Kagiso rabada
-
రాణించిన రబాడ.. ముంబై ఇండియన్స్ ఘన విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ రెండో విజయం నమోదు చేసింది. పార్ల్ రాయల్స్‌తో నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రీజా హెండ్రిక్స్ (37 బంతుల్లో 59; 8 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీతో రాణించాడు. రస్సీ వాన్ డెర్ డస్సెన్ (33 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఆఖర్లో డెలానో పాట్గెటర్ (18 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కేప్‌టౌన్ ఇన్నింగ్స్‌లో ర్యాన్ రికెల్టన్ 8, కొలిన్ ఇంగ్రామ్ 7, జార్జ్ లిండే 1, జూనియర్ ఏబీడి 14, అజ్మతుల్లా 2 (నాటౌట్) పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో గాలిమ్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫోర్టుయిన్, మఫాకా, ముజీబ్ ఉర్ రెహ్మన్, లుంగి ఎంగిడి తలో వికెట్ దక్కించుకున్నారు.173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు డ్రి ప్రిటోరియస్ (26), జో రూట్ (26), వన్‌డౌన్ బ్యాటర్ సామ్ హెయిన్ (20), ముజీబ్ రెహ్మాన్ (34), మఫాకా (22 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ లీగ్‌లో ఆడుతున్న ఏకైక భారతీయుడు దినేశ్ కార్తీక్ దారుణంగా విఫలమయ్యాడు. డీకే 7 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (1) కూడా నిరాశపరిచాడు. ఎంఐ బౌలర్లలో జార్జ్ లిండే 3 వికెట్లు పడగొట్టగా.. రబాడ, కెప్టెన్ రషీద్ ఖాన్ తలో రెండు, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ దక్కించుకున్నారు. రబాడ అద్భుతమైన స్పెల్ వేశాడు. తొలి రెండు ఓవర్లను మెయిడిన్ చేసి రెండు వికెట్లు తీశాడు. మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేసిన రబాడకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లింది. -
చరిత్ర సృష్టించిన కగిసో రబాడ.. 108 ఏళ్ల రికార్డు బ్రేక్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్లో దక్షిణాఫ్రికా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సెంచూరియన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో సంచలనం విజయం సాధించిన ప్రోటీస్.. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించింది.ఈ విజయంలో సౌతాఫ్రికా స్పెషలిస్టు సీమ్ బౌలర్ కగిసో రబాడ (26 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) కీలక పాత్ర పోషించాడు. 148 పరుగుల సులువైన లక్ష్య చేధనలో ప్రోటీస్ 99 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రబాడ, మార్కో జానెసన్ విరోచిత పోరాటం కనబరిచారు.వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 51 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా ఊహించని విధంగా మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో స్పెషలిస్టు బ్యాటర్ అవతరమెత్తిన రబాడ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.రబాడ అరుదైన ఘనత..విజయవంతమైన లక్ష్య చేధనలో పది లేదా అంతకంటే ఎక్కువ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోర్ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా రబాడ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సౌతాఫ్రికా దిగ్గజం పెర్సీ షెర్వాల్ పేరిట ఉండేది. అతడు 1906లో జోహన్నెస్‌బర్గ్‌లో ఇంగ్లండ్‌పై పదో వికెట్‌కు బ్యాటింగ్‌కు వచ్చి ఆజేయంగా 22 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో 108 ఏళ్ల షెర్వాల్ రికార్డును రబాడ బ్రేక్ చేశాడు.చదవండి: IND vs AUS: బెయిల్స్ మార్చిన స్టార్క్.. ఇచ్చిపడేసిన యశస్వి జైశ్వాల్! వీడియో వైరల్ -
పాకిస్తాన్ ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సౌతాఫ్రికా
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2023-25 ఫైనల్‌కు ఆర్హత సాధించింది.సెంచూరియన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన సౌతాఫ్రికా.. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టింది.ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో 11 మ్యాచ్‌లు ఆడిన ప్రోటీస్.. 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, మరో మూడింట ఓటమి, ఒకటి డ్రా చేసుకుంది. పాయింట్ల పట్టికలో 66.670 విన్నింగ్ శాతంతో దక్షిణాఫ్రికా అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఇక మిగిలిన ఒక స్ధానం కోసం ఆస్ట్రేలియా, భారత్ జట్లు పోటీపడుతున్నాయి.రబాడ, జాన్సెన్ విరోచిత పోరాటం..ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు దక్షిణాఫ్రికా తీవ్రంగా శ్రమించింది. మార్కో జాన్సెన్, కగిసో రబడా విరోచిత పోరాటంతో తమ జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించారు. స్వల్ప లక్ష్య చేధనలో సౌతాఫ్రికా కేవలం 99 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పాక్ పేసర్ మహ్మద్ అబ్బాస్ 6 వికెట్లతో సఫారీలను దెబ్బకొట్టాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన జాన్సెన్(16), కగిసో రబాడ(31)లు అడ్డుగా నిలుచునున్నారు. అచితూచి ఆడుతూ లక్ష్యాన్ని చేధించారు. అంతకుముందు పాకిస్తాన్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు ఆలౌటైంది.బాబర్ ఆజం (85 బంతుల్లో 50; 9 ఫోర్లు), సౌద్ షకీల్ (113 బంతుల్లో 84; 10 ఫోర్లు, 1 సిక్స్) ఇద్దరు అర్ధసెంచరీలతో రాణించారు. అదేవిధంగా సౌతాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 301 పరుగులు చేయగా.. పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులకే ఆలౌటైంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు కేప్‌టౌన్ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs IND: మెల్బోర్న్ టెస్టు.. భారత్ గెలిస్తే 96 ఏళ్ల రికార్డు బద్దలు! -
వరల్డ్ నెం1 బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా..
టీమిడియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోసారి వరల్డ్ నెం1 టెస్టు బౌలర్‌గా నిలిచాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాకింగ్స్లో బుమ్రా తిరిగి తన అగ్రపీఠాన్ని ఆదోరిహంచాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు టాప్ ర్యాంక్‌లో కొనసాగిన దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడను బుమ్రా వెనక్కి నెట్టాడు. బుమ్రా టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంక్‌కు చేరుకోవడం ఇది ఈ ఏడాదిలో రెండో సారి కావడం గమనార్హం. కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రా మూడో స్ధానంలో ఉన్నాడు.అయితే పెర్త్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఎనిమిది వికెట్లతో సత్తాటాటిన బుమ్రా.. 883 పాయింట్లతో రబడ, జోష్ హేజిల్‌వుడ్‌ను ఆధిగిమించి మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో బుమ్రా నెం1గా నిలిచాడు. మరోవైపు భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ మూడు స్దానాలు ఎగబాకి 25వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అదే విధంగా ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ రెండు స్ధానాలు దిగజారి ఆరో ర్యాంక్‌కు పడిపోయాడు.పెర్త్‌లో బుమ్ బుమ్..కాగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా సంచలన ప్రదర్శన కనబరిచాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో జట్టుకు నాయకత్వం వహించిన బుమ్రా.. కెప్టెన్సీతో పాటు వ్యక్తిగత ప్రదర్శన పరంగా అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టి సత్తచాటాడు. మొత్తంగా 8 వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.చదవండి: IPL 2025: 'నిజంగా నేను ఆశ్చర్యపోయాను.. థాంక్యూ ముంబై ఇండియన్స్' Back to the top and a career-best rating 🙌One of India's best headlines the latest ICC Rankings moves 👇https://t.co/aJzYloew2R— ICC (@ICC) November 27, 2024 -
IPL 2025: ఈ నలుగురిని కొంటే ఆర్సీబీ రాత మారుతుంది!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలం నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) రిటెన్షన్ జాబితా బాగానే ఉందని.. అయితే వేలంపాటలో అనుసరించే వ్యూహాలపైనే అంతా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లి జట్టుతోనే ఉండటం సంతోషకరమన్న ఏబీడీ.. చహల్‌ను కూడా తిరిగి తీసుకువస్తే జట్టు మరింత బలోపేతమవుతుందన్నాడు.కాగా నవంబరు 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో మెగా వేలం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఇక ఆర్సీబీ తమ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(రూ. 21 కోట్లు)తో పాటు రజత్ పాటిదార్(రూ. 11 కోట్లు), యశ్ దయాళ్(రూ. 5 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. ఈ క్రమంలో రిటెన్షన్ పోగా.. ఆర్సీబీ పర్సులో ఇంకా రూ. 83 కోట్లు మిగిలి ఉన్నాయి.ఈ నలుగురిని కొంటే ఆర్సీబీ రాత మారుతుందిఈ నేపథ్యంలో ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ వేలంలో ఆర్సీబీ అనుసరించాల్సిన వ్యూహాలపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘నేనైతే ఈ నలుగురు ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తాను. యజువేంద్ర చహల్, కగిసో రబడ, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్... ఈ నలుగురిని కొనుగోలు చేసిన తర్వాత పర్సులో ఎంత మిగిలిందన్న అంశం ఆధారంగా మిగతా ప్లేయర్లను ప్లాన్ చేసుకోవాలి.ఒకవేళ మీకు రబడను కొనేంత సొమ్ము లేకపోతే.. మహ్మద్ షమీని దక్కించుకోండి’’ అని డివిలియర్స్ ఆర్సీబీ యాజమాన్యానికి సూచించాడు. కాగా సుదీర్ఘకాలం పాటు తమతో కొనసాగిన భారత మణికట్టు స్పిన్నర్ చహల్‌ను 2022లో ఆర్సీబీ వదిలేసిన విషయం తెలిసిందే.లీడింగ్ వికెట్ టేకర్అయితే, అదే ఏడాది రాజస్తాన్ రాయల్స్ చహల్‌ను కొనుక్కోగా.. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా 160 మ్యాచ్‌లు ఆడి క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక వికెట్లు(295) తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు చహల్.ఈ నేపథ్యంలో చహల్‌ను ఆర్సీబీ మళ్లీ తిరిగి జట్టులో చేర్చుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయని ఆ టీమ్ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీ ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఈ ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరినా.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. చదవండి: #Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్లో తొలి డబుల్ సెంచరీ -
మళ్లీ ఐదేసిన రబాడ.. ఫాలో ఆన్ ఆడుతున్న బంగ్లాదేశ్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన సహా తొమ్మిది వికెట్లు పడగొట్టిన రబాడ, రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మరో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. రబాడ విజృంభించడంతో రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ ఫాలో ఆన్ ఆడుతుంది.Kagiso Rabada picks up his 16th Test five wicket haul. 🤯 pic.twitter.com/lXOXbVSF2v— Mufaddal Vohra (@mufaddal_vohra) October 31, 2024పూర్తి వివరాల్లోకి వెళితే.. చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా గెలుపు దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 575 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టోనీ డి జోర్జీ (177), ట్రిస్టన్ స్టబ్స్ (106), వియాన్ ముల్దర్ (105 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. ఈ ముగ్గురికి కెరీర్లో (టెస్ట్) ఇవి తొలి సెంచరీలు. ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆటగాళ్లు తొలి సెంచరీలు నమోదు చేయడం ప్రపంచ రికార్డు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ, ట్రిస్టన్, ముల్దర్ సెంచరీలతో సత్తా చాటగా.. డేవిడ్ బెడింగ్హమ్ (59), సెనురన్ ముత్తుస్వామి (68 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం ఐదు వికెట్లు తీశాడు.అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. రబాడ దెబ్బకు (5/37) తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూలింది. డేన్ పీటర్సన్, కేశవ్ మహారాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ముత్తుస్వామి ఓ వికెట్ దక్కింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్ హాక్ (82), తైజుల్ ఇస్లాం (30), మహ్మదుల్ హసన్ జాయ్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. దక్షిణాఫ్రికా తోలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 416 పరుగులు వెనుకపడి ఫాలో ఆన్ ఆడుతున్న బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. మూడో రోజు టీ విరామం సమయానికి ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి కేవలం 43 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు బంగ్లాదేశ్ ఇంకా 373 పరుగులు వెనుకపడి ఉంది. -
బుమ్రా చేజారిన వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు.. అగ్రస్థానంలో అతడు
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును కోల్పోయాడు. అతడి అగ్ర స్థానాన్ని సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ ఆక్రమించాడు. ఇక బుమ్రా మూడోస్థానానికి పడిపోగా.. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్ రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) బుధవారం ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఈ మేర మార్పులు చోటుచేసుకున్నాయి.మూడు వందల టెస్టు వికెట్ల క్లబ్లోకాగా బంగ్లాదేశ్ పర్యటనలో రబాడ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మిర్పూర్ టెస్టులో తొమ్మిది వికెట్లతో సత్తా చాటి జట్టును గెలిపించాడు. అంతేకాదు.. ఈ టూర్ సందర్భంగా రబాడ మూడు వందల టెస్టు వికెట్ల క్లబ్లో చేరాడు. ఈ క్రమంలో రెండు ర్యాంకులు మెరుగుపరచుకున్న 29 ఏళ్ల రబాడ.. బుమ్రాను వెనక్కి నెట్టి వరల్డ్ నంబర్ వన్‌గా అవతరించాడు.మరోవైపు.. బుమ్రా స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో రాణించలేకపోతున్నాడు. స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌పై వికెట్లు తీయడంలో వెనుకబడ్డాడు. దీంతో కివీస్‌తో తొలి రెండు రెండు టెస్టుల్లో మూడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ క్రమంలో నంబర్ వన్ ర్యాంకును కోల్పోయాడు.సత్తా చాటిన పాక్ స్పిన్నర్లుసొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ స్పిన్నర్లు నౌమన్ అలీ, సాజిద్ ఖాన్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో నౌమన్ కెరీర్ బెస్ట్ సాధించాడు. ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకి.. తొమ్మిదో ర్యాంకుకు చేరుకున్నాడు.సాంట్నర్ ఏకంగా 30 స్థానాలు ఎగబాకిమరోవైపు.. సాజిద్ ఖాన్ సైతం 12 స్థానాలు మెరుగుపరచుకుని కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించాడు. ఇక టీమిండియాతో పుణె వేదికగా రెండో టెస్టులో సత్తా చాటిన న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ సైతం ముందుకు దూసుకువచ్చాడు. రెండో టెస్టులో 13 వికెట్లతో చెలరేగిన ఈ లెఫ్టార్మ్ బౌలర్ 30 స్థానాలు ఎగబాకి 44వ ర్యాంకుకు చేరుకున్నాడు.ఐసీసీ టెస్టు బౌలర్ల తాజా ర్యాంకులు టాప్-51. కగిసో రబాడ(సౌతాఫ్రికా)- 860 రేటింగ్ పాయింట్లు2. జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా)- 847 రేటింగ్ పాయింట్లు3. జస్ప్రీత్ బుమ్రా(ఇండియా)- 846 రేటింగ్ పాయింట్లు4. రవిచంద్రన్ అశ్విన్(ఇండియా)- 831 రేటింగ్ పాయింట్లు4. ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- 820 రేటింగ్ పాయింట్లు.జైస్వాల్‌కు మూడో ర్యాంకుఇదిలా ఉంటే.. టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కేన్ విలియమ్సన్ రెండో ర్యాంకు నిలబెట్టుకున్నాడు. ఇక టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక ర్యాంకు మెరుగపరుచుకుని మూడో స్థానానికి చేరుకోగా.. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ స్మిత్ ఆ తర్వాతి ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ -
రఫ్ఫాడించిన రబాడ.. సౌతాఫ్రికా ఘన విజయం
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక సౌతాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106, రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308, ఛేదనలో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది. సౌతాఫ్రికా పేసర్ రబాడ మ్యాచ్ మొత్తంలొ తొమ్మిది వికెట్లు తీసి బంగ్లా ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. కైల్ వెర్రిన్ తొలి ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీ (114) తమ జట్టు గెలుపుకు పునాది వేశాడు.కుప్పకూలిన బంగ్లాదేశ్తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకు ఆలౌటైంది. రబాడ, వియాన్ ముల్దర్, కేశవ్ మహారాజ్ తలో మూడు వికెట్లు, డీన్ పైడిట్ ఓ వికెట్ తీసి బంగ్లా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మహ్మదుల్ హసన్ (30), తైజుల్ ఇస్లాం (16), మెహిది హసన్ మిరాజ్ (13), ముష్ఫికర్ రహీం (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.వెర్రిన్ సూపర్ సెంచరీఅనంతరం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. కైల్ వెర్రిన్ సూపర్ సెంచరీతో (114) తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ముల్దర్ హాఫ్ సెంచరీతో (54) రాణించాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం ఐదు వికెట్లు పడగొట్టగా.. హసన్ మహమూద్ 3, మెహిది హసన్ మిరాజ్ 2 వికెట్లు దక్కించుకున్నారు.సెంచరీ చేజార్చుకున్న మిరాజ్202 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఈ ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. తద్వారా సౌతాఫ్రికా ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. బంగ్లా బ్యాటర్ మెహిది హసన్ మిరాజ్ (97) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రబాడ ఆరు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. కేశవ్ మహారాజ్ 3, ముల్దర్ ఓ వికెట్ పడగొట్టారు.చదవండి: IND vs NZ 2nd Test: అశ్విన్ మ్యాజిక్.. కెప్టెన్ ఔట్ -
ఆరేసిన రబాడ.. సౌతాఫ్రికా టార్గెట్ 106
ఢాకా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓటమి దిశగా సాగుతోంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 307 పరుగులకు ఆలౌటైంది. తద్వారా సౌతాఫ్రికా ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు ఆట ప్రారంభమైన కొంత సేపటికే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్‌నైట్ బ్యాటర్ మెహిది హసన్ మిరాజ్ తన వ్యక్తిగత స్కోర్‌కు మరో 10 పరుగులు జోడించి 97 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఓవర్‌నైట్ స్కోర్‌కు (283/7) బంగ్లాదేశ్ మరో 24 పరుగులు జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. రబాడ ఆరు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. కేశవ్ మహారాజ్ 3, ముల్దర్ ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. కైల్ వెర్రిన్ సూపర్ సెంచరీతో (114) తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ముల్దర్ హాఫ్ సెంచరీతో (54) రాణించాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం ఐదు వికెట్లు పడగొట్టగా.. హసన్ మహమూద్ 3, మెహిది హసన్ మిరాజ్ 2 వికెట్లు దక్కించుకున్నారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 106 పరుగులకు ఆలౌటైంది. రబాడ, వియాన్ ముల్దర్, కేశవ్ మహారాజ్ తలో మూడు వికెట్లు, డీన్ పైడిట్ ఓ వికెట్ తీసి బంగ్లా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మహ్మదుల్ హసన్ (30), తైజుల్ ఇస్లాం (16), మెహిది హసన్ మిరాజ్ (13), ముష్ఫికర్ రహీం (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. చదవండి: స్కై, విరాట్లను అధిగమించిన సికందర్ రజా -
బంగ్లా ఆల్‌రౌండర్ విశ్వరూపం.. సౌతాఫ్రికాకు షాకిచ్చేలా!
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో బంగ్లాదేశ్ క్రికెటర్ మెహదీ హసన్ మిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో వికెట్లు(2) తీయడంతో పాటు బ్యాట్ ఝులిపిస్తూ సత్తా చాటుతున్నాడు ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. మిరాజ్ సూపర్ బ్యాటింగ్ కారణంగానే బంగ్లా ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకుని మళ్లీ పోటీలోకి వచ్చే స్థితిలో నిలిచింది.106 పరుగులకే ఆలౌట్‌కాగా రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య సోమవారం ఢాకా వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ప్రొటిస్ బౌలర్ల ధాటికి నిలవలేక తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌట్ అయింది. 202 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికాసౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ, వియాన్ ముల్దర్, కేశవ్ మహరాజ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. డేన్ పీడ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 308 పరుగులు చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ కంటే 202 రన్స్ ఆధిక్యంలో నిలిచింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లోనూ బంగ్లాదేశ్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(1), వన్‌డౌన్ బ్యాటర్ మొమినుల్ హక్(0) పూర్తిగా విఫలమయ్యారు.ఈ దశలో మరో ఓపెనర్ మహ్మదుల్ హసన్ జాయ్ 40 పరుగులతో రాణించగా.. కెప్టెన్ నజ్ముల్ షాంటో(23) అతడికి సహకరించాడు. సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం(33) స్థాయికి తగ్గట్లు ఆడలేక చతికిలపడగా.. వికెట్ కీపర్ లిటన్ దాస్ 7 పరుగులకే అవుటయ్యాడు.మిరాజ్ మిరాకిల్ఫలితంగా ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలయ్యే దుస్థితిలో బంగ్లాదేశ్ ఉన్న వేళ మెహదీ హసన్ మిరాజ్ ఆపద్భాందవుడిగా ఆదుకున్నాడు. ఏడోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు ఊహించని రీతిలో సౌతాఫ్రికా బౌలర్లకు షాకిచ్చాడు.తన బ్యాటింగ్ విశ్వరూపం ప్రదర్శిస్తూ.. అర్ధ శతకం పూర్తిచేసుకున్నాడు. బుధవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 171 బంతులు ఎదుర్కొని 87 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిరాజ్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ జాకిర్ అలీ సైతం హాఫ్ సెంచరీ(58)తో రాణించాడు.సరికొత్త రికార్డుఈ క్రమంలో వీరిద్దరు కలిసి సౌతాఫ్రికాపై సరికొత్త రికార్డు నెలకొల్పారు. 138 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక పార్ట్నర్షిప్ సాధించిన జోడీగా మెహదీ హసన్ మిరాజ్- జాకిర్ అలీ నిలిచారు. ఈ సందర్భంగా హబీబుల్ బషార్- జావేద్ ఒమర్(131 రన్స్) పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశారు.ఎట్టకేలకు లీడ్లోకిఇదిలా ఉంటే.. బుధవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి మిరాజ్ 87, నయీం హసన్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ 85 ఓవర్ల ఆటలో ఏడు వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసి.. 81 పరుగుల లీడ్‌లోకి వచ్చింది. ఇక బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో ప్రొటిస్ బౌలర్లలో కగిసో రబాడ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కేశవ్ మహరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. చదవండి: Ind vs NZ: అతడి ఆట తీరు బాగుంది.. అయినా..: గంభీర్ -
రబాడ దెబ్బకు ముష్ఫికర్‌కు ఫ్యూజులు ఔట్..!
