
జొహన్నస్‌బర్గ్ : క్వైటో స్టార్ మవుసనా(46) తన పుట్టిన రోజునాడే మృతిచెందారు. 90వ దశకంలో జొహన్నస్‌బర్గ్‌లో ప్రారంభమై దక్షిణాఫ్రికా వ్యాప్తంగా పేరుపొందిన ఓ కొత్త శైలి సంగీతమే క్వైటో. ఒడా మీస్తా క్వైటో గ్రూప్‌ను మవుసానా స్థాపించి ఎందరో సంగీత అభిమానులకు చేరువయ్యారు. ఆయన స్వరపరిచిన సమ్మర్‌టైమ్ ట్రాక్ దక్షిణాఫ్రికా వ్యాప్తంగా మారుమోగింది.
బుధవారం ఉదయాన్నే పోర్ట్ ఎలిజిబెత్‌లో హోటల్ గదిలో ఉన్న మవుసనాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్లినప్పుడు విగతజీవిగా పడిఉన్నారని ఎంటీఎన్ టీమ్ సభ్యులు తెలిపారు. ఆయన మృతికిగల కారణాలుతెలియాల్సి ఉంది. మవుసనా పుట్టిన రోజునాడే మృతిచెందడంపై ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేస్తున్నారు. పుట్టిన రోజు శుభాకాంక్షలతోపాటూ మవుసనా ఆత్మకు శాంతి చేకూరాలంటూ పోస్టులు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment