జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జొహన్నెస్‌బర్గ్‌లోని ఐదంస్థుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 73 మందికిపైగా సజీవదహనం అయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది శరణార్థులే ఉన్నట్లు తెలుస్తోంది.
ఎమర్జెన్సీ సేవల అధికార ప్రతినిధి రాబర్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. మరో 43 మంది గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. తెల్లవారడానికి ముందే ఈ ఘోర ప్రమాదం జరిగిందని.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారాయన. మంటల్ని అదుపులోకి తెచ్చిన అధికారులు.. భవనంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మరిన్ని మృతదేహాలు బయటకు వస్తున్నాయని తెలిపారాయన. మరోవైపు బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా మారుమోగుతోంది.
The death toll in a fire in the Johannesburg CBD has risen to 55 & likely to increase. Over 43 other people have also been injured. It has been reported that the building that caught fire this morning in Johannesburg CBD is a hijacked building full of illegal immigrants. pic.twitter.com/OTEAiQVZ8j
— Man’s NOT Barry Roux (@AdvoBarryRoux) August 31, 2023
Comments
Please login to add a commentAdd a comment