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా పట్టు బిగించింది. మూడో రోజు లంచ్ విరామం సమయానికి బంగ్లాదేశ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు బంగ్లాదేశ్ ఇంకా ఒక్క పరుగు వెనుకపడి ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గట్టెక్కలేదు. ఆ జట్టు చేతిలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంకా రెండున్నర రోజులకు పైగా ఆట మిగిలి ఉంది. మెహిది హసన్ (55), జాకెర్ అలీ (30) బంగ్లాదేశ్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇద్దరూ ఔటైతే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ పరిసమాప్తమైనట్టే.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటైంది. అనంతరం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేసి 202 పరుగుల ఆధిక్యం సంపాదించింది. కైల్ వెర్రిన్ అద్బుతమైన సెంచరీ (114) చేసి సౌతాఫ్రికాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.THE SOUND. 🔊THE DELIVERY. 🥶KAGISO RABADA, YOU BEAUTY...!!!pic.twitter.com/ZuVxm1ovxq— Mufaddal Vohra (@mufaddal_vohra) October 23, 2024రబాడ దెబ్బ.. ముష్ఫికర్ అబ్బ..!ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా పేసర్ రబాడ బంగ్లాదేశ్ బ్యాటర్లను తెగ ఇబ్బంది పెట్టాడు. ముఖ్యంగా వెటరన్ ముష్ఫికర్ రహీం పాలిట విలన్ అయ్యాడు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో రబాడ ముష్ఫికర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్ క్లీన్ బౌల్డ్ అయిన తీరు ఎలా వైరల్ అయ్యిందో.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో సీన్ కూడా అలాగే వైరలవుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో రబాడ సంధించిన ఇన్ స్వింగర్ దెబ్బకు ముష్ఫికర్ మిడ్ వికెట్ గాల్లో పల్టీలు కొట్టింది. ఈ సీన్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. కాగా, రబాడ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 3, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు నేలకూల్చాడు. చదవండి: కేఎల్ రాహుల్‌ను వదిలేయనున్న లక్నో.. మయాంక్ యాదవ్‌కు 14 కోట్లు..? -
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్.. కష్టాల్లో బంగ్లాదేశ్
ఢాకా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ ఎదురీదుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. బంగ్లాదేశ్.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 101 పరుగుల వెనుకంజలో ఉంది. బంగ్లా సెకెండ్ ఇన్నింగ్స్‌లో షద్మాన్ ఇస్లాం (1), మొమినుల్ హక్ (0), నజ్ముల్ హసన్ షాంటో (23) ఔట్ కాగా.. మహ్మదుల్ హసన్ జాయ్ (38), ముష్ఫికర్ రహీం (31) క్రీజ్‌లో ఉన్నారు. రబాడ సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ బంగ్లా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. నాలుగు పరుగుల వద్ద రబాడ.. షద్మాన్ ఇస్లాం, మొమినుల్ హక్ వికెట్లు పడగొట్టాడు. షాంటో వికెట్ కేశవ్ మహారాజ్‌కు దక్కింది.అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. వికెట్‌కీపర్ కైల్ వెర్రిన్ సూపర్ సెంచరీతో (114) సౌతాఫ్రికాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. వెర్రిన్‌కు వియాన్ ముల్దర్ (54), డీన్ పైడిట్ (32) సహకరించారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ డి జోర్జీ (30), ర్యాన్ రికెల్టన్ (27), ట్రిస్టన్ స్టబ్స్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం ఐదు వికెట్లు తీయగా.. హసన్ మహమూద్ 3, మెహిది హసన్ మిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. సఫారీ బౌలర్ల ధాటికి 106 పరుగులకే ఆలౌటైంది. రబాడ, వియాన్ ముల్దర్, కేశవ్ మహారాజ్ తలో మూడు వికెట్లు, డీన్ పైడిట్ ఓ వికెట్ తీసి బంగ్లా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మహ్మదుల్ హసన్ (30), తైజుల్ ఇస్లాం (16), మెహిది హసన్ మిరాజ్ (13), ముష్ఫికర్ రహీం (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది.చదవండి: Sarfaraz vs KL Rahul: గిల్ రాక.. ఎవరిపై వేటు? కోచ్ ఆన్సర్ ఇదే -
చరిత్ర సృష్టించిన రబాడ.. దెబ్బకు ప్రపంచ రికార్డు బ్రేక్
దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో బంతుల పరంగా అత్యంత వేగంగా 300 వికెట్ల మైలు రాయిని అందుకున్న బౌలర్‌గా రబాడ రికార్డులకెక్కాడు. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రబాడ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు.బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో రబాడ ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సఫారీ పేస్ గుర్రం కేవలం 11,187 బంతుల్లోనే ఈ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వకార్ యూనిస్ పేరిట ఉండేది. యూనిస్ 12,602 బంతుల్లో 300 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో వకార్ ఆల్‌టైమ్ రికార్డును రబాడ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌ల పరంగా అయితే రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్ధానంలో ఉన్నాడు. అశ్విన్ కేవలం 54 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును అందుకున్నాడు. ఈ జాబితాలో రబాడ నాలుగో స్ధానంలో ఉన్నాడు.మూడో సఫారీ పేసర్గాఅదే విధంగా టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆరో సౌతాఫ్రికా బౌలర్‌గా రబాడ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో డేల్ స్టెయిన్(439) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. కాగా బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో రబాడ 3 వికెట్లు పడగొట్టాడు.బంతుల పరంగా అత్యంత వేగంగా 300 టెస్టు వికెట్లు తీసిన బౌలర్లు వీరేకగిసో రబాడ (దక్షిణాఫ్రికా) – 11817 బంతులువకార్ యూనిస్ (పాకిస్థాన్) – 12602 బంతులుడేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) – 12605 బంతులుఅలాన్ డొనాల్డ్ (దక్షిణాఫ్రికా) – 13672 బంతులుటెస్టుల్లో దక్షిణాఫ్రికా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..డేల్ స్టెయిన్ – 93 మ్యాచ్‌ల్లో 439 వికెట్లుషాన్ పొలాక్ – 108 మ్యాచ్‌ల్లో 421 వికెట్లుమఖాయ ఎంతిని – 101 మ్యాచ్‌ల్లో 390 వికెట్లుఅలెన్ డొనాల్డ్ – 72 మ్యాచ్‌ల్లో 330 వికెట్లుమోర్నీ మోర్కెల్ – 86 మ్యాచ్‌ల్లో 309 వికెట్లుకగిసో రబాడ – 65 మ్యాచ్‌ల్లో 301* వికెట్లు -
దక్షిణాఫ్రికా బౌలర్ల ఉగ్రరూపం.. 106 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్
టీమిండియా చేతిలో వైట్‌వాష్‌కు గురైన బంగ్లాదేశ్ ఆట తీరు ఏ మాత్రం మారలేదు. ఢాకా వేదికగా సౌతాఫ్రికాతో ప్రారంభమైన మొదటి టెస్టులో బంగ్లాదేశ్ దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు నిప్పులు చేరిగారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు సఫారీ బౌలర్లు చుక్కలు చూపించారు. సౌతాఫ్రికా పేసర్ల దాటికి బంగ్లా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 106 పరుగులకే కుప్పకూలింది. రబడా, ముల్డర్, కేశవ్ మహారాజ్ తలా మూడు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించారు. బంగ్లా బ్యాటర్లలో మెహదీ హసన్ జాయ్(30) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా బంగ్లాదేశ్ గత నెలలో భారత్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయింది.తుది జట్లుబంగ్లాదేశ్: షాద్మన్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, లిట్టన్ దాస్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, నయీమ్ హసన్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్దక్షిణాఫ్రికా : టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, ర్యాన్ రికెల్టన్, మాథ్యూ బ్రీట్జ్కే, కైల్ వెర్రెయిన్నే(వికెట్ కీపర్), వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, డేన్ పీడ్ -
63 టెస్టులు.. 294 వికెట్లు! జాక్వెస్ కల్లిస్ రికార్డు బద్దలు
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ నిప్పులు చేరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 18 ఓవర్లు బౌలింగ్ చేసిన రబాడ.. మూడు కీలక వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బ తీశాడు. అతడితో పాటు మహారాజ్ 4 వికెట్ల పడగొట్టడంతో ఆతిథ్య కరేబియన్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకే కుప్పకూలింది. దీంతో ప్రోటీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగుల ఆధిక్యం లభించింది. విండీస్ బ్యాటర్లలో కీసీ కార్తీ(42) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 357 పరుగులకు ఆలౌటైంది.రబాడ అరుదైన ఘనత..ఇక ఈ మ్యాచ్‌లో కగిసో రబాడ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆరో సఫారీ బౌలర్‌గా రబడ రికార్డులకెక్కాడు. విండీస్ బ్యాటర్ కావెం హాడ్జ్‌ను ఔట్ చేసిన రబాడ.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 63 టెస్టులు ఆడిన రబాడ 294 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు ప్రోటీస్ క్రికెట్ దిగ్గజం జాక్వెస్ కల్లిస్ (291) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కల్లిస్‌ను రబాడ అధిగమించాడు. ఇక ఈ జాబితాలో దక్షిణాఫ్రికా పేస్ గన్ డేల్ స్టెయిన్ 439 వికెట్లతో అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానాల్లో షాన్ పొలాక్(421), ఎన్తిని(390) ఉన్నారు. -
T20 World Cup 2024: దారుణంగా ఢీకొట్టుకున్నారు.. జన్సెన్కు తీవ్ర గాయం..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా వెస్టిండీస్‌తో ఇవాళ (జూన్ 24) జరుగుతున్న కీలక సమరంలో ఓ ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. మార్క్రమ్ బౌలింగ్ కైల్ మేయర్స్ కొట్టిన సిక్సర్‌ను క్యాచ్‌గా మలిచే క్రమంలో మార్కో జన్సెన్, కగిసో రబాడ తీవ్రంగా గాయపడ్డారు. బౌండరీ లైన్ వద్ద రబాడ, జన్సెన్ ఒకరినొకరు దారుణంగా ఢీకొట్టుకున్నారు. ఈ ఘటనలో జన్సెన్ తీవ్రంగా గాయపడగా.. రబాడ స్వల్ప గాయంతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.Kagiso Rabada and Marco Jansen collide on the boundary line 🤯Hope there are no serious injuries 🤞📸: Disney+Hotstar pic.twitter.com/S1PYlR4Ddw— CricTracker (@Cricketracker) June 24, 2024ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. సౌతాఫ్రికా బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. తబ్రేజ్ షంషి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించి విండీస్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. షంషి 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. షంషికి జతగా సఫారీ బౌలర్లంతా రాణించారు. జన్సెన్, మార్క్రమ్, కేశవ్ మహారాజ్, రబాడ తలో వికెట్ పడగొట్టారు. View this post on Instagram A post shared by ICC (@icc)విండీస్ ఇన్నింగ్స్‌లో రోస్టన్ ఛేజ్ (52) అర్దసెంచరీతో రాణించగా.. కైల్ మేయర్స్ 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. వీరిద్దరు మినహా విండీస్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. హోప్ 0, పూరన్ 1, రోవ్‌మన్ పావెల్ 1, రూథర్‌ఫోర్డ్ 0, రసెల్ 15, అకీల్ హొసేన్ 6 పరుగులు చేశారు. అల్జరీ జోసఫ్ (11 నాటౌట్), మోటీ (4) నాటౌట్‌గా నిలిచారు. 10 పరుగులు ఎక్సట్రాల రూపంలో వచ్చాయి. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు వరుణుడు అడ్డు తగిలాడు. ఆ జట్టు స్కోర్ 15/2 (2 ఓవర్లలో) వద్ద ఉండగా.. వర్షం మొదలైంది. దీంతో అక్కడే మ్యాచ్‌ను ఆపేశారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవాలంటే మరో 18 ఓవర్లలో 121 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిస్తే గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్‌తో పాటు సెమీస్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడితే మెరుగైన రన్‌రేట్ కలిగిన జట్టు (విండీస్, సౌతాఫ్రికా) సెమీస్‌కు చేరుకుంటుంది. -
రబాడను ఎదుర్కొనేందుకు రోహిత్ స్పెషల్ ప్లాన్..
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత జట్టు వ్యహాలు రచిస్తోంది. తొలి టెస్టులో ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. శనివారం టీమిండియా నెట్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గోంది. ఈ ప్రాక్టీస్ సెషన్‌కు భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ డుమ్మా కొట్టారు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడను ఎదుర్కొనేందుకు హిట్‌మ్యాన్ ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాడు. భారత పేసర్ ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. దాదాపు రెండు గంటల పాటు ముఖేష్ బౌలింగ్‌ను రోహిత్ ఎదుర్కొన్నాడు. ముఖేష్ బౌలింగ్‌లో ఎక్కువగా లెంగ్త్ బాల్స్‌ను రోహిత్ ప్రాక్టీస్ చేశాడు. కాగా గత కాలంగా రబాడ బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి శర్మ ఇబ్బంది పడుతున్నాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో కూడా రబాడ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఇప్పటివరకు 14 సార్లు హిట్‌మ్యాన్‌ను రబాడ ఔట్ చేశాడు. ఇక జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్‌కు రవీంద్ర జడేజా తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. జడ్డూ పూర్తి ఫిట్నెస్ సాధించి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. చదవండి: ఐపీఎల్ ఒలింపిక్స్‌తో సమానం.. చాలా సంతోషంగా ఉంది: లక్నో హెడ్ కోచ్ -
చెలరేగిన ప్రొటిస్ పేసర్లు.. రోహిత్ సేన ఘోర పరాజయం.. ఈసారీ లేనట్లే
సౌతాఫ్రికాలో టీమిండియాకు మరోసారి పరాభవం ఎదురైంది. ఇంత వరకు సఫారీ గడ్డపై ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవని భారత జట్టు ఈసారి కూడా అవకాశాన్ని చేజార్చుకుంది. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ మీద 32 పరుగుల తేడాతో ఓడి ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. సొంతగడ్డపై టీమిండియాపై మరోసారి ఆధిపత్యం చాటుకున్న సౌతాఫ్రికా మూడో రోజే ఆటను ముగించి సత్తా చాటింది. ప్రొటిస్ సెంచరీ హీరో డీన్ ఎల్గర్(185) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మంగళవారం మొదలైన బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కఠినమైన సెంచూరియన్ పిచ్‌పై ప్రొటిస్ పేసర్ల విజృంభణతో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. స్టార్ బ్యాటర్లు, అనుభవజ్ఞులు అయిన ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(5), విరాట్ కోహ్లి(38) విఫలం కావడం ప్రభావం చూపింది. అయితే, ఆరో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన కేఎల్ రాహుల్ అసాధారణ పోరాటం కనబరిచాడు. అర్ధ శతకంతో రాణించి తొలి రోజు ఆటను ముగించాడు. అయితే రెండో రోజు ఆట సందర్భంగా సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ నండ్రీ బర్గర్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ చరమాంకానికి చేరుకుంది. 67.4 ఓవర్లలో కేవలం 245 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్ డీన్ ఎల్గర్ అదిరిపోయే ఆరంభం అందించాడు. అతడికి తోడుగా అరంగేట్ర బ్యాటర్ బెడింగ్హామ్ అర్ధ శతకం (56)తో రాణించాడు. ఈ క్రమంలో బుధవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి 66 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. 11 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఇక మూడో రోజు ఆటలో భాగంగా 408 పరుగులకు ఆలౌట్ అయి ఆధిక్యాన్ని 163 పరుగులకు పెంచుకుంది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాను ప్రొటిస్ పేసర్లు దెబ్బకొట్టారు. కగిసో రబడ రోహిత్ శర్మను డకౌట్ చేసి శుభారంభం అందించగా.. నండ్రీ బర్గర్ యశస్వి జైస్వాల్(5)ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత శుబ్‌మన్ గిల్(26)ను పెవిలియన్‌కు పంపిన మార్కో జాన్సెన్.. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్(6)ను కూడా అవుట్ చేశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి ఆచితూచి నిలకడగా ఆడాడు. అయితే, కేఎల్ రాహుల్(4) అవుటైన తర్వాత టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనం వేగం పుంజుకుంది. రాహుల్‌ను అవుట్ చేసిన మరుసటి బంతికే బర్గర్.. అశ్విన్‌ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత రబడ శార్దూల్ ఠాకూర్ వికెట్‌ను తన ఖాతాలో వేసుకోగా.. కోహ్లితో సమన్వయ లోపం కారణంగా బుమ్రా రనౌట్ అయ్యాడు. సిరాజ్ 4 పరుగులకే పెవిలియన్ చేరగా.. ప్రసిద్ కృష్ణ క్రీజులోకి వచ్చాడు. అయితే, 34.1వ ఓవర్ వద్ద మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో కోహ్లి రబడకు క్యాచ్ అవ్వడంతో టీమిండియా ఓటమి ఖరారైంది. సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రీ బర్గర్ నాలుగు వికెట్లు తీయగా.. రబడకు రెండు, మార్కో జాన్సెన్కు మూడు వికెట్లు దక్కాయి. బుమ్రా రనౌట్‌లో ఎల్గర్, రబడ పాలు పంచుకున్నారు. .@imVkohli brings up his 5️⃣0️⃣ He came out in the middle with all guns blazing countering the fiery 🇿🇦 bowling attack 🔥 Will the 👑 go on & convert it into a big one? Tune in to #SAvIND 1st Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/edhPpCavOi — Star Sports (@StarSportsIndia) December 28, 2023 -
టీమిండియాతో తొలి టెస్టు.. రబాడ అరుదైన ఘనత! కేవలం 28 ఏళ్లకే
సెంచూరియన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న బ్యాక్సింగ్ డే టెస్టులో దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ నిప్పులు చేరుగుతున్నాడు. తొలి రోజు ఏకంగా 5 వికెట్లు పడగొట్టి భారత్‌ను బ్యాక్‌ఫుట్‌లో ఉంచాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, శార్ధూల్ ఠాకూర్ వంటి కీలక వికెట్లను రబాడ పడగొట్టాడు. ఈ క్రమంలో రబాడ ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్లు తీసిన ఎలైట్ బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో రబాడ 39వ స్ధానంలో నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో శార్ధూల్ ఠాకూర్‌ను ఔట్ చేసిన ఈ సఫారీ సూపర్ స్టార్.. ఈ అరుదైన తన పేరిట లిఖించుకున్నాడు. కేవలం 28 ఏళ్లకే రబాడ ఈ ఘనత సాధించడం విశేషం. అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్లో దక్షిణాఫ్రికా తరుపున అత్యధిక వికెట్లు తీసిన ఏడో బౌలర్‌గా రబాడ రికార్డులకెక్కాడు. దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు.. షాన్ పొలాక్ – 829 వికెట్లు డేల్ స్టెయిన్ – 699 మఖాయ ఎంతిని – 662 అలాన్ డోనాల్డ్ – 602 జాక్వెస్ కలిస్ – 577 మోర్నీ మోర్కెల్ – 544 కగిసో రబడ – 500* -
ముగిసిన తొలి రోజు ఆట.. నిప్పులు చేరిగిన రబాడ! రాహుల్ క్లాసీ ఇన్నింగ్స్
సెంచూరియన్ వేదికగా భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆటముగిసింది. వర్షం కారణంగా తొలి రోజు కేవలం 59 ఓవర్లు ఆట మాత్రమే సాధ్యమైంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(70 బ్యాటింగ్), సిరాజ్ ఉన్నారు. అయితే మొదటి రోజు దక్షిణాఫ్రికా బౌలర్లు భారత్‌పై పైచేయి సాధించారు. ముఖ్యంగా స్టార్ పేసర్ రబాడ ఐదు వికెట్లతో చెలరేగాడు. రబాడతో పాటు బర్గర్ రెండు, జానెసన్ ఒక వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో రాహుల్‌తో పాటు విరాట్ కోహ్లి(38), శ్రేయస్ అయ్యర్(31) పరుగులతో పర్వాలేదన్పించారు. కాగా ఈ మ్యాచ్‌లో జైశ్వాల్(17),రోహిత్ శర్మ(5), గిల్(2) తీవ్ర నిరాశపరిచారు. రాహుల్ క్లాసీ ఇన్నింగ్స్.. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికీ.. రాహుల్ ఆచితూచి ఆడుతూ టీమిండియా స్కోర్ 200 పరుగుల దాటడంలో కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు నిప్పులు చేరుగుతున్న చోట రాహుల్ క్లాసీ ఇన్నింగ్స్ ఆడాడు. చదవండి: #KL Rahul: రబాడ బౌన్సర్ల వర్షం.. అయినా గానీ! శెభాష్ రాహుల్ -
రోహిత్ శర్మను ట్రాప్ చేసిన రబాడ.. వీడియో వైరల్
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశ పరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి రోహిత్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికా పేసర్ రబాడ ట్రాప్ చేసి మరి హిట్‌మ్యాన్‌ను పెవిలియన్ పంపాడు. ఫైన్ లెగ్‌లో ఫీల్డర్‌ను పెట్టి రోహిత్‌కు షార్ట్ బాల్‌ను రబాడ సంధించాడు. ఈ క్రమంలో భారీ షాట్‌కు ప్రయత్నించిన రోహిత్.. ఫైన్ లెగ్ ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో చేసేదేమి లేక రోహిత్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ఓటమి అనంతరం రోహిత్‌కు ఇదే తొలి మ్యాచ్. కాగా టెస్టుల్లో రోహిత్‌ను రబాడ ఔట్ చేయడం ఇది 13వ సారి కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్(5), జైశ్వాల్(17), గిల్(2) తీవ్ర నిరాశపరిచారు. ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్‌ను విరాట్ కోహ్లి(15), శ్రేయస్ అయ్యర్(9) చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 16 ఓవర్లకు భారత్ స్కోర్: 50/3. చదవండి: Adudam Andhra: ఏపీ క్రీడా సంబురం: టాలెంట్ హంట్‌లో CSK! ప్రణాళికాబద్ధంగా జగన్ ప్రభుత్వం Rohit Sharma Gone 💔 Early break through for SA#RohitSharma #AUSvsPAK #INDvsSA #ShubmanGill pic.twitter.com/R9gGwcz1qh — Ali Khan (@ProPakistanii7) December 26, 2023 -
Ind vs SA: అతడి నుంచి ఎక్కువగా ఆశించొద్దు: మాజీ ఓపెనర్
IND vs SA Test Series 2023: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్‌పై అంచనాలు పెంచుకోవద్దని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. సఫారీ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం అత్యంత సవాలుతో కూడుకున్నదని.. గత ప్రదర్శన ఆధారంగా యశస్విపై ఆశలు పెట్టుకోవద్దని పేర్కొన్నాడు. కాగా వెస్టిండీస్ పర్యటన సందర్భంగా యశస్వి జైశ్వాల్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. విండీస్‌తో తొలి మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ 21 ఏళ్ల లెఫ్టాండర్.. సెంచరీతో చెలరేగాడు. అరంగేట్రంలోనే సెంచరీ కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్‌గా బరిలోకి దిగి 171 పరుగులు సాధించి అనేక రికార్డులు సృష్టించాడు. విండీస్‌పై టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక రెండో టెస్టులోనూ అర్ధ శతకం(57)తో ఆకట్టుకున్న యశస్వి.. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ సందర్బంగా మొత్తంగా 266 పరుగులతో సత్తా చాటాడు. రెగ్యులర్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ వన్‌డౌన్‌లో ఆడటంతో ఓపెనర్‌గా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లోనూ అడుగుపెట్టి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇదిలా ఉంటే.. యశస్వి టీమిండియాతో పాటు ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. సౌతాఫ్రికాతో అంత ఈజీ కాదు.. ఎందుకంటే ప్రొటిస్‌తో టీ20 సిరీస్ అనంతరం డిసెంబరు 26 నుంచి మొదలుకానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా అతడు బరిలోకి దిగడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో.. మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘వెస్టిండీస్.. సౌతాఫ్రికా పరిస్థితులు పూర్తి భిన్నమైనవి. సఫారీ పిచ్‌లపై భారత బ్యాటర్లకు కఠినమైన సవాళ్లు ఎదురవుతాయి. నిజానికి వెస్టిండీస్ పిచ్‌లు కాస్త ఉప ఖండపు పిచ్‌లను పోలి ఉంటాయి. ప్రొటిస్ పేసర్లను ఎదుర్కోవడం కష్టం కానీ సఫారీ గడ్డపై పేస్ దళం అటాకింగ్‌ను తట్టుకోవడం కష్టం. ముఖ్యంగా మార్కో జాన్సెన్, కగిసో రబడ, లుంగి ఎంగిడి, నండ్రే బర్గర్ వేసే బంతులను ఎదుర్కోవడం అత్యంత కష్టం. యశస్వి ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్ షాట్లు అద్భుతంగా ఆడతాడనడంలో సందేహం లేదు. అయితే, సౌతాఫ్రికాలో అతడికి అంత ఈజీ కాదు. మంచి ఎక్స్పీరియన్స్ మాత్రం వస్తుంది. అతడు ఇంకా యువకుడు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రికెటర్. అతడిపై భారీగా అంచనాలు పెట్టుకోవద్దు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లోనూ సెంచరీ, డబుల్ సెంచరీ బాదాలని కోరుకోకూడదు’’ అని గంభీర్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. చదవండి: Ind W vs Aus W: ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్.. సరికొత్త చరిత్ర -
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు సౌతాఫ్రికాకు షాక్!
South Africa vs India- Test Series: టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. సఫారీ స్టార్ పేసర్ కగిసో రబడ మడిమ నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో భారత్‌తో సిరీస్‌కు ముందు దేశవాళీ క్రికెట్ ఆడాలన్న తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. కెప్టెన్ తెంబా బవుమా కూడా ముందుగా అనుకున్నట్లు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లో ఆడటం లేదు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా దేశవాళీ జట్టు లయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఒక్కసారైనా గెలవాలని పరిమిత ఓవర్ల క్రికెట్‌ను మినహాయిస్తే భారత జట్టు సఫారీ గడ్డపై ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. ఈసారి.. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. వరల్డ్‌కప్-2023 ఫైనల్ ఓటమి బాధలో ఉన్న అభిమానులకు చారిత్రాత్మక గెలుపుతో ఊరటనివ్వాలని భావిస్తోంది. మరోవైపు.. ప్రొటిస్ జట్టు సైతం సొంతగడ్డపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ భారత్‌పై పైచేయి సాధించాలనే తలంపుతో ఉంది. దీంతో ఈసారి టీమిండియా- సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బవుమా అలా.. గాయంతో రబడ ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచకప్ తర్వాత విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ తెంబా బవుమా టీ20, వన్డే సిరీస్‌లకు దూరం అయ్యాడు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌తో పునరాగమనం చేయాలని భావిస్తున్న బవుమా.. అంతకంటే ముందు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడి పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని భావించాడు. కెప్టెన్‌తో పాటు పేసర్ రబడ కూడా డొమెస్టిక్ టీమ్ లయన్స్ తరఫున ఆడాలని నిశ్చయించుకున్నాడు. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా బవుమా తన నిర్ణయాన్ని మార్చుకోగా.. రబడ గాయం తాలుకు నొప్పి కారణంగా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో డాల్ఫిన్స్ జట్టుతో తాము ఆడాల్సిన మ్యాచ్‌కు వీరిద్దరు అందుబాటులో ఉండటం లేదని లయన్స్ టీమ్ గురువారం ప్రకటించింది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా.. రబడ గాయపడ్డాడు. నాటి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో కేవలం ఆరు ఓవర్లు బౌలింగ్ చేసి 41 పరుగులు ఇచ్చాడు రబడ. అయితే, అతడు ఇంతవరకు పూర్తిగా కోలుకోలేదు. మరోవైపు.. అన్రిచ్ నోర్జే కూడా గాయం వల్ల చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. చదవండి: రితిక జోలికి వస్తే ఊరుకోను.. నాడు రోహిత్‌కు యువీ వార్నింగ్! ఆమెతో నాకేం పని అంటూ.. -
పాక్‌కు పరీక్ష! నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా.. అలీ స్థానంలో అతడే!
ICC ODI WC 2023- Pak Vs SA: వన్డే వరల్డ్‌కప్-2023 సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో సౌతాఫ్రికాను తొలుత బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ.. ‘‘మేము ముందు బ్యాటింగ్ చేస్తాం. ఇక నుంచి ప్రతీ మ్యాచ్ మాకు అత్యంత ముఖ్యమైనదే. ప్రతీ విభాగంలోనూ మేము మెరుగుపడాల్సి ఉంది. ముఖ్యంగా ఫీల్డింగ్ లోపాలు సరిచేసుకోవాలి. నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల సంతోషంగానే ఉన్నా ఈ విషయాలన్నిటి గురించి అంతా కూర్చుని చర్చించుకున్నాం. నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల సంతోషంగానే ఉన్నాను’’ అని పేర్కొన్నాడు. ఇక ప్రొటిస్ జట్టుతో మ్యాచ్‌కు హసన్ అలీ అనారోగ్యం కారణంగా దూరం కాగా.. వసీం జూనియర్ తుదిజట్టులోకి వచ్చినట్లు బాబర్ తెలిపాడు. మూడు మార్పులతో సౌతాఫ్రికా ఇక ఇప్పటి వరకు నెదర్లాండ్స్ చేతిలో తప్ప ఓటమన్నది ఎరుగని సౌతాఫ్రికా.. మరో భారీ విజయంపై కన్నేయగా.. హ్యాట్రిక్ ఓటములకు చెక పెట్టాలని పాక్ భావిస్తోంది. ఈ శతాబ్దం ఆరంభం నుంచి ప్రొటిస్ జట్టుపై తమకున్న ఆధిపత్యాన్ని మరోసారి చాటుకోవాలని పట్టుదలగా ఉంది. కాగా పాక్‌తో మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే విధంగా.. తబ్రేజ్ షంసీ, లుంగి ఎంగిడి కూడా టీమ్‌తో చేరారు. రీజా హెండ్రిక్స్, కగిసో రబడ, లిజాద్ విలియమ్స్ దూరం కావడంతో ఈ ముగ్గురు రీఎంట్రీ ఇచ్చారు. పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా తుదిజట్లు పాకిస్తాన్ అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, హారిస్ రవూఫ్. సౌతాఫ్రికా క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), తెంబా బవుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహారాజ్, తబ్రేజ్ షంసీ, లుంగి ఎంగిడి . చదవండి: WC 2023: ఎవరు ఏం చెప్పినా వినాలి.. కెప్టెన్‌గా నేనున్నాంటే: రోహిత్ శర్మ -
WC 2023: చెలరేగిన సౌతాఫ్రికా బౌలర్లు.. ఆసీస్‌కు ఘోర పరాభవం! వరుసగా రెండో‘సారీ’
ICC Cricket World Cup 2023- Australia vs South Africa, 10th Match: వన్డే వరల్డ్‌కప్-2023లో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభం నుంచే షాకుల మీద షాకులిచ్చింది సౌతాఫ్రికా. ప్రొటిస్ బౌలర్ల దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. ముఖ్యంగా పేసర్ కగిసో రబడ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 71 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన కంగారూ జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. ఆరో ఓవర్ ఐదో బంతికి మిచెల్ మార్ష్(7)ను మార్కో జాన్సెన్ అవుట్ చేయడంతో మొదలైంది ఆసీస్ వికెట్ల పతనం. ఆ తర్వాత ఎంగిడి బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్(13), రబడ బౌలింగ్‌లో స్మిత్(19) ఎల్బీడబ్ల్యూ, జోష్ ఇంగ్లిస్‌ను బౌల్డ్ కాగా.. మహరాజ్ బౌలింగ్‌లో మాక్స్వెల్(3) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మళ్లీ రంగంలోకి దిగిన రబడ స్టొయినిస్(5)ను అవుట్ చేయడంతో ఆసీస్ కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి దశలో మార్నస్ లబుషేన్‌కు తోడుగా టెయిలెండర్ మిచెల్ స్టార్క్(51 బంతుల్లో 27 పరుగులు) పట్టుదలగా క్రీజులో నిలబడిన వేళ మార్కో జాన్సెన్ దెబ్బకొట్టాడు. ఆ వెంటనే 46 పరుగులతో నిలకడగా ఆడుతున్న లబుషేన్‌ను కేశవ్ మహరాజ్ పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. నాలుగు బౌండరీల సాయంతో 22 పరుగులతో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అయితే, 41వ ఓవర్ మూడో బంతికి తబ్రేజ్ షంసీ బౌలింగ్‌లో కమిన్స్ ఇచ్చిన క్యాచ్‌ను మిల్లర్ ఎలాంటి పొరపాటు చేయకుండా ఒడిసిపట్టాడు. దీంతో షంసీ ఖాతాలో వరల్డ్‌కప్ క్రికెట్లో తొలి వికెట్ చేరింది. అదే ఓవర్లో హాజిల్‌వుడ్‌ను కూడా షంసీ అవుట్ చేయడంతో ఆసీస్ కథ ముగిసిపోయింది. 177 పరుగులకే ఆలౌట్ కావడంతో సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 134 పరుగులు భారీ తేడాతో ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది. ప్రొటిస్ పేసర్లలో రబడకు మూడు, జాన్సెన్కు రెండు, లుంగి ఎంగిడికి ఒక వికెట్ దక్కగా.. స్పిన్నర్లు కేశవ్ మహారాజ్, తబ్రేజ్ షంసీ చెరో రెండు వికెట్లు తీశారు. డికాక్ సెంచరీతో.. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా గురువార నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. కంగారూ జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఓపెనర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ క్వింటన్ డికాక్ వన్డే వరల్డ్‌కప్-2023లో వరుసగా రెండో శతకం(109) నమోదు చేయగా.. నాలుగో నంబర్ బ్యాటర్ ఎయిడెన్ మార్కరమ్ 56 పరుగులతో రాణించాడు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో భారీ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. కాగా ఈ మెగా టోర్నీ తాజా ఎడిషన్‌లో ఆసీస్‌కు ఇది వరుసగా రెండో పరాజయం.తొలుత చెన్నైలో టీమిండియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఆసీస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. -
కొడుకు వరల్డ్‌కప్‌లో ఆడుతున్నాడు.. టీమిండియాకు తండ్రి సపోర్టు! రోహిత్ జెర్సీతో
ICC ODI WC 2023: సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది టీమిండియా. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఆస్ట్రేలియాతో తమ ఆరంభ మ్యాచ్ ఆడుతోంది. ఈ క్రమంలో అభిమానులు, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ఆల్ ది బెస్ట్ చెబుతూ భారత జట్టును విష్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. తన కుమారుడు ప్రపంచకప్-2023లో ఈవెంట్లో ఆడుతున్న తరుణంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మద్దతుగా నిలుస్తూ.. హిట్‌మ్యాన్‌పై అభిమానం చాటుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే.. సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడ తండ్రి ఎంఫో రబడ. ‘‘ఈరోజు టీమిండియాకు నా మద్దతు’’ అంటూ రోహిత్ శర్మ పేరిట జెర్సీని ధరించి భారత జట్టును విష్ చేశాడు. రబడ తండ్రి చేసిన ప్రయత్నం రోహిత్ ఫ్యాన్స్‌తో పాటు టీమిండియా అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా తన తనయుడు కగిసో రబడకు చీర్ చేసేందుకు ఎంఫో రబడ భారత్‌కు వచ్చాడు. ఢిల్లీలో సౌతాఫ్రికా- శ్రీలంక మధ్య శనివారం నాటి మ్యాచ్‌కు హాజరై.. తన కుమారుడికి మద్దతు తెలిపాడు. కాగా లంకపై ప్రొటిస్ జట్టు ఏకంగా 102 పరుగుల తేడాతో గెలుపొంది ఘనంగా ఐసీసీ ఈవెంట్‌ను ఆరంభించింది. ఈ మ్యాచ్‌లో రబడ 7.5 ఓవర్ల బౌలింగ్‌లో 50 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక నవంబరు 5న టీమిండియా- సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగనుంది. మరి అప్పుడు ఎంఫో రబడ ఏం చేస్తాడో చూడాలి అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: #Ducks: ఆనందం కాసేపు కూడా లేదు! నువ్వేం కెప్టెన్? గోల్డెన్ డక్ బాయ్ నువ్వేమో.. -
అప్పుడలా! ఈసారి మాత్రం వరల్డ్‌కప్ ట్రోఫీ మాదే: సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్
అప్పటి దాకా అదరగొట్టడం... అభిమానుల్లో అంచనాలు పెంచేయడం... మేజర్ ఈవెంట్లలో కీలక సమయంలో చేతులెత్తేయడం.. కనీసం ఫైనల్ కూడా చేరలేక చతికిలపడటం.. మీరు ఊహించిన పేరు నిజమే! ఈ ప్రస్తావన సౌతాఫ్రికా గురించే! 1992 నుంచి వరల్డ్‌కప్ టోర్నీలో పోటీపడుతున్న దక్షిణాఫ్రికా ఇంత వరకు ఒక్క వన్డే ట్రోఫీ కూడా గెలవలేదు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లలో విజయం అంచులదాకా వెళ్లి బోల్తా పడటం.. ‘చోకర్స్’ అనే ‘నామధేయం’ తమకు సరిగ్గా సరిపోతుందని మళ్లీ మళ్లీ నిరూపించుకోవడం ప్రొటిస్‌కు బాగా అలవాటు. ఈసారి ట్రోఫీ గెలుస్తాం అయితే, ఈసారి ఆ అపఖ్యాతిని కచ్చితంగా చెరిపేసుకుంటాం అంటున్నాడు సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ కగిసో రబడ. ప్రపంచకప్ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా భారత్‌లో బరిలోకి దిగుతామని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు జరగనిది.. ఇప్పుడు చేసి చూపిస్తామంటూ ధీమా వ్యక్తం చేశాడు. ప్రొటిస్ పేస్ దళానికి నాయకత్వం వహిస్తున్న 28 ఏళ్ల రబడ ఈ మేరకు మాట్లాడుతూ.. ‘‘సౌతాఫ్రికా క్రికెట్ గురించి బయట నడుస్తున్న డ్రామా, చర్చల గురించి మేము అస్సలు పట్టించుకోము. నిజమే ప్రపంచకప్ టోర్నీల్లో ఆడుతూ.. ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోతే ఎలా ఉంటుందో తెలుసు. ప్రతి క్రికెటర్ కల అదే! తీవ్రమైన నిరాశ కలుగుతుంది కదా! ఈ విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈసారి దానిని సాధ్యం చేసి చూపించాలని నేను... మేమంతా బలంగా కోరుకుంటున్నాం. వరల్డ్‌కప్ ట్రోఫీ గెలవడం ఎవరికైనా ఇష్టమే కదా! ప్రతి ఒక్క క్రికెటర్ కల అదే! ఒక్కసారి జట్టును ప్రకటిస్తే.. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు’’ అంటూ ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడు. కాగా ఇప్పటి వరకు నాలుగుసార్లు వరల్డ్‌కప్ సెమీస్ వరకు చేరుకున్న సౌతాఫ్రికా ఒక్కసారి కూడా ముందడుగు వేయలేకపోయింది. అప్పుడలా.. ఆఖరిగా.. 2019 వరల్డ్‌కప్‌లో మాంచెస్టర్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 10 పరుగుల తేడాతో గెలిచి.. విజయంతో టోర్నీని ముగించింది. అయితే, ఈసారైనా కప్ గెలుస్తారంటూ.. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు మాత్రం ఫాఫ్ డుప్లెసిస్ బృందం నిరాశనే మిగిల్చింది. ఇదిలా ఉంటే.. భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే! చదవండి: టీమిండియా క్యాప్ అందుకోవడం ఈజీ అయిపోయింది.. అదే జరిగితే బుమ్రా అవుట్! -
ఐపీఎల్ 2023లో ఫ్లాప్ అయిన టాప్-5 విదేశీ ఆటగాళ్లు
రెండు నెలలుగా అభిమానులను అలరించిన ఐపీఎల్ 16వ సీజన్ ఈ వారంతో ముగియనుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, లక్నోసూపర్జెయింట్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం(మే 23న) క్వాలిఫయర్-1లో సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ అమితుమీ తేల్చుకోనున్నాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెడితే.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఇక ఎలిమినేటర్ పోరులో లక్నో, ముంబై తలపడనున్నాయి. ఈ విషయం పక్కనబెడితే ఐపీఎల్ 16వ సీజన్ విదేశీ ఆటగాళ్లకంటే దేశవాలీ ఆటగాళ్లనే ఎక్కువగా వెలుగులోకి తీసుకొచ్చింది. తక్కువ ధరకే అమ్ముడయిన చాలా మంది ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రింకూ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, అథర్వ టైడే, తుషార్ దేశ్‌పాండే, యశస్వి జైశ్వాల్, మతీషా పతీరానా సహా చాలా మంది ఉన్నారు. వీరిని మినహాయిస్తే ఐపీఎల్ 2023 సీజన్‌కు కోట్లు పెట్టి కొనుక్కున్న విదేశీ ఆటగాళ్లలో చాలా మంది దారుణంగా విఫలమయ్యారు. కొందరు గాయాలతో సీజన్‌కు దూరంగా ఉంటే.. అవకాశాలు ఇచ్చినా ఆడడంలో ఫెయిలయ్యారు. మరి ఐపీఎల్ 16వ సీజన్లో అత్యంత ఎక్కువ ధర పలికి ఫ్లాప్ షో కనబరిచిన టాప్-5 విదేశీ ఆటగాళ్లను ఒకసారి పరిశీలిద్దాం. బెన్ స్టోక్స్(సీఎస్కే): Photo: IPL Twitter ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సీఎస్కే తరపున రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్‌లో ఒక ఓవర్ వేసి 18 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. అసలు సీజన్ ఆరంభానికి ముందు బెన్ స్టోక్స్ సీఎస్కేకు కీలకంగా మారతాడని అంతా అనుకున్నారు. కానీ గాయం కారణంగా అతను రెండు మ్యాచ్‌లకు మాత్రమే పరిమితమయ్యాడు. తర్వాత కోలుకున్నప్పటికి స్టోక్స్‌ను జట్టులోకి తీసుకోవడానికి మొగ్గు చూపలేదు. అలా రెండు మ్యాచ్‌లకు మాత్రమే పరిమితమైన స్టోక్స్ ఐర్లాండ్‌తో టెస్టుమ్యాచ్ కోసం స్వదేశానికి వెళ్లిపోయాడు. ఐపీఎల్ మినీ వేలంలో సీఎస్కే బెన్ స్టోక్స్‌ను రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. జోఫ్రా ఆర్చర్(ముంబై ఇండియన్స్): Photo: IPL Twitter జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో జోఫ్రా ఆర్చర్ ముంబై ఇండియన్స్ బౌలింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తాడని అనుకున్నారు. కీలకంగా మారడం అటుంచి తన ప్రదర్శనతో జట్టుకు భారమయ్యాడు. సీజన్లో కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఆర్చర్ 9.50 ఎకానమీతో పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆ తర్వాత గాయంతో ఐపీఎల్ నుంచే వైదొలిగాడు. ఈ సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచిన వారిలో ఆర్చర్ ఒకడిగా మిగిలిపోయాడు. హ్యారీ బ్రూక్(ఎస్ఆర్హెచ్): Photo: IPL Twitter ఐపీఎల్ ఆరంభానికి ముందు హ్యారీ బ్రూక్‌పై మంచి అంచనాలున్నాయి. ఎస్ఆర్హెచ్ ఏరికోరి బ్రూక్‌ను రూ. 13.35 కోట్లకు సొంతం చేసుకుంది. కానీ తన ధరకు బ్రూక్ ఏ విధంగానూ న్యాయం చేయలేకపోయాడు. ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ సాయంతో కేవలం 190 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. తొలి అంచె పోటీల్లో అన్ని మ్యాచ్‌లు ఆడిన బ్రూక్ తర్వాత అంచె పోటీల్లో కేవలం మూడు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. టెస్టుల్లోనే విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగిన బ్రూక్ ఐపీఎల్లో మాత్రం ఫ్లాప్ షో చేశాడు. కగిసో రబాడ(పంజాబ్ కింగ్స్): Photo: IPL Twitter కగిసో రబాడ అంతర్జాతీయ క్రికెట్లో సౌతాఫ్రికా తరపున టాప్ బౌలర్. అతని వైవిధ్యమైన పేస్‌తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టాడు. అలాంటి రబాడ ఐపీఎల్లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌లాడిన రబాడ ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. సామ్ కరన్(పంజాబ్ కింగ్స్): Photo: IPL Twitter ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా సామ్ కరన్ చరిత్ర సృష్టించాడు. రూ. 18.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది. సీజన్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్న సామ్ కరన్.. ధావన్ గైర్హాజరీలో పలు మ్యాచ్‌ల్లో పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 276 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు తీశాడు. ప్రదర్శన పరంగా సామ్ కరన్ అందరిలో కాస్త బెటర్‌గా కనిపిస్తున్నప్పటికి.. అతనికి వెచ్చించిన ధర ప్రకారం ఈ ప్రదర్శన ఫ్లాప్ అని చెప్పొచ్చు. చదవండి: 'నాలుగేళ్ల వయసులో వాడేంటో తెలిసింది... ఇది ఊహించిందే!' -
రగ్బీ ప్లేయర్ నుంచి క్రికెటర్ దాకా.. ఆసక్తికర ప్రయాణం
కగిసో రబాడా.. దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్‌గా అందరికి సుపరిచితమే. తన ఫాస్ట్ బౌలింగ్‌తో జట్టును ఎన్నోసార్లు గెలిపించి కీలక బౌలర్‌గా ఎదిగాడు. మంచి వేగంతో బంతులు సంధించే రబాడ దెబ్బకు ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించడంలో దిట్ట. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున తొలి మ్యాచ్ ఆడాడు. గురువారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రబాడా ఐపీఎల్లో వందో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. సాహా వికెట్ తీయడం ద్వారా రబాడ ఈ మార్క్‌ను అందుకున్నాడు. అయితే రబాడా క్రికెటర్ కాకపోయుంటే రగ్బీ ప్లేయర్ అయ్యేవాడంట. అతని గురించి మనకు తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రగ్బీతో కెరీర్ మొదలుపెట్టి ఆపై క్రికెటర్‌గా.. కగిసో రబాడా మొదట రగ్బీలో కెరీర్‌ను కొనసాగించాలనుకున్నాడు. కానీ అతను తన మొదటి ప్రేమను అంటే రగ్బీని వదులుకోవాల్సి వచ్చింది. రగ్బీ ప్లేయర్ నుంచి కగిసో రబాడా క్రికెటర్‌గా మారిన కథ చాలా ఆసక్తికరంగా ఉంది. రబాడాకు చిన్నప్పటి నుంచి రగ్బీ అంటే ఆసక్తి. అతను పాఠశాల జట్టుతో రగ్బీ ఆడేవాడు. కానీ ఒక్కసారి ఆఫ్ సీజన్ కారణంగా సరదాగా క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. తర్వాత ఎ లెవల్ క్రికెట్ టీమ్‌లోనూ, రగ్బీ టీమ్‌లోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. అందుకే ఈ ఆటగాడు రగ్బీని వదిలి క్రికెటర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు మే 25, 1995న జోహన్నెస్‌బర్గ్‌లో జన్మించిన రబాడా 2013లో దేశవాళీ క్రికెట్లో ఆడడం ప్రారంభించాడు. మరుసటి సంవత్సరం అంటే 2014లో అండర్-19 ప్రపంచకప్ జట్టులోకి ఎంపికయ్యాడు. తన ప్రతిభను ప్రదర్శించేందుకు రబడకు ఇది పెద్ద వేదికగా మారింది. అండర్-19 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో తన స్పీడ్ మ్యాజిక్‌ను చూపించాడు. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై రబాడా 25 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఆ సంవత్సరం ప్రొటీస్ జట్టును ప్రపంచ ఛాంపియన్‌గా చేయడంలో కీ రోల్ ప్లే చేశాడు. Photo: IPL Twitter తండ్రి డాక్టర్, తల్లి లాయర్ దీంతో.. కగిసో రబాడాకి ఆర్థికంగా ఇబ్బందులు లేవు. తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం లభించింది. అండర్-19 టి20 ప్రపంచకప్ తర్వాత అతను విజయాల మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు. ఈ టాల్ ఫాస్ట్ బౌలర్ 2014లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 19 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియాతో తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన రబాడా అరంగేట్రం టీ20లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. Photo: IPL Twitter టి20 అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఒక సంవత్సరం తర్వాత 2015లో రబాడా తన వన్డే అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో.. రబాడా 3 మెయిడిన్లు బౌలింగ్ వేసి 8 ఓవర్లలో హ్యాట్రిక్ సహా 6 వికెట్లు పడగొట్టాడు. ఇక కగిసో రబడ ఐపీఎల్ లో 2022 సంవత్సరంలో 13 మ్యాచ్‌లలో 23 వికెట్లు తీయగా, 2021 సంవత్సరంలో 15 వికెట్లు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో రబడ అత్యుత్తమ ప్రదర్శన 2020లో వచ్చింది. ఈ సీజన్ లో 17 మ్యాచ్‌ల్లో 30 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా 64 మ్యాచ్‌ల్లో వంద వికెట్లు తీశాడు. -
వచ్చీ రావడంతోనే రికార్డు.. అత్యంత వేగంగా వంద వికెట్లు
ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున గురువారం కగిసో రబడా తొలి మ్యాచ్ ఆఢాడు. ఈ క్రమంలో వచ్చీ రావడంతోనే అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సాహా వికెట్ తీయడం ద్వారా రబాడ ఐపీఎల్లో వందో వికెట్ సాధించాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా తక్కువ బంతుల్లో వంద వికెట్లు తీసిన బౌలర్‌గా రబాడ తొలి స్థానంలో నిలిచాడు. ఐపీఎల్లో వంద వికెట్లు సాధించేందుకు రబాడ 1438 బంతులు తీసుకున్నాడు. రబాడ తర్వాత మలింగ 1622 బంతుల్తో రెండో స్థానంలో ఉండగా.. డ్వేన్ బ్రావో 1619 బంతులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక నాలుగో స్థానంలో హర్షల్‌పటేల్ 1647 బంతులతో ఉన్నాడు. ఇక మ్యాచ్‌ల పరంగానూ అతి తక్కువ మ్యాచ్‌ల్లో వంద వికెట్లు సాధించిన బౌలర్‌గా రబాడ తొలి స్థానంలో ఉన్నాడు. రబాడ 64 మ్యాచ్‌ల్లో వంద వికెట్లు సాధించాడు. రబాడ తర్వాత మలింగ(70 మ్యాచ్‌లు), భువనేశ్వర్, హర్షల్ పటేల్‌లు 81 మ్యాచ్‌లు, రషీద్ ఖాన్, అమిత్ మిశ్రా, ఆశిష్ నెహ్రాలు 83 మ్యాచ్‌లు, యజ్వేంద్ర చహల్ 84 మ్యాచల్లో వంద వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు. 𝐴𝑎𝑡𝑒 ℎ𝑖 𝑑𝑖𝑙 𝑘ℎ𝑢𝑠ℎ 𝑘𝑎𝑟 𝑑𝑖𝑡𝑡𝑎, Rabada veere! 🙌 Kagiso Rabada is 🔙 with pace 🔥 as he brings up a 💯 wickets in #TATAIPL✨#PBKSvGT #IPLonJioCinema #IPL2023 | @KagisoRabada25 @PunjabKingsIPL pic.twitter.com/vnXHyt3quI — JioCinema (@JioCinema) April 13, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
PBKS Vs GT: పవర్ హిట్టర్ వచ్చేశాడు! అందరి కళ్లు అతడిపైనే!
