
South Africa vs West Indies, 2nd Test- జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 251 పరుగులకు ఆలౌటైంది. జేసన్ హోల్డర్ (117 బంతుల్లో 81 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.
ఇతర బ్యాటర్లలో కైల్ మేయర్స్ (29), రోస్టన్ ఛేజ్ (28), జొషువా డ సిల్వ (26) కొన్ని పరుగులు జోడించగలిగారు. సఫారీ బౌలర్లలో కోయెట్జీ 3 వికెట్లు పడగొట్టగా...రబడ, హార్మర్ చెరో 2 వికెట్లు తీశారు.
దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్‌లో 69 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్ కోల్పోకుండా 4 పరుగులు చేసింది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 311/7తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 320 పరుగులకు ఆలౌటైంది.
కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్ సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది. ఫిబ్రవరి 28న ఆరంభమైన టెస్టు సిరీస్‌లో భాగంగా ఆతిథ్య ప్రొటిస్ తొలి మ్యాచ్‌లో 87 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తద్వారా ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక మార్చి 8న మొదలైన రెండో టెస్టులోనూ విండీస్‌పై బవుమా బృందానిదే పైచేయిగా ఉంది. ఇదిలా ఉంటే.. మార్చి 16-21 వరకు వన్డే, మార్చి 25-28 వరకు సౌతాఫ్రికా- వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ జరుగనుంది.
చదవండి: Wanindu Hasaranga: పెళ్లి చేసుకున్న శ్రీలంక ఆల్‌రౌండర్.. ఫొటోలు వైరల్!
Steve Smith: అంతా బాగానే ఉంది కానీ.. ఇదేంటి స్మిత్! మరీ ఇలా.. కెరీర్‌లో ఇదే తొలిసారి!
Comments
Please login to add a commentAdd a comment