫ్రికా జట్టు పాలిట ఇది మరింత ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. తొలి టెస్టులో కెప్టెన్ ఎల్గర్ చక్కని పోరాటం చేశాడు. ఇతనికి మార్క్రమ్ తోడయితేనే శుభారంభమైనా... ఇంకేదైనా! లేదంటే ఆరంభంలోనే తడబడితే భారత సీమర్లు... తమకు కలిసొచ్చే బౌన్సీ వికెట్‌పై సఫారీ బ్యాటర్స్‌ను త్వరగానే కట్టేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా జట్టు ఒకరిద్దరిపై ఆధారపడితే కుదరనే కుదరదు. సిరీస్ పోరాటం ఆఖరి టెస్టుదాకా సాగాలంటే కచ్చితంగా ఎల్గర్ సేన సమష్టిగా పోరాడాల్సిందే. బ్యాటింగ్‌లో బవుమా, వాన్ డెర్ డసెన్ బాధ్యత పంచుకోవాలి. బౌలింగ్‌లో నోర్జే గైర్హాజరీ లోటే అయినా ఎన్గిడి, రబడ, ఒలివర్ చక్కని ప్రభావం చూపుతున్నారు. తమకు కంచుకోటలాంటి ‘సెంచూరియన్’లో ఎదురైన చేదు ఫలితానికి గట్టి బదులు తీర్చుకోవాలంటే తప్పకుండా సీమర్లంతా సర్వశక్తులు ఒడ్డాలి. భారత పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌కు తూట్లు పొడిస్తేనే సఫారీ ఆటలు వాండరర్స్‌లో సాగుతాయి. లేదంటే సెంచూరియన్ కథే పునరావృతమైన ఆశ్చర్యం లేదు. పిచ్, వాతావరణం వాండరర్స్ అంటేనే పేస్, బౌన్సీ వికెట్. గత మ్యాచ్‌లాగే ఇక్కడా సీమర్లు మ్యాచ్ విన్నర్లు కావొచ్చు. ఈ నేపథ్యంలో బ్యాటర్స్‌కు సవాళ్లు తప్పవు. అయితే వర్షం ముప్పు మ్యాచ్‌పై ఆందోళన పెంచుతోంది. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్, మయాంక్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, శార్దుల్, షమీ, బుమ్రా, సిరాజ్. దక్షిణాఫ్రికా: ఎల్గర్ (కెప్టెన్), మార్క్రమ్, పీటర్సన్, డసెన్, బవుమా, కైల్ వెరినె, ముల్డర్/జాన్సెన్, రబడ, కేశవ్ మహరాజ్, ఒలీవర్, ఎన్గిడి. -
నాలుగో వేవ్ నుంచి బయటపడ్డట్లే.. రెండేళ్ల తర్వాత కర్ఫ్యూ ఎత్తివేత
జొహన్నెస్‌బర్గ్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు మొదటిసారిగా బయటపడిన దక్షిణాఫ్రికాలో ప్రభుత్వం కొన్ని ఆంక్షలను తొలగించింది. దాదాపు రెండేళ్లుగా రాత్రి వేళ అమలవుతున్న కర్ఫ్యూను తొలగిస్తున్నట్లు గురువారం అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. అదేవిధంగా, సభలు, సమావేశాల్లో పాల్గొనే వారి సంఖ్యపై పరిమితిని పెంచింది. కరోనా నాలుగో వేవ్ తీవ్రత నుంచి దేశం బయటపడినట్లేనని పేర్కొంది. అయితే, ఒమిక్రాన్ కారణంగా కేసులు పెరిగే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఆఫ్రికా ఖండంలోనే అత్యధికంగా దక్షిణాఫ్రికాలో 35 లక్షల మంది కరోనా బారిన పడగా 90వేల మంది చనిపోయారు. చదవండి: (న్యూ ఇయర్ ఉత్సాహంపై ఒమిక్రాన్ నీడ) -
కరోనాకాలంలో జైలు శిక్షంటే మరణ శిక్షతో సమానం!
జొహన్నెస్‌బర్గ్: పదవీ కాలంలో అవినీతి ఆరోపణలపై కోర్టు జైలు శిక్ష విధించడంతో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా సానుభూతి పల్లవి అందుకున్నారు. ఇప్పటివరకు విచారణకు హాజరు కానంటూ బీరాలు పలికిన జూమా తాజాగా కొత్తపాట ఆరంభించారు. ఈ వయసులో, కరోనా సమయంలో తాను జైలుకు పోవడమంటే అది మరణ శిక్ష విధించినట్లేనంటూ సానుభూతిపరుల మద్దతుకు యత్నించారు. అంతలోనే తాను జైలుకు భయపడనంటూ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు 1980 కాలం నాటి నిర్భంధాన్ని గుర్తు తెస్తున్నాయంటూ విమర్శించారు. మరోవైపు జుమా అరెస్టును అడ్డుకునేందుకు పలువురు మద్దతుదారులు ఆయన నివాసం చుట్టూ మానవ కవచంలా నిలుచున్నారు. అవినీతి కేసులో 15నెలల జైలు శిక్ష విధించిన కోర్టు ఆయనంతట ఆయనే పోలీసులకు లొంగిపోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో తన ఇంటి బయట మద్దతుదారులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో 79ఏళ్ల వయసులో జైలుకు పోవడమంటే మరణశిక్ష విధించినట్లేనని, దక్షిణాఫ్రికాలో 1995లోనే మరణ శిక్ష రద్దయిందని చెప్పారు. ఇదే అభ్యర్ధన చేస్తూ ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానంలో తీర్పు పునఃసమీక్ష పిటీషన్ కూడా వేశారు. శనివారం ఈ పిటీషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించి, తదుపరి వాయిదాను జూలై 12కు వేసింది. అప్పటివరకు జైలు శిక్ష అమలు వాయిదా పడనుంది. కరోనా కాలంలో ఇంతమంది మద్దతుదారులు మాస్కుల్లేకుండా గుమికూడినా వారికి జుమా ఎలాంటి సూచనలు చేయలేదు. నిజానికి కరోనా నిబంధనల కాలంలో ఇలాంటి సమావేశం చట్టవ్యతిరేకమైనదని నిపుణులు చెబుతున్నారు. అయితే తమ నాయకుడిని అరెస్టు చేస్తే హింస తప్పదనే సంకేతాలను జుమా మద్దతుదారులిస్తున్నారు. జుమా, ఆయన మద్దతుదారుల ప్రవర్తనను పలువురు తీవ్రంగా ఖండించారు. -
కరోనాతో గాంధీ మునిమనవడు మృతి
జోహన్నెస్‌బర్గ్: కరోనా వైరస్ కారణంగా జాతిపిత మహాత్మా గాంధీ మునిమనవడు సతీష్ ధుపేలియా ఆదివారం జోహన్నెస్‌బర్గ్‌లో మరణించారు. ఆయన కరోనా వైరస్‌తో మృతి చెందినట్లు ఆయన సోదరి ఉమా ధుపేలియా తెలిపారు. న్యుమోనియాతో ఆస్పత్రిలో చేరిన తన సోదరుడికి కరోనా వైరస్ కూడా సోకిందని తెలిపారు. ఆయన నెల రోజుల నుంచి ఆస్పత్రిలో కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స పొందుతున్న సతీష్‌కి ఆదివారం హఠాత్తుగా గుండెపోటు రావటంతో మృతి చెందారని ఆమె సోషల్ మీడియలో వెల్లడించారు. ఆయనతో పాటు సోదరి ఉమా, మరో సోదరి కీర్తి మీనన్ జోహన్నెస్‌బర్గ్‌లో నివసిస్తున్నారు. చదవండి: ఆ రెండు మార్కెట్ల మూసివేత: ఆదేశాలు వెనక్కి! వీరు ముగ్గురు మహాత్మా గాంధీ చూపిన మార్గంలో రెండు దశాబ్దాలుగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సతీష్ ధుపేలియా మీడియా రంగంలో వీడియోగ్రాఫర్, ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. గాంధీ ప్రారంభించిన ‘గాంధీ డెవలప్మెంట్ ట్రస్ట్’ ద్వారా అనేక సేవలు అందింస్తూ.. సామాజిక కార్యక్రమాలు నిర్వహించేవారు. సతీష్ ధుపేలియా, ఉమా ధుపేలియా, కీర్తి మీనన్ వీరు ముగ్గురు మహాత్మాగాంధీ రెండో కుమారుడు మనీలాల్ గాంధీ వారసులు. చదవండి: భోజనం డబ్బు మా నాన్న తినేస్తున్నాడు -
నెల్సన్ మండేలా చిన్న కుమార్తె మృతి
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా చిన్న కుమార్తె జిండ్జీ(59) మృతి చెందినట్లు స్థానిక మీడియా సోమవారం వెల్లడించింది. ఈ రోజు ఉదయం జోహన్నెస్‌బర్గ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు పేర్కొంది. అయితే ఆమె మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. ప్రస్తుతం జిండ్జీ డెన్మార్క్ రాయబారిగా పనిచేస్తున్నారు. కాగా నెల్సన్ మండేలా- రెండో భార్య విన్నీ మడికిజెలాకు పుట్టిన సంతానం జిండ్జీ. (క్యాన్సర్‌తో మరో నటి కన్నుమూత) అయితే వీరు 1992లో విడాకులు తీసుకోగా విన్నీ మడికిజెలా 2018 ఏప్రిల్ నెలలో మృతి చెందారు. 1998లో తన పుట్టిన రోజు సందర్భంగా మండేలా మూడో భార్య గ్రాచా మాచెల్స్ను వివాహం చేసుకున్నారు. నెల్సన్ మండేలాకు మొత్తం ముగ్గురు భార్యలు ఆరుగురు సంతానం. 20 మంది మనువలు, మనవరాళ్లు ఉన్నారు. కాగా మండేలా తీవ్ర శ్వాసకోశ సంబంధ అస్వస్థతతో బాధపడుతూ 2013 డిసెంబర్ 5 న జోహన్నెస్‌బర్గ్‌లో మరణించారు. -
ఇలాంటి వింత ఇల్లు ఎప్పుడైనా చూశారా!
జోహన్నెస్‌బర్గ్ : ప్రపంచంలో ఇలాంటి ఇల్లు మాత్రం మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఎందుకంటే ఆ ఇంట్లో అన్ని వస్తువులు తలకిందులుగా కనిపిస్తాయి. సాధారణంగా ఇంటిపై కప్పు గాలిలో ఉంటే ఫ్లోర్ మాత్రం నేలపై ఉంటుంది. కానీ ఆ ఇంట్లో మాత్రం రివర్స్‌గా ఉంటుంది. అలాంటి ఇంటిని మీరు చూడాలనుకుంటే మాత్రం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్టిబీస్ట్పూర్ట్ అనే ప్రాంతానికి వెళ్లాల్సిందే. అయితే ఈ ఇంట్లో మాత్రం ఎవరు నివసించరు. ఎందుకంటే అది పర్యాటకులను ఆకట్టుకునేందుకు అక్కడి అధికారులు ఏర్పాటు చేశారు. ప్రసుత్తం అక్కడికి వచ్చే పర్యాటకులను ఈ కట్టడం విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇంట్లో ఉండే సోఫాల దగ్గరి నుంచి కుర్చీలు, కిచెన్‌లో ఏర్పాటు చేసిన వస్తువులు అన్ని రివర్స్‌లో కనిపిస్తాయి. ఇంటి ఆర్కిటెక్చర్‌ను ఎవరు చూసిన ముగ్దులయ్యేలా తీర్చిదిద్దారు. కాగా సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు, శుక్ర, శనివారాల్లో మాత్రం ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల మధ్య సందర్శనకు అందుబాటులో ఉంచుతారు . ఇంటి లోపలికి వెళ్లడానికి పెద్దవాళ్లకు 90 సౌత్ ఆఫ్రికా రాండ్లు( భారత కరెన్సీలో దాదాపు రూ.415), చిన్నపిల్లలకు 60 సౌత్ ఆఫ్రికా రాండ్(దాదాపు రూ. 277) వసూలు చేస్తారు. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీన్ని ఇది వరకే సందర్శించిన పలువురు 'ఇది నిజంగా అద్భుతమైన కట్టడం.. ' అని కామెంట్లు పెడుతున్నారు. 'ఇలాంటి ఇల్లును కచ్చితంగా చూసి తీరాల్సిందే..' అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
'నా తండ్రి కంటే నాకు ఏది ఎక్కువ కాదు'
'2019 ఏడాది నాకు ఎన్నో మధురానుభూతులు మిగిల్చాయి. కానీ నా తండ్రి ఏడాది చివర్లో అనారోగ్యానికి గురవ్వడంతో ఈ ఏడాదిని అదే సంతోషంతో ముగించలేకపోతున్నానంటూ' ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ భావోద్వేగంతో పేర్కొన్నాడు. వివరాల్లోకి వెళితే.. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడడానికి ఇంగ్లండ్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 23న స్టోక్స్ తండ్రి గేడ్ అనారోగ్యంతో జోహన్నెస్‌బర్గ్‌లోని ఆసుపత్రిలో చేరారు. అదే సమయంలో డిసెంబర్ 26న బాక్సింగ్‌డే సందర్భంగా దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టు మ్యాచ్ ఉండడంతో స్టోక్స్ తన తండ్రిని చూడడానికి వెళ్లలేదు. అయితే డిసెంబర్ 29న అతని తండ్రి జేడ్‌ను ఐసీయు నుంచి బయటికి తీసుకువచ్చారని తెలుసుకున్న స్టోక్స్ ఆ సమయంలో తన తండ్రి దగ్గర ఉండుంటే బాగుండేదని బాధను వ్యక్తం చేశాడు. 'నా తండ్రి అనారోగ్యానికి గురవడంతో.. ప్రపంచకప్ సాధించిపెట్టిన కీర్తి ప్రతిష్టలు, బీబీసీ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకోవడం కంటే తన తండ్రి ఆరోగ్యం 100శాతం మెరుగవడమే గొప్పగా భావిస్తానని' స్టోక్స్ ఒక పత్రికలో పేర్కొన్నాడు.అందుకే 2019 ఎన్నో మంచి అనుభూతులను ఇచ్చినా చివర్లో తన తండ్రి అనారోగ్యం పాలవడం జీర్ణించుకోలేకపోతున్నాని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు 2019 ఏడాది అద్భుతంగా గడిచిందనే చెప్పాలి. ఎందుకంటే 2019లో జరిగిన ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలపడంలో స్టోక్స్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రపంచకప్ ఫైనల్లో స్టోక్స్ ఆడిన ఇన్నింగ్స్‌ను ఎవరు అంత తేలికగా మరిచిపోలేరు. తమ జట్టులో బెన్ స్టోక్స్ లాంటి నిఖార్సైన ఆల్‌రౌండర్ ఉంటే బాగుంటుందని క్రికెట్ ప్రపంచంలోని ప్రతీ జట్టు కోరుకోవడం విశేషం. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ దశాబ్దంలోనే బెన్ స్టోక్స్ ఒక గొప్ప ఆల్‌రౌండర్ అంటూ కితాబివ్వడం విశేషం. పాంటింగ్ తాజాగా ప్రకటించిన దశాబ్దపు అత్యుత్తమ టెస్టు జట్టులో బెన్ స్టోక్స్ ఆల్‌రౌండర్ జాబితాలో చోటు సంపాదించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా 107 పరుగులతో విజయం సాధించి నాలుగు టెస్టుమ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. కాగా రెండో టెస్టు జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో ప్రారంభం కానుంది. (చదవండి : క్రికెటర్ తండ్రి ఆరోగ్యం విషమం) -
పుట్టిన రోజునాడే ప్రాణాలు కోల్పోయిన క్వైటో స్టార్
జొహన్నస్‌బర్గ్ : క్వైటో స్టార్ మవుసనా(46) తన పుట్టిన రోజునాడే మృతిచెందారు. 90వ దశకంలో జొహన్నస్‌బర్గ్‌లో ప్రారంభమై దక్షిణాఫ్రికా వ్యాప్తంగా పేరుపొందిన ఓ కొత్త శైలి సంగీతమే క్వైటో. ఒడా మీస్తా క్వైటో గ్రూప్‌ను మవుసానా స్థాపించి ఎందరో సంగీత అభిమానులకు చేరువయ్యారు. ఆయన స్వరపరిచిన సమ్మర్‌టైమ్ ట్రాక్ దక్షిణాఫ్రికా వ్యాప్తంగా మారుమోగింది. బుధవారం ఉదయాన్నే పోర్ట్ ఎలిజిబెత్‌లో హోటల్ గదిలో ఉన్న మవుసనాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్లినప్పుడు విగతజీవిగా పడిఉన్నారని ఎంటీఎన్ టీమ్ సభ్యులు తెలిపారు. ఆయన మృతికిగల కారణాలుతెలియాల్సి ఉంది. మవుసనా పుట్టిన రోజునాడే మృతిచెందడంపై ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేస్తున్నారు. పుట్టిన రోజు శుభాకాంక్షలతోపాటూ మవుసనా ఆత్మకు శాంతి చేకూరాలంటూ పోస్టులు పెడుతున్నారు. -
రష్యా అధ్యక్షుడితో నరేంద్ర మోదీ భేటి
-
‘మా స్నేహం బలమైనది’
జోహన్నెస్‌బర్గ్ : రష్యాతో తమ బంధం ఎంతో విలువైనదని, భారత్-రష్యా దేశాలు బహుళ రంగాల్లో కలిసి పనిచేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్లో తెలిపారు. బ్రిక్స్ సమావేశాల్లో భాగంగా రెండు రోజుల పర్యటనకు మోదీ బుధవారం దక్షిణాఫ్రికా వెళ్లిన విషయం తెలిసిందే. సమావేశంలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో శుక్రవారం భేటి అయ్యారు. ‘రష్యాతో మాకు మంచి అనుబంధం ఉంది. విభిన్న రంగాల్లో మా స్నేహం కొనసాగుతుంది. బహుళ రంగాల్లో రెండు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించాము’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇరు దేశాల నేతల ప్రస్తుత పరిస్థితులపై సమగ్రంగా చర్చించినట్లు విదేశాంగ ప్రతినిధి రావీష్ కూమార్ ట్విటర్లో తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి, శక్తి, రక్షణ మరియు పర్యాటక రంగం వంటి అంశాలపై లోతుగా చర్చించినట్లు పేర్కొన్నారు. గత మేలో సోచిలో భేటి అయిన ఇద్దరు నేతలు రష్యా, భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కాగా ప్రపంచ జనాభాలో 40 శాతం ఉన్న బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు పరస్పర సహాకారం కొరకు 2009లో బ్రిక్స్ గా ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్రిక్స్ పదో శిఖరాగ్ర సమావేశాలకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నగరం ఆతిథ్యం ఇస్తోంది. Wide-ranging and productive talks with President Putin. India’s friendship with Russia is deep-rooted and our countries will continue working together in multiple sectors. @KremlinRussia pic.twitter.com/xMl1k6XWX9 — Narendra Modi (@narendramodi) July 26, 2018 -
సాంకేతికతతో కొత్త ప్రపంచం
జోహన్నెస్‌బర్గ్: సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, బహుముఖ సహకారంతో మెరుగైన ప్రపంచాన్ని నిర్మించొచ్చని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న నూతన పారిశ్రామిక సాంకేతికత, డిజిటల్ విధానాల జోక్యం అవకాశాలు సృష్టించడమే కాకుండా సవాళ్లు విసురుతాయన్నారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల పదో శిఖరాగ్ర భేటీ ప్లీనరీ సమావేశంలో మోదీ ప్రసంగించారు. నాలుగో పారిశ్రామిక విప్లవం కోసం బ్రిక్స్ దేశాలతో కలసిపనిచేయాలని భారత్ ఉవ్విళ్లూరుతోందని అన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో మూలధనం కన్నా ప్రతిభే ముఖ్యమని నొక్కిచెప్పారు. ఈ తరంలో ‘అత్యుత్తమ నైపుణ్యం–కొద్ది పని’ కొత్త విధానంగా మారిందని వ్యాఖ్యానించారు. పారిశ్రామిక తయారీ, డిజైన్, ఉత్పాదకతల్లో నాలుగో పారిశ్రామిక విప్లవం మౌలిక మార్పులు తీసుకొస్తుందని పేర్కొన్నారు. బహుళత్వ విధానాలు, అంతర్జాతీయ వాణిజ్యానికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఉగ్రపోరుకు సమగ్ర విధానం: బ్రిక్స్ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిపై పోరాడటానికి సమగ్ర విధానం అవలంబించాలని బ్రిక్స్ దేశాలు నిర్ణయించాయి. బ్రిక్స్ దేశాలు సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రదాడులను సదస్సు డిక్లరేషన్ ఖండించింది. అవినీతి కూడా ప్రపంచానికి అతిపెద్ద సమస్యగా మారిందని పేర్కొంది. జిన్‌పింగ్‌తో మోదీ భేటీ.. బిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. తమ భేటీ ఇరు దేశాల సంబంధాలకు, సహకారానికి కొత్త శక్తినిస్తుందని మోదీ అన్నారు. మరోవైపు, ఆతిథ్య దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో కూడా వేరుగా సమావేశమైన మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. -
పదేళ్ల ప్రస్థానం...!
భారత్, చైనా, రష్యాలతో సహా వివిధ దేశాలపై అమెరికా ఆంక్షల రూపంలో వాణిజ్య యుద్ధానికి కాలు దువ్వుతున్న ప్రస్తుత సందర్భంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాల శిఖరాగ్ర సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మూడురోజుల పాటు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ పదవ వార్షిక సమావేశం జరగనుంది. బ్రిక్స్ దేశాల అధినేతలు, ఉన్నత స్థాయి బృందాల మేధోమథనంలో ప్రధానంగా సభ్య దేశాల మధ్య రాజకీయ, సామాజికఆర్థిక సమన్వయం, వ్యాపార,వాణిజ్య అవకాశాలు, ఏయే రంగాల్లో సహకారం అవసరమన్న అంశాలు చర్చకు రానున్నాయి. ఇప్పటికే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ, రాజకీయాలపై చారిత్రక, వ్యూహాత్మక దృష్టికోణంతో బ్రిక్స్ తనదైన ముద్ర వేసింది. అమెరికా ప్రయోజనాల పరిరక్షణ పేరిట ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు చర్యల ప్రభావం తమపై ఏ మేరకు పడుతుంది ? వాటి వల్ల జరిగే హాని, బయటపడే మార్గం ఏమిటన్న దానిపై ఈ దేశాలు కూలంకశంగా చర్చించవచ్చునని తెలుస్తోంది. భారత్‌లో సీమాంతర ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ప్రోత్సహించడాన్ని గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పదేళ్ల ప్రస్థానం... ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఏర్పడిన సందర్భంగా 2009 జూన్‌లో రష్యాలోని యెకటెరిన్‌బర్గ్‌లో బ్రిక్స్ మొదటి శిఖరాగ్ర సమావేశం ( 2010లో దక్షిణాఫ్రికా చేరింది) జరిగింది. ఒక్కో సంవత్సరం ఒక్కో సభ్యదేశంలో ఈ భేటీని ఏర్పాటు చేస్తున్నారు. మనదేశంలో 2012 మార్చిలో ఢిల్లీలో, 2016 అక్టోబర్‌లో గోవాలో ఈ భేటీ జరిగింది. 2010లో బ్రెజిల్లో, 2011లో చైనాలో, 2013లో దక్షిణాఫ్రికాలో, 2014లో బ్రెజిల్లో, 2015లో రష్యాలో, 2017లో చైనాలో ఈ సమావేశాలు జరిగాయి. 2014లో సభ్యదేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని వ్యవస్థీకరించే ఉద్ధేశ్యంతో న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ)తో పాటు కాంటింజెంట్ రిజర్వ్ అరెంజ్మెంట్ (సీఆర్ఏ) సౌకర్యాన్ని ఏర్పాటుచేసుకోవడం గొప్ప విజయంగా చెబుతున్నారు. గతేడాది చైనాలో జరిగిన భేటీలో విలువలు, ఆకాంక్షలకు అనుగుణంగా సభ్యదేశాలు పునరంకితం కావాలని తీర్మానించాయి.ఎన్డీబీ ద్వారా ఆశించిన పురోగతి సాధ్యమైందని, ఈ బ్యాంక్ ద్వారా చేపట్టిన 11 ప్రాజెక్టులలో స్థిరమైన మౌలికవనరుల అభివృద్ధి సాధ్యమని భావిస్తున్నారు. 2017-18కు సంబంధించి ఈ బ్యాంకు ఆధ్వర్యంలో పరస్పర సహకారంలో భాగంగా చేపట్టిన మొత్తం 23 ప్రాజెక్టులు (600 కోట్ల అమెరికన్ డాలర్లు) వివిధ దశల్లో ఉన్నాయి. -సభ్యదేశాల మధ్య మెరుగైన ఆర్థిక సంబంధాలు సాధించే దిశలో పురోగమనం సాధించడంలో బ్రిక్స్ సఫలమైందనే అభిప్రాయంతో నిపుణులున్నారు. ఈ ఐదు దేశాల్లోని లక్షలాది మంది ప్రజలకు స్థిరమైన ప్రయోజనాలు కలిగించిందని దర్భన్లోని చైనా కౌన్సల్జనరల్ వాంగ్ జియాంగ్జౌ తెలిపారు.పదేళ్లలో బ్రిక్స్ జీడీపీ 179 శాతం వృద్ధి చెందిందని ,, వాణిజ్యం 94 శాతం పెరిగిందని ఆయన చెబుతున్నారు. బ్రిక్స్ ఆర్థికాభివృద్ధి రేటు 8 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నామని, అదే సమయంలో ప్రపంచ సగటు మాత్రం కేవలం ఒక శాతమే ఉందని దక్షిణాఫ్రికా స్టాండర్డ్బ్యాంక్ ఆర్థికవేత్త జెర్మీ స్టీవెన్స్ తెలిపారు. చర్చించే అంశాలివే... అంతర్జాతీయ శాంతి, భద్రత, వాణిజ్యపరమైన అంశాలతో పాటు ఈ భేటీలో ఆరోగ్య పరిరక్షణ-వ్యాక్సిన్లు, మహిళల సామాజిక, ఆర్థిక సాధికారత, శాంతి పరిరక్షణ, సైన్స్, సాంకేతిక, మౌలిక సదుపాయాల అభివృద్ధిరంగాల్లో సహకారం, స్థిరమైన అభివృద్ధి, సమ్మిళిక పురోగతి, గ్లోబల్ గవర్నెన్స్ తదితర అంశాలు చర్చనీయాంశం కానున్నాయి. బ్రిక్స్ చరిత్ర ఇదీ... 2001లో బ్రిక్ అనే పదాన్ని (ప్రపంచ ఆర్థికశక్తులు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలు ఎదుగుతున్న క్రమంలో) బ్రిటన్ ఆర్థికవేత్త జిమ్ ఓనీల్ ప్రతిపాదించారు. 2006 నుంచి ఈ నాలుగుదేశాలు క్రమం తప్పకుండా సమావేశమవుతున్నాయి. న్యూయార్క్‌లో ఐరాస వార్షిక జనరల్ అసెంబ్లీ సందర్భంగా ఈ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు.అదే ఏడాది జీ-8 నాయకులు తమ భేటీకి హాజరుకావాలని భారత్, బ్రెజిల్, చైనా దేశాల అధ్యక్షులను ఆహ్వానించారు. 2009లో మొదటి బ్రిక్స్ సమావేశానికి రష్యా వేదికైంది. ప్రపంచ రాజకీయ,ఆర్థికరంగానికి సంబంధించిన సంస్థ రూపాన్ని 2010లో బ్రిక్స్ సంతరించుకుంది. 2010 డిసెంబర్లో ఆఫ్రికా ఖండం నుంచి ఏకైక ప్రతినిధిగా దక్షిణాప్రికా ఈ సభ్యదేశాల్లో ఒకటిగా చేరింది. పేరు బ్రిక్స్‌గా మారింది. -
దక్షిణాఫ్రికాలో ఘనంగా ఉగాది వేడుకలు
జొహన్నెస్‌బర్గ్ : ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా(ఆశా) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జొహన్నెస్‌బర్గ్‌లోని దాదాపు 800మంది తెలుగు వారు ఈ ఉగాది సంబరాల్లో పాల్గొన్నారు. పిల్లలకి, పెద్దలకి ఆటల పోటీలు నిర్వహించారు. సంప్రదాయక నృత్యాలు, డ్యాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. పురోహితుడు పంచాంగ శ్రవణం చేశారు. అతిథులకు ఉగాది పచ్చడితోపాటూ రుచికరమైన ఆంధ్ర వంటకాలను ఏర్పాటు చేశారు. అనంతపురం వంటకం ఒలిగలు( బొబ్బట్లు) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇండియన్ కాన్సుల్ జనరల్ కేజే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రెసిడెంట్ కుమార్ ఎద్దులపల్లి ఆశా ప్రస్థానం గురించి వివరించారు. ఆశా రైతు సంఘం తరపున అనంతపురం జిల్లా ఎద్దులపల్లిలో ఏడుగురు పేద రైతులకి వడ్డిలేని ఋణం కింద రూ. 4,55,000 ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఆశా చైర్మన్ సుబ్రమణ్యం చిమట ఉగాది వేడుకలను విజయవంతం చేయడంలో సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. -
స్టీవ్ స్మిత్‌కు చేదు అనుభవం
-
స్టీవ్ స్మిత్‌కు చేదు అనుభవం
సాక్షి, జొహన్నెస్‌బర్గ్ : ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు చేదు అనుభం ఎదురైంది. బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో స్వదేశానికి బయలుదేరిన అతన్ని జొహన్నెస్‌బర్గ్ ఎయిర్‌పోర్టులో కొందరు చుట్టు ముట్టారు. ఛీట్.. ఛీట్.. అంటూ నినాదాలు చేశారు. వెంటనే భద్రతా సిబ్బంది స్మిత్‌ను లోపలికి తీసుకెళ్లారు. అదే సమయంలో మీడియా స్మిత్‌ను ముట్టడించి ప్రశ్నల వర్షం గుప్పించింది. అయినప్పటికీ అతనేం స్పందించపోగా.. అధికారులు అతన్ని వేగంగా తీసుకెళ్లారు. ఇక గురువారం సాయంత్రం సిడ్నీలో స్మిత్ విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నాడు. ట్యాంపరింగ్‌పై విలేకరుల నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటాడో... వాటికి ఎలా స్పందిస్తాడో చూడాలి. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన క్రికెట్ ఆస్ర్టేలియా(సీఏ) స్మిత్, వార్నర్‌పై ఏడాది నిషేధం, మరో ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది. -
ప్రాక్టీస్ జోరుగా...
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో ఇప్పటికే టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్ మూడో టెస్టులోనైనా మెరుగ్గా ఆడాలని పట్టుదలగా ఉంది. ఈ నెల 24 నుంచి ఇక్కడి వాండరర్స్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ కోసం ఆటగాళ్లంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆదివారం వారంతా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. సెంచూరియన్ పరాజయం తర్వాత మూడు రోజులు విశ్రాంతి తీసుకొని సరదాగా విహరించిన జట్టు సభ్యులంతా నెట్స్‌కు హాజరై చెమటోడ్చారు. ఫుట్‌బాల్ ఆడి వార్మప్ చేసిన తర్వాత ముందుగా జట్టు ఫీల్డింగ్‌పై దృష్టి పెట్టింది. పార్థివ్, రాహుల్, రహానే, రోహిత్, దినేశ్ కార్తీక్‌లతో కోచ్ ఆర్. శ్రీధర్ స్లిప్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయించారు. మంగళవారమే జొహన్నెస్‌బర్గ్ చేరుకున్న ప్రాక్టీస్ బౌలర్లు శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైని బంతులు విసరగా రాహుల్, విజయ్, పుజారా ఒకేసారి సాధన చేశారు. విజయ్, రాహుల్‌కు స్పిన్నర్లు అశ్విన్, జడేజా కూడా ఎక్కువ సేపు బౌలింగ్ చేశారు. అనంతరం కోహ్లి, రహానే, పాండ్యా బ్యాటింగ్‌కు దిగారు. తొలి రెండు టెస్టులకు జట్టులో స్థానం లభించని రహానే చాలా సేపు ఆడటం విశేషం. ప్రధాన పేసర్లు భువీ, షమీ వీరికి బౌలింగ్ చేశారు. మరో వైపు పిచ్‌పై ఉన్న పచ్చికను ఆదివారం కొంతవరకు తొలగించారు. ‘వికెట్‌పై తగినంత పచ్చిక ఉంచాం. మ్యాచ్‌కు ముందు దీనిని తగ్గించకపోవచ్చు. సరిపోయేంత నీటిని కూడా ఉపయోగిస్తున్నాం కాబట్టి సెంచూరియన్ తరహాలో పొడిబారిపోయే ప్రమాదం లేదు. దక్షిణాఫ్రికా జట్టు కోరిక మేరకే దీనిని సిద్ధం చేశాం. పేస్, బౌన్స్‌కు పిచ్ అనుకూలంగా ఉంటుంది’ అని వాండరర్స్ క్యురేటర్ బేతుల్ బుతెలెజి చెప్పారు. -
మీకోసం భారత్ ఎదురుచూస్తోంది
-
మీకోసం భారత్ ఎదురుచూస్తోంది
- దక్షిణాఫ్రికాలో ప్రవాసభారతీయులకు మోదీ పిలుపు - మీరు భారత్ గర్వించదగ్గ వారసత్వ సంపద - మన రెండు దేశాలూ యువరక్తం గల దేశాలు - మనం ఉమ్మడిగా సరికొత్త విలువలు సృష్టించగలం .. పేదరికం, ఆకలి, పోషకాహార లోపాలపై పోరాడగలం - ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఉజ్వల కేంద్రం.. భారత విజయగాథ ‘హోప్’ - డిజిటల్ విప్లవం తెస్తున్నాం - 2022 నాటికి దేశంలో 50 కోట్ల ఉద్యోగాల సృష్టి లక్ష్యం జొహెనెస్‌బర్గ్: భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో ఆర్థికంగా ఉజ్వల బాటలో పయనిస్తోందని.. ఆశావాదం అనేది ఇప్పుడు భారత విజయగాథ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. మున్ముందు 8 శాతం వృద్ధి రేటు సాధించే దిశగా తాము కృషి చేస్తున్నామని చెప్పారు. దక్షిణాఫ్రికాలోని భారత సంతతి ప్రజలు దేశం గర్విచదగ్గ వారసత్వ సంపద అంటూ.. వారికోసం భారతదేశం ఎదురుచూస్తోందని పిలుపునిచ్చారు. ఇరు దేశాలూ యువ దేశాలంటూ.. ఇద్దరూ కలిసి కొత్త విలువలు, కొత్త నైపుణ్యాలు సృష్టించవచ్చునన్నారు. దక్షిణాఫ్రికా సత్యాగ్రహానికి పుట్టినిల్లని, మహాత్ముడి రాజకీయ ఆలోచనలకు రూపునిచ్చింది ఇక్కడేనని.. మండేలా, గాంధీలు చూపిన బాట ప్రపంచానికి స్ఫూర్తి అని కొనియాడారు. జొహనెస్‌బర్గ్‌లోని ‘ద డోమ్’ ఆడిటోరియంలో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు 15,000 మంది సభికులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని ప్రసంగానికి అడుగడుగునా చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ‘‘నమస్తే.. మీ ఆత్మీయ స్వాగతానికి కృతజ్ఞతలు. విశాల హిందూ మహాసముద్రం ఆవలి నుంచి 125 కోట్ల భారతీయుల శుభాకాంక్షలను నేను తెచ్చాను. నేను నా పర్యటనను ప్రారంభంచటానికి ముందు.. ఈ పర్యటనకు ఆలోచనలు ఆహ్వానిస్తూ వ్యక్తిగతంగా మీకు ఈమెయిల్ చేశాను. వేలాది వినూత్నమైన ఉపయుక్తకరమైన సూచనలు నాకు అందాయి. నరేంద్రమోదీ ఆప్‌లో. మన ఉమ్మడి సాంస్కృతిక, మత, ఆధ్యాత్మిక వారసత్వ సంపద మనల్ని మన మనసుల్లో, మన ఆలోచనల్లో కలిపే ఉంచుతుంది. శతాబ్దాల కిందట మన పూర్వీకులు దక్షిణాఫ్రికాకు ప్రయాణించారు. వాళ్లు కష్టాలను, కటిక దారిద్య్రాన్ని చవిచూశారు. ఆ హరివిల్లు దక్షిణాఫ్రికాలో భిన్నత్వానికి ప్రతీక... ఈ హరివిల్లు దేశం ఆవిర్భవించాక మన సంబంధాల్లో సరికొత్త ఉజ్వల అధ్యాయం మొదలైంది. జాత్యహంకారాన్ని ధ్వంసం చేసిన తర్వాత దక్షిణాఫ్రికాను ఆలింగనం చేసుకున్న తొలి దేశం భారతదేశం. జూలై పదో తేదీ ప్రాముఖ్యత మీకు తెలుసా? 1991లో ఈ రోజున దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్ మీద అంతర్జాతీయ ఆంక్షలను తొలగించారు. కొన్ని రోజుల తర్వాత దక్షిణాఫ్రికా తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ను భారత్‌లో ఆడింది. హోళీ రంగులు, దిపావళి వెలుగులు, సంక్రాంతి రుచులు, ఈద్ పండుగలు కేవలం భారతీయ సంస్కృతి హరివిల్లే కాదు.. దక్షిణాఫ్రికాలో భిన్నత్వానికి అవి ప్రతీక. భారత తీరాన్ని వదిలి వచ్చిన తొలి ప్రజల్లో వాళ్లలో మీరు ఒకరు. మీరు గర్వించాలి. వారిద్దరు చూపిన మార్గం ప్రపంచానికి సూర్ఫి... మహాత్మాగాంధీ తన రాజకీయాలకు ఆలోచనారూపం ఇచ్చింది ఇక్కడే. ఇది సత్యాగ్రహానికి పుట్టినిల్లు. మోహన్‌దాస్‌ను దక్షిణాఫ్రికా మహాత్ముడిగా మార్చింది. దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర పోరాటంలో మీలో ఎందరో కథానాయకులు ఉన్నారు. భారత సంస్కృతికి చెందిన గర్వించదగ్గ కుమారులు, కుమార్తెలు మీరు. కష్టించి పనిచేసే మీరు దక్షిణాఫ్రికాకు విధేయులైన పౌరులు. వృద్ధి చెందుతున్న ప్రపంచ భారత కుటుంబంలో కూడా మీరు భాగం. దక్షిణాఫ్రికా ఒక పవిత్ర భూమి. ఇది మండేలా భూమి. మహాత్మా గాంధీ కర్మభూమి. ఈ ఇద్దరు మహానుభావులు మనకు చూపిన మార్గం, మన కోసం వార గెలిచిన స్వాతంత్య్రం.. మొత్తం మానవజాతికి స్ఫూర్తి. 1914 జూలైలో మహత్మా గాంధీ దక్షిణాఫ్రికాకు వీడ్కోలు చెప్తూ.. ‘‘ఈ ఉపఖండం నాకు నా మాతృభూమి తర్వాత ఒక పవిత్రమైన, ప్రియమైన భూమిగా మారింది. బరువైన గుండెతో దక్షిణాఫ్రికా తీరాన్ని నేను వదిలి వెళ్తున్నా. ఇప్పుడు నన్ను దక్షిణాఫ్రికా నుంచి వేరు చేయనున్న ఈ దూరం.. నన్ను ఈ దేశానికి మరింత దగ్గర చేస్తుంది. ఈ దేశ సంక్షేమం నా ఆలోచనల్లో ఎల్లప్పుడూ ప్రధానంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. భారత్ ఒక ఉజ్వల కేంద్రం... ప్రపంచ ఆర్థికవ్యవస్థలో భారతదేశం ఒక ఉజ్వల కేంద్రం. తగ్గిపోతున్న వృద్ధి రేట్లు, ఆర్థిక మందగమనంతో ఉన్న ప్రపంచంలో భారతదేశం ఈ ఏడాది ఆరోగ్యవంతమైన 7.6 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. ముందటి సంవత్సరాల్లో 8 శాతం అంతకన్నా ఎక్కువగా వృద్ధి చెందటం కోసం మేం పనిచేస్తున్నాం. భారతదేశపు చలనశీలత పటిష్ట చర్యల ద్వారా సాగుతోంది. డిజిటల్ విప్లవాన్ని కూడా మేం ఒక రూపం ఇస్తున్నాం. ప్రభుత్వం తన పౌరులతో వ్యవహరించే తీరును మార్చేసే విప్లవం ఇది. డిజిటల్ మౌలికవసతులపై ఆధారపడే విప్లవం ఇది. ఇది సమాచారం, ఆలోచనలు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలు కల్పిస్తుంది. యనవి యువదేశాలు... దక్షిణాఫ్రికా లాగానే భారతదేశం కూడా యువ దేశం. భారతదేశపు ఆర్థికవ్యవస్థను, సమాజానికి ముందుకు తీసుకువెళ్లే చోదకశక్తి మన యువత కావాలని మేం కోరుకుంటున్నాం. 2022 నాటికి దేశంలో 50 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించాలన్నది ప్రణాళిక. భారతదేశ పౌరులు ఆశావాదంతో నిండి ఉన్నారు. నేడు.. భారతదేశపు విజయగాథను నాలుగు అక్షరాల్లో చెప్పవచ్చు.. అది హోప్ (ఆశ). హెచ్ అంటే హార్మనీ (సామరస్యం), ఓ అంటే ఆప్టిమిజమ్ (ఆశావాదం), పీ అంటే పొటెన్షియల్ (సామర్థ్యం), ఈ అంటే ఎనర్జీ (శక్తి). భారత్, దక్షిణాఫ్రికాలు రెండిటికీ జనాభాపరంగా భారీ అవకాశాలున్నాయి. మన ఇరు దేశాలకూ యువ జనాభా ఉంది. భారత్‌లో మూడింట రెండు వంతుల ప్రజలు 35 ఏళ్ల లోపు వయసు వారే. ఆఫ్రికా ఖండంలోనూ, దక్షిణాఫ్రికాలోనూ ఇదే పరిస్థితి ఉంది. మనం ఇంకా ఎక్కువ చేయాలి... మన అభివృద్ధి, వ్యాపార భాగస్వామ్యాలు ఇప్పటికే బాగున్నాయి. కానీ మనం ఇంకా ఎక్కువ చేయాలి. మనం ఉమ్మడిగా కొత్త సంస్థలను, కొత్త నైపుణ్యాలను, నూతన సామాజిక విలువలను సృష్టించగలం. ఆఫ్రికాలోని మన మిత్రుల కోసం మనం ఉమ్మడిగా కొత్త విలువలను సృష్టించగలం. పేదరికం, ఆకలి, పోషకాహార లోపాలపై పోరాటానికి మనం కలిసి పనిచేయగలం. మనం ప్రపంచ సవాళ్ల శకంలో జీవిస్తున్నాం.. ఉగ్రవాదంపై, పైరసీ మీద, ఎయిడ్స్, ఎబోలాల మీద పోరాటం మన కీలక భాగస్వామ్యాల్లోని కొన్ని రంగాలు. మీరు ఇంట్లో కూర్చుని వీసా పొందొచ్చు... సోదరసోదరీమణులారా! మీ కోసం పునరుజ్జీవిత భారతదేశం ఎదురుచూస్తోంది. ఓసీఐ, పీఓఐ పథకాలను ఒకే పథకంగా చేయటం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా కోసం మేం ఈ-వీసాను ప్రారంభించాం. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చుని మీ ఈ-మెయిల్లో భారత వీసా పొందవచ్చు. అదికూడా ఎటువంటి ఖర్చూ లేకుండా. భారత వారసత్వ సంపదకు, మన ఆచారాలకు, విలువలకు మీరు గవాక్షం. మీరు సాధించే విజయాలు, మీరు అందించే మద్దతులు మమ్మల్నందరినీ గర్వించేలా చేస్తాయి. మిమ్మల్ని కలవటం నాకు లభించిన విశేషావకాశం. మీ మధ్య ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. నమస్తే!’’ -
కౌలాలంపూర్‌లో ‘ఎంఎస్ఎంఈ’ ట్రేడ్ ఫెయిర్
హైదరాబాద్: చిన్న సంస్థలకు సంబంధించి ఈ ఏడాది జూన్‌లో కౌలాలంపూర్ (మలేషియా), జొహానెస్బర్గ్ (దక్షిణాఫ్రికా)ల్లో జరిగే 2 అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్స్లో జరగనున్నట్లు చిన్న, మధ్యతరహా సంస్థల శాఖ డెవలప్మెంట్ విభా గం తెలిపింది. వీటిలో పాల్గొనదల్చుకునే సంస్థలు కౌలాలంపూర్ ఫెయిర్ కోసం ఏప్రిల్ 29లోగా, జొహానెస్బర్గ్ ఫెయిర్ కోసం మే 11లోగా దర ఖాస్తు చేసుకోవాలని ఎంఎస్ఎంఈ-డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ డెరైక్టర్ డి. చంద్రశేఖర్ పేర్కొన్నారు. సదరు ఎంఎస్ఈలకు విమాన చార్జీలు, స్టాల్ వ్యయాలను గరిష్టంగా రూ. 1.25 లక్షల దాకా ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని ఒక ప్రకటనలో వివరించారు. -
ప్రమాదంలో 38 మంది బాలికల మృతి
జోహన్నెస్‌బర్గ్: స్వాజిలాండ్ దేశంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 38 మంది బాలికలు, ఒక యువతి చనిపోగా, 20 మంది గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న లారీ ఎంబబానే నుంచి మంజీనీకి వెళ్తుండగా మరో వాహనాన్ని ఢీకొట్టింది. బాలికలు, యువతులు స్వాజిలాండ్ రాజభవనంలో జరిగే నృత్య వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ వేడుకలో రాజు యువతుల్లో ఒకరిని భార్యగా స్వీకరిస్తారు. -