IPL 2023- Punjab Kings vs Gujarat Titans: ఐపీఎల్-2023లో భాగంగా డిపెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో పోరుకు పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది. సొంత మైదానంలో టైటాన్స్‌తో ఢొకొట్టేందుకు ధావన్ సేన పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. పవర్ హిట్టర్, ఇంగ్లంగ్ స్టార్ లియామ్ లివింగ్‌స్టోన్ రాకతో పంజాబ్‌లో జోష్ వచ్చింది. తమ స్టార్ ప్లేయర్ వచ్చేశాడని.. అందరి కళ్లు అతడిపైనే ఉన్నాయంటూ కింగ్స్ జట్టు లివింగ్‌స్టోన్ ఫొటోలు షేర్ చేస్తూ ఆనందాన్ని పంచుకుంది. కాగా గాయం కారణంగా సుదీర్ఘ కాలం పాటు ఆటకు దూరమైన లివింగ్‌స్టోన్ ఈ మ్యాచ్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనే అందుబాటులోకి వచ్చినప్పటికీ బెంచ్‌కే పరిమితమైన సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడ కూడా గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆడే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పంజాబ్ తుది జట్టు ఎలా ఉండబోతుందన్న అంశాన్ని పరిశీలిద్దాం. గుజరాత్‌తో పంజాబ్ ఢీ ఓపెనర్లుగా ప్రబ్‌సిమ్రన్ సింగ్, కెప్టెన్ శిఖర్ ధావన్ జోడీ కొనసాగనుండగా.. లివింగ్‌స్టోన్‌ను వన్‌డౌన్‌లో ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇక భనుక రాజపక్స స్థానంలో గత మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన మాథ్యూ షార్ట్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అదే విధంగా ఆశించిన మేర రాణించలేకపోతున్న సికందర్ రజాకు ఇదే ఆఖరి ఛాన్స్ అయ్యే అవకాశం ఉంది. మిడిలార్డర్లో షారుక్ ఖాన్, వికెట్ కీపర్ జితేశ్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్ ఆడనున్నారు. వీరితో పాటు సామ్ కర్రన్ ఉండనే ఉంటాడు. గతంలో చెరోసారి ఇక.. బౌలింగ్ విభాగంలో పేసర్లు కగిసో రబడ, నాథన్ ఎల్లిస్లలో ఒకరు.. అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు స్పిన్నర్ రాహుల్ చహర్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. కాగా గత మ్యాచ్‌లో శిఖర్ ధావన్ మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం కావడంతో సన్‌రైజర్స్ చేతిలో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. మరోవైపు.. గుజరాత్‌కు సైతం గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రూపంలో ఈ సీజన్లో తొలి ఓటమి ఎదురైంది. దీంతో విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. కాగా గురువారం మ్యాచ్ జరుగనున్న మొహాలీ స్టేడియంలో గతంలో ఇరు జట్లు తలపడిన రెండు సందర్భాల్లో చెరో విజయం నమోదు చేశాయి. గుజరాత్‌తో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ తుది జట్ల(అంచనా): పంజాబ్ కింగ్స్ ప్రబ్‌సిమ్రన్ సింగ్, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, సికిందర్ రజా, జతేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, సామ్ కర్రన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, నాథన్ ఎల్లిస్/కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్. గుజరాత్ టైటాన్స్ వృద్ధిమాన్ సాహా, శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, జాషువా లిటిల్. చదవండి: IPL 2023: నీ తప్పిదం వల్ల భారీ మూల్యం! అమ్మో ఈ ‘మహానుభావుడు’ ఉంటేనా.. సచిన్ నన్ను బ్యాట్‌తో కొట్టాడు.. పిచ్చివాడిని చేస్తావా అంటూ ఫైర్ అయ్యాడు: సెహ్వాగ్ All the focus is on 𝐨𝐧𝐞 𝐦𝐚𝐧! 📸@liaml4893 is ready to Roar 🦁#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL pic.twitter.com/wo7boR6Qvk — Punjab Kings (@PunjabKingsIPL) April 12, 2023 -
పంజాబ్‌కు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేశాడు! హైదరాబాద్‌కు చేరుకున్నధావన్ సేన
IPL 2023- Punjab Kings- Liam Livingstone- Kagiso Rabada: వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్‌కు శుభవార్త. సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడ భారత్‌కు వచ్చేశాడు. జట్టుతో కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అదే విధంగా ధావన్ సేనకు సంబంధించిన మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. భారీ మొత్తం వెచ్చించి కింగ్స్ కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ రాకకోసం మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా కోలుకోలేదు మోకాలి గాయం కారణంగా రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న లివింగ్‌స్టోన్ ఇంకా పూర్తి కోలుకోలేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఓల్డ్ ట్రఫోర్డ్‌లో చికిత్స పొందుతున్న లివింగ్‌స్టోన్ ఏప్రిల్ 15 తర్వాతే భారత్‌కు వెళ్లే అవకాశం ఉందని క్రిక్‌బజ్‌తో పేర్కొన్నారు. కాగా గాయం కారణంగా గతేడాది డిసెంబరు నుంచి లియామ్ లివింగ్‌స్టోన్ ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న అతడు.. ఏప్రిల్ మొదటి వారంలోనే పంజాబ్ కింగ్స్‌తో చేరతాడనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం అతడి రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. సౌతాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబడ మాత్రం తదుపరి మ్యాచ్‌లో అందుబాటులోకి రానున్నాడు. కాగా ఏప్రిల్ 9న పంజాబ్ కింగ్స్ హైదరాబాద్ వేదికగా.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో తలపడనుంది. హైదరాబాద్‌కు చేరుకున్న ధావన్ సేన ఈ నేపథ్యంలో ధావన్ సేన.. హైదరాబాద్‌కు చేరుకుంది. సంప్రదాయ పద్ధతిలో గబ్బర్ బృందానికి స్వాగతం లభించింది. కాగా పంజాబ్ కింగ్స్ ఐపీఎల్-2023 సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 7 పరుగుల తేడాతో గెలుపొందిన పంజాబ్.. రెండో మ్యాచ్‌లో రాజస్తాన్‌పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వల్ప తేడాలతో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కాగా 11.50 కోట్ల రూపాయల భారీ మొత్తం చెల్లించి పంజాబ్ లివింగ్‌స్టోన్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక రబడ కోసం 9.25 కోట్లు ఖర్చు చేసింది. చదవండి: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ప్రతీసారి ఇంతే కోహ్లి వచ్చాడు.. కోపంగా బ్యాట్ విసిరేశాడు.. పక్కనే కూర్చున్న నాతో.. Sadda Captain has spoken. 🫡 📍Hello, Hyderabad. 👋🏻#JazbaHaiPunjabi #SaddaPunjab #TATAIPL | @SDhawan25 pic.twitter.com/4GpSvq1Q9J — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2023 All eyes on KG! 👀#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL I @KagisoRabada25 pic.twitter.com/wwhpjjLRTv — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2023 Sadde 🦁s enjoyed a warm Hyderabadi welcome! 😊 🙏#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL pic.twitter.com/wuvpq4Fyb7 — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2023 -
SA Vs WI: జేసన్ హోల్డర్ ఒంటరి పోరాటం.. అయినా పాపం!
South Africa vs West Indies, 2nd Test- జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 251 పరుగులకు ఆలౌటైంది. జేసన్ హోల్డర్ (117 బంతుల్లో 81 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఇతర బ్యాటర్లలో కైల్ మేయర్స్ (29), రోస్టన్ ఛేజ్ (28), జొషువా డ సిల్వ (26) కొన్ని పరుగులు జోడించగలిగారు. సఫారీ బౌలర్లలో కోయెట్జీ 3 వికెట్లు పడగొట్టగా...రబడ, హార్మర్ చెరో 2 వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్‌లో 69 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్ కోల్పోకుండా 4 పరుగులు చేసింది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 311/7తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 320 పరుగులకు ఆలౌటైంది. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్ సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది. ఫిబ్రవరి 28న ఆరంభమైన టెస్టు సిరీస్‌లో భాగంగా ఆతిథ్య ప్రొటిస్ తొలి మ్యాచ్‌లో 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక మార్చి 8న మొదలైన రెండో టెస్టులోనూ విండీస్‌పై బవుమా బృందానిదే పైచేయిగా ఉంది. ఇదిలా ఉంటే.. మార్చి 16-21 వరకు వన్డే, మార్చి 25-28 వరకు సౌతాఫ్రికా- వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ జరుగనుంది. చదవండి: Wanindu Hasaranga: పెళ్లి చేసుకున్న శ్రీలంక ఆల్‌రౌండర్.. ఫొటోలు వైరల్! Steve Smith: అంతా బాగానే ఉంది కానీ.. ఇదేంటి స్మిత్! మరీ ఇలా.. కెరీర్లో ఇదే తొలిసారి! -
విండీస్‌ను శాసించిన రబాడ.. తొలి టెస్టులో ఘన విజయం
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా శుభారంభం చేసింది. సెంచూరియన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో ప్రొటీస్ 87 పరుగుల తేడాతో విజయం అందుకుంది. 246 పరుగుల టార్గెట్‌తో నాలుగో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ 41 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. జెర్మెన్ బ్లాక్‌వుడ్ 79 పరుగులతో ఒంటరిపోరాటం చేయగా మిగతావారు విఫలమయ్యారు. కగిసో రబాడ ఆరు వికెట్లతో విండీస్ నడ్డి విరవగా.. మార్కో జాన్సెన్ రెండు, నోర్ట్జే , కోట్జే చెరొక వికెట్ తీశారు. అంతకముందు సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 116 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 342 పరుగులకు ఆలౌట్ కాగా.. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగుల వద్ద ముగించడంతో సౌతాఫ్రికాకు 130 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో 47 పరుగులతో ఆకట్టుకున్న ఓపెనర్ మార్క్రమ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మార్చి 8 నుంచి 12 వరకు జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరగనుంది. చదవండి: టీమిండియా నిలబెట్టుకుంటే.. 141 ఏళ్ల రికార్డు బద్దలు! 'లక్ష్యం చిన్నదే.. రేపు ఏమైనా జరగొచ్చు!' -
ఐసీసీ టెస్టు జట్టు: ఆసీస్, ఇంగ్లండ్ ప్లేయర్ల హవా.. భారత్ నుంచి ఒకే ఒక్కడు
ICC Men’s Test Team of the Year 2022: గతేడాది టెస్టుల్లో తమదైన ముద్ర వేసిన పురుష క్రికెటర్లతో కూడిన జట్టును అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం ప్రకటించింది. 2022 ఏడాదికి గానూ.. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 11 మంది ప్లేయర్ల పేర్లను వెల్లడించింది. ఈ జట్టుకు బెన్‌స్టోక్స్‌ను సారథిగా ఎంపిక చేసిన ఐసీసీ.. టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్‌కు వికెట్ కీపర్‌గా అవకాశమిచ్చింది. భారత్ నుంచి ఒకే ఒక్కడు కాగా టీమిండియా నుంచి పంత్ ఒక్కడికే ఐసీసీ అత్యుత్తమ టెస్టు జట్టులో స్థానం దక్కడం విశేషం. ఈ టీమ్‌లో ఓపెనర్లుగా ఉస్మాన్ ఖవాజా, క్రెయిగ్ బ్రాత్‌వెయిట్.. మూడో స్థానంలో మార్నస్ లబుషేన్, ఆ తర్వాతి స్థానాల్లో బాబర్ ఆజం, జానీ బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్, రిషభ్ పంత్, ప్యాట్ కమిన్స్‌కు చోటిచ్చింది ఐసీసీ. ఆసీస్, ఇంగ్లండ్ ఆటగాళ్ల హవా పేస్ విభాగంలో కగిసో రబడ, జేమ్స్ ఆండర్సన్ స్పిన్ విభాగంలో నాథన్ లియోన్ ఐసీసీ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇప్పటికే 2021-23 సీజన్లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన ఆసీస్ జట్టుకు చెందిన ఆటగాళ్లు అత్యధికంగా నలుగురు ఈ జట్టులో స్థానం సంపాదించారు. బజ్‌బాల్ విధానంతో టెస్టు క్రికెట్లోనూ దూకుడు ప్రదర్శిస్తున్న సారథి స్టోక్స్‌తో పాటు బెయిర్‌స్టో, ఆండర్సన్ ఇంగ్లండ్ నుంచి చోటు దక్కించుకున్నారు. వారెవ్వా పంత్ 2022లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ 12 ఇన్నింగ్స్‌లో 61.81 సగటుతో 680 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక గతేడాది పంత్ టెస్టుల్లో 21 సిక్సర్లు బాదాడు. ఆరు స్టంప్స్‌లో భాగమయ్యాడు. 23 క్యాచ్‌లు అందుకున్నాడు. కాగా గతేడాది డిసెంబరు 30న కారు ప్రమాదానికి గురైన పంత్ కోలుకుంటున్న విషయం విదితమే. ఐసీసీ మెన్స్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022 1.ఉస్మాన్ ఖవాజా- ఆస్ట్రేలియా 2.క్రెయిగ్ బ్రాత్‌వెట్- వెస్టిండీస్ 3.మార్నస్ లబుషేన్- ఆస్ట్రేలియా 4.బాబర్ ఆజం- పాకిస్తాన్ 5.జానీ బెయిర్‌స్టో- ఇంగ్లండ్ 6.బెన్ స్టోక్స్- ఇంగ్లండ్ (కెప్టెన్) 7.రిషభ్ పంత్- ఇండియా(వికెట్ కీపర్) 8.ప్యాట్ కమిన్స్- ఆస్ట్రేలియా 9.కగిసో రబడ- సౌతాఫ్రికా 10.నాథన్ లియోన్- ఆస్ట్రేలియా 11.జేమ్స్ ఆండర్సన్- ఇంగ్లండ్. చదవండి: IND VS NZ 3rd ODI: 17 నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు సెంచరీ బాదిన హిట్‌మ్యాన్ ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా బాబర్ ఆజం.. టీమిండియా నుంచి ఇద్దరే -
నిప్పులు చెరిగిన పేసర్లు.. తొలి రోజే 15 వికెట్లు
ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా జట్ల మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇరు జట్ల పేస్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ఫలితంగా ఆట తొలి రోజే ఏకంగా 15 వికెట్లు పడ్డాయి. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా పర్యాటక సౌతాఫ్రికాను 152 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం సఫారీ బౌలర్లు సైతం రెచ్చిపోయి 145 పరుగులకే సగం ఆసీస్ వికెట్లను పడగొట్టారు. ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ (77 బంతుల్లో 78 నాటౌట్; 13 ఫోర్లు, సిక్స్) ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్ తొలి బంతికే కగిసో రబాడ.. డేవిడ్ వార్నర్‌ను పెవిలియన్‌కు పంపగా, ఉస్మాన్ ఖ్వాజా (11), స్టీవ్ స్మిత్ (36)లను నోర్జే.. మార్నస్ లబూషేన్ (11)ను జన్సెన్ ఔట్ చేశారు. స్కాట్ బోలాండ్ (1)ను రబాడ ఔట్ చేయడంతో తొలి రోజు ఆట ముగిసింది. అంతకుముందు మిచెల్ స్టార్క్ (3/41), పాట్ కమిన్స్ (2/35), బోలాండ్ (2/28), నాథన్ లయోన్ (3/14) ధాటికి సౌతాఫ్రికా 152 పరుగులకే చాపచుట్టేసింది. సఫారీ ఇన్నింగ్స్‌లో వికెట్‌కీపర్ వెర్రిన్ (64) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. వెర్రిన్తో పాటు సరెల్ ఎర్వీ (10), టెంబా బవుమా (38), రబాడ (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కెప్టెన్ డీన్ ఎల్గర్ (3), వాన్ డెర్ డస్సెన్ (5), జోండో (0), జన్సెన్ (2), మహారాజ్ (2), నోర్జే (0), ఎంగిడి (3) దారుణంగా విఫలమయ్యారు. కాగా, ఈ ఆస్ట్రేలియా పర్యటనలో సౌతాఫ్రికా 3 టెస్ట్‌లు, 3 వన్డేలు ఆడనుంది. -
WC 2022: ‘వాళ్లిద్దరు అద్భుతం.. ఈసారి వరల్డ్‌కప్ ట్రోఫీ సౌతాఫ్రికాదే!’
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో తొలి మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదుర్కొన్న సౌతాఫ్రికా.. రెండో మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టింది. తద్వారా నెట్ రన్‌రేటు భారీగా పెంచుకుని గ్రూప్-2లో గట్టి పోటీదారుగా నిలిచింది. కాగా వర్షం కారణంగా హోబర్ట్‌లో జింబాబ్వేతో మ్యాచ్‌లో ఫలితం తేలకుండా పోవడంతో ప్రొటిస్‌కు ఒకే ఒక్క పాయింట్ వచ్చిన విషయం తెలిసిందే. గెలిచే మ్యాచ్‌లో వరుణుడి రూపంలో ఇలా దురదృష్టం వెక్కిరించడంతో ఉసూరుమంది. అయితే, ఆ బెంగ తీరేలా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 104 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్‌లో రిలీ రోసో అద్భుత సెంచరీ(109)తో మెరవగా.. 205 పరుగుల భారీ స్కోరు చేసింది సౌతాఫ్రికా. అద్భుతం చేసిన బౌలర్లు ఇక బౌలర్లు కగిసో రబడ ఒకటి, కేశవ్ మహరాజ్ ఒకటి, తబ్రేజ్ షంసీ 3 వికెట్లు తీశారు. ఇక అన్రిచ్ నోర్జే 3.3 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో భారీ తేడాతో గెలిచిన ప్రొటిస్ జట్టు రెండు మ్యాచ్‌లు ముగిసే సరికి మూడు పాయింట్లు, నెట్రన్ రేటు 5.200తో గ్రూప్-2లో ప్రస్తుతం టీమిండియా తర్వాతి స్థానం(2)లో నిలిచింది. ఈసారి విజేతగా సౌతాఫ్రికా ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ పేసర్, కామెంటేటర్ డేల్ స్టెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పేసర్లకు అనుకూలించే ఆస్ట్రేలియా పిచ్‌లపై తమ బౌలర్లు అద్భుతం చేయగలరని.. ప్రొటిస్ తొలిసారి ప్రపంచ విజేతగా నిలిచే అవకాశం ఉందని అంచనా వేశాడు. ఈ మేరకు ఐసీసీ వెబ్‌సైట్‌తో స్టెయిన్ మాట్లాడుతూ.. ‘‘సౌతాఫ్రికా బౌలింగ్ అటాక్‌కు కగిసో రబడ నాయకుడు. అతడికి తోడుగా అన్రిచ్ నోర్జే కూడా ఉన్నాడు. ఈ ఫాస్ట్‌బౌలర్ల జోడీ అద్భుతంగా రాణించగలదు. వీళ్లిద్దరూ కలిసి ఈసారి సౌతాఫ్రికాకు వరల్డ్‌కప్ అందించగలరని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. నా టాప్-5 బౌలర్లు వీరే ‘‘వాళ్ల పేస్‌లో వైవిధ్యం ఉంది. మెరుగైన నైపుణ్యాలు కలిగి ఉన్న బౌలర్లు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఎక్స్ట్రా పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై రబడ రెచ్చిపోవడం ఖాయం. నోర్జే కూడా తక్కువేమీ కాదు’’ అంటూ ప్రొటిస్‌ను గెలిపించగల సత్తా వీరికి ఉందని డేల్ స్టెయిన్ అభిప్రాయపడ్డాడు. ఇక గ్రూప్-1లోని ఇంగ్లండ్ జట్టులో మార్క్ వుడ్ తన ఫేవరెట్ అన్న ఈ స్పీడ్‌స్టర్.. యార్కర్లు, బౌన్సర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో అతడు దిట్ట అని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ ఈ టోర్నీలో గనుక ముందుకు వెళ్తే అందులో మార్క్‌దే కీలక పాత్ర అని చెప్పవచ్చని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ప్రస్తుత వరల్డ్‌కప్ టోర్నీలో తన టాప్-5 బౌలర్ల పేర్లను స్టెయిన్ వెల్లడించాడు. కగిసో రబడ, అన్రిచ్ నోర్జే, మార్క్ వుడ్, మిచెల్ స్టార్క్, షాహిన్ ఆఫ్రిదిలకు ఈ లిస్టులో స్థానమిచ్చాడు. ఇక స్టెయిన్ ఈ జాబితాలో ఒక్క టీమిండియా పేసర్ కూడా లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీ గెలవని జట్టుగా సౌతాఫ్రికాకు అపవాదు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టెయిన్ వ్యాఖ్యలపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ‘‘కనీసం ఈసారైనా టైటిల్ గెలిచి చోకర్స్ ట్యాగ్‌ను తొలగించుకోండి’’ అంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. చదవండి: ఏ నిమిషానికి ఏమి జరుగునో! రిజర్వ్ డే ఉన్నా.. 667లో ఒక్కటే రద్దైనా.. ఫైనల్ ‘బెంగ’! T20 WC 2022: 'అతడు జట్టులో లేడు.. అందుకే పాకిస్తాన్‌కు ఈ పరిస్థితి' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Eng Vs SA: దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ ఘన విజయం.. ఏకంగా..
South Africa tour of England, 2022 - England vs South Africa, 3rd Test: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. కాగా లండన్‌లోని కెనింగ్టన్ వేదికగా సెప్టెంబరు 8న ఆరంభమైన ఆఖరి టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 118 పరుగులకే ఆలౌట్! ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక ప్రొటిస్ జట్టుకు ఇంగ్లండ్ బౌలర్లు రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్ చుక్కలు చూపించారు. రాబిన్సన్ ఐదు వికెట్లు, బ్రాడ్ నాలుగు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు 118 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా సొంతం! ఇక ఇంగ్లండ్ 158 పరుగులకు ఆలౌట్ అయింది. ఇదిలా ఉంటే.. బ్రాడ్ మరోసారి మూడు వికెట్లతో రెచ్చిపోవడం.. ఇందుకు కెప్టెన్ బెన్‌స్టోక్స్ కూడా జత కావడంతో దక్షిణాఫ్రికా 169 పరుగులకే రెండో ఇన్నింగ్స్‌ను ముగించింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ కేవలం ఒకే ఒక వికెట్ నష్టపోయి.. ఆఖరి రోజు జయభేరి మోగించింది. సిరీస్‌ను సైతం సొంతం చేసుకుంది. రాబిన్సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌తో పాటు ప్రొటిస్ బౌలర్ కగిసొ రబడ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రబడ మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. టీ20 సిరీస్ ప్రొటిస్ది.. టెస్టు సిరీస్ ఇంగ్లండ్‌ది! మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడే నిమిత్తం దక్షిణాఫ్రికా ఇంగ్లండ్ పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా మొదటి వన్డేలో పర్యాటక ప్రొటిస్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లంఢ్ గెలుపొందింది. ఆఖరి వన్డేలో ఫలితం తేలలేదు. ఇక టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-1తో కైవసం చేసుకోగా.. ఆఖరి రెండు టెస్టుల్లో ఓటమి పాలై.. టెస్టు సిరీస్‌ను 2-1తో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. చదవండి: ఇండియా నుంచి వచ్చారా? హ్యాపీగా ఉన్నారనుకుంటా: రమీజ్ రాజా దురుసు ప్రవర్తన SL Vs Pak: పాక్‌తో ఫైనల్! అప్పుడు వాళ్లు అలా.. ఇప్పుడు మేమిలా: దసున్ షనక -
అద్భుత విన్యాసం.. వికెట్లే కాదు క్యాచ్‌లు కూడా బాగా పట్టగలడు
ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అద్భుత విన్యాసంతో మెరిశాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో బ్రాడ్ ఈ విన్యాసం చేశాడు. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కగిసో రబడా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. మాథ్యూ పాట్ బౌలింగ్‌లో రబడా మిడ్‌ఫీల్డ్ దిశగా బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడుంది ఎవరు.. ఆరు అడుగులు ఆరు అంగుళాల స్టువర్ట్ బ్రాడ్. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిన బ్రాడ్ ఒకవైపుగా డైవ్‌చేస్తూ ఒంటిచేత్తో ఎవరు ఊహించని విధంగా స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. తన మెరుపు విన్యాసంతో జట్టు ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి జట్టును కూడా నోరెళ్లబెట్టేలా చేశాడు. బ్రాడ్ విన్యాసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇదే టెస్టులో బ్రాడ్.. ప్రొటిస్ బ్యాటర్ వెరిన్నేను ఔట్ చేయడం ద్వారా లార్డ్స్ వేదికలో 100వ వికెట్ సాధించాడు. తద్వారా టెస్టుల్లో ఒకే వేదికపై వంద వికెట్లు సాధించిన ఇంగ్లండ్ రెండో బౌలర్‌గా.. ఓవరాల్‌గా నాలుగో బౌలర్‌గా ఘనత సాధించాడు. బ్రాడ్ ఇంత మంచి ఫీట్ అందుకున్నా ఇంగ్లండ్ మాత్రం తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైంది. ఏకంగా ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో దక్షిణాఫ్రికా ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోర్ 289/7తో మూడో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైంది.దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ప్రోటీస్‌కు 161 పరుగల లీడ్ లభించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో సారెల్ ఎర్వీ (73) అర్ధ సెంచరీ చేయగా, ఎల్గర్ (47), కేశవ్ మహరాజ్ (41) పరుగులతో రాణించారు. అనంతరం 161 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 149 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. Oh Broady! 😱 Live clips: https://t.co/2nFwGblL1E 🏴 #ENGvSA 🇿🇦 | @StuartBroad8 pic.twitter.com/SCkwjfD7g5 — England Cricket (@englandcricket) August 19, 2022 చదవండి: Asia Cup 2022: కెప్టెన్‌గా షనక.. ఆసియాకప్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక ఇంగ్లండ్ జట్టుకు ఘోర పరాభవం.. 19 ఏళ్ల తర్వాత తొలి సారిగా! -
SA Vs ENG: రబడా పాంచ్ పటాకా..
