దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో బంతుల పరంగా అత్యంత వేగంగా 300 వికెట్ల మైలు రాయిని అందుకున్న బౌలర్‌గా రబాడ రికార్డులకెక్కాడు. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రబాడ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు.
బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో రబాడ ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సఫారీ పేస్ గుర్రం కేవలం 11,187 బంతుల్లోనే ఈ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వకార్ యూనిస్ పేరిట ఉండేది.
యూనిస్ 12,602 బంతుల్లో 300 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో వకార్ ఆల్‌టైమ్ రికార్డును రబాడ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌ల పరంగా అయితే రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్ధానంలో ఉన్నాడు. అశ్విన్ కేవలం 54 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును అందుకున్నాడు. ఈ జాబితాలో రబాడ నాలుగో స్ధానంలో ఉన్నాడు.
మూడో సఫారీ పేసర్‌గా
అదే విధంగా టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆరో సౌతాఫ్రికా బౌలర్‌గా రబాడ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో డేల్ స్టెయిన్(439) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. కాగా బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో రబాడ 3 వికెట్లు పడగొట్టాడు.
బంతుల పరంగా అత్యంత వేగంగా 300 టెస్టు వికెట్లు తీసిన బౌలర్లు వీరే
కగిసో రబాడ (దక్షిణాఫ్రికా) – 11817 బంతులు
వకార్ యూనిస్ (పాకిస్థాన్) – 12602 బంతులు
డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) – 12605 బంతులు
అలాన్ డొనాల్డ్ (దక్షిణాఫ్రికా) – 13672 బంతులు
టెస్టుల్లో దక్షిణాఫ్రికా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
డేల్ స్టెయిన్ – 93 మ్యాచ్‌ల్లో 439 వికెట్లు
షాన్ పొలాక్ – 108 మ్యాచ్‌ల్లో 421 వికెట్లు
మఖాయ ఎంతిని – 101 మ్యాచ్‌ల్లో 390 వికెట్లు
అలెన్ డొనాల్డ్ – 72 మ్యాచ్‌ల్లో 330 వికెట్లు
మోర్నీ మోర్కెల్ – 86 మ్యాచ్‌ల్లో 309 వికెట్లు
కగిసో రబాడ – 65 మ్యాచ్‌ల్లో 301* వికెట్లు
Comments
Please login to add a commentAdd a comment