సౌతాఫ్రికాలో గాంధీ విగ్రహానికి అవమానం
దక్షిణాఫ్రికాలో జాత్యహంకార విముక్తి ఉద్యమానికి స్ఫూర్తిప్రదాతగానిలిచిన మహాత్మా గాంధీ విగ్రహానికి ఆ దేశంలో ఘోర అవమానం జరిగింది. గాంధీని జాత్యహంకారిగా అభివర్ణిస్తూ జొహాన్నెస్‌బర్గ్‌లోని ఆయన విగ్రహంపై ఓ ముష్కర మూక తెలుపు రంగు చల్లి, వ్యతిరేక నినాదాలు చేసింది. జొహెన్నెస్బర్గ్తో మహాత్ముని అనుబంధానికి గుర్తుగా ఆ నగరం నడిబొడ్డున 1997లో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. అప్పటినుంచి ఆ ప్రాంతాన్ని గాంధీ స్వేర్గా వ్యవహరిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్ సీ) పార్టీ లోగో ధరించిన యువకుల బృందం.. బకెట్లలో తీసుకొచ్చిన తెలుపు రంగును గాంధీ విగ్రహంపై జల్లారు. అంతటితో ఆగకుండా గాంధీని జాత్యహంకారిగా అభివర్ణిస్తూ సౌతాఫ్రికాలో ఆయన విగ్రహాలన్నింటిని కూల్చాలని నినాదాలుచేశారు. ప్రభుత్వ ఆస్తి విధ్వంసం కింద కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా గాంధీ తమకు ఆరాధ్యుడని, విగ్రహంపై దాడిలో తమ పార్టీ ప్రమేయం లేదని ఏఎన్సీ ప్రకటించింది. ఇదంతా అధికారపార్టీ ఆడుతోన్న నాటకమని విమర్శించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గాంధీవిగ్రహాల్లోకెల్లా జొహాన్నెస్ బర్గ్ విగ్రహం ప్రత్యేకమైనది. గాంధీజీ యుక్తవస్కుడిగా చూపే ఏకైక విగ్రహం ఇదొక్కటే! -
జోహన్నెస్ బర్గ్ లో భూప్రకంపనలు
జోహన్నెస్ బర్గ్: దక్షిణాఫ్రికా వ్యాపార రాజధాని జోహనెస్ బర్గ్ లో గురువారం భూమి కంపించింది. భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3 గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప తీవ్రత స్వల్పంగా ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. దక్షిణ జోహనెస్ బర్గ్ కు 180 కిలో మీటర్ల దూరంలో ఆర్క్‌నీ సమీపంలో భూకంపం సంభవించింది. భూప్రకంపనలు పొరుగుదేశాలైన బోట్స్వానా, మోజాంబిక్ దేశాల్లో కూడా సంభవించినట్టు సమాచారం అదింది. -
మళ్లీ చైనాకి వెళ్లే విమానం .... మళ్లీ మలేషియాలో....
చైనాకి చెందిన ఓ విమానం మలేషియా గగనతలంపై ప్రయాణిస్తూండగా ఉన్నట్టుండి భారీగా షేక్ అయింది. కొన్నినిమిషాల పాటు సాగిన ఈ షేకింగ్ వల్ల దాదాపు 20 మంది ప్రయాణికులు విమానంలోనే చెల్లాచెదరై అటూ ఇటూ పడిపోయారు. కొందరు ఏకంగా విమానం సీలింగ్ ను ఢీ కొన్నారు. దీంతో వారికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి జటిలంగా ఉండటంతో వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. ఈ విమానం సౌత్ ఆఫ్రికా లోని జోహానెస్ బర్గ్ నుంచి హాంకాంగ్ కి వస్తోంది. ఇందులో 165 మంది యాత్రికులు ఉన్నారు. గాయపడ్డవారిలో ఎక్కువ మంది విమానం వెనుక భాగంలో కూర్చున్న వారే కావడం గమనార్హం. ఇప్పుడు ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది. విమానంలోపలి ప్యానెల్స్ దెబ్బతిన్నట్టు అధికారులు చెబుతున్నారు. -
హై‘డ్రా’మా...
-
హై‘డ్రా’మా...
మహాద్భుతం... వాండరర్స్‌లో తొలి టెస్టు ఫలితాన్ని వర్ణించేందుకు ఈ మాట సరిపోదు. ఎవరన్నారు టెస్టు క్రికెట్ చచ్చిపోతోందని... టెస్టులపై ఆసక్తి తగ్గిపోయిందని... జొహన్నెస్‌బర్గ్‌లో చివరి రోజు ఆటను చూసినవారు ఈ మ్యాచ్‌లో ‘డ్రా’మాను ఎప్పటికీ మరచిపోలేరు. ఎన్నెన్నో మలుపులు... మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు... ఒకరివైపు మొగ్గిన విజయం అంతలోనే మరొకరి పక్షాన నిలుస్తూ వచ్చింది. మ్యాచ్ చివరి రోజు ఆఖరి బంతి వరకు టెస్టు క్రికెట్లో ఫలితం కోసం ఎదురు చూడాల్సి రావడం అంటే ఆ మ్యాచ్ గొప్పతనం ఏమిటో అర్థ్ధమవుతోంది. చివరి రోజు విజయానికి దక్షిణాఫ్రికా చేయాల్సిన పరుగులు 320... భారత్‌కు 8 వికెట్లు... మ్యాచ్ మన వైపే ఉంది. 197 వద్ద నాలుగో వికెట్ పడింది.... ఫర్వాలేదు, భారత్ ఇంకా విజయానికి చేరువైనట్లే... కనీసం ‘డ్రా’ కోసమైనా దక్షిణాఫ్రికా ప్రయత్నించగలదా అనే సందేహం. అనూహ్యంగా భారత బౌలర్ల వెనుకంజ... డు ప్లెసిస్, డివిలియర్స్ 205 పరుగుల భాగస్వామ్యం... సఫారీలు విజయంపై గురి పెట్టారు. విజయం కోసం దక్షిణాఫ్రికా 13 ఓవర్లలో 56 పరుగులు చేయాలి. చేతిలో ఆరు వికెట్లు. ఇక మ్యాచ్ చేజారినట్లే అనిపించింది. డివిలియర్స్‌ను అవుట్ చేసి ఇషాంత్ ఆనందం నింపాడు. ఆ వెంటనే డుమిని కూడా వెనుదిరిగాడు. జట్టులో మళ్లీ ఆశలు... అయినా సరే డు ప్లెసిస్ ఉన్నాడు. అతను, ఫిలాండర్ అప్పటికే షాట్లు మొదలు పెట్టారు. 20 బంతుల్లో 16 పరుగులు చాలు. ఊహించని విధంగా డు ప్లెసిస్ రనౌట్. అంతే... ప్రొటీస్ వెనక్కి తగ్గారు. వికెట్లు కోల్పోకూడదని నిలబడ్డారు. విజయానికి కేవలం 8 పరుగుల దూరంలో జట్టు ఆగిపోయింది. ఓటమి తప్పిందనే ఆనందం టీమిండియాలో... నెగ్గకున్నా పరాజయాన్ని తప్పించుకోగలిగామన్న సంతృప్తి ప్రత్యర్థిలో... ఫలితం ఏదైనా ఇరు జట్లు ఒక గొప్ప మ్యాచ్‌లో భాగమయ్యాయి. జొహన్నెస్‌బర్గ్: హమ్మయ్య... ఓటమికి చేరువగా వచ్చిన మ్యాచ్‌లో భారత్ గట్టెక్కింది. మలుపులు తిరుగుతూ చివరి వరకు ఆసక్తికరంగా సాగిన భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు చివరకు ‘డ్రా’గా ముగిసింది. 458 పరుగుల విజయలక్ష్యం ఛేదించే క్రమంలో 138/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 450 పరుగులు చేసింది. ఫాఫ్ డు ప్లెసిస్ (309 బంతుల్లో 134; 15 ఫోర్లు), ఏబీ డివిలియర్స్ (168 బంతుల్లో 103; 12 ఫోర్లు) అద్భుత శతకాలతో ఒక దశలో దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు విజయానికి చేరువైనట్లు కనిపించింది. అయితే వీరిద్దరు అవుటయ్యాక సఫారీలు తమ పోరాటాన్ని ఆపేశారు. స్టేడియంలోని తమ అభిమానుల ఆగ్రహానికి గురైనా... చివర్లో వికెట్లు కోల్పోకుండా జాగ్రత్తగా ఆడి ‘డ్రా’గా ముగించారు. ఆఖరి రోజు ఆట ఆరంభానికి ఎలాంటి ఆశలు లేని దక్షిణాఫ్రికా ఇక్కడి వరకు మ్యాచ్ తీసుకు రాగా... నాలుగు రోజుల పాటు ఆధిక్యం ప్రదర్శించినా ఒక్క రోజు వైఫల్యంతో టెస్టులో భారత్‌కు విజయం దక్కకుండా పోయింది. విరాట్ కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్‌లో చివరిదైన రెండో టెస్టు 26 నుంచి డర్బన్‌లో జరుగుతుంది. కట్టడి చేసిన బౌలర్లు.... 138/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా మొదట్లో తడబడింది. 14 బంతులు ఆడినా తన ఓవర్‌నైట్ స్కోరుకు ఒక్క పరుగు కూడా జత చేయకుండానే పీటర్సన్ (162 బంతుల్లో 76; 9 ఫోర్లు) పెవిలియన్ చేరాడు. అయితే డు ప్లెసిస్, కలిస్ (37 బంతుల్లో 34; 6 ఫోర్లు) కలిసి జాగ్రత్తగా ఆడారు. ఈ భాగస్వామ్యం 54 పరుగులకు చేరిన అనంతరం దురదృష్టవశాత్తూ కలిస్ అవుటయ్యాడు. జహీర్ బౌలింగ్‌లో బంతి బ్యాట్‌కు తగిలినా అంపైర్ నిర్ణయంతో కలిస్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఇది జహీర్ కెరీర్లో 300వ వికెట్ కావడం విశేషం. ఆ తర్వాత డు ప్లెసిస్, డివిలియర్స్ క్రీజ్‌లో నిలదొక్కుకొని మరో వికెట్ పడకుండా సెషన్ ముగించారు. కీలక భాగస్వామ్యం... రెండో సెషన్లో పూర్తిగా దక్షిణాఫ్రికా ద్వయం ఆధిపత్యం ప్రదర్శించింది. ఇద్దరూ చక్కటి షాట్లతో దూసుకుపోయారు. భారత బౌలర్లలో ఎవరూ ప్రభావం చూపలేకపోవడంతో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆశించిన విధంగా చివరి రోజు పిచ్ బౌలర్లకు పెద్దగా సహకరించకపోవడం, బ్యాటింగ్‌కు ఇంకా అనుకూలంగానే ఉండటంతో డు ప్లెసిస్, డివిలియర్స్ స్వేచ్ఛగా ఆడారు. ఈ సెషన్లో భారత్‌కు ఒక్క వికెట్టూ దక్కలేదు. అనూహ్య మలుపులు... టీ విరామం తర్వాత దక్షిణాఫ్రికా విజయంపై కన్నేసింది. ఈ క్రమంలో డు ప్లెసిస్ 252 బంతుల్లో, డివిలియర్స్ 162 బంతుల్లో సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఎట్టకేలకు ఇషాంత్ బౌలింగ్‌లో డివిలియర్స్ వెనుదిరగడంతో మ్యాచ్ పరిస్థితి మారిపోయింది. డివిలియర్స్ వికెట్లపైకి ఆడుకోగా, తర్వాతి ఓవర్లోనే డుమిని (5) కూడా షమీ బౌలింగ్‌లో అదే తరహాలో అవుటయ్యాడు. డు ప్లెసిస్ రనౌట్‌తో సఫారీలు ఆత్మ రక్షణలో పడిపోయారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 280 దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 244 భారత్ రెండో ఇన్నింగ్స్: 421 దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: పీటర్సన్ (బి) షమీ 76; స్మిత్ రనౌట్ 44; ఆమ్లా (బి) షమీ 4; డు ప్లెసిస్ రనౌట్ 134; కలిస్ ఎల్బీడబ్ల్యూ (బి) జహీర్ 34; డివిలియర్స్ (బి) ఇషాంత్ 103, డుమిని (బి) షమీ 5; ఫిలాండర్ నాటౌట్ 25; స్టెయిన్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (136 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 450 వికెట్ల పతనం: 1-108, 2-118, 3-143, 4-197, 5-402, 6-407, 7-442 బౌలింగ్: జహీర్ 34-1-135-1, ఇషాంత్ 29-4-91-1, షమీ 28-5-107-3, అశ్విన్ 36-5-83-0, మురళీ విజయ్ 1-0-3-0, ధోని 2-0-4-0, కోహ్లి 6-0-18-0. ‘నాలుగు రోజుల పాటు భారత్ ఆధిక్యం ప్రదర్శించింది. అయినా మానసికంగా మేం బలంగా ఉండటం వల్ల ఇక్కడి వరకు మ్యాచ్‌ను తీసుకు రాగలిగాం. గెలిస్తే ఇంకా బాగుండేది కానీ డు ప్లెసిస్ రనౌట్ దురదృష్టకరం. వారిద్దరి ఇన్నింగ్స్‌లు చరిత్రలో నిలిచిపోతాయి. మోర్కెల్ వంద శాతం ఫిట్‌గా లేడు. అతను ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేడనే డ్రా కోసం సిద్ధమైపోయాం’ -గ్రేమ్ స్మిత్, దక్షిణాఫ్రికా కెప్టెన్ మలుపు తిప్పిన రనౌట్ దక్షిణాఫ్రికా విజయానికి 20 బంతుల్లో 16 పరుగులు అవసరం... డుప్లెసిస్ అదే ఓవర్లో భారీ షాట్‌తో తన ఉద్దేశాన్ని తెలియజేశాడు. అతను క్రీజ్‌లో ఉంటే సఫారీ విజయం లాంఛనమే అనిపించింది. అయితే నాలుగు గంటల పాటు బ్యాటింగ్ చేసిన డు ప్లెసిస్ కూడా ఒత్తిడిని తట్టుకోలేకపోయాడేమో... లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. జహీర్ బౌలింగ్‌లో మిడాఫ్ దిశగా నెట్టి సింగిల్ కోసం దూసుకొచ్చాడు. అయితే చురుగ్గా ఉన్న అజింక్యా రహానే విసిరిన త్రో నేరుగా వికెట్లను తాకింది. థర్డ్ అంపైర్ అవుట్ ఖరారు చేయడంలో డు ప్లెసిస్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ పరిణామంతోనే దక్షిణాఫ్రికా విజయాన్ని పక్కన పెట్టింది. ఫిలాండర్, స్టెయిన్ చివరి 19 బంతులు ‘డ్రా’ కోసమే ఆడారు. అన్నట్లు నాలుగో రోజు ఇదే రహానే మిడాన్ నుంచి డెరైక్ట్ త్రోతో గ్రేమ్ స్మిత్‌ను పెవిలియన్ పంపించి ప్రత్యర్థి పతనాన్ని ప్రారంభించాడు. డు ప్లెసిస్ మరోసారి! జట్టును డుప్లెసిస్ పరాజయం బారి నుంచి తప్పించడం ఇది మొదటి సారి కాదు. ఏడాది క్రితం అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో టెస్టును అతను ఇదే తరహాలో రక్షించాడు. 