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికాకు భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. దాంతో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 124 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. సారెల్ ఎర్వీ (73) అర్ధ సెంచరీ చేయగా, ఎల్గర్ (47), కేశవ్ మహరాజ్ (41), మార్కో జాన్సెన్ (41 బ్యాటింగ్) రాణించారు. బెన్ స్టోక్స్‌కు 3 వికెట్లు దక్కాయి. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 116/6తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకు ఆలౌటైంది. ఒలీ పోప్ (73) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పేస్ బౌలర్ రబడాకు 5 వికెట్లు దక్కగా, నోర్జే 3 వికెట్లు తీశాడు. -
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్..!
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ కగిసో రబాడ గాయం కారణంగా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 లో రబాడా ఎడమ కాలి చీలమండకు గాయమైంది. దీంతో అతడు ఇంగ్లండ్‌తో జరిగిన అఖరి టీ20కూడా దూరమయ్యాడు. అయితే రబాడ గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టనున్నట్లు ప్రోటిస్ జట్టు బృందం తెలిపింది. ఈ క్రమంలో అతడు ఐర్లాండ్ సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఇంగ్లండ్ వేదికగా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐర్లాండ్‌తో ప్రోటీస్ తలపడనుంది. ఐర్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 బ్రిస్టల్ వేదికగా బుధవారం జరగనుంది. ఈ సిరీస్ మొత్తం బ్రిస్టల్ వేదికగా జరగనుంది. ఇక ఈ సిరీస్ ముగిసిన అనంతరం దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. కాగా ఇంగ్లండ్‌తో మూడు టీ20 సిరీస్‌ను 2-1తో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. ఐర్లాండ్‌తో టీ20లకు దక్షిణాఫ్రికా జట్టు డేవిడ్ మిల్లర్ (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, రిలీ రోసౌ, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, వేన్ పార్నెల్, ఆండిలే ఫెహ్లక్వాయో, డ్వైన్ ప్రిటోరియస్, క్వింటన్ డి కాక్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, గ్రెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహారాజ్,తబ్రైజ్ షమ్సీ, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే చదవండి: IND vs WI 3rd T20: భారత్-విండీస్ మూడో టీ20 కూడా ఆలస్యం.. కారణం ఇదే..! -
IPL: ఏదో ఒకరోజు నేనూ ఐపీఎల్లో ఆడతా.. కెప్టెన్ అవుతా!
IND Vs SA T20 Series: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తాను భాగస్వామ్యం కావాలనుకుంటున్నానని దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ తెంబా బవుమా అన్నాడు. ఏదో ఒకరోజు క్యాష్ రిచ్ లీగ్‌లో తప్పకుండా ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాలం కలిసి వస్తే కెప్టెన్‌గా కూడా వ్యవహరించే అవకాశం రావాలని ఆశిస్తున్నానంటూ మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే, అంతకంటే ముందు ఏదో ఒక జట్టులో ఆడే ఛాన్స్ రావాలని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో ఇప్పటికే చాలా మంది ప్రొటిస్ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఏబీ డివిలియర్స్ వంటి స్టార్ల నుంచి బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ వరకు ఈ జాబితాలో చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా ఐపీఎల్-2022లో కగిసో రబడ, డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్కరమ్, మార్కో జాన్సెన్ తదితరులు తాము ప్రాతినిథ్యం వహించిన జట్ల విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ఇక మిల్లర్.. గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరడంలో కీలకంగా వ్యవహరించాడు. టైటిల్ గెలిచిన జట్టులో భాగమయ్యాడు. ఈ క్రమంలో వీరందరిపై ప్రశంసలు కురిపించిన బవుమా.. ఐపీఎల్లో మంచి ప్రదర్శన నమోదు చేశారని పేర్కొన్నాడు. రబడ వంద వికెట్లు తీయడం గర్వంగా ఉందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తానూ ఏదో ఒకరోజు ఐపీఎల్లో ఆడతానని ఈ 32 ఏళ్ల బ్యాటర్ పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘నేను కూడా అక్కడ ఆడతాను. మెరుగ్గా రాణిస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. నిజానికి అక్కడ ఓ జట్టుకు కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించాలని ఉంది. ఇది నా ఫాంటసీ. అయితే, ముందు ఐపీఎల్లో ఏదో ఒక జట్టుకు ఆడి అనుభవం గడించాలి కదా’’ అని క్రికెట్మంత్లీతో బవుమా చెప్పుకొచ్చాడు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో 33 మంది ప్రొటిస్ ప్లేయర్లు తమ పేరు నమోదు చేసుకున్నారు. వీరిలో బవుమా లేకపోవడం గమనార్హం. ఇక జూన్ 9 నుంచి టీమిండియాతో టీ20 సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికా సన్నద్ధమవుతోంది. చదవండి 👇 అమ్మో అదో పీడకల.. ఆ బౌలర్ ఎదురుగా ఉన్నాడంటే అంతే ఇక: జయవర్ధనే Ind Vs SA T20 Series: టీమిండియాను తక్కువగా అంచనా వేయలేం.. కానీ విజయం మాదే: బవుమా Welcome to the #Proteas, Tristan Stubbs 🇿🇦💚#INDvSA #BePartOfIt pic.twitter.com/EJWx8agZKV — Cricket South Africa (@OfficialCSA) June 1, 2022 -
ధవన్, రబాడలను ఊరిస్తున్న భారీ రికార్డులు
ఐపీఎల్ 2022 సీజన్ ఇవాళ (మే 22) చిట్టచివరి లీగ్ మ్యాచ్ జరుగనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారై, సన్‌రైజర్స్, పంజాబ్ జట్లు ఇదివరకే రేసు నుంచి నిష్క్రమించడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. రికార్డులు ఎలా ఉన్నాయంటే.. క్యాష్ రిచ్ లీగ్‌లో పంజాబ్‌పై సన్‌రైజర్స్ పూర్తి ఆధిక్యాన్ని కలిగి ఉంది. ఇరు జట్ల మధ్య జరిగిన 19 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ 13, పంజాబ్ 6 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ప్రస్తుత సీజన్ తొలి అర్ధ భాగంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా సన్‌రైజర్స్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 7 వికెట్ల తేడాతో పంజాబ్‌ను మట్టికరిపించింది. నేటి మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు ఇవే.. - పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధవన్ ఈ మ్యాచ్‌లో మరో బౌండరీ సాధిస్తే ఐపీఎల్ చరిత్రలో 700 బౌండరీల మార్కును అందుకున్న తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే నేటి మ్యాచ్‌లో ధవన్ 5 బౌండరీలు బాధితే పంజాబ్ తరఫున 50 బౌండరీలు పూర్తి చేసుకుంటాడు. - పంజాబ్ పేసర్ రబాడ నేటి మ్యాచ్‌లో మరో 2 వికెట్లు పడగొడితే క్యాష్ రిచ్ లీగ్‌లో 100 వికెట్ల అరుదైన మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఐపీఎల్లో 100 వికెట్లు సాధించిన తొలి సౌతాఫ్రికా బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. - పంజాబ్ బౌలర్ రాహుల్ చాహర్ మరో 2 వికెట్లు తీస్తే టీ20ల్లో 100 వికెట్ల మార్కును చేరుకుంటాడు. - పంజాబ్ హిట్టర్ లివింగ్‌స్టోన్ మరో 2 పరుగులు చేస్తే పొట్టి క్రికెట్లో 4500 పరుగుల మార్కును క్రాస్ చేస్తాడు. - సన్‌రైజర్స్ డాషింగ్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి మరో 3 బౌండరీలు బాధితే టీ20ల్లో 250 బౌండరీల మార్కును, అలాగే మరో 4 సిక్సర్లు కొడితే 100 సిక్సర్ల క్లబ్లో చేరతాడు. - పంజాబ్ సారధి మయాంక్ అగర్వాల్ మరో 3 సిక్సర్లు బాధితే టీ20ల్లో 150 సిక్సర్ల అరుదైన క్లబ్లో చేరతాడు. అలాగే మయాంక్ నేటి మ్యాచ్‌లో మరో 6 ఫోర్లు కొడితే ఐపీఎల్లో పంజాబ్ తరఫున 150 బౌండరీలను పూర్తి చేసుకుంటాడు. - సన్‌రైజర్స్ ప్లేయర్ నికోలస్ పూరన్ మరో 6 బౌండరీలు సాధిస్తే టీ20ల్లో 300 బౌండరీల మార్కును అందుకుంటాడు. - సన్‌రైజర్స్ బౌలర్ శ్రేయస్ గోపాల్ మరో వికెట్ పడగొడితే ఐపీఎల్లో 50 వికెట్లను పూర్తి చేసుకుంటాడు. - సన్‌రైజర్స్ హిట్టర్ అబ్దుల్ సమద్ మరో 4 సిక్సర్లు కొడితే టీ20ల్లో 50 సిక్సర్ల క్లబ్లో చేరతాడు. చదవండి: సన్‌రైజర్స్‌తో తలపడనున్న పంజాబ్.. ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ ఎవరంటే..! -
PBKS VS DC: రబాడ ఖాతాలో అరుదైన రికార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ అరుదైన రికార్డు నెలకొల్పాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ వికెట్ పడగొట్టడం ద్వారా.. డేల్ స్టెయిన్ (97 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఐపీఎల్లో 62 మ్యాచ్‌లు ఆడిన రబాడ.. 98 వికెట్లు సాధించి 100 వికెట్ల మైలురాయి దిశగా దూసుకెళ్తున్నాడు. మే 22న సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో రబాడ మరో 2 వికెట్లు తీస్తే.. ఐపీఎల్ చరిత్రలో వేగంగా 100 వికెట్ల మార్కును అందుకున్న బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. కాగా, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలై ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు చేజార్చుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి నాలుగో స్థానంలో ఉంది. అయితే టెక్నికల్‌గా పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. తదుపరి జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ చేతిలో ఆర్సీబీ ఓడి, ముంబై చేతిలో ఢిల్లీ ఓడితే సన్‌రైజర్స్- పంజాబ్ మ్యాచ్ కీలకంగా మారుతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే ఢిల్లీ, ఆర్సీబీలతో సమానంగా (14 పాయింట్లు) నిలుస్తుంది. చదవండి: IPL 2022: ముంబైపై ఢిల్లీ గెలిచిందా.. ఆ నాలుగు జట్ల పని గోవిందా..! -
టి20 క్రికెట్లో పంజాబ్ కింగ్స్ బౌలర్ కొత్త చరిత్ర
పంజాబ్ కింగ్స్ బౌలర్ కగిసో రబాడ టి20 క్రికెట్లో మరో మైలురాయిని అందుకున్నాడు. శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్‌ను ఔట్ చేయడం ద్వారా పొట్టి ఫార్మాట్లో 200వ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా టి20 క్రికెట్లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్‌గా రబాడ నిలిచాడు. రబాడ 146 మ్యాచ్‌ల్లో 200 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. రబాడ కంటే ముందు రషీద్ ఖాన్ 134 మ్యాచ్‌ల్లోనే 200 వికెట్ల మార్క్‌ను అందుకొని తొలి స్థానంలో ఉండగా.. పాక్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ 139 మ్యాచ్‌లతో రెండో స్థానం, ఉమర్ గుల్ 147 మ్యాచ్‌లతో నాలుగో స్థానం, లసిత్ మలింగ 149 మ్యాచ్‌లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్లే ఆఫ్ ఆశలు నిలవాలవంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గర్జించింది. ఓపెనర్‌గా బెయిర్ స్టో(29 బంతుల్లో 66, 4 ఫోర్లు, 7 సిక్సర్లు) సీజన్లో తొలిసారి అదరగొట్టడం.. లివింగ్‌స్టోన్(42 బంతుల్లో 70, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ పంజాబ్ బౌలర్ల ధాటికి 155 పరుగులకే చాప చుట్టేసింది. మ్యాక్స్‌వెల్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు.. ఆరు ఓటములతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో సమానంగా ఉంది. మరోవైపు ఆర్సీబీ మాత్రం 13 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు.. ఆరు పరాజయాలతో నాలుగో స్థానంలో ఉంది. చదవండి: Tilak Varma: తెలుగుతేజంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ ప్రశంసల వర్షం .@KagisoRabada25 led the charge with the ball for @PunjabKingsIPL and was our top performer from the second innings of the #RCBvPBKS match. 👍 👍 #TATAIPL Here's a summary of his performance 🔽 pic.twitter.com/nuQqU4fvp2 — IndianPremierLeague (@IPL) May 13, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సల్మాన్ ఖాన్ ఎవరో తెలీదు కానీ.. రషీద్ ఖాన్ అయితే తెలుసు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. లీగ్ ప్రారంభమై 15 ఏళ్లు గడుస్తున్నా ఆ జట్టు ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా సాధించలేదు. ఎందరో కెప్టెన్లు, ఆటగాళ్లు మారినా ఆ జట్టు తలరాత మాత్రం మారడం లేదు. ప్రస్తుత సీజన్ (2022)లో కూడా ఆ జట్టు ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప మయాంక్ సేన ప్లే ఆఫ్స్ అర్హత సాధించలేని పరిస్థితి నెలకొంది. ఈ సీజన్లో పంజాబ్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. జట్టు నిండా ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నా.. పంజాబ్ కింగ్స్ స్థాయికి తగ్గ విజయాలు సాధించలేకపోతుంది. పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తదుపరి ఆడే మూడు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్లో కీలక దశ మ్యాచ్‌లు జరుగుతున్న వేళ పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఓ ఫన్నీ కార్యక్రమాన్ని నిర్వహించింది. డు ఇట్ లైక్ శశి పేరుతో సాగిన ఈ ప్రోగ్రాంలో పంజాబ్ కింగ్స్‌కు చెందిన విదేశీ ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇందులో యాంకర్ శశి చెప్పే పాపులర్ హిందీ డైలాగ్‌లను పంజాబ్ కింగ్స్ విదేశీ ఆటగాళ్లు కెమెరా ముందు రిపీట్ చేశారు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్నీ హోవెల్, ఆసీస్ పేసర్ నాథన్ ఇల్లీస్, విండీస్ ఆల్‌రౌండర్ ఓడియన్ స్మిత్‌లు శశి చెప్పిన డైలాగ్‌లను బాగానే అప్పజెప్పగా, సఫారీ పేసర్ కగిసో రబాడ మాత్రం డైలాగ్ చెప్పేముందు నవ్వులు పూయించాడు. యాంకర్ శశి రబాడని 'మీకు సల్మాన్ ఖాన్ తెలుసా..?’ అని ప్రశ్నించగా అందుకు రబాడ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ఆ సల్మాన్ ఖాన్ ఎవరో నాకు తెలీదు కానీ.. రషీద్ ఖాన్ అయితే తెలుసంటూ చమత్కరించాడు. అయితే ఆతర్వాత రబాడ చాలా కష్టం మీద సల్లు భాయ్ పాపులర్ డైలాగ్‌ను 'ఏక్ బార్ మైనే జో కమిట్మెంట్ కర్దీ’ (తెలుగులో మహేశ్ బాబు పోకిరి డైలాగ్.. ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినను) ప్రేక్షకులకు వినిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా, 2020 సీజన్ పర్పుల్ క్యాప్ విన్నర్ అయిన రబాడాను ఈ సీజన్ వేలంలో పంజాబ్ కింగ్స్ రూ.9.25 కోట్లకు దక్కించుకుంది. ప్రస్తుత సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన రబాడ 18 వికెట్లు తీసి మరోసారి పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు. చదవండి: 'ఏం చేయాలో తెలియని స్థితి.. చివరకు సీఈవో జోక్యం' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ బౌలర్ అరుదైన ఫీట్
ఐపీఎల్ 2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బౌలర్ కగిసో రబాడ అరుదైన ఫీట్ అందుకున్నాడు. మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన రబాడ 33 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. తన మూడో ఓవర్లో హ్యాట్రిక్ తీసే అవకాశం మిస్ అయిన రబాడ ఓవరాల్‌గా మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ నేపథ్యంలోనే రబాడ ఒక రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో నాలుగు వికెట్ల ఫీట్‌ను ఎక్కువసార్లు సాధించిన జాబితాలో రబాడ మూడో స్థానానికి చేరుకున్నాడు. రబాడ 59 మ్యాచ్‌ల్లో ఆరుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. తొలి స్థానంలో ఉన్న సునీల్ నరైన్ 144 మ్యాచ్‌ల్లో ఎనిమిదిసార్లు నాలుగు వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు. మలింగ ఏడుసార్లు 4 వికెట్ల ఫీట్(122 మ్యాచ్‌లు) సాధించి రెండో స్థానంలో ఉండగా.. రబాడ మూడోస్థానం(59 మ్యాచ్‌ల్లో ఆరుసార్లు 4 వికెట్ల ఫీట్), ఇక నాలుగో స్థానంలో అమిత్ మిశ్రా 154 మ్యాచ్‌ల్లో ఐదుసార్లు 4 వికెట్లు ఫీట్ అందుకున్నాడు. చదవండి: IPL 2022: 'నోటితో చెప్పొచ్చుగా'.. సహనం కోల్పోయిన తెవాటియా -
IPL 2022: లక్నో సూపర్ ‘సిక్సర్’
పుణే: ఐపీఎల్లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ దూసుకుపోతోంది. బ్యాటింగ్‌లో అద్భుతాలు చేయకపోయినా... ఈసారి బౌలర్ల చక్కటి ప్రదర్శనతో ఆ జట్టు ఖాతాలో ఆరో విజయం చేరింది. స్వల్ప లక్ష్యాన్ని కూడా టీమ్ కాపాడుకోగలిగింది. శుక్రవారం జరిగిన పోరులో లక్నో 20 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (37 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీపక్ హుడా (28 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. కగిసో రబడకు 4 వికెట్లు దక్కాయి. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. జానీ బెయిర్‌స్టో (28 బంతుల్లో 32; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన కృనాల్ పాండ్యా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. కీలక భాగస్వామ్యం... సీజన్లో అద్భుత ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ (6) అరుదైన వైఫల్యంతో లక్నో ఆట మొదలైంది. అయితే డికాక్, హుడా రెండో వికెట్‌కు 85 పరుగులు (59 బంతుల్లో) జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. రబడ ఓవర్లో డికాక్ వరుస బంతుల్లో రెండు సిక్సర్లు బాదగా, పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 39 పరుగులకు చేరింది. ఈ భాగస్వామ్యం భారీ స్కోరుకు బాటలు వేస్తున్న తరుణంలో సందీప్ శర్మ దెబ్బ తీశాడు. అతని బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి డికాక్ అవుటయ్యాడు. బౌలర్ అప్పీల్‌పై అంపైర్ స్పందించకపోయినా డికాక్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ మైదానం వీడాడు. ఇక్కడే లక్నో బ్యాటింగ్ తడబడింది. 13 పరుగుల వ్యవధిలో జట్టు మరో 4 ప్రధాన వికెట్లు కోల్పోయింది. హుడా, కృనాల్ (7), బదోని (4), స్టొయినిస్ (1) పెవిలియన్ చేరారు. చివర్లో ఆరు బంతుల వ్యవధిలో 4 సిక్సర్లు కొట్టిన సూపర్ జెయింట్స్ 150 పరుగుల స్కోరు దాటగలిగింది. వీటిలో రబడ ఓవర్లో వరుస బంతుల్లో చమీరా బాదిన రెండు సిక్స్‌లు ఉన్నాయి. సమష్టి వైఫల్యం... మొహసిన్ ఓవర్లో 6, 4 తో ఛేదనను కెప్టెన్ మయాంక్ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా మొదలు పెట్టాడు. అయితే చమీరా ఓవర్లోనూ సిక్స్ బాదిన అతను అదే ఓవర్లో వెనుదిరిగాడు. అనంతరం తక్కువ వ్యవధిలో శిఖర్ ధావన్ (5), రాజపక్స (9) వికెట్లను పంజాబ్ కోల్పోయింది. బెయిర్‌స్టోతో పాటు భారీ హిట్టర్ లివింగ్‌స్టోన్ (18) క్రీజ్‌లో ఉన్నంత వరకు కింగ్స్ గెలుపు విషయంలో ఎలాంటి ఢోకా కనిపించలేదు. రవి బిష్ణోయ్ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లు కొట్టిన లివింగ్‌స్టోన్ జోరు ప్రదర్శించాడు కూడా. అయితే మొహసిన్ బౌలింగ్‌లో కీపర్ మీదుగా భిన్నమైన షాట్ ఆడేందుకు ప్రయత్నించి అతను అవుటయ్యాడు. ఆ వెంటనే జితేశ్ శర్మ (2), గెలిపించే అవకాశం ఉన్న బెయిర్‌స్టో కూడా వెనుదిరగడంతో పంజాబ్ గెలుపు ఆశలకు కళ్లెం పడింది. చివర్లో రిషి ధావన్ (22 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ప్రయత్నం సరిపోలేదు. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) జితేశ్ (బి) సందీప్ శర్మ 46; రాహుల్ (సి) జితేశ్ (బి) రబడ 6; హుడా (రనౌట్) 34; కృనాల్ (సి) శిఖర్ (బి) రబడ 7; స్టొయినిస్ (సి అండ్ బి) చహర్ 1; బదోని (సి) లివింగ్‌స్టోన్ (బి) రబడ 4; హోల్డర్ (సి) సందీప్ (బి) చహర్ 11; చమీరా (సి) చహర్ (బి) రబడ 17; మొహసిన్ (నాటౌట్) 13; అవేశ్ ఖాన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–13, 2–98, 3–104, 4–105, 5–109, 6–111, 7–126, 8–144. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–23–0, సందీప్ శర్మ 4–0–18–1, రబడ 4–0–38–4, రిషి ధావన్ 2–0–13–0, లివింగ్‌స్టోన్ 2–0–23–0, రాహుల్ చహర్ 4–0–30–2. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: మయాంక్ (సి) రాహుల్ (బి) చమీరా 25; శిఖర్ ధావన్ (బి) బిష్ణోయ్ 5; బెయిర్‌స్టో (సి) కృనాల్ (బి) చమీరా 32; రాజపక్స (సి) రాహుల్ (బి) కృనాల్ 9; లివింగ్‌స్టోన్ (సి) డికాక్ (బి) మొహసిన్ 18; జితేశ్ (ఎల్బీ) (బి) కృనాల్ 2; రిషి ధావన్ (నాటౌట్) 21; రబడ (సి) బదోని (బి) మొహసిన్ 2; చహర్ (సి) బదోని (బి) మొహసిన్ 4; అర్‡్షదీప్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–35, 2–46, 3–58, 4–88, 5–92, 6–103, 7–112, 8–117. బౌలింగ్: మొహసిన్ 4–1–24–3, చమీరా 4–0–17–2, హోల్డర్ 1–0–8–0, అవేశ్ ఖాన్ 3–0–26–0, రవి బిష్ణోయ్ 4–0–41–1, కృనాల్ పాండ్యా 4–1–11–2. ఐపీఎల్లో నేడు గుజరాత్ టైటాన్స్ X బెంగళూరు వేదిక: ముంబై, మధ్యాహ్నం గం. 3:30 నుంచి రాజస్తాన్ రాయల్స్ X ముంబై ఇండియన్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. That's that from Match 42.@LucknowIPL win by 20 runs and add two more points to their tally. Scorecard - https://t.co/H9HyjJPgvV #PBKSvLSG #TATAIPL pic.twitter.com/dfSJXzHcfG — IndianPremierLeague (@IPL) April 29, 2022 -
IPL 2022: రఫ్ఫాడించిన రబాడ.. పట్టలేని ఆనందంలో పంజాబ్
Kagiso Rabada: రబాడ (5/39) ఐదు వికెట్లతో రఫ్ఫాడించడంతో బంగ్లాదేశ్‌తో ఇవాళ(మార్చి 20) జరిగిన రెండో వన్డేలో ఆతిధ్య ప్రోటీస్ జట్టు అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో సఫారీలు 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకోవడంతో పాటు తొలి వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నారు. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. సఫారీ జట్టును 38 పరుగుల తేడాతో మట్టికరిపించగా, ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో పర్యాటక జట్టుపై రివెంజ్ విక్టరీ సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు రబాడ ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేయగా, డికాక్ (62), కైల్ వెర్రిన్ (58 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించడంతో సఫారీ జట్టు 37.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు అఫీఫ్ హోసేన్ (107 బంతుల్లో 77; 9 ఫోర్లు) ఒంటరి పోరటాం చేయడంతో బంగ్లాదేశ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో వన్డే బుధవారం (మార్చి 23) జరగనుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో రబాడ భీకరమైన బంతులతో ప్రత్యర్ధులను గడగడలాడించడంతో అతని ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ ఆనందంలో మునిగి తేలుతుంది. ఇటీవల జరిగిన మెగా వేలంలో రబాడను పంజాబ్ ఏకంగా రూ. 9. 25 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, రబాడ, ఎంగిడి, డస్సెన్, మార్క్రమ్ సహా పలువురు సౌతాఫ్రికా క్రికెటర్లు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగాల్సిన టెస్ట్ సిరీస్‌కు డుమ్మా కొట్టి ఐపీఎల్ ఆడేందుకు పయనమవుతున్నారు. చదవండి: హిట్టర్లలతో సిద్దమైన పంజాబ్.. పూర్తి జట్టు ఇదే A great catch from Janneman Malan to ensure @KagisoRabada25 five-wicket haul🖐️ #SAvBAN #BetwayPinkODI #BePartOfIt | @Betway_za pic.twitter.com/hlYxZDjyPN — Cricket South Africa (@OfficialCSA) March 20, 2022 -
ఒకవైపు ఐపీఎల్.. జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా.. స్టార్ ఆటగాళ్లు లేకుండానే!
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. అయితే ఐపీఎల్ 15వ సీజన్ కారణంగా రబడా, మార్క్రామ్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ వంటి స్టార్ స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు. దీంతో యువ ఆటగాడు ఖయా జోండో దక్షిణాఫ్రికా తరుపున టెస్టులో అరంగేట్రం చేయనున్నాడు. దక్షిణాఫ్రికా తరపున ఆరు వన్డేలు ఆడిన జోండో.. 146 పరుగులు సాధించాడు. అయితే దక్షిణాఫ్రికా ప్రకటించిన జట్టులో కెప్టెన్ ఎల్గర్, బావుమా, కేశవ్ మహారాజ్ తప్ప సీనియర్ ఆటగాళ్లు ఎవరూ లేరు. మార్చి 31 నుంచి డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికా- బంగ్లాదేశ్ తొలి టెస్టు ప్రారంభం కానుంది. అదే విధంగా మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా జట్టు: డీన్ ఎల్గర్ (కెప్టెన్), టెంబా బావుమా, డారిన్ డుపావిల్లోన్, సరెల్ ఎర్వీ, సైమన్ హార్మర్, కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్, డువాన్ ఒలివర్, కీగన్ పీటర్సన్, ర్యాన్ రికెల్టన్, లూథో సిపమ్లా, గ్లెంటన్ స్టౌర్మాన్, కైల్ వెర్రెయిన్స్, లిజాడ్ విలియొండోమ్స్. -
ప్రొటిస్ పేసర్ల దెబ్బ.. న్యూజిలాండ్ తడబాటు
క్రైస్ట్‌చర్చ్: దక్షిణాఫ్రికా పేస్ బౌలర్లు కగిసో రబడ (3/37), మార్కో జాన్సెన్ (2/48) ధాటికి రెండో టెస్టులో న్యూజిలాండ్ తడబడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా స్కోరుకు కివీస్ 207 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం గ్రాండ్‌హోమ్ (54 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ (29 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 238/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా133 ఓవర్లలో 364 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో నీల్ వాగ్నర్ నాలుగు, హెన్రీ మూడు వికెట్లు తీశారు. -
Ind Vs Sa: నువ్వు తోపు అనుకోకు.. అలా చేశావో నిన్ను మించినోడు లేడని చెప్పాను.. అంతే
Dean Elgar Comments: కగిసో రబడ... ప్రొటిస్ జట్టులో ప్రధాన బౌలర్.. జొహన్నస్‌బర్గ్ టెస్టులో టీమిండియాపై దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా రాణించాడు. ఫామ్‌లోకి వచ్చి నిలకడగా బ్యాటింగ్ చేస్తూ... అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్న భారత బ్యాటర్లు అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాను రబడ అవుట్ చేశాడు. 100కు పైగా పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేసిన ఈ జంటను, ఆ తర్వాత రిషభ్ పంత్‌ను పెవిలియన్‌కు పంపి భారత జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 6 వికెట్లు తన ఖాతాలో వేసుకుని సత్తా చాటాడు. బౌలర్ల అద్భుత ప్రదర్శనకు తోడు కెప్టెన్ డీన్ ఎల్గర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో జొహన్నస్‌బర్గ్ టెస్టులో విజయం దక్షిణాఫ్రికా సొంతమైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఎల్గర్ మాట్లాడుతూ.. తనకు, రబడకు మధ్య మ్యాచ్‌కు ముందు జరిగిన సంభాషణ గురించి ప్రస్తావించాడు. డీన్ ఎల్గర్(PC: CSA) ‘‘కేజీ దగ్గరకు వెళ్లి అతడితో మాట్లాడాను. మన గ్రూపులో నీ పట్ల అందరికీ గౌరవం, అభిమానం ఉంది. నువ్వు నీ గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నావని నేను అనుకోను. బాగా బౌలింగ్ చేస్తున్నావనే అతి విశ్వాసంతో ఉంటావని భావించను. నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. ఎప్పుడైతే కేజీ తన ప్రతిభకు తగ్గట్లు రాణిస్తాడో... అప్పుడు తనను మించినోడు ఉండడు’’ అని చెప్పాను. తనపై ఈ మాటలు ప్రభావం చూపాయి. బాగా ఆలోచించి ఉంటాడు. మరుసటి రోజు పక్కా ప్రణాళికతో వచ్చి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు’’ అని ఎల్గర్ చెప్పుకొచ్చాడు. ఒక్కోసారి రబడ రిలాక్స్ అవుతాడు.. అలాంటి సమయంలో తనను మోటివేట్ చేయాల్సి ఉంటుందని సరాదాగా వ్యాఖ్యానించాడు. నిన్ను నువ్వు తోపు అనుకోకు అంటూ తన మాటలతో రబడలో కసి పెరిగేలా చేసిట్లు పరోక్షంగా వెల్లడించాడు. కాగా రెండో టెస్టులో విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో టీమిండియాతో సమానంగా నిలిచింది ప్రొటిస్. దీంతో జనవరి 11 నుంచి ఆరంభమయ్యే మూడో టెస్టు ఇరు జట్లకు కీలకంగా మారింది. చదవండి: టీమిండియాకు భారీ షాక్.. మూడో టెస్ట్‌కు స్టార్ బౌలర్ దూరం! Kagiso Rabada produced a fiery spell to remove both set batsmen early on Day 3 🔥 Watch the full highlights here 📲 https://t.co/QyWr8FjPcu#SAvIND #FreedomTestSeries #BePartOfIt pic.twitter.com/aWg74V5LLQ — Cricket South Africa (@OfficialCSA) January 6, 2022 -
నో బాల్స్ వేయడమే గగనం.. చెత్త రికార్డులేంది?
టెస్టుల్లో నో బాల్స్ వేయడమే అరుదు. మరి అలాంటిది దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడ నో బాల్స్ విషయంలో చెత్త రికార్డు నమోదు చేశాడు. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో రబాడ ఇప్పటివరకు 17 నో బాల్స్ వేశాడు. ఈ నేపథ్యంలోనే రబాడ చెత్త రికార్డు నమోదు చేశాడు. సౌతాఫ్రికా తరపున ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక నో బాల్స్ వేసిన జాబితాలో రబాడ చోటు దక్కించుకున్నాడు. ఇంతకముందు 1997-98లో కేప్‌టౌన్ టెస్టు వర్సెస్ శ్రీలంకతో మ్యాచ్‌లో షాన్ పొలాక్ 17 నోబాల్స్ వేయగా.. ఆ తర్వాత మళ్లీ పొలాక్ 1998 నాటింగ్హమ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో 17 నోబాల్స్ వేశాడు. ఇక 2004-05లో పోర్ట్ ఎలిజిబెత్ టెస్టు వర్సెస్ ఇంగ్లండ్‌తో డేల్ స్టెయిన్ 16 నోబాల్స్ వేయడం విశేషం. చదవండి: Virat Kohli: రెండు ఇన్నింగ్స్‌లో ఒకేలా ఔటైన కోహ్లి.. ఫ్యాన్స్ ట్రోల్ -
Ind VS Sa: 327 అనేది మరీ చెత్త స్కోరేమీ కాదులే.. మనోళ్లు తక్కువేం కాదు!
Ind VS Sa 1st Test: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు లుంగి ఎన్గిడి. వరుసగా వికెట్లు పడగొట్టి కోహ్లి సేనను దెబ్బకొట్టాడు. మొత్తంగా 6 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. కగిసో రబడ సైతం ఎన్గిడికి తోడు కావడంతో 272 పరుగుల స్కోరు వద్ద మూడో రోజు ఆట ఆరంభించిన భారత్.. కేవలం యాభై పరుగుల వ్యవధిలోనే మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. 327 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఎన్గిడికి 6, రబడకు 3, జాన్సెన్కు ఒక వికెట్ దక్కాయి. దీంతో ప్రొటిస్ బౌలర్లను ప్రశింసిస్తూనే.. టీమిండియా బ్యాటింగ్ తీరును ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ‘‘ఎన్గిడి, రబడ సూపర్... టీమిండియా భారీ స్కోరు చేస్తుందనుకుంటే.. కేవలం 36 పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోయింది’’ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే, మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ మాత్రం భారత జట్టుకు అండగా నిలిచాడు. ‘‘సెంచూరియన్ టెస్టు... మూడో రోజు ఆటలో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిన విధానాన్ని విమర్శించడం తేలికే. కానీ... 327 అనేది మరీ చెత్త స్కోరేమీ కాదు. టాస్ గెలిచిన తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఈ మాత్రం స్కోరు చేయడం మంచి విషయం’’అని ట్వీట్ చేశాడు. అదే విధంగా... టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ సైతం.. ‘‘50 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు! తమ బౌలింగ్ అటాక్ ఎలా ఉంటుందో దక్షిణాఫ్రికా బౌలర్లు మరోసారి నిరూపించారు. తమను తక్కువగా అంచనా వేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూపించారు. అయితే, భారత బౌలర్లు కూడా ఇలాంటి పిచ్‌పై అద్భుతాలు చేయగలరు’’ అని చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే భారత పేసర్లు ప్రొటిస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. చదవండి: IPL 2022- Ambati Rayudu : "నాకు ఐపీఎల్లో ఆ జట్టుకు ఆడాలి అని ఉంది" Last 6 wickets for less than 50 runs! It’s definitely not a good morning for Team India. South Africa has once again shown that their bowling attack can’t be taken lightly but I am sure Indian bowling can do even better in these conditions. #SAvsIND #INDvsSA — R P Singh रुद्र प्रताप सिंह (@rpsingh) December 28, 2021 It is easy to critise the dramatic collapse on the 3rd day at #Centurion but I feel 327 is still a very good score in the first innings after winning the toss. pic.twitter.com/MEzUW527jk — parthiv patel (@parthiv9) December 28, 2021 🇿🇦 👏 What a performance with ball in hand from Lungi Ngidi 6/71.#SAvIND #FreedomTestSeries #BePartOfIt #KeepWalking | @johnniewalker_ pic.twitter.com/6FxrTZCKwt — Cricket South Africa (@OfficialCSA) December 28, 2021 -
Ind Vs Sa: మూడోరోజు ముగిసిన ఆట.. 146 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
Ind Vs Sa 1st Centurion Test Day 3 Live Updates టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడోరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 5, శార్దూల్ ఠాకూర్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్ కలుపుకొని 146 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా మూడోరోజు ఆటలో తొలి సెషన్లో సౌతాఫ్రికా ఆధిపత్యం చూపించగా.. మిగిలిన రెండు సెషన్లలో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. నాలుగో రోజు ఆటలో టీమిండియా తొలి రెండు సెషన్ల పాటు ఆడి భారీ స్కోరు చేస్తే సౌతాఫ్రికా ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టమే. 20:56 PM: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు 130 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. టీమిండియా బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ పరుగులు తీయడంలో ఇబ్బందులు పడ్డారు. ప్రొటీస్ బ్యాటింగ్‌లో టెంబా బవుమా 52 పరుగులు చేయగా.. క్వింటన్ డికాక్ 34 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ 5 వికెట్లతో దుమ్మురేపగా.. బుమ్రా, శార్దూల్ చెరో రెండు, సిరాజ్ ఒక వికెట్ తీశారు. 7:31 PM : తొలి టెస్టులో టీమిండియా చెలరేగుతుండడంతో సౌతాఫ్రికా బ్యాటర్స్ పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. తాజాగా 12 పరుగులు చేసిన ముల్డర్ షమీ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో దక్షిణాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 44 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. టెంబా బవుమా 48 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 6:35 PM : శార్ధూల్ ఠాకూర్ అద్బుత బౌలింగ్‌తో దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 34వ ఓవర్ తొలి బంతికి డికాక్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 37 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. బవుమా 31, ముల్డర్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. 4: 47 PM: భారత బౌలర్లు దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపిస్తున్నారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతున్నారు. దీంతో 32 పరుగులకే ప్రొటిస్ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం తెంబా బవుమా, క్వింటన్ డికాక్ క్రీజులో ఉన్నారు. బుమ్రా ఒకటి, షమీ రెండు, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. 4: 22PM- మహ్మద్ షమీ బౌలింగ్‌లో ప్రొటిస్ బ్యాటర్ కీగన్ పీటర్సన్ అవుటయ్యాడు. దీంతో 30 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం మార్కరమ్, రసే వాన్ డెర్ డసెన్ క్రీజులో ఉన్నారు. 4: 22PM: రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 3: 50 PM: లంచ్ బ్రేక్ సమయానికి ప్రొటిస్ జట్టు స్కోరు: 21/1 (7). పీటర్సన్(11), మార్కరమ్(9) క్రీజులో ఉన్నారు. 3: 10 PM: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా మొదటి వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో ప్రొటిస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్ క్రీజులో ఉన్నారు. 2: 52 PM: దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి టీమిండియా ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో మూడో రోజు ఆటలో భాగంగా 327 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అయితే, వర్షం కారణంగా రెండో రోజు ఆట రద్దు కాగా... మంగళవారం ఆట ప్రారంభించిన కొద్ది సేపటికే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడికి అత్యధికంగా 6 వికెట్లు దక్కగా... రబడ 3, జాన్సెన్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక టీమిండియా ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 123 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మయాంక్ అగర్వాల్(60), కోహ్లి(35), రహానే(48), బుమ్రా (14) మినహా మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ►టీమిండియా తొలి ఇన్నింగ్స్: 327 పరుగులు, ఆలౌట్ 2: 37 PM: టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మహ్మద్ షమీ ఎంగిడి బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ క్రీజులో ఉన్నారు. 2: 26 PM: ప్రొటిస్ బౌలర్ కగిసో రబడ విశ్వరూపం చూపిస్తున్నాడు. వరుసగా వికెట్లు తీస్తూ టీమిండియాను దెబ్బకొడుతున్నాడు. ఇప్పటి వరకు మొత్తంగా అతడు 3 వికెట్లు తీయగా.. ఎంగిడి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 2: 26 PM: కోహ్లి సేన నిమిదో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. 2: 15 PM: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మూడో రోజు ఆట ఆరంభం కాగానే వరుసగా వికెట్లు కోల్పోతోంది. కేఎల్ రాహుల్, అజింక్య రహానే, అశ్విన్, రిషభ్ పంత్ రూపంలో నాలుగు వికెట్లు కోల్పోయింది. వరుణుడు కరుణించడంతో దక్షిణాఫ్రికా- భారత్ మధ్య తొలి టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభమైంది. కాగా ఆరంభంలోనే రెండు కీలక వికెట్లను భారత్ కోల్పోయింది. సెంచరీ సాధించి మంచి టచ్‌లో కనిపించిన కేఎల్ రాహుల్, రబడ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఎంగిడీ బౌలింగ్‌లో రహానే కూడా వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తుదిజట్లు: భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), వియాన్ మల్దర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి. -
Ind vS SA Test: నోర్జే లేడు.. కష్టమే.. భారమంతా రబడపైనే.. మరి కేశవ్ మహరాజ్?
Ind vS SA Test: South Africa Batting And Bowling Strength: టీమిండియా- దక్షిణాఫ్రికా జట్ల మధ్య సమరానికి సమయం ఆసన్నమైంది. డిసెంబరు 26 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో గెలవాలని కోహ్లి సేన ఉవ్విళ్లూరుతుండగా... సొంతగడ్డపై తమకు తిరుగులేదంటూ ప్రొటిస్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో పటిష్ట బ్యాటింగ్ గల భారత్‌ను దెబ్బకొట్టేందుకు దక్షిణాఫ్రికా వ్యూహాలు రచిస్తోంది. నిజానికి... ఐపీఎల్-2022 సీజన్లో, టి20 ప్రపంచకప్‌లో చక్కగా రాణించిన సీమర్ అన్రిచ్ నోర్జేను... సొంతగడ్డపై తురుపుముక్కగా జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ తుంటి గాయంతో మొత్తం సిరీస్‌కే దూరమవడం జట్టుకు శాపమైంది. ఈ నేపథ్యంలో బౌలింగ్ భారమంతా రబడపైనే పడింది. ఇన్‌గిడి, ఒలీవర్లు ఉన్నప్పటికీ నోర్జే అంతటి ప్రస్తుత పేస్ పదును వీరికి లేదు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ సొంతగడ్డపై తన మాయాజాలం కనబరిచేందుకు తహతహలాడుతున్నాడు. బ్యాటింగ్‌లో కెప్టెన్ ఎల్గర్, మార్క్రమ్, పీటర్సన్, డసెన్లతో పాటు వికెట్ కీపర్ డికాక్ అందరూ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఎల్గర్, మార్క్రమ్ శుభారంభమిస్తే... మిడిలార్డర్లో డసెన్, బవుమా ఇన్నింగ్స్‌ను భారీస్కోరువైపు నడిపించగలరు. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, రహానే/శ్రేయస్ అయ్యర్/ హనుమ విహారి, రిషభ్ పంత్, అశ్విన్, శార్దుల్, షమీ, బుమ్రా, సిరాజ్/ఇషాంత్ శర్మ. దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్ (కెప్టెన్), మార్క్రమ్, కీగన్ పీటర్సన్, వాన్ డెర్ డసెన్, బవుమా, డికాక్, వియాన్ మల్డర్, కేశవ్ మహారాజ్, రబడ,డిన్గిడి, ఒలీవర్. చదవండి: India vs South africa: దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ సాధించిన రికార్డులు ఇవే.. -
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సెమీస్‌కు.. దక్షిణాఫ్రికా కొంపముంచిన బంగ్లా ఇన్నింగ్స్!
దక్షిణాఫ్రికాతో చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయ లక్ష్యం 190 పరుగులు... 87 పరుగులు చేస్తే సెమీస్‌కు ఇంగ్లండ్... 10.4వ ఓవర్లో ఆ పరుగు వచ్చేసింది... 106 పరుగులు చేస్తే గ్రూప్‌లో అగ్రస్థానం... 12.1వ ఓవర్లో అదీ జరిగిపోయింది... 132 పరుగులు చేస్తే ఆసీస్‌కు సెమీస్ అవకాశం... 15.2వ ఓవర్లో ఆ స్కోరు రావడంతో కంగారూ టీమ్‌లో ఆనందం...చివరి మ్యాచ్‌లో గెలిచినా దురదృష్టం వెంటాడటంతో సఫారీ జట్టు మరోసారి ఐసీసీ టోర్నీ నుంచి ఉత్త చేతులతో నిష్క్రమించింది. టి20 ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ గ్రూప్–1 టాపర్‌గా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. హోరాహోరీగా సాగిన చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడినా రన్‌రేట్ ఆధారంగా ఇంగ్లండ్‌కు అగ్రస్థానం దక్కగా... అదే తరహాలో మెరుగైన రన్‌రేట్‌తో రెండో స్థానంలో నిలిచి ఆస్ట్రేలియా కూడా సెమీస్‌కు అర్హత పొందింది. ఈ మూడు టీమ్‌లు 4 విజయాలు, 8 పాయింట్లతో సమానంగా నిలవగా... పోటీలో దక్షిణాఫ్రికా వెనకబడిపోయింది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 85 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 13.3 ఓవర్లు తీసుకోవడం చివరకు దక్షిణాఫ్రికాను బాగా దెబ్బ తీసింది. తాజా ఫలితంతో సెమీస్‌లో పాకిస్తాన్‌తో ఆస్ట్రేలియా పోరు ఖాయమైపోయింది. (చదవండి: T20 WC 2021: అతి పెద్ద సిక్స్ కొట్టిన రసెల్.. వీడియో వైరల్) షార్జా: టోర్నీ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లండ్‌కు చివరి లీగ్ మ్యాచ్‌లో చుక్కెదురైంది. శనివారం జరిగిన పోరులో దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వాన్ డర్ డసెన్ (60 బంతుల్లో 94 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుతంగా ఆడగా... మార్క్రమ్ (25 బంతుల్లో 52 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా దూకుడైన అర్ధ సెంచరీ సాధించాడు. క్వింటన్ డి కాక్ (27 బంతుల్లో 34; 4 ఫోర్లు) కూడా రాణించాడు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు సాధించింది. మొయిన్ అలీ (27 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్ మలాన్ (26 బంతుల్లో 33; 3 ఫోర్లు, సిక్స్), లివింగ్ స్టోన్ (17 బంతుల్లో 28; ఫోర్, 3 సిక్స్‌లు), బట్లర్ (15 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్), జేసన్ రాయ్ (15 బంతుల్లో 20 రిటైర్డ్‌హర్ట్; 4 ఫోర్లు) తలా కొన్ని పరుగులు జోడించారు. కగిసో రబడ (3/48) ఇన్నింగ్స్ చివరి ఓవర్లో తొలి మూడు బంతులకు మూడు వికెట్లు (వోక్స్, మోర్గాన్, జోర్డాన్) తీసి ‘హ్యాట్రిక్’ సాధించడం విశేషం. అంతర్జాతీయ టి20ల్లో హ్యాట్రిక్ తీసిన తొలి దక్షిణాఫ్రికా బౌలర్‌గా రబడ గుర్తింపు పొందాడు. (చదవండి: Harbhajan Singh: 'చెత్త వాగుడు ఆపండి'.. భజ్జీ వార్నింగ్) వార్నర్ వీరవిహారం అబుదాబి: ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ వార్నర్ (56 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌కు తోడు మిచెల్ మార్ష్ (32 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అర్ధ సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియాకు చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం దక్కింది. ఈ పోరులో ఆసీస్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కెప్టెన్ పొలార్డ్ (31 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా... ఎవిన్ లూయిస్ (26 బంతుల్లో 29; 5 ఫోర్లు), హెట్‌మైర్ (28 బంతుల్లో 27; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. జోష్ హాజల్‌వుడ్ (4/39) విండీస్‌ను దెబ్బ తీశాడు. అనంతరం ఆస్ట్రేలియా 16.2 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు సాధించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన విండీస్ చివరకు ఒకే ఒక విజయంతో టోర్నీని ముగిచింది. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌కు డ్వేన్ బ్రావో గుడ్‌బై చెప్పగా... క్రిస్ గేల్ కూడా తన ఆఖరి ప్రపంచకప్ మ్యాచ్ ఆడేశాడు. (చదవండి: అజహరుద్దీన్-సంగీతల బ్రేకప్ లవ్‌స్టోరీ) స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: గేల్ (బి) కమిన్స్ 15; లూయిస్ (సి) స్మిత్ (బి) జంపా 29; పూరన్ (సి) మార్ష్ (బి) హాజల్‌వుడ్ 4; ఛేజ్ (బి) హాజల్‌వుడ్ 0; హెట్‌మైర్ (సి) వేడ్ (బి) హాజల్‌వుడ్ 27; పొలార్డ్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) స్టార్క్ 44; బ్రావో (సి) వార్నర్ (బి) హాజల్‌వుడ్ 10; రసెల్ (నాటౌట్) 18; హోల్డర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–30, 2–35, 3–35, 4–70, 5–91, 6–126, 7–143. బౌలింగ్: స్టార్క్ 4–0–33–1, హాజల్‌వుడ్ 4–0–39–4, కమిన్స్ 4–0–37–1, మ్యాక్స్‌వెల్ 1–0–6–0, మార్ష్ 3–0–16–0, జంపా 4–0–20–1. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (నాటౌట్) 89; ఫించ్ (బి) హొసీన్ 9; మిచెల్ మార్ష్ (సి) హోల్డర్ (బి) గేల్ 53; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (16.2 ఓవర్లలో 2 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–33, 2–157. బౌలింగ్: హొసీన్ 4–0–29–1, రోస్టన్ ఛేజ్ 1.2–0–17–0, జేసన్ హోల్డర్ 2–0–26–0, డ్వేన్ బ్రావో 4–0–36–0, వాల్ష్ 2–0–18–0, ఆండ్రీ రసెల్ 2–0–25–0, గేల్ 1–0–7–1. -
దక్షిణాఫ్రికా ధమాకా.. సెమీస్‌కు ఒక్క అడుగు దూరంలో
అబుదాబి: ఆరు పటిష్ట జట్లున్న గ్రూప్–1లో వరుసగా మూడో విజయం సాధించిన దక్షిణాఫ్రికా జట్టు టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. వరుసగా మూడు పరాజయాలు చవిచూసి ఈ మ్యాచ్‌కు ముందే సెమీఫైనల్ రేసు నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్ తమ ఖాతాలో మరో ఓటమిని జమ చేసుకుంది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను దక్షిణాఫ్రికా పేసర్లు కగిసో రబడ (3/20), అన్రిచ్ నోర్జే (3/8) హడలెత్తించారు. దాంతో బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌటైంది. మెహదీ హసన్ (25 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్), లిటన్ దాస్ (36 బంతుల్లో 24; 1 ఫోర్) ఫర్వాలేదనిపించారు. ఛేదనలో దక్షిణాఫ్రికా 13.3 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 86 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ బవూమ (28 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), వాన్‌డెర్ డసెన్ (27 బంతుల్లో 22; 2 ఫోర్లు) రాణించారు. రబడకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. చదవండి: SA Vs BAN: బౌలర్ల విజృంభణ.. బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం సఫారీ జట్టుతో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను రబడ ఆరంభంలోనే దెబ్బ తీశాడు. వరుస బంతుల్లో నైమ్ (9), సౌమ్య సర్కార్ (0) వికెట్లతో పాటు తన తర్వాతి ఓవర్లో కీలకమైన ముష్ఫికర్ రహీమ్ (0)ను కూడా అవుట్ చేసి బంగ్లాదేశ్‌ను కోలుకోకుండా చేశాడు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఓపెనర్ హెన్డ్రిక్స్ (4) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. మూడు ఫోర్లు కొట్టి దూకుడు మీదున్నట్లు కనిపించిన క్వింటన్ డికాక్ (16; 3 ఫోర్లు), మార్క్రమ్ (0) వెంట వెంటనే అవుటయ్యారు. బవూమ, డసెన్ జట్టును విజయంవైపు నడిపారు. వీరు నాలుగో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. చివర్లో డసెన్ అవుటైనా... ఫోర్‌తో డేవిడ్ మిల్లర్ (5; 1 ఫోర్) ఛేదనను పూర్తి చేశాడు. సంక్షిప్త స్కోర్లు : బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: 84 ఆలౌట్ (18.2 ఓవర్లలో) (లిటన్ దాస్ 24, షమీమ్ 11, మెహదీ హసన్ 27, రబడ 3/20, నోర్జే 3/8, షమ్సీ 2/21); దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: 86/4 (13.3 ఓవర్లలో) (డికాక్ 16, డసెన్ 22, బవూమ 31 నాటౌట్, తస్కిన్ 2/18). -
CSK Vs DC: అతడితో 19వ ఓవర్ వేయించాల్సింది.. పంత్ చేసిన తప్పు ఇదే!