430 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజు దక్షిణాఫ్రికా 45/4 స్కోరుతో ఉన్న దశలో బరిలోకి దిగాడు. కెరీర్లో అది తొలి టెస్టు మ్యాచ్ అయినా దాదాపు ఎనిమిది గంటలు ఆడి 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని పోరాటంతో జట్టు ఈ మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించగలిగింది. జహీర్ ఖాన్ @ 300 భారత ప్రధాన పేస్ బౌలర్ జహీర్ ఖాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో జహీర్ 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో జాక్ కలిస్‌ను ఎల్బీగా అవుట్ చేసి అతను ఈ రికార్డును చేరుకున్నాడు. జహీర్ భారత్ తరఫున 300 వికెట్లను సాధించిన నాలుగో బౌలర్. అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (413) అంతకంటే ముందున్నారు. 13 ఏళ్ల కెరీర్లో 89 టెస్టులు ఆడిన జహీర్ 32.35 సగటుతో ఈ వికెట్లు పడగొట్టాడు. గత దశాబ్ద కాలంలో విదేశీ గడ్డపై భారత జట్టు సాధించిన చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఖాన్... తన కెరీర్లో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు 10 సార్లు, టెస్టులో 10 వికెట్లు ఒకసారి తీసుకున్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన 7/87 కాగా, టెస్టులో 10/149గా ఉంది. తొలి సెషన్ ఓవర్లు: 29, పరుగులు: 98, వికెట్లు: 2 రెండో సెషన్ ఓవర్లు: 31, పరుగులు: 95, వికెట్లు: 0 మూడో సెషన్ ఓవర్లు: 31, పరుగులు: 119, వికెట్లు: 3 -
సీ(మ్)న్ మారింది!
మూడో రోజు ఆట మ.గం. 2.00 నుంచి టెన్ క్రికెట్లో ప్రత్యక్ష ప్రసారం సొంత గడ్డపై బౌన్స్, ఫాస్ట్ వికెట్లతో ప్రత్యర్థిని ఆడుకోవడం దక్షిణాఫ్రికాకు అలవాటు...ఇప్పుడు భారత బౌలర్లు సీన్ మార్చేశారు. దానిని తమకు అనుకూలంగా మార్చుకొని చెలరేగారు. స్ఫూర్తిదాయక బౌలింగ్‌తో ఇషాంత్ చెలరేగితే...షమీ, జహీర్ అతడిని అనుసరించారు. భారత బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా ఉందని మన పేసర్లు నిరూపించారు. అద్భుత బంతులతో సఫారీ ఇన్నింగ్స్‌ను దెబ్బ తీశారు. యువ భారత ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చెల్లాచెదురైంది. ఆఖర్లో కొంత పట్టు విడిచినా...ఇప్పటికీ తొలి టెస్టులో ధోనిసేనదే ఆధిక్యం. జొహన్నెస్‌బర్గ్: తొలి టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్లు అంచనాలకు మించి రాణించారు. ఫలితంగా దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. గురువారం రెండో రోజు ఆట ముగిసే సరికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. గ్రేమ్ స్మిత్ (119 బంతుల్లో 68; 11 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. స్మిత్, ఆమ్లా రెండో వికెట్‌కు 93 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా 130/1 స్కోరుతో ఒక దశలో మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే మన పేసర్ల ధాటికి 16 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయింది. అయితే ఫిలాండర్ (76 బంతుల్లో 48 బ్యాటింగ్; 5 ఫోర్లు), డుప్లెసిస్ (55 బంతుల్లో 17 బ్యాటింగ్; 1 ఫోర్) ఏడో వికెట్‌కు అభేద్యంగా 67 పరుగులు జోడించి ఆతిథ్య జట్టును ఆదుకున్నారు. ఇషాంత్ శర్మ 3 కీలక వికెట్లు తీయగా, షమీ 2, జహీర్ 1 వికెట్ పడగొట్టారు. అంతకు ముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 280 పరుగులకే ఆలౌటైంది. రెండో రోజు 13 ఓవర్లు ఆడిన ధోని సేన కేవలం 25 పరుగులు జోడించి చివరి 5 వికెట్లు కోల్పోయింది. కట్టడి చేసిన ఫిలాండర్... ముందు రోజు రాత్రి కురిసిన వర్షంతో పాటు ఆరంభంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటంతో పరిస్థితులను దక్షిణాఫ్రికా బౌలర్లు చక్కగా ఉపయోగించుకున్నారు. తొలి రోజుతో పోలిస్తే ఆఫ్‌స్టంప్‌కు మరింత దగ్గరగా క్రమశిక్షణతో బౌలింగ్ చేశారు. ఫలితంగా పరుగులు సాధించేందుకు తీవ్రంగా శ్రమించిన భారత్ తొలి ఎనిమిది ఓవర్లలో 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. మోర్కెల్ వేసిన ఇన్నింగ్స్ 99వ ఓవర్లో ఇబ్బంది పడిన ధోని (19) అదే ఓవర్ చివరి బంతిని దూరం నుంచి ఆడబోయి కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం చక్కటి బంతులతో ఫిలాండర్ చెలరేగాడు. ఓవర్‌నైట్ స్కోరుకు నాలుగు పరుగులు మాత్రమే జోడించిన రహానే (137 బంతుల్లో 47; 8 ఫోర్లు) వికెట్ కీపర్‌కే క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా...మరుసటి బంతికే జహీర్ (0) కూడా ఎల్బీగా అవుటయ్యాడు. ఫిలాండర్ హ్యట్రిక్ను నిరోధించగలిగినా, అతని తర్వాతి ఓవర్లోనే ఇషాంత్ (0) బౌల్డయ్యాడు. ఆ వెంటనే షమీ (0)ను అవుట్ చేసి మోర్కెల్ భారత్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. తొలి రోజు ఆటను బట్టి చూస్తే భారీ స్కోరుపై ఆశలు రేపిన టీమిండియా రెండో రోజు 13 ఓవర్లకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా లంచ్ సమయానికి 10 ఓవర్లు ఆడి 22 పరుగులు చేసింది. జహీర్, షమీ బౌలింగ్‌లో కొన్ని ఉద్విగ్న క్షణాలు ఎదుర్కొన్నా...సఫారీ ఓపెనర్లు జాగ్రత్తగా సెషన్‌ను ముగించారు. స్మిత్‌కు కలిసొచ్చిన అదృష్టం... లంచ్ విరామం తర్వాత నాలుగో ఓవర్ తొలి బంతికే ఇషాంత్ భారత్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆఫ్ స్టంప్‌పై పడి దూసుకొచ్చిన బంతిని ఆడలేక అల్విరో పీటర్సన్ (21) ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే మరో రెండు ఓవర్ల తర్వాత అదృష్టం స్మిత్ పక్షాన నిలిచింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ మరోసారి తన ప్రియమైన శత్రువు జహీర్ బౌలింగ్‌లోనే వెనుదిరిగే అవకాశం వచ్చినా అశ్విన్ దానిని నేలపాలు చేశాడు. 19 పరుగుల వద్ద స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను మొదటి స్లిప్‌లో అశ్విన్ వదిలేశాడు. దీనిని ఉపయోగించుకున్న అతను ఆమ్లాతో కలిసి చక్క టి భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరు స్వేచ్ఛగా ఆడటంతో జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. స్మిత్ 98 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 27 బంతుల్లో మారిన కథ... టీ విరామం భారత బౌలర్లలో కొత్త శక్తిని తెచ్చినట్లుంది. మూడో సెషన్ నాలుగో ఓవర్లో ఇషాంత్ మ్యాజిక్ మొదలు పెట్టాడు. ఆఫ్ స్టంప్ నుంచి లోపలికి వచ్చిన బంతిని అంచనా వేయడంలో ఆమ్లా (74 బంతుల్లో 36; 6 ఫోర్లు) విఫలమయ్యాడు. ఆడకుండా వదిలేయడంతో అది వికెట్లను గిరాటేసింది. ఆ తర్వాతి బంతికే సీనియర్ ఆటగాడు కలిస్ (0) వెనుదిరిగాడు. షాట్ ఆడటంలో ఆలస్యం చేయడంతో అతను ఎల్బీగా అవుటయ్యాడు. ఈ రెండు వికెట్లు ఒక్కసారిగా జట్టులో ఉత్సాహం నింపాయి. తర్వాతి ఓవర్లోనే జహీర్, స్మిత్‌పై తన అద్భుత రికార్డును కొనసాగించాడు. అనూహ్యంగా స్వింగ్ అయిన బంతిని ఆడటంతో తడబడిన స్మిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఒకే స్కోరు వద్ద సఫారీ జట్టు ముగ్గురు ప్రధాన బ్యాట్స్మెన్ల వికెట్లు కోల్పోవడం విశేషం. మరో నాలుగు ఓవర్లు ముగిశాయి. ఈ సారి షమీ వంతు వచ్చింది. టీ తర్వాత షమీ వేసిన తొలి బంతిని డుమిని (2) ఆడలేక స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. రెండు బంతులకే కీలక వికెట్ భారత్ చేజిక్కింది. షమీ వేసిన చక్కటి బంతిని డివిలియర్స్ (13) బ్యాక్‌ఫుట్‌పై ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆదుకున్న భాగస్వామ్యం... భారత బౌలర్ల జోరు తర్వాత దక్షిణాఫ్రికా స్కోరు 146/6 వద్ద నిలిచింది. సఫారీల ఇన్నింగ్స్ ఇక ఎంతో సేపు సాగదని అనిపించింది. అయిత ఈ దశలో ఫిలాండర్, డుప్లెసిస్ కలిసి జట్టును ఆదుకున్నారు. ఆట ముగియడానికి రెండు ఓవర్ల ముందు షమీ బౌలింగ్‌లో ప్లెసిస్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను స్లిప్‌లో రోహిత్ వదిలేయడంతో భారత్‌కు మరో అవకాశం చేజారింది. భారత్ వేసిన 66 ఓవర్లలో 6 మాత్రమే స్పిన్నర్ అశ్విన్ వేశాడంటే మన పేసర్లు ఎంత చక్కగా బౌలింగ్ చేశారో అర్ధం చేసుకోవచ్చు. తొలి సెషన్ ఓవర్లు: 23 పరుగులు: 47 వికెట్లు: 5 రెండో సెషన్ ఓవర్లు: 25 పరుగులు: 96 వికెట్లు: 1 మూడో సెషన్ ఓవర్లు: 31 పరుగులు: 95 వికెట్లు: 5 ‘విదేశీ గడ్డపై బౌలింగ్ అంటే ఉపఖండంలో వేసిన దానికి వ్యతిరేకంగా శైలి మార్చుకోవాల్సి ఉంటుంది. విపరీతమైన ఓపికతో సరైన ప్రాంతంలో బంతులు విసరగలిగాను. అలాగే ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాను. జట్టులోని మిగతా సీమర్లు కూడా విశేషంగా రాణించారు. అందుకే ప్రత్యర్థి ఆటగాళ్లు పరుగులు తీసేందుకు ఇబ్బందిపడ్డారు. నేటి (శుక్రవారం) ఆటలోనూ ఇదే రీతిన చెలరేగి ఐదు వికెట్ల ఘనతను సాధించాలని ఆశిస్తున్నాను’ - ఇషాంత్ స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) డివిలియర్స్ (బి) మోర్కెల్ 6; ధావన్ (సి) తాహిర్ (బి) స్టెయిన్ 13; పుజారా (రనౌట్) 25; కోహ్లి (సి) డుమిని (బి) కలిస్ 119; రోహిత్ శర్మ (సి) డివిలియర్స్ (బి) ఫిలాండర్ 14; రహానే (సి) డివిలియర్స్ (బి) ఫిలాండర్ 47; ధోని (సి) డివిలియర్స్ (బి) మోర్కెల్ 19; అశ్విన్ (నాటౌట్) 11; జహీర్ (ఎల్బీ) (బి) ఫిలాండర్ 0; ఇషాంత్ (బి) ఫిలాండర్ 0; షమీ (బి) మోర్కెల్ 0; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (103 ఓవర్లలో ఆలౌట్) 280. వికెట్ల పతనం: 1-17; 2-24; 3-113; 4-151; 5-219; 6-264; 7-264; 8-264; 9-278; 10-280. బౌలింగ్: స్టెయిన్ 26-7-61-1; ఫిలాండర్ 27-6-61-4; మోర్కెల్ 23-12-34-3; కలిస్ 14-4-37-1; తాహిర్ 8-0-47-0; డుమిని 5-0-30-0. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: స్మిత్ (ఎల్బీ) (బి) జహీర్ 68; పీటర్సన్ (ఎల్బీ) (బి) ఇషాంత్ 21; ఆమ్లా (బి) ఇషాంత్ 36; కలిస్ (ఎల్బీ) (బి) ఇషాంత్ 0; డివిలియర్స్ (ఎల్బీ) (బి) షమీ 13; డుమిని (సి) విజయ్ (బి) షమీ 2; డుప్లెసిస్ (బ్యాటింగ్) 17; ఫిలాండర్ (బ్యాటింగ్) 48; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (66 ఓవర్లలో 6 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1-37; 2-130; 3-130; 4-130; 5-145; 6-146. బౌలింగ్: జహీర్ 22-4-72-1; షమీ 18-3-48-2; ఇషాంత్ 20-4-64-3; అశ్విన్ 6-0-25-0. -
రాణించిన ఇషాంత్, కష్టాల్లో దక్షిణాఫ్రికా!