Gautam Gambhir Commnets On DC Loss to CSK in Qualifier 1: ఐపీఎల్-2021 సీజన్లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్.. చివరి రెండు ఓవర్లలో చెన్నైకి 24 పరుగులు అవసరం... పర్లేదు.. టార్గెట్ కొట్టేయచ్చు. కానీ.. అప్పటి వరకు అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రుతురాజ్ గైక్వాడ్(50 బంతుల్లో 70; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఔటవ్వడంతో చెన్నై శిబిరంలో ఆందోళన కనిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి రుతురాజ్ పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ధోని... కాస్త కుదురుకున్నాక భారీ సిక్సర్‌తో ఆవేశ్ ఖాన్‌కు గట్టి సమాధానమిచ్చాడు. ఇక చివరి ఓవర్‌కు ఢిల్లీ సారథి రిషభ్ పంత్(Rishabh Pant).. టామ్ కరన్‌ను రంగంలోకి దింపాడు. అతడు వచ్చీ రాగానే మొయిన్ అలీని పెవిలియన్‌కు పంపినా.. ధోని(MS Dhoni) వరుస బౌండరీలు బాదడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. 3 బంతుల్లో 5 పరుగులు అవసరమైన తరుణంలో వైడ్ రూపంలో ఒక పరుగు రావడం, త తర్వాత ధోని బౌండరీ బాదడంతో చెన్నై సగర్వంగా తొమ్మిదోసారి ఫైనల్‌కు చేరింది. గత సీజన్లో రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ.. క్వాలియఫైయర్-2 ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. Rishabh Pant(PC: IPL)- Gautam Gambhir ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, ఢిల్లీ జట్టు మాజీ సారథి గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతి ముఖ్యమైన 19వ ఓవర్లో బంతిని కగిసో రబడ(Kagiso Rabada)కు ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘రుత్‌రాజ్ గైక్వాడ్‌ను ఆవేశ్ ఖాన్ పెవిలియన్‌కు పంపినప్పటికీ... అత్యుత్తమ డెత్ బౌలర్ రబడాతో 19వ ఓవర్‌ను వేయించాల్సింది. ఇతర ఆలోచనకు తావు లేకుండా అతడికే బౌలింగ్ ఇవ్వాల్సింది. ఆవేశ్ 17, నోర్ట్జే 18, రబడ 19, టామ్ కరన్ 20.. ఈ క్రమంలో బౌలింగ్ ఆర్డర్ ఉండాల్సింది. ఆవేశ్‌తో 17, 19 ఓవర్లు వేయించడం సరైన నిర్ణయం కాదు. రబడ.. అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. తను వరల్డ్కాస్ బౌలర్. తన సేవలను వినియోగించుకోవాల్సింది’’ అని గంభీర్.. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. కాగా చెన్నై 4 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలుపొంది ఫైనల్ చేరగా.. ఎలిమినేటర్ విజేతతో పంత్ సేన క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉంటుంది. స్కోర్లు: ఢిల్లీ క్యాపిటల్స్: 172/5 (20) చెన్నై సూపర్‌కింగ్స్: 173/6 (19.4) చదవండి: Virat Kohli: సీట్లోంచి లేచి ఎగిరి గంతేశాను.. గ్రేటెస్ట్ ఫినిషర్.. ధోనిపై ప్రశంసల జల్లు What a game of cricket that was! #CSK, they are now in Friday's Final of #VIVOIPL pic.twitter.com/eiDV9Bwjm8 — IndianPremierLeague (@IPL) October 10, 2021 💯/💯 Entertainment Guaranteed. Always 💙🤝💛 https://t.co/Q9mccyvvLo — Delhi Capitals (@DelhiCapitals) October 10, 2021 -
IPL 2021: రబడా ట్రాప్‌లో గేల్..
అహ్మదాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు పేసర్ కగిసో రబడాను టార్గెట్ చేసిన పంజాబ్ కింగ్స్ పించ్ హిట్టర్ క్రిస్ గేల్.. చివరకు అతని ట్రాప్‌లోనే పడ్డాడు. రబడా వేసిన ఆరో ఓవర్ తొలి బంతిని సిక్స్ కొట్టిన గేల్.. ఆ తర్వాత బంతికి అనూహ్యంగా బౌల్డ్ అయ్యాడు. సుమారు 144 కి.మీ వేగంతో వేసిన ఫుల్ టాస్‌ను అంచనా వేయడంలో విఫలమైన గేల్.. బ్యాట్స్ పెట్టేలోపే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. షార్ట్ బంతిని వేస్తాడని గేల్ ప్రిపేర్ కాగా, రబడా ఫుల్‌టాస్ వేశాడు. దాంతో గేల్ తేరుకునే లోపే ఆ బంతి కాస్తా వెళ్లి వికెట్లపై పడింది. తన బ్యాక్లెగ్తో బంతిని ఆపుదామని యత్నించినా చివరకు ఔట్ కావడంతో గేల్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అంతకుముందు ప్రభ్ సిమ్రాన్‌ను సైతం రబడానే ఔట్ చేశాడు. నాల్గో ఓవర్ మూడో బంతిని అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్‌కు వేయగా దాన్ని ప్రభ్ సిమ్రాన్ క్లియర్ చేయడానికి యత్నించాడు. ఆ సమయంలో ఎక్స్ట్రా కవర్లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ ఎడమవైపు దూకి మరీ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. తొలుత స్మిత్ పట్టిన క్యాచ్, ఆ తర్వాత గేల్ బౌల్డ్ అయిన విధానం రెండూ కూడా మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచాయి. Photo Courtesy: Delhi Capitals Twitter -
మూడు వరుస లీగల్ డెలివరీల్లో వికెట్లు.. హ్యాట్రిక్ కాదు
అబుదాబి: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఈ విజయంలో కగిసో రబడా, మార్కస్ స్టోయినిస్‌లు కీలక పాత్ర పోషించారు. 190 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ పోరాడింది. రబడా, స్టోయినిస్‌లు వరుస వికెట్లు సాధించి దెబ్బమీద దెబ్బ కొట్టడంతో సన్‌రైజర్స్ తిరిగి తేరుకోలేకపోయింది. 19 ఓవర్లో రబడా వరుసగా మూడు వికెట్లు సాధించడం హైలైట్‌గా నిలిచింది. అయితే రబడా వరుస మూడు లీగల్ డెలివరీల్లో వికెట్లు సాధించినా అది హ్యాట్రిక్‌గా నమోదు కాలేదు. 19 ఓవర్ మూడో బంతికి అబ్దుల్ సామద్‌ను ఔట్ చేసిన రబడా.. ఆ తర్వాత బంతికి రషీద్ ఖాన్‌ను ఔట్ చేశాడు. ఆపై ఐదో బంతిని వైడ్‌గా వేశాడు. కానీ ఆ బంతి స్థానంలో వేసిన మరో బంతికి శ్రీవాత్స్ గోస్వామిని పెవిలియన్‌కు పంపాడు. దాంతో అది హ్యాట్రిక్ అనే అనుమానం చాలామందిలో తలెత్తింది. కానీ అది హ్యాట్రిక్ కాదు. వరుస మూడు లీగల్ డెలివరీల్లో వికెట్లు సాధించినా, ఒక బంతి వైడ్ కావడంతో హ్యాట్రిక్ మిస్సయ్యింది. నిబంధనల ప్రకారం వరుస మూడు బంతుల్లో మాత్రమే ఒక బౌలర్ వికెట్లు సాధిస్తేనే హ్యాట్రిక్ అవుతుంది కానీ లీగల్ డెలివరీలు అయినంత మాత్రన హ్యాట్రిక్‌గా పరిగణించరు. మరొకవైపు మ్యాచ్‌లో వరుసగా రెండు వికెట్లు సాధించిన తర్వాత మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లి, సదరు బౌలర్ ఫస్ట్ బాల్కే వికెట్ తీసినా అది కూడా హ్యాట్రిక్ కాదు. అలానే ఒక మ్యాచ్‌లో వరుసగా రెండు వికెట్లు సాధించి, తదుపరి మ్యాచ్‌లో ఆ బౌలర్ తాను వేసిన తొలి బంతికే వికెట్ తీసినా హ్యాట్రిక్‌గా నమోదు చేయరు. కేవలం ఒకే మ్యాచ్‌లో మాత్రమే వరుస వికెట్లును తీసే క్రమంలో మాత్రమే హ్యాట్రిక్ అవుతుంది. -
రేపే ఐపీఎల్ ఫైనల్.. బుమ్రా, రబడకు కూడా!
అబుదాబి: ఐపీఎల్ 13 వ సీజన్ చివరి దశకు చేరుకుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మంగళవారం జరుగనుంది. అయితే, ఐపీఎల్ విజేత ఎవరనే ఉత్కంఠ ఒకవైపు కొనసాగుతుండగా.. పర్పుల్, ఆరెంజ్ క్యాప్‌లను గెలుచుకునే ఆటగాళ్లెవరు? అనే ఆసక్తి పెరిగిపోయింది. బ్యాటింగ్ విభాగంలో ప్రస్తుతం కింగ్స్ పంజాబ్ ఆటగాడు కేల్ రాహుల్ 670 పరుగులతో టాప్‌లో ఉండగా.. ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ 603 పరగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఎస్ఆర్హెచ్ ఆటగాడు డేవిడ్ వార్నర్ మూడో స్థానంలో ఉన్నాడు. రాహుల్ కన్నా 67 పరుగుల వెనకబడి ఉన్న ధావన్‌కు ఆరెంజ్ క్యాప్ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాఫ్రికా ఆటగాడు కాగిసో రబడ 29 వికెట్లతో బౌలింగ విభాగంలో టాప్‌లో ఉన్నాడు. 27 వికెట్లతో ముంబై బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తర్వాతి స్థానంలో ఉన్నాడు. 22 వికెట్లతో ముంబై మరో బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. ఇరు జట్లలో కీలకమైన బుమ్రా, రబడ ఇద్దరిలో ఎవరు రేపు జరిగే ఫైనల్లో సత్తా చాటి పర్పుల్ క్యాప్‌ను దాంతోపాటు జట్టుకు విజయాన్ని కట్టబెడతారో చూడాలి. ఆదివారం ఎస్ఆర్హెచ్తో జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఢిల్లీ 17 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టులో ధావన్ (50 బంతుల్లో 78 పరుగులు, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా.. అనంతరం రబాడా నాలుగు వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. (చదవండి: బ్రియన్ లారా మెచ్చిన యంగ్ క్రికెటర్ అతనే!) -
దక్షిణాఫ్రికా వన్డే జట్టులో రబడ పునరాగమనం
జొహన్నెస్‌బర్గ్: ఇంగ్లండ్‌తో వచ్చే నెలలో జరిగే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించారు. స్టార్ పేస్ బౌలర్ కగిసో రబడ పునరాగమనం చేశాడు. గత మార్చిలో భారత్‌తో జరిగిన సిరీస్‌కు గాయంతో రబడ దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న రబడ ఐపీఎల్ టి20 టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 15 మ్యాచ్‌ల్లో ఆడిన రబడ 25 వికెట్లు తీశాడు. 24 మంది సభ్యులతో ప్రకటించిన ప్రస్తుత జట్టులో పేస్ బౌలర్ స్టర్‌మన్‌కు తొలిసారి స్థానం లభించింది. దక్షిణాఫ్రికా వన్డే జట్టు: డికాక్ (కెప్టెన్), బవుమా, డాలా, డు ప్లెసిస్, ఫార్చూన్, బ్యూరన్ హెన్డ్రిక్స్, రీజా హెన్డ్రిక్స్, క్లాసెన్, జార్జి లిండె, కేశవ్ మహరాజ్, మలాన్, మిల్లర్, ఇన్‌గిడి, నోర్జే, ఫెలుక్వాయో, ప్రెటోరియస్, రబడ, షమ్సీ, సిపామ్లా, స్మట్స్, స్టర్‌మన్, బిల్జాన్, డుసెన్, వెరియన్. -
భారత పర్యటనకు రబడ దూరం
కేప్‌టౌన్: వచ్చే నెల్లో భారత పర్యటనకు రానున్న దక్షిణాఫ్రికా జట్టు నుంచి పేసర్ కగిసో రబడ దూరమయ్యాడు. గాయం కారణంగా అతనికి నాలుగు వారాల విశ్రాంతి అవసరమైన తరుణంలో భారత్ పర్యటన నుంచి రబడా వైదొలిగాడు. దాంతో పాటు ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే సిరీస్‌కు సైతం రబడ దూరం కావాల్సి వచ్చింది. ఆసీస్‌తో కేప్‌టౌన్‌లో జరిగిన తొలి టీ20లో గాయపడ్డ రబడ.. ఆ తర్వాత సిరీస్‌లో పాల్గొనలేదు. ఆసీస్‌తో వన్డే సిరీస్ నాటికి అందుబాటులోకి వస్తాడని భావించినా అదీ జరగలేదు. (కెప్టెన్ అయినంత మాత్రాన అలా చేస్తావా?) సఫారీలతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఆసీస్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మూడు వన్డేల సిరీస్ ఈ రోజు నుంచి ఆరంభం కానుంది. మార్చి 7వ తేదీతో ఈ సిరీస్ ముగిస్తుంది. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనలో మూడు వన్డేలు ఆడనుంది. మార్చి 12వ తేదీ నుంచి మొదలుకొని 18వ తేదీ వరకూ మూడు వన్డేల్లో తలపడనుంది. రబడాకు కనీసం నాలుగు వారాలు విశ్రాంతి అవసరమని టీమ్ మెడికల్ డైరక్టర్ డాక్టర్ షుయబ్ మంజ్రా స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ స్టార్ పేసర్ లేకుండానే సఫారీలు భారత్ పర్యటనకు రానున్నారు. -
బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డు: రబడ
కేప్‌టౌన్: ఇటీవల టీమిండియా ముగిసిన టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ కావడంపై దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ స్పందించాడు. తాము ఈ సిరీస్ క్లీన్‌స్వీప్‌పై విశ్లేషించుకోవాల్సిన సమయం వచ్చిందంటూ పేర్కొన్నాడు. భారత్ పర్యటనను ముగించుకుని స్వదేశానికి చేరుకునే క్రమంలో రబడా తన ట్వీటర్ అకౌంట్లో ఓటమిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అదే సమయంలో భారత జట్టు సమష్టి ప్రదర్శనపై పొగడ్తల వర్షం కురిపించాడు. ‘ భారత పర్యటన ముగిసింది. వాళ్లు మా కంటే ఎంతో అత్యుత్తమైన ఆటను ప్రదర్శించారు. ఉత్తమ జట్టు అని టీమిండియా నిరూపించుకుంది. ఆ జట్టుకు హ్యాట్సాఫ్. మా కోసం కొత్త చాలెంజ్‌లు నిరీక్షిస్తున్నాయి. బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డు’ అంటూ రబడ ట్వీట్ చేశాడు. టీమిండియాతో టీ20 సిరీస్‌ను సమం చేసుకున్న సఫారీలు.. మూడు టెస్టుల సిరీస్‌లో మాత్రం తేలిపోయారు. వరుస రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్ తేడాతో ఓటమి చవిచూశారు. భారత్ జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ల్లో విశేషంగా రాణించడంతో సఫారీలు భారంగా సిరీస్ ముగించారు. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతో భారత్ ఖాతాలో 240 టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్లు చేరాయి. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ద్వారా 120 పాయింట్లను సాధించిన టీమిండియా.. అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోవడం ద్వారా 120 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు భారత జట్టే పాయింట్ల పరంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. India tour comes to an end. They were by far the better team, hats off to them. Back to the drawing board ✏️ New challenges await... 💎 pic.twitter.com/xslq5DXSXa — Kagiso Rabada (@KagisoRabada25) October 24, 2019 -
నోరు పారేసుకున్న రబడ.. సర్దిచెప్పిన కెప్టెన్..!
పుణె : మహారాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆటగాళ్లు పరుగుల వరద పారించారు. 273/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లి సేన సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించింది. రెండోరోజు (అజింక్య రహానే 59, రవీంద్ర జడేజా 91) వికెట్లను మాత్రమే కోల్పోయిన టీమిండియా 328 పరుగులు జతచేసి 601 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ కోహ్లి 254 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక తొలిరోజు మూడు వికెట్లు ఖాతాలో వేసుకుని సత్తా చాటిన రబడ రెండో రోజు వికెట్లేమీ తీయలేకపోయాడు. ఫ్లాట్ పిచ్‌పై భారత ఆటగాళ్లు చెలరేగుతుంటే చేష్టలుడిగిపోయాడు. తన బౌలింగ్‌లో అలవోకగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులెత్తిస్తన్న కోహ్లి, రహానేలను చూసి అతనిలో అసహనం పెరిగింది. ఇదే క్రమంలో బౌలర్‌ను మార్చితే బాగుంటుందని కీపర్ క్వింటన్ డీకాక్ కెప్టెన్ డుప్లెసిస్‌కు సూచించడంతో.. రబడలో అసహనం తీవ్రస్థాయికి చేరింది. దీంతో డీకాక్‌తో అతను వాగ్వివాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో అక్కడే ఉన్న డుప్లెసిస్ కలగజేసుకున్నాడు. రబడను అతను అక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘టీమిండియా ఆటగాళ్ల దెబ్బకు రబడకు దిమ్మతిరిగింది. అతనేం చేస్తున్నాడో తెలియడం లేదు’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రహానేను మహరాజ్, రవీంద్ర జడేజాను ముత్తుసామి ఔట్ చేశారు. -
ఎప్పుడూ ‘టాప్’ మీరే కాదు బాస్: రబడ
ముంబై: కొంతమంది క్రికెటర్లను మాత్రమే మీడియా హైప్ చేస్తుందని దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ అసంతృప్తి వ్యక్తం చేశాడు. పలువురి క్రికెటర్లకు మీడియాలో లభించిన క్రేజ్‌ను చూస్తే తనను ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నాడు. భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఆడటానికి సిద్ధమైన వేళ రబడా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల కాలంలో ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్, భారత్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాలను మీడియా ఆకాశానికి ఎత్తేస్తుందన్నాడు. అదే సమయంలో కొంతమంది పట్ల నిర్లక్ష్యపు ధోరణిని ప్రదర్శిస్తుందంటూ ధ్వజమెత్తాడు. ‘ ఆర్చర్, బుమ్రాలను నేను కచ్చితంగా అభినందిస్తా. ఆ ఇద్దరు తక్కువ కాలంలోనే సత్తాచాటి తమ జట్లలో రెగ్యులర్ ఆటగాళ్లగా మారిపోయారు. వారు తమ ప్రదర్శనతో ప్రత్యేక స్థానం కూడా సంపాదించుకున్నారు. ఆర్చర్‌ది సహజసిద్ధమైన టాలెంట్ అయితే, బుమ్రా బంతితో అద్భుతాలు చేస్తున్నాడు. ఇదంతా ఓకే. కేవలం ఆ ఇద్దరు మాత్రమే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం లేదు. నేను కూడా చాలా కాలంగా బాగా ఆడుతున్న విషయం నాకు తెలుసు. ఎప్పుడూ ఆ ఇద్దరే టాప్‌లో ఉండరని విషయం మాత్రం నేను చెప్పగలను’ అని రబడ పేర్కొన్నాడు. ఇటీవల విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రబడ రెండో స్థానంలో నిలవగా, బుమ్రా మూడో స్థానాన్ని ఆక్రమించాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంలో బుమ్రా ముఖ్యపాత్ర పోషించడంతో ర్యాంకింగ్‌ను కూడా మెరుగుపరుచుకున్నాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో బుమ్రా 13 వికెట్లు సాధించాడు. -
కోహ్లిపై నోరుపారేసుకున్న రబాడ
లండన్: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌కు ముందే దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడ మాటల యుద్దానికి తెరదీశాడు. టీమిండియాలో కీలక ఆటగాడు, సారథి విరాట్ కోహ్లిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కోహ్లి గొప్ప బ్యాట్స్‌మన్ అయినప్పటికీ అతడికి పరిపక్వత లేదని ఎద్దేవ చేశాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో కూడా కోహ్లితో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ టోర్నీలో జరిగిన వివాదాన్ని వివరిస్తూ కోహ్లిని చులకన చేసి మాట్లాడాడు. ‘ఐపీఎల్లో ఆరోజు వివాదానికి కారణం కోహ్లినే. నా బౌలింగ్‌లో అతడు ఫోర్ కొట్టడంతో నేను ఆలోచనలో పడ్డాను. అప్పుడు కోహ్లి నన్ను ఓ మాట అనడంతో అదే మాటను కోహ్లిని అన్నాను. దీంతో వెంటనే అతడు కోపంతో రగిలిపోయాడు. అతను అద్బుతమైన బ్యాట్స్‌మన్ అయినంత మాత్రాన అతడు అన్న మాటలు పడాలా?. అతడు తిడితే నేను పడను. కోహ్లి ఇంకా పరిపక్వత సాధించాల్సి ఉంది. ఆట మాత్రమే కాదు వ్యక్తిత్వం కూడా ఉండాలి’అంటూ రబాడ వ్యాఖ్యానించాడు. అయితే ఆటగాళ్లతో గొడవలు పడటం రబాడకు కొత్తేం కాదు. 2017లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌తో అనుచితంగా ప్రవర్తించడంతో ఒక టెస్టు మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. గతేడాది ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై నోరు పారేసుకున్నాడు. ఇక స్మిత్‌తో శృతిమించి ప్రవర్తించడంతో మరోసారి సస్సెన్షన్‌కు గురయ్యాడు. -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ ఎదురుదెబ్బ
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. డీసీ తరపున ఆడుతున్న దక్షిణాఫ్రికా బౌలర్ కాగిసో రబడ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. దీంతో మిగతా మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండడని డీసీ తెలిపింది. స్వల్ప గాయం కారణంగా బుధవారం చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఆడలేదు. అయితే త్వరలో ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని విశ్రాంతి తీసుకునేందుకు ఐపీఎల్ నుంచి వెంటనే వచ్చేయాలని అతడికి దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కబురు పెట్టింది. ఫలితంగా అతడు ఐపీఎల్‌కు దూరమయ్యాడు. రబడ లేకపోవడంతో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో డీసీ 80 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. ప్రస్తుత ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టి రబడ టాప్‌లో కొనసాగుతున్నాడు. 12 మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు దక్కించుకున్నాడు. కీలక దశలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వీడి వెళుతున్నందుకు బాధగా ఉన్నప్పటికీ తప్పడం లేదని రబడ వ్యాఖ్యానించాడు. వన్డే ప్రపంచకప్ ఎంతో దూరంలో లేనందున స్వదేశానికి వెళ్లాల్సివస్తోందన్నాడు. ఈ సీజన్లో ఢిల్లీ తరపున ఆడటం మర్చిపోలేని అనుభూతిని కలిగించిందన్నాడు. తమ టీమ్ ఐపీఎల్ విజేతగా నిలవాలని ఆకాంక్షించాడు. రబడ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడాన్ని డీసీ హెచ్ కోచ్ రికీ పాంటింగ్ దురదృష్టకర పరిణామంగా వర్ణించాడు. వరల్డ్‌కప్‌లో రబడ రాణించాలని ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ శుభాకాంక్షలు తెలిపింది. -
సన్‌రైజర్స్ చిత్తు చిత్తుగా..
సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించాలంటే 30 బంతుల్లో 56 పరుగులు చేయాలి. చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నాయి. అరవీర భయంకర డేవిడ్ వార్నర్ క్రీజులో ఉన్నాడు. దీంతో సన్‌రైజర్స్ విజయం ఖాయం అనుకున్నారు. కానీ తీరా ఫలితం చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. 17 పరుగుల వ్యవధిలో చివరి ఎనిమిది వికెట్లు కోల్పోయి.. సన్‌రైజర్స్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఓపెనర్లు మినహా ఎవరూ రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. మరోసారి మిడిలార్డర్ ఢమాల్ అవడంతో ఆరెంజ్ ఆర్మీకి హ్యాట్రిక్ ఓటమి తప్పలేదు. హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 39 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. దీంతో సన్‌రైజర్స్ ఖాతాలో హ్యాట్రిక్ ఓటమి నమోదైంది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడం అందులోనూ రెగ్యులర్ సారథి విలియమ్సన్ తిరిగి రావడంతో ఢిల్లీపై విజయం ఖాయమనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఢిల్లీ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 18.5 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ బౌలర్లు రబడ(4/22), మోరిస్(3/22), కీమో పాల్(3/17) సన్‌రైజర్స్ పతనాన్ని శాసించారు. ఛేదనలో ఓపెనర్లు డేవిడ్ వార్నర్(51), బెయిర్ స్టో(41)లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. బెయిర్ స్టో నిష్క్రమించిన అనంతరం సన్‌రైజర్స్ పతనం ప్రారంభమైంది. విలియమ్సన్(3)తో మెదలెడితే మిగతా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఢిల్లీ బౌలర్ల ధాటికి రికీ భుయ్(7), శంకర్(1), హుడా(3), అభిషేక్(3), రషీద్(0)లు నిలవలేక చేతులెత్తేశారు. దీంతో హైదరాబాద్‌కు ఘోర ఓటమి తప్పలేదు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. పృథ్వీ షా(4), శిఖర్ ధావన్(7) విఫలం చెందారు. ఆ తర్వాత కొలిన్ మున్రో(40: 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడగా, శ్రేయస్ అయ్యర్(45; 40 బంతుల్లో 5 ఫోర్లు) సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. ఆపై రిషభ్ పంత్(23), అక్షర్ పటేల్(14)లు రెండంకెల స్కోరుకే పరిమితం కావడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్ రెండు వికెట్లు తీశాడు. అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్లు తలో వికెట్ తీశారు. -
నేటి మ్యాచ్‌లో గంగూలీ ఎవరివైపు?
కోల్‌కతా: ప్రస్తుత ఐపీఎల్లో భీకరమైన ఫామ్‌లో ఉండి ప్రత్యర్థి జట్లకు చెమటపట్టిస్తున్న ఆటగాడెవరెంటే నిస్సందేహంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు ఆండ్రూ రసెలే. ఇప్పటివరకూ కేకేఆర్ ఆడిన మ్యాచ్‌ల్లో రస్సెల్ విజృంభించిన తీరు దీనికి నిదర్శనం. ఆరు మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ 4 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉందంటే అది రస్సెల్ చలవే. ఈ ఆరు మ్యాచ్‌ల్లోనూ విధ్వంసక వీరుడు 257 పరుగులు సాధించాడు. ఇందులో 150 పరుగులు ఏకంగా సిక్సర్ల రూపంలోనే వచ్చాయి. ఇంతగా విజృంభిస్తున్న రసెల్‌ను కట్టడి చేసింది.. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కాగిసో రబడ మాత్రమే. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానం వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో.. సూపర్ ఓవర్లో రబడ అద్భుతమైన యార్కర్‌తో రస్సెల్‌ను పెవిలియన్‌కు చేర్చి తమ జట్టుకు విజయాన్ని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు కోల్‌కతా వేదికగా ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి. ఇందులోనూ ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు సాగడం ఖాయం. గంగూలీ ఎటువైపు..? ఈ రెండు జట్ల మధ్య పోరులో మరో ఆసక్తికర అంశం. టీమిండియా, కేకేఆర్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి కోల్‌కతా సొంత మైదానం. అంతేకాదు క్యాబ్ అధ్యక్షుడిగానూ గంగూలీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇంతకుముందు ఇక్కడ కేకేఆర్‌తో ఏ జట్టు తలపడినా గంగూలీ మద్దతు సొంత జట్టుకే. అయితే, ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ)కు సలహాదారుగా ఉన్న దాదా ఈసారి ఏ జట్టు డగౌట్ వైపు కూర్చుంటాడనేది ఆసక్తికరం. జట్లు(అంచనా): కోల్‌కతా నైట్ రైడర్స్: దినేశ్ కార్తీక్(కెప్టెన్), రాబిన్ ఉతప్ప, క్రిస్ లిన్, శుభ్‌మన్ గిల్, రసెల్, సునీల్ నరైన్, పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, ప్రసీద్ కృష్ణ, ఫెర్గూసన్. ఢిల్లీ క్యాపిటల్స్: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధవన్, రిషబ్ పంత్, కొలిన్ ఇంగ్రామ్, అక్షర్ పటేల్, రాహుల్ తెవాటియా, రబడ, ఇషాంత్, క్రిస్ మోరిస్, బౌల్ట్. -
ఆర్సీబీతో మ్యాచ్: రబడ విజృంభణ
బెంగళూరు: ఐపీఎల్లో భాగంగా ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 150 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. పార్థివ్ పటేల్(9) తొలి వికెట్‌గా నిష్క్రమించాడు. క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో లామ్చెన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అటు తర్వాత ఏబీ డివిలియర్స్(17) కూడా ఔట్ కావడంతో ఆర్సీబీ 40 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరో 26 పరుగుల వ్యవధిలో స్టోయినిస్(15) పెవిలియన్ చేరడంతో ఆర్సీబీ మరింత ఇబ్బందుల్లోకి వెళ్లింది. ఆ తరుణంలో కోహ్లితో కలిసి మొయిన్ అలీ ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టాడు. వీరిద్దరూ 37 పరుగులు జత చేసిన తర్వాత అలీ(32;18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) ఔటయ్యాడు. ఇక అక్షదీప్ నాథ్ కలిసి మరో 30 పరుగులు జోడించిన తర్వాత కోహ్లి(41;33 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) పెవిలియన్ చేరడంతో ఆర్సీబీ 133 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను నష్టపోయింది. చివరి వరుస బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించకపోవడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులే చేసింది. ఢిల్లీ బౌలర్లలో రబడ విజృంభించి బౌలింగ్ చేశాడు. డివిలియర్స్, కోహ్లి, అక్ష్దీప్ నాథ్, పవన్ నేగీ వికెట్లను సాధించి ఆర్సీబీ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాడు. అతనికి జతగా క్రిస్ మోరిస్ రెండు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, లామ్‌చెన్‌లకు తలో వికెట్ దక్కింది. -
రబడ ఒట్టేశాడు : శ్రేయస్ అయ్యర్
న్యూఢిల్లీ : సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌లో చెమటోడ్చి రబడ పుణ్యమా సూపర్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ గట్టెక్కిన విషయం తెలిసిందే. శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఫిరోజ్ షా కోట్ల మైదనాంలో అత్యంత ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్.. ప్రేక్షకులకు కావాల్సిన అసలు సిసలు మజానిచ్చింది. ఇరు జట్లు విజయం కోసం చివరి బంతి వరకు నువ్వా-నేనా అన్నట్లు తడబడ్డాయి. చిరకు సూపర్ ఓవర్లో రబడ అద్భుత బౌలింగ్‌తో కోల్‌కతాను కట్టడి చేసి ఢిల్లీకి విజయాన్నందించాడు. అయితే రబడ యార్కర్లు మాత్రమే వేస్తానని తనకు మాటిచ్చాడని మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ‘సూపర్ ఓవర్ వేసే ముందు రబడ నేను మాట్లాడుకున్నాం. ఈ ఓవర్ మొత్తం యార్కర్లే మాత్రమే సంధిస్తానని రబడ ఒట్టేశాడు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా ప్రతి బాల్ అద్భుతంగా యార్కర్లు సంధించి విజయాన్నందించాడు’ అని అయ్యర్ సంతోషం వ్యక్తం చేశాడు. సూపర్ ఓవర్ ఆడాల్సిన పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదన్నాడు. కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి మా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. ఇక నుంచి ఒక ఓవర్ మిగిలుండగానే విజయం అందుకునేలా జాగ్రత్తపడతామని తెలిపాడు. దాటిగా ఆడాలని బ్యాట్స్‌మెన్ అంత అనుకున్నామని, పృథ్వీషా ఆ దిశగా ఆడాడని, తన ఆటను అలానే కొనసాగిస్తాడని కూడా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఒత్తిడిలో బౌలింగ్ చేసి జట్టుకు విజయాన్నందించడం చాలా ఆనందంగా ఉందని రబడ పేర్కొన్నాడు. యార్కర్లు మాత్రమే సంధించాలని భావించానని, తన ప్రణాళిక పనిచేయడంతో విజయం దక్కిందని చెప్పుకొచ్చాడు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఒక వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది. అనంతరం రబడ వేసిన సూపర్ ఓవర్లో కోల్‌కతా 4, 0, ఔట్ (రసెల్), 1, 1, 1లతో మొత్తం 7 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. #Rabada Wt a bowling man @KagisoRabada25 🔥🔥🔥#DDvsKKR #SuperOver pic.twitter.com/O9tldNuI4R — Sk.azaad Suraz Basha🇮🇳 (@azaadsurazbasha) March 31, 2019 -
‘సూపర్’రబడా
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. కేకేఆర్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా అన్నే పరుగులు చేసింది. దీంతో ఇరు జట్లు సూపర్ ఓవర్ ఆడాయి. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ ప్రసీద్ కృష్ణ వేసిన ఓవర్లో రెండు వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ రబడా బౌలింగ్‌లో కేవలం 7 పరుగులే చేసింది. ఢిల్లీ బౌలర్ రబడా తన సూపర్ బౌలింగ్‌తో జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. శనివారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్-కేకేఆర్ మ్యాచ్ టై అయింది. కేకేఆర్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి యువ సంచలనం పృథ్వీ షా(99; 55 బంతుల్లో 12ఫోర్లు, 3 సిక్సర్లు) సంచలన రీతిలో ఆడాడు. అయితే తృటిలో శతకం చేజార్చుకున్నాడు. పృథ్వీకి తోడుగా సారథి శ్రేయాస్ అయ్యర్(43, 32 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లు)కూడా రెచ్చిపోయాడు. షా, అయ్యర్లు ఆడినంత సేపు ఢిల్లీ సునాయసంగా విజయం సాధిస్తుందనుకున్నారు. అయితే వీరిద్దరి నిష్క్రమణ తర్వాత మిగతా బ్యాట్స్‌మన్ పూర్తిగి విఫలమయ్యారు. పంత్(11), విహారీ(2), వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి ఆరు పరుగులు కావాల్సిన సమయంలో ఆజట్టు కేవలం ఐదు పరుగులే చేసింది. దీంతో ఢిల్లీ కూడా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులే చేసింది. కేకేఆర్ బౌలర్లలో కుల్దీప్ రెండు, ఫెర్గుసన్, చావ్లా, రసెల్‌లు తలో వికెట్ సాధించారు. అంతకుముందు టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో కేకేఆర్ ముందుగా బ్యాటింగ్ దిగింది. కేకేఆర్ బ్యాటింగ్‌ను నిఖిల్ నాయక్, క్రిస్ లిన్లు ఆరంభించారు. అయితే నిఖిల్ నాయక్(7) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, ఆపై కాసేపటికి రాబిన్ ఊతప్ప(11) కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో కేకేఆర్ వికెట్లు కోల్పోతూ వచ్చింది. దినేశ్ కార్తీక్ సమయోచితంగా బ్యాటింగ్ చేయగా, మిగతా టాపార్డర్ ఆటగాళ్లు వరుస పెట్టి క్యూకట్టారు. అయితే రసెల్ వచ్చిన తర్వాత ఆట స్వరూపం మారిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రసెల్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఓ దశలో రసెల్ ధాటికి బెంబెలేత్తిపోయిన ఢిల్లీ బౌలర్లు.. చివరకు అతని వికెట్ తీసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. క్రిస్ మోరిస్ వేసిన 18 ఓవర్ ఐదో బంతికి భారీ షాట్‌కు యత్నించిన రసెల్(28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 62) ఔటయ్యాడు. అటు తర్వాత కార్తీక్ హాఫ్ సెంచరీ సాధించిన వెంటనే ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీయగా, అమిత్ మిశ్రా, రబడా, లామ్‌చెన్, క్రిస్ మోరిస్, అమిత్ మిశ్రాలు తలో వికెట్ తీశారు. -
రబడా.. బా...గా స్వింగ్ చేశాడు!
క్వీన్స్లాండ్: దక్షిణాఫ్రికా ప్రధాన పేసర్లలో కగిసో రబడా ఒకడు. ఇటీవల కాలంలో దక్షిణాఫ్రికా విజయాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్న రబడా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అయితే రెండు రోజుల క్రితం ఆసీస్‌తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో రబడా ఎవరూ ఊహించని బంతిని సంధించి వార్తలో నిలిచాడు. సాధారణంగా బౌలర్లు బంతిని వేసే క్రమంలో వికెట్ కీపర్‌కు అందకుండా కానీ, స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ వైపు కానీ వేయడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాగా, చేతి నుంచి జారిందో.. లేక బాగా స్వింగ్ చేద్దామని అలా వేశాడో కానీ రబడా వేసిన ఒక బంతి వెళ్లి పాయింట్లో ఉన్న ఫీల్డర్ చేతిలో పడింది. రబాడా వేసి బాల్‌ను వైడ్‌గా ప్రకటించాలా?లేక నో బాల్‌గా ఇవ్వాలో తెలియక అంపైర్లు కూడా కాసేపు చర్చించుకున్నారు. అయితే చివరికి దానిని డెడ్ బాల్‌గా ప్రకటించారు. సాధారణంగా కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఆశ్చర్యపరిచే రబడా.. ఇలా బంతిని వేయడంతో జట్టు సభ్యుల్లో నవ్వులు పూయించింది. అంతేకాదు అసలేం జరిగిందో తనకే తెలియక బిక్కమొహం వేశాడు రబడా. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వర్షం కారణంగా 10 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో 21 పరుగులతో గెలిచిన దక్షిణాఫ్రికా 1-0తో టీ20 సిరీస్‌ను గెలిచింది. BALLLLL RABADA KE BALLLLLLLLLLL 🤣🤣 #AUSvSA #RABADA pic.twitter.com/6Pf0juks01 — Aditya Adapa || 9394022222 (@BezawadaAditya) 17 November 2018 -
రబడా ‘మరో’ రికార్డు!
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా ప్రధాన పేసర్ కగిసో రబడా అవార్డుల్లో మరోసారి రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ) అందజేసిన తాజా అవార్డుల్లో రబడా అత్యధికంగా ఆరు అవార్డులను గెలుచుకోవడం ద్వారా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు, టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ప్లేయర్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఫాన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, డెలివరీ ఆఫ్ ద ఇయర్ అవార్డులను రబడా కైవసం చేసుకున్నాడు. 2016లో అత్యధికంగా ఆరు అవార్డులు గెలుచుకుని ఐదు, అంతకంటే ఎక్కువ అవార్డులు గెలిచిన ఏకైక దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా నిలిచిన రబడా.. మరోసారి అవార్డుల్లో దుమ్మురేపాడు. ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న రబడా రెండు సార్లు దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుల గెలుచుకున్న సఫారీ ఆటగాళ్ల జాబితాలో సైతం చేరిపోయాడు. అంతకుముందు రెండుసార్లు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్న వారిలో హషీమ్ ఆమ్లా, జాక్వస్ కల్లిస్, ఎన్తిని, ఏబీ డివిలియర్స్‌లు ఉండగా, వారి సరసన రబడా నిలిచాడు. కాగా, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ఏబీ డివిలియర్స్‌కు టీ 20 ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. -
రబడ స్థానంలో ఇంగ్లండ్ పేసర్
ఢిల్లీ: గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్‌కు దూరమైన దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ స్థానంలో ఇంగ్లండ్ పేసర్ లియామ్ ప్లంకెట్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులోకి తీసుకుంది. ఈ మేరకు ప్లంకెట్‌ను జట్టులోకి తీసుకుంటున్న విషయాన్ని ఢిల్లీ డేర్‌డెవిల్స్ యాజమాన్యం తాజాగా ఓ ప్రకటనలో తెలియజేసింది. దాంతో 33 ఏళ్ల ప్లంకెట్ తొలిసారి ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడాల్సిన రబడ గాయంతో ఈ సీజన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెన్నునొప్పి కారణంగా రబడా మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలిపాడు. ఐపీఎల్ ఆరంభానికి రోజు ముందుగా రబడ అర్థాంతరంగా ఐపీఎల్ నుంచి వైదొలగడంతో అతని స్థానంలో ప్లంకెట్‌ను అదృష్టం వరించింది. రబడ స్థానంలో పలువురు ఆటగాళ్ల పేర్లను పరిశీలించినప్పటికీ ప్లంకెట్కే ఢిల్లీ తొలి ప్రాధాన్యత ఇచ్చింది. -
వివాదాల సిరీస్ దక్షిణాఫ్రికా వశం!
జొహన్నెస్‌బర్గ్ : వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ముగిసింది. ఈ నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆతిథ్య జట్టు 3-1తో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. చివరిదైన నాలుగో టెస్టులో ప్రొటీస్ జట్టు ఘన విజయం సాధించింది. అసాధ్యమైన 612 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ను ఫిలాండర్ (6 వికెట్లు) దెబ్బ తీయడంతో 119 పరుగులకే కుప్ప కూలింది. దీంతో సఫారీ జట్టు 492 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. ఇది దక్షిణాఫ్రికా టెస్టు చరిత్రలోనే అతిపెద్ద విజయం కాగా సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో తలపడిన 7 సిరీస్లనంతరం సిరీస్ కైవసం చేసుకొవడం మరో విశేషం. అద్భుతంగా రాణించిన ఫిలాండర్ టెస్టుల్లో 200 వికెట్ల మార్కును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టిన ఫిలాండర్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ వరించగా.. సిరీస్ ఆసాంతం ఆసీస్‌ను దెబ్బతీసిన కగిసో రబడ (23 వికెట్లు)కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లభించింది. ఈ సిరీస్ ఆరంభం నుంచే వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో వార్నర్-డికాక్‌ల వాగ్వాదం, రెండో టెస్టులో రబడా-స్మిత్‌ల గొడవలతో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో ఆసీస్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్, స్టీవ్ స్మిత్‌లపై నిషేదం పడేలా చేసిన ఈ సిరీస్ చివరకు ఆతిథ్య జట్టు వశమైంది. దక్షిణాఫ్రికా స్కోరు 488 ఆలౌట్ & 344/6 డిక్లెర్ ఆస్ట్రేలియా స్కోరు 221 ఆలౌట్ & 119 ఆలౌట్ -
రబడను చెడుగుడు ఆడిన వార్నర్!
సాక్షి, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్ తారస్థాయికి చేరడం.. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా దూషించుకోవడం.. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో కోత విధించడం తెలిసిన విషయమే. జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లో ఇరు జట్లు చెరొకటి గెలిచి సిరీస్‌లో సమంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో గురువారం ప్రారంభమైన మూడో టెస్ట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 311 పరుగులకు కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించారు. ముఖ్యంగా రెండు టెస్టుల్లో ఆసీస్ పతనాన్ని శాసించిన దక్షిణాఫ్రికా పేసర్ రబడపై వార్నర్ కసితీర్చుకున్నాడు. ఎదుర్కొన్న వరుస ఐదు బంతులను బౌండరికీ తరలించాడు. రబడా వేసిన నాలుగో ఓవర్ చివరి మూడు బంతులను బౌండరీలకు పంపించిన వార్నర్.. ఆరో ఓవర్ తొలి బంతిని సిక్స్ కొట్టాడు. రెండో బంతిని రబడా నోబాల్ వేయగా దాన్ని సైతం బౌండరీకి తరలించాడు. వార్నర్ దూకుడుతో మైదానంలో ఉన్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇది టెస్టా.. టీ20 ఆ! అనే సందిగ్ధంలో ఉండగానే రబడ వార్నర్‌ను బౌల్డ్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. -
రబడ నిషేధం ఎత్తివేతపై స్మిత్ అసంతృప్తి !
సాక్షి, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి(ఐసీసీ) దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ నిషేధం ఎత్తివేయడంపై ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో రబడ స్మిత్‌ను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టాడని తొలుత ఐసీసీ రెండు టెస్టుల నిషేదం విధించిన విషయం తెలిసిందే. దీనిపై రబడా అప్పీల్ చేయగా విచారించిన అప్పీల్ కమిషనర్ మైకేల్ హెరాన్ నిషేదాన్ని ఎత్తి వేస్తూ రబడకు అనుకూలంగా తీర్పునిచ్చాడు. దీంతో రబడ గురువారం నుంచి జరిగే మూడో టెస్టులో బరిలోకి దిగనున్నాడు. అయితే ఈ తీర్పును స్మిత్ తప్పుబట్టాడు. రబడ తనని ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టాడని, ఇది వీడియోలో స్పష్టంగా తెలుస్తుందన్నాడు. వికెట్ పడగొట్టిన తర్వాత బౌలర్ల ఆనందం తనకు తెలుసని, కానీ ఓవర్‌గా రియాక్ట్ కావడం అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఇలాంటి విషయాల్లో ఐసీసీ కఠినంగా వ్యవహరించాలని సూచించాడు. విచారణలో తన వాదనలు వినకపోవడం ఆశ్చర్యం కలిగించిందని స్మిత్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సిరీస్‌లో రబడ తన బౌలింగ్‌తో ఆసీస్ పతనాన్ని శాసిస్తున్నాడు. రెండు మ్యాచుల్లో ఏకంగా 15 వికెట్లు పడగొట్టాడు.