భారత బౌలర్ ఇషాంత్ శర్మ రాణించి మూడు వికెట్లు పడగొట్టడంతో జోహన్నెస్ బర్గ్ లో భారత్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో దక్షిణాఫ్రికా జట్టు రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా జట్టులో అత్యధికంగా కెప్టెన్ స్మిత్ 68, ఆమ్లా 36 పరుగులు చేయగా, ఫిలాండర్ 48 పరుగులతో, ప్లెసిస్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. షమీ 2, జహీర్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు. పీటర్సన్ (21), ఆమ్లా (36), కల్లీస్ (0) వికెట్లను ఇషాంత్ శర్మ పడగొట్టారు. అంతకుముందు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 280 పరుగులకు ఆలౌటైంది. క్రమం తప్పకుండా వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది. 255/5 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా మరో 25 పరుగులకే మిగతా వికెట్లు కోల్పోయింది. అజింక్య రహానే 47, ధోనీ 19 పరుగులు చేశారు. జహీర్‌ఖాన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ డకౌటయ్యారు. విరాట్ కోహ్లి119, పుజారా 25, రోహిత్ శర్మ 14, ధావన్ 13 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలాండర్ 4, మోర్కల్ 3 వికెట్లు పడగొట్టారు. స్టెయిన్, కలిస్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
నెల్సన్ మండేలా అస్తమయం
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం పృధ్వీ-2 పరీక్ష విజయవంతం ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే పృధ్వీ-2 క్షిపణిని సైన్యానికి చెందిన వ్యూహాత్మక దళాల కమాండ్ (ఎస్ఎఫ్సీ) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి డిసెంబర్ 3న పరీక్ష నిర్వహించారు. ఈ క్షిపణి 250 కి.మీ నుంచి 350 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 350 కిలోల అణ్వాయుధాలను మోసుకుపోగలదు. దీన్ని 2003లో సైన్యంలో చేర్చారు. దీన్ని ధనుష్ పేరుతో నౌకాదళానికి కూడా అందించారు. అవినీతి సూచీలో భారత్‌కు 94వ స్థానం అవినీతి సూచీలో భారత్‌కు 94వ స్థానం దక్కింది. గతేడాది కూడా భారత్ ఇదే స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని అవినీతి దేశాల జాబితాలో సోమాలియా అత్యంత అవినీతి దేశంగా మొదటి స్థానంలో ఉంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ 177 దేశాల జాబితాను డిసెంబర్ 3న విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యంత తక్కువ అవినీతి దేశాలుగా డెన్మార్క్, న్యూజిలాండ్ ఉన్నాయి. 0-100 స్కేలులో 0 స్థానంలో ఉంటే అత్యంత అవినీతి దేశంగా, 100వ స్థానంలో ఉంటే అత్యంత నీతివంతమైన దేశంగా పరిగణిస్తారు. భారత్‌కు 36 పాయింట్లు దక్కాయి. డెన్మార్క్, న్యూజిలాండ్‌లకు 91 పాయింట్లు లభించాయి. ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, సింగపూర్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ దేశాలు తక్కువ అవినీతి దేశాలుగా మంచి స్థానంలో ఉన్నాయి. చైనా 80వ స్థానంలోనూ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లు 72వ స్థానంలోనూ, రష్యా 127, పాకిస్థాన్ 127వ స్థానంలోనూ ఉన్నాయి. శక్తిమంతమైన విద్యుత్ సరఫరా లైన్ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన విద్యుత్ సరఫరా లైన్‌ను వార్దా - ఔరంగాబాద్ మధ్య 1200 కె.వి లైన్ నెలకొల్పనున్నారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 400 కి.మీ. ప్రస్తుతం 400 కె.వి లైన్ పనిచేస్తోంది. వచ్చే రెండేళ్లలో దీని సామర్థ్యాన్ని 1200 కె.వికి పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ పెంచనుంది. అల్ట్రా హై వోల్టేజి (యుహెచ్‌వీ) విధానాలను ఈ లైన్ ఏర్పాటులో వినియోగిస్తారు. ప్రస్తుతం చైనా వాణిజ్యపరంగా 1100 కె.వి లైన్‌ను ఉపయోగిస్తోంది. ఉత్తమ వ్యాపార దేశాల జాబితాలో భారత్‌కు 98వ స్థానం ప్రపంచంలో వ్యాపారానికి ఉత్తమ దేశాల జాబితాను ఫోర్బ్స్ పత్రిక డిసెంబర్ 5న విడుదల చేసింది. 148 దేశాల జాబితాలో భారత్‌కు 98వ స్థానం దక్కింది. ఐర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌కు రెండో స్థానం, హాంగ్‌కాంగ్‌కు మూడో స్థానం లభించాయి. ఆస్తి హక్కులు, కొత్తదనం, పన్నులు, సాంకేతికత, అవినీతి, స్వేచ్ఛ (వ్యక్తిగత, వ్యాపార, ద్రవ్యపరమైన), జాప్యం, పెట్టుబడిదారు రక్షణ, స్టాక్ మార్కెట్ పనితీరు వంటి 11 అంశాలపై ఆధారపడి ర్యాంకులు కేటాయించారు. సీఐసీగా సుష్మా సింగ్ కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా మాజీ ఐఏఎస్ అధికారి సుష్మా సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఐసీ దీపక్ సంధూ పదవీకాలం ముగియడంతో ఆమె స్థానంలో సుష్మ బాధ్యతలు చేపట్టారు. ఆమెను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, కేంద్ర న్యాయశాఖ మంత్రితో కూడిన ప్యానెల్ ఎంపిక చేసింది. సుష్మా 2009, సెప్టెంబర్ 23 నుంచి కేంద్ర సమాచార కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏపీలో తయారీ జోన్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ఆంధ్రప్రదేశ్‌లో మూడు జాతీయ పెట్టుబడి, తయారీ జోన్ల ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రం డిసెంబర్ 4న సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. వీటి కోసం భూసేకరణకు రూ.250 కోట్లు విడుదల చేసేందుకు కూడా కేంద్రం అంగీకరించింది. ఈ మూడు జోన్లను చిత్తూరు, ప్రకాశం, మెదక్ జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు. మెదక్ జిల్లాకు రూ.43,000 కోట్లు, చిత్తూరుకు రూ.31,000 కోట్లు, ప్రకాశంకు రూ.43000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఒక్కో జోన్‌కు 5000 హెక్టార్ల భూమిని కేటాయించారు. తెలంగాణ ఏర్పాటు బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం సమర్పించిన నివేదికను, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు - 2013ను డిసెంబర్ 5న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇందులో ఇరు రాష్ట్రాల సరిహద్దుల నుంచి నదీ జలాలు, సహజ వనరుల పంపకాలు, హైదరాబాద్‌లో శాంతిభద్రతల వరకు అనేక అంశాలను పొందుపరిచారు. విభజనతో ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలు ఉంటాయి. 119 మంది శాసనసభ సభ్యులు, 40 మంది శాసనమండలి సభ్యులు, 17 మంది లోక్‌సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉంటారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటాయి. కొత్త ఆంధ్రప్రదేశ్‌లో 175 మంది శాసనసభ సభ్యులు, 50 మంది శాసనమండలి సభ్యులు, 25 మంది లోక్‌సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. కొత్త హైకోర్టు ఏర్పడే వరకు ప్రస్తుత హైకోర్టు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది. కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలకు పదేళ్లకు మించని కాలానికి ఉమ్మడి గవర్నర్ ఉంటాడు. హైదరాబాద్ పదేళ్లకు మించని కాలానికి ఉమ్మడి రాజధానిగా పనిచేస్తుంది. ప్రస్తుతమున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధి ప్రాంతం ఉమ్మడి రాజధాని ప్రాంతమవుతుంది. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానికి సంబంధించి వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి కేంద్రం నిపుణుల కమిటీని నియమిస్తుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన 45 రోజుల్లోగా ఈ నిపుణుల కమిటీ సిఫారసులు చేస్తుంది. కృష్ణా, గోదావరి నదుల పర్యవేక్షణ, నిర్వహణ కోసం రెండు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తారు. కేంద్ర జలవనరుల మంత్రి, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నేతృత్వంలోని సర్వోన్నత మండలి ఈ బోర్డులను పర్యవేక్షిస్తుంది. ఐదేళ్ల కాలపరిమితికి మించకుండా అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలతోపాటు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ కూడా ఉమ్మడిగా అందరికీ ఒకేలా వర్తిస్తుంది. 371డీ రెండు రాష్ట్రాల్లోనూ అమల్లో ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి పన్ను ప్రోత్సాహకాలు కల్పిస్తారు. పులిచింతల ప్రాజెక్టు ప్రారంభం కృష్ణానదిపై నిర్మించిన డాక్టర్ కెఎల్ రావు సాగర్ పులిచింతల ప్రాజెక్టును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి డిసెంబర్ 7న ప్రారంభించారు. ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కృష్ణా డెల్టా ఆయకట్టు భూముల స్థిరీకరణకు తోడ్పడుతుంది. కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 13.88 ల క్షల ఎకరాలకు నీరందుతుంది. 45.77 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1831 కోట్లు వ్యయమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. డ్యామ్ స్పిల్ వే 18.50 మీటర్లు ్ఠ 17.00 మీటర్ల 24 రేడియల్ గేట్లతో దేశంలోనే అత్యంత భారీగా నిర్మితమైంది. దీన్ని గుంటూరు జిల్లాలో అచ్చంపేట మండలంలో కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ ఎగువన, నాగార్జునసాగర్‌కు దిగువన నిర్మించారు. 2004, అక్టోబర్ 15న నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా నిర్మాణం మొదలుపెట్టిన తొలి ప్రాజెక్ట్. క్షిపణిని ప్రయోగించిన ఎల్సీఏ తేలికపాటి యుద్ధ విమానం (ఎల్సీఏ) నుంచి ప్రయోగించిన క్షిపణి విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ పరీక్షను గోవా తీరం నుంచి డిసెంబర్ 7న చేపట్టారు. తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసిన యుద్ధ విమానం తేజస్ నిర్వహించిన క్షిపణి ప్రయోగం మరో ప్రధాన ఘట్టం. దీంతో వైమానిక దళంలో తేజస్‌ను చేర్చేందుకు వీలవుతుంది. దీన్ని బెంగళూరులో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, హెచ్ఏఎల్ కలిసి అభివృద్ధి చేశాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఐదు రాష్ట్రాల శాసనసభలకు నవంబర్, డిసెంబర్లలో జరిగిన ఎన్నికల ఫలితాలు.. మధ్యప్రదేశ్ (మొత్తం సీట్లు -230): ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. బీజేపీ 165, కాంగ్రెస్‌కు 58, ఇతరులకు 7 స్థానాలు దక్కాయి. ఛత్తీస్‌గఢ్ (మొత్తం సీట్లు -90): ఇక్కడ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ నాయకత్వంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిం ది. బీజేపీకి 49,కాంగ్రెస్‌కు 39, ఇతరులకు 2 స్థానాలు లభించాయి. రాజస్థాన్ (మొత్తం సీట్లు -200): అధికార కాంగ్రెస్‌ను ఓడించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. మొత్తం ఎన్నికలు జరిగిన 199 స్థానాల్లో బీజేపీ 162, కాంగ్రెస్ 21, ఇతరులు 16 స్థానాలు దక్కించుకున్నారు. ఢిల్లీ (మొత్తం సీట్లు - 70): ఇక్కడ ఏ పార్టీకి మెజారిటీ పూర్తిగా రాలేదు. మూడు దఫాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. కేవలం 8 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాలు దక్కించుకోగా, బీజేపీ 31 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. మిజోరాం (మొత్తం సీట్లు-40): ముఖ్యమంత్రి లాలా థన్హవ్లా నేతృత్వంలో అధికార కాంగ్రెస్ పార్టీ 33 సీట్లు దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) 5 స్థానాలు, మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ ఒక స్థానంలో విజయంలో సాధించాయి. అంతర్జాతీయం ఆసియా కోసం కమ్యూనికేషన్ ఉపగ్రహం దక్షిణాసియా, ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు టెలివిజన్, కేబుల్ టీవీ సేవలు అందించేందుకు తొలి ప్రైవేటు వాణిజ్య రాకెట్ ప్రయోగాన్ని అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ చేపట్టింది. భారత్, చైనాలకు కూడా ఈ ఉపగ్రహ సేవలు అందుతాయి. ఈ రాకెట్ ద్వారా ఎస్.ఇ.ఎస్-8 అనే 3.2 టన్నుల ఉపగ్రహాన్ని ఫ్లోరిడాలోని కేప్ కేనవెరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి డిసెంబర్ 4న ప్రయోగించారు. ఈ ఉపగ్రహాన్ని భూమి కంటే పైన స్థిర కక్ష్యలో ఉంచి ఉపయోగించుకుంటారు. నెల్సన్ మండేలా అస్తమయం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా (95) జోహెన్నెస్‌బర్గ్‌లో డిసెంబర్ 5న మరణించారు. మండేలా దక్షిణాఫ్రికాకు తొలి నల్లజాతి అధ్యక్షుడు. దక్షిణాఫ్రికాలో శ్వేత జాత్యహంకార పాలనను అంతమొందించారు. అల్ప సంఖ్యాకులైన శ్వేత జాతీయుల పాలనలో తీవ్ర వివక్షకు గురైన నల్లజాతి ప్రజల విముక్తి కోసం సుదీర్ఘ పోరాటం చేసి విజయం సాధించారు. ఈ పోరాటంలో ఆయన 27 ఏళ్ల జైలు జీవితం గడిపారు. మండేలా 1918, జూలై 18న జన్మించారు. 1943లో ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ)లో చేరారు. 1960, మార్చిలో ప్రభుత్వం ఏఎన్సీని నిషేధించడంతో 1961 డిసెంబర్లో మండేలా చీఫ్ కమాండర్‌గా ఏఎన్సీ సాయుధ దళం ఏర్పడింది. ప్రభుత్వం 1962లో మండేలాను బంధించి ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. 1964లో జీవిత ఖైదుకు గురయ్యారు. 27 ఏళ్లపాటు రాబెన్ ఐలాండ్ జైలులో దుర్భర జీవితం గడిపారు. 1990, ఫిబ్రవరి 11న జైలు నుంచి విడుదలయ్యారు. 1991లో ఏఎన్సీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1993లో మండేలాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1994, ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి అన్ని జాతులు ఓటింగ్‌లో పాల్గొన్నాయి. జాతి వివక్షకు తెరపడింది. 1994, మే 10న దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి అధ్యక్షుడిగా మండేలా ఎన్నికయ్యారు. ఐదేళ్ల తర్వాత 1999లో స్వచ్ఛందంగా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. 2004లో ప్రజా జీవితం నుంచి విరమించుకున్నారు. 1990లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. 2001లో గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతితో భారత ప్రభుత్వం మండేలాను సత్కరించింది. క్రీడలు ధోనీకి ఐసీసీ పీపుల్స్ చాయిస్ అవార్డు -2013 భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 2013 సంవత్సరానికి ఐసీసీకి చెందిన ఎల్జీ పీపుల్స్ చాయిస్ అవార్డుకు ఎంపికయ్యాడు. సచిన్ (2010) తర్వాత ఈ అవార్డుకు ఎంపికైన రెండో భారత క్రికెటర్ ధోని. 2011లో, 2012లో రెండుసార్లు ఈ అవార్డు శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కరకు దక్కింది. ఐసీసీ వెబ్సైట్, ట్విట్టర్ ద్వారా జరిగిన ఓటింగ్‌లో రెండు లక్షల మంది విజేతను ఎంపిక చేశారు. కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్‌బర్గ్‌లో డిసెంబర్ 8న ముగిసిన కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ 16 స్వర్ణ పతకాలు గెలుచుకుంది. 13 రజతాలు, 11 కాంస్య పతకాలతోపాటు మొత్తం 38 పతకాలు భారత్‌కు దక్కాయి. పురుషుల ఫ్రీ స్టైల్, గ్రీక్-రోమన్ స్టైల్ టీం చాంపియన్‌షిప్ భారత్‌కు లభించాయి. మహిళా విభాగంలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. -
నెల్సన్ మండేలా సంస్మరణ సభ
-
మండేలా సంస్మరణలో ఏకమైన దక్షిణాఫ్రికా
జొహాన్నెస్‌బర్గ్: జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు నివాళులర్పించడంలో దేశ ప్రజలం తా ఏకమయ్యారు. ‘మదీబా’ సంస్మరణ కోసం ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన జాతీయ ప్రార్థనా దినం సందర్భంగా ప్రజలంతా కులమతాలు, జాతివర్ణాలకు అతీతంగా ఆదివారం చర్చ్‌లు, ఇతర ప్రార్థనా స్థలాలకు భారీగా తరలివచ్చారు. జొహాన్నెస్‌బర్గ్‌లోని బ్రయన్స్టన్ మెథడిస్ట్ చర్చ్‌లో జరిగిన మండేలా సంస్మరణ కార్యక్రమంలో దేశాధ్యక్షుడు జాకబ్ జుమాతోపాటు మండేలా మాజీ భార్య విన్నీ మండేలా, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 15న మండేలా స్వగ్రామం కునులో ప్రభుత్వ లాంఛనాలతో జరిగే ఈ అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులతోపాటు ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తదితరులు హాజరుకానున్నారు. -
15న మండేలా అంత్యక్రియలు... హాజరుకానున్న ఒబామా
దక్షిణాఫ్రికా జాతిపిత, నల్లజాతి సూర్యడు నెల్సన్ మండేలా అంత్యక్రియలు ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ దేశాధ్యక్షుడు జాకోబ్ జూమా ఇక్కడ వెల్లడించారు. ఈస్టరన్ కేప్‌లోని క్యూనులో మండేలా స్వగృహం వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం ఆయన జోహెన్స్‌బర్గ్‌లోని మండేలా కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మండేలా అంత్యక్రియలు వచ్చే ఆదివారం నిర్వహించాలని తెలిపారని ఆయన చెప్పారు. ఆ మహానియుడి మృతికి 10 రోజులు సంతాపదినాలుగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. మండేలా ఆత్మశాంతికి దేశవ్యాప్తంగా ప్రజలు ప్రార్థనలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మండేలా మృతితో ఆయన కుటుంబానికి దక్షిణాఫ్రికా వాసులతోపాటు ప్రపంచ ప్రజలు మద్దతుగా నిలవడం పట్ల జూమా సంతోషం వ్యక్తం చేశారు. వారందరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నెల్సన్ మండేలా అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు ప్రపంచనేతలు హాజరుకానున్నారు. గత కొన్ని ఏళ్లుగా నెల్సన్ మండేలా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఈ ఏడాది మధ్యలో మండేలా తీవ్ర అనారోగ్యం పాలైయ్యారు. దాంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆయన కోలుకుని, సెప్టెంబర్1న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. జోహెన్స్‌బర్గ్‌లో స్వగృహంలో మండేలా గురువారం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. -
బౌలింగ్‌తోనే దెబ్బ తిన్నాం: ధోని
జొహన్నెస్‌బర్గ్: ఆరంభ ఓవర్లలోనే గతి తప్పిన తమ బౌలర్లు ఓటమికి బాట పరిచారని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యాఖ్యానించాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకపోవడం తొలి వన్డేలో పరాజయానికి కారణం కాదని అతను విశ్లేషించాడు. ‘మొత్తంగా చూస్తే ఇది చెత్త ప్రదర్శన. అయితే ఇది మా బౌలింగ్‌తోనే మొదలైంది. ఈ వికెట్‌పై 300కు పైగా పరుగులు ఇవ్వాల్సింది కాదు. ఇక్కడి పరిస్థితుల్లో అనుభవం కీలకం. దక్షిణాఫ్రికా బౌలర్లకు లెంగ్త్‌పై అవగాహన ఉంది. వారి జట్టులో అత్యుత్తమ పేసర్లు ఉన్నారు. మా ఆరంభం సరిగా లేకపోవడం కూడా ఓటమికి కారణమైంది’ అని ధోని అభిప్రాయ పడ్డాడు. చివరి ఓవర్లలో బౌలర్లు భారీగా సమర్పించుకోవడం ఇటీవల సహజంగా మారిందని, అగ్రశ్రేణి బౌలర్ కూడా బాధితుడిగా మారుతున్నాడని ధోని తన బౌలర్లను సమర్ధించాడు. ‘సర్కిల్లో అదనపు ఫీల్డర్ ఉండటం, బంతి రివర్స్ స్వింగ్ వల్ల మంచి బౌలర్లు కూడా భారీ పరుగులిస్తున్నారు. కాబట్టి ఏ జట్టయినా ఆరంభ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేయగలగాలి. అప్పుడే బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచగలం’ అని భారత కెప్టెన్ అన్నాడు. పరిస్థితులకు తొందరగా అలవాటు పడితేనే బ్యాటింగ్‌లో ప్రభావం చూపించగలమని అతను సహచరులకు సూచించాడు. ‘అంతర్జాతీయ క్యాలెం డర్లో ఎక్కువ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆశించడం సరైంది కాదు. షెడ్యూల్‌ను మనం తప్పు పట్టలేం. వన్డేకు ముందు మాకు రెండున్నర రోజుల విరామం లభిం చింది. మ్యాచ్‌కు మానసికంగా సిద్ధమయ్యేందుకు ఇది సరిపోతుంది’ అని ధోని అన్నాడు. -
ప్రొటీస్ పొదిలో ప్రసన్నాస్త్రం!
జొహన్నెస్‌బర్గ్: భారత క్రికెటర్లు బస చేసిన హోటల్లో రెస్టారెంట్... దక్షిణాఫ్రికా టీమ్ డ్రెస్‌లో ఉన్న ఒక వ్యక్తి అందులోకి ప్రవేశించాడు. అంతే... అక్కడ కూర్చొని ఉన్న కోహ్లి, రోహిత్, పుజారా, జడేజా, ఇషాంత్ కళ్లల్లో ఆనందం... వారంతా ఒక్కసారిగా వెళ్లి అతడిని కౌగిలించుకున్నారు. ఇది చూసిన చాలా మందికి ఆశ్చర్యం కలిగింది. ఆ వ్యక్తి దక్షిణాఫ్రికా టీమ్ వీడియో అనలిస్ట్ ప్రసన్న అగోరామ్. స్వస్థలం చెన్నై. 2010 నుంచి అతను దక్షిణాఫ్రికా జట్టుకు సాంకేతిక విశ్లేషకుడిగా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా సభ్యులు అంతగా చేరువ కావడానికి కారణం ఉంది. వీరంతా అండర్-15 స్థాయి నుంచి ప్రసన్నకు బాగా తెలుసు. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పని చేస్తున్న సమయంలో అండర్-19 స్థాయిలో ఈ కుర్రాళ్ల ఆటను బాగా దగ్గరి నుంచి చూసిన వ్యక్తి ప్రసన్న. 2006 ప్రపంచకప్‌లో భారత అండర్-19 జట్టుతో అతను కలిసి పని చేశాడు. ప్రస్తుత స్టార్ ఆటగాళ్ల అప్పటి రోజులను అతను గుర్తు చేసుకున్నాడు. ‘అండర్-17 స్థాయిలో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసినప్పుడే విరాట్ భారత్‌కు ఆడతాడనుకున్నాను. పుజారాను రేపటి ద్రవిడ్‌గా, రోహిత్‌ను రేపటి మార్క్‌వాగా అప్పుడే అనుకునేవాళ్లం. ఆ సమయంలో వారి కళ్లలో ఒక రకమైన ఉద్వేగం కనిపించేది’ అని ప్రసన్న చెప్పాడు. గత సిరీస్‌లోనూ ప్రసన్న ప్రొటీస్ టీమ్‌తో ఉన్నా... అప్పుడు ఈ కుర్రాళ్లు భారత జట్టులో లేరు. తమ మధ్య ఒక రకమైన గురుశిష్యుల సంబంధం ఉన్నా వారి కోసం వ్యూహాలకు వెనుకాడనని అతను అన్నాడు. వారి బలాలు, బలహీనతల గురించి అతనికి బాగా తెలుసు. ‘దక్షిణాఫ్రికా వీడియో అనలిస్ట్‌గా వారిని నిలువరించే ప్రణాళికలు రూపొందించడం నా విధి. ఆ సమయంలో ఆ చిన్నారులు నాకు గుర్తుకు రారు. వారు మా జట్టుపై ఒక్క బౌండరీ కొట్టడాన్ని కూడా నేను చూడలేను’ అని ప్రసన్న వ్యాఖ్యానించాడు. -
సవాల్‌కు సై!
సాయంత్రం గం. 5.00 నుంచి టెన్ క్రికెట్లో ప్రత్యక్ష ప్రసారం దాదాపు మూడేళ్ల క్రితం భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు... జట్టు వెళ్లిన ప్రతి చోటా ‘మీ కోసం ఎదురు చూస్తున్నాం’ అంటూ హోర్డింగ్‌లు, బిల్‌బోర్డులు కనిపించాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. బోర్డుల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో అక్కడి అభిమానులు కూడా ఇరు జట్ల మధ్య ‘స్నేహం’ గురించి ఆలోచించకుండా తమ జట్టు నుంచి దూకుడును ఆశిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులను కూడా టీమిండియా ఎదుర్కోవాల్సిన స్థితిలో... ఉద్రేకాల మధ్య సిరీస్‌కు తెర లేవనుంది. ఈసారి చిన్న సిరీస్ కావడంతో కోలుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉండదు. జొహన్నెస్‌బర్గ్: వన్డేల్లో అద్భుతమైన ప్రదర్శనతో ఈ ఏడాది తిరుగులేని ఆటతీరు కనబర్చిన భారత జట్టు ఇప్పుడు విదేశీ గడ్డపై కీలక పోరుకు సిద్ధమైంది. వివాదాలు ముగిసి ఎట్టకేలకు ఖరారైన దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా వన్డే సిరీస్ రూపంలో తొలి పరీక్షను ఎదుర్కోబోతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం ఇక్కడి వాండరర్స్ మైదానంలో తొలి మ్యాచ్ జరగనుంది. సొంతగడ్డపై ఇటీవల పాక్ చేతిలో సిరీస్ ఓడిన దక్షిణాఫ్రికా మళ్లీ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఇటీవలి ప్రదర్శన ప్రకారం చూస్తే భారత్ అభేద్యంగా కనిపిస్తున్నా... ఉప ఖండానికి భిన్నమైన పరిస్థితులు ఉండే సఫారీ గడ్డపై ఏ స్థాయి ఆటతీరు కనబరుస్తుందనేది ఆసక్తికరం. దక్షిణాఫ్రికాలో భారత జట్టు గత రికార్డు పేలవంగా ఉండటం ప్రతికూలాంశం. ఆ జట్టుతో ఇక్కడ జరిగిన 25 వన్డేల్లో టీమిండియా 5 మాత్రమే నెగ్గి 19 ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక్కడ మన జట్టు ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా గెలవలేకపోయింది. కుర్రాళ్లు మళ్లీ చెలరేగుతారా... ఈ ఏడాది భారత్ ఆరు వన్డేలు సిరీస్/ట్రోఫీలు గెలిచింది. ఇందులో కీలక పాత్ర పోషించిన కుర్రాళ్ల బృందమే ఇప్పుడు దక్షిణాఫ్రికాలోనూ పర్యటిస్తోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తమ కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నారు. ఈ ఏడాది వీరంతా వెయ్యికి పైగా పరుగులు సాధించారు. వీరికి తోడు కెప్టెన్ ధోని కూడా తన జోరును కొనసాగిస్తున్నాడు. 2013లో ధోని 23 మ్యాచుల్లో 66.90 సగటుతో పరుగులు చేయడం విశేషం. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా పేస్‌ను సమర్థంగా ఎదుర్కోగలిగితే ఈ యువ ఆటగాళ్లు మరో చిరస్మరణీయ విజయంలో భాగం కాగలరు. అయితే యువరాజ్, రైనాల ఫామ్ మాత్రం జట్టును ఆందోళన పరుస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లతో జరిగిన సిరీస్‌లలో వీరిద్దరూ విఫలమయ్యారు. ఈ ఏడాది రైనా సగటు 36 కాగా... యువరాజ్‌ది 21.23 మాత్రమే. మరి టీమ్ మేనేజ్మెంట్ వీరిపైనే నమ్మకం ఉంచుతుందా లేక అంబటి రాయుడు, రహానేలకు అవకాశం ఇస్తుందా చూడాలి. భారత్ తమ ఇటీవలి విజయ యాత్రలో ఇంగ్లండ్, వెస్టిండీస్, జింబాబ్వే వంటి విభిన్న పరిస్థితుల్లో అద్భుతంగా రాణించింది. వాటితో పోలిస్తే బౌన్స్ ఎక్కువగా ఉండే దక్షిణాఫ్రికా పిచ్‌లు భిన్నం. కొన్నాళ్ల క్రితం భారత్ ‘ఎ’ జట్టు ఇక్కడ పర్యటించి పరిస్థితులపై అవగాహన పెంచుకుంది. ధావన్ అనధికారిక వన్డేలో డబుల్ సెంచరీ కూడా చేశాడు. అయితే పూర్తిగా భారత పిచ్‌లను పోలి ఉండే ప్రిటోరియాలాంటి చోటనే ఆ మ్యాచ్‌లు జరిగాయనే విషయాన్ని విస్మరించరాదు. ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. భారత యువ బౌలర్లకు కూడా తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇది సరైన వేదిక కానుంది. సీనియర్లే బలం... మరోవైపు దక్షిణాఫ్రికా పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న ఈ జట్టు ఇటీవల అనూహ్యంగా పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. అంతకుముందు చాంపియన్స్ ట్రోఫీలో విఫలమైన ఆ జట్టు... న్యూజిలాండ్, శ్రీలంకల చేతిలో కూడా పరాజయం పాలైంది. నంబర్‌వన్ టీమ్‌ను నిలువరించడం వారికి అంత సులభం కాబోదు. సొంతగడ్డపై ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించేందుకు జట్టు తమ పేస్ బలగాన్నే నమ్ముకుంటోంది. స్టెయిన్, మోర్నీ మోర్కెల్, సోట్సోబ్, మెక్లారెన్, కలిస్లతో టీమ్ పేస్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. వీరు భారత బ్యాట్స్‌మెన్‌కు అడ్డుకట్ట వేయగలిగితేనే జట్టుకు విజయావకాశాలు ఉంటాయి. కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్ తప్పుకున్నాక కెప్టెన్‌గా డివిలియర్స్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. అయితే బ్యాటింగ్‌లో అతనితో పాటు హాషిమ్ ఆమ్లా ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. స్మిత్ వన్డేల్లో చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మన్ కాకపోయినా... డుమిని, మిల్లర్లు కీలకం కానున్నారు. ఆల్‌రౌండర్‌గా కలిస్పై ఆ జట్టు ఎంతో ఆధార పడుతోంది. భారత్‌లో తరహాలో కాకుండా బ్యాట్, బంతి మధ్య సమతూకం ఉండే పిచ్‌లు కావడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, యువరాజ్, రైనా, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, మోహిత్. దక్షిణాఫ్రికా: డివిలియర్స్ (కెప్టెన్), ఆమ్లా, స్మిత్, డి కాక్, కలిస్, డుమిని, మెక్లారెన్, స్టెయిన్, మోర్నీ మోర్కెల్, సోట్సోబ్, తాహిర్. వాతావరణం తొలి వన్డే మ్యాచ్‌కు వాతావరణం అడ్డంకిగా మారవచ్చు. గత మూడు వారాలుగా ప్రతీ సాయంత్రం జొహన్నెస్‌బర్గ్‌లో వర్షం కురుస్తోంది. గురువారం కూడా కొద్ది సేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడవచ్చని స్థానిక వాతావరణ శాఖ చెబుతోంది. మ్యాచ్ పూర్తిగా ఆగకపోయినా... ఆలస్యం కావడం, మధ్యలో ఆగేందుకు కూడా అవకాశం ఉందని సమాచారం. పిచ్ బౌన్సీ వికెట్‌ను సిద్ధం చేశారు. మ్యాచ్ రోజూ పచ్చికను తొలగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పేసర్లకు అనుకూలించే ఈ పిచ్‌పై భారీ స్కోర్లు రావడం కష్టమే. 22 ఈ ఏడాది భారత్ తాను ఆడిన 31 వన్డేల్లో 22 గెలవడం విశేషం మాపై చాలా ఒత్తిడి ఉంది ‘సొంతగడ్డపై ఇంతటి ఒత్తిడిని ఎదుర్కోవడం మాకు కొత్తగా అనిపిస్తోంది. అయితే ఒక సిరీస్ ఓడినంత మాత్రాన మమ్మల్ని అండర్డాగ్స్ అనడాన్ని నేనొప్పుకోను. మా దేశంలో రికార్డు బాగా లేని ఒక ఉపఖండపు జట్టును మేం ఎదుర్కోబోతున్నాం కాబట్టి మా స్థాయికి తగినట్లు ఆడితే చాలు. ఇక్కడి పిచ్‌లపై 300పైగా స్కోర్లు తరచుగా నమోదు కావు. ప్రత్యర్థి బలం బ్యాటింగ్‌లోనే ఉందని, వారి బౌలింగ్ బలహీనమని మాకు తెలుసు. అయితే నంబర్‌వన్ జట్టును మేం తేలిగ్గా తీసుకోం. తగిన వ్యూహాలతోనే బరిలోకి దిగుతున్నాం.’ - ఏబీ డివిలియర్స్, దక్షిణాఫ్రికా కెప్టెన్ పేస్, బౌన్స్‌కు అలవాటు పడాలి ‘వాతావరణాన్ని బట్టి వికెట్‌ను ఎలా సిద్ధం చేశారనేదే ఇక్కడ కీలకం. ఇండియాలో ఎక్కడా ఇలాంటి వికెట్ కనిపించదు కాబట్టి కొత్త కుర్రాళ్లు ఇక్కడి బౌన్స్, పేస్‌కు అలవాటు పడటం సవాల్లాంటిది. అయితే వేర్వేరు చోట్ల ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లకు ఆ ఇబ్బంది లేదు. గత రికార్డులను పట్టించుకోను. రెండు బంతుల నిబంధనలు ఇక్కడ ఫాస్ట్ బౌలర్లకు బాగా అనుకూలిస్తాయి కాబట్టి తొలి పది ఓవర్ల ఆట కీలకమవుతుంది. ఎక్కడ ఆడినా, పిచ్ ఎలా ఉన్నా చేతిలో వికెట్లుంటే ఆఖరి 8-10 ఓవర్లలో ఎక్కువ పరుగులు చేయవచ్చు. మా దగ్గర అత్యుత్తమ బౌలర్లు లేకపోయినా పరిస్థితులను బట్టి వారు రాణిస్తూనే ఉన్నారు. సమయానికి తగిన విధంగా స్పందించడమే వ్యూహం తప్ప ప్రత్యేక ప్రణాళిక అవసరం లేదు’ - ఎం.ఎస్. ధోని, భారత కెప్టెన్ -
షెడ్యూల్‌ను గౌరవించాలి: ధోని
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఎన్ని మ్యాచ్‌లు ఆడుతున్నామనేది ముఖ్యం కాదని, ఎన్ని మ్యాచ్‌లు ఆడినా నాణ్యత ముఖ్యమని భారత కెప్టెన్ ధోని అన్నాడు. సోమవారం దక్షిణాఫ్రికా చేరగానే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక మీడియా ఎక్కువగా షెడ్యూల్ గురించే ప్రశ్నించింది. దక్షిణాఫ్రికా బోర్డుతో బీసీసీఐ విభేదాల వల్ల మ్యాచ్‌ల సంఖ్య తగ్గడం గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడిగారు. దీనికి ధోని కూడా తెలివిగా సమాధానం చెప్పాడు. ‘బోర్డు పరిపాలకుల మధ్య మ్యాచ్‌లు ఏర్పాటు చేసి ఆడుకోమని చెబితే సరిపోతుంది (నవ్వుతూ). షెడ్యూల్ ఎలా ఉందనేది ముఖ్యం కాదు. మేం ఏడాదంతా విరామం లేకుండా ఎక్కడో చోట క్రికెట్ ఆడుతూనే ఉన్నాం. మ్యాచ్‌ల సంఖ్య కంటే మ్యాచ్‌ల నాణ్యత ముఖ్యం’ అని ధోని చెప్పాడు. బోర్డు పెద్దల మధ్య విభేదాల సంగతి తమకు తెలియదని, రెండు దేశాల క్రికెటర్ల మధ్య మాత్రం మంచి స్నేహం ఉందని చెప్పాడు. ‘ఐపీఎల్లో మేమంతా కలిసి ఆడుతున్నాం. ఇరు దేశాల క్రికెటర్లు మంచి స్నేహితులు’ అని చెప్పారు. ఎవరైనా ప్రేక్షకులు మీపై ఏదైనా వస్తువు విసిరితే ఏం చేస్తారని ప్రశ్నించగా... ‘ఏం చేస్తాం... తిరిగి ఇచ్చేస్తాం’ అని నవ్వుతూ అన్నాడు. ఇలాంటి విషయాలను చూసుకోవడానికి భద్రతా సిబ్బంది ఉంటారని ధోని బదులిచ్చాడు. -
గణేశుడి రూపంలో బీసీసీఐ
జొహన్నెస్‌బర్గ్: గణేశుడి రూపంలో బీసీసీఐ... ఓ చేతిలో క్రికెట్ బ్యాట్... ఇతర చేతుల్లో డబ్బుల కట్టలు... కాళ్ల దగ్గర బలి పీఠంపై క్రికెట్ దక్షిణాఫ్రికా సీఈఓ హరూన్ లోర్గాట్. డబ్బుల కోసం ఆయన్ని బలి ఇస్తున్నట్లుగా సీఎస్ఏ బోర్డు పెద్దలు... జొనాథన్ షాపిరో అనే కార్టూనిస్ట్ గీసిన ఓ కార్టూన్... దక్షిణాఫ్రికాలో వివాదానికి దారితీసింది. వివరాళ్లోకి వెళ్తే.... లోర్గాట్పై ఆగ్రహంతో సఫారీ టూర్‌ను సందిగ్దంలో పడేసిన బీసీసీఐని.. దక్షిణాఫ్రికా బోర్డు కాళ్లావేళ్లా పడి ఒప్పించుకుంది. చివరకు ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని టూర్‌ను కుదించుకోవడానికి కూడా అంగీకరించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో లోర్గాట్‌ను బలి పశువును చేశారు. చివరకు భారత్‌తో క్రికెట్ గురించి అతనికి మాట్లాడే అర్హత లేకుండా చేశారు. ఇదంతా కేవలం బీసీసీఐవిసిరే డబ్బు కట్టల కోసమేనన్నది అక్కడి విమర్శకుల స్పందన. దీంతో బీసీసీఐ, సీఎస్ఏల మధ్య ఉన్న సంబంధాలను షాపిరో కార్టూన్ రూపంలో వ్యక్తపరిచారు. ఇది ‘సండే టైమ్స్’లో రావడంతో తమ మనోభావాలను కించపరిచారంటూ హిందూ మతవాద సంస్థల ప్రతినిధులు ఆందోళనకు దిగారు. పత్రిక యాజమాన్యం తక్షణమే క్షమాపణలు చెప్పాలని దక్షిణాఫ్రికా హిందూ ధర్మ సభ (ఎస్ఏహెచ్డీఎస్), హిందూ మహా సభ, తమిళ సమాఖ్యలు డిమాండ్ చేశాయి.